8, ఫిబ్రవరి 2020, శనివారం

సమస్య - 3275 (అన్ననుఁ బెండ్లియాడెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్"
(లేదా...)
"అన్ననుఁ బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చఁగా భువిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

104 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    B. దేవి:

    కన్నియ హైద్రబాదునట కమ్మగ నిచ్చుచు బిల్లు గేట్సుకున్
    చెన్నుగ సైబ్రబాదు వలె చేకొని మార్చుచు ధూముధామునన్
    పన్నుగ లాపుటాపులను వాడుచు రాజ్యమునేలబోవు చం
    ద్రన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్.

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    S. దేవి:

    చెన్నుగ కాంగ్రెసాదులను చేకొని కొట్టుచు చెంపమీదనున్
    మిన్నగ క్రొత్త రాష్ట్రమును మీరిన పొందున కూర్చి రాజుగా
    పన్నుగ నేలుచున్ వడిగ బంగరు భూమిగ మార్చబోవు చం
    ద్రన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్

    రిప్లయితొలగించండి
  3. చెన్నెస లారు మోహమున చేడియ జానకి ప్రాజ్ఞుడం చుతా
    నెన్నిక చేయకుం డినను నెమ్మిని పెద్దల యాజ్ఞమే రకున్
    పన్నుగ వింటిరా సినట వంచిన ధీరుడు మంచివాడు రా
    మన్నను పెండ్లి యాడెను మహామహి తాత్ములు మెచ్చగా భువిన్

    రిప్లయితొలగించండి
  4. ఎన్నగ మంచి గంధమును యేలిక నద్రి తనూజకున్ మహిన్
    మన్ననబొందగా చెలులు మానిని మెచ్చువిధంబు బూసిరే
    యన్నులమిన్న శంకరియె నాదరణమ్మున ప్రేమతోడ రా
    జన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నగ మంచి గంధమును నేలిక నద్రి తనూజకున్ మహిన్
      మన్ననబొందగా చెలులు మానిని మెచ్చువిధంబు బూసిరే
      యన్నులమిన్న శాంకరియె యాదరణమ్మున ప్రేమతోడ రా
      జన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్!!

      శంకరార్యుల సూచనతో..సవరణ

      తొలగించండి
    2. మీ సవరించిన పూరణ బాగున్నది అభినందనలు

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      ఉత్పలమాల

      వెన్నుని పైన రుక్మిణికి ప్రేమ జనింపగ నంపె భూసురున్
      బన్నగ శాయి రాక్షస వివాహమునన్ గొనిపోదునంచనన్
      గన్నియ గౌరికోవెలను కాలిడి కృష్ణునిఁ జేరె రుక్మి కా
      దన్నను పెండ్లి యాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు

      తొలగించండి
  6. కందం
    వెన్నుడు రుక్మిణిఁ జేగొన
    తిన్నగ రమ్మనఁగ గుడికిఁ దీరుచుఁ జనెనే
    యన్న యగు రుక్మి సరి కా
    దన్నను బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  7. ఎన్నుచువిదర్భరాట్సుత
    కన్నని హృత్కమలమందు గాటపుపేర్మిన్
    అన్నలు నీకాహరి తగ
    డన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్"

    రిప్లయితొలగించండి
  8. వన్నెల సొగసులు విరియగ
    కన్నియ కలగాంచె నంట కలవర బడగన్
    చెన్నుని చేరగ మురిసి మా
    యన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      మూడవ పాదంలో గణదోషం చేర మురిసి మా... అనండి.

      తొలగించండి
  9. మిన్నునరపాలుని తనయ
    కన్నియ పద్మావతమ్మ గాదిలి తోడన్
    తిన్నని రూపుం డగు వెం
    కన్నను బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్


    మిన్నునరపాలుడు =ఆకాశ రాజు
    తిన్నని = మనోజ్నమైన్

    రిప్లయితొలగించండి
  10. ( కమలా గోపరాజుల కల్యాణం )
    అన్నులమిన్నయౌ "కమల"
    యందము చిందెడి ధీరశాంతుడున్ ;
    బిన్నటనుండియున్ దనకు
    బ్రేమను బంచిన మన్మథుండునున్ ;
    జెన్నుగ రామచంద్రునకు
    సేవల జేసెడి ముద్దుబావ ; "గో
    పన్న"ను బెండ్లియాడెను మ
    హామహితాత్ములు మెచ్చగా భువిన్ .
    (అన్నులమిన్న - సౌందర్యవతి ; ధీరశాంతుడు - ధీరస్వభావం , శాంతస్వభావం కలిగినవాడు )

    రిప్లయితొలగించండి
  11. అన్నులమిన్న జానకియు,అందమునందున సుందరాంగియే
    కన్నుల కాంతివంతమగు,కారుణదృష్టిని నింపుకుంచు, యా
    పన్నులగాచు సుందరుడు,పావనమూర్తి యయోధ్యవాసి ,రా
    మన్నను పెండ్లియాడెను,మహామహితాత్ములు మెచ్చగాభువిన్.

    రిప్లయితొలగించండి
  12. కన్నులనింపి కామమును,కాంక్షలతీరముజేర్చగోపికల్
    అన్నులమిన్నలందరును,ఆశగజేరిరి వ్రేగి పల్లెకున్
    కన్నయరూపుగాంచగనె,కాంక్షలురేపెడు కామనోద్ధి గో
    పన్నను పెండ్లియాడెను మహా మహితాత్ములు మెచ్చగాభువిన్.

    రిప్లయితొలగించండి
  13. ఉ:

    అన్నుల మిన్న సీత, ముని యానతి గైకొని రాముడెక్కిడున్
    ధన్ను మనంగ భంగమగు ధన్వము, జూచిన సంభ్రమంబునన్
    కన్నుల పండుగన్ దలుపు కారణ జన్ముడు లక్ష్మణున్డనన్;
    అన్నను పెండ్లియాడెను మహా మహితాత్ములు మెచ్చగా భువిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. ఆకాశవాణికి పంపిన పూరణ...

    సమస్య. :. ఉ.మా.
    **** ****

    అన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్

    నా పూరణ. 
    **** *** ***

    అన్నులమిన్నయౌ ఘన ధరాత్మజ సీత స్వయంవరమ్మునన్

    చెన్నగు రాముడున్ సుళువు ఛేదన జేయగ శంభు చాపమున్

    సన్నిధి జేరి జానకియె చక్కగ దా వరమాల వేసి రా

    మన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్

    --  ఆకుల శాంతి భూషణ్

    వనపర్తి



    రిప్లయితొలగించండి
  15. మేమునూ మా పద్య సరదా పూరణను......
    జిలేబి గారికి అంకిత మిచ్చితిమహో!!!

    నా పూరణ ఉ.మా.
    *** *** ***

    ఎన్నగ హిందుదేశ ప్రజలే తన బిడ్డలగా దలంచుచున్

    పన్నుగ భారతావనిని పాలన జేయు నరేంద్రమోడియే!

    ఎన్నికలందునన్ గనగ నెప్పుడు నా జయకాంతనే నరేం

    ద్రన్నను బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  16. అన్నులమిన్న సద్గుణములన్నియు గల్గిన బుద్ధిమంతురా
    లెన్నిక గన్న విద్యల ననేకము నేర్చెను, మేనమామకున్
    చిన్నకుమార్తె, చిన్నపుడె చేసిరి పెద్దలు బాసలంచు మా
    యన్ననుఁ బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చఁగా భువిన్.

    రిప్లయితొలగించండి
  17. కన్నియ, సద్గుణప్రకర, కల్మషశూన్య, శుభాశయాది సం
    పన్న, 'యుమా'ఖ్య స్వీయపరివారమువారలు నిర్ణయించ దా
    నన్నులమిన్నయై వరగుణాఢ్యత యందము లేనివాడనౌ
    య న్నను బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చఁగా భువిన్.

    రిప్లయితొలగించండి
  18. విరించి.

    అన్నుల మిన్నయైన జనకాత్మజ జానకి, సద్గుణమ్ము తో

    నున్నతుడై వెలుంగెడు మహోన్నత కీర్తి విరాజితుండుగా

    మన్నన లందుకొన్న మహిమాన్విత సూర్యకులాన్వయుండు రా

    మన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్.

    .

    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    లక్ష్మణుని వద్దకు శూర్పణఖ వచ్చి తాను శ్రీరాముని కోరినానని తెలుపగా... లక్ష్మణస్వామి ఇలా అంటున్నారు...

    ఎన్నగ రామమూర్తి యన నేకసతీవ్రతదీక్షితుండు లో...
    కోన్నతధర్మవర్తనుడహో! శివచాపమునెత్తి త్రుంచగా
    నన్నులమిన్నయైన జనకాత్మజ ప్రేమ వరించి నాడు మా
    యన్నను బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ

      పన్నగమే యలంకృతి., కపాలము చేతి విభూష., బేసి ము...
      క్కన్నులవాడు., వాసమన కాడ.., తడెట్టులు జోడు నీకు? ., సం...
      పన్నుడ ? యందగాడ ? వినుమా! యని పార్వతిఁ దల్లి "వద్దు వ...
      ద్దన్నను" బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నాయి అభినందనలు.

      తొలగించండి
  20. అన్నులమిన్నజానకి స్వయంవరమందునరామచంద్రుడా
    జన్నపుగొంగ చాపమును జక్కగనెక్కిడునంత వేదికన్
    భిన్నముగాగనాధనువు ఫెళ్ళున, జానకి ప్రీతినొంది రా
    మన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్
    (జన్నపుగొంగ = శివుఁడు)

    రిప్లయితొలగించండి
  21. అన్నలు వలదని చెప్పిన
    నన్నుల మిన్న వినదయ్యె యభిమతు డనుచున్
    చిన్నది పట్టువిడక మా
    యన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  22. పన్నగధారి, దిగంబరు,
    వెన్నెలరేనిని శిగలను బెట్టెడివానిన్
    నెన్నకుమో సతి సుఖపడ
    వన్నను బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  23. ఎన్ని దెసల జెప్పిన , దన
    కన్న వయసున కడు పెద్ద గాన వలదనెన్ ,
    మొన్న సరియని తన జనని
    యన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  24. కం.
    దన్నుగ బ్రహ్మను యడుగగ
    కన్నడియన్నకు కుకుద్మి కన్యను యొసగన్ !
    చెన్నుగ రేవతి బలరా
    మన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్ !!

    రిప్లయితొలగించండి
  25. ఒక స్త్రీ:
    ఎన్నక దోషములన్, తన
    యన్నలు తామంత మెచ్చు యంద విహీనుం
    డున్నత శీలుండౌ రా
    జన్నను బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  26. అన్నుల మిన్నగు జానకి
    యెన్నో యాలోచనలటు ఏర్పడు దారి తా
    నెన్నక విఘ్నములను రా
    మన్నను పెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  27. మిత్రులందఱకు నమస్సులు!

    [సీతాదేవి సకలగుణాభిశోభితుఁడైన శ్రీరాముని వివాహమాడిన సందర్భము]

    సన్నుతమైన జన్నమును జక్కఁగఁ గాచిన వింటిజోదుఁ, డా
    పన్నులఁ గావఁ దాటక సుబాహులఁ జంపిన వీరవర్యుఁ, డా
    యన్నులమిన్న ఱాతిని నహల్యను నాతిగఁ జేయు వేల్పు, తా
    నెన్నికమీఱ శైవధను వెత్తియుఁ ద్రుంచిన మేటియైన రా

    మన్ననుఁ బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చఁగా భువిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణతో:

      సన్నుతమైన ౙన్నమును ౙక్కఁగఁ గాచిన వింటిౙోదుఁ, డా
      పన్నులఁ గావఁ దాటక సుబాహులఁ ౙంపిన వీరవర్యుఁ, డా
      యన్నులమిన్న ఱాతిని నహల్యను నాతిగఁ జేయు వేల్పు తా
      నెన్నికమీఱ శైవధను వెత్తియుఁ ద్రుంచఁగ, సీత యప్డు రా
      మన్ననుఁ బెండ్లియాడెను మహామహితాత్ములు మెౘ్చఁగా భువిన్!

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉంది అభినందనలు

      తొలగించండి
  28. సావిత్రి

    కన్నుల జూడకయున్నను
    విన్నను నారదునిమాట భీరువుగాకే
    దన్నని హరి,నాయువు లే
    దన్నను పెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  29. మన్ననతో నమించుచు నుమాపతి విల్లునుఁ బట్టి త్రుంపగా
    క్రన్నన రామభద్రుడట, కాంచిన రాజులు చోద్యమందగా
    నన్నులమిన్నసీత కడుహర్షముతోనిడి పూలమాల రా
    మన్నను బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్

    రిప్లయితొలగించండి
  30. కన్నియ చిత్తము నెరిగియు
    వెన్నుడు వీరమున వెడలి విక్రమ యుతుడై
    అన్నయగు రుక్మి తా కా
    దన్నను బెండ్లాడెను మహి తాత్ములు మెచ్చ న్

    రిప్లయితొలగించండి
  31. అన్నుల మిన్న జనక సుత
    యన్ని విధమ్ముల దగు వరునా రఘురామున్
    యెన్నగ మువ్వురు దమ్ముల
    అన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  32. మన్నన జేయు పెద్దలను, మానినులన్ దగ గౌరవించునా
    వెన్నుని బోలు సుందరుడు, వీరుడమేయబలాఢ్యుడాతడా
    పన్నుల గాచునట్టి గుణవంతుడు నన్నిట నగ్రగామి, నా
    అన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ

    (ఆకాశవాణి కి పంపినది)

    రిప్లయితొలగించండి
  33. అన్నుల మిన్నయౌన? వలదన్నను, వంశ మతమ్ము భిన్నమౌ
    నన్నను, గూటముల్ బొసగవన్నను, మెచ్చగ నీడుజోడుగా
    దన్నను, మూర్ఖవౌచు మనువాడినచో గృహకీర్తి గంగఁ జే
    రన్ననుఁ, బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చఁగా భువిన్.

    రిప్లయితొలగించండి
  34. ఎన్నగ సాటిరాడు మనకెందును, గోపకులుండు, జారుఁడున్!
    వెన్నునిఁ జేయిపట్టకని వేయివిధంబుల యన్న రుక్మి వ
    ద్దన్నను, పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్
    అన్నుల మిన్న రుక్మిణి నయంబుగ కృష్ణుని నామతించి తాన్!

    రిప్లయితొలగించండి
  35. చెన్నుగ నీశుచాపమును చేకొని ఫెళ్ళున ద్రుంచగా సభన్
    మిన్నున వేల్పులెల్లరును మెచ్చగ, పౌరులు జేలు కొట్టగా
    అన్నుల మిన్న భూమిజయె హర్షమునొందుచు ప్రేమమీర రా
    మన్నను బెండ్లియాడెనుమహామహితాత్ములు మెచ్చగా భువిన్!!!

    రిప్లయితొలగించండి
  36. వెన్నునిటారుగా నిలిపి వెన్నెల చిందగ మోముపైన పే
    రెన్నికగన్న భూరివిలు శ్రీరఘురాముడు ద్రుంచ ఫెళ్ళునన్
    కన్నియ సీత పొంగుచు సుగంధ పరీమళమాలతోడ రా
    మన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్

    తిరుక్కోవళ్ళూ శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  37. సవరణతో-
    కం.
    దన్నుగ బ్రహ్మనె యడుగగ
    కన్నడియన్నకు కుకుద్మి కన్య నొసగగన్ !
    చెన్నుగ రేవతి బలరా
    మన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్ !!

    రిప్లయితొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    అన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్

    సందర్భము:
    పురారి గిరి సంభూతా
    శ్రీ రామార్ణవ సంగతా
    అధ్యాత్మ రామ గంగేయం
    పునాతి భువన త్రయమ్
    త్రిపురారి (శివుడు) అనే పర్వతంనుంచి బయలువెడలింది.. శ్రీ రాము డనే సాగరంలో సంగమించింది.. ఈ (అధ్యాత్మ) రామాయణం (రామకథ) అనే గంగానది మూడు లోకాలనూ పవిత్రీకరిస్తుంది.. అంటాడు వ్యాస మహర్షి.
    శివుడు పార్వతికి రామ గాథ చెబుతూ.. అందులో భాగంగా శివ ధనుర్భంగాన్ని గురించి చెబుతూ వుండే సందర్భం పూరణ పద్యంలో పేర్కొనబడింది.
    (శివుడు పార్వతికి రామగాథను వినిపించడం గురించి 23.11.19 నాడు కూడ వ్రాయబడింది. చూడవచ్చు.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *రామన్న పెండ్లి*

    "అన్నుల మిన్నరొ! నా ధను

    వున్న దొకటి జనకు నొద్ద నొప్పుగ విరువన్

    జెన్ను మెఱయు జానకి రా

    మన్ననుఁ బెండ్లాడెను మహి
    తాత్ములు మెచ్చన్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    8.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  39. కందం
    మిన్నగ సృజియించియు నిగ
    మోన్నతికిన్ దోడగునని యుక్తిని సతిగా
    నెన్న నలువయె వరుస కా
    దన్నను బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్
    (ఉక్తి = సరస్వతి)

    రిప్లయితొలగించండి
  40. ఉ. జన్నము గాచి గాధిసుతు సంతస మందగ జేసి మౌనిచే
    సన్నుతులందుచున్ శిలను చానగ దీర్చియు నీశు జాపమున్
    జెన్నుగ ద్రుంచ మైథిలియె చిన్మయుడా యవతారమూర్తి రా
    మన్నను బెండ్లి యాడెను మహా మహితాత్ములు మెచ్చగా భువిన్!

    రిప్లయితొలగించండి
  41. *అందరికీ నమస్సులు*🙏

    నా చిరు ప్రయత్నం 🙏

    ప్రేమ పెళ్ళికి ఇంటిని వదలి వెళ్లిన కొడుకు/కూతురు ..సందర్భములో

    *కం||*

    ఎన్నో గొడవలు జేయుచు
    అన్నియు తనకే తెలుసని యనుకొనుచున్ తా
    నిన్ననె వెడలెను మే మే
    *"మన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  42. చెన్నగురూపపుకుజరా
    మన్ననుబెండ్లాడెనుమహితాత్ములుమెచ్చన్
    మిన్నునుమన్నునుముదమున
    సన్నుతిగైదండలిడుచుస్రజములువిసిరెన్

    రిప్లయితొలగించండి
  43. మిన్నంట సంబరమ్ములు
    మన్నుకొమారిత లతాంగి మహిళా మణియే
    కన్నుల పండుగగా రా
    మన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్


    మిన్నయ విద్యలం దరయ మించి వివేకుఁడు విత్త మందుఁ దా
    సన్నని వాఁడె యందమునఁ చక్కని వాఁ డని మేనకోడలౌ
    యన్నుల మిన్న సుందరి నిజాంబకుఁ దమ్మునిఁ దోటి వారు కా
    దన్ననుఁ బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చఁగా భువిన్

    రిప్లయితొలగించండి
  44. ఒక రోజంతా శంకరాభరణం బ్లాగులో ఆకాశవాణి హైదరాబాదు వారి సమస్యయే..అలరించటం ధర్మమే
    అదేవిధంగా తదుపరి వారం సమస్యయేమిటో ప్రకటించటం భావ్యం కదా! కానీ కవులకు తదుపరి సమస్య తెలియజేయడానికి మనసొప్పదు ఎందుకో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇట్లు వ్యంగ్యాస్త్రములు సంధించుట కన్న యీ వారపు టాకాశవాణి వారి సమస్య యేమిటని యడుగుట భావ్యము కదా.

      తొలగించండి
    2. *కనిపించని కీటకమ్ము కాలుని మించెన్*

      ఇదండీ వచ్చేవారానికి ఆకాశవాణి హైదరాబాదు వారి సమస్య. శుభాకాంక్షలు.

      తొలగించండి
  45. చెన్నగురూపమున్గలిగిశీతమయూఖునిబోలునట్టిరా
    మన్ననుబెండ్లియాడెనుమహామహితాత్ములుమెచ్చగాభువిన్
    నన్నువతోడగన్పడెడునామిధిలాపురముద్దుబిడ్డకా
    యున్నతపూరుషుండునుమహోన్నతశీలుడునయ్యెభర్తగా


    రిప్లయితొలగించండి
  46. విషయా చంద్రహాసుల పరిణయ నేపథ్యంలో..

    ఉత్పలమాల(పంచపాది)
    "ఎన్నుచు నీతనిన్ విషము నీయుము మాకహి తుండు" గా గనన్
    "యెన్నుచు నీతనిన్ విషయ నీయుము మాకుహితుండ" టంచుఁ దాఁ
    దిన్నగ కాటుకన్ విషయ దిద్దుచు లేఖ వివేకురాలిగన్
    మిన్నగఁ జంద్రహాసుఁ, బిత మిత్తినిఁ గూర్చు మటంచు బూన్చగా
    నన్ననుఁ, బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్

    రిప్లయితొలగించండి
  47. మన్ననసేయగా మదిని మానిని భర్తగ సత్యవంతునిన్
    విన్నను మౌనిమాటలను భీతినిచెందక, వానికచ్చటన్
    చెన్నగు రాజభోగములు,జీవితకాలము లేవులేవు వ
    ద్దన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగాభువిన్

    రిప్లయితొలగించండి
  48. మిన్నంటిన సంబరమున
    అన్నుల మిన్నగు సుభద్ర యారా ధనతో
    కన్నార్పక చూచి నకులు
    నన్నను పెండ్లాడెను మహిత ఆత్ములు మెచ్చన్.
    మరొక పూరణ

    పన్నగ‌ భూషణు నిధనువు
    విన్నాణముతో రఘుకుల వీరుడు విరువన్
    కన్నియ జానకి గని రా
    మన్నను పెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్


    రిప్లయితొలగించండి
  49. ఉత్పలమాల
    వెన్నుడు వేద రక్షకని పేర్మిని గూర్చఁగ బ్రహ్మ దేవుఁ దా
    నెన్నెనె వాణిఁ దానె సృజియించుచు విద్యకు మాతఁ జేసి సం
    పన్నత గూర్చగన్వదన భాగము నందున జేర్చ వావి కా
    దన్ననుఁ బెండ్లి యాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్

    రిప్లయితొలగించండి
  50. అన్నగ రుక్మి, రుక్మిణిని యాశిశుపాలున కిత్తునంచుఁ దా
    నన్నను, పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్
    యన్నులమిన్న విప్రుని రయంబున బంపగ కోర్కెదీర్పగన్
    వెన్నుడు వచ్చితేరుపయివేగమె భైష్మకి, రుక్మిణిన్ గొనన్

    రిప్లయితొలగించండి
  51. పన్నగభూషణుండునట,పార్వతిరూపముజూసినంతనే
    కన్నులనింపు యందమని,కారణజన్మయె నీమెతోడనిన్
    పన్నుగదల్చిశైలజయు ,పావనధాత్రిన యాదిదేవు శై
    వన్నను పెండ్లియాడెను మహా మహితాత్ములు మెచ్చగాభువిన్.

    రిప్లయితొలగించండి
  52. సన్ననిగాత్రమున్నదని,సాహసమన్నదిజేయనాపెయే
    మిన్నునుదాకసంతసము,మీదుగమిక్కిలి కాంక్షలూరగా
    అన్నులమిన్ననీమెయని,నాతడు యామెను తోడు గోర బా
    లన్నను పెండ్లియాడెను మహా మహితాత్ములు మెచ్చగాభువిన్.

    [బాలగంధర్వుని ప్రేమవివాహం స్ఫురణకురాగా]

    రిప్లయితొలగించండి
  53. దన్నుఁగ నిల్చి యా శివుని ధన్వము ఫెళ్ళున ద్రుంగ జేయగన్
    ఉన్నతి నొందగన్ హలజ యుల్లస మొప్పఁగ మాల తోడ, మా
    *యన్నను బెండ్లి యాడెను మహా మహితాత్ములు మెచ్చగా, భువిన్*
    అన్నువు తోడ లక్ష్మణుఁడు నత్తరి దెల్పెను దేహకర్తకున్

    రిప్లయితొలగించండి
  54. కన్నులు లేని కబోదిని
    పన్నుగ జాలిని గొనుచును పరిణయ మాడన్
    కన్నె ,జనని జనకులు వల
    దన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  55. ఈరోజు ఆకాశవాణి లో చదువబడిన నా పూరణం

    కన్ను గవన్ సతంబును ప్రకాశమొనర్చుచు,ప్రేమ నింపుచున్,
    మన్ననలెన్నొ చేసి,మరుమల్లెల జాజుల పూలజల్లుతో
    వన్నెలు చిన్నెలన్ సలుపు బావను కోమలి కోర్కెఁదీర, సో
    మన్నను పెండ్లి యాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్.

    రిప్లయితొలగించండి