29, ఫిబ్రవరి 2020, శనివారం

సమస్య - 3295 (లలితమ్మై విన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మేటి రాగాల వినిపించు పేటిక యిదె"
(లేదా...)
"లలితమ్మై వినసొంపుగన్ నవరసాలన్ జిల్కు నీ పేటియే"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

58 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  "మండిత నాయకి"

  జలసాలాటకు మానసమ్ము తగులన్ సంపంగులన్ పూనుచున్
  పిలువన్ గా వడి వచ్చుచున్ దిటవుగా ప్రేమించి ముద్దాడుచున్
  కలనన్ గానని శ్లాఘముల్ పలికెడిన్ గారాబు నాథుండహో
  లలితమ్మై వినసొంపుగన్ నవరసాలన్ జిల్కు నీ పేటియే

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  "Yes! Boss!"

  పిలువన్ గా వడి వచ్చుచున్ మొరుగుచున్ ప్రేమించి పాదమ్ములన్
  కలనన్ గానని రీతి నెత్తుకొనుచున్ గారాబుగా నొత్తుచున్
  బలుపౌ పాటలు పద్యముల్ విరివిగా పాడంగ భట్రాజహో
  లలితమ్మై వినసొంపుగన్ నవరసాలన్ జిల్కు నీ పేటియే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. నా కడ "సంగీత జ్ఞానము, భక్తి," లేవు కదా 😊

   తొలగించండి

  2. అంతకు మించి నిత్య విద్యార్థి లక్షణములున్నవి కదా :)

   తొలగించండి
  3. ఏమిటో ఈ ఆకాశవాణి "సమస్య" అర్థం కాలేదు. 😊

   తొలగించండి

  4. పృచ్ఛక మహాశయుడు ఆకాశవాణిని కాకా పడుతున్నట్లనిపించినది వినగానే

   తొలగించండి
 3. కలకంఠుల్ దమ రాగభావ పటిమన్ కమ్మంగ మాట్లాడుచున్
  తొలివార్తల్ ప్రజజేర్చుచున్ మిగుల సంతోషంబు జేకూర్చుచున్
  లలనాశ్రీలకు నిత్యమున్ దగిన కాలక్షేపమున్ గూర్చగా
  లలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కునీపేటియె!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుప్రభాతము వినిపించు సుబ్బలక్ష్మి
   భక్తిపాటల నందించు బాలమురళి
   చిత్రగీతాల దేల్చును చిన్నమురుగ
   పొద్దు నెరుగక నెప్పుడు సద్దుజేసి
   మేటిరాగాల వినిపించు పేటికయిదె

   చిన్నమురుగ = బాలసుబ్రహ్మణ్యం
   రేడియో
   ప్రొద్దున సుప్రభాతం,మధ్యలో కర్ణాటక సంగీతం,రాత్రికి సినిమా సంగీతం !

   తొలగించండి

  2. చిన్నమురుగ :)

   బావుందండోయ్

   సుబ్రహ్మణ్య భారతి చిన్న శంకర అన్నాడు మురుగుని అట్లా మీ చిన్న మురుగ :)


   జిలేబి

   తొలగించండి
  3. ధన్యవాదములు జిలేబిగారూ!ఏమిటో ఈమధ్య అర్ధరాత్రులు మేల్కొని పూరణలు చేసినా గురువుగారి వీక్షణలకు నోచుకోవడం లేదు!వారు మరీ నల్లపూసైనారు!

   తొలగించండి
 4. Guruvu gariki namaskaram.Naaku telugu padyalante entho istam. Vaatini chadivi,artham chesukoni,abhinandinchi nenu kooda raaddamani prayatniste chaala samayaniku okati rendu paadalu athi kastam meeda kudiraayi.vaatini koorchaam entho kastam gaa anipinchindi.enno vachana kavitalu raasinaa padyam rayalane korika alage migilipoyindi. Meeru iche ee samasyalu, raayagalgina vaaru baagane rastaaru.Kaani naa vanti vaari kosam ante ela modhalupettali vanti soochanalu,melakuvalu ee blog dwaara teliyacheyagalarani aasistunnanu.Dhanyavaadaalu

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. నవపికమ్ముల మధురస్వనమ్ములెగయ
   'గానగంధర్వ' కర్తృత్వ గరిమ మెరయ
   ' పాడుతా తీయగా' వేడ్క చూడ ననెద
   మేటి రాగాల వినిపించు పేటిక యిదె

   గాన గంధర్వ : శ్రీ యస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు

   తొలగించండి
 6. ఘనమయిన కీర్తి నొందిన ఘంటసాల
  వారి స్వరపేటిక యిడగ పరవశించి
  పూర్వపు సినిమా పాటలు పొందుబరచ
  మేటి రాగాల వినిపించు పేటిక యిదె

  రిప్లయితొలగించండి
 7. ( దేవభటులు ఘంటసాల వారి మెడ వైపు
  చేయి చూపుతూ అమరేంద్రునితో అంటున్నారు )
  కలితమ్మై కవిభావనాంబరకళా
  కల్యాణశోభాంకమై ;
  ఫలితమ్మై చలియించు పాత్రములకున్
  బ్రామాణ్యభృంగారువై ;
  వెలయున్ దేవర ! ఘంటసాలఘను శ్రీ
  వీణాస్వరారూఢమై
  లలితమ్మై వినసొంపుగన్ నవరసా
  లన్ జిల్కు నీ పేటియే !
  ( ప్రామాణ్యభృంగారువు - దృష్టాంతమైన
  బంగారుపాత్ర ; పేటి - స్వరపేటిక )

  రిప్లయితొలగించండి
 8. లలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కు నీ పేటియే
  కలలో నైనను నూహకం దనిమ హాకాళిన్ నివేధిం చగా
  వలయం బందున బంధితుల్ మిగుల భావావే శమందున్ గనన్
  వెలయం గాసుర లోకమే మురిసి దీవించంగ నేతెంతురే

  రిప్లయితొలగించండి
 9. విరించి  ఇలలో మార్కొని శాస్త్రవేత్త యతడే యెంతో ప్రతీతుండు, తా

  నలనాడే సృజియించె మందస మదే యాశ్చర్యమే, యందునన్

  బలు కార్యక్రమముల్ ప్రసార మవగన్ బాటించి యాలించినన్

  లలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కు నీ పేటియే.

  .

  రిప్లయితొలగించండి
 10. ఊర్ద్వ్హ లోకాల తేలించు నుర్వి జనుల
  ఘంట సాలను మించిన గాయ కుండు
  నేడు లేడంటె లేడుగా వేడు కొనగ
  మేటి రాగాల వినిపించు పేటిక యిదె

  రిప్లయితొలగించండి
 11. నాడె సృజియించె మార్కోని నాణ్యమైన
  శబ్ద పేటికనొకటి యీ జగతి యందు
  చిన్న దైనట్టి రేడియో చిత్రముగను
  మేటి రాగాల వినిపించు పేటి కయిదే.

  రిప్లయితొలగించండి


 12. వార్త లను చేర్చు నిద్దియె వాయువేగ
  మున ఫిలిప్సు రేడియొ యను మువ్వలాడి
  రావె రావె వినెదము సరాగమైన
  మేటి రాగాల వినిపించు పేటిక యిదె


  ఆకాశవాణికి
  జాల్రా
  జిలేబి

  రిప్లయితొలగించండి


 13. ఇలలో వాక్కుల శ్రోత లెల్లరికి ప్రావీణ్యమ్ముతో చేర్చగా
  నలయై తేలెడి హాయి హాయి యనెడా నాకాశవాణిన్ సఖా
  భళిరా నిల్పెను నాడు నేడు మనకై పైపెచ్చు వైవిధ్యమై
  లలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కునీ పేటియే


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. అలఘుప్రేమను జూపుచుండి సతతం బత్యంత సన్మిత్రుడై
  ఛలహీనుండగు వాద్యకారు నొకనిన్ సమ్యగ్విధానమ్మునన్
  కలియం జేరి యొకండు బల్కె వినుమో కల్యాణభావాన్వితా!
  లలితంబై వినసొంపుగన్ నవరసాలం జిల్కు నీపేటియే

  రిప్లయితొలగించండి
 15. అలనాడెప్పటినుండియోజనులకారాధ్యంబునైవెల్గెనీ
  యిలలో 'రేడియొ' వైభవప్రభలతో, నెన్నెన్నియో గీతముల్
  పలికించెన్ ప్రతి శ్రోతమెచ్చుపగిదిన్ వాంఛాను కూలంబుగా
  లలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కు నీ పేటియే

  రిప్లయితొలగించండి
 16. మైలవరపు వారి పూరణ

  సూతుడు... రాధతో..

  అలలన్ దేలుచు వచ్చుచుండెనిది రాధా! చూడుమిందున్ మహో...
  జ్జ్వల భానుప్రభ చిందె సందుల గనన్., బాలుండుగాబోలు! వి...
  హ్వలుడై యేడ్చు కువా కువా యనుచు., నీ యాశల్ ఫలించున్ గదా!
  లలితంబై వినసొంపునై నవరసాలన్ చిల్కునీ పేటియే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరో పూరణ...

   శంకరాభరణం.. సమస్యాపూరణం..

   లలితంబై వినసొంపునై నవరసాలన్ చిల్కునీ పేటియే!

   లలితావిష్ణు సహస్ర నామ ఘనసారంబై., సదా వేంకటా...
   చలపత్యద్భుత సుప్రభాత రస కాసారమ్మునై., త్యాగరా...
   జ లయప్రాభవ పంచరత్నమయ భాస్వద్వార్ధియై., యన్నమ...
   య్య లతా ప్రోత్థిత కీర్తనాసవమునై., అయ్యారె! గోపన్న పా...
   టల పూఁదోటల చంచరీకమయి., వాడన్ దేశమున్ దాటు కాం...
   తులతో భారతరత్నమై చెలగు మా తోబుట్టువై., గానమం...
   దెలమిన్ సుస్వరపేటి నా బరగు ఎమ్మెస్సుబ్బలక్ష్మిన్ గనన్
   లలితంబై వినసొంపునై నవరసాలన్ చిల్కునీ పేటియే!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

   తొలగించండి
 17. (అత్యంత ప్రజాదరణపొందుచు నాడూ నేడూ చూడదగిన చిత్రరాజం 'మాయాబజార్ ' చిత్రంలోని ఒక సన్నివేశం నేపథ్యంగా)

  బావ అభిమన్యుడు మరదలు శశిరేఖకై పంపిన ప్రియదర్శిని అను పేటిని ఇస్తూ శ్రీకృష్ణపరమాత్మ శశిరేఖతో....

  తేటగీతి
  మరదలు 'శశిరేఖ' ను దల్చి మురిపెముగ
  ప్రేమ 'నభి' 'ప్రియదర్శి' న్ వేడ్కనంపె
  కోరుకున్నది చూపించి గుండె మీటి
  మేటి రాగాల వినిపించు పేటిక యిదె!

  మత్తేభవిక్రీడితము

  కలవై నీ వభిమన్యుఁ దేల్చ శశిరేఖా!  ప్రేమభావాబ్ధిలోఁ.
  దలమున్కై 'ప్రియదర్శినిన్ బనిచె మోదంబంద, నేకాంతవై
  వలపుల్ జిందఁగఁ గాంచితే యవనికన్ వాంఛించు దృశ్యాలతో
  లలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కు నీ 'పేటి' యే

  రిప్లయితొలగించండి
 18. మిత్రులందఱకు నమస్సులు!

  [ఆకాశవాణి (రేడియో) కార్యక్రమ వివరణము]

  "వలపుల్ గుల్కెడు నాటికల్, కవులు, స్త్రీల్ వాంఛించు కార్యక్రమాల్,
  నెలవౌ బాల వినోదముల్, పొలములన్ నెక్కొల్పు సత్కృత్యముల్,
  విలువౌ వార్తలు, చిత్రసీమ పదముల్ విన్పించు నీ రేడియో!

  లలితమ్మై వినసొంపుగన్ నవరసాలన్ జిల్కు నీ పేటియే!"

  రిప్లయితొలగించండి
 19. మ:

  విలసద్రూపము చంద్రబింబము కురుల్విప్పార నా చెక్కిలిన్
  లలితాంగీ మనసంత నీ వశము నాలాపింప నౌ చందమున్
  కలిలంబౌ కటి భాగమున్ వలపు బంగారమ్ము నూహించగన్
  లలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కు నీ పేటియే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 20. చెలియా నీకిదె కానుకంచు నిడె దా జిత్రమ్ముగా జూడగన్
  చెలువౌ రాగసుధాస్రవంతి మది రంజింపన్ ప్రమోదమ్ముగా
  లలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కు నీ పేటియే
  దలపన్ మానవ మేధకున్నిజమసాధ్యమ్మన్నదే లేదుగా
  (ఆకాశవాణికి పంపినది)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాటి తరమున కిదియె నానందమొసగె
   నేటి తరమున యెఫ్ఫెమ్ము నిలిచె మరల
   సాటి లేనిది రేడియో స్వర స్రవంతి
   మేటి రాగాల వినిపించు పేటిక యిదె

   తొలగించండి

 21. మన సమూహాన్ని ఉద్దేశించి రాసిన పద్యం

  పండితులనొక చో చేర్చి పద్య మల్ల
  చేయు కవి పుంగ వుండీతడేయటండ్రు
  నెల్ల కవిమిత్రులకును పుట్టిల్లు గనుడు
  *మేటి రాగాల వినిపించు పేటిక యిదె.

  మరొకపూరణ

  సుస్వరంబుగ పాడెడు సుదతి యీమె
  గాన కోకిల గానిల ఖ్యాతినందె
  నవరసాలను చిందించు నారి గళమె
  మేటి రాగాల వినిపించు పేటిక యిదె*

  రిప్లయితొలగించండి
 22. లలిత సంగీత గానంపు రాగ ఝరులు
  నాటకమ్ముల పద్యాలు నవ్య మైన
  చిత్ర గీతాలు వాద్యాల చిత్త మలర
  మేటి రాగాలు వినిపించు పేటిక యిదె

  రిప్లయితొలగించండి
 23. అందరికీ నమస్సులు 🙏🙏

  నా పూరణ

  *తే గీ*

  పాట పాడగ నాతడు, పరవశమ్ము
  అమర గాయకుడతడొక, యద్భుతమ్ము
  మరువ లేని గాత్రము మన మనసు దోచె
  *"మేటి రాగాల వినిపించు పేటిక యిదె"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌷🙏🌷🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. *సరదా పూరణ* 🙏😊

   వద్దన్నా కూడా పాడి వినిపించే వారినుద్దేశించి 🙏

   *తే గీ*

   గానము వినిన మరువము గార్ధభ మును
   పాట పాడగ చేయుదు పాపములను
   పాట మొదలిడ లంఘించు పరుగులను, కు
   *"మ్మేటి రాగాల వినిపించు పేటిక యిదె"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏😃🙏😃🙏

   పేటిక = స్వర పేటిక అనే ఉద్దేశ్యముతో

   తొలగించండి
 24. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "మేటి రాగాల వినిపించు పేటిక యిదె"

  సందర్భము: "రామ లక్ష్మణులు చూస్తారు శివధనుస్సును తెప్పించండి" అన్నాడు విశ్వామిత్రుడు. జనకుడు తెప్పించే ముందు దాని వృత్తాంతాన్ని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.
  జన్నంబు గావింప సమకట్టి యేను
  సన్నుత నియతి భూస్థలి శుద్ధికొరకుఁ
  గ్రతు శాల దున్న నాగటి చాలులోన
  నతులితంబుగ చాలునం దొప్పు మిగిలి
  మందసంబును రాగ మది నుబ్బి చూచి
  మందసంబును నేను మమత దీయంగ
  నతి వైభవంబుగా నందులో నపుడు
  నతివ యొక్కతె పుట్టె నాశ్చర్య లీల
  ప్రీతితో సీతయన్ బేరొప్ప బెట్టి
  యా తన్వి నా కూతు రని పెంచుచుండ..
  (రంగనాథ రామాయణం బా.కాం.)
  యజ్ఞ ధాత్రి సీతాభవయైన కన్య.. అన్నారు విశ్వనాథ వారు.
  పెట్టె కనిపించగానే రాజు వెంట వుండే విదూషకుడు పైపైన చూసి "ఇదేదో హార్మోనియం పెట్టె.." అన్నాడు.. కాని తెరచి చూస్తే అందులో ఒక పసిపాప వున్నది. సీత.. అని పేరు పెట్టి పెంచుకున్నాడు జనకుడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *పొలము పొలతి*

  జన్నమునకయి భూమిని దున్నుచుండఁ
  దనరు సీతాభవంబు మందసముఁ గనియె
  జనకు.. డంత విదూషకుం డనియె నిట్లు..
  "మేటి రాగాల వినిపించు పేటిక యిదె"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  29.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 25. మరొక పూరణ

  కలనైనన్ వినినంతనే కలుగు మాకత్యంత మోదమ్మిటన్
  కలతల్ బాపుచు నేప్పుడున్ చెవుల కా గానమ్ము విందున్ సదా
  కలిగిం చున్ గను మీసువా ద్యమున టన్ కైసే సిరోయంచనన్
  లలితం బైవిన సొంపునై నవర సాలన్ జిల్కునీ పేటియే

  రిప్లయితొలగించండి
 26. కలయో వైష్ణవ మాయయోనరుల లోకంబందు నట్టింట నా
  కలలోనైననుగన్పడన్నెరుగ యీ, గానామృతమ్మౌ గదా
  ఫలమున్ దక్కును గానమాధుర ప్రభల్ ప్రాణంబగున్ గాదె యీ
  లలితంబై వినసొంపునై నవరసాలంజిల్కు నీ పేటియే!

  **ఈరోజు ఆకాశవాణి సమస్యాపూరణం కార్యక్రమం లో చదుబడిన పూరణ!

  రిప్లయితొలగించండి


 27. ఆకాశవాణి విశేషములు తెలియ చేయగలరు.

  రిప్లయితొలగించండి
 28. లలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కు నీ పేటియే
  పలికింపన్ బలు శబ్ద రీతులను, బాపన్ ద్రుప్పు కర్ణమ్ములన్
  కలయేమో యనునట్టులీ జనుల నాకర్షించుచున్ బోవ మై
  పులకించన్ మది పెట్టెనున్ పొగడి "కీబోర్డం"చు వాక్రుచ్చిరే!

  రిప్లయితొలగించండి
 29. లలితమ్మై వినసొంపుగన్ నవరసాలన్ జిల్కు నీ పేటియే
  కలిలో దైవముఁ గొల్వ నామజపమౌ గానమ్ము లీ పేటివే
  పలుకుల్ యుక్తముగా వచించునటు నేర్పంగా వరంబిమ్ము వా
  క్కుల తల్లీ వర శారదా భగవతీ కోట్లాది స్తోత్రాలివే౹౹

  రిప్లయితొలగించండి
 30. అలనాడెందఱువ్రాసినన్గనగనయ్యాద్యంతమానందిదే
  లలితంబైవినసొంపునై నవరసాలన్ జిల్కునీపేటియే
  కలలోనైననుజెప్పనోపుగదసాకారంబుగానాకధన్
  లలితా!వింటివెనాదుమాటచెవులారానీవుసంపూర్తిగా

  రిప్లయితొలగించండి
 31. మేటిరాగాలవినిపించు పేటికయిదె
  సందియములేదునిజమార్య!శంకరాభ
  రణమెసుమధురపద్యాలరాగయుతము
  శ్రోతలెల్లరిమనముల శుద్ధిజేయు

  రిప్లయితొలగించండి
 32. పద్యమో, శ్లోక మేదైన హృద్యముగను |
  పాట పాడ తన్మయమెగ పరవశింప |
  ఘంటసాల సుధలు దాచె కంఠసీమ |
  "మేటి రాగాల వినిపించు పేటిక యిదె"

  రిప్లయితొలగించండి
 33. పాట లందు గంధర్వుల వాణి మించు
  గణిత గాయక గాయకీమణులు పాడ
  శాస్త్రవిజ్ఞాన మహిమమ్ము సన్నుతింతు
  మేటి రాగాల వినిపించు పేటిక యిదె


  ఇలఁ దారాడు విరించి దేవి యనఁ గన్పింపంగ రమ్యంబుగా
  నలివేణీ నిజమే వచింతు నిట మేనల్లాడఁ బద్మాక్షిరో
  చెలువం బొప్పఁగఁ గింకిణీ కలిత కాంచీ బద్ధమై వెల్గుచున్
  లలితమ్మై వినసొంపుగన్ నవరసాలన్ జిల్కు నీ పేటియే

  [పేటి = నడికట్టు]

  రిప్లయితొలగించండి
 34. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "మేటి రాగాల వినిపించు పేటిక యిదె"

  సందర్భము: యజ్ఞం చేయ సమకట్టి భూ శుద్ధికోసం జనకుడు అనుచరులతో కలిసి దున్నుతున్నాడు. నాగటి చాలులో దైవికంగా ఒకానొక పెట్టె కనిపించింది.
  సఖుడు "సీతా పేటిక (నాగటి చాలులో పెట్టె)" అన్నాడు. జనకుడు "సీతా పేటికయే! (సీతయొక్క పెట్టెయే!) అన్నాడు.
  సంగీత విదుడు (పాటకాడు) పెట్టెను మాత్రమే చూసినాడు. తెరువడం చూడలేదు. (చూసివుంటే అందులో పాప వున్న సంగతి తెలిసివుండేది.)
  అందుకని "ఇదేదో హార్మోనియం పెట్టె.." అన్నాడు..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *సీతా పేటిక*

  సంగీత విదునితో, సఖునితో జనకుండు
  యజ్ఞార్థ మహి దున్ను నవసరమున
  నాగటి చాలులోనన్ మందసం బొండు
  కాంచి "సీతా పేటిక" యనె సఖుడు..
  ఆ పెట్టెలో నొక్క యందాల పసికూన
  కననయ్యె వింతగా జనకునికిని..
  "కంటి, సీతా పేటికయె!" యనె జనకుండు
  చిన్ని పాపను బిల్చి సీత పేర..
  చూచి పేటికన్, తెరచుట చూడకునికి
  నపుడు నలు దిక్కులకుఁ జూపు లప్పగించు
  పాటకా డీ విధంబుగాఁ బలికినాడు
  "మేటి రాగాల వినిపించు పేటిక యిదె!"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  29.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 35. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "మేటి రాగాల వినిపించు పేటిక యిదె"

  సందర్భము: యజ్ఞం చేయ సమకట్టి భూ శుద్ధికోసం జనకుడు అనుచరులతో కలిసి దున్నుతున్నాడు. నాగటి చాలులో దైవికంగా ఒకానొక పెట్టె కనిపించింది.
  సఖుడు "సీతా పేటిక (నాగటి చాలులో పెట్టె)" అన్నాడు. జనకుడు "సీతా పేటికయే! (సీతయొక్క పెట్టెయే!) అన్నాడు.
  సంగీత విదుడు (పాటకాడు) పెట్టెను మాత్రమే చూసినాడు. తెరువడం చూడలేదు. (చూసివుంటే అందులో పాప వున్న సంగతి తెలిసివుండేది.)
  అందుకని "ఇదేదో హార్మోనియం పెట్టె.." అన్నాడు..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *సీతా పేటిక*

  సంగీత విదునితో, సఖునితో జనకుండు
  యజ్ఞార్థ మహి దున్ను నవసరమున
  నాగటి చాలులోనన్ మందసం బొండు
  కాంచి "సీతా పేటిక" యనె సఖుడు..
  ఆ పెట్టెలో నొక్క యందాల పసికూన
  కననయ్యె వింతగా జనకునికిని..
  "కంటి, సీతా పేటికయె!" యనె జనకుండు
  చిన్ని పాపను బిల్చి సీత పేర..
  చూచి పేటికన్, తెరచుట చూడకునికి
  నపుడు నలు దిక్కులకుఁ జూపు లప్పగించు
  పాటకా డీ విధంబుగాఁ బలికినాడు
  "మేటి రాగాల వినిపించు పేటిక యిదె!"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  29.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 36. తెలుపున్ వార్తలు వింతలున్, మనములన్ తేజమ్ములే నింపుచున్
  తలపే దోచుచు, నెల్లవేళలను నుత్థానమ్మునన్ భాగమై
  అలుపే లేకను బల్కుచున్ మిగుల నానందాబ్ది తేలించుచున్
  లలితంబై వినసొంపునై నవరసాలన్, జిల్కు నీపేటియే!!!

  రిప్లయితొలగించండి
 37. పలు కార్యక్రమముల్ సదా జగమునన్ వ్యాపింపగా, నిత్యమున్
  సులువౌ మార్గములందునన్ ప్రజలకున్ చూపించి పేరొందుచున్
  కలిగించెన్ కలికాలమందున సుసౌఖ్యమ్మున్, నిజమ్మెంచగా
  లలితంబై వినసొంపునై నవరసాలన్ చిల్కు నీ పేటియే

  రిప్లయితొలగించండి
 38. ఇలలోసంతసమిచ్చుమేటిగను,తానిష్టంపు సంగీతమై
  కలలోనైనను వీడగాజనని,యాగాత్రమ్ముశోభిల్లగా
  మలుపుల్ దిప్పుచు,మంత్రమాయనగ నామాహాత్యమే గొప్పగా
  లలితంబైవినసొంపునైనవరసాలం, జిల్కునీపేటియే.

  రిప్లయితొలగించండి
 39. పలుతావుల్ తనగానమాధురిని,కాపాడంగనేగొప్పగా
  ఇలలో శాశ్వతమైనకీర్తిగొని,తానిల్లాలుగా సంపదై
  మలుపుల్ ద్రిప్పుచుభారతాంబ తన సమ్మానంబదే రత్నమై
  లలితంబైవినసొంపునైనవరసాలం, జిల్కునీపేటియే.

  రిప్లయితొలగించండి
 40. అందరికీ నమస్సులు ��

  మాటలాడు, జనుల స్వర పేటికెపుడు,

  పాట పాడు జనుల స్వర పేటిక ముద

  మునిడు మనకు సరిగమప దనిస యనుచు,

  మేటి రాగాలు వినిపించు పేటిక యిది

  గాన సుధలు పొరలు చుండు గళము విప్ప

  వాణిశ్రీ నైనాల, హైదరాబాద్��

  రిప్లయితొలగించండి