11, ఫిబ్రవరి 2020, మంగళవారం

సమస్య - 3278 (బ్రహ్మముహూర్తమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"
(లేదా...)
"బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా"

77 కామెంట్‌లు:


  1. బ్రాహ్మీలగ్నపు పూరణ:

    బ్రాహ్మండౌచును వంగ దేశముననున్ బంగారు కొండన్ వలెన్
    బ్రహ్మాండమ్ముగ జేసి నౌకరిని నా భాగ్యమ్ముగా నిప్పుడే
    బ్రహ్మాస్త్రమ్మును బోలు పూరణనునేన్ వ్రాయంగ హా! యెవ్విధిన్
    "బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా"?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోరంజకంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "బ్రాహ్మండౌచును వంగ దేశముననున్ భక్షించుచున్ జేపలన్" అంటారేమో అనుకున్నా... :-)

      తొలగించండి

    2. 🙏😊

      ఒక్క సారే, చేపను ప్రేమతో వంగ భద్రమహిళ వడ్డించగా తినక తప్పలేదు సార్!

      http://gpsastry.blogspot.com/2014/08/fish-n-chips-repeat-telecast.html?m=0

      తొలగించండి
    3. బ్రాహ్మ ముహూర్తపు పూర్వమె
      బ్రహ్మాండంబౌ సమస్య పరిపూరణమే
      బ్రహ్మాండంబుగఁ జేసిన
      "బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"

      😃😎🙏🏻

      తొలగించండి

  2. బ్రాహ్మీలగ్నమున పనులు

    బ్రహ్మాండముగా జరుగుచు భాగ్యములబ్బున్
    బ్రహ్మే మెచ్చునె యిటులన
    బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    శివరాత్రి జాగరణ, 1960

    బ్రహ్మాండమ్మగు యూనివర్సిటిని నా భాగ్యమ్ముగా జేరుచున్
    బ్రహ్మంగారివి పల్కులన్నియును నేన్ పండించుచున్ హాయిగా
    బ్రహ్మాండమ్మగు మూడు పిక్చరులనున్ వైజాగునన్ చూడగా
    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      జిలేబి గారెక్కడ?

      తొలగించండి
    2. 'వరూధిని' బ్లాగులోను ఫిబ్రవరి 5 తరువాత పోస్ట్ కాని, వ్యాఖ్య కాని పెట్టలేదు.

      తొలగించండి

    3. తెలియదు సార్!

      మొన్నటి రోజు వరకూ వారు నా బ్లాగును చూస్తూ ఉండేవారని నా అంచనా...నిన్న చూడలేదు. కించిత్తు అనారోగ్యము కారణమని తోచుచున్నది.

      🙏

      తొలగించండి
  4. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    ఉండి లేని దొకటె యున్నదేమొ"

    నా పూరణ సీస పద్యములో

    శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్ర ధారి అతను ఎవరు భక్తితో కొలిస్తె వారి వద్ద ఉన్నట్లు కనిపిస్తాడు రాస లీల జరుగు చున్నప్పుడు ఒకసారి నారదుడు భూలోకం వస్తాడు అప్పుడు బృ0 దా వనములో గొపాలుని ఒకె సమమయములొ అనెక మంది స్త్రీల తో చూస్తాడు చివరికి సత్య భామ మందిరములొ రుక్మిణీ మందిదిరములో కుడా ఒకే సమయములో చూస్తాడు అధి భ్రమ. మిధ్య తనతో ఉన్నాడ అంటె ఉన్నట్టే . లేడా అమెతో ఉన్నాడా అన్నట్లె .అక్కడ ఉన్నట్లె మరి అక్కడ ఉంటె ఇక్కడ ఒకే సమయములో ఉండడు గదా మరి అతని రూపము ఎక్కడ అన్నది ధర్మ సందెహము కలిగెను నారదునికి .


    (మ ల్లె)పూ దండను (మెల్ల)గా నొకనాతి
    (కు)రులందు పెట్టుచు (కు)లుకు చుండె

    (నొ)కచోట, వేణువు (నూ)దుచు నొకచోట
    (ప)డతి చెంత నిలిచె (ప)రవశముగ,

    (క)రములు రెంటితో (కౌ)గిలిం చుకొనుచు
    (నుం)డె బింబాధర (నొ)క్కచోట,

    (ను)గ్మలి కూర్చుడ (నూ(రువు పై త ల
    (బె)ట్టి పరుండెను (ప్రే)మతోడ

    (నొక)చోట , కోలాట (మొక)చోట నాడుచూ
    (కొ)మరాళ్ళకు ముదము (గూ)ర్చు చుండె,

    (దాగు)డు మూతలు (బాగు)గా నాడుచు
    (పడ)తుల గుంపులో (గడు)పు చుండె

    (నొక)చోట, వర నెల(తుక) సత్య భామకు
    (నలు)కతీర్చుచునుండె (చెలి)మి తోడ

    (నంత)పురము లోన, (సంత)సముగ ధర్మ
    (ప)త్నియా రుక్మిణి (పా)ద పూజ

    (లను)చేయు చుండగన్ (కను)చు తాదాత్మ్యము
    (పొం)దుచు నుండె (పు)రము లోన

    (యెచ)ట చూడ నుండె (నచ)ట గో పాలుడు
    (నుం)డె నుగద నిచట (నుం)డె నచట
    (నుం)డె నా నడపొడ (నుం)డెనా రూపము
    (నుం)డి లేని దొకటి (ను)న్న దేమొ


    (త)రచి చూడ గా నిదియంత (త)మరి మాయ
    (గా)దె , నరహరీ ,మురబిధా, (గ)రుడ గమన,
    (దే)వకీ,నందనా, సూరి, (దే)వదేవ,
    (యను)చు నారదుడు తలచె (మన)సు లోన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణమాయను మనోహరంగా వర్ణించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      యతిమైత్రిని గుర్తించే కుండలీకరణాలు పెట్టవలసిన అవసరం లేదు.

      తొలగించండి
  5. బ్రాహ్మీదేవుడు సాయని
    బ్రహ్మమువచియించె నాడు బ్రహ్మాండముగా.
    అహ్మదునగరమునందున
    బ్రాహ్మ ముహూర్తముననిద్ర భాగ్యప్రదమౌ.

    రిప్లయితొలగించండి
  6. వహ్మ కలిగె నా మదిలో

    బ్రాహ్మ ముహూర్తమున నిద్ర భాగ్య ప్రదమౌ,

    బ్రాహ్మణ,నిజమా? యని నొక

    వహ్మీ యడిగెను విడువక వాదన తోడన్

    పురాణము చెబుతున్న పండితుని ఒక అనుమాన పక్షి అడుగు సందర్భం

    వహ్మ. = సందేహము,
    వహ్మీ = సందేహము కలవాడు

    రిప్లయితొలగించండి
  7. బ్రాహ్మీ లగ్నము నందున
    బ్రాహ్మము జరిపించి నంత భాగ్యము లబ్బున్
    బ్రాహ్మణ శాస్త్రము తెలుపగ
    బ్రాహ్మ ముహూర్తమున నిద్ర భాగ్య ప్రదమౌ
    బ్రాహ్మము= వివాహము

    రిప్లయితొలగించండి

  8. నా పూరణ.
    ** ***

    బ్రాహ్మీలగ్నమునందు కార్యములనే ప్రారంభమున్ సల్పగా

    బ్రహ్మాండంబుగ సాగుచున్ విజయమే ప్రాప్తించి భాగ్యంబుల్,

    బ్రహ్మానందము,సౌఖ్యముల్ కలుగవే ప్రాజ్యమ్ముగా??..నెవ్విధిన్

    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా"


    .🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  9. బ్రహ్మ జనులకెల్ల విధిగ
    బ్రహ్మ ముహూర్తసమయంబు ఫలదంబగుటన్
    బ్రాహ్మణ వినుమా ! సేయకు
    బ్రాహ్మముహూర్తమున నిద్ర ,భాగ్యప్రదమౌ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బ్రహ్మణ! వినకు మిటు లనగ..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  10. బ్రహ్మజ్ఞానము బొందగోరుచును తా బ్రహ్మోప దేశమ్ముతో
    బ్రహ్మత్వమ్మును బొందనేమి గదరా పాపాత్నునిన్ జేయదే
    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర, శుభసౌభాగ్యమ్ము లిచ్చున్ గదా
    బ్రహ్మాండమ్మును బ్రోచువానిని సదా ప్రార్థించినన్ గాదుటే.

    రిప్లయితొలగించండి
  11. బ్రహ్మోపదేశమందిన
    బ్రాహ్మణుడీరీతి పలుక భావ్యంబగునే
    బ్రాహ్మణుడా! యేరీతిని
    బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ?

    రిప్లయితొలగించండి
  12. బ్రహ్మోప దేశమగు గద
    బ్రాహ్మ ముహూర్తమున : నిద్ర భాగ్య ప్రద మౌ
    బ్రహ్మా o డ ము గా నలసియు
    బ్రహ్మ మురారుల దలచుచు పవళింప o గా

    రిప్లయితొలగించండి


  13. బ్రహ్మాండముగా చెప్పిరి
    "బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"
    బ్రాహ్మణుడా! ఓ నా యం
    బ్రహ్మా! జోహారులయ్య పండిత పుత్రా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హమ్మయ్య మీరు వచ్చేసారు ...సంతోషం ..
      బ్రాహ్మముహూర్తంతో వచ్చేసారు...🙏🙏😀😀

      తొలగించండి
    2. స్వాగతం జిలేబిగారూ! మీరులేక బ్లాగు చిన్నబోయింది!

      తొలగించండి
    3. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఓ నా యంబ్రహ్మా' ... అర్థం కాలేదు.

      తొలగించండి
    4. అర్ధంకాక పోవడమే మంచిది సార్ !నమోనమః!!

      తొలగించండి

    5. యంబ్రహ్మ : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
      వి.

      1. పిసినిగొట్టు.
      2. తెలివి తక్కువవాఁడు.
      3. చేఁతగానివాఁడు.

      తొలగించండి
  14. బ్రహ్మఙ్ఞానము గల్గును
    బ్రహ్మముహూర్తమున;నిద్ర భాగ్యప్రదమౌ
    బ్రహ్మమునందున మున్గగ
    నహ్మదె ప్రతిరాత్రియందు నానందముగన్

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    బ్రాహ్మీలగ్నవిశిష్టకాలమున నా బ్రహ్మమ్మె నిద్రింపఁ, ద
    ద్బ్రహ్మన్ గాంచియు సోమకాసురుఁడు తాఁ బ్రాగబ్బముల్ దొంగిలన్,
    బ్రహ్మన్ గన్న గురుండు మత్స్యమయి తద్భ్రష్టాత్మునిం జంపి, స
    ద్బ్రహ్మానందముఁ గూర్చె లోకములకున్! వహ్వారె! సౌఖ్యాంతమౌ

    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర, శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా!

    రిప్లయితొలగించండి
  16. అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ ప్రయత్నం..🌹

    *కం||*

    బ్రహ్మాండము నమ్మదిటుల
    బ్రహ్మానందమనినట్లు పరిహాసమనున్
    బ్రహ్మయె తరలిటులనినన్
    *"బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి

  17. బ్రహ్మాండంబుగు బెండ్లికై యడుగ నవ్వాడందు సత్కాలమా
    బ్రహ్మజ్ఞానులు తెల్పి రాపడతియున్ వాంఛించ వేరొక్కనిన్
    బ్రహ్మాఖ్యున్ సఖియోర్తు జేరి పలికెన్ భంజించ నుద్వాహ మో
    బ్రాహ్మీ! లగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చున్ గదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నైది. అభినందనలు.
      'బ్రహ్మాండంబగు' టైపాటు.

      తొలగించండి
  18. బ్రాహ్మణి!తగదుగ నెపుడున్
    బ్రాహ్మముహూర్తమున నిద్ర, భాగ్యప్రదమౌ
    బ్రహ్మాండము సృజియించిన
    బ్రహ్మమ్మును నమ్మి గొలువ ప్రతిదినమందున్!!!

    రిప్లయితొలగించండి
  19. బ్రహ్మము నెరుగగ దగదుగ
    బ్రాహ్మముహూర్తమున నిద్ర; భాగ్యప్రదమౌ
    బ్రాహ్మముహూర్తమునందున
    బ్రాహ్మీ విద్యాధ్యయనము భక్తిగ సేయన్

    రిప్లయితొలగించండి
  20. అందరికీ నమస్సులు 🙏

    మరో పూరణ ప్రయత్నం 🙏

    *కం||*

    బ్రహ్మాండపు నిద్దురకై
    బ్రహ్మ ముహూర్తముకనుగొని పడుకొంటిని నే
    బ్రహ్మ నిదురించక, యెటుల
    *"బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"?*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  21. (మహాపండితుడైన డిండిమభట్టారకుని
    సర్వశాస్త్రసాహిత్యచర్చలలో జయించిన
    శ్రీనాథకవిసార్వభౌమునికి బ్రాహ్మీసమయ
    నిద్ర సముచితం ; మంగళప్రదం )
    బ్రాహ్మీదత్తవరప్రసాదుడయి ; సు
    ప్రజ్ఞావిశిష్టుండునై ;
    బ్రహ్మాండంబగు డిండిమం బలరు నా
    భట్టారు నోర్చిన మా
    బ్రాహ్మీమూర్తికి విశ్రమింపదగు సౌ
    వర్ణంపు దల్పమ్ముపై ;
    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌ
    భాగ్యమ్ము లిచ్చుం గదా !
    (డిండిమము - ఢక్క ; బ్రాహ్మి - సరస్వతి)

    రిప్లయితొలగించండి
  22. రహ్మానూ!హరి!డేవిడూ వినుడు మీరభ్యాసమున్ జేయుడీ
    బ్రహ్మజ్ఞానము, దృష్టినిల్పి నుదుటన్ వర్ధిల్లు చక్రమ్ముపై
    బ్రహ్మాండమ్మగు యోగనిద్ర సలుపన్ వర్ఛస్సు మీసొంతమౌ
    *బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  23. బ్రాహ్మణులునిద్రలేతురు
    బ్రాహ్మముహూర్తమున,నిద్రభాగ్యప్రదమౌ
    బ్రహ్మమునెఱిగినవారలు
    బ్రహ్మమునేదలచుచుండిపవళించినచో
    -
    బ్రహ్మము=వేదము,పరమాత్మ

    రిప్లయితొలగించండి
  24. బ్రహ్మజ్ఞానులు బ్రహ్మవిద్యను సదా ప్రాభాత కాలంబునన్
    బ్రహ్మాండంబున సాధనా భ్యుదయమౌ శ్రద్ధన్ ప్రయత్నించగా
    బ్రహ్మజ్ఞానము వశ్యమౌననుచు ప్రారబ్ధాఘ మంతం బనన్
    బ్రహ్మాసక్తులు జాగరూకతను నిద్రాలస్య మున్వీడ నే
    *బ్రాహ్మీలగ్నము నందు నిద్ర శుభ సౌభాగ్యంబు లిచ్చుంగదా*

    రిప్లయితొలగించండి
  25. బ్రహ్మాజ్ఞంజరియించులోకములుదద్బ్రహ్మంబునన్గర్మముల్
    బ్రహ్మాతీతతమేదిసర్వమగునాబ్రహ్మంబుజీవక్రియల్
    బ్రహ్మాగ్నిన్హృతమౌనుగర్మఫలమున్బ్రహ్మంబుకర్పించుచున్
    *బ్రాహ్మీలగ్నము నందు నిద్ర శుభ సౌభాగ్యంబు లిచ్చుంగదా*

    రిప్లయితొలగించండి
  26. సమస్యాపూరణకు సమస్య

    "బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా"

    బ్రహ్మచ్ఛాత్రులెయాశ్రమంబెయది నిల్వన్ యోగ నిద్రాస్థితిన్
    బ్రాహ్మీలగ్నమునందుకుడ్యతటులన్ భద్రంబుగానిష్ఠతన్
    బ్రహ్మజ్ఞానవిహీనుడడ్డుకొనగాపల్కెన్ గురుండోర్పుతోన్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  27. సమస్యాపూరణకు సమస్య

    "బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా"

    బ్రహ్మచ్ఛాత్రులెయాశ్రమంబెయది నిల్వన్ యోగ నిద్రాస్థితిన్
    బ్రాహ్మీలగ్నమునందుకుడ్యతటులన్ భద్రంబుగానిష్ఠతన్
    బ్రహ్మజ్ఞానవిహీనుడడ్డుకొనగాపల్కెన్ గురుండోర్పుతోన్
    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా


    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  28. బ్రహ్మాదులు మెచ్చరిలను
    "బ్రహ్మ ముహూర్తమున నిద్ర, భాగ్యప్రదమౌ"
    బ్రాహ్మీకాలము సతతము
    బ్రహ్మత్వము నొసగు నంద్రు పండిత వరులే

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "బ్రాహ్మముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ"

    సందర్భము: ఉదయ సంధ్య సాయం సంధ్యలు మనలోని దైవీ శక్తులను మేలుకొలిపే సాధన చేయడానికి చాలా అనుకూలమైన వేళలు. ఆ సమయంలో నిద్రించటంవల్ల తమోగుణమే ప్రకోపిస్తుంది. కాని సత్వగుణం కాదు. నిజానికి ఆ సమయాలను కోలుపోతే ఆ దినమంతా నష్టపోయినట్టు. ఏదో కారణాలతో బాగా పొద్దెక్కినదాకా నిద్ర పోవడం అలవాటు చేసుకున్నవాళ్ళే మనలో ఎక్కువ. అలాంటి వాళ్ళిది గ్రహించాలి.
    విశ్వామిత్రుడు రాముణ్ణి పొద్దున్నే మేల్కొలుపుతూ యిలా అన్నాడు..
    "కౌసల్యా సుప్రజా! రామా! సరస్వతీ కటాక్షం సంపాదించా లన్నా బ్రహ్మానంద మనే రాజ్య పదవి సంపాదించా లన్నా బ్రాహ్మ ముహూర్తంలో నిద్ర మానుకోవాలి."
    విమల అజిహ్మ ఆచరణము= నిర్మలమైన నిష్కపటమైన నడవడి కలవాడా!.. అని సంబోధనం.. కపటమైన నడవడీ మానుకోవాలి.. అని ఆంతర్యం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *సరస్వతీ కటాక్షము*

    బ్రాహ్మీ కటాక్ష సిద్ధికి,
    బ్రహ్మానందాధిరాజ్య పదవికి విమలా
    జిహ్మాచరణా! మానుట
    బ్రాహ్మముహూర్తమున నిద్ర... భాగ్యప్రదమౌ

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    11.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి


  30. బ్రహ్మణ్యోజపమాలికాత్కరణకాభ్యాంప్రాణయోర్వ్యాప్తత
    త్బ్రహ్మారాధనచేతనావలయసత్కార్యేణవిస్తారహృ
    త్బ్రహ్మానాంకరుణామహత్వసతియేతాంస్థిత్వసంప్రాప్తితా
    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  31. రిప్లయిలు
    1. బ్రహ్మాండంబుననెవరికి
      బ్రహ్మముహూర్తమున నిద్రభాగ్యప్రదమౌ?
      బ్రహ్మోపాసకులెవ్వరు
      బ్రహ్మముహూర్తమ్మునందుబవళింపరుగా

      తొలగించండి
  32. కందం
    బ్రహ్మజ్ఞానము, యోగము,
    బ్రహ్మాండపు విశ్వశక్తి బడయన్ బ్రభువౌ
    బ్రహ్మంబుఁ దెలియ వదలన్
    బ్రహ్మముహూర్తమున నిద్ర, భాగ్యప్రదమౌ!

    శార్దూలవిక్రీడితము
    బ్రహ్మజ్ఞానము ధ్యానులై మునులు సంపాదించి భాషించిరే
    బ్రహ్మంబందెడు యోగవిద్యలరయన్ వారించినన్ మేలగున్
    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర, శుభసౌభాగ్యమ్ము లిచ్చున్ గదా
    బ్రహ్మాండంబున విశ్వశక్తిఁ గొనగన్ బ్రాప్తించ నారోగ్యముల్

    రిప్లయితొలగించండి
  33. బ్రహ్మాదుల్ హరికీర్తనల్ సలుపుగన్ బ్రాహ్మీ ముహూర్తంబునన్
    బ్రహ్మాండంబుననెవ్వరేనికడువిభ్రాంతంబుగానిద్దురన్
    బ్రాహ్మీలగ్నమునందు సల్పుదురెసంభావింపనేరీతిగా
    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా?

    రిప్లయితొలగించండి
  34. బ్రహ్మాండమ్ముల నింపుగ
    బ్రహ్మ నలినజుం డొనర్చె రతి నత్తరి వ్యా
    జిహ్మమ్ము లేని, మేల్కొన
    బ్రాహ్మముహూర్తమున, నిద్ర భాగ్యప్రదమౌ


    జిహ్మత్వమ్మునఁ బల్కు పల్కులను నీ చిత్తంబులోఁ ద్రుంచుమా
    సుహ్మావాస జనౌఘ తుల్యమయి శుశ్రూషా రతిన్ నిత్య స
    ద్బ్రాహ్మణ్యాంచిత ధార ణాస్వనిత సంభావ్యుండ! వీడంగ నీ
    బ్రాహ్మీలగ్నము నందు నిద్ర, శుభ సౌభాగ్యమ్ము లిచ్చుం గదా

    [సుహ్మము = ఒక ప్రదేశము వంగ దేశమున]

    రిప్లయితొలగించండి
  35. బ్రహ్మాజీ!వినునాదుమాటనుసుమాభవ్యంబుగాదెప్పుడున్
    బ్రాహ్మీలగ్నమునందునిద్ర,శుభసౌభాగ్యంబులిచ్చుంగదా
    బ్రహ్మఙ్ఞానమునొందువారలికదాపారంబుతోబాటుగా
    బ్రహ్మంబేకదమోక్షమీయగవెసన్ బ్రారబ్ధమున్బట్టియే

    రిప్లయితొలగించండి
  36. కం.

    బ్రహ్మము తానే యనుచున్
    బ్రహ్మాండము నొకటి జేయ పలుకగ నెప్డున్
    బ్రాహ్మణ వేశము యవనుడు
    బ్రాహ్మ ముహూర్తమున నిద్ర భాగ్యప్రదమౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  37. మైలవరపు వారి పూరణ

    కవిగారి భార్య.. సలహా..

    బ్రహ్మజ్ఞానవివేచనోత్సుకత తద్బ్రహ్మప్రలీనోక్తమౌ
    బ్రహ్మానందము పొందుగోరు యతికిన్ భావ్యమ్ము., నీకేలరా ?
    బ్రహ్మాండంబగు శంకరాభరణసత్పద్యాశ్రితాసక్తికిన్ !
    బ్రాహ్మీ లగ్నమునందు నిద్ర శుభ సౌభాగ్యమ్ములిౘ్చున్ గదా!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  38. బ్రహ్మాండాదికణానువర్తిసుపరివ్యాప్తున్ మదిన్ దల్చుచున్
    జిహ్మాదీంద్రియభావవేద్యగతసచ్చిత్ జ్ఞానసంలీనుడై
    బ్రహ్మణ్యార్ధనిమీలితాక్షియుగళీ, ప్రాంచత్సమున్మత్తతన్
    బ్రాహ్మీలగ్నమునందు నిద్ర శుభసౌభాగ్యమ్ము లిచ్చుం గదా

    రిప్లయితొలగించండి
  39. బ్రాహ్మణుడవురా? తగునా?
    బ్రాహ్మ ముహూర్తమున నిద్ర, భాగ్యప్రదమౌ
    బ్రాహ్మీ మూహూర్తమునను
    బ్రాహ్మణి నర్చింప కలుగు భద్రము నీకున్

    రిప్లయితొలగించండి
  40. బ్రహ్మాండము గా పనులగు
    *బ్రహ్మ ముహూర్తమున, నిద్ర భాగ్య ప్రదమౌ*
    బ్రహ్మ ముహూర్తం బుననుచు
    బ్రహ్మజ్ఞానియు పలుకుట భావ్యం బౌనే

    రిప్లయితొలగించండి

  41. నా పూరణ
    **** *** ***
    ( యుద్ధము వలదన్న అర్జునునితో శ్రీ కృష్ణుని ఉవాచ...)

    కం!!

    కినుకా కిరీటి? వలదా

    దినకర తేజ సమరమ్మె?దిగులెందులకో

    రణము సలుపంగ బావా?

    వినుమా! నీదు తలపాపి విల్లుని గొనుమా!


    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  42. నన్నునేకాకిగదలచి నాదరికిటు
    వచ్చితివపాపి! వావియువరుసలేద?
    నిన్నుచూచినదాదిగ గన్నులురిమె
    యనుచుబలికెను ద్రౌపదిదనుజుతోడ
    ---
    దనుజుడు=దనుజతుల్యుడు కీచకుడు

    రిప్లయితొలగించండి