15, ఫిబ్రవరి 2020, శనివారం

సమస్య - 3281 (కనుపించని కీటకమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కనుపించని కీటకమ్ము గాలుని మించెన్"
(లేదా...)
"కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

72 కామెంట్‌లు:

 1. అందరికీ నమస్సులు🙏🙏

  (GP శాస్త్రి గారికి అంకితం)

  *కం||*

  వినునే చెప్పిన వన్నియు
  కనుగొన వైనము తెలిసెను ఘనమగు రీతిన్
  మన పన్నుల వేటు గనిన
  *కనుపించని కీటకమ్ము కాలుని మించెన్*!!

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*

  రిప్లయితొలగించండి

 2. నడిరేయి సరదా పూరణ:

  మనలో మాట:

  మనమున చింత సుంతయును మాటల లోనను చూపకుండనే
  ధనమును తీసి దండిగను ధాటిగ పాకుకు ధారపోసెడిన్
  ఘనమగు చీని దేశమున గాభర లేపుచు పచ్చవారికిన్
  కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
 3. గనివంటి యెదను నిండిన
  వినిపించని గాన మంట వేవురు మెచ్చన్
  కనివిని యెరుగని చోద్యము
  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితము)

  శర్మిష్ఠా ముఖర్జీ ఉవాచ:

  దినమును రాత్రి నెంచకయె దిట్టపు రీతిని ప్రాకులాడుచున్
  తినుచును ద్వారబంధమును తీరుగ కట్టిన టేకు తల్పులన్
  ఘనముగ లోన దూరుచును కాంగ్రెసు సౌధము కొల్లగొట్టుచున్
  కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
 5. కనివిననట్టి రీతిగను గబ్బిలజాతులు పిల్లలన్కనన్
  కనుగొని వాటి యున్కినికకర్కటులంతయు చైన దేశమున్
  మనుషులు శుభ్రమెంచకను మాయ ముజేయుచువండిపెట్టగా
  కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
 6. ( కురుక్షేత్ర యుద్ధానంతరం తనపుత్రులం
  దరినీ వధించిన భీముని కౌగిలికి పిలచిన
  ధృతరాష్ట్రుని ముందుకు ఉక్కుభీముని
  నెట్టిన కృష్ణుడు ఆవిగ్రహాన్ని ఆగ్రహంతో నుగ్గుచేసిన వృద్ధరాజుతో అంటున్నాడు )
  ఘనమగు చంద్రవంశమున
  గణ్యత నందిన పార్థివేశ్వరా !
  అనయము పెద్దతండ్రివని
  యంఘ్రుల బట్టుచు నుండువారలే !
  వినయముతోడ జేరుకొను
  భీముని బిండియొనర్ప నెంచితే ?
  కనపడనట్టి కీటకము
  గాలుని మించె నిదేమి చిత్రమో ?
  (పార్థివేశ్వరా - మహారాజా ; అంఘ్రుల-పాదములను ; అనయము - ఎల్లప్పుడు )

  రిప్లయితొలగించండి
 7. అనుమానము పెను భూతము

  మనుజుల పీడించునట్టి మయిలారిదియే

  మనమును జొచ్చిన జాలును

  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్.

  .

  రిప్లయితొలగించండి
 8. మునిసుతు శాపముఁ దథ్యం
  బొనరుపఁ దక్షకుఁడు బురుగు నొరవొక ఫలముం
  జొని కరచెఁ బరీక్షిత్తుని!
  కనుపించని కీటకమ్ము కాలుని మించెన్.

  రిప్లయితొలగించండి
 9. వినుడిది విశ్వమందు గన విస్తృత మౌచు "గరోన"నేడు దా
  ననుపమరీతి మానవుల నంతము జేయుచునుండె భూతమై
  మనుటయె కష్టమయ్యె ననుమానములేదు దురాత్మ చూడు డీ
  కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో.

  రిప్లయితొలగించండి
 10. పూరణము 2

  పెనుజబ్బయ్యె కరోనా!
  మనుషులు పిట్టల పగిదిని మరణించుటఁ జూ
  చిన యనిపించును గాదే!
  కనుపించని కీటకమ్ము కాలుని మించెన్!

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ

  కర్ణుడు శల్యునితో..

  వనమున సేదదీరునెడ వజ్రముఖుండను పుర్వు కుట్టగా
  వినుమిదె జామదగ్నియె శపించెను నన్ రుధిరప్లుతాంగుడై!
  యనితరశస్త్రసంగతరహస్యములన్నియు విస్మృతిన్ గొనన్!
  కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో"!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది.

   తొలగించండి


  2. వజ్రముఖుండను ....

   పేరుతో సహా కంటికి కనిపించే పుర్వు కుడితే కనబడనట్టి కీటకము అంటారేమిటి మైలవరపు వారు ? :)

   జె కె :)   జిలేబి

   తొలగించండి
  3. జామదగ్నికి కనుపించలేదుకదా😆. పేరంటారా, కనుపించని వైరస్లకూ కరోనా అంటూ పేరు పెడుతున్నాం కదా!

   తొలగించండి


 12. అనుమానమేల కంటికి
  కనుపించని కీటకమ్ము గాలుని మించెన్!
  మనుగడ సార్సువలె‌ నిపుడు
  మనుజుల నూర్ధ్వగతినంపె మహిని కరోనా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. కనులకు కనబడకుండనె
  వినిపించెడి కీటకమ్ము వీనులదుయ్యన్
  అనుభవమున యింక కొలది
  కనుపించని కీటకమ్ము గాలుని మించెన్

  రిప్లయితొలగించండి
 14. కం.

  కణముగ వైరస్ కరొనా
  కనివిని యెఱుఁగని పథముల కంటక మగుటన్
  హనువుల బాయగ మూలము
  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి


 15. కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో
  యనితల పట్టుకోవలదయాకవి వర్యుడ! ప్రేతి వైనమె
  వ్వనికి జగద్వహమ్మున రవంతయు దోచును? వైపరీత్యముల్
  మనుగడ యెన్ని వచ్చె నిల మానవు లన్ దునిమాడె సోదరా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. తినగూడని జంతువులను
  కనికారములేక చంపి కడుపును నింపన్
  మనుగడకే ముప్పునిడుచు
  కనిపించని కీటకమ్ము కాలునిమించెన్

  రిప్లయితొలగించండి
 17. మిత్రులందఱకు నమస్సులు!

  [లంకలో సూక్ష్మరూపమునఁ బ్రవేశించి, విశ్వరూపుఁడై తనపై విజృంభించిన హనుమంతునిఁ గూర్చి వితర్కించుచున్న లంకిణి స్వగతము]

  "కనఁబడకుండ లంక నిటు గాలిడి వానర మిట్లు వింత రూ
  పున భయపెట్టుచుండెఁ గద! ముందుగఁ గీటకమాత్రరూపుఁడై,
  కనుచును నుండఁగానె ఘనకాంచన దేహమహోన్నతుండునై,

  కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో!"

  రిప్లయితొలగించండి
 18. అణువంతటిజీవులు యవి
  తొణకవదెంతటి తాపమైన,తొలుచును తనువున్
  క్షణమున, త్వక్చక్షువులకు
  కనుపించని కీటకమ్ము గాలుని మించెన్"

  రిప్లయితొలగించండి
 19. మునివద్దకుచనుదెంచెను,
  వినయంబుగవిద్యనేర్వవిప్రుడననుచున్
  మునిశాపముకర్ణునికన
  కనిపించనికీటకమ్ముకాలునిమించెన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్,రంగారెడ్డి


  రిప్లయితొలగించండి
 20. తనువుల జేరియు హానియు
  ననుదినము ను రోగ బాధ లధికము గూర్ప న్
  మునుకొని మించు కరోనా
  కనిపించని కీటకమ్ము గాలుని మించె న్

  రిప్లయితొలగించండి
 21. కనుడీ తాకెను చైనా
  జనులను విష పూరితమగు జాడ్యమ్మకటా
  వినుడీ జాగ్రత పడుడీ
  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్

  రిప్లయితొలగించండి
 22. అందరికీ నమస్సులు🙏🙏

  *సరదా పూరణ*

  *నేటి సమస్యా పూరణలు అన్నీ కరోనా మీదనే రావడం గురించి* 😃😃🙏

  *|కం|*

  *అనుకొన లేదుగ నేనిట*

  *విననే పూరణ దెలిసెను విపరీతమిదే*

  *ఘనముగ కరోన చేరిక*

  *కనుపించని కీటకమ్ము కాలుని మించెన్*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అందరికీ నమస్సులు 🙏🙏
   *రేడియో కి పంపిన నా పూరణ ..*

   కానీ చదువ లేదు 😊

   *కం||*

   వినునే చెప్పిన వన్నియు
   కనుగొన వైనము తెలిసెను ఘనమగు రీతిన్
   మన వైద్యపు ఖర్చుగనిన
   *కనుపించని కీటకమ్ము కాలుని మించెన్*!

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🌹🙏🌹🙏

   తొలగించండి
  2. *వామనావతారం తో చిరు ప్రయత్నం*

   *కం||*

   హ, నరుడుగ చేరి యా వా
   మనుడొక మూడడుగులనెను మహిలో తనకున్
   కనుగొనె, పాదము మోపగ
   *కనిపించని కీటకమ్ము కాలుని మించెన్*!!

   🙏🌷🙏🌷🙏

   తొలగించండి
 23. మనుజుల హడలెత్తించగ
  జనుదెంచె 'కరోన'! విషపు జల్లులతో దా
  మనుగడకె సవాలిడె గద!
  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్!

  రిప్లయితొలగించండి
 24. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును"

  నా పూరణము సీసములో
  శ్రీకృష్ణుని రుక్మిణి ప్రేమించి పెళ్ళి చేసుకొన్నది. ఆది రుక్మిణి అన్న అయిన రుక్మికి ఇష్టము లేదు. చేధి రాజు శిశుపాలునికి ఇచ్చి వివాహము జేయ తలపూనుతాడు. అప్పుడు అన్నకు తెలియకుండ శ్రీ కృష్ణునితో గిరిజాంబిక ఆలయం నకు వెళ్ళి అచట నుంచి శ్రీ కృష్ణునితో వెళ్ళిపొతుంది. అది గ్రహైంచి రుక్మి వెంబడించి శ్రీకృష్ణుని నానా మాటలు పలుకుతాడు కృష్ణుడు రుక్మిని చంప బోగా రుక్మిణి అడ్దు పడుతుంది అప్పుడు అతనికి శిరో ముండనము చేయించి ఇది నీకు తగిన శిక్ష అని వదలి వేస్తాడు అవమాన భారముతో కుమిలిపోతు ఉంటాడు వత్సరముగడచిన పిదప భీష్మకుడు వేడుకలను తల బెట్టగా రుక్మి సహించ లేక తండ్రితొ పై మాటలు మాట లాడినాడు అను భావన


  చేతు వివాహమ్ము చేడి దేశపురాజు
  శిశుపాలు తోడని చెప్పి నాడ,

  నా మాటను వినక నమ్మక ద్రోహంబు
  చేసి యా రుక్మిణి చేయి కలిపి

  గొల్ల వానింటికి కోరివెడలె నాడు
  శిరమును గొరిగించి శిక్ష నీకి

  దనుచు నాకుంజేసె కినుక తోడ నవమా
  నంబు, దురాత్ముడు నంద సుతుడు,

  కొడుకు కవమానము కలుగ కొందలమ్ము
  లేదు వేడుకలను జేయ మోద మేల
  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును
  వీరి కనుచు బల్కె ను రుక్మి వేగిరముగ

  కొందలము బాధ
  గురువు గారు నమస్కారము ఇది నిన్నటి పూరణ ఒకసరి చూసి సలహా తెల్పండి

  రిప్లయితొలగించండి
 25. కనుడిక మనుషుల లీలలు
  తినుచును పాముల వధించి, తెచ్చిరి కరో
  న,నెలవయె దేశమందున
  కనిపించని కీటకమ్ము కాలునిమించెన్!

  రిప్లయితొలగించండి
 26. కనుముర దిగువ సమస్యను
  కనిపించనికీటకమ్ము కాలునిమించెన్
  కనిపించకయే కాలుని
  విను,మించెనుననుటయదియ వెర్రియకాదే!

  రిప్లయితొలగించండి
 27. కనివినియెరుగనిరీతిగ
  ననుదినము'కరోన' జనులయసువులుదీసెన్
  కనికరమేమెరుగనియా
  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్ 

  రిప్లయితొలగించండి
 28. కనికరమేకరువాయెను
  కనుగాననికామమెమదికైపెక్కింపన్
  వనితలమానముదోచెడు
  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్ 

  రిప్లయితొలగించండి
 29. కందం
  జనియించి 'కరోనా' యను
  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్
  దునుమాడె వందలాదిగ
  జనులను రక్షించ రార శౌరీ! రయమే

  రిప్లయితొలగించండి


 30. ఆకాశవాణి వారి సమస్య ...
  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్
  కందపద్యము

  మనుజులప్రాణంబులగై
  కొన వైరసు కరొన వచ్చె కడుచోద్యముగా
  వినుమా! జాగ్రత!కనులకు
  కనిపించని కీటకమ్ము కాలుని మించెన్

  గాదిరాజు మధుసూదనరాజు
  తాడిపత్రి .అనంతపురంజిల్లా

  రిప్లయితొలగించండి


 31. ఈ వారపు ఆకాశవాణి‌ విశేషములు‌ తెలియ చేయగలరు


  జిలేబి

  రిప్లయితొలగించండి
 32. శంకరాభరణము నేటి సమస్య


  కనుపించని కీటకమ్ము గాలుని మించెన్"

  అసురలతో కొన్ని వేల సంవత్సరములు యుధ్ధము చేసి శ్రీహరి అలసి పొయి తన తలను ధనువు పైన పెట్టి నిదురించ సాగాడు. అతను అనేక సంవత్సరములు నిదుర పోవుచుండ భూలోకములొ యాగ ఫలమును స్వీకరించు వారు లేరు అప్పుడు బ్రహ్మాది దేవతలు శివుని తో కలసి చూస్తె విష్ణుమూర్తి గాడ నిద్రలో ఉంటాడు. అది చూసి శివుడు బ్రహ్మతో గాఢ నిద్రలో ఉన్న వారిని లేపుట మహా పాపము. దీనికి ఒక పరిష్కారము కలదు. నువ్వు సృష్టించిన వాటిలొ వింటి నారిని కొరుకు ఒక క్రిమి ఉన్నది ఆ క్రిమి ఈవింటి నారిని కొరుకగా అది తెగిపొవును అప్పుడు గలుగు ఆ శబ్దమునకు శ్రీహరి నిదుర లేచును అని తెలుపుతాడు. ఆ క్రిమి కొరికిన పిదప ఆ వింటి నారి తెగి భూమి ఆకాశములు దద్దరిల్లు భయంకరమైన శబ్దములు కలుగుతాయి. జగము మొత్తము వణికి పోతుంది.. ఆ సమయములోనె ఆ వింటి నారి వల్ల శ్రీహరి తల తెగి పడిపోతుంది ఈహటాత్పరిణామమునకు అందరు నివ్వ్వెర పొయి ఆది శక్తిని ప్రార్థించగా ఆమె హయ గ్రీవుడు అనే పేరు గల రాక్షసుని సంహరించడానికి స్వామి హయగ్రీవ అవతారము ఎత్తాలి కాబట్టి ఒక హయము(గుర్రము) తలను నరికి స్వామికి అతికించి ప్రాణముపొయమని ఆది శక్తి తెలుపు తుంది. అది శంకరుడు బ్రహ్మతో తెలుపు సందర్భము.  శిరమును బెట్టి యా శ్రీహరి నిలబడె
  పంచారపు కొనల పైన, నిదుర

  బోయెగా నలసిన కాయము విశ్రాంతి
  కోరగ, జగమున కొరవడె హవ

  న ఫలపు స్వీకర్త నారాయణుండు సౌ
  ఖ్యమ్ముగ నిదురించ, కంబు పాణి


  శయన భంగము చేయ సంకల్పమున నొక
  క్రిమిని సృష్టించి గాంగేయ గర్భు

  డు తెలిపె వింటి తాడును కొరకమని, కీ
  టకము కొరికి నంత ఢమఢమ మను

  శబ్దము లనిడుచు సారంగ శింజిని
  విచ్చిన్న మవగ నా విష్ణువు తల

  తెగిపడి పోయెగా, దిగ్భ్రాంతి నొందిన
  బ్రహ్మ తోడ కపర్ధి పలికె “సాత్వి

  క కనుపించని కీటకమ్ము గాలుని మించె
  నెటులని తలచగ నేమి ఫలిత

  ము గలుగును,దేవి తెల్పెగా. ముద్గ భుజము
  శిరము నొక్కటి ఖండించి హరి శరీర
  మునకు నతికించి నాతని తనువు కాయు
  వు నిడుగ వలయు ననుచు శివుండు బల్కె


  పంచారము సారంగము = ధనస్సు శింజిని = వింటి త్రాడు
  ముద్గభుజము = గుర్రము , గాంగేయ గర్బుడు ,సాత్వికుడు

  రిప్లయితొలగించండి
 33. వినుమా పరదేశమ్మున
  జనాళినతిభీకరముగ చంపగ వచ్చెన్
  కనుకనితోనుండవలయు
  కనుపించని కీటకమ్ము కాలుని మించెన్.  కనుకని=జాగ్రత్తగా
  మరొక పూరణ;


  మనమును సతతము తొలచుచు
  కునుకును రానీక మదికి, కూల్చెను మమతల్
  వినుమా నిక్కం బిదియే
  *కనిపించని కీటకమ్మె కాలుని మించెన్.*  రిప్లయితొలగించండి
 34. వినువీధి పయన మాపెను
  జనుదెంచె జనించి తూర్పుసామ్రాజ్యమునన్
  వినిపించని నవ్వుల నీ
  కనుపించని కీటకమ్ము గాలుని మించెన్


  ఘన నరుఁ డాక్రమించెను సుఖమ్ముగ నుర్విని స్వార్థ చిత్తుఁడై
  మన మిట నుండ రాదె మఱి మాకిల నుండదె తీపి ప్రాణమం
  దని మది నెంచి రోషమున నంతము సేయఁగ మానవాళినే
  కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
 35. వినుముకరోననాబడుచువీసముమాదిరియుండునట్టిదే
  కనబడనట్టికీచకముగాలునిమించెనిదేమిచిత్రమో
  కనబడకుండయయ్యదిలగాలునివోలెనుభీకరంబునై
  మనుజులబ్రాణహానినిలమాటలతోడనుజెప్పలేముగా

  రిప్లయితొలగించండి
 36. జనులు భయ భ్రాంతి గొనిరి ,
  వినగ కరోనా తెవులతి వింత విధముగన్|
  మనుజుల హరించు నకటా !
  *కనిపించని కీటకమ్ము కాలుని మించెన్*

  రిప్లయితొలగించండి
 37. కనివిని నెరుగని జబ్బులు
  ననవరతము ప్రజకు సోకి నడచగ, నకటా
  పెను వైరసు ప్రబలి ధరను
  కనిపించని కీటకమ్ము కాలును మించెన్!!!

  రిప్లయితొలగించండి
 38. అనుమానం వలదయ్యా
  పెనుభూతము పొంచియుండె పీనుగు సేయన్
  నీ నా భేదము లేకను
  కనుపించని కీటకమ్ము కాలుని మించెన్

  రిప్లయితొలగించండి
 39. ధనమదె కాదె మానవుడు దానవుడై చరియింప మూలమై
  మనమున జొచ్చినంత నది మాన్యుల నైనను జేయు హీనులన్
  జనగణమందు మానవతఁ జంపెడు స్వార్థమనే తలంపదే
  కనబడనట్టి కీటకము కాలుని మించెనదేమి చిత్రమో!

  రిప్లయితొలగించండి
 40. చంపకమాల
  మనలను దోచవచ్చిరని మార్కొని తెల్లల వెల్లగొట్టుచున్
  గొని గణతంత్ర రాజ్యమును గూర్చిన మేటి స్వతంత్ర్య పాలనన్
  గనబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో
  వినిమయమైన సంపదలుఁ బేదలఁ జేరవు డెబ్బదేళ్లుగన్

  రిప్లయితొలగించండి
 41. కనిపించిన ప్రతి జీవిని
  తిని చైనా వాసులిలకు తెచ్చిరి ముప్పున్
  మునిగిరి కరోన దెబ్బకు
  కనుపించని కీటకమ్ము గాలుని మించెన్

  రిప్లయితొలగించండి