సందర్భము: తస్య త్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః సుతార్థం తప్యమానస్య నాసిద్వంశకరః సుతః బా.కాం. 8-1 ధర్మజ్ఞుడైన మహాత్ముడైన అటువంటి ప్రభావం కలిగిన దశరథ మహారాజుకు పుత్రులకై పరితపిస్తున్నా వంశాన్ని నిలిపే సుతుడు కలుగనే లేదు. పరిచయస్థు లగుపిస్తే అన్నిటికంటె ముందుగా "ఎంతమంది పిల్లలు?" అనే అడుగుతారు గాని "ఎన్ని కోట్లు సంపాదించినారు?" అని అడుగరు కదా! అందువల్ల నిజమైన సంపద అంటే సంతానమే! దశరథుని రాణులైన కౌసల్య సుమిత్ర కైకేయి భర్తయొక్క వంశోద్ధరణా న్నాశించి మహాలక్ష్మిని సంతానరూపమైన సంపదకోసం ప్రార్థించినారు. నగరంలోని కొందరు ముత్తైదువలూ వారి ననుసరించారు. (పద్యంలో సతులు.. అంటే దశరథ సతులు కావచ్చు.. సామాన్య స్త్రీలు కావచ్చు. అభ్యంతరం లేదు.) ~~~~~~~~~~~~~~~~~~~~~~~
*సంతాన సంపత్ ప్రద*
నరులకు నిజమగు సంపద ధర సంతానమ్మె యనుచు దశరథ వంశో ద్ధరణేచ్ఛామతులై శ్రీ కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 22.02.20 -----------------------------------------------------------
(అ)రుణ సారధి తూర్పు కొండల (నా)మతించక పూర్వమే
రిప్లయితొలగించండి(ధ)రణిపై కలయంపి జల్లి ము(దం)బు నొప్పెడు చిత్రమౌ
(ప)రికలం దొరయించి శ్రావణ (భౌ)మ్య వాసర మందు సీ
(ధు)రస పల్లవముల్, లతాంతపు( తో)రణంబులు కట్టి వే
(గి)రము గన్ బలు పిండివంటలు (గీ)ములోన పచించి బం
(గ)రపు సొమ్ములు చెంగలించగ (గౌ) రి కుత్తుక నుంచి శాం
(క)రిని వేడిరి భాగ్యమిమ్మని (కాం)త లందరు భక్తితో
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
తొలగించండిమీరు యతిమైత్రిని గుర్తిస్తూ కుండలీకరణాలు () పెట్టనవసరం లేదు.
నమస్కారము గురువర్యా ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
మురియు చుండగ పార్వతమ్మయె మూషికమ్మును జూచుచున్
బరువు బొజ్జను మోయలేకయె బావురంచును త్రేన్పుచున్
వరలు చుండిన నాలయమ్మున వారణాసిని దేవు డౌ
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
కరి = ఏనుగ (గణపతి)
డుంఠి గణపతిని ప్రస్తావించిన మీ సరదా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
మురియు చుండగ రామభద్రుడు ముద్దు మోమును జూచుచున్
మరచి పుచ్చుచు బాధలన్నియు మందహాసము నందునన్
వరలు చుండిన నాలయమ్మున వారణాసిని దేవు డౌ
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
కరి = కోతి (హనుమంతుడు)
కరి శబ్దానికి ఉన్న విశేషార్థంతో మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమధ్యలో రామభద్రు డెందుకు వచ్చాడు? వారు ద్వాపర కాంతలా?
🙏
తొలగించండిఆలయములో విగ్రహములు సార్!
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
రిప్లయితొలగించండిహరిహరప్రియమైనమాఘమహాత్మ్యమున్ మదినెంచుచున్
తరుణులెల్లహరీ!శివా!యని తన్మయత్వమునందుచున్
తరలివచ్చిరిపూజఁజేయగ తల్లిలక్ష్మినిమాతశాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
గాదిరాజు మధుసూదన రాజు
తాడిపత్రి అనంతపురము జిల్లా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరమ భక్తిని పూజచే సినబా ధలన్ తొలగించ గా
రిప్లయితొలగించండికరుణ జూపుము భక్తవత్సల గారవించగ మోదమున్
చరమ గీతిని మోక్షమీ యగసంత సంబున కోరుచున్
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంత లందరు భక్తితో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కరిని వేడిరి?
హరినివేడెగహస్తియప్పుడు,హానిగల్గగనార్తితో
రిప్లయితొలగించండిమరణమన్నదితప్పనప్పుడు ,మాయమాటలుచెల్లునా?
తరళవృత్తముయౌనుకాదని,తర్కచర్చనుజేసి ,శాం
కరినివేడిరి,భాగ్యమిమ్మని, కాంతలందరుభక్తితో.
---------------------------------------------------
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వృత్తము+ఔను' అన్నపుడు యడాగమం రాదు. "వృత్తమె యౌను..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివరములు కోరగ రమణులు
రిప్లయితొలగించండివిరులను పూజించి భక్తి వేడ్క మీరన్
సరసిజ వదనుని ప్రియమగు
కరిని సతులు వేఁడు కొనిరి భాగ్య మ్మిడగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదం చివర గణభంగం. "వేడుక మీరన్" అనండి.
ఆకాశవాణి సమస్య
రిప్లయితొలగించండి**** ****
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
నా పూరణ.
**** *** ***
పెరుగు, క్షీరము, తేనె, హోమ్యము, బిల్వపత్రము, గంధముల్,
విరులు ,పండ్లు, విభూతి, ధూపము విస్తరమ్ముగ దెచ్చియున్
కరుణతోడుత బ్రోవుమంచును ఖ్యాతి బూజలు జేసి శాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
౼ ఆకుల శాంతి భూషణ్
వనపర్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివేడుటయేమా భాగ్యము !
హరిని లక్ష్మిని వేడిరెల్లరు, హాటకేశ్వరు డద్రిజన్
వరములిమ్మని కోరిరెల్లరు ప్రార్థనాగళమాధురిన్
సరళిచేర్చుచు తమ్మిచూలిని శారదాంబను వేడి, మ
స్కరిని వేఁడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆకాశవాణికి పంపినది
తరళము (ధ్రువకోకిల)
గిరుల చుట్టిరి తీర్థయాత్రల గీమువేల్పుల మ్రొక్కియ
క్కరిని కోరిరి, గేస్తుధర్మపు కారణమ్ముగ శంకరిన్
హరుని వేడిరి, బుద్ధినిమ్మని హక్కసంతయు బోవ మ
స్కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శాంకరిన్' అనండి.
( అష్టలక్ష్మీ స్వరూపిణి అయిన అమ్మకు
రిప్లయితొలగించండిఅంజలి ఘటిస్తున్న అంగనామణులు )
హరిని వీడక వక్షమందున
నందగించెడి దేవినే ;
గొరకుచేతల కోలదైత్యుని
గూల్చివేసిన శక్తినే ;
యరయ నెన్మిది రూపులందున
నాదరించెడి తల్లి ; శ్రీ
కరిని వేడిరి భాగ్యమిమ్మని
కాంతలందరు భక్తితో .
(గొరకుచేతలు - నీచపు చేష్టలు ; కోలదైత్యుడు - కోలాసురుడు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిహరిని రమాదేవిని వే
డిరి,భక్తిని పింగళుని సరి పలుకు చెలినా
హరునినమస్కృతులన్ శం
కరిని సతులు వేఁడుకొనిరి కలిమిని చేర్చన్
స్వల్ప యతి అడ్జస్ట్ మాడి :)
జిలేబి
యతిదోషాన్ని సవరించి చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితరుణులంతయుజేరి కోరుచు దాక్షిణిన్, తమ భర్తగా
రిప్లయితొలగించండికరుణతోడను నందనందను గారవమ్మున పొందగా
విరులతోడనుపూజజేసిరి వీక్షణల్ గురిపించ శాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసుర శిరస్థ కిరీట కాంతి సుశోభితాంఘ్రి యుగంబుతో
రిప్లయితొలగించండిహరి యురస్థితయై నిరంతర మార్త రక్షణ దీక్షతో
వరలు నా వరలక్ష్మినిన్ సిత పద్మవాసినియౌ శుభం
కరిని వేఁడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో.
చాల బాగున్నది గురువుగారూ,నమస్సులు!
తొలగించండిఅద్భుతంగా వున్నది శంకరయ్యగారూ! శుభాభినందనలు!
తొలగించండివరము లిచ్చెడి దేవివీ వనివా సిగా నట మ్రొక్కుచున్
పరమ మంగళ రూపివంచును బాయకెల్లరు నొక్కచో
విరుల హారము కట్టి చక్కగ వేయగా మది నెంచి శాం
*కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంత లందరు భక్తితో.*
మరొక పూరణ
కరమనురక్తిన్ బూనుచు
నరుణోదయవేళలందు నారాధనముల్
సరుగున సలుపుచచట శ్రీ
కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్"*
తరళము (ధ్రువకోకిల)
రిప్లయితొలగించండిహరుని భర్తగ దక్షపుత్రిక యంది గుండము దూకినన్
మరలఁ బుట్టుచు శైల పుత్రిగ మన్మథారినిఁ బొందె! స
ద్వరునిఁ బొందిన సర్వమంగళ భాగ్యమున్ దలపోసి శాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
విరించి
రిప్లయితొలగించండిసురస షడ్భుజ సర్వమంగళ సుధ్యుపాస్య భవానివే
హరుని మానస రాణియమ్మిక యంబికా మము బ్రోవవే
కరుణ జూపుచు లోకమేలెడు కప్పుటైదువ యంచు శాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో.
.
వరసుదీర్ఘసుమంగళీత్వము వాసి నొందగ గోరి శాం
రిప్లయితొలగించండికరిని గొల్చిరి భర్తనిమ్మని బాలికామణులార్తితో
నిరయలబ్ధిని బోనడంచుచు నిష్ఠతోడుగ శ్రీలకా
కరిని వేఁడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో.
శ్రీలకాకరి శ్రీలకు ఆకరమైనది
తొలగించండి
రిప్లయితొలగించండిదరికి జేర్చక బాధలన్నియు దారి జూపుము దేవిరో!
విరివిగా కురిపించ వమ్మరొ!వేడ్క మీరగ సంపదల్
తరిమి వేయుచు కష్టముల్ దయ దల్చుమనంచు శాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందఱు భక్తితో !
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసరసిజాసను రాణి విద్యల సారమిమ్మని మ్రొక్కుచున్
గిరితనూజను శక్తియుక్తుల కీర్తినిమ్మని కోరుచున్
సరసిజాక్షుని పత్ని వారిధిజాత పద్మదళాక్షి శ్రీ
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పరమసౌఖ్యద మౌచు దీప్తికి పాదు శ్రావణమౌటచే
రిప్లయితొలగించండివరగుణాఢ్యలు భర్త్రధీనలు వైభవప్రదయైన యా
హరిసతిన్ వరలక్ష్మి నంబను హర్షరూపిణినిన్ శుభం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో.
తరళము:
రిప్లయితొలగించండిపురము నందున భామలందరు పూజ సేయగ గౌరినీ
కరువు కాటక మందు దప్పక కావ రమ్మని గోరుటై
వరుని క్షేమము గోరు వారలు వందనమ్ములు జేయ శాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
వై. చంద్రశేఖర్
వరుడు=భర్త
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిసుర వందిత గా వెలుగుచు
రిప్లయితొలగించండికరుణను వాంఛలను దీర్చు కామాక్షిని వే
వరముల నొసంగు మని శాం
కరిని సతులు వేడుకొనిరి కలుముల నిడగ న్
కరములు మోడిచి భక్తిని
రిప్లయితొలగించండిశరణము గోరుచు విడువక సతతము బ్రోవన్|
వరమిడ శివరాత్రిన శాం
"కరిని సతులు వేఁడుకొనిరి కలతలు తొలగన్ |
ఆకాశవాణిలో ప్రసారం:
రిప్లయితొలగించండిపరమపావనిపాపనాశని భావజారిమనోహరిన్
వరములిచ్చెడుకల్పవల్లిని పాదపద్మములంటుచున్
స్థిరముగామదినమ్మిగొల్వగచింతలన్నియుదీర్చు శాం
కరినివేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
అరిగి నాగచతుర్థి నాడుదయానఁ బాముల పుట్ట ద
రిప్లయితొలగించండిగ్గరకుఁ, బాలను బోసి శ్రద్ధగ కల్గులందున, వచ్చి తాఁ
గరచునన్ భయమే వహింపక, కైలుమోడ్చుచు కంటివి
న్కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో!
అరయనీభువినెల్లజీవులనాదరమ్మున బ్రోవగన్
రిప్లయితొలగించండివరములిచ్చెడుకల్పవల్లిగ భక్తరక్షణ దీక్షతో
సిరిగిరిన్ భ్రమరాంబగావిలసిల్లుపావనమూర్తి శ్రీ
కరినివేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
పరమ పావని లోక రక్షకి పార్వతిన్ భవనాశినిన్
రిప్లయితొలగించండిగిరిజ నా జగదంబ దుర్గ నగేంద్రపుత్రిక నంబికన్
విరుల మాలల తోరణమ్ముల వేడ్క పూజలొనర్చి శాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
(ఆకాశవాణికి పంపినది)
ఆకాశవాణి వారు పూరణ పద్యమూ చదవలేదు. పేరూ నుడువలేదు.
రిప్లయితొలగించండిహరినిగోరుచు భర్తగా తుదియామమందున వేడ్కతో
రిప్లయితొలగించండియమునయందున స్నానమాడుచు నాలయంబున శ్రద్ధగా
విరులతోడను పూజసేయుచు విష్ణుసోదరి ధీరశాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
హరియురమున సుస్థిరముగ
తొలగించండిపరిఢవిలు వరాంగనను సువర్ణ సువర్ణిన్
వరలక్ష్మిని పరమ శుభం
కరిని సతులు వేడుకొనిరి కలుములనిడగన్
రిప్లయితొలగించండికరువు వచ్చిన భక్తి మార్గము కాంచరే యిటు బాగుగా
మరువ బోకిసుమంతయైననుమాధవుండనురక్తితోన్
కరుణ జూపుచు లోకులెల్లర గావు మంచును కోరి, శ్రీ
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితోన్ !
శరణము వేడిన చాలును
రిప్లయితొలగించండికరుణను గురిపించి బ్రోచు కరుణామయి క
ర్వరి శర్వాణి సురస శాం
కరిని సతులు వేడుకొనిరి కలుముల నిడగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిహరశుభంకరవామభాగకృతాంకితార్ధశరీరినిన్,
వరదయాస్థిత, నీలలోహితఁ, బాటలావతిఁ, బార్వతిన్
స్థిరమనమ్మునఁ జేరి, మ్రొక్కుచుఁ, జింతఁ దీర్పఁగఁ దల్లి శాం
కరిని వేఁడిరి "భాగ్య"మిమ్మని కాంతలందఱు భక్తితో!
వరలక్ష్మీవ్రత దినమున
రిప్లయితొలగించండివిరబూచిన యెఱ్ఱతమ్మి విరిపూౙలతో
మరిమరి మొక్కులిడుచు భా
స్కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్!
(భాస్కరి=లక్ష్మి ; భాస్కరీం బిల్వ నిలయాం...)
అందరికీ నమస్సులు 🙏
రిప్లయితొలగించండినా పూరణ
*కం||*
కరములు జోడిగ జేయుచు
వరియే యధికముగ పండ వరముల నడుగన్
సరియగు సమయముగని తొల
*"కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏
*మరో పూరణ ప్రయత్నం*
తొలగించండికల్తీ విత్తనాలకు భయపడి ఒక మోసగాడినే మంచి రాబడి గల విత్తుని కోరెనను భావనతో .. ప్రయత్నం 🙏🙏
*కం||*
వరిపంటను వేయుట కని
సరియగు విత్తుని వెదుకుచు సంతకు బోతే
సిరి రాదని కల్తీ కి ట
*"క్కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🌹🙏🌹🙏
టక్కరి= మోసగాడు, మోసకత్తె , దొంగ
కందం
రిప్లయితొలగించండిగరళము మ్రింగిన వానికి
కరోన కీటకము బాప గ్రక్కునఁ జెలఁగన్
బురికొల్పుమటంచును శాం
కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్
భరము నెంచుచు మందరంబది పాలసంద్రముచిల్కగా
రిప్లయితొలగించండిగరళమయ్యది కంఠమందున కట్టివేసెనురుద్రుడున్,
పరమలక్ష్యము సిద్దినొందగవామదేవుని పత్నిశాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరుభక్తితో
కొరుప్రోలు రాధాకృష్ణారావు,మీర్ పేట్ ,రంగారెడ్డి
గురువు గారు క్షమించండి నిన్నటి సమస్యకు పూరణ
రిప్లయితొలగించండిశివమగుఁపుణ్యకార్యములఁజేయునెడన్శివయామినిన్సదా
భవహరమౌ శివార్చన నపారవినమ్రత నాచరిం చగన్
శివగుణ గానమున్గరము జేసిన, నెంత దురాత్ము
కేనియున్
శివమగుఁ బాపకార్యములఁ జేసినచో, శివరాత్రికిన్ సఖా"
నేటిసమస్య.
సరసచేటిక లాడుచుండెడిసారసోక్తుల నవ్వుచున్
హరిని జేరగ రుక్మిణీ సతియా లయమ్ము నకేగగా
హరమనోహరి గౌరినార్తదయా ళువున్వరదాభ యం
కరిని వేఁడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో"
తరుణులు నిరసన తెలిపి , త
రిప్లయితొలగించండిమ రాజధాని దరలించు మానవు మనసున్
గరిమగ మార్చగ విశ్వం
భరుని సతులు వేడుకొనిరి భాగ్యమ్మిడగన్
అరకులోయనునుండువారలుహర్షమొందుచురక్తితో
రిప్లయితొలగించండితిరపుబుద్ధిని నిమ్ముమాకనిదేవదేవునిగోరుచున్
విరులతోడనుబూజజేసియువేదమంత్రముబల్కిశాం
కరినివేడిరిభాగ్యమిమ్మనిగాంతలందఱుభక్తితో
పరువమందున కన్య యొక్క వివాహవేడుక సేయగన్
రిప్లయితొలగించండివరుని జేరెడు కాలమందున పల్లవాధరి గౌరినిన్
పరితపించుచు నార్తి తోడను భవ్యరీతిని గొల్వ శాం
కరినివేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
వరములిచ్చుటె మాని యింతుల వస్త్రముల్ హరియింతువా,
రిప్లయితొలగించండిహరివి మమ్ముల బ్రోచి నీ సతియౌ సుభాగ్యమునిమ్ము, మా
పరువుతో పరిహాసమాడకు పద్మనాభ! యనంచు ట
క్కరిని వేఁడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో౹౹
గురువొసంగ నగస్త్యు డందిన గోప్యమౌ నొక స్తోత్రమున్
రిప్లయితొలగించండిస్థిరముగా పఠియించి శ్రేయము సిద్ధులన్ గొన గోరుచున్
ధరణిపై లలితాంబికన్ మది దర్శనమ్మిడ నెంచి శ్రీ
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో!
శరణుగోరెడి సజ్జనాళికి శాంతిసౌఖ్యములీయుచున్
రిప్లయితొలగించండికరుణజిల్కుచు నెల్లవేళల గావుమాయని నిష్ఠతో
గరళకంఠుని ధర్మభాగిని కాంతిరూపిణి యౌ శుభం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో!!!
రిప్లయితొలగించండిఆకాశవాణి విశేషములేమిటి తెలియచేయగలరు
వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య :
తొలగించండిలలితంబై వినసొంపునై నవరసాలన్ జిల్కు నీ పేటియై
తొలగించండి* ....నీ పేటియే ?
నీ పేటియై అన్నట్లు వినిపించింది
తొలగించండి
తొలగించండినెనరుల్స్ అనప్చాచ్ :)
జిలేబి
అరమరికలేకయుండగ
రిప్లయితొలగించండినిరతముదాబూజజేసినీయమముతోడన్
వరములనొసగెడునాశాం
కరినిసతులువేడుకొనిరికలుములనిడగన్
నియమముతోడన్
తొలగించండిపూరణమయినట్టో.... కానట్టో...
రిప్లయితొలగించండి😄...
ఏమైనను ఒక సరదాకి...
తరలమును వీడి కందము
నఱయుచుఁ బూరణము సేయగాఁ జూడగ నే
నరియయెను సమస్య! యటుల
"కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్"
రిప్లయితొలగించండికరుణతోతగు పాడిపంటలు కర్షకాళికి నిచ్చుచున్
ధరణిపై వసియించు ధూర్తుల దర్పమంతముచేయుచున్
శరణు కోరిన భక్త కోటిని సాదరమ్మునఁ బ్రోచు శాం
కరినివేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
కరిని బ్రోచిన స్వామియే యిట కా చుచుండగ భీతియున్
రిప్లయితొలగించండిపరుగు దీయుచు నుండు నన్నది వాస్తవమ్మను మాటయున్
ధరను సత్యమటంచు నమ్ముచు తల్లితల్లి యునైన శ్రీ
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంత లందరు భక్తితో
అరవిందనయనలు వ్రత ని
రిప్లయితొలగించండికరమ్ము లొనరించి భక్తిఁ గమనీయముగాఁ
గరములు మోడ్చి మది శుభం
కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్
తరళము.
తరుణు లెన్నఁడు వస్త్రహీనము తానమాడఁగ రాదు నాఁ
బరమ తత్త్వము వారికిం దెలుపంగ నిర్జిత శంక న
త్తరినిఁ గృష్ణునిఁ జేతు లెత్తి ముదమ్ము మీఱఁగ,నిల్చి భా
స్కరిని, వేఁడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
[భాస్కరి = భాస్కరుని పుత్రి, యమున]
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్"
సందర్భము:
తస్య త్వేవం ప్రభావస్య
ధర్మజ్ఞస్య మహాత్మనః
సుతార్థం తప్యమానస్య
నాసిద్వంశకరః సుతః
బా.కాం. 8-1
ధర్మజ్ఞుడైన మహాత్ముడైన అటువంటి ప్రభావం కలిగిన దశరథ మహారాజుకు పుత్రులకై పరితపిస్తున్నా వంశాన్ని నిలిపే సుతుడు కలుగనే లేదు.
పరిచయస్థు లగుపిస్తే అన్నిటికంటె ముందుగా "ఎంతమంది పిల్లలు?" అనే అడుగుతారు గాని "ఎన్ని కోట్లు సంపాదించినారు?" అని అడుగరు కదా! అందువల్ల నిజమైన సంపద అంటే సంతానమే!
దశరథుని రాణులైన కౌసల్య సుమిత్ర కైకేయి భర్తయొక్క వంశోద్ధరణా న్నాశించి మహాలక్ష్మిని సంతానరూపమైన సంపదకోసం ప్రార్థించినారు. నగరంలోని కొందరు ముత్తైదువలూ వారి ననుసరించారు.
(పద్యంలో సతులు.. అంటే దశరథ సతులు కావచ్చు.. సామాన్య స్త్రీలు కావచ్చు. అభ్యంతరం లేదు.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*సంతాన సంపత్ ప్రద*
నరులకు నిజమగు సంపద
ధర సంతానమ్మె యనుచు దశరథ వంశో
ద్ధరణేచ్ఛామతులై శ్రీ
కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
22.02.20
-----------------------------------------------------------
నిరుపమ కరుణాంబుధియై
రిప్లయితొలగించండివరము లొసగి సకల జనుల పాలన జేయన్
నిరతమును బ్రోవగ, శుభం
కరిని సతులు వేడుకొనిరి భాగ్యమ్మిడగన్!
తరుణులు నిరసన తెలిపె , త
రిప్లయితొలగించండిమ రాజధాని దరలించు మానవు నకికన్
బురదన ముంచుటకయి శం
కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్
వరదాయినినాశశిసో
రిప్లయితొలగించండిదరినాభృగుబాలనాసుధాబ్ధికుమారిన్
హరిహృత్కమలామృతమధు
కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్"
ఈ రోజు ఆకాశవాణి లో చదువబడిన నా పూరణం
రిప్లయితొలగించండిసరకు సేయక నెండవానల సర్వ కాలములందునన్
పరుల కన్నము పెట్ట భూముల పైరుపంటల వేయుచున్
కరము వెల్గెడు కర్షకాదుల కష్టముల్ తెగటార్ప,తొ
ల్కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో.
మీ పూరణ వైవిధ్య భరితం 👌👏
తొలగించండి👏👏👏👏
తొలగించండిగురువర్యులకు వందనములు
రిప్లయితొలగించండినేను కవిని కాదు కాని సాహితీ కళాభిమానిని
మాధవరెడ్డి
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
"కరిని వేఁడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో"
సందర్భము:
అక్షీణ కళ్యాణు డగు రామ విభుడు
నక్షత్ర పరివృత నవ చంద్రు భాతి...
అయోధ్యలోకి ప్రవేశించినాడు వనవాసానంతరం.
వినువీధి సుర పుష్ప వృష్టులు గురియ
జనులెల్ల జయ జయ శబ్దంబు లొసగ..
స్వాగతించినారు.
కైసేసి చనుదెంచి కామినీ మణులు
ప్రాసాద గోపుర ప్రతతులందుండి
పుణ్యావలోకనంబుల బుణ్య సతులు
పుణ్య పుష్పాక్షతంబులు చల్లుచుండ...
సీతా లక్ష్మణులతో కూడి రాముడు కన్నులవిందు గావించినాడు. (రంగనాథ రామాయణం. యు.కాం.)
రాముడు వనవాసంనుంచి మరలిరాగానే అయోధ్యా పౌరులు మురిసిపోయినారు. "రాముని రాజుగా చూసే ముచ్చట నెరవేరబోతుంది. (ఇక ఆటంకం లేదు కదా!) అదే మన భాగ్యం (సుకృతం)." అనుకున్నారు.
పౌర కాంతలూ ఆ భాగ్యంకోసమే శాంకరిని (పార్వతీదేవిని) ప్రార్థించినారు.
ఇది ధ్రువకోకిల వృత్తము (తరలము).సాహితీ ప్రియుల సౌకర్యార్థం సులక్షణసారము ననుసరించి దీని లక్షణ మిక్కడ పొందుపరుస్తున్నాను. (సభరసజజగ అనే గణాలు వస్తాయి.)
శుభ విలాస ముకుంద కేశవ
శూలి భవ్య విరామమున్
నభరసంబులు జాగముల్ దగు
నవ్యమై ధ్రువ కోకిలన్
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*ముద్దు ముచ్చట*
మరలి వచ్చిన రామునిన్ గని
మానసంబునఁ బౌరులున్
మురిసి.. "రాతని రాజుగాఁ గను
ముద్దు ముచ్చట తీరులే!
అరయగా మన భాగ్య మద్దియె!"
యంచు నెంచిరి.. యంత శాం
కరిని వేఁడిరి భాగ్య మిమ్మని
కాంత లందరు భక్తితో..
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
22.02.20
-----------------------------------------------------------
చూ..పౌరుల ప్రసక్తి 9.1.20 పూరణలోను.