19, ఫిబ్రవరి 2020, బుధవారం

సమస్య - 3285 (రంభాఫల మెంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రంభాఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్"
(లేదా...)
"రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్"

57 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  "కదళీ న కదాచన"

  కసిగా జీర్ణపు కోశమందు పొసగన్ గంభీరమౌ ఘాతమే
  విసుగున్ జెందుచు పథ్యమున్ గతుకుటన్ వేధించి బాధించగా
  నసనున్ తాళక రాత్రినిన్ తినుటకై నాణ్యమ్ముగా నెంచగన్
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్

  రిప్లయితొలగించండి

 2. ఆటవెలది సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  "తట్టి కూర్చుండుము; పెట్టి తినుము"

  పసనున్ తెల్పగ మోడివర్యుడలుకన్ భాజ్పాది బెంగాలునన్
  వెసనున్ దూకుచు కొల్కతా నగరినిన్ బింకమ్మునన్ జేరగా
  నసనున్ బెట్టక దీది నవ్వుచునహో నాణ్యంబుగా నిచ్చుచో...
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్

  రిప్లయితొలగించండి
 3. ముని తపోభంగం చేయడానికి వెళుతున్న రంభతో, ఊర్వశి మన్మథుని వృత్తాంతము చెబుతూ హెచ్చరిక చేయడం..


  శంభుని వంటి మునియె నా
  రంభింప తపంబు వలదు ఱంకాడకుమా
  సంభూషించకను గలుగు
  రంభా! ఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్


  రిప్లయితొలగించండి
 4. (జఠరాగ్ని మెండైనవాడు అరటిపండ్లలో అమృతాన్ని చూస్తే జఠరాగ్ని బెండైనవాడు ఒక్క అరటిపండులోనే విషాన్ని చూస్తాడు)
  రసనాగ్రంబున మాటిమాటికి రుచుల్
  రంజిల్ల వెన్వెంటనే
  ససియౌ పండుల మాధురిన్ దవడలన్
  సంధించుచున్ మ్రింగు నా
  రసికుండే యెరుగున్ ; విషంపుటునికిన్
  రంభాఫలం బందునన్
  మసకల్వారిన జీర్ణశక్తి గల సా
  మాన్యుండు గాంచున్ గదా !
  (రసనాగ్రము - నాలుకచివర;ససియౌ - బాగైన ;సంధించు - కలుపు;
  మసకల్వారిన - మందగించిన )

  రిప్లయితొలగించండి
 5. జంభారిసభాంగణమున
  జృంభించు సురాంగనల పరీక్షించునెడన్
  అంభోజాక్షుల నటసం
  రంభాఫలమెంత విషమొ రసికుడె ఎరుగున్

  నటసంరంభాఫలము : నటనలో అతిశయమువలన పూలు నలిగినవని రసికుడైన రాజు ( విక్రముడు) నిర్ణయించాడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంరంభ ఫలము' అన్న సమాసం సాధువనుకుంటాను.

   తొలగించండి
 6. వసుధన్ "దిండికి హద్దులేని యెడలన్ భవ్యంబులౌ గారెలే
  మెసవన్ జేదగు" నన్నరీతి నతిగా మెక్కన్ సుఖశ్వాసకున్
  వెస నిబ్బందిగమార నందుచు గసన్ భీతిల్లి యొక్కండనెన్
  "రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్"

  రిప్లయితొలగించండి
 7. సంబంధీకులు వత్తురు
  సంభోగము పూర్తిచేయ సరసుని కోరన్
  సంబర మెందుకె చెలి సం
  రంభా ఫలమెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్.

  సంబంధీకులు...చుట్టాలు
  సంబరం , సంరంభం.....వేగిరపాటు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బ-భ' ప్రాస ? స్వవర్గజ ప్రాస కేవలం తవర్గానికే పరిమితం.

   తొలగించండి


 8. ఈ రంభాఫలమేమిటో సాంబా తెలియ రా దే :)  రంభా నిన్నెరుగుదునే
  రంభాఫలమేమొ తెలియ రాత్రియె గడిచెన్!
  రంభారావిడియిదియే!
  రంభా! ఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. మైలవరపు వారి పూరణ

  ఉసిగొల్పున్ బలు లౌకికాంశములు నిన్నూబిన్ బడన్ ద్రోయగా.,
  వెస చిద్దార్ఢ్యము గల్గు మానవుడె నిర్భీతిన్ ప్రవర్తించెడిన్!
  రసనా చంచలతానుగామియగునా రంభాఫలాస్వాదియౌ
  రసికుండే యెఱుగున్ విసంపుటునికిన్ రంభాఫలంబందునన్.!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి


 10. ముసిరింతల్ తసిరీబులిచ్చి పడతిన్ ముద్దాడి జవ్వాదులన్
  కసిగా చాదుచు మీద మీద పడుచున్ కవ్వింతలన్ పాడుచున్
  మిసిదేలంగ ప్రియా ప్రియా యనగ నమ్మీతిక్కరేగించెడా
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. :)


   ఛందోబద్ధము గా వున్నది. అసలు మీనింగుందంటారా దీంట్లో ? :)


   నారదా!
   జిలేబి

   తొలగించండి

  2. ఛందోబద్ధపు పూరణన్ సలుపగా జంజాటమే తీరునా?

   తొలగించండి
  3. గురువుగారు సాధారణంగా ఛందోవ్యాకరణ దోషాలే చూస్తారు.వాటిలో తప్పులేకుంటే బాగుందనేస్తారు! అర్ధాలూ,అలంకారాలూ బాగుంటే మిగిలిన వ్యాఖ్యలు చేస్తారు!

   తొలగించండి
 11. వెసనారావణబ్రహ్మపడతిన్వేంచేసిమోహంబునన్
  రసనాగ్రంబునకామవాంఛగొనియెన్రంభాచ్చరన్గూడదన్
  వెసనాబెన్మిటిశాపమిచ్చెపరయౌభీతేక్షణాంతంబునున్
  "రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్

  రిప్లయితొలగించండి
 12. జంభాల మాట కాదిది
  శంభు తనయుని మనసార సన్నుతి జేయన్
  గంభీరమైన యా హే
  రంభాఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్

  రిప్లయితొలగించండి
 13. శంభుని తపమును సేయఁగ
  జంభారియు కోపగించి సరగున బంప న్
  సంభావ్య మయ్యె నప్పుడు
  రంభా ఫల మెంత విషమొరసికు డె యెరుగు న్ a

  రిప్లయితొలగించండి
 14. సంభవమది ముదితనమున
  గంభీరమగు మధుమేహ కాశువు పెరిమిన్
  జంభాలను పలుకకుమిక
  రంభాఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్

  రంభా = అరటి చెట్టు

  రిప్లయితొలగించండి
 15. గంభీరమైన జబ్బు వి
  జృంభించగ దేహమంత క్షేమమునెంచన్
  దంభంబేటికి నరుడా!
  రంభాఫలమెంత విషమొ రసికుడె యెరుగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పసిప్రాయంబున పాటవంబదియె పెంపారంగ కాష్ఠీలమున్
   విసుగున్ గానక స్వీకరింపదగు సంప్రీతిన్ వినా శంకలన్
   మసకల్వారిన చూపునన్ ముదిమినిన్ మందంబునైనన్ క్షుధన్
   రసికుండే యెరుగున్ విషంపుటునికిన్ రంభాఫలం బందునన్
   కాష్ఠీలము = అరటి

   తొలగించండి
 16. గుంభనమేమియు లేదిట
  సంభాషణమున విరసము సరి గాదు గదా
  గంభీరించకుమిక నో
  రంభా, ఫలమెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్
  (గంభీరించు = భీష్మించు అనే అర్థంలో)

  రిప్లయితొలగించండి


 17. ఇంతకీ రంభాఫలము పదము ఆంధ్రభారతి లో కనరాదేమి ?


  జిలేబి


  రిప్లయితొలగించండి
 18. అంభోరుహ నేత్రా! విను
  రంభా ఫలములవి రుచికరమ్మునుచును సం
  రంభముఁ మితిమీరి తినిన
  రంభా ఫలమెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్

  రిప్లయితొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!

  రసనాగ్రస్వరరాగతాళగతులన్ రంజిల్లుఁ దద్గ్రాహ్యుఁడే!
  విసరప్రస్తుతకావ్యరమ్యరుచులన్ వీక్షించుఁ దద్గ్రాహ్యుఁడే!
  విసపుంబుర్వువసింప, దాని సవురున్ వేగమ్ముగాఁ గాంచి, త

  ద్రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్!

  రిప్లయితొలగించండి
 20. సంభావ్య మగును చూడన్
  రంభాఫల మెంత విషమొ;రసికుడె యెరుగున్
  కుంభోరు కుచ విలాసము
  నంభోరుహనేత్ర పొందు నందము చిందన్.

  రిప్లయితొలగించండి


 21. గంభీరముగా చూచెను
  జంభారి రుషుల పయి భళి చానల త్రోసెన్
  స్తంభమువలె నిల దోచిన
  రంభాఫలమెంత విషమొ రసికుడె యెరుగున్!


  రిప్లయితొలగించండి
 22. రంభా ఫలమది దిన నా
  రంభము లోన రుచి హెచ్చి రసికత పెంచున్
  రంభాలింగన మనియెడు
  రంభా ఫలమెంత విషమొ రసికుడె యెరుగున్.

  రిప్లయితొలగించండి
 23. సరదా పూరణ ప్రయత్నం 🙏🙏

  (రంభాఫలము తినడం గురించి గొప్పగ డాక్టర్ కీ చెబుతున్న వ్యక్తి, డాక్టర్ సందర్భం)

  *కం||*

  సంబరములు జేయు ననుచు
  డాంభికములు పలుకుచుండ డాక్టర్ యెదుటే
  బెంబేలెత్తించగనెను
  *"రంభాఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏😞🙏😊🙏

  రిప్లయితొలగించండి
 24. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "రంభాఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్"

  సందర్భము: మేనక తర్వాత దేవేంద్రుడు రంభను వెళ్ళు మన్నాడు విశ్వామిత్ర తపోభంగానికి.. ఆమె భయపడ్డది.
  నాకేశ! కోపించు నన్ను శపించు
  నా కౌశికుని సైప నని జాలి బడుచు..
  నుండగా మన్మథుని వసంతుని తోడిచ్చి పంపినాడు దేవేంద్రుడు.
  ఆ రంభయును మనోహర లాస్య గరిమ
  నారంభ మొనరింప నలిగి కౌశికుడు
  పదివేల వర్షముల్ పాషాణభావ
  మొదవంగ గైకొని యుండి యామీద
  నురు తపోనిధియైన యొక విప్రువలన
  సరసిజానన పొందు శాప మోక్షంబు..
  అని పల్కినాడు.
  (రంగనాథ రామాయణం. బా.కాం.)
  ఆ విధంగా మేనకవలన కామపరవశుడై రంభవలన క్రోధ పరవశుడై విశ్వామిత్రుడు తన తపస్సును కోల్పోయినాడు. ఐనా పట్టిన పట్టు వదలక బ్రహ్మర్షిత్వాన్ని సాధించినాడు.
  రంభా ఫలము = రంభవలన ఫలము
  విషము = (తపస్సంపన్నులకు) మృత్యు సదృశము
  5.2.20 పూరణంలోని విశ్వామిత్ర ప్రసక్తి కూడ పరిశీలించగలరు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *క్రోధము తపమున్ జెఱచును*

  శుంభత్ తపః క్రియ సమా
  రంభం బొనరింపగ ఋషి.. రానే వచ్చెన్
  రంభ.. శపించెను ముని.. యా
  రంభా ఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  19.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 25. మత్తేభవిక్రీడితము
  అసలే మాగని కాయలన్ గొనుచుఁ గార్భైడుల్ ప్రయోగించుచున్
  రసనానందమొసంగ పండ్లనుచు స్వార్థంబెంచి వ్యాపారులున్
  వెస నంగళ్లను విక్రయించఁ దినఁ బ్రావీణ్యుండు శాస్త్రజ్ఞఁడౌ
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్

  రిప్లయితొలగించండి
 26. అంభోజాక్షులఫలములు
  సంభావ్యముజేయదెలియుసన్నుతులెవరో
  రంభనుగూడినతదుపరి
  రంభాఫలమెంతవిషమొరసికుడెయెఱుగున్

  రిప్లయితొలగించండి
 27. సమస్యాపూరణం కై
  సమస్య:
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్

  మత్తేభము

  రసికుల్ బొందగతీపిజబ్బురతికార్యస్థాయిహీనంబగున్
  పసురుల్ ద్రావుచుపథ్యముల్ నెఱపదీప్తంబౌనుతచ్ఛక్తియున్
  వెసఁబెంచున్ మధుమేహమున్ కదళినిర్వీర్యంబగున్ దేహముల్
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్

  గాదిరాజు మధుసూదన రాజు

  రిప్లయితొలగించండి
 28. రిప్లయిలు
  1. కందం
   గుంభనముగన్ రసాయన
   చుంబితముగ మాగఁ జేయ సొమ్ముల కొరకై
   గంభీర శాస్త్ర విజ్ఞత
   రంభాఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్

   తొలగించండి
 29. దంభ గమనమ్ము పతనా
  రంభము వేశ్యాంగనావర రత జనిత సం
  రంభము సౌందర్య విజిత
  రంభా ఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్

  [ సౌందర్య విజిత రంభా ఫలము = సౌందర్యములో జయింపబడిన రంభ కల యామెను గూడిన ఫలము]


  వెస వీడం దగు జీవరాశికి ధరన్ వే భక్ష్యముల్ గ్రుళ్లినన్
  విసమై చంపును రోగ కారకమునై వేగంబ సందేహమే
  పస యెల్లం జెడి తద్ద క్రుళ్లిన నహోపండైనఁ దాఁ దిన్నచో
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలంబం దిలన్

  రిప్లయితొలగించండి
 30. కసుగాయల్ దిననుండునేమిగులదాకాకోలపాషాణమై
  రసికుండేయెఱుగున్విషంపుటునికిన్,రంభాఫలంబందునన్
  నసమానంబగుదీపియుండియునునాహాయంచురీతిన్ దగన్
  రసనాగ్రంబునుదాకుచున్దనరివేరంజిల్లెశోభాకృతిన్

  రిప్లయితొలగించండి
 31. రంభాఫలఖాదనమా
  రంభంబునమేలుగూర్చి రంజననిడు, సం
  రంభంబుగనెక్కుడు తిన
  రంభాఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్

  రిప్లయితొలగించండి
 32. పసిగట్టున్ గద బియ్యమందు నలకల్ పద్మాక్షి వైదగ్ధియై
  రసనాగ్రమ్మున వేరుచేయు జలమున్ రాయంచ క్షీరమ్ముతో
  కుశలత్వమ్మున పాపసంచయము సంకోచింప సాధ్యంబగన్
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్

  రిప్లయితొలగించండి
 33. వ్యసనంబౌప్రతిజీవి యెక్కుడుగనిర్వ్యాపారియై మెల్గుచున్
  రసనాగ్రంబుననెల్లవేళలనుతారంభాఫలాస్వాదనన్
  వసనంబందునసల్పుచుండుటనదేవానిన్ హరించున్ సదా
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్

  రిప్లయితొలగించండి
 34. మసురల్ పిల్చిన చాలు మైమరచి సమ్మానించుచున్ వారిదౌ
  బసకున్ జేరగ నట్టి వైశికునకున్ బ్రాప్తించ గా వ్యాధి నిన్
  భిషజుల్ గాంచుచు చెప్పిరే యరటిఁ బోబెట్టంగ మేలంచు నా
  రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలం బందునన్

  రిప్లయితొలగించండి
 35. శశిబింబంబది యింపుగా కురిసెడిన్ చంద్రద్యుతిన్ గాంచినన్
  సిసలైనట్టి కవిత్వమున్ సలుపగా శృంగారమున్ గూర్చుటే
  రసికుండే యెఱుఁగున్, విషంపు టునికిన్ రంభాఫలం బందునన్
  కసిగాటంతయినన్ కనంబడదురా కాయంబుకున్ బుష్టిరా!

  రిప్లయితొలగించండి