24, ఫిబ్రవరి 2020, సోమవారం

సమస్య - 3290 (రమణి కుచంబుపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రమణి కుచముపైన ఱంపముండె"
(లేదా...)
"రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్"

72 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  రమణిని గాంచి మోహమున రమ్యపు రీతిని స్వప్నమందునన్
  సుమములు దేహమంతయును చూచుచు మెండుగ సంతసించితే!
  క్రమముగ చూడుమో నరుడ! కన్నులు విప్పుచు పచ్చబొట్లహో!
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  పచ్చబొట్లు = tattoos

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంతసించితే' అనడం వ్యావహారికం. "సంతసించినన్/సంతసింపగన్" అనండి.

   తొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కుములుచు వంటయింటినను కూరలు వండుచు గార్దభాలకై
  క్రమముగ పెన్ను బట్టుచును గండర గండుల వాతబెట్టుచున్
  సమముగ చెప్పి యుండినది చల్లని మాటలు రంగనాయకే:
  "రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్"

  రంగనాయకి = ముప్పాళ రంగనాయకమ్మ

  రిప్లయితొలగించండి


 3. ఆమె పేరు? ఎచట నా గుణనిక యేను
  సొగసు గా వెలసెను? సోకు మాడ!
  చేతి లోన నుండె చెప్పవే యేమిటో?
  రమణి; కుచముపైన; ఱంపముండె!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 4. అమరె ప్రధాన మంత్రిగ పణాయిత మైన విచక్షణాధికా
  రములను చేతగాంచి ప్రవరాన్విత భారత దేశ మందుతా
  నమరెను! పేరు యిందిర రణాంగణ! శక్తియె రూపమై భళా
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్!


  జై ఇందిరా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. సుమధుర వర్ణశోభితము సుందరవస్త్రము నొక్కదాని దా
  నమలినమైన ప్రేమమున నందగ జేసెను ప్రాణనాథు డా
  యమ ధరియించె జూడనగు నందలి చిత్రములైన చిత్రముల్
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్"

  రిప్లయితొలగించండి
 6. కలికి బొమ్మ కడ్డుగగల కొమ్మను తొల
  గించ బోవుచుండ కేలును విడి
  వడిన ఱంపమెచట పడినదో జూడగ
  రమణి కుచముపైన ఱంపముండె

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  కుమిలితివేని ప్రేమఁబడి కోయును గుండెఁ., బరాంగనాంగకా
  మమున స్పృశించితే కడు ప్రమాదము కంఠమునుత్తరించెడిన్!
  మమతను స్వచ్ఛదుగ్ధమిడు మాతగ దల్చిన., నామె శక్తిరా!
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 8. పడుచు వాడొకండు పనిముట్టు కోసమై
  వెదుకు చుండ గాంచి వృద్ధు డనెను
  శిల్పములను చెక్కు శిల్పాలయములోన
  రమణి కుచముపైన ఱంపముండె

  రిప్లయితొలగించండి
 9. చీమ యొకటి దూరి చిన్నగ గఱ చెను
  రమణి కుచము పైన : ఱ o ప ముండె
  కార్మి కాళి చెంత కఱ్ఱ లు కోయంగ
  పనికి వచ్ఛు తగిన పరికర ము గ

  రిప్లయితొలగించండి
 10. చిన్నపాపకెప్డు చన్నుబాలీయదు
  షోకుకొరకునొకటె ప్రాకులాట
  అమ్మతనములోనియందమ్ముదెలియని
  రమణి కుచముపైన ఱంపముండె

  రిప్లయితొలగించండి
 11. విమలతనూమనఃకలితవిశ్రుతపాణితలగ్రహీత న
  క్రమమున వీడు టేలనొ! విలాసమ! సౌఖ్యరుజాప్రదాయియౌ
  ప్రమద ప్రమాదకారియగు పణ్యనుఁ గూడకు హేయభోగినీ
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  రిప్లయితొలగించండి
 12. శిల్పి చెక్కు చుండ శిల్పాలు కొయ్యతో
  చెదరిన పనిముట్ల వెదుక దొడగె
  కలికి శిల్పమునటు కదలించి చూడగా
  "రమణి కుచముపైన ఱంపముండె"

  రిప్లయితొలగించండి
 13. వింత గొలుపు చిత్ర మింతిగుండె లపైన
  మెరయు చుండె నంట మిగుల సొగసు
  వెరగు బడుచు గాంచ వేవేల తలపులు
  రమణి కుచము పైన ఱంప ముండె

  రిప్లయితొలగించండి
 14. గొల్ల రేని యింటి గొల్లభామల చెంత
  అమ్మవలపుగరిమననుభవించ
  శ్రీవిభుండుచేరె చిన్నిబాలుడగుచు
  కర్మలతలగోయు క్రకచమగుచు

  నెలల బాలుడయ్యు నెలబాలుడైయొప్ప
  పాలుగొనమటంచు బాలుగొనిన
  పూతనతన రొమ్ము పొదవ కృష్ణుడనెడు,
  రమణి కుచముపైన, ఱంపముండె

  రిప్లయితొలగించండి
 15. కమలమువోలె విచ్చుకుని ,కామితయర్ధములన్నియిచ్చునా
  రమణి మనోహరీయమిత,రాగములెన్నియొనాడు బల్కు గా
  క్రమమునతానుదగ్గరయి ,కామవినోదినిగాచరించుయా
  రమణికుచంబుపై గలవు ,ఱంపము కత్తియు రాజహంసమున్
  ++++++++++++++++++++++
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కామిత+అర్థము=కామితార్థము' అవుతుంది. యడాగమం రాదు. 'మనోహరీ' అని దీర్ఘాంతంగా అక్కడ అన్వయించదు. "చరించు నా..." అనండి.

   తొలగించండి
  2. కమలమువోలె విచ్చుకుని ,కానుకలివ్వగగోరునట్టియా
   రమణినిగాంచగా,యమిత,రాగములెన్నియొతానె బల్కు చున్
   క్రమమునతానుదగ్గరయి ,కామవినోదినిగాచరించుయా
   రమణికుచంబుపై గలవు ,ఱంపము కత్తియు రాజహంసమున్
   ++++++++++++++++++++++
   రావెలపురుషోత్తమరావు
   (సవరణ పాఠము ధన్యవాదాలతో)

   తొలగించండి
 16. భ్రమరము వంటి వాడవుర పయ్యెద జారిన చాలు కాంక్షతో
  ప్రమదను గాంచుచుంటివది పాపమె కాదు ప్రమాదమే సుమా
  యమభటుఁ బోలు తండ్రిగలడా సుకుమారికిఁ జంపు గాంచినన్
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  రిప్లయితొలగించండి
 17. బిడ్డయేడ్పువినగ బిత్తరబోయెను
  చీరచాటుజేర్చి చిదిమె బుగ్గ
  కన్నెవయసులోని కాంతనుపరికించ
  రమణికుచముపైన ఱంపముండె
  ——————-/—————-
  రావెలపురుషోత్తమరావు


  రిప్లయితొలగించండి
 18. భ్రమరమువంటి దానవని,బ్రాహ్మడు జెప్పెను పెండ్లిముందరే
  క్రమముగమారులెమ్మనుచు,ఖాయముజేసితినీదుబంధమున్
  విమల యశోవిలాసిగను ,వీక్షణజేయగ దెల్సివచ్చెనీ
  రమణికుచంబుపైగలవు,ఱంపముకత్తియురాజహంసమున్
  ************************
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 19. బ్రెస్ట్ కాన్సర్ బాధితులు
  అమ్మదనము కేను నాశ్రయమైయుండ
  కనులబడని వ్యాధి క్రమ్మగాను
  పాలనిచ్చు యురము పాషాణమాయెగా
  రమణి కుచముపైన రంపముండె

  రిప్లయితొలగించండి
 20. మిత్రులందఱకు నమస్సులు!

  [సర్వమత సమత్వమును కోరుకొనెడి యొక రాజవంశీకురా లానాఁటి వివిధ మత చిహ్నములును తన యెదపైఁ బచ్చబొట్లుగాఁ బొడిపించుకొనిన సంఘటనను గురించి యిఱువురు మాటలాడుకొను సందర్భము]

  "సమహితశాంతికామి, సువిశాలదృగార్తదయార్ద్రచిత్త, స
  ర్వమత సమత్వభావన విభాసిలఁ గాంక్షిలునట్టిదై, కడున్
  దమి మెయిఁ బచ్చబొట్టులను దాఁ బొడిపించెను! వానిఁ జూడు! మా

  రమణి కుచంబుపైఁ గలవు, ఱంపముఁ గత్తియు రాజహంసమున్!"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. వివరణమునఁ జిన్న సవరణతో...

   [సర్వమత సమత్వమును కోరుకొనెడి యొక రాజవంశీకురా లానాఁటి వివిధ మత చిహ్నములను తన యెదపైఁ బచ్చబొట్లుగాఁ బొడిపించుకొనిన సంఘటనను గురించి యిరువురు పరిచారికలు మాటలాడుకొను సందర్భము]

   "సమహితశాంతికామి, సువిశాలదృగార్తదయార్ద్రచిత్త, స
   ర్వమత సమత్వభావన విభాసిలఁ గాంక్షిలునట్టిదై, కడున్
   దమి మెయిఁ బచ్చబొట్టులను దాఁ బొడిపించెను! వానిఁ జూడు! మా
   రమణి కుచంబుపైఁ గలవు, ఱంపముఁ గత్తియు రాజహంసమున్!"

   తొలగించండి
 21. ప్రముఖముగాను జూపగనె పత్రికలందు ప్రచార చిత్రముల్
  భ్రమలను మున్గి యాధునిక వస్త్రములంచు ధరింతురిట్టులన్
  రమణులిదేల చోలముల రంగుల చిత్రములంచు జూడుమీ
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  రిప్లయితొలగించండి
 22. అందరికీ నమస్సులు 🙏🙏

  నా పూరణ

  *ఆ వె*

  పెరుగుచున్న ప్రెక్కు వెర్రి చూడునిచట
  చిరుగు డ్రెస్ మరియొక చింపిరి తల
  ఇన్ని రకముల బదులిదియొకటి వినుమ
  *"రమణి కుచముపైన ఱంపముండె"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌸🙏🌸🙏

  రిప్లయితొలగించండి
 23. హతవిధీ! వ్రణమయె యెడదను వనితకు మానకసలుపుచును మరణమెయన |
  శస్త్ర వైద్యమయెను,స్వస్థత కూర్చను |
  "రమణి కుచముపైన ఱంపముండె

  రిప్లయితొలగించండి
 24. హతవిధీ! వ్రణమయె యెడదను వనితకు మానకసలుపుచును మరణమెయన |
  శస్త్ర వైద్యమయెను,స్వస్థత కూర్చను |
  "రమణి కుచముపైన ఱంపముండె

  రిప్లయితొలగించండి
 25. ఏమిగలదొ?చూడరెవరుబతియుదప్ప
  రమణికుచముపైన,ఱంపముండె
  నింటియటకమీద కంటివె!యిటులిమ్ము
  కట్టెకోయవలయుగడపకొఱకు

  రిప్లయితొలగించండి
 26. చిత్రకారుడొకడు చిత్రించు పటముల
  చిత్రమొకటి జూడ చిత్రమాయె
  జీవముట్టిపడుచు చిరునవ్వు లొలికెడు
  రమణి కుచము నందు ఱంపముండె!!!

  రిప్లయితొలగించండి
 27. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "రమణి కుచముపైన ఱంపముండె"

  సందర్భము: ఒకనాడు సీత తొడపై తల వుంచి రాముడు నిదురిస్తుండగా ఒక కాకి సీత కుచాన్ని పదే పదే పొడువసాగింది. సీత పారదోలే ప్రయత్నం చేస్తే ఫలించలేదు. నడుము పట్టెడతో కొడుదా మంటే చీర జారసాగింది. రాముడు దిగ్గున మేల్కొని నవ్వగా సీత సిగ్గు పడింది.
  రాము డోదార్చి నిద్రలో పడ్డాడు. సీతకూ క్రమంగా కళ్ళు మూతలు పడుతుండగా కాకి మళ్ళీ తీవ్రంగా పొడిచింది. నెత్తుటిబిందువులు పడి రామునికి నిద్రాభంగ మయింది. కాకి కంటబడగా ఆయన కన్ను లెఱ్ఱబడ్డాయి.
  " ఇలా రుధిర బిందువులు కారుతున్నా యేమిటి? రమణి (సీత) కుచంపై రంపం పెట్టి ఎవరో కోస్తున్నారా!" అన్నాడు.
  ఆ వృత్తాంతమే సీత ఆంజనేయునితో చెబుతున్నది పద్యంలో..
  పిదప రాముడు ఒక దర్భను తీసుకొని బ్రహ్మాస్త మభిమంత్రించి కాకిపై వదలగా మూడు లోకాలూ తిరిగివచ్చి రామునే శరణు పొందినది. రాముడు కరుణించినాడు. బ్రహ్మాస్తం వ్యర్థం కారా దంటే తన కుడి కన్ను నర్పించి ప్రాణం రక్షించుకున్నది కాకి.
  చిత్రకూటంలో జరిగిన పై సంఘటనను ఒక జ్ఞాపకంగా భర్తతో చెప్పు మని (ఇదం శ్రేష్ఠ మభిజ్ఞానం బ్రూయాస్త్వం తు మమ ప్రియమ్..) సీత హనుమకు వివరించింది. (సుం.కాం. 38-12 నుంచి 39)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *అభిజ్ఞానము*

  అలసి నా తొడపయి నానాడు శయనించి,

  ధవుడు నిదుర చెదరఁ దగ వచించె..

  "నొనర రుధిర మిట్టు లొలికించుచుండెనే!

  రమణి కుచముపైన ఱంప ముండె"

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  24.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 28. సమయపురీశుడార్యముడుచక్కనిశిల్పములన్ సృజింపగా
  విమలునిశిల్పినట్లునిలిపెన్ పనిసాగుచుండచెక్కచే
  నమరెనుపెద్దశిల్పములునచ్చటనాపనిముట్లుకన్పెడెన్
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  గాదిరాజు మధుసూదనరాజు

  రిప్లయితొలగించండి
 29. రమణికుచంబుపైగలవుఱంపముగత్తియురాజహంసమున్
  రమణికుచంబుజూచితిరె!ఱంపములాదిగనున్నవంటిరే!
  విమలమనంబుతోసతులవీక్షణజేయుచుగౌరవించుచున్
  రమణులజూడగావలెనురామునిపత్నియసీతమాతగా

  రిప్లయితొలగించండి
 30. తమదగు రీతినం నరులు ద్రావుచు మత్తున దూగుతున్ పడన్
  రమణము దప్పుచున్ వెలదులం గవయంగ దలంపు మానుమా
  గమనము నీవెరుంగుమికఁ గానవదేలను మాయలాడియౌ
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  రిప్లయితొలగించండి
 31. కదిసిన వడిఁ గోయుఁ గరమును గోమలి
  దూఁక నేల నీకుఁ బోకు దరికి
  వెఱ్ఱిదనము నూని వీఁగిన బగులు బు
  ఱ్ఱ మణి కుచముపైన ఱంపముండె


  సమముగ నాత్మ రక్షణకు శార్వరి వచ్చిన చోర కాయమే
  కుములక ధైర్య ముండుటకుఁ గూర్చఁగ భద్రము నెంచి వారలే
  యమరి క్రమమ్ముగా నచట యందము లొల్కుచు వింత గాంచు మ
  ఱ్ఱ మణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  [అఱ్ఱ మణి కుచము = శ్రేష్ఠపు పెట్టె యఱ గుండెలలో (లోపల), రాజహంసపు బొమ్మ]

  రిప్లయితొలగించండి
 32. సుమములు గండశైలములు చుక్కలు శూలము లున్న చీరనే
  ప్రమదకు ప్రేమతో నిడగ బావ, విచక్షణ తోడ నామెయే
  యమరిక తోడ గట్ట నది యంగన యందము బెంచె చూడుమా
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  రిప్లయితొలగించండి
 33. కొమరుని పెండ్లి సంబరము కోసము ధారణ జేయనెంచగన్
  రమకయి హారమందిడిరి ఱంపము గత్తియు రాజ హంసముల్
  యమరిన మాల నొక్కపరి యద్దము నందునజూసి దాల్చగన్
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  రిప్లయితొలగించండి
 34. ఆటవెలది
  అందమెంచి భర్త యాదరించఁ డని తాఁ
  బాపలేడ్చు చున్న పాలనీని
  యతివ నరక మేగ యమకింకరులుఁ బట్ట
  రమణి కుచముపైన ఱంపముండె!

  రిప్లయితొలగించండి
 35. చంపకమాల
  భ్రమలను జూపి యిద్దరట భామనుఁ జేరఁగఁ గామ వాంఛతో
  నమలిన ప్రేమఁ జూపు నొక నాప్తుని మెచ్చగ విజ్ఞురాలిగన్
  ధుమధుమలాడి మత్సరము దుష్టులు జూపఁగ నాప్తుడడ్డినన్
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

  రిప్లయితొలగించండి
 36. శ్రమపడి శిల్పమున్ దొలచి శ్రావణ మెచ్చట మర్చిపోతివో
  విమలుడ శ్రద్ధతో వెదుకు, వేదిక ప్రక్కనె యున్న శిల్పమా
  రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు, రాజహంసమున్
  కమలము చెక్కువేళ యటఁ గాంచితి తెమ్మిటు వేగ పోయెదన్.

  రిప్లయితొలగించండి
 37. సమస్య:
  "చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"

  కందము

  చెలగన్ సమస్య నేడిట
  చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే
  యిలననుచుకందిబ్లాగునఁ
  గలదిటరాజేశ్వరమ్మ కవిత జవాబై

  గాదిరాజు మధుసూదనరాజు

  రిప్లయితొలగించండి