14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

సమస్య - 3280 (ప్రేమికుల రోజు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును"
(లేదా...)
"రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్"

56 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  తాజా కబురు...జైరాం రమేష్ ఉవాచ:

  హాయిగ మోడినిన్ కరచి హ్లాదము నొందెడి కాంగ్రెసయ్యరో!
  మూయుచు నోరు పృష్ఠములు ముప్పది రోజుల భండనమ్మునన్
  పోయెను హస్తినమ్మనుచు భోరున నేడ్చుచు కేజ్రివాలునున్
  రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 2. సమస్య : -
  "ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును"

  *తే.గీ**

  కాలము గడుపుట కొరకు కపటముగను
  చెడుతలంపుతో ప్రేమింప చేసినట్టి
  ప్రేమలకు కచ్చితమ్ముగ ప్రేమికులును
  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును
  .......................✍చక్రి

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  హిందూ సేన (కోయంబత్తూర్):

  వ్రాయుచు ప్రేమలేఖలను వాడల వీధుల వెంబడించుచున్
  ప్రాయపు కన్నెలన్ మురిసి పండుగ జేసెడి రోమియోలనున్
  పోయెను హైందవమ్మనుచు పోరును జేయుచు, వేలటిన్నుకున్,
  రోయక నేఁడు ప్రేమికుల రోజని, పిండముఁ బెట్టఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 4. వాలెనుటెయినొక క్రైస్తవ ముని తొల్లి
  మతము మార్పిడు లకునేడు మరణమొందె
  అతని మరణసంస్మరణనేడనిరి కనుక
  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును

  తేట తెనుగు లోన కుదింపు తేటగీతి
  లోన క్లుప్తమై విషయమ్ము లుప్తమయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ కౢప్తంగా ఉన్నా విషయాన్ని సమగ్రంగా అందజేసింది. బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. ఉత్పలమాల
  హాయిగ దేశమున్న సరిహద్దుల గాచెడు వారి త్యాగమే
  మాయునె పుల్వమా గిరుల మారణహోమము ప్రేల శత్రువే
  బాయఁగఁ బ్రాణముల్ నిరుడు వారలు నల్భది మించి వారికై
  రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 6. నేటి ప్రేమల స్వేచ్చకు సాటి యేది
  రక్త పాతపు మడుగున రిక్త మవగ
  నిండు ప్రాణము దీసెడి బండ లున్న
  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁ దగును

  రిప్లయితొలగించండి
 7. (ఉదాత్తమైన , సమాజానికి నిరపాయకర
  మైన , ప్రేమ వర్ధిల్లటం వాంఛనీయం )
  తీయని ప్రేమతో ; తెరలు
  తీసిన స్వచ్ఛమనోజ్ఞభావులై
  హాయిగ నుత్సహమ్ము పెను
  పారగ పర్వము సాగుగావుతన్
  రోయక నేడు ప్రేమికుల
  రోజని ; పిండము బెట్టగా దగున్
  మాయల మంత్రగాండ్రకును
  మత్సరవాక్కుల దుర్జనాళికిన్ .

  రిప్లయితొలగించండి


 8. రండి! లవ్వాడుకొనెదము రాధనమిదె
  ప్రేమికుల రోజు; పిండముఁ బెట్టఁదగును
  వలదనిన వారలకిపుడె పడతులార
  యువకు లార వుద్యమముచేయుడి విడువక


  నారదా!
  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. ప్రేయసి రాధనమ్మిదియె ప్రేమకు జోహరు పల్కవేసఖీ!
  రోయక నేఁడు ప్రేమికుల రోజని! పిండముఁ బెట్టఁగాఁ దగున్
  చేయకు డీయటంచు మన చేరువ గిల్లు జనాళికంతయున్!
  ధ్యేయము వారి దాయె తియతీపిని ద్రోలుట క్రూరదృక్కులై

  జిలేబి
  నారదా బారయ్యా :)

  రిప్లయితొలగించండి
 10. రాజు శాసించి పెండ్లిళ్ళు రద్దుసేయ
  ధిక్కరింప వాలెంటైను ధీరు నతని
  చంపినట్టిరోజిది గాన జనులు నేడు
  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును

  రిప్లయితొలగించండి
 11. న్యాయము ధర్మముల్ విడిచి నమ్మినవారిని జన్మదాతలన్
  బాయుచు స్వీయసంస్కృతిని బాతర బెట్టుచు జంటలౌట దా
  నీయెడ మెచ్చలేని యొక డీవిధి నాడెను క్రోధమూర్తియై
  "రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్"

  రిప్లయితొలగించండి
 12. మాయలమారి సంస్కృతిని మాయనిమచ్చగనెంచకుండనే
  పోయినవత్సరమ్మువలె పొందుగగూడుటదేమివింతయో
  శ్రేయముగూర్చు పండుగలు,శ్రీకరమౌగదనిట్టివేలకో??
  రోయకనేడుప్రేమికులరోజని, పిండముబెట్టగాదగున్
  **********************************
  రావెలపురుషోత్తమరావు  రిప్లయితొలగించండి
 13. మైలవరపు వారి పూరణ

  మాయలమారి సంస్కృతి సుమా యిది! భారతభూమిపై విదే...
  శీయుల కుట్రగానెఱిగి చెప్పుమ దీనికి వీడుకోలికన్!
  బాయక వారు *ప్రేమికదిన* మ్మని యెంచెడి *తద్దినమ్మునన్*
  రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాయలమారి సంస్కృతి సుమా యిది! భారతభూమిపై విదే...
   శీయుల కుట్రగానెఱిగి చెప్పుమ దీనికి వీడుకోలికన్!
   బాయక వారు *ప్రేమికదిన* మ్మని యెంచెడి *తద్దినమ్మునన్*
   రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


 14. మైలవరపు వారికి రిటార్టు :) ఇవ్వాళ నారదులవారు వేగముగా తిరుగు చున్నారు :)


  మాయలమారి సంస్కృతి ప్రమాదము సూవెయటంచహో స్వదే
  శీయులు కుట్ర కుట్ర యని చెప్పెడు పల్కుల నమ్మబోకుడీ
  ప్రాయపు వారు పూనుకొని రాధన మొందెడు వేళ పైకెగ
  ద్రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. ప్రేమ పేరున వంచించు కాముకులకు
  క్రూర మృగముల కీనాడు కోర్కె మీర
  సంఘ మందున నెల్లరు సహకరింప
  ప్రేమికుల రోజు పిండము బెట్టదగును

  రిప్లయితొలగించండి
 16. రిప్లయిలు
  1. కాయమునందు భాగమిడె కామవిరోధి,సుధాబ్ధి పుత్రికన్
   బాయకనిల్పెదానెదను పావనుడాహరి, యజుండు భారతిన్
   వాయిన దాల్చె, ప్రేమయనవారిదె, కూడుచు వీడువారలన్
   రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్"

   తొలగించండి
 17. అందరికీ నమస్సులు 🙏🙏

  నా పూరణ ప్రయత్నం ..

  *తే గీ*

  ప్రేమ కొరకు నేనని వచ్చి వేటు వేయు
  అమర ప్రేమికుడిననుచు యాసిడు విడు
  బ్రతుకు నీతో ననుచు తమ పగను జూపఁ
  *"ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙏

  రిప్లయితొలగించండి
 18. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును"

  సందర్భము: వనవాసంలో రామునికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఒక మహర్షి కలియుగంలో రాబోయే ప్రేమికుల రోజును గూర్చి ఇలా చెప్పాడు.
  "రామా! కలియుగంలో యువతకు ప్రేమంటే ఏమిటో తెలియదు. తెలియకపోవటం తప్పు కాదు గాని తెలిసినట్టు నటిస్తారు. తెలియదంటే అంగీకరించరు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు.. అనే రకంగా తమ పట్టు నెగ్గించుకోవడానికే చూస్తారు గాని జ్ఞానాపేక్ష వుండదు.
  కామాన్నే ప్రేమ అనుకొని కాలక్షేపం చేస్తుంటారు. అంతా తారుమారే! కాముకుల జోరే ప్రేమికుల రోజుగా మారుతుంది.
  కటువుగా వుంటుంది కాని బుద్ధి హీనులు మాత్రమే ప్రేమిస్తారని చెప్పవచ్చు. (ఈ కామమే ప్రేమ అనుకుంటే.)
  నీవు పితృ వాక్య పరిపాలన మనే ఆదర్శాన్ని చూపించావు.. కాని కలియుగంలో యువతీ యువకులు కేవలం భౌతిక సుఖాలకోసమే తా మనుకునే రీతిలో ప్రేమలు ప్రేమించుకుంటూ తలిదండ్రు లుండగానే వాళ్ళకుకూడ పిండం పెట్టడానికి వెనుకాడరు. సతీ సుత వాక్య పాలనమే ప్రప్రధాన మైపోతుంది."
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *కాముకుల జోరు*

  "పొసగఁ దారుమారైన కాముకుల జోరు

  మీరి, తా నౌను కలినిఁ బ్రేమికుల రోజు..

  అంత సుత వాక్య పాలన మవును రామ!..

  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును.."

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  14.02.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 19. ప్రేమికులరోజుపిండముబెట్టదగును
  నాహయెంతమంచిసమస్యయయ్య యదియ
  చూచినంతనేపెద్దలుచూరుచేరి
  యెదురుచూతురుపిండము నిత్తురనుచు

  రిప్లయితొలగించండి
 20. ప్రాయమునందు పిల్లలకుఁబాయక ప్రేమనుదోమ కుట్టగా
  హేయముగాదె సంస్కృతిని హీనమొనర్చుచు సంచరించుటల్
  శ్రేయముకాదు ప్రేమికులు సేయగ ప్రేమ బజారుపాలుగన్
  రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 21. ఆయన ప్రేమ మూర్తి, మనసారగ ప్రేమికులెంతమందికో
  సాయము జేసినాడుగ, విచారము వీడి ప్రశాంత చిత్తులై,
  రోయక నేఁడు ప్రేమికుల రోజని, పిండముఁ బెట్టఁగాఁ దగున్
  బోయిన వానికిన్ పరమ పూజ్యునిగా మదిలో దలంచుచున్

  రిప్లయితొలగించండి
 22. సకల విధముల మిమ్ముల సాకెదనన
  నోటు వేయ మాయాశల నూడ కొట్టి
  రాష్ట్ర పెంపును పూర్తిగ రద్దు జేయు
  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును

  రిప్లయితొలగించండి
 23. తేటగీతి

  దేశమున్ గాచ ప్రేమతో దిక్కులందు
  శత్రు సైనిక ప్రేలుడు సంహరించ
  వత్సరంబౌచు నేటికి వగపుమివులఁ
  బ్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును

  రిప్లయితొలగించండి
 24. మిత్రులందఱకు నమస్సులు!

  శ్రేయము కాని కామమునఁ, ’జిత్తము ప్రేమనుఁ జిక్కె”నంచుఁ, దా
  నీ యిల నాత్మవంచనము నెప్పటికప్పుడుఁ జేసికొంచు, న
  న్యాయపుఁ గర్షణన్ మునిఁగి, నమ్మిన నాతిని నొంచు ద్రోహికిన్,

  రోయక, "నేఁడు ప్రేమికుల రో"జని, పిండముఁ బెట్టఁగాఁ దగున్!

  రిప్లయితొలగించండి
 25. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును"

  నా పూరణము సీసములో
  శ్రీకృష్ణుని రుక్మిణి ప్రేమించి పెళ్ళి చేసుకొన్నది. ఆది రుక్మిణి అన్న అయిన రుక్మికి ఇష్టము లేదు. చేధి రాజు శిశుపాలునికి ఇచ్చి వివాహము జేయ తలపూనుతాడు. అప్పుడు అన్నకు తెలియకుండ శ్రీ కృష్ణునితో గిరిజాంబిక ఆలయం నకు వెళ్ళి అచట నుంచి శ్రీ కృష్ణునితో వెళ్ళిపొతుంది. అది గ్రహైంచి రుక్మి వెంబడించి శ్రీకృష్ణుని నానా మాటలు పలుకుతాడు కృష్ణుడు రుక్మిని చంప బోగా రుక్మిణి అడ్దు పడుతుంది అప్పుడు అతనికి శిరో ముండనము చేయించి ఇది నీకు తగిన శిక్ష అని వదలి వేస్తాడు అవమాన భారముతో కుమిలిపోతు ఉంటాడు వత్సరముగడచిన పిదప భీష్మకుడు వేడుకలను తల బెట్టగా రుక్మి సహించ లేక తండ్రితొ పై మాటలు మాట లాడినాడు అను భావన


  చేతు వివాహమ్ము చేడి దేశపురాజు
  శిశుపాలు తోడని చెప్పి నాడ,

  నా మాటను వినక నమ్మక ద్రోహంబు
  చేసి యా రుక్మిణి చేయి కలిపి

  గొల్ల వానింటికి కోరివెడలె నాడు
  శిరమును గొరిగించి శిక్ష నీకి

  దనుచు నాకుంజేసె కినుక తోడ నవమా
  నంబు, దురాత్ముడు నంద సుతుడు,

  కొడుకు కవమానము కలుగ కొందలమ్ము
  లేదు వేడుకలను జేయ మోద మేల
  ప్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును
  వీరి కనుచు బల్కె ను రుక్మి వేగిరముగ

  కొందలము బాధ

  రిప్లయితొలగించండి
 26. పెద్దవాఁడె యీతఁడు పైడి విద్దె యందుఁ
  బనులు గానక కృశియించు వాఁడు సుమ్ము
  భార మన రాదు మీరు బంగారమునకుఁ
  బ్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును

  [ప్రేమికులరు +ఓజు = ప్రేమికుల రోజు (మేము ప్రేమికులము – మీరు ప్రేమికులరు); ఓజు = కంసాలి; పిండము = బ్రదుకుఁదెరువు]


  కాయము లెంచ రెండయినఁ గావని యాత్మలు వేఱువేఱు నా
  నీ యవనీ తలమ్మున సహించఁగ లే మెడఁబాటు నం చయో
  పాయఁగ నొల్ల కొండొరులఁ బ్రాణము లిచ్చిరి ప్రేమకోసమై
  రోయక నేఁడు ప్రేమికుల రో జని పిండముఁ బెట్టఁగాఁ దగున్

  [రోయక = వెదకక; రోజు = దినము (తద్దినము)]

  రిప్లయితొలగించండి
 27. ప్రేమ పేరిట యువతుల వెంట బడుచు
  హాని చేయు దుర్మతులకు, మానములను
  ప్రాణములను గూడి హరించు ప్రల్లదులకు
  ప్రేమికుల రోజు పిండము బెట్ట దగును!

  రిప్లయితొలగించండి
 28. మఱియొక పూరణము:

  దేహసౌందర్యమును గోరి, మోహమునను
  రేఁగి, తమ మనస్సౌందర్య రీతి వీడి,
  ఠీవిఁ గనుచు, "వ్యాలెంటైన్సుడే" నెపమున,
  వెఱ్ఱి వేషముల్వేసెడి వెంగళులకుఁ

  బ్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును!

  రిప్లయితొలగించండి
 29. ఆయతరీతినిన్ వగలుహత్తుకునట్లుగసంచరించుమా
  రోయకనేడుప్రేమికులరోజని,పిండముబెట్టగాదగున్
  కాయమువీడువారలకుకన్నకుమారుడుఖచ్చితంబుగా
  నీయవకాశమున్ మనకెయిచ్చెనుశంభుడుతీర్చయాకలిన్

  రిప్లయితొలగించండి
 30. మాయమాటలు జెప్పుచు, మానవతుల
  మాన ప్రాణముల్ చిటికెలో మట్టిగలిపి
  ప్రేమపేరిట వంచించు ఫేరవులకు
  ప్రేమికులరోజు పిండమ్ము బెట్టదగును!!!

  రిప్లయితొలగించండి
 31. వ్రాయగ ప్రేమలేఖలు చివాలున రక్తము చిమ్మినాను నా
  ధ్యేయము నీవటంచు నినదించితినో సఖి!నీదునామమున్
  రేయిపవళ్ళు వ్యర్ధమయె ప్రేమయొకింతను లేదు నీకు నే
  రోయక నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్

  రిప్లయితొలగించండి
 32. పోయిన వారికోసమని భోక్తలఁ బిల్చుచు శ్రాద్ధకర్మలన్
  జేయుటె సాంప్రదాయమది క్షేమము భావితరాల కందురే
  ప్రేయసి పిల్చెనంచు నిక పెద్దల కర్మను మానుకుందురే
  రోయక నేడు ప్రేమికుల రోజని, పిండముఁ బెట్టగా దగున్.

  రిప్లయితొలగించండి
 33. Marilyn Monroe

  ప్రాయములోన పర్వములు పంచిన మార్లిను శిల్పమద్ది ప
  ర్యాయ పదమ్ము ప్రేమకు వరమ్ముల పంట జవాన్లకీధరన్
  ధీయుతులార రండు విరితేనియ పంచి దివమ్ముకేగె *మ*
  న్రోయక ,నేఁడు ప్రేమికుల రోజని పిండముఁ బెట్టఁగాఁ దగున్

  మన్రో+అక =మన్రో అను పూజ్యస్త్రీ

  రిప్లయితొలగించండి

 34. క్రితం వారపు సమస్య దీని అజాపజా యేమన్నా తెలుసా? ఆకాశవాణి విశేషములేమిటో?

  మున్నెవరున్ను తాకుటకు ముంగల రాన్ కుదురంగలేదటన్
  మిన్నతి పోవుటేను సరి! మించరి యాతడు వచ్చి హొన్నుగా
  యన్నుల మిన్న చూపుల హయమ్మును త్రుంచగ నేలకాన్పు రా
  మన్నను పెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చగా భువిన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 35. ఇవాళ గురువు గారి ఆరోగ్యము‌ఎలా ఉన్నదో సమీక్షలు చేయలేదు

  రిప్లయితొలగించండి