26, ఫిబ్రవరి 2020, బుధవారం

సమస్య - 3292 (తులువా సద్బుద్ధి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్"
(లేదా...)
"తులువా వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా"

37 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    పలకన్ బల్పము పట్టకుండగనహో పండంటి సెల్ఫోనునన్
    కలనున్ గానని కైపదమ్ము లిడుచున్ కంగారు లేకుండనే
    తెలుగున్ నేర్పిన కంది శంకరవరా! తేనీరు నిప్పింతు పం
    తులు! వా! వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా

    రిప్లయితొలగించండి
  2. వలపించిన చెలువుడు పె
    ద్దలొప్పుదల లేక జరుగదనఁ దమ మనువున్
    విలపించుచు ప్రేయసి యనె
    తులువా! సద్బుద్ధిని నేర్పుదువ నాకిపుడున్!

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)


    కులుకుల్ మీరగ చెట్టపట్ట లిడుచున్ కొండాడి నీ రూపమున్
    చెలియల్ చేరుచు దొర్వుగట్టున రహిన్ చేదోడు వాదోడుగా
    వలువల్ వీడగ స్నానమాడగనయో వస్త్రమ్ములన్ దాచెడిన్
    తులువా! వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా

    తులువ = తుంటరి

    రిప్లయితొలగించండి
  4. పలుపూరణలే సలుపగ
    చలువదిమాశంకరార్యు సరియగు గురుగా
    దలచితి మయ్యా! మరి పం
    తులు, వా! సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

    రిప్లయితొలగించండి

  5. ( ఏకలవ్యుడు ద్రోణాచార్యునితో )
    కలనైనన్ నిను జూతునా యనుచు నా
    కంతంత సద్భాగ్యముల్
    గలవా యంచును డోలలూగె మది యో
    కారుణ్యరత్నాకరా !
    వెలుగై కౌరవ పాండుపుత్రుల ధను
    ర్విద్యాకళల్ పంచు పం
    తులువా ! వందనమయ్య ! నాకిపుడు స
    ద్బుద్ధుల్ దగన్ నేర్పుమా !
    ( కారుణ్యరత్నాకరా - దయాసాగరా ;
    పంతులువా - గురువువా )

    రిప్లయితొలగించండి


  6. పలుపలు విధముల బ్లాగ్దు
    ష్టులు,కష్టములకలిగించు చున్నారయ్యా
    తొలుదొల్తయెనలగా శ
    క్తులు! వా! సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్!


    నారదా!
    దుషటచతుషటయః
    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. పలకా బలపము పట్టక
    చిలిపి తనమ్మున చదవక చెడిపోయితినే
    సులువుగ విద్య నొసగు పం
    తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

    రిప్లయితొలగించండి
  8. అలనాటి నుండి నేనిల
    పలు సత్కార్యముల సేయు వాడను గదరా
    ఖలుకర్మమ్ములొనర్చెడు
    తులువా! సద్బుద్ధి నేర్పుదువ ? నాకిపుడున్.

    రిప్లయితొలగించండి
  9. పలురకములైన రీతుల
    జులుములను సలుపుచునుండి సొమ్మసిలితివే
    విలువలవిడు నీవొక పం
    తులువా ! సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడు ?

    రిప్లయితొలగించండి
  10. పలురకముల విశ్వాసము
    కలిగించి వదలుమనేడ్వ కరుగక తెచ్చీ
    పలుగాకులు పేలుదువా
    తులువా!సద్బుద్ధి నేర్పుదువ నాకిపుడున్

    రిప్లయితొలగించండి
  11. తలపులలో సద్భావన
    చెలువపు వర్తనను బెంచి శీల యుతుండై
    మెలిగ గ బోధించె డు పం
    తులు వా !సద్బుద్ధి నేర్పుదు వ నాకిపు డు న్

    రిప్లయితొలగించండి
  12. పలుకులములుకులు విసరుచు
    పలుమారులుఁనలకఁబూని పరుషోక్తులతో
    కలుషాత్మతఁవర్తించుచు
    తులువా! సద్బుద్ధి నేర్పుదువ నాకిపుడున్

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    వ్యభిచారకూపంలో చిక్కిన ఒక వ్యథార్త... యజమానిని ఇలా వేడుకొంటోంది....

    కలలన్ గంటిని రంగురంగులగు లోకంబున్ గనన్., మత్తు నా
    తలపున్ గ్రమ్మెను., సొమ్మునాశపడితిన్., దౌర్భాగ్యమౌ వృత్తి నీ
    వలలో చిక్కితి., పాపకూపమిది! నన్ పంపింపు మా యింటికిన్!
    తులువా! వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కలికాలమ్మిది! పోల్చనైతినకటా! కన్పట్టదే చేత గం..
      టల పంచాంగము., దానికిన్ బదులు ల్యాప్టాపుండెడిన్., వేసముల్
      పలువైవిధ్యములయ్యె., వచ్చితి ముహూర్తంబెంచుచున్., నీవు పం...
      తులువా ?! వందనమయ్య! నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  14. లలిత సుమాంజలిగురువా !
    కలిమిగ కలికియనసూయ కడుపున శిశువా
    కలగలిసిన యా ముమ్మూ
    ర్తులువా!సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడు

    రిప్లయితొలగించండి
  15. *తన భార్య నూత్నప్రయోగాల పేరిట వంటలు చేసి వడ్డిస్తుందని వలదన్న వినదని ఆమెకు సద్బుద్ధి నేర్పమని ఆమె అన్నతో మొరపెట్టుకునే భర్త మాటలుగా*


    పలురీతుల్ పరిశోధనల్ సలుపుచున్ వండించె నీ చెల్లెలే
    పలు శాకమ్ములు పాయసమ్ములును నా భార్యా శిరో రత్నమే
    వలదన్నన్ వినకుండె బావ మరి నే భక్షింపగా గల్గె వాం
    తులు, వా! వందనమయ్య నాకిపుడు, సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా.

    రిప్లయితొలగించండి
  16. అందరికీ నమస్సులు 🙏🙏

    పార్టీ లో నీతులు చెప్ప జూచిన ఒక పెద్ద మనిషితో ఒక యువకుడు ...😊

    నా పూరణ 🌹

    *కం||*

    పలువిధమగు చేష్టలతో
    కలు త్రాగిట చేరితివిగ కనుగొన లేమా?
    విలువలు మరచిన నీ గం
    *"తులు, వా! సద్బుద్ధి నేర్పుదువ, నా కిపుడున్"?*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌷🙏🌷🙏

    రిప్లయితొలగించండి
  17. పలికెన్ దానొక చట్టు స్వీయగురునిన్ భక్తిన్ సమీపించి యీ
    యిలలో మీకెన యెవ్వరిచ్చట గురూ? యివ్వానితో నేనిటన్
    జెలిమిం జేయుచునుంటి యజ్ఞుడనయా శ్రీమంత! వీడెంతయున్
    దులువా వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా.

    రిప్లయితొలగించండి
  18. పలుకునవన్నియు కల్లలు
    కలుషపు యోచనల నెపుడు గడిపెదవౌరా
    నిలకడ నెరుగని వాడవు
    తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

    రిప్లయితొలగించండి
  19. రాజసూయయాగ సభలో శిశుపాలునితో ధర్మజుడు

    బలుపున్ బల్కుచునుంటివి
    నలినాక్షుని చోరుడంచు నల్వురిలోనన్
    వెలలేని రత్నమాతడు
    తులువా!సద్బుద్ధి నేర్పుదువ నాకిపుడున్ ?

    రిప్లయితొలగించండి
  20. విలువలనెరుగక గురువుల
    కొలవక జ్ఞానము నెరుగని కుమతివి తెగువన్
    తలతువె బోధలు చేయన్
    తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    [ఒక బాలుఁడు విద్యాబుద్ధులు నేర్చుకొనఁదలఁచి, యొక యుపాధ్యాయునిఁ జేరి, చేసెడి యభ్యర్థన]

    "పలుకుల్ నేర్చితి నిన్నమొన్ననె! కనన్, బల్కుల్ సుధల్ చిల్కెడిన్!
    ’విలువౌ చేఁతలు చేయఁగాఁ దలఁచుచో, వేదాలు, సాహిత్య వి
    ద్యలు నేర్వం దగు’ నంచుఁ జెప్పి రిటఁ బెద్దల్! నీవ నేర్పించు పం

    తులువా? వందనమయ్య! నా కిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా!"

    రిప్లయితొలగించండి
  22. వలపులునేర్పితె?నీవొక
    పంతులువా?సద్బుద్ధినేర్పుదువ నాకిపుడున్
    బలువురునన్నున్ మెచ్చగ
    నలకాపురివాస!సాయి!యార్తిని నడుగన్

    రిప్లయితొలగించండి
  23. పలు శాస్త్రమ్ముల నారితేరితివి నీ ప్రజ్ఞా విశేషమ్మహా
    ఫలమౌ మా గత జన్మ పుణ్యమిది సద్భావామృతాస్వాదమున్
    విలువౌ జ్ఞానము పంచి మమ్ములను దీవింపంగ విచ్చేయు పం
    తులువా వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా

    రిప్లయితొలగించండి
  24. నా ప్రయత్నం :

    కురుక్షేత్రయుద్ధమున శ్రీకృష్ణ పరమాత్మతో పార్థుడు...

    కందం
    పలుబంధమ్ముల నెంచుచు
    నిలువఁగ లేననుచు యుద్ధ నీతిని మఱువన్
    చిలుకుచు గీతామృతపు స్మృ
    తులు వా! సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

    మత్తేభవిక్రీడితము
    వలలో జిక్కిన చేపనౌదునని సంభావించి చింతించుచున్
    బలుబంధమ్ముల నెంచుచున్ రణమునే బాయంగ నిన్వేడఁగన్
    వలదంచున్ దగ గీతఁ జెప్ప విన గీర్వాణా! కనన్ బంక్తి మూ
    ర్తులు వా! వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా!

    రిప్లయితొలగించండి
  25. రాముని ఆదేశంతో, రావణుని వద్ద లక్ష్మణుడు మంచి విషయములు తెలియగోరడం.


    మలినాత్ముడాతడైనను
    తెలియదగును నీతి గలదు తెలచుమనగ గో
    రె లలాటాక్షుని గొలిచిన
    తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్


    రిప్లయితొలగించండి
  26. మఱియొక పూరణము:

    [యుద్ధభూమిలోఁ దనను మాటిమాటికి నిరుత్సాహపఱచుచుఁ, దగని బుద్ధులు సెప్పుచున్న సారథియగు శల్యునితో, వ్యంగ్యముగాఁ గర్ణుడు పలుకుచున్న సందర్భము]

    "విలువౌ బుద్ధులఁ జెప్పుచుంటె, యిటఁ గవ్వింపుల్ వెసన్ బెంచి, పం
    తులు వోలెన్? మతిహీన! సారథిగ గంతుల్వేయుచున్, నన్ను నీ
    వలకున్ లాఁగఁగ, శల్య! న్యాయమె? చలంబా? నీవు నా స్వంత మా

    తులువా! వందనమయ్య! నా కిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా!"

    [మాతులువా=మాతులుఁడవా]

    రిప్లయితొలగించండి
  27. ఎలమిని నుండంగఁ గలసి
    మెలసి సతము నా కనుంగు మిత్రుఁడవే నా
    పలుకు లివి యేల నమ్మవు
    తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్


    కల నైనం దలఁచంగ శక్య మగునే కాంచంగ దుష్టాత్ముగా
    నల వానిం జరితంబు గన్పడుఁ గదా యత్యుత్తమంబైన య
    ట్లిలలో నమ్ముదు నేరి నట్లయిన నీవే దిక్కిఁకన్, వాఁ డహో
    తులువా, వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా

    రిప్లయితొలగించండి
  28. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "తులువా వందనమయ్య నాకిపుడు
    సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా"

    సందర్భము:
    బుద్ధిర్బలం యశోధైర్యం
    నిర్భయత్వ మరోగతా..
    అజాడ్యం వాక్పటుత్వం చ
    హనుమత్ స్మరణాత్ భవేత్
    హనుమ బాల్యంలో సూర్యుని పం డనుకొని మింగబోగా ఇంద్రుడు వజ్రాయుధంతో తాడించగా కింద పడిపోయినాడు. వాయు దేవుడు లోకాలను గాలి వీచకుండా స్తంభింపజేసినాడు. బ్రహ్మ ఇతడు భావి లోక కళ్యాణ కారకు డౌతా డని సమాధాన పరచగా దేవతలంతా తమ శక్తులను ధారపోసినారు.
    హనుమ చిన్నప్పుడు ముని కుటీరాలలో చాలా అల్లరి చేసేవాడు.
    "మునుల కృష్ణాజినంబులు వల్కలములు
    గొని వృక్షశాఖల గ్రుమ్మరుచుండి
    హోమాగ్నులార్చుచు నొగి స్రుక్ స్రువాది
    హోమసాధనములు హోమగుండముల
    నొండొండ వైచుచు..."
    (రంగనాథ రామాయణం ఉ.కాం.)
    మునులు వేగలేక పోయేవారు. దాంతో..
    "కినిసి భార్గవులు నాంగీరసు లనగ
    ననఘ తపోమూర్తు లగు మహామునులు
    నీ వెరుంగకయుండు నీ లావు ననుచు
    నీవీరు శపియించి రీతడు నంత
    నాయాశ్రమంబుల నతి శాంతవృత్తి..."
    నుండేవాడు. "ఎవరైనా గుర్తు చేస్తేనే నీ బలం నీకు గుర్తు వస్తుం" దన్నారు.
    హనుమ చిన్నప్పటి యీ విషయం గుర్తు చేస్తూ ఒక భక్తుడు ప్రార్థిస్తున్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *తులువ దేవర*

    తులువల్ పెక్కురు.. నిన్నుఁ బోలెడు మహా
    త్ముం డెవ్వ డవ్వారిలో?..
    బలమున్ బుద్ధియు నిన్నుఁ గొల్వఁ గలుగున్
    భద్రాత్మ! మున్యాశ్రమం
    బుల నీ యల్లరిఁ జెప్ప నేల? హనుమా!
    ముద్దైన బాల్యంబులోఁ
    దులువా! వందన మయ్య! నా కిపుడు స
    ద్బుద్ధుల్ దగన్ నేర్పుమా!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    26.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  29. సమస్య:

    తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్
    _________
    తెలియదుజ్యోతిషమేమన?
    తెలియదుభాగవతులనగ తెలుగువిలువయున్
    తెలియనినీవెట్లుగురువు
    తులువా ?సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

    గాదిరాజు మధుసూదనరాజు

    భాగవతోత్తముడైన నొక పురోహితుడువివాహ ముహూర్తము నిర్ణయిస్తున్న సమయంలో ఆక్షేపిస్తూ వచ్చిన
    క్రొత్తపండితుడిని నుద్దేశించి..పలికిన పలుకులు

    రిప్లయితొలగించండి
  30. అలకావారముకాముమేముమఱియయ్యారాకుమాజోలికిన్
    తులువావందనమయ్య,నాకాపుడుసద్బుద్ధుల్ దగన్ నేర్పుమా
    వెలిగాజేసిరిబంధుకోటిననునీవేళన్ రమాధీశ!యీ
    నలుసుంగావగరాగదేయిటకువిన్నాణంబులొప్పంగగా

    రిప్లయితొలగించండి
  31. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్"

    సందర్భము: అశోకవన విధ్వంస మొనర్చి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి సభ కేతెంచి సీతను రామున కప్పగించు మని బుద్ధి చెప్పిన హనుమతో రావణు డన్న మాట లివి.
    "పండ్లచెట్ల నెంత మూర్ఖుడైనా నాటి పోషిస్తాడు గాని విరుస్తాడా! పూలతోటలను చెరుస్తాడా! నీ యంత పనికిమాలిన వాడు లేడు." అన్నాడు రావణుడు.
    "తుంటరి వాడవు. నాకు బుద్ధి మాటలు చెబుతావా!.." అన్నాడు రావణుడు.
    నిజానికి హనుమంతుడు చేసిన వన్నీ ఫలితం లేని పనులే! ఫలితం కోరని పను లన్న మాట! అంటే నిష్కామ కర్మ లన్న మాట! పనికీ ఫలితానికీ ముడి వెట్టి చేసుకుంటూ పోవట మంతా లౌకికమే! ఫలితాన్ని పక్కన పెట్టి పని చేసుకుంటూ పోవటమే ఆముష్మికానికి తొలి మెట్టు. అదే నిష్కామ కర్మ యోగం. ఆ యోగాన్ని అత్యుచ్చ స్థాయిలో ఆచరించి చూపించిన వాడు ఆంజనేయుడు. లేకపోతే సీతాన్వేషణం, సంజీవనీ పర్వతం తీసుకురావటం మొదలైన ఘన కార్యాలు సాధించుకురావడాని కెన్ని రూపాయల పారితోషికం చెల్లిస్తే సరిపోతుందో!...
    సీతాదర్శనంతోనే హనుమ వచ్చిన పని అయిపోయింది. ఇక అశోకవన విధ్వంసం, రామ సందేశ మందించటం, లంకా దహనం ఇవన్నీ తాను చేస్తున్న పనికి కొనసాగింపే! (ఎక్స్టెన్షనే!)
    ఐనా రావణు డంటున్నట్టు ఇవన్నీ కాలక్షేపానికో పని లేకనో చేసిన పనులు కావు. రాక్షసుల గుండెల్లో గుబులు పుట్టించి మరీ వెళ్ళా లనుకుని చేసిన పనులు. అదీ గాక రాత్రి వేళ లంకా ప్రవేశం చేసినాడు కాబట్టి వైరిబలాన్ని పట్టణం తీరుతెన్నుల్నీ సరిగ్గా చూడలేదు. తోకకు నిప్పంటించి తిప్పినప్పుడు చక్కగా చూసి చేరవేయదగిన సమాచారాన్ని సేకరించుకున్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *యోగః కర్మసు కౌశలమ్*

    ఇలలో ఫలితము లేని ప

    నులఁ జేయుచుఁ బండ్ల చెట్లను విరిచి, పూదో

    టలఁ జెఱచు పనికి మాలిన

    తులువా! సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్!

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    26.02.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి


  32. నారదా వృత్తము వేయడానికి ఇంత సమయము తీసుకున్నావా!


    పలుకే మారెను తిట్లపర్వముగ నాపైనన్ సభాప్రాంగమం
    దు! "లు" రాదయ్యరొ! ఏడుగుర్రములజోదుండా! దినాధీశుడా!
    అలుకేలయ్యరొ భాస్కరార్య! అలుకేలయ్యా జిలేబీ కదా?
    తులువా ?! వందనమయ్య! నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. మ:

    మలుపా !నీవిటు లెట్లు మారితివొ గా ,మాకింత నాశ్చర్యమే !
    పలుకున్ మారిన నేమి నీ దుడుకు స్వాభావమ్ము యంతే నుగా
    నిలుమా, నేడిక గొంతనైన నిక గానీవయ్య మార్పున్ నినున్
    తులువా వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి