4, ఏప్రిల్ 2020, శనివారం

సమస్య - 3329 (అయ్యో మాటలు రానిదై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పలుకు రాదయ్యె నాకాశవాణి నోట"
(లేదా...)
"అయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్"

80 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    వయ్యారమ్మగు కైపదమ్ములిడుచున్ వారమ్ము నొక్కొక్కటిన్
    తయ్యారైనవి కూడబెట్టి కొలదిన్ తగ్గించి పాడింపగన్
    కుయ్యోమంచును నేడ్చుచున్ కవులహో కొట్లాడగన్ నవ్వగా
    నయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్...

    రిప్లయితొలగించండి
  2. యెల్లజనులు చిక్కాలు వాయిలకుఁ గట్టి
    మోడి రాముడు నడుపగ ముందు నుండి
    ఆజ్ఞ పాలించు కపివీరులన్గఁజెల్ల
    గాఁ గొరోన రావణు గెల్వగాసమరముఁ
    జేయు భారతావని స్థైర్యచిత్తముఁ గని
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. "ఎల్ల జనులు..." అనండి. "కపివీరు లనగ.." టైపాటు.

      తొలగించండి
    2. ఔనండీ. మొదటి వెర్షన్లో ఇది రెండవపాదం. ఈ వెర్షన్లో మొదటి పాదం ఐంది. ఆ యడాగమం లాక్ డౌన్ ముందు వచ్చిన అతిథిలా ఉండిపోయింది.

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వయ్యారమ్ముగ కారు త్రోలుచునహా బంజార హిల్సందునన్
    సయ్యాటమ్ములు రేడియోన వినుచున్ సంప్రీతినిన్ పొందగా
    కుయ్యోమంచునుబందియై గృహమునన్ కూర్చుండి బోరొందగా...
    నయ్యోమాటలురానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కారులో ఉన్న యఫ్.యం. రేడియో ఇంట్లో లేదయ్యె! హతవిధీ... మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      "కుయ్యో యంచును..." అనండి.

      తొలగించండి
  4. బెంగుళూరు వైద్యుడొకరు ప్రిన్సు ఛార్లె
    సునకు పోగొట్టగ కొరోన చూచి భరత
    దేశ స్వీయవైద్య ప్రతిభ దిగ్భ్రమంద
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దేశ స్వీయ..' అన్నపుడు 'శ' గురువై గణభంగం. 'దిగ్భ్రమనంద' అనడం సాధువు. 'దిగ్భ్రమ+అంద' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
    2. ఔఁగదా! నిద్రాసుందరియే దీనికి బాధ్యురాలు😆

      తొలగించండి
    3. "దేశ వైద్యపాటవమును, దిగ్భ్రమఁగొని" అంటే సరిపోతుంది.

      తొలగించండి
  5. సరస పూరణలందించ సరసకవులు
    చదివి వినిపించు శనివార సమయమనగ,
    చదువు వారలు జేరక సదనమునకు
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట
    కొరుప్రోలు రాధాకృష్ణారావు,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాస్తవం తెలిపారు. నిజానికి ఏప్రిల్ నెలలో నన్ను రమ్మన్నారు. ఈరోజు నాగొంతు రేడియోలో వినబడవలసింది. కాని దురదృష్టం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. (ముందే ఉన్న చెవుల కన్న వెనుకవచ్చిన కొమ్ములు మిన్న అయితే )
    "మంచిమాటలు పాటలు పంచిపెట్టి
    జనుల చెవులకు నెన్నెన్నొ చవులు నింపు
    చక్కదనముల కుప్పవే అక్క !నీవు ;
    నన్ను చెల్లిని నీవెన్క నడువనీవ ?"
    యనిన టీవీయె ముందున కడుగువేయ
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టీవీ దెబ్బకు మరుగున పడ్డ రేడియో గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  7. అట రికార్డింగులున్ లేదయా కవవిర
    కారణమ్మా కరోనాయె! కైపదముల
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట
    అరరె లేదు సమస్యల యానవాలు!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ లాకౌట్ లేకుంటే నిన్న రికార్డింగుకు వెళ్ళవలసినవాణ్ణి! ఏం చేద్దాం.. కరోనా దెబ్బ!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  8. కుయ్యోమొర్రొయటంచు వ్రాసితిమయా కొంతైన పూరించుచున్
    భయ్యా వచ్చె కరోన కూడుకొనుచున్! పాటింప కర్ఫ్యూలనే
    హయ్యారే! సరికొత్త పూరణలులేవాయెన్ సుమా శార్వరిన్!
    అయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    అయ్యెన్ నీకిక మృత్యుకాలమిదె కంసా! దేవకీగర్భమం...
    దయ్యారే! జనియించునష్టమసుతుండౌరా! నినున్ జంపునన్
    తియ్యంబల్కెను నాడు! *కోవిడు నివృత్తిన్ జెప్పనేనాడొ* నే...
    డయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ద్వాపరయుగం నాటి ఆకాశవాణి కాదు కాని కలియుగపు ఆకాశవాణి (రేడియో) రోజంతా కరోనా వార్తలే కదా చెప్పేది!

      తొలగించండి
  10. దుయ్యంబట్టుచునుండి సర్వజనులన్ దుఃఖంబులన్ ముంచుచున్
    దయ్యం బంటిన దానిబోలె సుఖముల్ స్తంభింపగా జేయు నా
    యొయ్యారిన్ దడకట్టు కాంత మహిమం బొప్పారగా మెచ్చి రి
    ట్లయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశ, వాణిన్ గనన్.


    నెయ్యం బెంచక నమ్మియున్న జనులన్ నిత్యమ్ము వంచించుటల్
    న్యాయ్యం బౌనను నారి యొక్కతె యటన్ "నష్టమ్ము వాటిల్లు నీ
    కయ్యెన్ గూలెడి కాల"మంచు నభమం దావేళ విన్పించగా
    నయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  11. సత్యమగును రాజా! నిను సంహరించు
    వాడు పుట్టినన్ బుట్టు నీ వసుధ యందు
    జాగ రూకుడ వగుము కంసా! యసత్య
    పలుకు రాదయ్యె నాకాశ వాణి నోట.

    రిప్లయితొలగించండి
  12. వెనుక చక్కగ రేడియో విన్న మేము 
    ఇపుడు వినగను సరదాగ నెప్పుడైన  
    తలచి పెట్టంగ, నాటి విధమున యొక్క        
    "పలుకు రాదయ్యె నాకాశవాణి నోట"  

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మేము+ఇపుడు' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "విధమున నొక్క..." అని ఉండాలి.

      తొలగించండి
  13. మిడిసిపడబోకుము కరోన మేది నందు
    సంహరించువాడరుదెంచు జవము గాను
    భయము వీడుడటంచు నభయము నొసగు
    *పలుకు రాదయ్యె నాకాశ వాణి నోట*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మేదిని+అందు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  14. గట్టి నిర్బంధ ముల యందు కాంక్ష తోడ
    పద్యముల నల్లి పంపి యెదురు
    చూచిరి వినగ నాసక్తి యిను మడింప
    పలుకు రాదయ్యె నాకాశ వాణి నోట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదం లో నాసక్తి చూపు చుండ అని సవరణ చేయడమైనది

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    3. సవరణ పద్యం
      గట్టి నిర్బంధ ముల యందు కాంక్ష తోడ
      పద్యముల నల్లి కవులెల్ల పంపి యెదురు
      చూచిరి వినగ నాసక్తి చూపు చుండ
      పలుకు రాదయ్యె నాకాశ వాణి నోట

      తొలగించండి
  15. ఈ కరోన రక్కసి భువి శోకమిడగ
    గృహము నుండ నుద్యోగులు గిలి యడరగ
    నాగి పోవగ కార్యము లన్నియచట
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట

    రిప్లయితొలగించండి
  16. బహు కవిత్వసమస్యలఁ బలురకాల
    పూరణములను చేయించి ముదమునందె!
    యీ కొరోన సమస్యఁ బూరించ లేక
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట!

    రిప్లయితొలగించండి
  17. తెలుపు మహిలోని వార్తలు తేటపరచు
    చిలుకు తియ్యంద నములతో చిత్ర లహరి
    కలిపి నవరసమ్ముల నాటకమ్ము పంచు
    సలుపు బాలవినోదమ్ము సరస ముగను
    పరవశింపగ జేయును *పరుషముగను*
    *పలుకు రాదయ్యె నాకాశవాణి నోట*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  18. అయ్యయ్యో! స్థిర వాసరమ్మున సమస్యాపూరణంబంచు నా
    నెయ్యంబౌ కవి యాలకించునిజమే నేడెందుకో యాపగన్
    సయ్యాటింపగనేల కోవిదది విశ్వంబంతటన్ బ్రాక నే
    డయ్యో! మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్

    రిప్లయితొలగించండి
  19. వారమునకొక్కదినమునవదలకెపుడు
    పద్యపూరణములసల్పి హృద్యముగను
    పొందెడానందమీనాడు పొందనైతి
    పలుకురాదయ్యెనాకాశవాణినోట

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందఱకు నమస్సులు!

    అయ్యారే! తొలినాఁట రేడియొఁ గనన్ హర్షంబు కల్గంగ, న
    మ్మయ్యా! యెంతటి గొప్ప వస్తు విదిరా! యంచున్మదిన్విస్మయం
    బయ్యెన్! దాని యనంతరాన మఱియింపయ్యెన్ గదా టీవి! య

    య్యయ్యో! మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్!

    రిప్లయితొలగించండి
  21. మల్లి సిరిపురం శ్రీశైలం,
    తేగీ//
    సత్యదేవుని వ్రతమున సంభవించు
    లోపములు జెప్పెను, "కరోన" లోపములను !
    జెప్పగ దెలుసు కొందురు, గొప్పదైన
    పలుకు రాదయ్యె నాకాశ వాణి నోట !!

    రిప్లయితొలగించండి


  22. వయ్యారమ్ముగ కైపదమ్ములకు భావస్ఫోరణంబైపదాల్
    పయ్యాడంగను వెల్లువై విరిసెనా వాక్కాంత కారుణ్యమై
    లయ్యాలన్ శనివారముల్ గడిచె కూలార్చెన్ కరోనాసురీ!
    అయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్


    కరోనాసురీ - పదానికి credit goes to జెజెకె బాపూజి గారు.


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. పలికె నమిను సాయానియె నెలలు వత్స
    రములుగా, జనావళి మనోరంజనమ్ము
    నిడు బినాక గీత్మాలయె నీల్గె, నతని
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట౹౹

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అమీన్ సయానీని, బినాకా గీత్ మాలాను గుర్తు చేసి నన్ను మళ్ళీ నా బాల్యంలోకి తీసుకువెళ్ళారు. ధన్యవాదాలు.

      తొలగించండి
  24. పలుకు రాదయ్యె నాకాశవాణి నోట"
    (సమస్య)

    బాధ్యతెరిగినమాధ్యమం బదికనుకను
    వార్తలువినోద మందించు వైఖరందు
    చక్కగాపలుకునుగాని చవకబారు
    పలుకు రాదయ్యె నాకాశవాణినోట.

    రిప్లయితొలగించండి
  25. క్రూరమౌ కరోన నెదరి పోరుచుండ
    సాగి పోయెడి పనులెన్నొ చతికిలబడె!
    కవివరేణ్యుల పదనగు కలము లొలుకు
    పదము రాదయ్యె నాకాశవాణి నోట!

    రిప్లయితొలగించండి
  26. గృహము జైలవ, ప్రజలెల్ల నహరహమును|
    గడుప స్థబ్దత తోడను, కాలమాగె |
    చీకటి కడుపున బడిన లోకము గని |
    "పలుకు రాదయ్యె నాకాశవాణి నోట"

    రిప్లయితొలగించండి
  27. అయ్యో యేమిటులీ యుపద్రవము విశ్వంబంత వ్యాపించెనే
    అయ్యో రాకలు పోకలన్నియునిటన్ స్తంభించెనే జూడగా
    నయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్
    అయ్యా యందరు దూరముండుటనె దూరంబౌనటీ జాడ్యమే

    రిప్లయితొలగించండి
  28. తేటగీతి
    తేటగీతి
    అక్కరోన ధాటికి నిత్యమసువులు విడ
    లక్షలాది జనులిల, విలయము గూర్చి
    తక్క నన్యమ్ము బలికెడు దిక్కులేక
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట

    రిప్లయితొలగించండి
  29. నిత్యము విధిగ పొడుపున నిక్కమైన
    సోదలన్నిటి వివరించు చుండ , నీయు
    దయముననుగూడ కొంతైవ తగ్గినటుల
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట !

    రిప్లయితొలగించండి
  30. శంకరాభరణం ...04/04/2020
    ..... శనివారం.....

    సమస్య
    **** ***
    అయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్"

    నా పూరణ. శార్ధూలము
    *** **** **

    అయ్యారే!యిదియేమి ఖర్మరొ! ప్రభో!అయ్యయ్యొ!పీడించుచున్

    దయ్యం వోలె... కరోన నాగు పడగెత్తన్.. రేడియో వారికిన్

    వెయ్యింతల్ పెరగన్ భయమ్ము..మరి ఆఫీసున్ త్యజించంగ... న

    య్యయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్"



    🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి 🌷

    రిప్లయితొలగించండి
  31. దారబందాలుమూయగజూరునుండి
    సోకెనేమొక రోనయె సుకరముగను
    చదువువారలులేమినివేదికనసు
    పలుకురాదయ్యెనాకాశవాణినోట

    రిప్లయితొలగించండి
  32. శా:

    లియ్యంబైరహొ కోవిదుల్ మిగుల నుల్లేఖిన్ప సాహిత్యముల్
    అయ్యారే కడు ప్రీతి నొంద గనమే నాపద్యమే బారగన్
    భయ్యంబేమొ కరోన గాథ వినుటై వారింప నా యాపదల్
    అయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశ వాణిన్ గనన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. చెలగి పద్యపు జిలుగులు చిలుకుచుండు
    నెలవు నేడొసగ వలసె సెలవు మనకు
    విలయమీ గతి సృష్టించె విషపు క్రిమియె
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట

    రిప్లయితొలగించండి
  34. అయ్యోమాటలురానిదైనిలిచెనీయాకాశవాణిన్ గనన్
    దెయ్యంరూపునుదాల్చియందరిమనోధైర్యంబుబోగొట్టునా
    వయ్యారాలకరోననంతముగనన్ వాగ్దేవిసూక్తంబులన్
    నయ్యా!విందురుగాకదప్పకగడున్ నాసక్తితోనెప్పుడున్

    రిప్లయితొలగించండి
  35. మృదువచన మోహనాకార హృదయ రాణి
    నన్ను దా నిష్టపడు చున్న దన్న మాట
    నచిర కాలమ్ముననె వినఁగఁ జెవులారఁ,
    బలుకు రాదయ్యె, నా కాశ, వాణి నోట

    [నాకు +ఆశ = నా కాశ]


    అయ్యో వింతగ నారి పోయె నట నాత్మానంద మయ్యన్నకుం
    దియ్యంబోఁడిని సాగనంపఁ దమినిం దేరున్ వడిం దోలుచున్
    సయ్యాటించుచుఁ జెల్లి బావలను గంసక్రూరు చిత్తమ్ము దా
    నయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిం గనన్

    [కనన్ = తెలియఁగా]

    రిప్లయితొలగించండి
  36. అయ్యారే విధినేమనందుమకటా యాకాశవాణిన్ సదా
    వయ్యాళించెడు పద్యపూరణములన్ వాక్రుచ్చగా నైతిరే
    సయ్యాటన్ విషకీటకంబు పనులన్ స్తంభింప జేసెన్ గదా
    అయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్

    రిప్లయితొలగించండి
  37. అల్లకల్లోలమొనరించినాయుదీయు
    వైరసదియేలవచ్చెనోవసుధలోన
    దండిరోగంబునీరీతిదాపురించ
    పలుకురాదయ్యెనాకాశవాణినోట.

    *యస్ హన్మంతు*

    రిప్లయితొలగించండి
  38. విధినియెదిరించు రీతులు వివరముగను
    వెవులకెక్కెడు రీతినచెప్ప మేలు
    మూకరాకలు వద్దనిముఖ్యముగను
    చెప్పుటందున గద్దించి చెప్పగాను
    పలుకురాదాయెనాకాశవాణినోట
    +++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  39. రంగుల జగతి నంతయు రమ్య గతిని

    చోద్యముగ మాన వాళికి చూపు చుండు

    టీవి యుండగ నింటను ఠీవి తోడ,

    పలుకు రాదయ్యె నాకాశ వాణి నోట

    రిప్లయితొలగించండి
  40. ధర్మ మార్గానపయనించు దండుమనది
    రుజను వోడించుశక్తుల రుజువుగలదు
    శాస్త్రపద్ధతివిడనాడు శాఖగాదు
    అట్టిగొప్పనుగాదని యల్పమైన
    పలుకురాదయ్యెనాకాశవాణినోట
    +++*++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  41. చిత్రగీతాలు సరదాలు చిన్నబోయె
    భక్తిపాటలు పద్యాలు పారిపోయె
    పగలు రాత్రియు ప్రజలంత భయపడంగ
    దయ్యపు కరోన వార్తలుదక్క వేరు
    పలుకురాదయ్యె నాకాశవాణి నోట

    వయ్యారంబగు యాంకరుల్ దమదు సుస్వాభావికంబైనన్
    సయ్యాటంపు నుడుంగులన్ వదలి విఙ్ఞానంబు నందించుచున్
    అయ్యారే!శుచిశుభ్రతల్ గొనగ సాహాయ్యంబు నర్ధించగా
    అయ్యో!మాటలురానిదై నిలిచెనీ యాకాశవాణిన్ గనన్

    రిప్లయితొలగించండి
  42. గురువు గారికి నమస్సులు.
    గగన వాణీయ శ్రోతలు కరిగి పోవ
    గణన యంత్రము లోనన్ని గారడీలు
    మాతృ భాషరాని ప్రజకు మంచి కవుల
    పలుకు రాదయ్యె నాకాశవాణి నోట.

    రిప్లయితొలగించండి
  43. శార్దూలవిక్రీడితము
    తియ్యంగన్ వినుచుంటి పాటలను ప్రీతిన్భాల్యమందంత, తా
    నయ్యెన్నేస్తము నింపుగూర్చుచు సమస్యాపూరణంబొక్కటిన్
    దుయ్యన్ జూడ కరోన! రద్దన నమోదున్ జేయ శబ్దమ్ముల
    య్యయ్యో! మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్!

    రిప్లయితొలగించండి