6, ఏప్రిల్ 2020, సోమవారం

సమస్య - 3331 (అహహా దుఃఖము వచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"
(లేదా...)
"అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్"

99 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    రహినిన్ జేయడు పూరణమ్మునయయో; రాగమ్మునన్ పాడడే
    వహవా తీరున నాశువుల్; దిగులుతో పల్కంగ నాశించుచున్
    బహుధా మార్చగ దత్తమౌ పదములన్ భావమ్ము కోల్పోవగా
    నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గుహలో దూరిన మేకపిల్ల తెరగున్ కూయంగ మెమ్మేలనున్
    మహినిన్ దున్నెడి కాసరమ్ము కరణిన్ మాట్లాడి కాట్లాడుచున్
    సహనంబొప్పక హాస్యగాని పలుకుల్ సౌమ్యమ్మునన్ సైచకే
    యహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్

    రిప్లయితొలగించండి
  3. కం//
    పలుమా టలినగ మతిచెడి
    కలఁగిరి యష్టావధానిఁ, గని జనులు సభన్ !
    కిలకిల నవ్వులు రువ్వగ
    తొలిసారిగ నేడ్చెనపుడె దోషము గలుగన్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వినగ'ను 'ఇనగ' అన్నారు. "మాటలు విన మతి చెడి" అనండి.

      తొలగించండి
  4. అందరికీ నమస్సులు 🙏🙏

    *కం||*

    పలుకగ సరదా పలుకులు
    కలతలు తీరును కరోన కష్టము వీడన్
    విలపించుచు తా పలుకగ
    *"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😊🙏😊🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పూరణ 🙏🌹🌹

      *కం||*

      పిలువక వచ్చెను యాతడు
      పలుకగ రాదని తెలిసెను పద్యమ్ములనే
      తొలి పద్యము వినినంతనె
      *"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"*!!

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏😊🙏😊🙏

      తొలగించండి
    2. సరదా పూరణ 🙏😊

      *కం||*

      తెలుగే పలుకుట తెలియదు
      తెలియదు పృచ్ఛకులనినను దేవుడె దిక్కే
      పలికిన పలుకులు వినగనె
      *"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏🙏🙏

      తొలగించండి
    3. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మొదటి పాదంలో 'వచ్చెను+ఆతడు' అన్నపుడు యడాగమం రాదు. "పిలువక యాతడు వచ్చెను" అనండి.

      తొలగించండి
    4. ధన్యోస్మి ఆర్యా ..
      శతాధిక నమస్సులు 🙏🙏🙇🙇

      తొలగించండి
  5. కులుకుచునిరతమునాతడు
    పలుకడునొకపద్యమైన ప్రతిభను జూపన్
    సులువగు వంచన యిదియని
    కలగిరి యష్టావధానిగనిజనులు సభన్
    ———————-//////
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  6. కం//
    బలముగ పృచ్ఛక వర్యులు
    బలుతీరుగ బలుకుచుండ పలుకులు రాకన్ !
    నలుదారులు మూసుకొనగ
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్ !!

    రిప్లయితొలగించండి
  7. (అసమర్థుడైన అవధాని నిర్వాకంతో ఆహ్వానించినవారి ఆవేదన )
    ఇహిహీ యంచును నవ్వునన్నిటికి ;ధా
    రేమాత్రమున్ లేదయో !
    యొహొహో !యెచ్చటి యాతడో !సరసభా
    వోక్తుల్ గడున్ శూన్యమే !
    కుహనాపండితు డీతడే !తుదకు గ
    గ్గోలే ఫలంబయ్యెనే !
    యహహా ! దుఖ్ఖము వచ్చె సభ్యులకు నీ
    యష్టావధానిన్ గనన్ .
    (కుహనాపండితుడు-కపటపండితుడు ; గగ్గోలు -కలత )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధార + ఏమాత్రము' అన్నపుడు సంధి లేదు. "ధారా ధారణల్ లేవయో" అందామా?

      తొలగించండి


  8. బలి గొని వచ్చిన క్రిమినట
    చులకన చేయక పొగడగ చోద్యంబనుచున్
    కలవరము వుంచు మదిలో
    కలగిరి యష్టావధాని గని జనులు సభన్.

    రిప్లయితొలగించండి
  9. వహవా యంచును పండితోత్తములు దైవంబంచు శ్లాఘించిరే
    గ్రహపాటో మరి కాలచక్ర మహిమో ద్రవ్యంబు లేదాయె తాఁ
    నిహ సౌఖ్యంబులు లేక దేహము విడన్ హీనంపు దైన్యంబు నే
    డహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్

    రిప్లయితొలగించండి


  10. All programs deferred


    తొలగని కరోన బాధల
    కలఁగిరి యష్టావధానిఁ, గని జనులు సభన్
    కలవర పడి వలదిపుడని
    కలచిరి వేరెప్పుడైన కానింతుమనన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. నమస్కారములు
    ఈ మధ్య కొంచం అనారోగ్యము వలన వ్రాయలేక పోతున్నాను. సోదర సోదరీ మణుల క్షేమం కోరుతూ అక్కయ్య .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. 🙏

      ఆరోగ్యమే ముఖ్యం కదా...త్వరలో కోలుకొని రండి.

      శుభాభినందనలు!

      తొలగించండి
    2. అక్కయ్యా!
      మీకు సర్వేశ్వరుడు త్వరలో స్వస్థత చేకూర్చుగాక.🙏🙏
      యజ్ఞభగవాన్. గంగాపురం

      తొలగించండి
    3. అక్కయ్యా,
      కొద్ది రోజులుగా మీ పద్యాలు రావడం లేదేమిటా అని ఆలోచిస్తున్నాను.
      ఆరోగ్యం కాపాడుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

      తొలగించండి


  12. సహనమ్మన్నది కానరాదు త్రుటిలో సంఘమ్మునే తిట్టి బో
    సి హసించున్ తన పద్యమాలికలతో చిర్రెత్తు ధాంధూంయటం
    చు హఠారంబుగ నూగిపోవును వెసన్ సోన్మాదుడై దోచగా
    నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. మహిలో నేడిట బద్యవిద్య మరుగై మందత్వముం గాంచగా
    నహహా దుఃఖము వచ్చె సభ్యులకు, నీ యష్టావధానిన్ గనన్
    మహదానందముగల్గె పిన్నయగుచున్ మాన్యత్వముం బొందుచున్
    బహుసామర్ధ్యము జూపుచుండ సభలన్ బల్రీతులన్ నిత్యమున్.

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    మహితేందూపమకీర్తిమంతుడు వచోమాధుర్యసంపన్నుడౌ
    విహితానేకవధానయాజకుడు సద్విద్యాప్రపూర్ణుండనన్
    మహిలో వీరిని నమ్మి పిల్వగ., కరోనా లాక్డవున్ వచ్చె నం
    చహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ *గనన్* !!

    కనన్ = చూచుటకు

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      నిజమే... కరోనా కారణంగా కొన్ని అవధానాలు రద్దయ్యాయి.

      తొలగించండి
  15.  వలదని చెప్పిన వినకనె  
    యలుసుగ  తా చేయ దిగెను అవధానమ్ము
    న్పలుకుల కూర్పుకు మతిచెడి     
    "కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్" 

    రిప్లయితొలగించండి
  16. మహదానంద కళా విలాసములు సమ్మాన్యప్రభా సంపదల్
    విహితాదర్శ మహోన్నతతాద్భుత వచో విన్యాస గాంభీర్యముల్
    మహి చెన్నారెడువాడు'లాక్డవును' క్రమ్మన్ రాని యవ్వేళలో
    అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  17. చెలరేగి కరోనా భువి
    నలుదెసలువ్యాప్తి నొంద నలిగిన జనులన్
    తలచుచు మలచిన కవితల
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "నలుదెసలను/కు వ్యాప్తి..." అనండి.

      తొలగించండి
  18. వలువలు చూడగ చలువులు
    పలుబిరుదులు కంకణాలు ప్రాకటమైనన్
    బలుకగ కంఠము పీలగ
    కలగిరి యష్టావధాని గని జనులు సభన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిలువరు నికపై సభలకు
      పలుకులరాణి సుతులైన! పాలకులకటా!
      పలుకగ నాంగ్లమె మేలని
      కలగిరి యష్టావధాని గని జనులు సభన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "పిలువరు సభలకు నికపై" అనండి.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా,సవరిస్తాను!

      తొలగించండి
  19. విలసిత మేధా ప్రౌఢి న్
    పలుకులలో తాండ వించె వాణి యె యనగా
    చెలరేగి కవిత లల్ల గ
    కలిగిరి యష్టావధాని గని జనులు సభ న్
    కలిగిరి =చలించిరి (శబ్దార్ధ చంద్రిక )

    రిప్లయితొలగించండి
  20. మహితంబౌ యవధాన సాహితి సదంబందున్న శూన్యంబు గాం
    చహహా దుఃఖము వచ్చె సభ్యులకు, నీ యష్టావధానిన్ గనన్
    బహుదూరంబులనుండి వచ్చితిమి, యా పాండిత్యమున్ ప్రాజ్ఞయున్
    మిహి యానందమునన్ రసించదగు, నే మీ హీన దౌర్భాగ్యమో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాంచి+అహహా' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి


  21. ఒహొహో యంచు వధాని బిల్చితిమిరో యుత్సాహమే మీఱగన్

    రహి భాషించునె..?ధారణల్‌,చతురతల్ రవ్వంత జూపించునే..?

    సహి భావమ్ములు దెల్పునే..?పలుకునే శ్రావ్యంపు రాగాలనే?

    "అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్"

    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  22. పొలిమేర దాటి వచ్చు వ
    యిళమందున రక్షకభటు లిడుముడి పెట్టన్
    పలుబాధల కోర్చెననుచు
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వయిళము' శబ్దాన్ని శబ్దరత్నాకం పేర్కొన లేదు. జి.ఎన్. రెడ్డి గారి పర్యాయపద నిఘంటువులో ఉన్నంత మాత్రాన ప్రమాణం కాదు.

      తొలగించండి
  23. అలుగుచు నది యిది లేదని
    నలుగురితో గలువననుచు నవహేళనగా
    పలుకుట జూచి యిసీ యని
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్

    రిప్లయితొలగించండి
  24. నెలవున గలవారందరు
    కలఁగిరి యష్టావధానిఁ గని ; జనులు సభన్
    నిలిపిరిగద యవధానము ,
    బలురీతినొలయు కరోస బాధ తొలగగన్

    రిప్లయితొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    [పృచ్ఛకుఁ డిచ్చిన ప్రశ్నకుఁ బద్దెమున నవధాని "సీతాదేవిని రావణుఁడు దొంగిలించి తీసుకొనిపోవుచుండఁగాఁ గాంచిన చెట్టు చేమలు దుఃఖాతిశయముతోఁ జేష్టలు తక్కినవై వానినిఁ జంపునంతటి క్రోధముతోఁ జూచినవి" యని కరుణ రసార్ద్రమైన కంఠముతో సమాధాన మీయఁగా నా యవధానినిఁ జూచిన సభ్యులకుఁ గూడ దుఃఖము వచ్చెననుట]

    అహొ! ప్రశ్నమ్మున కిత్తుఁ బద్దె మిదె; "వాఁ డంకించి కొంపోవ నా
    గృహిణిన్ సీతను, చెట్టు చేమ లట నిర్వేదమ్ముచే దుఃఖ ధూ
    ర్వహలై చేష్టలు దక్కి, రావణు దెసన్ మ్రందింపఁ జూచె"న్నన

    న్నహహా! దుఃఖము వచ్చె సభ్యులకు, నీ యష్టావధానిన్ గనన్!

    (ద్విత్వనకార ప్రయోగము పోతన ననుసరించి చేసితిని. తప్పలేదు. మన్నింపఁగలరు)

    రిప్లయితొలగించండి


  26. తొలుదొల్తగునవధాన
    మ్మిల భారతి దయ కమికిలి మెతుకుల కొరకై
    యిలువాకిలి విడిచితినన
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  27. మహనీయుండని మెత్తురందరును సామాన్యుండు గాడీతడే
    మహదానందము మాకటంచు ఘన సమ్మానమ్ము జేబూనగా
    నొహొహో దుర్విధి యీ కరోన రగిలెన్ యుత్సాహమున్ గూల్చెనే
    అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్

    రిప్లయితొలగించండి
  28. తొలిసారియగుటకతమున
    పలుకులుదడబడుచునుండిపలుమరుపలుకన్
    వలదీయవధానంబని
    గలగిరియష్టావధానిగనిజనులుసభన్

    రిప్లయితొలగించండి
  29. సహనోత్కృష్ట తమంబుగా జెలగు భా
    షావేదికన్ బ్రాశ్నికుల్
    రహి సంధించ, వికాస ధారణ సుధా
    లాపమ్ములంజూడగన్
    విహితానంద రసాద్భుత ప్రకట సం
    వీచీ లయన్ జిత్తమం
    దహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్!

    రిప్లయితొలగించండి
  30. చలమున నీయఁగ దుష్కర
    కలుష ప్రాసను వినోద ఘాత మనంగం
    గలతం జెందెడు వీనినిఁ,
    గలఁగిరి, యష్టావధానిఁ గని జనులు సభన్


    కుహనా చర్యయె పండితోత్తములు నుద్ఘోషింతు దౌర్భాగ్యమే
    సహ పీఠమ్మ లలంకరించి రిట నీశా వీని మించంగ లే
    రిహ లోకమ్మునఁ బండితబ్రువులు గాలించంగ సత్యమ్ముగా
    నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్

    రిప్లయితొలగించండి
  31. అహహాయేమనిజెప్పనోపుదునునీయాసామికాజాడ్యమా!
    యహహోదైవముకొంపముంచినదియీయష్టావధానిన్ భళా
    మహనీయుండితడారుజంబువడిదామందుండుగానుండగా
    నహహాదుఃఖమువచ్చెసభ్యులకునీయష్టావధానిన్ గనన్

    రిప్లయితొలగించండి
  32. మ:

    బహుశా నిర్వహణమ్మొనర్చుటన నొప్పారిందహోయేమదో
    కుహనా పండిత నేత రాక గని యక్కున్ జెర్చ పోగాలమై
    వహవా వేదిక నప్పగించిరట సంభాషింప తానొక్కడై
    ఆహాహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావ ధానిన్ గనన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. గురువు గారికి నమస్సులు.
    సలలిత కవితను చదివిన
    తొలగని బంధము నలరెడు తొలకరి కవిగా
    అలుపెరుగని సాహితికిన్
    కలిగిరి ,అష్టావధానగని జనులు సభన్.

    రిప్లయితొలగించండి
  34. పలుమార్పుచేర్పుల సతము
    సలుపుచు పాదముల లోన సమయోచిత ప
    ల్కులులేక తడబడ మదిని
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్

    రిప్లయితొలగించండి
  35. మరొక ప్రయత్నము.
    పలుకుల లోతున్ దెలసిన
    వలచిన పద్యసముదాయ వందే యనినన్
    తెలుగు భారత శ్రోతలు
    కలిగిరి అష్టావధానగని జనులు సభన్.

    రిప్లయితొలగించండి
  36. మూడవ పాదము సవరించడమైనది.
    తెలుగింట మధుర శ్రోతలు.

    రిప్లయితొలగించండి
  37. మత్తేభవిక్రీడితము
    ఒహొహో! యెంతటి పాండితీ గరిమ మీరుత్కృష్టులంచున్ దొలిన్
    మహనీయుండ వధాని నొక్కనిని సంభావించి, తా నంతయై
    స్పృహనే వీడుచుఁ బిల్వఁ బేరిడి సభన్ బింకమ్మునే జూపుచున్
    నహహా! దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్

    రిప్లయితొలగించండి
  38. కందం
    విలసిల్లుచు వాణికరుణఁ
    బలు దేశముల యశముఁ గొని భావజు మహిమన్
    గలుషములపకీర్తినిడన్
    గలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్!

    రిప్లయితొలగించండి
  39. మరో పూరణ ..🙏🙏

    *కం||*

    తెలుగుకు ప్రాణము బోయుచు
    నలుగురి మన్ననలు బొంది యద్భుతముగనే
    విలువలు తెలియక యిచ్చట
    *"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*

    రిప్లయితొలగించండి
  40. సహనమ్మంతయు నీరుగారి బుధుడా సంగాతి యే బిల్వగా
    గృహనిర్బంధము రోసి వీధిబయటన్ గ్రీడింపగా వెళ్ళగన్
    బహరాగాసెడు వాడొకండు గని కోపంబందు దండింపగా
    నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  41. సహజంబేగద శారదారమలొకే స్థానంబునన్ నిల్చుచున్
    సహవాసంబును జేయరన్ బలుకు,నిష్ణాతుండయున్ విద్యలన్
    గృహమందున్ గనలేముగా సిరినహో!క్రీడించగా జ్యేష్టయే
    నహహా!దుఃఖము వచ్చె సభ్యులకు నీయష్టావధానిన్ గనన్ !

    రిప్లయితొలగించండి
  42. వెలకట్టలేనితొడవులు
    మిలమిలతనువెల్లమెరిసె మేధాసూన్యున్
    పలుకులు విఫలంబాయెను
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్.

    రిప్లయితొలగించండి
  43. సహ వాసిన్ పలు మిత్రు లందు తనతో సాన్నిధ్యమే కోరు యా
    సహపాఠిన్గని కృష్ణుడా సఖుని యాసాంతం స్పృశించిన్నిడెన్
    సహపీఠంబు గుచేలుకున్ మురియుచూ సంతోషమందెన్ గదా
    అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్

    రిప్లయితొలగించండి
  44. బిలబిలలాడుచు వచ్చిరి
    పిలువగయష్టావధానవేదికకుజనుల్
    పలుకని మైకుల తీరుకు
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్

    రిప్లయితొలగించండి
  45. వహవా లిప్తనె పృచ్ఛకుండు విసురన్ ప్రశ్నన్ ప్రతిప్రశ్నమున్
    బహు రమ్యమ్ముగ నిచ్చె నా బుధుడు తా వాణీ సుతుం డెన్నగా
    సెహబా సన్నది లేరు ప్రేక్షకులలో చీ యొక్కరున్ జాలియౌ
    నహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్.

    రిప్లయితొలగించండి
  46. బలి గొని వచ్చిన క్రిమినట
    చులకన చేయక పొగడగ చోద్యంబనుచున్
    కలవరము వుంచు మదిలో
    కలగిరి యష్టావధాని గని జనులు సభన్.

    రిప్లయితొలగించండి
  47. నలతను దేహము చెడగా
    వెలిసిన దుస్తుల నడచుచు విబుధుడు రాగా
    తలచగ నాతని దైన్యము
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్

    రిప్లయితొలగించండి
  48. తెలుగు అవధాన మందున
    పలువురు పృచ్ఛకులు వివిధ ప్రశ్నలడుగగా
    తెలిసె నవధాని యజ్ఞత
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్

    రిప్లయితొలగించండి
  49. తెలుగవధానము నందున
    పలు సవరణల నొనరింప పద్యములందున్
    తెలిసె నవధాని యజ్ఞత
    కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్

    రిప్లయితొలగించండి