13, ఏప్రిల్ 2020, సోమవారం

సమస్య - 3338

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఖరహతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్"
(లేదా...)
"ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్"

51 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    నా స్వప్న వృత్తాంతము:

    మురియుచు గాంచి యెన్నికలు మోదము పొందుచు పాటపాడుచున్
    స్థిరమగు రీతి పాతుచును తీరుగ వెన్కటి రెండు కాళ్ళనున్
    వరుడగు దేశ నేతనట భారిగ నాంధ్రను తన్నినట్టిదౌ
    ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్

    రిప్లయితొలగించండి
  2. కరముల మార్కండేయుడు
    హరలింగము గౌగిలింప నంతకభీతిన్
    సరగున కాచిన శశిశే
    ఖరహతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్!

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    అఱవపు పట్నమందునను హ్లాదము నిచ్చుచు చేరు వారికిన్
    వరమగు శాస్త్ర పద్ధతిని భామయె గానము చేయుచుండగన్
    తెరచుచు పండు మోమునట తీరుగ బ్రేవని పాడబోయినన్
    ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్

    రిప్లయితొలగించండి
  4. మురియుచు డబ్బుబంచుచును,మోజులుదీర్చెడు మాటజెప్పుచున్
    పరిపరిమోసకార్యముల,పాపపుకృత్యములెన్నొజేయుచున్
    హరహరగెల్చెనాపిదప,హానిదలంచగ నెంచునేతయే
    ఖరహతిగాంచె ధన్యతను,గాలుడుప్రాణహరుండుచయ్యనన్
    +++++++++++++++++++++++
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  5. నిరతము వైరిదిట్టుచును,నిందలువేయుచు వారిపైననే
    పరిపరిమాటదప్పుచును,పాపమురైతులబాధపెట్టుచున్
    హరిహర దుష్టకార్యముల,హానిదలంచెడు తీరుగాంచియీ
    ఖరహతిగాంచెధన్యతను,గాలుడు ప్రాణహరుండుచయ్యనన్
    ++++++++++++==============
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  6. కం//
    పరమ గురుదేవ "విదుశే
    ఖర" హతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్ !
    వరమీయగ సంతసముగ
    ధరణిన స్వామిగ మెలగుచు దారిని జూపెన్ !!

    రిప్లయితొలగించండి
  7. పరుగిడి పాతాళమున స

    గరుల భసిత మెల్ల దాక కలిగె సుగతులె

    ల్లరకును , ఘనమగు హరశే

    ఖర హతి తో ధన్యుడయ్యె కాలుడలరన్


    హరశేఖర. = గంగ

    రిప్లయితొలగించండి
  8. (మహేశ్వరుని బాలమార్కండేయసంరక్షణం)
    ధర మార్కండేయుని గని
    కరుణావరుణాలయుడయి ఘనమౌ తాపున్
    ద్వరితమె యొసగిన; శశిశే
    ఖరహతితో ధన్యుడయ్యె గాలు డలరుచున్ .
    (కరుణావరుణాలయుడు -దయాసముద్రుడు ;శశిశేఖరహతి -చంద్రమౌళి దెబ్బ)

    రిప్లయితొలగించండి


  9. అరరే సామాన్యుండా
    ఖరహతితో ధన్యుఁడయ్యెఁ, గాలుఁ డలరుచున్
    చెరకు విలుకాని కాల్చెను
    పరాచకము పనికి రాదు పరమాత్మునితో!

    ఖర హతి - కామ దేవుని పోటు

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరాభరణం వాట్సప్ సమూహంలో నన్ను కూడా చేర్చండి మహాశయా ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాను.����
      9553219978

      తొలగించండి
    2. ఇప్పటికి చిక్కారు!కందివారి మహిమ!

      తొలగించండి
  10. మరుని నడతకు కుపితుడై
    రరాటమున గల నయన తెరచి చూడగనే
    మరణించె మన్మథుడు యా
    ఖరహతితో ; ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్

    రరాటము = లలాటము ( ఆం.భా)
    ఖరహతి = వేఁడిమి దెబ్బ ?

    రిప్లయితొలగించండి


  11. నరునికి రక్తి పెక్కువయె నాతుక చేరగ లేసు మూలమై
    ఖరహతిఁ గాంచె ధన్యతను, గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్
    విరివిలుకాని కాల్చె మది వీడగ ధ్యానము! నిత్యముక్తుడా
    హరుని కెడన్ పరాచకములాడుట తొయ్యలి శోభ నీయదే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. స్థిరమతి మౌనిబాలకుడు చిత్సుఖదాయక! భూతనాయకా!
    వరకరుణాసమన్విత! శుభప్రద!శంకర! నీవె దిక్కనన్
    బిరబిర జేరి గాచు శుభవేళను దండధరుండు చంద్రశే
    ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ


    మరణము తథ్యమంచు., తన మాటకు లేదెదురంచు ., గర్వసం...
    భరితుడునై యముండు దృఢ పాశము వేయ., మృకండుపట్టి శం...
    కరపదముల్ భజింపనఁటఁ గావగవచ్చిన బాలచంద్రశే...
    ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. కవగొని యుండదే మృగము కైవడి వాలము ధీవిలాసవై
    భవబిరుదాఖ్యసత్కవనబంధురసత్కవిపుంగవాళకిన్
    ప్రవిమలసార్థశబ్దరసభావచతుష్పదవిక్రమంబునన్
    కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. విరి శర రతిపతి శశిశే
    ఖర హతి చే ధన్యుడ య్యె : గాలు దలరు చున్
    గిరిసుత వివాహ మాడియు
    సుర వరులకు ముదము గూర్చి శుభము లొసంగె న్

    రిప్లయితొలగించండి
  16. వరదా  మార్కండేయుని
    కరుణను కాపాడ రమ్మిక శివా! యనగా  
    పరుగున వఛ్చిన శశిశే 
    "ఖరహతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్"

    రిప్లయితొలగించండి
  17. అరమర లెరుగని బాలుడు
    తరిగెడు నాయువు నిలుపగ తపమును జేయన్
    వరమీయగ నా శశిశే
    ఖరహతితో ధన్యుడయ్యె గాలుడలరుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కిరికిరి బెట్టెడున్ గ్రిమిని క్రిందికడంచగ రేబవళ్ళు దా
      నరమర లేకయే జనుల కాదరమొప్పగ సేవజేయుచున్
      గురిగొని ప్రాణరక్షణయె గూర్చును మోదమనెండు వైద్యశే
      ఖరహతి గాంచె ధన్యతను గాలుడు ప్రాణహరుండు చయ్యనన్

      తొలగించండి
  18. హరుని మదిని నిలిపి విడక
    స్మరియించుచు బాలుడచట జాలిగ వేడన్
    వరములొ సంగిన శశిశే
    ఖరహతితో ధన్యుడయ్యెగాలుడలరుచున్

    రిప్లయితొలగించండి


  19. అవధానీ! పృచ్ఛక చ
    క్రవర్తి కందివర శంకరార్య ప్రణతుల
    య్య విదుర ! కార్యక్రమమం
    దు విశేషమ్ములను తెలుపుదుర పదుగురికై


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవధానం అద్దిరిపోయింది!(మీ భాషలో) ప్రశంసల వరదలో చిక్కుకుని గురువుగారింకా బయట పడలేదు!ఇవాళో రేపో బ్లాగులో పద్యాలు పెడతార్లెండి!

      తొలగించండి
  20. మొర విని మార్కండేయుని
    అరయగ దానేగుదెంచెనా హరుడంతన్
    మరలెను పాశము శశిశే
    ఖరహతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్

    రిప్లయితొలగించండి
  21. శరములగొని శ్రీరాముడు
    దురితదనుజకోటినెల్లదునుమాడగనా
    కరివరదు నిశిత శరముల
    ఖరహతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్

    రిప్లయితొలగించండి
  22. మిత్రులందఱకు నమస్సులు!

    [మహాదేవుని వరం వల్ల జన్మించి, షోడశవర్షప్రాయమందే తన యాయుస్సును కోల్పోనున్న మార్కండేయుని చెంత కేఁగుదెంచిన యమునకు శివుఁడు గర్వభంగ మొనరించిన సందర్భము]

    పురహరదత్తసద్వర విభూతి మృకండమరుద్వతీయుఁడై,
    స్థిరతరదివ్యతేజుఁడయి, చిన్నిమృకండుఁడు పుట్టి, యీశ్వరున్
    వరవుడమూని, పూజనల భక్తినిఁ గొల్చుచు వాఁడు షోడశో
    త్కర పరిపాక వత్సరుఁడుఁ గాఁగనె, వచ్చియు, నప్డు చంద్రశే

    ఖరహతిఁ, గాంచె ధన్యతను గాలుఁడు, ప్రాణహరుండు చయ్యనన్!

    రిప్లయితొలగించండి
  23. తిరువడిమార్కండేయుని
    మొరవినియాశంకరుండుముదమునుగూర్పన్
    సరగుననేగినశశిశే
    ఖరహతితోధన్యుడయ్యెగాలుడలరుచున్

    రిప్లయితొలగించండి
  24. ధరలో దుష్టుల దునముగ
    హరుడు విలయముల సృజించి నంతము చేయున్
    తరుగగ తనవిధి శశిశే
    "ఖరహతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్"n

    రిప్లయితొలగించండి
  25. పురహరిని వేడు చుండెడి
    చిరుతడి ప్రాణము హరింప జేర, జముని సం
    జ్వరమున నిలిపిన శశిశే
    ఖర హతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్

    రిప్లయితొలగించండి
  26. చం:

    సరసన జేరి కన్నియను సంకట బెట్టుచు వంచుకుండొకో
    మురిపము నంద జేయుమన మూర్ఖపు మాటలు మానుమంచు తా
    పరిపరి వేడి వేగమున బంటును కోరగ రక్షణార్థమై
    ఖరహతి గాంచె ధన్యతను గాలుడు ప్రాణ హరుండు చయ్యనన్

    ఖరహతి -- వాడి దెబ్బ
    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మార్కండేయుడు మరణాన్ని జయించుట:

      చం:
      చిరమగు నాయువున్ గలుగ చిన్మయరూపుని మ్రోకరిల్లనా
      పరమ శివుండు మెచ్చి యమ పాశపు ముప్పున కడ్డు జెప్పగన్
      మరణము దూరమాయె పరమార్థము లోకము లెల్ల దేల్వ శం
      ఖరహతి గాంచె ధన్యతను గాలుడు ప్రాణ హరుండు చయ్యనన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి

  27. శరణము కాఁవుమంచు ఘన శంభుని లింగముఁ గౌగిలించె నా

    మురిపెపు బాలకుండు;కఁడు మూర్ఖత బాశముచేత కోణు సో

    దరుఁడు యముండు బాలకుని దండనఁ జేయగ నంత చంద్రశే

    ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుడు ప్రాణహరుండు చయ్యనన్"

    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  28. అందరికీ నమస్సులు 🙏🙏

    నా భారపు పూరణ యత్నం 🙏😄

    *కం||*

    గురువులు యిచ్చిన పూరణ
    బరువుగ యున్నది తెలియక భావము నాకే
    యెరిగిన జెప్పర నాకిది
    *"ఖరహతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  29. చంపకమాల (షట్పది)

    పురహరుఁ డేగుదెంచి వరపుత్రునొసంగుచు నల్పమాయువన్
    గొరతను గూర్చ సప్తఋషి కూటమి బ్రహ్మయు దీర్ఘమాయువున్
    మురియుచు నిచ్చి దీవెనల మ్రొక్కుమనంగ మహేశ్వరున్ సదా
    శిరమునఁ దాకి లింగడిని జిక్కఁగఁ బట్టుచు వేడ బాలుడున్
    దురదుర వచ్చి పాశమును దూసిన వేళ, కపాలి రాజశే
    ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్


    రిప్లయితొలగించండి
  30. మరణము సంభవించునని మాతయె శోకమునందు తెల్పగా
    శరణము జొచ్చెశంకరుని సత్కృప జూపుచు కావుమంచు నా
    చిరుతడు, పోతురౌతు యట జేరగ నాగ్రహమందు చంద్రశే
    ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్

    రిప్లయితొలగించండి
  31. మరణమ్మిక తప్పదనుచు
    ధరణికి చన బాలునిఁ గొన దండధరుండే
    వరభక్తుఁ బ్రోచు శశిశే
    ఖర హతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్

    రిప్లయితొలగించండి
  32. రిప్లయిలు
    1. హరి నారీమణి రూపం
      బరయం గోరి మదనాస్త్ర బాధితుఁ డగుచున్
      వర మోహినీ కరాబ్జ న
      ఖర హతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్

      [నఖరము =గోరు; కాలుఁడు = శివుఁడు]


      కరివర చర్మధారి విషకంఠుఁడు భర్గుఁడు భస్మదేహుఁడున్
      హరహర నామ పూజితుఁడు హంతృ భయార్దిత రక్షణక్రియా
      పరుఁడు మృకండు సూను పరిపాలన సక్త మనస్క చంద్ర శే
      ఖర హతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్

      తొలగించండి
  33. మొరవినియామృకండుశిశుమోదముగూర్చభళారెచంద్రశే
    ఖరహతిగాంచెధన్యతనుగాలుడుప్రాణహరుండుచయ్యనన్
    నరయగదైవమెప్పుడునునార్తులబ్రోవుచునుండునేగదా
    శరణనివేడువారికినిసాదరమొప్పగరక్షజేయుగా

    రిప్లయితొలగించండి
  34. రిప్లయిలు
    1. కందం
      వరమార్కండేయ సుతుని
      దరిఁ జేరుచు నుసురుఁదీయఁ ద్రాటిని విసరన్
      బరిగొన లింగని శశిశే
      ఖరహతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్

      తొలగించండి
  35. పరమ శివుండె గావలెను భర్తగయన్చు తపంబు జేయుచున్
    చరణముబట్టి వేడగను జక్కని బార్వతి నీరసంబుగన్
    మొర వినివచ్చెనీశుడును ముగ్దకు తాపము దీర్ప బూనియున్
    ఖరహతి గాంచె ధన్యతను గాలుడు ప్రాణహరుండు చయ్యనన్

    రిప్లయితొలగించండి
  36. కృష్ణకు వలువలొసంగెను
    కృష్ణుడు,సావిత్రి గూడి కిలకిల నవ్వెన్
    నిష్ణాతుండౌ యాపతి
    తృష్ణయు తీరిక వనమున దివసాంతమునన్

    రిప్లయితొలగించండి
  37. శరణము కోరగానచటశంకరుడున్ దయ జూపినంతనే
    హరుననుకంప నొందగనె యర్భకు నాయువదెల్ల హెచ్చగా
    మరణమువెన్దిరుంగగ నుమానసమందుచు మ్రొక్క చంద్రశే
    ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్"


    రిప్లయితొలగించండి