16, ఏప్రిల్ 2020, గురువారం

సమస్య - 3341

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ" 
(లేదా...)
"తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"

75 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    చనుచును రాత్రి వేళనట చంద్రుని వెన్నెల లేని రోజునన్
    తినుచును కోడి బిర్యనిని తీరుగ త్రాగి గుడుంబనున్ భళా
    ఘనమగు చౌర్యమున్ సలుప గండర గండులు సౌధమందునన్
    తనయయుఁ; దండ్రియున్ గలిసి; తల్లినిఁ; జంపిరి సంతసంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ, శుభోదయం!
      పూరణ నాకు అర్థం కాలేదు. దేనిని చంపారు?

      తొలగించండి
    2. 🙏

      చోరులు తనయను, తండ్రిని, తల్లిని సంతసంబునన్ చంపిరి అని నా భావము.

      తొలగించండి


  2. రండి చూడండి వెండితెర పయిన సిని
    మా జిలేబి హీరోయిను మాంఛి థ్రిల్ల
    రు కథ! సస్పెన్సు తుదిదాక రూఢి గాను
    తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ!


    నడిరేయి హత్య సినిమా టైటిలు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వింతేమున్నది కలియుగమ్మునన్:

    మునుపొక తండ్రినిన్ కొలిచి ముచ్చట మీరగ నచ్చచెప్పుచున్
    దినమును రాత్రినిన్ వలచి తీరును తెన్నును లేని పుత్రియే
    వినకయె తల్లి మాటలను ప్రేమను జూపగ వెఱ్ఱివానిపై
    తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్

    రిప్లయితొలగించండి


  4. మిడ్ నైట్ మర్డరర్స్ చిత్రము నేడే చూడండి :)

    మునుగడ చూచి యుండరు ప్రమోదిత నాయిక గాను థ్రిల్లరి
    ద్ది! నవల "అర్ధరాత్రి మణిదీపము" స్కంభనమైన చిత్రమి
    ద్ది!నడక తీరు చూడవలె దిమ్మడచంగ జనాళి చూతురే
    "తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ("లేడీ మేక్బెత్" వంటి దుర్మార్గురాలైన మానవదానవికి
    దగ్గరివారే వేసిన శిక్ష )
    ఘనమగు వంశమందునను
    ఘాతిని యొక్కతె జన్మనందెనే ;
    వినయము లేదు ;దేవతల
    విజ్ఞుల పూజ్యుల ధిక్కరించునే ;
    ధనమనమానహానికర
    దారుణజారిణి పీడబాపగా
    తనయయు దండ్రియున్ గలిసి
    తల్లిని జంపిరి సంతసంబునన్ .

    రిప్లయితొలగించండి
  6. తస్కరుల బారిన బడక దప్పుగొనిరి
    దండ్రి కూఁతుండ్రు ; చంపిరి తల్లినయ్యొ !
    యెంత దారుణమో యిది
    యెంచి జూడ
    వలదు యిట్టి యిబ్బంది యెవరి కయినను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలదు+ఇట్టి' అన్నచోట సంధి నిత్యం. యడాగమం రాదు. "వలదయా యిట్టి యిబ్బంది పరులకైన" అందామా?

      తొలగించండి
  7. తేగీ//
    పెద్దపులి పిల్లల నొదలి పేరుకొరకు
    తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ !
    యనిన వదలక కొట్టగా, కనులుమూసి
    జాలి,దయజూపు మికనైన జంపకనెను !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణ అర్థం కాలేదు. 'ఒదిలి' అనడం సాధువు కాదు. "పిల్లల విడిచి" అనండి.

      తొలగించండి
  8. వ్యసనపరుడయ్యి వసుధను బాధపెట్టె
    తనయ కోర్కెలు వీడక తగవులాడె
    భారమంతయు మోయంగ వలసివచ్చె
    తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ!!

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    వినయము లేదు ! పాపమను భీతియు లేదు! కుటుంబబంధముల్
    కనుమరుగయ్యె! జీవనవిలాసములే బ్రతుకయ్యె! తల్లినిం
    గన ధనవంతురాలగుట క్రౌర్యమునన్ సుఖభోగమత్తులై
    తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. ఘనతరమైన మానసిక కష్టమునందు జరించుచుండ వా
    రనునయ వాక్య జాలమున నాధిని ద్రుంచి సమాదరించి రా
    తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ, జంపిరి సంతసంబునన్ ధనగతభావనాజనిత దౌష్ట్యము లాయమ కంటకుండగన్.

    రిప్లయితొలగించండి
  11. పిల్లలను వెంట గైకొని వీధులందు
    తిరుగు చుండెడి పెట్టనా తరుణి గాంచి
    కూర కొరకంచు కోరగా కూర్మి వీడి
    తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ

    రిప్లయితొలగించండి
  12. కాని కాలము కాకున్నకలదె యెందు 
    కన్న తండ్రియే కూతును కలియుటన్న
    చాలదనియేమొ వారలు చవట తెలివి  
    "తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ"

    రిప్లయితొలగించండి
  13. కవల కూతుండ్రఁ గని భార్య కన్నుమూయ
    నమిత భార్యానురక్తుడైనట్టి వారి
    తండ్రి, కూఁఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ
    యంచుఁ బ్రేమఁ జూపడు వారియందుఁ దాను!

    రిప్లయితొలగించండి
  14. డా.బల్లూరి ఉమాదేవి

    త్రాగి వచ్చి పీడించుచు ధనము కొరకు
    పతియు,సోకుల కొరకని సుతయు సతత
    మడుగు చుండగ కాదన నాగ్రహమున
    *తండ్రి కూతుళ్ళు చంపిరి తల్లి నయ్యొ*

    రిప్లయితొలగించండి
  15. జనకు సభ లోన నుండిరి జానకి యును
    తండ్రి కూతుండ్రు : చంపిరి తల్లి నయ్యొ
    తండ్రి యాజ్ఞ ను తలదాల్చి తనయు డైన
    పరశు రాముడు జంకక పంత మూని

    రిప్లయితొలగించండి
  16. పెండ్లి చూడగ వెడలె సద్విధి యటంచు
    తండ్రి కూతుళ్లు; చంపిరి తల్లి నయ్యొ
    యింట నొంటరిఁగని కడు హేయమైన
    దుండగులు సొమ్ములను లాగి ధూర్తులగుచు.

    రిప్లయితొలగించండి
  17. శంకరాభరణం
    గురువారం...16/04/2020

    సమస్య:

    "తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"

    నా పూరణ. చం.మా.
    **** **** *

    తనయుల బిల్చిఁ బల్కె జమదగ్నియె తల్లినిఁ జంపు మంచుఁ గ్రో

    ధనమున ;నంత రాముడును ధర్మమొ కాదొ యనిన్ దలంచకే


    జనకుని యాజ్ఞ నాచరణ సల్పఁ గుఠారముఁ బూని త్రుంచెరో!


    తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"

    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "ధర్మమొ కాదొ యటంచు నెంచకే" అనండి.
      'తనయ' అని కదా సమస్య?

      తొలగించండి
  18. వినిననె చేరి రాస్పతిరి, వేదన తగ్గె, ప్రశాంతచిత్తులై
    తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ, జంపిరి సంతసంబునన్
    మనసున నిండినట్టి యల మంతనమున్, సుకుటుంబ విల్వలే
    కనబడు రీతి నిద్దరును కారణమయ్యిరి తల్లి స్వస్తికిన్౹౹

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి నమస్సులు.
    పాడు కార్యముల్ జేయగ పాపము కొని
    తండ్రి కూతుళ్ళుచంపిరితల్లినయ్యొ
    కీడు తలపెట్టు కామాంధ కీచకులను
    దేహశుద్దియుచాలదుదహనము
    సరి.
    దేశ బహిష్కరణ చట్టమున్ తెచ్చుడిలన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాలుగవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  20. పెనిమిటి వచ్చెనంచు కడు వేడ్కలు జేయుమటంచు కోరగా
    తనయను తృప్తి పర్చగను తండ్రియె సైయ్యని సంతనుండి తా
    నెనిమిది పిల్లలున్న నొక యెర్రని పెట్టను తెచ్చినంత నా
    తనయయు తండ్రియున్ గలసి తల్లిని జంపిరి సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  21. మనసుకు నచ్చినట్టి నవ మన్మథుడుండగ కాదటంచు నీ
    యనుజుని పెండ్లియాడననె యాత్మజ యందుకు సమ్మతించె నా
    పెనిమిటి, చారులోచనయె వేదన నంది విషమ్ము గ్రోలగన్
    తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  22. ఏమితప్పునుజేసెనోనేమొకాని
    తండ్రికూతుండ్రుచంపిరితల్లినయ్యొ
    తల్లిదండ్రులెపుడమినిదైవసములు
    నట్టివారినిజంపినబుట్టగతులు
    నుండవెవరికినిజమిదియొండులేదు

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    ["కూఁతురు పెండిలియై యత్తవారింటి కేఁగఁ, దండ్రి యవార్డుఁ గొనుటకై పరదేశమున కేఁగఁగా, సంతోషము పట్టలేక గుండెపోటుఁ దెచ్చుకొని యీ తల్లి మరణించెఁగదా! తండ్రీ, తనయా యిద్దఱూ మోయలేని సంతోషాన్నిచ్చి, దగ్గఱ లేకుండ వెడలి, యీమెను చంపినారుగదా!" యని యిరుగు పొరుగు టమ్మలక్కలు సంభాషించుకొనుచున్న సందర్భము]

    "తనయనుఁ బేరు, డబ్బు గల ధన్యున కిచ్చియు వేడ్కఁ బెండ్లి సే
    సినఁ దగ నేఁగెఁ! దండ్రికిని శ్రేష్ఠతమంపు టవార్డు రాఁగ, న
    ల్లనఁ గొన నేఁగె! సంతసపు వ్రేఁగునఁ దల్లికి గుండెపోటు రాన్,
    దనయ, మగండు నిద్దఱును దగ్గఱ లేక, గతించె! నయ్యయో,

    తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి, సంతసంబునన్!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాన్యులు పాలకుర్తి రామమూర్తిగారి సూచనమేరకు నొక పాదము తగ్గించి సేసిన పూరణము:

      "తనయకుఁ బెండ్లిసేయఁ, జనెఁ! దండ్రియుఁ బద్మపురస్కృతమ్ము న
      ల్లనఁ గొన నేఁగె! సంతసపు వ్రేఁగునఁ దల్లికి గుండెపోటు రాన్,
      దనయ, మగండు నిద్దఱును దగ్గఱ లేక, గతించె! నయ్యయో,
      తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి, సంతసంబునన్!"

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  24. చం:

    ఒనరువు నైజమైన సుతి నొద్దిక కూతురు తండ్రికిన్ భళా
    తనదగు రీతి పెంపకము తల్లిగ గూర్చిన గాని యెట్టకు
    న్ననునయమాడ బెండ్లి యన నమ్మిక బల్కుచు నిద్దరొక్కటై
    తనయయు దండ్రియున్ గలిసి తల్లిని జంపిరి సంతసంబునన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  25. తనయయుతండ్రియున్గలిసితల్లినిజంపిరిసంతసంబుగన్
    వినగనురోతబుట్టెనిదిప్రేమనుజూచుటపోయిచంపెనా?
    గనికరమింతయేనియునుగానగరాదె!యిదేమిపుట్టుకో
    యనయముదల్లిదండ్రులకునాదరమొప్పగసేవజేయుడీ

    రిప్లయితొలగించండి
  26. తేటగీతి
    తేటగీతి
    అల్లుని కులము వేరని హతమొనర్చి
    కన్య పగఁబూన తప్పదు ఖైదటంచు
    జీవమున్ వీడె పిత! మానసికముగ నటఁ
    దండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ

    రిప్లయితొలగించండి
  27. కాల ముత్తరింప నగునె కంజునకును
    గరుణ యొకయింత నేరక కాలు భటులు
    కర్మపరిపక్వ మైన దుఃఖమ్మువొందఁ
    దండ్రి కూఁతుండ్రు, చంపిరి తల్లి నయ్యొ


    కన విన నేర నట్టి విధిఁ గాంతునిఁ బుత్రిని సేవ లందు ముం
    చినఁ గడుఁ బ్రీతి నిత్యము సుశీల చెలంగ భృశంపు టార్తియే
    నెన రది మీఱ ముంచి యనునిత్యము వాగభిమాన వార్ధిలోఁ
    దనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్

    [నెనరు =కృతజ్ఞత; చంపిరి యన నుక్కిరిబిక్కిరి చేసిరని భావము]

    రిప్లయితొలగించండి
  28. ఈ మధ్య దినపత్రికలలో చదివిన వార్త ఆధారంగా కల్పన...

    చంపకమాల
    తనయనుఁ జూడ్ఁగన్ వరుని తండ్రియె వచ్చినఁ బెండ్లిచూపులన్
    మునుపటి ప్రేమికుండనుచు ముచ్చటఁ దల్లియె లేచిపోవుచున్
    బనిగొని యింటి గౌరవము భంగము జేయగ! స్వప్నమందునన్
    దనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి! సంతసంబునన్?

    రిప్లయితొలగించండి
  29. అష్టాచెమ్మా ఆట
    పనియది లేకయే పగలు పత్నియు పుత్రికతోడ నాటలో
    ననయము మంచిపందెముల హ్లాదమునొందుచు ముందుకేగుచున్
    కినుకనుబూను భార్యనుడికించుచు జంపుడు పందెమందునన్
    తనయయు తండ్రియున్ గలసి తల్లిని జంపిరి సంతసంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బల్లిదపు మశూచిక్రిమియె తల్లియనగ
      దానినడచగ వైద్యుండు తండ్రియయ్యె
      కనుగొనిన వాక్సిను కూతుగలసి నేడు
      తండ్రికూతుండ్రు చంపిరి తల్లినయ్యొ!

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!

      తొలగించండి
  30. పెనగొని యున్నబంధమది పేగున బుట్టెను గూతురొక్కతిన్
    కనుగొన జిత్రమౌ విధియు గాలము తీరగ వచ్చెదల్లికిన్
    వినుకొని మంచి మాటలను బెద్దలు జెప్పగ రోగిశాంతికిన్
    తనయయు దండ్రియున్ గలసి తల్లిని జంపిరి సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  31. అనయముగా వినోదమును హాస్యమునున్ వెలయించుండెడీ
    ఘనమగునట్టి బుల్లితెర క్రౌర్య విషాద కుతంత్ర ధార వా
    హినుల ఘటింపజేసె పరికించగ నందున నొక్క దృశ్యమున్
    తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్

    రిప్లయితొలగించండి
  32. ఝామురాతిరి నిదురను జారుకొనగ
    నెల్లయాత్రికుల్ రైలులో నింతలోన
    చోరులేతెంచి నగలకై, చూచుచుండ
    తండ్రి కూఁతుండ్రు, చంపిరి తల్లినయ్యొ

    రిప్లయితొలగించండి
  33. తనయభిమానపుత్రికకుదక్కపురస్కరణంబు విద్యలో
    తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్
    తనమదియుత్సహించగనుతల్లికి నాశుభవార్త చెప్పగన్
    మనసుల వానవెల్లువగ మల్లెలుపూసెను గీమునందునన్

    రిప్లయితొలగించండి
  34. గాసుపొయ్యి నాపమరచె కన్నబిడ్డ
    కాఫి పెట్ట మనగపతి కదలె నతివ
    భగ్గు మన్న మంటలబడి బుగ్గియాయె
    తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ

    రిప్లయితొలగించండి