17, ఏప్రిల్ 2020, శుక్రవారం

సమస్య - 3342

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"
(లేదా...)
"పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్"

68 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    తరువున్ చెంతను కూర్చియున్న శివునిన్ తాదాత్మ్యన్ జెందుచున్
    కరముల్ మోడ్చుచు నేను చూడగనటన్ గంభీరమౌ భక్తినిన్
    వరమౌ తీరున దాగ మూషికమహో వైనంపు లింగమ్మునన్
    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ధరలో నీకిక సూటి లేడనచు భల్ ధైర్యమ్మునన్ గొల్చుచున్
    సరియౌ రీతిని వాయుపుత్రుడనహో శస్త్రమ్ములన్ పొందగన్
    వరమౌ తీరున కాంగ్రెసున్ చెరచగన్ బంగారు రాష్ట్రమ్మునన్
    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్

    రిప్లయితొలగించండి
  3. కం//
    సంకటమగు చంద్రునిగన
    పంకజనాభుఁన కెరుకయె పాలించంగన్ !
    వంకను జూచిన భయపడు
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్ !!

    రిప్లయితొలగించండి
  4. (హరిహరనాథుడు వాలంబులు ధరించిన విలక్షణుడైన
    స్వామి అని శిష్యులకు బోధిస్తున్న గురువు)
    వరదైవంబగు చక్రి దాల్చునుగదా
    వాలంబు రమ్యంబుగా !
    పరమేశుండగు శూలికిం గలదు పో
    వాలంబు చర్చింపగన్ !
    సిరినాథుండు ధరించు "నందకమునే"
    శిక్షింప దుష్టాత్ములన్ ;
    గిరిజానాథుడు "దివ్యపాశుపతమున్"
    గేల్దాల్చు సచ్చాంతికై .
    (వాలంబు -ఖడ్గము ;బాణము )

    రిప్లయితొలగించండి
  5. జింకను చంద్రుని యందున
    శంకించక వెలుచ లన్ని సరసము లాడన్
    పంకజ ముఖిపార్వతి గని
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్

    రిప్లయితొలగించండి

  6. మైలవరపు వారి పూరణ

    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్"

    హరునిన్ జుల్కన జేయ దక్షుడట గర్వాంధుండునై ., తత్కృతా
    ధ్వరమున్ ధ్వంసము జేసె కేశము విదల్పన్ వీరభద్రుండు! శం...
    కరుడే రుద్రుడునౌను, మ్రొక్కనతనిన్ గాపాడు! లేకున్నచో
    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్!!

    వాలము... కేశము

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. లంకాదహి సామీరిగ
    శంకరుడే పుట్టెధరణి సాయపడంగా
    లెంక యవుచు రాముని కా
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్!

    రిప్లయితొలగించండి


  8. వంకర టింకర నరులకు,
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
    తంకవపు స్థాయి మెరమెర
    కుంకటి కనులకగుపడుటకు సుమా సుదతీ


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. శంకర భగవానుడు ని
    శ్శంకగఁ గలఁడు గద సృష్టి సర్వమునందున్!
    క్ష్వింకము లందున నుండెడు
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్!

    రిప్లయితొలగించండి
  10. లంకేశ దమను రాముని
    వంక నిలువ నెంచి గాలిపట్టిగఁ దా ని
    శ్శంకను జన్మించిన యా
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్.

    రిప్లయితొలగించండి
  11. లంకేశుడు గొంపోయిన
    పంకజముఖి సీత జాడ పావని దెలిపెన్
    శంకయ!? రాముని హితుడగు
    "శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"

    రిప్లయితొలగించండి
  12. వంకరబుద్ధులమనుజులు
    శంకలు సృజియించి 'టీవి' ఛానలులందున్
    వంకలుపెట్టగ నందురు
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్

    రిప్లయితొలగించండి


  13. పైన యేది కలదో క్రింద అదియే కలదు


    అరరే రావణు కుంకలార వినుడీ యాద్యంతమున్ తోక యే
    పరిశీలింపగ మిన్ను నీరు చిరియై ప్రాకట్యమైకన్బడెన్
    నరులందాత్మగ హృత్తుగా వలయమై నాట్యంబుచేసెన్ గనన్
    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. లంకను గాల్చి యయోనిజ
    సంకటమును తీర్చినట్టి సత్యుండగునా
    లంకారికి బంటతడా
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపగన్.

    శంకరుడు....శుభములను గూర్చువాడు.

    రిప్లయితొలగించండి
  15. పరమాత్ముం డొకరుండె భేదమరయన్ భావ్యంబు గాదన్న స
    త్వర మార్యోక్తికి రూప మిచ్చెను గదా బాలుండు చిత్రంబునన్
    తిరునామంబును శంఖచక్రము లటన్ దీపిల్లు శార్ఙ్గమ్ము న
    ప్పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్

    రిప్లయితొలగించండి
  16. శంకరు నంశగ రాముని
    కంకిత భావమున సేవ లతులిత రీతిన్
    గొంకక జేసెను గద యా
    శంకరునకు దోక గలదు చర్చింప న్

    రిప్లయితొలగించండి


  17. కింకరుడయ్యె దశశిరుడు
    *శంకరునకు,దోక గలదు చర్చింపంగన్*
    జంకక రావణు పురియౌ
    లంకను గాల్చెను హనుమయు లలితో నచ్చో

    రిప్లయితొలగించండి
  18. అంకము త్రేతాయుగమున
    నంకితభావంబునిల్చెహనుమంతుండై
    శంకరుడేసుందరుడన
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  19. నేటి శంకరా భరణము వారి సమస్య

    .
    శంకరునకు దోక గలదు, చర్చింపగన్


    ఇచ్చిన సమస్య కందములో నా పూరణము సీసములో



    అంజని దేవి ఒక అందమైన అప్సరస. ఆవిడ తన సుందరిని అని గర్వముతో ఒక ముని శాపమునకు గురి అయి కోతిగా పుడుతుంది. శాపము బాపు కొనుటకు శివుని గూర్చి తపస్సు చేసి అతనిని తన గర్భములో జన్మించమని అడుగుతుంది. శివుడు తాను ఆ వానర వనిత గర్భములో జన్మించి శ్రీహరి రాముడిగా అవతరించు సమయాన అతనికి సాయము చేస్తాను అని కైలాసము విడచి వెడలి పోతాడు. పతిని విడచి ఉండ లేక పార్వతి తాను కూడా వెళుతాను అని తన ప్రమధ గణములకు చెప్పగా వారు వద్దు అని వారిస్తారు.అప్పుడు పార్వతీ దేవి శివుడు వానరుడై పుడుతాడు కాబట్టి అతని వెంట నేనుండి అతని తోకలో పుడుతాను. కోతికి తోక చాలా ముఖ్యము నా శక్తి మొత్తము ఆ తోకలో ఉంచుతాను అని తన ప్రమధ గణములకు చెప్పెనను భావన


    అందగత్తె ననుచు నహముతో నంజని
    పొందెను శాపము పొలము తెంకి


    వలన, చేయంగ తపమును శూలధరుండొ
    సగె నొక్క వరమును సరస గతిని,

    మర్కట స్త్రీ గర్భ మందు జననమునొం
    దగ వెడలెను పతి, తలచ నడవి


    నట్టుడౌ శంకరునకు దోక గలదు, చ

    ర్చింపగన్ వలదు మీ రెల్ల రిపుడు



    వెడలు చుంటి కై లాసము వీడి, తోక

    ముఖ్య మందురు వానరములకు, నట్టి

    వాల మున పుట్టెదననుచు పరుల తెల్పి

    ప్రమధ గణములకు వెడలె భరణి పైకి


    పొలము తెంకి = ముని, అడవి నట్టుడు = కోతి, పరుల = పార్వతి , భరణి = భూమి

    రిప్లయితొలగించండి
  20. వంకర బుద్ధుల వాడనె
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్
    వంకలు బెట్టెడి తులువకు
    పంకిలమౌ గాదె బుద్ధి వాదంబేలా

    రిప్లయితొలగించండి
  21. నిన్నటి సమస్యకు నా పూరణ పరిశీలింప మనవి:

    దుండగములాప యత్నించి దూరమైరి
    తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ
    బండరాతి మనుష్యులు బందిపోట్లు
    యుండలేమిట్టి పాపిష్టి యూరిలోన

    రిప్లయితొలగించండి
  22. లంకా నగరము లోగల
    పంకజముఖి సీత జాడ పసిగట్టినయా
    వంకలు తెలియని భక్త వ
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్

    రిప్లయితొలగించండి
  23. వంకర టింకర మాటల
    జంకక యొకడిటు కపివలె జనులను తిరగన్
    శంకను తలచిరి యెల్లరు
    "శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"

    రిప్లయితొలగించండి
  24. శంకరు నవతార మనియు
    శంకయె వలదని నుడివిరి సారము గనగన్
    శంకరుడే హనుమ యనిరి
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్!!


    రిప్లయితొలగించండి
  25. ఎల్లపుడూ పరమేశ్వరుణ్ణి వదలకుండా వెంటవుండే భక్తగణములే వాలము అనే భావముతో......


    నిరతంబున్ తన భక్త సంతతుల సాన్నిధ్యంబునన్ వెల్గి స
    త్వరమే వారలకోర్కె దీర్చననుకంపాదృష్టి వీక్షింప భూ
    సురులున్ దేవగణంబు బాయక భవున్ స్తోత్రంబులన్ గొల్తురే
    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    [హరి హర వాహనములగు గరుడ నందీశ్వరుల సంవాదము]

    గరుడుండా శివు వాహనమ్ముఁ గనుచున్ గంభీరుఁడై వల్కె "మా
    హరికిన్ వాలము, ’చుట్టువాల్’ గలదయా!" యంచున్; వెసన్ నందియే

    "పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు! చర్చింపఁగన్,
    గరమందుంగలదోయి ’ముమ్మొనలవాల్’ గాంచంగదోయీ"  యనెన్!

    (వాలము=ఆయుధము, చుట్టువాలు=చక్రము, ముమ్మొనలవాలు=త్రిశూలము)

    రిప్లయితొలగించండి
  27. అందరికీ నమస్సులు 🙏🙏

    నా సరదా పూరణ యత్నం ..
    😄😄

    *కం||*

    వంకలు బెట్టకు హనుమది,
    బంకగ హారతి తగులగ భగవంతునికే
    బొంకుచు దెలిపితి విట్లని
    *"శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"*!!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😊🙏😊🙏
    (ఒక సినిమా సన్నివేశం ఆధారముగా ప్రయత్నము)

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు
    1. గురువు గారి సవరణతో..

      హరికిన్ మేలుగ నాభినిన్ కమల మొప్పారంగ ఫాలాక్షమున్
      పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్
      వర దుర్వార బలాఢ్యుడా హనుమకొప్పారున్ గదా సాజమే
      పరమానంద స్వరూపముల్ గనగ నొప్పై దోచు నెద్దేనియున్

      తొలగించండి
  29. శంకరుగూరిచిపలుకిటు
    శంకరునకుదోకగలదుచర్చింపంగన్
    గుంకనువోలెనుసరగున
    వంకరగామాటలాడభావ్యమె లల్లీ!

    రిప్లయితొలగించండి
  30. లంకేశున కెరిగించిరి
    కింకరులరుదెంచి, నేడు కేవలమొక కో
    తిం కాంచితిమయ్యా! యప
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్

    రిప్లయితొలగించండి
  31. హరుదేహంబున నున్నవింతయవు నాహార్యంబు వర్ణించుచున్
    వరకావ్యుండు కవిత్వమున్నుడువగా వ్యాళంబు వాలంబుగా
    పొరపాటున్ లిఖియించె వ్రాతకుడు;నాపొత్తంబు నామూలముం
    బరిశీలించిన కందిశంకరులదే మాకిచ్చె పూరింపఁగా!
    "పరమేశుండగు శూలికింగలదు పో వాలంబు చర్చింపఁగన్"

    రిప్లయితొలగించండి
  32. *తనశిష్యుడుఅడిగినప్రశ్నకు గురువుగారిసమాధానం*

    లంకనుగాల్చినదేమని
    సంకోచముచేతనడుగసద్గురుబలికెన్
    శంకేల?రామ భక్త వ
    శం కరునకుదోకగలదు చర్చింపంగన్

    *యస్ హన్మంతు*

    రిప్లయితొలగించండి
  33. పూజ్యులకు నమస్సులు🙏

    శంకరు గళమందుండెడి

    వంకర సర్పంబు జార ,వనిలో మునికిన్

    శంక కలిగి, తలచె నిటుల

    *శంకరునకు తోక గలదు చర్చింపంగన్*

    వాణిశ్రీ నైనాల

    రిప్లయితొలగించండి
  34. హరియేరాముఁడుగాభువిన్ దనుజ సంహారంబు గావించగన్
    కరుణన్ దానుజనించె మానవునిగా కౌసల్య గర్భంబునన్
    హరుడున్ రామునికండగాహనుమయై యావిర్భవింపంగ నా
    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్

    రిప్లయితొలగించండి
  35. లంకేశుఁ దునుమ భువిపై
    పంకజ నాభుడు జనించె భానుని కులమున్
    లెంకగ పుడమి జనించిన
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్

    రిప్లయితొలగించండి
  36. కం:

    బొంకులు నేర్చిన తుంటరి
    పొంకము పలుకుల పదుగురి బురిడీ జేయన్
    శంకే వలదన కలినిన
    శంకరునకు తోక గలదు చర్చింపంగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  37. శంకరాభరణం
    శుక్రవారం...17/04/2020

    సమస్య:

    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్

    నా పూరణ.
    **** **** *

    ( వాలము అనగా కత్తి అనే అర్ధమని గ్రహించుడీ...)

    ఆ దేవదేవుడు పరమేశ్వరునికి ఆ మూడోకన్ను, త్రిశూలము,కేశములు,నాగుపాము..అన్ని వాలములే అనకా కత్తులే...


    మత్తేభ విక్రీడితము
    **** **** **** ***

    అరయన్ దుష్టులఁ ద్రుంచ శంభునికి ఫాలాక్షమ్ము వాలంబె,యా

    కురులే వాలము దక్ష కంఠముఁ గడున్ ఘోరంగ ఖండించ,నా

    ఉరగమ్మౌ కద వాలమే!త్రిశిఖమే ఉష్ణీషికిన్ వాలమౌ

    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  38. గరళమ్మే గళమందు శీర్షమున నా గంగమ్మయున్ జంద్రుడున్
    గరమున్ శూలము నందివాహనము గోకర్ణమ్మె కంఠంబులో
    పరమేశుండగు శూలికే గలదు పో, వాలంబు చర్చింపగన్
    వరుణావాసము దాటినట్టి ఘనుడా ప్రాభంజికిన్ గాంచగన్.

    రిప్లయితొలగించండి
  39. అంకమున నిల్పుదురు ని
    శ్శంకను దారల నితరు లసమనేత్రుం డా
    వంక నునుచంగ దేవిని
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్


    వరసంజాతుఁడు రామ భక్తవరుఁడున్ వజ్రాంగ దుర్భేద్యుడుం
    దరుణీ రత్నవిమార్గ ణాచలిత విద్యానైపు ణోద్భాసియున్
    స్థిర సంకల్పుఁడు వాయు నందనుఁడు సందీప్తావతారమ్మునం
    బరమేశుండగు, శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్

    [శూలి = శూలము నూనిన వాఁడు (లంకలో)]

    రిప్లయితొలగించండి
  40. ధరణీశుండగువారలున్బ్రజలకాధారంబునౌయట్లుగా
    బరమేశుండగుశూలికింగలదువాలంబుచర్చింపగన్
    బరమేశుండునులోకమాతయునుగాపాడంగభూగోళమున్
    సురలున్మెచ్చగగాశికాపురపుటచ్చోటన్వసంబుండెగా

    రిప్లయితొలగించండి

  41. మత్తేభవిక్రీడితము
    "సురగంగా సతి జారుచున్ యుధృతిమై చుంబించితే భూమినిన్
    స్థిరమై నిల్పఁగ నోపునెవ్వర?" నుచున్ సేవించఁ బద్మాసనున్
    వరమై యిట్లనె నబ్భగీరధునకున్ "బంధించ జూటమ్మునన్
    బరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవుల సూచన మేరకు సవరించిన పూరణ
      మత్తేభవిక్రీడితము
      "సురగంగా సతి ధారగా నుధృతిమై చుంబించితే భూమినిన్
      స్థిరమై నిల్పఁగ నోపునెవ్వర?" నుచున్ సేవించఁ బద్మాసనున్
      వరమై యిట్లనె నబ్భగీరధునకున్" బంధించ జూటమ్మునన్
      బరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్"

      తొలగించండి
  42. శంకరుడన శుభకరుడగు
    సంకటములను దొలగించు షణ్ముఖునకునౌ
    వంకలుగల భుజగాకృతి
    శంకరునకు దోకగలదు చర్చింపంగన్

    కరమందున్ సుశిరోజమందు మరి యాకంఠమ్మునందున్ దగన్
    వరమాలాకృతి సర్పభూషలు శిరోపాదాంత సర్వాంగముల్
    పరివేష్టింపగ చూచువాడొకడనెన్ వాతాత్మజుండట్టులన్
    పరమేశుండగు శూలికిం గలదుపో వాలంబు చింతింపగన్


    రిప్లయితొలగించండి

  43. సీతతో మాట్లాడి అశోకవనమును నాశనమొనరించిన
    కోతిని రావణు ముందు ప్రవేశపెట్టినపుడు జరిగిన చర్చ :


    కందం
    పెంకితనమున వనమునకు
    సంకటమొనరించె కోతి సరి శిక్షించన్
    శంకవిడి కాల్చ వన నా
    శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్

    రిప్లయితొలగించండి
  44. ధరణిన్ పుట్టె సురల్ స్తుతించ నరవిందాక్షుండు కౌసల్యకున్
    వరపుత్రుండయి సూర్యవంశమున క్రవ్యాభుక్తి సంచారులన్
    పొరిమార్చన్, హరుడున్ జనించె భువిపై భూజాని సేవించ నా
    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్

    రిప్లయితొలగించండి
  45. లంకన యశోకవనమున
    పొంకముగల జానకమ్మ పొందునుగోరే
    వంకరబుద్ధినిగాల్చు;వ
    శంకరునకుతోకగలదు చర్చింపంగన్

    *********************
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  46. కరుణామూర్తగు మారుతే శివుడుగా గాంచుమ్ సదా మ్రొక్కుచున్
    పరమార్ధంబది గానగన్ నిరువురూ పారంగతుల్ శంకరుల్
    శరణంబన్నను శ్రీఘ్రమే సమయమున్ సాయంబు జేతుర్ సదా
    పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్

    రిప్లయితొలగించండి
  47. దయచేసి పద్యం భావం కూడా ఇస్తే బాగుంటుంది

    రిప్లయితొలగించండి