18, ఏప్రిల్ 2020, శనివారం

సమస్య - 3343

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
(లేదా...)
"మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్"

89 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    తనువున్ మానస ముజ్వలిం పగనయో తాంబూలమున్ కోరుచున్
    వినగన్ వైరసు లాక్రమించగనహో విడ్డూరమౌ రీతినిన్
    కనగన్ మూల్యము చేరగా తముల మాకాశమ్మునన్ భీతినిన్
    మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్

    రిప్లయితొలగించండి
  2. నిద్రపట్టని సరదాపూరణ..

    బుఱ్ఱయుఁ జిక్కెనె ఘనమౌ
    తొఱ్ఱను, తెలవాఱె తెలివి తొయ్యలి నాకున్
    జుఱ్ఱితి నన్ని రసమ్ముల
    "మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"

    రిప్లయితొలగించండి
  3. అందరికీ నమస్సులు 🙏🙏

    సరదా పూరణ 😄

    *కం||*

    వెర్రా పిచ్చా నీకును
    బుర్రే పని జేయ మానె బుద్దే లేదా?
    కర్రీ వలె నడిగితి విల
    *"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"*

    *కళ్యణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😄🙏😄🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరికీ నమస్సులు 🙏🙏
      మరో ప్రయత్నo😄 (భర్త భార్యతో)

      *కం||*

      సర్రున లేవ వలదు నిక
      వెర్రని తేలెగద నాకు వేయింతలుగన్
      బుర్రనె లేక పలికె నిల
      *"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో "లేవగ వలదిక । వెర్రిగ (వెర్రి+అని... సంధి లేదు)...బుర్రయె..." అనండి.

      తొలగించండి
  4. కుఱ్ఱాళ్ళకు మదము పెరిగి
    వెఱ్ఱిగ గెంతుచు ముదముగ వేడుక మీరన్
    గొఱ్ఱెలు బఱ్ఱెలు నొకదరి
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ

    రిప్లయితొలగించండి


  5. చర్రున చేయందుకొనన్
    కుర్రతనపు జ్ఞాపకాలు కూతలిడెనిదే
    గుర్రనకుమా జిలేబీ
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!



    జిలేబి

    రిప్లయితొలగించండి

  6. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తినుచున్ మ్యాగిని పూటపూట కరువై తీరొందు బిర్యాని హా
    కనుచున్ టీవిని వైరసే మనమహో గాఢంపు బోరొందగా
    పనియున్ పాటను గానకే రసన తా వైవిధ్యమున్ కోరగా
    మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్

    రిప్లయితొలగించండి


  7. చనుమా యిప్పుడె యేటివార దళముల్ సాధించి తెమ్మా జిలే
    బి! నసాళమ్మున కెక్కి కిక్కు తనరన్ పీయూషమై నెక్కొనన్!
    మునిమాణిక్యపు ధర్మపత్ని ! లలనా ముద్దార రమ్మా దరిన్
    మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. 👌

      మునిమాణిక్యపు ధర్మ పత్నులు ఇద్దరట:

      కాంతం; రాజ్యలక్ష్మి

      గూగులమ్మ చెప్పినది.

      వారి "కాంతం కథలు" మా చిన్నప్పుడు ఆంధ్ర పత్రికలో కనిపించేవి...మా నాన్నగారు మా అమ్మకు చదివి వినిపిస్తుండే వారు.

      తొలగించండి
    2. మునిమాణిక్యం వారి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. (ఒక కవి పిల్లలమఱ్ఱి పినవీరభద్రు నంతటికవి కావాలనుకొని మఱ్ఱిచెట్టు
    క్రింద కూర్చుని మఱ్ఱియాకు విస్తరిలో భుజించబోతూ భార్య దేవితో...)
    ఘనుడౌ నా పినవీరభద్రునకు పొం
    గారంగ మున్నామమై ;
    కన గంభీరత కాలవాలమగు బం
    గారంబు నిచ్చోటనే
    మనసాయెన్ గద భామినీ! తినుటకై
    మర్రాకునన్ ; వీడ్యమున్
    ఘనసారంబు జవాది కుంకుమ సుధా
    కస్తూరితో తేగదే !!
    (మున్నామము -ఇంటిపేరు ;ఘనసారము -పచ్చకర్పూరము ;సుధ -సున్నము )





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      మీ పద్యాలలో అఖండయతిని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటాను (మొదటి పాదంలో)
      'ముందు+నామము=మున్నామము' సందేహమే!

      తొలగించండి
  9. సమస్య :-
    "మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"

    *కందం*

    గుఱ్ఱము పై దుష్యంతుడు
    తుఱ్ఱు మని శకుంతల కడ దొరకొని పోయెన్
    మఱ్ఱాకుల భోజనమును
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
    ............‌‌.✍చక్రి

    రిప్లయితొలగించండి
  10. కం//
    వెఱ్ఱిగ దిరుగుచు నీడన
    కొఱ్ఱల బువ్వను గుడుచుచు కోనలనుండే !
    బఱ్ఱెలు గాయుచు నత్తఱి
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నీడను... కోనలలోనన్" అనండి. (ఉండే... వ్యావహారికం)

      తొలగించండి
  11. కుర్రాటలాడబోకుము
    వెర్రామనసేడబోయె వేవేవిధముల్
    జుర్రితిమాంసాహారము
    మఱ్ఱాకునవిడెముదినగ మనసాయెసఖీ
    ——————————-
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి


  12. చర్రున‌ బ్రాకె జనాళిని
    బర్రున నింట పడవేసె పడతి జిలేబీ
    వర్రీ కరోన వేళని
    మఱ్ఱాకున విడెముఁదినఁగ మనసాయె సఖీ!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  13. అర్రులు చాచిరి సుమ్మీ
    చిర్రావూరి విదురులు, బుచికియు, జిలేబీ
    జుర్రుకొనంగరసములా
    మఱ్ఱాకున విడె ముఁదినఁగ మనసాయె సఖీ!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బుచికి' ఎన్నాళ్ళకు కనబడింది!

      తొలగించండి
  14. జుఱ్ఱితి పాయసమంతను
    మఱ్ఱాకున , విడెముఁ దినఁగ మనసాయె సఖీ !
    గుఱ్ఱు పడక నీవిచ్చిన ,
    నెఱ్ఱనగును నాదు జిహ్వ యెంతయొ రహిగన్

    రిప్లయితొలగించండి

  15. పాపం! లాక్ డౌన్ మహాత్యం బిది సుమా...!
    ☺️☺️☺️ 😊😊😊

    మత్తేభము
    **** ******

    పనియున్ పాటయు లేక రే బవలు గొంపన్ నిల్చి యున్నందుకున్!

    మనసే ఖాళిగ నుండి క్రుళ్ళి మిగులన్ మారెన్ కదా యయ్యయో!

    వినవే కల్గెను బిచ్చి పట్టి మదికిన్ వేయౌ వికారమ్ములే

    మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్"

    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    కనులా చూడగ తింత్రిణీదళములై కన్పట్టునెంతెంతయో!
    చనులా ఎండిన రేగుపండ్లన రసస్యందుల్., కరమ్ముల్ గనన్
    నునుపౌ మెత్తని మఱ్ఱియాకులు., నినున్ పొందంగ నా భాగ్యమే!
    మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱాకునన్ వీడ్యమున్"

    (మఱ్ఱాకునన్... నీ చేతితో)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. పరమాశ్చర్యకరప్రతాపభయదప్రజ్వల్యమానోల్లస
    త్ఖరఫాలాక్షము పుష్పబాణహననోద్గారోష్ణసంపూరమై
    పరమేశుండగు శూలికిం గలదు పో, వాలంబు చర్చింపఁగన్
    మరుదంగోద్భవవీర్యసంగతహనూమద్ధీరుకున్ శోభిలెన్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది.
      'ధీరునకున్' అనడం సాధువు కదా?

      తొలగించండి
  18. కం//
    దర్రాలో దిరుగు నపుడు
    వెర్రిగ నాకలి గలుగగ వేచితి వక్కన్ !
    సుర్రన మండే సున్నము
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ !!

    రిప్లయితొలగించండి
  19. సరిజేసితిని గురూజీ 🙏
    కం//
    వెఱ్ఱిగ దిరుగుచు నీడను
    కొఱ్ఱల బువ్వను గుడుచుచు కోనలలోనన్ !
    బఱ్ఱెలు గాయుచు నత్తఱి
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ !!

    రిప్లయితొలగించండి
  20. మర్రాకునవడ్డించుము
    వెర్రిగనావైపుజూచివేదనబడకే
    కుర్రతనమదెగుర్తొచ్చెను
    మర్రాకునవిడెముజేయ మనసాయెసఖీ
    +++++++++++++++

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. బుఱ్ఱకు నీ బుద్ధి యొదవ
    జుఱ్ఱుచు నెఱిఁ బాయసమును సుష్టుగు రీతిన్
    కొఱ్ఱల బువ్వ భుజించితి
    మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"

    రిప్లయితొలగించండి
  23. ముఱ్ఱావు నేతి, పెరుగును
    కొఱ్ఱన్నము కొసరి కొసరి కోమలి ప్రేమన్
    బొఱ్ఱను నింపెను నేడిటు
    మఱ్ఱాకున; విడెముఁ దినఁగ మనసాయె సఖీ

    రిప్లయితొలగించండి
  24. చిఱ్ఱెత్తించెనుబంధన
    ఎఱ్ఱగబండించునాకుఇలలోకరువై,
    మఱ్ఱాకేభోజనమన
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  25. అర్ధరాత్రి 12 కు సమస్య schedule అయితే.....
    అర్ధరాత్రి 12.15 నుండే పూరణలు మొదలు !
    ఈ కవులు నిద్ర పోరా ?

    జనులే నిద్దుర బోవువేళ బిగితో జాలంబునన్ పద్యముల్,
    ఘనమౌ రీతిన పోస్టుజేసి,నలయంగా పండితశ్రేష్ఠుడున్
    గని,తా నిద్దుర లేపి భార్య నడుగంగా దల్చెనే! శూరుడే!
    "మనసాయెన్ గద!భామినీ!తినుటకై మఱ్ఱాకునన్ వీడ్యమే!"

    రిప్లయితొలగించండి
  26. బిఱ్ఱుగ రైకన్ గట్టిన
    వెఱ్ఱి మరదలా తినుమిది ప్రేమగ నీకై
    కొఱ్ఱీనె జున్ను దెచ్చితి
    మఱ్ఱాకున, విడముఁ దినఁగ మనసాయె సఖీ!

    రిప్లయితొలగించండి
  27. చిర్రావూరిం టల్లుడు 
    చర్రున సైకిలు నడుపుచు సతి యిలు చేరెన్ 
    కొర్రల బువ్వ తిని యడిగె 
    "మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"  

    రిప్లయితొలగించండి
  28. కొఱ్ఱలు తమిదలుపచ్చివి
    మఱ్ఱాకులుతిన్న చాలుమగధీ రుడవౌ
    కుఱ్ఱకు చెప్పగ వైద్యుడు
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. కొఱ్ఱలు తమిదలుపచ్చివి
      మఱ్ఱాకులుతిన్న చాలుమగధీ రుడవౌ
      కుఱ్ఱకు చెప్పగ వైద్యుడు
      మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!

      తొలగించండి
  29. గుఱ్ఱున దే న్చె భుజించియు
    మ ర్రా కున : విడెము ది న గ మనసా యె సఖీ
    సర్రున నందించు మనుచు
    న ర్రు లు చాచుచు నడిగె న మాంత ముగను దాన్

    రిప్లయితొలగించండి
  30. కుఱ్ఱదనమ్మున విడెమున
    వఱ్ఱగ జర్దాను గలిపి బావకు నిడగా
    బుఱ్ఱ దిరిగె నది దిని యనె
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ

    రిప్లయితొలగించండి
  31. శ్రీకృష్ణ తులాభారం తర్వాత పరమాత్మ సత్యా దేవతో...


    మత్తేభవిక్రీడితము
    నను నీ వానిగఁ గూర్చె నీ తులసి నందంబంద సత్యా! సతీ!
    ప్రణుతుల్ పొందెడు రీతి విందునిడి నే రంజిల్లగా జేసితే
    తనరన్ మఱ్ఱి దళమ్ము మాతయొడి శ్రాంతంబంద, నీవీయఁగన్
    మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్, వీడ్యమున్

    రిప్లయితొలగించండి
  32. సర్రున లేచెను ప్రియసతి
    బుర్రయె లేకను పలుకగ పురుషుడు కేళిన్
    వెర్రికి వేల తలలనన్ |
    "మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"

    రిప్లయితొలగించండి
  33. మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
    (సమస్య)
    కం:
    జుర్రితిపాయసమిప్పుడు
    మఱ్ఱాకున; విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
    ఎర్రగపెదవులుపండఁగ
    జుర్రెదనీయధరములను సుతిమెత్తంగా!

    రిప్లయితొలగించండి
  34. చిన్నతనములో సెలవులలో గేదెలను కాసేటప్పుడు, దానిమీద స్వారి చేస్తూ సాయంత్రం గుళ్ళో మఱ్ఱాకున తిన్న ప్రసాదము గుర్తుకు వచ్చింది.
    ఇఱ్ఱి వలె పరుగు లెత్తెడు
    బఱ్ఱెలపై స్వారి సలిపి వనముల లోనన్
    కొఱ్ఱల పొంగలిఁ గుడిచితి
    మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!

    రిప్లయితొలగించండి
  35. గురువు గారికి నమస్సులు.
    తొర్రన్ రసాధి మధువున్
    వెర్రిగ దొరకన్ జిహ్వాశ వెంకటనారీ
    పుర్రెకు తోచెను, గలదీ!
    మర్రాకున, విడెము దినగ మనసాయ సఖీ.

    రిప్లయితొలగించండి
  36. మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్,
    తినుబండారము లన్నమున్ పెరుగు చద్దిన్ తాటియాకున్, సల
    క్షణ పైక ప్పరిటాకుచే, జలుబు కోసం బెంగిలాకున్, సనా
    తన ధర్మంబిది కాదె? తీర్చు మిలఁ ఛందంబున్ నిరాటంకమై౹౹

    రిప్లయితొలగించండి
  37. వెఱ్ఱా యేమనిబలికెదు
    మఱ్ఱాకునవిడెముదినగమనసాయెసఖీ!
    మఱ్ఱాకునుదిందురె విడెముగ?
    బుఱ్ఱుందా నీకుచెపుమభూతపిశాచీ!

    రిప్లయితొలగించండి
  38. కుఱ్ఱుచు కొఱ్ఱుల మందను
    కుఱ్ఱఁడు గాచె మఱలించె; కునుకును దీసెన్
    సఱ్ఱున మేల్కొని పల్కెను
    మఱ్ఱాకున, విడెముఁ దినఁగ మనసాయె సఖీ!

    రిప్లయితొలగించండి
  39. మిత్రులందఱకు నమస్సులు!

    [ప్రేయసీ ప్రియుల సరస సంభాషణము]

    "ఘనురాలా! యిటు రమ్ము! లోక మిటులన్ గణ్యంబుగా నీ గరో
    నను మున్గెన్! దగులమ్ము వద్దు! కనఁగన్ నాకిప్పు డీ వియ్యెడన్
    దినఁగా నన్నియు మఱ్ఱియాకున నిడన్, దిందుం గదే! యట్టులే

    మనసాయెన్ గద, భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్."

    రిప్లయితొలగించండి
  40. కొఱ్ఱన్నము, పప్పు పులుసు
    నెఱ్ఱెఱ్ఱని యావకాయ యింపేపారన్
    జుఱ్ఱు కొనుచు తింటి కదా !
    మఱ్ఱాకున ; విడెముఁ దినఁగ మనసాయె సఖీ!
    ****
    సాధారణంగా విస్తరి మోదుగాకులతో కుట్టుతారు.
    కాని యీ విస్తరి మఱ్ఱాకులతో కుట్టినది.

    రిప్లయితొలగించండి
  41. పూజ్యులకు ప్రణామాలు🙏
    నా పూరణ....
    కం"

    కుర్రతన మున మగడనియె
    వెర్రిగ సరసంబులాడి వేడుక పొందన్
    జుర్రెద పాయసము, పిదప
    మర్రాకున విడెము దినగ మనసాయె సఖీ!

    వాణిశ్రీ నైనాల

    రిప్లయితొలగించండి




  42. కొర్రల బువ్వను తినియెద
    మర్రాకున, విడియము దిన మనసాయె సఖీ
    సర్రున తెమ్మిక నేనా
    మర్రాకులవిస్తరందు మరువక తిందున్.

    రిప్లయితొలగించండి
  43. కుర్రతనపుచేష్టితముగ
    కర్రాబిళ్ళాటలాడుకాలము మదిలో
    వెర్రిగకదలాడెనిపుఁడు
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!

    రిప్లయితొలగించండి
  44. వినయంబుందున వేడుచుంటి వినవే విద్యాధికుండన్ గదా
    నను నీ భర్తగ స్వీకరించ యనుమానంబేల, నీపైననే
    మనసాయెన్ గద భామినీ, తినుటకై మఱ్ఱాకునన్ వీడ్యమున్
    కనలేదెప్పుడు పిచ్చిదాన, యదినాకందింపగా నేలనే.

    రిప్లయితొలగించండి
  45. మనసాయెన్గదభామినీ!తినుటకైమఱ్ఱాకునన్వీడ్యమున్
    మనసాయేననిపల్కగాదగదునీమానంబునేమాయెనే?
    కొనగాశక్యముగాదుగానిపుడయేకోశానదాంబూలమున్
    వినుమాతమ్మునునాహరించుటనునేవేళంవిసర్జించుమా

    రిప్లయితొలగించండి
  46. ఎఱ్ఱఁగఁ బండ వలెఁ జుమీ
    గిఱ్ఱునఁ దే తములపాకు క్రిందం గలదా
    యఱ్ఱనఁ బొడవున మించును
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!

    [మఱ్ఱాకును +అ = మఱ్ఱాకున ; మఱ్ఱాకునే; అఱ్ఱ = పెట్టె యఱ]


    కనకభ్రాజిత కుండలా సరస శృంగారోజ్జ్వ లాస్యా సఖీ
    నినదప్రస్ఫుట కింకిణీ గురుకుచా నీరేజ పత్రేక్షణా
    వనజాస్యా మద మత్త నాగ గమనాభా పెట్టుమా సున్నమున్
    మనసాయెన్ గద భామినీ! తినుటకై, మఱ్ఱా కునన్, వీడ్యమున్

    రిప్లయితొలగించండి
  47. అనయంబీరజతంపు పళ్ళెరమునందన్నంబు భోంచేయగా
    కనలెన్ నామది మార్పుగోరినది నాకన్నంబు నీవేళలో
    మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్, వీడ్యమున్
    కొనితెమ్మిప్పుడు మర్రియాకుననునాకోసంబు బింబాననా

    రిప్లయితొలగించండి
  48. జుర్రితి జీకుల రసమును
    గుర్రును కొట్టుటకు కొంత గుట్కాతింటిన్
    వెర్రినిగానులె క్రొత్తగ
    మర్రాకున విడెముదినగ మనసాయె సఖీ!

    వినగా నేడిట వ్యాధిబాపుటకు బ్రావీణ్యంపు వైద్యంబహో
    తినుటే శాకపుభోజనంబు నదియున్ దివ్యంపు పర్ణంబునన్
    మనసాయన్గద భామీనీ!తినుటకై మర్రాకునన్;వీడ్యమున్
    గొనిరావే నవనాగవల్లికలతో కొంగ్రొత్త చూర్ణంబుతో

    రిప్లయితొలగించండి
  49. తనలో రేగిన భావముల్ మనసు నందాకంగ రంజిల్ల జే
    సిన పద్మాక్షిని జూడగన్ భయముగా శ్రీఘ్రంబె గేహంబుకున్
    జని రమ్మంటును బిల్వగన్ వెడల భోజ్యంబివ్వ నూహిం చెనో
    మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్

    రిప్లయితొలగించండి
  50. కం:

    గొఱ్ఱెల మేపుచు గడుసరి
    అఱ్ఱులు జాచుచు గుసగుస యభిరతి దెలుపన్
    చిఱ్ఱన, నాసతికి దెలుపె
    మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  51. అనయమ్మున్ తిరుగాడుచున్ మనసునన్ ధ్యానించుచున్ తృప్తిగా
    ఘనమౌ నీదగు సన్నిధానమున నేకన్గొంటి స్వర్గమ్మిలన్
    గొననారోగ్యము వెజ్జుపంపునను నీకోర్కెన్, నిరూఢమ్ముగా
    మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్

    రిప్లయితొలగించండి