20, ఏప్రిల్ 2020, సోమవారం

సమస్య - 3345

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్"
(లేదా...)
"శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్"

79 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    November 1984:

    తవులుచు వింతలన్నియును దాగుచు చూడగ భూమినందునన్
    చవిగొని యింద్రుడాదటను జంకక చేరగ హస్తినమ్మునన్
    నవనవలాడు మోమునను నాజుకు నిండిన నిందిరమ్మదౌ
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    April 2020 Lockdown:

    తవులుచు వింతలన్నియును దాగుచు చూడగ భూమినందునన్
    చవిగొని యింద్రుడాదటను జంకుచు చేరగ హైద్రబాదునన్
    నవనవలాడు తల్లమున నాజుకు నిండిన సాగరమ్మునన్
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్

    శవము = జలము

    రిప్లయితొలగించండి
  3. అవలీలగ గోవర్థన
    ము వేలికొసపైన నిల్పి పురవాసులఁ గా
    చ విశేషలీలనా కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్

    రిప్లయితొలగించండి
  4. నవనవలాడగా నచట నాశముగోరెనురాజధానికే
    కువకువలాడు రైతులికకుందగజేసిరి వైభవమ్ముతో
    దివసముజూడనెంచిరిక దివ్యపు ధామముజంపుయూహకే
    శవవిభవంబుజూడగనె శక్రుడుభీతిలెమేన్వడంకగన్
    ++++++++++++++++++++==++=====+
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  5. సమస్య :-
    "శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్"

    *కందం**

    భువన హిరణ్యకశిపుడుని
    దివి పంపిన నరసింహ దేహము తోడన్
    నవ రూపముపొందిన కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్
    ..................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భువిలో హిరణ్యకశిపుని । దివికంపినయట్టి నృహరి దేహము..." అనండి. రెండవ పాదంలో గణభంగం.

      తొలగించండి
  6. కం//
    జవసత్వంబుల తోడన్
    వివాద వృత్తాసుర వర, వికృతాంశముతో !
    హవనము నందున జన కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్ !!

    రిప్లయితొలగించండి


  7. అవలీలగ లేపుచు నా
    నవనీ ధరమును చిటికెన నందకుమారుం
    డవధారముగ నిలుప కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. జవమునరండు నాకడకు జంకకు డార్తియదేల మీకు నీ
    యవనిని యాదవుల్ వినుడ టంచును పర్వతమెత్తి వారినిన్
    స్తవములనంది గావగను దానవనాశకబాలకృష్ణ శై
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్

    రిప్లయితొలగించండి


  9. అవసరమా నమన్యమని యాదవుడాతడె ప్రశ్న లేవదీ
    సి వలదనంగ, వర్షమును చిత్రముగా కురిపింప జేయ కా
    చి వరలి కొండనెత్తి పయిచేయిని చూపుచు ఢీకొనంగ,కే
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  10. మైలవరపు వారి పూరణ

    నమో నారసింహా!!

    అవిరల సత్కృపారససమన్వితమాననమగ్నిగోలమై
    ప్రవిమలమందహాసమవురా! భయదోగ్రమహాట్టహాసమై
    నవనరసింహరూపము ఘనంబగుగర్జన జేసినంత., కే....
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్ !!

    వి *భవంబు*... విశేషమైన జన్మము... (అవతారము)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. దివమున నందనాపవనదివ్యసుమశ్రుతపారిజాతమున్
    బువిఁ గొని దెచ్చు వేళ హరి మూర్చిల ఘూర్ణితసత్యభామినీ
    జవకృతభీష్మయుద్ధవరశౌరిశరాసన ముక్తసాయకా
    శవవిభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్.

    సాయక ఆశవ ( ఆశు ) విభవము = బాణము యొక్క వేగసంబంధమైన వైభవము.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము.

    రిప్లయితొలగించండి
  12. నవనవలాడెడుఅమెరిక
    కువలయమునుబోలినేడు కుందుచునుండన్,
    శివశివ ఏమనిచెప్పుదు
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  13. అవమానమయ్యె కృష్ణా!
    భువన మదర రాళ్ల వర్షమోయని యేడ్వ
    న్నవరూపము పొందిన కే   
    "శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్"  

    రిప్లయితొలగించండి
  14. దివిజేంద్రుని యెదిరించుచు
    కువలయమునుగాచువాడు గోవిందుడుగా
    అవలీల బ్రోవఁ నా కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దివిజేంద్రుని నెదిరించుచు..." అనండి.

      తొలగించండి
  15. చ్యవనజు జేరి దేవపతి యాచన జేయగ నస్థికల్ ముని
    ప్రవరుడునౌ దధీచి సురపాలుని కోర్కెను దీర్చనెంచి యా
    యువు తెగటార్చి దేహమును యోగము చేత దహించివేయ నా
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవిరళ ఱాల వర్షము వైరిసమాస మండి.

      ఫణికుమార్ గారు దధీచి చ్యవనుని కుమారుఁడా? విన లేదండి. దీని కాధారము తెలుపఁ గలరా?
      అథర్వముని పుత్రుఁ డని తెలియు చున్నది.

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. నేను ఎక్కడ చదివానో లేదా విన్నానో గుర్తులేదు. ఎంత చూచినను అథర్వుని పుత్రుడనే నాకును కనబడినది. నేను పూరణ చేయువేళ ఒకసారి అవలోకనము చేయవలసినది. దోషము తెలియజేసినందులకు ధన్యవాదములు నా సవరణ.

      అవసర మొప్ప దేవపతి యాచన జేయగ నస్థికల్ ముని

      తొలగించండి
  16. దివిజులు మెచ్చె డు రీ తిగ
    వివిధము లగు మహిమ ల మిత వింతగ మెఱయ న్
    భువనము లు పొగడ గను కే
    శవ విభవము గాంచి వడ కె శక్రుడు భీతి న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమిత వింత' దుష్టసమాసం. "మహిమ లమిత విభ్రమములుగా" అందామా?

      తొలగించండి
  17. భువిలో రాజులనాభా
    ర్గవ రాముడు ఖండనంబు గావించగ కే
    శవునిగ గని నాతని పా
    ర్శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్

    రిప్లయితొలగించండి
  18. అవలీలగ రాలె ప్రాణులు
    అవిముక్తము బొందె నంట నామని వచ్చెన్
    కవి కోకిలలు కూసె ముదముగ
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. "రాలిరి జను। లవిముక్తము.." అనండి.

      తొలగించండి
  19. అవలీలగా ననేకము,
    ప్రవాహికుల మట్టుబెట్టు వజ్రాయుధ ధా
    రి, వెరసి కొరోన జేసిన
    శవ విభవము గాంచి వడకె శక్రుడు భీతిన్.

    రిప్లయితొలగించండి
  20. అవనిని ధర్మము నిలుపగ
    యవతారమెత్తినట్టి యనఘుడు వాడే
    భువనైక విభుండగు కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నిలుపగ నవతారమ్మెత్తినట్టి..." అనండి.

      తొలగించండి
  21. జవరాలు సత్య కోరగ
    భువనైక విభుండు లోక పూజ్యుండటకై
    జవమున నేతెంచగ కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్

    రిప్లయితొలగించండి
  22. సవతికి పారిజాతమును చక్రి యొసంగెనటంచెఱంగి యా
    యవని రుహమ్ముఁ గోరగనె యంబుజ నాభుడు సత్యభామతో
    జవమున జేరె నందనము శాల్మలి నెక్కి గదాగ్రజుండు, కే
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్

    రిప్లయితొలగించండి
  23. ధ్రువముగ గోవులనా యా
    దవులను గావగ నభయము దానై నిలిచెన్
    భవముగ గిరి నెత్తిన కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్

    రిప్లయితొలగించండి
  24. అవనిపయి రాళ్ళ వర్షము
    అవిరళముగ పోసివజ్రి యారడి పెట్టన్
    అవనీధరమెత్తిన కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుడు భీతిన్

    రిప్లయితొలగించండి


  25. పవి కురిపించెను వర్షము
    నవారిగానట చిటికెన నంగుటి పై తా
    నవనీధర మిడ గని కే
    *శవ విభవము గాంచి వడకె శక్రుడు భీతిన్.*

    మరొక పూరణ

    దివిలోని పారిజమ్ము న
    తివ కొసగ దలంచి శౌరి తిరమగు మతితో
    భువి విడి రాగా నా కే
    *శవ విభవము గాంచి వడకె శక్రుడు భీతిన్*

    శివము నుగూర్చ నెంచుచు నుచెచ్చె రబాలు నికావ నెంచుచున్
    జవము నబుట్టి కంబము నచక్ర ధరుండ నృసింహ రూపుడై
    జవము ననాదు రాత్మున టచంప నఖమ్ములతోడ గాంచి కే
    *శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్"*

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    [నిరంతర మష్టభార్యలు నాట్యగానములతోఁ గృష్ణుని సేవించుచుండ నాతని విభవముం జూచి, యా శ్రీకృష్ణుఁడు తనకన్న గొప్పవాఁడగునేమోనని శక్రుఁడు భీతిలి వణకిన సందర్భము]

    నవనవమైన నృత్యముల నవ్య సుగీతిక లాలపించుచున్
    జవమున నష్టభార్య లటఁ జక్కఁగ సేవలు సేయుచుండ, నీ
    భువనమనోహరుండునయి మ్రొక్కులుఁ గొంచును వెల్గిపోవు కే
    శవ విభవంబుఁ జూడఁగనె శక్రుఁడు భీతిలె మే న్వడంకఁగన్!

    రిప్లయితొలగించండి
  27. అవనీశుహిరణ్యక శిపు
    నవలీలగజంపుకతననదరగహృదియున్
    వివశతనొందుచునాకే
    శవవిభవముగాంచివడకెశక్రుడుభీతిన్

    రిప్లయితొలగించండి
  28. అవనిని గోపకుల్ తవిలి యద్రుల కర్చనచేయుచుండగా
    సవితను లెక్కచేయని ప్రజాళిని కాంచి యసూయతోడుతన్
    అవిరళ రాళ్ళ వర్షమున నారడి పెట్టగ, నల్లనయ్య తా
    నవి నవలీలనెత్తుకొని యావుల, గొల్లలఁ గాచె కృష్ణు శై
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్

    రిప్లయితొలగించండి
  29. అవిరళ ఱాల వర్షముననంతముగా గురిపింప గోకులం
    బును నిజ భక్త సంఘముల పుణ్యజనావళి రక్షణార్థమై
    ఠవఠవ సుంత లేక ప్రకటంబుగ భూధర మెత్తి గాచు శై
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్

    రిప్లయితొలగించండి

  30. కందం
    అవనీధర ధారిగ కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్
    స్తవనీయము 'గోవిందా' !
    భువి మీలీలనుచు మ్రొక్కె మురళీ కృష్ణున్

    చంపకమాల
    భువిఁ దన యాగమున్ విడువ ముమ్మరమౌ గతి రాళ్ళ వర్షమున్
    దివియగ సర్వజీవులకు దేవుఁడనన్ కొనగోటఁ గొండ ని
    ల్పి వగపు బాపి చిర్నగవుఁ బేర్మిని దాల్చిన శక్తిఁ దెల్సి కే
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్

    రిప్లయితొలగించండి
  31. భవభయ దురితౌఘ లతా
    లవిత్ర భక్తజనకోటి రక్షక కృష్ణుం
    డవలీల నెత్త గిరి శై
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్


    అవియఁగ విశ్వరూపుఁ డటు లాగ్రహ ముప్పతిలంగఁ ద్వష్ట దే
    వ వర గణాధినాథు పయిఁ బంతము నూని సృజించ దైత్యునే
    వివృత శరీర కాంతులను వృత్రుని శస్త్ర వరాస్త్ర పాట వా
    శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకఁగన్

    [పాటవ +ఆశవ = పాటవాశవ; ఆశవము = వడి]

    రిప్లయితొలగించండి
  32. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్"

    ఇచ్చిన పాదము కందము నాపూరణము సీసములో



    గొల్ల బాలుడొకడు పిల్ల చేష్టల తోడ
    కులమువారికి తెలిపె వలదు పూజ
    నగవైరి కనుచు, తన జనుల నొప్పించి
    మాన్పించె పూజలన్, మబ్బు రవుతు

    కినక తో కురిపించె ఘనమైన
    వడగళ్ల వానను ..జడిసి జనులు

    వేడు కొనగ, చక్రి వేలిపై నిలిపి గో
    వర్ధనమును కాచె వజ్రి దాడి
    నుంచి నెల్లరను, కనుల పొర మాయమై
    రయముగ పరుగిడి రత్నసువుకు

    వచ్చి కేశవ విభవముఁ గాంచి వడఁకె శ
    క్రుఁడు, భీతినెరిగి యా కృష్ణు డభయ

    మీయ పరిపరి విధముల మెచ్చుగొనుచు
    స్వర్గ మునకు వెడలి పోయె,సకల జనులు
    నాటి నుంచి జంతు బలులు నాపి చేయు
    చుండె గోపూజలు జగతి శుభము కోరి

    "

    రిప్లయితొలగించండి
  33. అవిరళప్రేమతోడనుమహాత్ముడుయాదవఱేడు,వెన్నుడున్
    నవనిధరంబునెత్తగనునాలనుగావగనొంటిచేతకే
    శవవిభవంబుచూడగనెశక్రుడుభీతిలెమేన్వడంకగన్
    వివశతనొందియుండుటనుభీతినినోటినివిప్పలేదుగా

    రిప్లయితొలగించండి
  34. అవలంబ గోరు గయునికి
    అవలంబనమీయగ దన యాత్మజు దోడన్
    సవరించు పోరులో కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్

    విభవము = ఉన్నతస్థితి

    రిప్లయితొలగించండి
  35. కం.

    భవకుడు పరమము గోరుచు
    న్నవసానమునందొనరుగ నందుని గొల్వ
    న్నవలోకించెడు యా, కే..
    శవ విభవమును గాంచి వడకె శక్రుడు భీతిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  36. శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్
    భవనము భీకరంబునవ బాణము తోడను రౌద్రమున్నటన్
    భువికిని పారిజాతముల పువ్వులు భార్యల కివ్వగోరి మా
    ధవుడట కేగుదెంచగ ముదంబున యింద్రుడు గాంచతోటనన్

    రిప్లయితొలగించండి
  37. అవిరళ వర్షము నాపగ
    అవనీ ధరమును గొడుగుగ యచ్యుతుడెత్తెన్
    దివిభువి మురియగ ,నా కే
    శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్

    రిప్లయితొలగించండి