26, ఏప్రిల్ 2020, ఆదివారం

సమస్య - 3351

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్"
(లేదా...)
"వెస పాపాత్ముఁడు విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్"

70 కామెంట్‌లు:

  1. అందరికీ నమస్సులు 🙏🙏

    నా పూరణ, (పూరణ మాత్రమే)😊😄

    *కం||*

    వ్యాపారము చేయగ తా
    కోపముతో వ్యవహరించి గోలను జేయన్
    శాపాలను పెట్టగ నో
    *"పాపాత్ముఁడు, విట్టుబాబు పక్కున నవ్వెన్"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😄🙏😄🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో పూరణ ప్రయత్నం 😊

      *కం||*

      చూపులకని వెళ్లగ నో
      పాపను జూచిన తరుణమె పరిణయ మాడన్
      కోపముతో తిట్టగ నో
      *"పాపాత్ముఁడు, విట్టుబాబు పక్కున నవ్వెన్"*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏😊🙏😊🙏

      తొలగించండి
    2. మరో ప్రయత్నం 🌹🌹🌹🙏

      *కం ||*

      వ్యాపారములో నిత్యము
      పాపాలను చేయునట్టి వారిని జూడన్
      కోపముతో తిట్టగ మరు
      *"పాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్"*!!

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
      🙏

      తొలగించండి
    3. అందరికీ 🙏🙏

      *కం||*

      *ఆపుము యవధానమనగ*
      *పాపాత్ముడు, విట్టుబాబు పక్కున నవ్వెన్*
      *పోపో లాక్డౌను వరకు*
      *నాపగ నీ తరముగాదు నమ్మిది నిజమే!!*

      *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*

      తొలగించండి
    4. మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
      చివరి పూరణలో 'ఆపుము+అవధాన'మన్నపుడు యడాగమం రాదు. "ఆపుమిక వధాన మనగ" అనండి.

      తొలగించండి
    5. ధన్యోస్మి ఆర్యా, శతాధిక వందనములు 🙏🙏

      తొలగించండి

  2. నడిరేయి సరదా పూరణ:

    రసమున్ గ్రోలి వధానమందు నిడగా రమ్యంబులౌ ప్రశ్నలన్
    విసుగున్ జెందుచు పృచ్ఛకుల్ విడువగా బింకంపు నిట్టూర్పులన్...
    పసనున్ జూపగ పండితుండ్రు కసిగా వాలమ్ములన్ విప్పగా
    వెస పాపాత్ముఁడు విట్టుబాబపుడు నవ్వెం బక్కునన్ వింతగన్

    రిప్లయితొలగించండి
  3. కోపంబునకలియుగమున
    శాపాలను పెట్టెనొకడుచాదస్తంబౌ
    కాపాడెడువాడేడన
    పాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    విసుగున్ జెందని విక్రమార్కు వలె వే వేధించుచున్ కన్నెలన్
    నసనున్ బెట్టక బ్రహ్మచర్యమున తా నాకమ్మునన్ జేరగా...
    పసనున్ జూపగ రంభ బాహు వులనున్ బంధమ్ము జేయంగయో
    వెస పాపాత్ముఁడు విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్

    రిప్లయితొలగించండి
  5. కం//
    భూపాళపు రాగమినుచు
    తాపాలను నేనుమరచి తాండవమాడన్ !
    కోపముగా గౌళియరవ
    పాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వినుచు'ను 'ఇనుచు' అనరాదు. "భూపాళ రాగము వినుచు" అనండి.

      తొలగించండి
  6. తేపకు తేపకు నడ్డుచు
    నాపగలేక సరసంపు హాస్యపువిధినిన్
    వేపుకు తినగా,కాడుగ
    పాపాత్ముడు, విట్టుబాబు ఫక్కున నవ్వెన్

    అసిధారా వ్రతమౌ వధానమున దాహాస్యంపు పాత్రన్ విధిన్
    విసువున్ లేకయె రువ్వగా నిశితమౌ వింతైన ప్రశ్నావళుల్
    నసయేమంచును తాళలేక కవి మౌనంబున్ శరణ్యంబనన్
    వెస పాపాత్ముండు,విట్టుబాబపుడు నవ్వెంబక్కునన్ వింతగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరదా పూరణ!
      కుసుమాస్త్రుం దయయో శరాస్త్రములనే గుచ్చంగ కాయంబునన్
      సుకుమారుండగు విట్టుబాబు గుబులై శోషించి తాకన్యకై
      యసమానంబగు రీతినిన్ కలగనన్ యానుష్క బెండ్లాడగా
      వెస పాపాత్ముండు, విట్టుబాబపుడు నవ్వెం ఫక్కునన్ వింతగన్

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. కం//
    పాపిడిరొడ్డయు తగులగ
    కోపానికిజేరె బుర్ర గోకుట వలనన్ !
    నా పాటులు జూచిన, మన
    పాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్ !!

    రిప్లయితొలగించండి
  8. పాపిడిబిళ్ళనుదెమ్మని
    పాపనుజూపుచు పతికిని పడతియెజెప్పన్
    పాపిడిమిఠాయిదేగా
    పాపాత్ముడు ,విట్టుబాబు పకపక నవ్వెన్
    +++++++*+++++**+
    రావెలపురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి
  9. ఓపక కరోన రోగ క
    లాపనమున శంకరాభరణ మందిడగన్
    యాపద్యపు నకలిడె నొక
    పాపాత్ముఁడు ; విట్టుబాబు పక్కున నవ్వెన్

    కలాపనము = కలత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మందిడగా । నా పద్యపు..." అనండి.

      తొలగించండి
  10. (ప్రాశ్నికుడుగా వచ్చి విరసభావనుడై అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని చూచి
    సరసభావనుడైన విట్టుబాబు నవ్వుకుంటున్నాడు )
    కసితో నిండిన చూపులన్ బరపుచున్
    గార్కశ్యకంఠమ్ముతో;
    నసగా వాగుచు ధూర్తుడై సభను నా
    నారీతి వేధింపగా
    వెస;పాపాత్ముడు;విట్టుబా బపుడు న
    వ్వెం బక్కునన్ వింతగన్-
    "హసితుండా కవివాక్కు నీపొగరుకే
    యంతంబు" నన్నట్టులన్ .

    రిప్లయితొలగించండి
  11. కం//
    గోపాలునివలె నిలబడె
    పాపాత్ముఁడు విట్టుబాబు, పక్కున నవ్వెన్ !
    రూపము వ్యత్యాసము గని
    నాపిత సోఫా లల బడి నానందించెన్ !!

    రిప్లయితొలగించండి


  12. విట్టుబాబు గారి అప్రస్తుత ప్రసంగ వేగం గాలి లా వేగం ! ప+ ఆత్ముడు - ప- గాలి ; గాలి యే ఆత్మ గా గల వారు :)


    లేపుచు ప్రశ్నల వేగము
    గా పండిన తలల చూచి కయ్యాటములన్
    దాపరికము లేకన్ చం
    పా, పాత్ముఁడు విట్టుబాబు! పక్కున నవ్వెన్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. నేపథ్యముయవధానము
    సాపంక్తినపృఛ్ఛకుండుసాజపుప్రతిభన్,
    కోపావేశులపాలిటి
    పాపాత్ముడువిట్టుబాబుపక్కుననవ్వెన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి


  14. ఓ పండిన తల అవధాని ! అప్రస్తుతమునకు గాలి కన్నా వేగపు మనం విట్టుబాబు గారు :)

    అవధానిని , ముసలీ ! శాస్త్రము తెలుసా అంటే వారన్నారు కదా


    ముసలీశాస్త్రము చెప్పె నోయి విను నీ ముంగాళ్ళకా బంధమై
    దుసికిళ్ళాడకనీక వచ్చు సితయే దువ్వాడు జవ్వాదియై
    అసలే బాలుడు! పృచ్ఛకుండు! పనియో నప్రస్తుతంబాయెనే
    వెస పా! పాత్ముఁడు విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్


    ముసలీశాస్త్రము - బల్లి శాస్త్రము

    జిలేబి



    రిప్లయితొలగించండి
  15. వసుధన్ నిత్య మనాథదీనజనులన్ బాధించుచున్ దౌష్ట్యముల్
    కసితో జేయుచు సత్యదూరు డగుచున్ గాంక్షించి యన్యార్థముల్
    మెసవం జూచుచు ధర్మబోధకొరకై మేలంచు జేరన్ సభన్
    వెస పాపాత్ముఁడు, విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్

    రిప్లయితొలగించండి
  16. కాపాడును పరమాత్ముడు 
    పాపాలను చేయకుండ పవిత్రుండైనన్ 
    నీ పాలికి మంత్రమ్మన 
    "పాపాత్ముఁడు విట్టుబాబు ఫక్కున నవ్వెన్"  

    రిప్లయితొలగించండి
  17. ఏపాపమెరుగ బోడయ
    రూపాయినిచేతికివ్వ లోకమునుసదా
    కాపాడనెంచ, తిట్టగ
    పాపాత్ముఁడు; విట్టుబాబు పక్కున నవ్వెన్!

    రిప్లయితొలగించండి
  18. సూపము జేసెనటంచును
    కోపముతో సతిని కొట్ట కోలను తేగా
    కూపములో జారి పడగ
    పాపాత్ముఁడు, విట్టుబాబు పక్కున నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  19. పాపా కరోనా పురుషుడు

    పాపాత్ముడు ,విట్టుబాబు పకపక నవ్వెన్

    యీ పదము నేను పలుకగ,

    లోపము లేమిగలవోతెలుపగ వలయున్

    రిప్లయితొలగించండి
  20. https://epaper.newindianexpress.com/m5/2648119/The-New-Indian-Express-Hyderabad/26-04-2020#page/4/1

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అదురహో :) వచ్చే మారిట్లాంటి ఆర్టికల్ లో జిలేబి పేరు వేయడం కూడా మరువకండేం :)



      జిలేబి

      తొలగించండి
  21. కోపంబున దూషించును
    పాపాత్ముడు : విట్టు బాబు ఫక్కున నవ్వె న్
    దీపించు హాస్య నుడులకు
    దాపున నున్నట్టి మిత్ర తతి తో దాను న్

    రిప్లయితొలగించండి
  22. ఆపాలనికోవిడయును
    వేపాకునుపసుపునుపొగవేయగ యింటన్
    కాపాడునవి మనలనన
    పాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి
  23. నాపెండ్లమువైపున నీ
    చూపుపడినచో తడాఖ చూపింతునురా!
    పో పొమ్మనమిత్రుడు! ని
    ష్పాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్!

    రిప్లయితొలగించండి
  24. శంకరాభరణం
    శనివారం...25/04/2020

    సమస్య:

    "వెస పాపాత్ముఁడు విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్"

    నా పూరణ. మత్తేభము
    **** **** **

    ( నేనొల్ల బాబోయ్..హిహిహి....నీకు దండము...నే పుణ్యాత్ముడనే...)

    నసతోడన్ సతులున్ సదా పతుల ప్రాణా లొల్చగన్ గాంచుచున్

    దుసి!కళ్యాణము వద్దు నాకనుచు తా దూరంగ నేగెప్పుడున్

    కసినే తీర్చుకొనంగ "నీవు గొనుమా కళ్యాణమే.."యంచనన్

    వెస పాపాత్ముఁడు..; విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్"


    -- ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. ఊపునఁ దా నవధానిగఁ
      బ్రాపుఁ గొనిన యూహ విరిసి రంజిలఁ జేయన్
      జూపుల మురిసిన నగునే
      పాపాత్ముడు? విట్టుబాబు ఫక్కున నవ్వెన్!

      తొలగించండి
  26. పాపము చేసిన వాడౌ
    పాపల నాడించుచుండు పదిలముగా నా
    పాపయు సంతసమున గని
    పాపాత్ముడు,విట్టుబాబు,పకపక నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  27. చూపగ చక్కని కన్యను
    కోపము నొందెను హితవరి, కుదరదు యనగన్
    శాపము లిడుచును తిట్టెను
    "పాపాత్ముఁడు, విట్టుబాబు పక్కున నవ్వెన్"

    రిప్లయితొలగించండి
  28. పాపయ్యెవరన జెప్పితి
    వ్యాపారపు మెలకువలని వడ్డీలంచున్
    రూపాయలకేడ్చునెపుడు
    పాపాత్ముఁడు; విట్టుబాబు పక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి

  29. మైలవరపు వారి పూరణ

    పాపాత్ముడు ఎవరో... విట్టుబాబు ఏం చెబుతాడో.. అన్నీ రహస్యాలే😂😀🙏

    "అసలేమాత్రము నవ్వురానటుల మీ యప్రస్తుతంబుండునా?
    పస కాసింతయులేని ప్రశ్నలడుగన్ భావింతురా? నేడిటన్
    రసరమ్యంబగు పద్యసౌరభములన్ రానీయరా?" యన్నచో
    వెస పాపాత్ముఁడు., విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  30. "పాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్"
    (సమస్య)


    శాపాలనుపెట్టుకొనుచు
    కోపాగ్నిని రగిలిపోయి గోలనుచేయన్
    ఏపాటి సిగ్గు లేకను
    పాపాత్ముఁడు విట్టుబాబు ఫక్కున నవ్వెన్.

    రిప్లయితొలగించండి
  31. వసపిట్టై యవధానమందునతిగా వాచాలతన్ జూపగా
    వెస పాపాత్ముఁడు; విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్
    పస లేదీతని బల్కులందితనికుద్వాసమ్ము బల్కుండనెన్,
    రసరమ్యంబుగ సాగెనింక సభ యుల్లాసమ్ముగానంతటన్

    రిప్లయితొలగించండి
  32. ఓపికఁ బనులన్నిసలుప
    పాపాల భయిరవు డంద్రు వ్యాపారములన్
    చూపమనుచు నడుగగ మన
    పాపాత్ముఁడు, విట్టుబాబు పక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి
  33. ఇసుమంతైనను జాలిలేని ఖలుడౌ హీనాత్ముడాయింతినే
    కసితో కొట్టగ నెంచి తా కదలగా గయ్యాళియౌ కాంతయే
    విసిరెన్ రొట్టెల కఱ్ఱనే తగలగన్ భీతిల్లి తానేడ్చెనే
    వెస పాపాత్ముఁడు, విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్

    రిప్లయితొలగించండి
  34. కోపమునకు తావియ్యక
    తాపము శమియింప బాబు తగ నవ్వించన్
    ఆ పండితుడనె గోముగ
    "పాపాత్ముడు విట్టుబాబు పకపక నవ్వెన్!"

    రిప్లయితొలగించండి
  35. పాపాలపుట్టయగుచును
    బాపమునేజేయుచుండిపలుకగనీతుల్
    పాపారావునుగనుచును
    పాపాత్ముడువిట్టుబాబుపక్కుననవ్వెన్
    ప్రత్యుత్తరంతొలగించు

    రిప్లయితొలగించండి
  36. ఏపార దర్పము సని మ
    హీపుఁడు గద్దియకుఁ దూలి యెరియన్ సభలోఁ
    గోపా టోపమ్ము లడరఁ
    బాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్


    వెసఁ బాపాత్ముఁ డని సమస్య యుండుట న్యాయము.
    కాని యది కూడా సమస్యగానే భావించి యరసున్న యవసరము లేని విధముగాఁ జేసిన పూరణము.


    పొసగం జూతుమె స్వచ్ఛ భారతము నంభోజాక్షుఁ డేతెంచినం
    బసి చందంబునఁ బౌర ధర్మ నిరతిం బాటించ నేర్వం డహో
    యిసు మంతైనను సిగ్గు సెందక విసర్జించెన్ నశించంగఁ దా
    వెస పాపాత్ముఁడు విట్టు, బా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్

    [పసి = గోగణము; తావు +ఎస = తా వెస; ఎస = అధికము; విట్టు = మలము]

    రిప్లయితొలగించండి
  37. మ:

    అసమానుండగు గాన కోవిదుడు నాలాపింప గొంతెత్తి త
    ద్విసురున్ నోటిన కీటకంబోకటి నావేశింప దగ్గుత్తికన్
    అసలే రాగము రానిదుస్థితిని హాహాకారమే విన్పడన్
    వెస పాపాత్ముడు విట్టుబాబపుడు నవ్వెమ్బక్కునన్ వింతగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  38. మత్తేభవిక్రీడితము
    అసలే యా వసుదేవు జంట విడదీయంగన్ విలోకించడై
    దొసగున్ బొందెన? కంసుడంచుఁ బలుకన్, దుష్టుండె కంసుండు, నిన్
    గసిలో మించడు పృచ్ఛకా! యన వధానంబందు, ఖిన్నుండయెన్
    వెస పాపాత్ముఁడు! విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్

    రిప్లయితొలగించండి
  39. అసమానుండగు మంచి స్నేహితుడునభ్యాసమ్ముతో కైతలన్
    రసమాధుర్యముతోడ నిత్యమును వాల్లభ్యమ్ముతో వ్రాయుచున్
    పసినవ్వుల్ కన నన్ని కార్యముల పాపండై యొనర్చంచనన్
    వెస పాపాత్ముఁడు విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్

    రిప్లయితొలగించండి
  40. అసమానంబుగబాండితీప్రతిభనయ్యాచారిచూపించగా
    వెసపాపాత్ముడువిట్టుబాబపుడునవ్వెంబక్కునన్ వింతగన్
    నసలేమందుడునాపయిన్రచనజేయంజాలడెన్నాటికిన్
    వెసమావిఠ్ఠలునార్యులేసదయవేవీక్షించనేగోరుదున్

    రిప్లయితొలగించండి
  41. కోపానికితావీయడు
    లోపాలనుచూడబోడులోకులవెపుడున్
    పాపమ్మునెరుగని 'చిఱుత
    పాపా'త్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్

    రిప్లయితొలగించండి
  42. నేనింకా పూర్తిగా కోలుకోలేదు. మానసికంగా కొంత అలజడి. రోజంతా ఎక్కువగా నిద్రపోయాను. అందువల్ల మీ పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి