29, ఆగస్టు 2020, శనివారం

సమస్య - 3471

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జలములో నూనె చుక్కల జాడఁ గనము"

(లేదా...)
"జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా"

42 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  పిలిచిన పల్కకుండగను బ్రీతిని గూడుచు పాకశాలనున్
  సలసల కాగు నూనెనహ సందడి జేయుచు పండుగందునన్
  వలపున వేచ బజ్జిలను బంగరు పత్నివి కన్నులందునన్
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా

  రిప్లయితొలగించండి
 2. మంచిలో చెడు విషయమ్ము నుంచ లేము
  ఆకలిని ద్రుంచ నోదార్పు నంద లేము
  కలిమిలో లేమి కలదని పలుక లేము
  జలములో నూనె చుక్కల జాడఁ గనము
  సాంద్రతన్ధర్మ మమరును సామ్యమగుచు!

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పలువుర మాటలన్ వినక భాద్రపదంబున రాత్రివేళనున్
  నలువురు దొంగలున్ కలిసి నందము నొందుచు నోరుగల్లునన్
  గలగలలాడి త్రవ్వగను కర్మపు దిష్టను నూతినందునన్
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా

  తైలము = crude oil

  రిప్లయితొలగించండి
 4. జలము పైనూనె బొట్లు గోచరమగు నయ

  నయనములకు,నిక్కమది, మానవుల దేహ

  మున విరామము యే లేక పుట్టు కాయ

  జలములో నూనె చుక్కల జాడ కనము

  కాయజలము = మూత్రము

  రిప్లయితొలగించండి
 5. సమస్య :
  జలమున దైలబిందువుల
  జాడ గనంగ నసాధ్యమే కదా

  ( సద్గుణసాగరునిలో దుర్గుణాలు ఉండనే
  ఉండవు కదా )
  మలయజమట్లు తమ్ములను
  మంచిగ జూచెడి యగ్రజుండుగా ;
  జలదమువోలె పౌరులను
  చక్కగ నేలెడి రాజమూర్తిగా ;
  విలసితుడైన రాము కడ
  వేడుకకైనను దోషముండునే ?
  జలమున దైలబిందువుల
  జాడ గనంగ నసాధ్యమే కదా !
  ( మలయజము - చందనము ; జలదము -మేఘము ; వేడుక - వినోదము )

  రిప్లయితొలగించండి
 6. పైకెగురు బంతి వీడ దిలఁ, కరుగదులె
  జలములో నూనె, చుక్కల జాడఁ గనము
  పగటి యాకసమందున, ప్రకృతిలోని
  ధర్మమిదియె తెలుసుకొమ్ము తంగిరాల౹౹

  రిప్లయితొలగించండి
 7. బాపూజీగారికి ధన్యవాదములతో

  పలుకుల తేనెలొల్కెడు స్వభావము గల్గిన పూర్వభాషికిన్
  విలువల నాచరించుచు వివేకము
  గల్గిన ధర్మమూర్తికిన్
  దలపగ దోసముండునె సుధామయ మూర్తికి రామమూర్తికిన్?
  జలముల తైలబిందువుల జాడగనంగ నసాధ్యమేగదా!

  రిప్లయితొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ధర్మమందు నధర్మమె దల్చ లేము
  నీతి నందున యవినీతి నెంచ లేము
  జలములో నీటిచుక్కల జాడ గనము
  అవని లక్షణ మిద్దియె నరయుమయ్య!

  గల్ఫు దేశములందున కాన నగును
  నూనె జాడలమితముగ నూతులందు
  జలములోన; నూనె చుక్కల జాడ గనము
  మచ్చు కైనను మనదేశ మరులమందు.
  (మరులము= నీరు)

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అలవిని ధర్మమెంచు సుగుణాత్ము డధర్మము నెంచడెప్పుడున్
  విలువలు నాచరించెడి వివేకి వ్యతిక్రమ మెంచడెప్పుడున్
  ఇలనిటు నచ్చుగూడు నెఱి నిద్దమునైన ప్రవృత్తులుండగన్
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా

  రిప్లయితొలగించండి
 10. ద్రవములను జూడ నొక్క విధముగ నుండు
  గాని , నీళ్ళు తైలంబులు కలువ బోవు
  వాటి నిజమట్లు యుండుట వలన యెటుల
  జలములో నూనె చుక్కల జాడఁ గనము ?

  రిప్లయితొలగించండి
 11. పాప భీతిని విడిచి సంపదల కొరకు

  నిరతమారాట పడియెడు నీచు డైన
  ఖలుని యందున మంచిని కాంచ గలమె
  జలములో నూనె చుక్కల జాడఁ గనము.

  రిప్లయితొలగించండి
 12. తలపున నేదియో యునిచి తద్గత చిత్తముతోడ దేనెనున్
  గలిపియు దాని నెంచకయె కన్నులు విప్పి కడంగి మిత్రమా!
  నిలిచితి వీగతిన్ వినుము నీవతియత్నము చేయబూనినన్
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా!

  రిప్లయితొలగించండి


 13. పిల్ల కోతులే బుడతలు వీరి పనిని
  చూడుడీ యేమి చేసిరి చూడుడయ్య!
  జలములో నూనె చుక్కల జాడఁ గన,ము
  దిత జిలేబి యాక్రోశించె దిమ్మ తిరుగ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. ద్రవములేయైననారెండు తరచిచూడ
  జలములో నూనె చుక్కల జాడఁ గనము
  శిష్టజనులకునడుమన దుష్టులున్న
  శిష్టునెన్నడునంటదు దుష్టబుద్ధి

  రిప్లయితొలగించండి


 15. కలిపిరి నీళ్ల లోన పది గ్లాసుల తైలము నొక్క పాత్రలో
  పిలిచి జిలేబి మేడమును "వింతయిదేమన పాఠశాల పి
  ల్లలిక సయిన్సు ఫేరున భళారె ప్రదర్శన చేయ చిత్రమౌ
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా"
  పలికిరి హెడ్డుమాస్టరు ప్రభాకర శాస్త్రి ముదమ్ము తోడుతన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 16. మూర్ఖు లందున మూర్ఖత జాడ కనము
  పుంస్త్వమే లేని పురుషుని జాయ కనము
  నీతివంతుల సత్యము జాడ కనము
  జలములో నూనె చుక్కల జాడఁ గనము

  రిప్లయితొలగించండి
 17. తిలలను బిండిఁ జేయ సముదీరితతైలము కానవచ్చెడిన్
  చెలగి బలప్రయోగమున చెచ్చెర సైకతమందు నైననున్
  వెలయును తైలబిందువులు వెల్వడుఁ గొన్నిట బావులందు క
  జ్జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా!.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురం.

  రిప్లయితొలగించండి
 18. కల్ల కపటము లెరుగని కాంత లందు
  మోస పూరిత దుష్టంపు బుద్ధి లేని
  మనుజు లందున మరియును మలిన రహిత
  జలము లో నూనె చుక్కల జాడ గనము

  రిప్లయితొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  కులమని కొన్నినాళ్లు పలుకుంపటులన్ రగిలించినారు., మ...
  మ్ముల మతరూపభేదమున మూర్ఖత జీల్చిరి కొన్నినాళ్లు., నే...
  తలు., వెదుకన్ సమైక్యమని., దర్శనమిచ్చును భేదభావముల్
  జలమునఁ దైలబిందువుల జాడఁ., గనంగ నసాధ్యమే కదా!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 20. విలయము గాంచిరీ వనిని భీతిని పొందుచు గాలి వానలన్
  కలవర మందిరీ జనులు కంటికి కానని మాయజబ్బుతోన్
  తలవని నీ పరిస్థితిని దారుణ కష్టములోర్వ కళ్ళలోన్
  జలమున దైలబిందువుల జాడ గనంగ నసాధ్యమే కదా

  రిప్లయితొలగించండి
 21. కలము నెఱుంగ నింట నొక కావ్యము పుట్టగ సాధ్య మిమ్మహిన్
  బలమగు యంత్రముల్ గొనుచు పాటవమందగ సాధ్యమేనియున్
  జలమున దైల బిందువుల జాడ; గనంగ నసాధ్యమే కదా
  సలలిత భావజాలముల సందడి నెంచుట దుష్టబుద్ధిలో!

  రిప్లయితొలగించండి
 22. పలువిధ భోగభాగ్యముల వాసిగఁ బొందదలంచు మూర్ఖుడే
  కలుషితభావనల్ కలిగి కల్లల నాడెడు స్వార్థచిత్తుడౌ
  ఖలునకు మానవత్వమన గౌరవ ముండదు లేశమాత్రమున్
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా!

  రిప్లయితొలగించండి
 23. గలగలపారునీరమునకానగజాలము కల్మషంబులన్
  కలకలలాడుచున్ నెరపుకాపురమందున కల్లవాటులున్
  చలమగుచిత్తమందున నచంచలదీక్షయుగాంచమెన్నడున్
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమేకదా

  రిప్లయితొలగించండి
 24. జలములోనూనెచుక్కలజాడగనము
  జాడ గనిపించుదప్పకజలములోన
  దేలియుండునుబరికించ తళతళలయి
  మెఱయుచుండునునెండకుశరముపైన

  రిప్లయితొలగించండి
 25. కె.వి.యస్. లక్ష్మి:

  పాలు నీరుల క్రమమెంచు పరమహంస
  పసిడి రాగిల గుణమెంచు పారగుండు
  నాలిముచ్చు గుణమ్ము నరయ లేము
  జలములో నూనెచుక్కల జాడ గనము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె.వి.యస్. లక్ష్మి:

   పాలు నీరుల క్రమమెంచు పరమహంస
   పసిడి రాగిల గుణమెంచు పారగుండు
   కుటిల మనుజుల పోకడ లెటుల మారు?
   జలములో నూనెచుక్కల జాడ గనము

   తొలగించండి
 26. జలమునదైలబిందువులజాడగనంగనసాధ్యమేకదా
  జలమునదైలబిందువులుజారుచుదెల్లనిగాంతితోగడున్
  తళతళలాడుచుండుగదదర్షునిగాాంతికినీటిపైననే
  జలమునవాటిజాడనికజాలముసేయకజూడవచ్చుగా

  రిప్లయితొలగించండి
 27. తెలిపెద ధర్మ సూక్ష్మమును తెల్లముగా వినుమయ్య నీవికన్;
  సులువగు నెట్టివారికిని సుంతయు యోచన లేక దోయిలిన్
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ; నసాధ్యమే కదా
  జలధరమందు రేణువుల జాడ గనుంగొన నేరికైననున్

  రిప్లయితొలగించండి
 28. కలుగును తైలముల్ పుడమి గర్బము నందున నగ్గలమ్ముగా
  వెలికి కొనంగ నెంచినను పెచ్చుగ సొమ్మును ఖర్చుపెట్టగా
  వలయును, లేనిచోట పయి భాగము నయ్యది రాదు కావునన్
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా

  రిప్లయితొలగించండి
 29. చం:

  కలహము రూపుమాప తగు కల్పన జేయుచు రాయబారమున్
  సలుపగ నేగి హస్తినకు చక్కగ దెల్పగ మంచిచెడ్డలన్
  కలయుట కష్టమెంచి నరకాంతకుడిట్లు తలంచె నక్కటా
  జలమున దైల బిందువుల జాడ గనంగ నసాధ్యమే కదా

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 30. వారిరాశి గర్భముఁ ద్రవ్వి పట్టవచ్చుఁ
  దివిరి తైలసంపద ధరిత్రీ జనాలి
  కడు ప్రయాసల కోర్చినఁ గడలి యందు
  జలములో నూనె చుక్కల జాడఁ గనము


  కశ్చిన్మహర్ష్యువాచ:

  తెలుపక యున్నఁ దత్క్షణము తీవ్ర తరమ్ము శపింతు నిత్తరిం
  గలవర మందఁ జేయుటకు గౌరవ హీనుఁ డెవండు ఘోరపున్
  జలమున వేయ కున్న మఱి నాదు కమండలు వందు నుండు నీ
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా

  రిప్లయితొలగించండి
 31. తేటగీతి
  యింటికొక పావు తైలము నెలమిఁ దెచ్చి
  నింపుమనగ! గంగాళము నిండెఁ! గాని
  యచట 'గుంపులో గోవింద' యన్నరీతి
  జలములో నూనె చుక్కల జాడఁ గనము!!

  చంపకమాల
  పిలుచుచు నూరి వారలను పేదల సేవకు పావు తైలమీ
  రెలమిని దెచ్చి నింపుమన నెల్లరు నింపిరి పెద్ద పాత్రలో
  నలుగురి లోని భాగమని నైచ్యము నెంచిరొ రామ! రామ! !యా
  జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా!

  రిప్లయితొలగించండి
 32. సరుకులందున కల్తీలుసాగ? నేడు
  పాలయందున నీళ్లుగలుప పట్టగలమ?
  మనుషులందున మనసుల మలినమట్లు
  జలములో నూనెచుక్కలు జాడగనము!

  రిప్లయితొలగించండి
 33. తైల వణిజుండు నేగెను తరణి పైని
  నంతలో నూనె బడిపోయె నభసమందు
  కటకటా ! యనుచున్ జెప్పెనట "సముద్ర
  జలములో నూనె చుక్కల జాడఁ గనము!
  --- శ్రీరామ్ 10వ తరగతి

  రిప్లయితొలగించండి