17, ఆగస్టు 2020, సోమవారం

సమస్య - 3460

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్"
(లేదా...)
"మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్"

72 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  సరసపు మాటలాడుచును చల్లని మజ్జిగ రాత్రినిచ్చుచున్
  మురియుచు ప్రీతిగా నిడెడు ముద్దుల కాఫిని రోజు తల్చగన్
  బరువగు హృత్తునున్ మరచి భారము నోర్చుచు నత్తగారిదౌ
  మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్

  రిప్లయితొలగించండి
 2. పరమాత్ముని సేవించుచు
  గురువులుగా సకలజీవ కోటిని భావిం
  తురు, ప్రేమమయుడు తానే
  మరణమును జయించు, వాఁడె మర్త్యుం డన్నన్

  రిప్లయితొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  మురియుచు వంగ భూమిజని ముచ్చట మీరగ దీది తోడుతన్
  తిరుగుచు గంగ తీరమున దివ్వెల త్రిప్పుచు నాట్యమాడుచున్
  దరువులు వేసి పాటలను దండిగ పాడుచు మార్క్సువాదపున్
  మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్

  రిప్లయితొలగించండి
 4. జై జవాన్🙏🏻

  పొరుగున ముష్కర మూకల
  చొరబాటుకు తావొసగక చోడుమలెల్లన్
  పరిపరి జవాను మోయగ,
  మరణమును జయించు, వాఁడె మర్త్యుం డన్నన్

  రిప్లయితొలగించండి
 5. ధరలో కాంక్షల వీడుచు
  నరునిగ నిహమున పొదవుచు జ్ఞానా
  ర్జనమున్
  స్థిరమగు ముక్తిని బడయుచు
  మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్!

  రిప్లయితొలగించండి

 6. సమస్య :
  మరణమునున్ జయించిననె
  మర్త్యు డనంబడు నెవ్విధిన్ గనన్

  ( మరణించేవాడు మర్త్యుడు ; స్వదేశం
  కోసం మరణించేవాడు అమర్త్యుడు )
  మరణము గల్గువాడె మరి
  మర్త్యుడగున్ గద ! యెట్టులెట్టులన్
  మరణమునున్ జయించిననె
  మర్త్యుడనంబడు ? నెవ్విధిన్ గనన్
  ధరణిని దేశమాతకయి
  తానొక త్యాగిగ బ్రాణ మిచ్చినన్
  వరలును వా డమర్త్యుడయి ;
  వానికి లోకము వందనం బిడున్ . సమస్య :
  మరణమునున్ జయించిననె
  మర్త్యు డనంబడు నెవ్విధిన్ గనన్

  రిప్లయితొలగించండి


 7. అరకొరగా మాట్లాడకు!
  మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్,
  తరిమెదరు నిన్ను జనులే
  పరిణితి గనవే తెలివిడి వలయు జిలేబీ !  జిలేబి

  రిప్లయితొలగించండి


 8. కందా చంప్స్


  కడగండ్లను దాటుచు ము
  న్నడి మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనం
  బడు నెవ్విధిన్ గనన్ త్వర
  పడక మొగపిఱికి జయించు పగటు జిలేబీ


  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్? గనన్,
  గురువులు, ముక్తికోరికయు కూర్పుగ మానుష జన్మమున్ లభిం
  ప,రవణ మై మనోజ్ఞముగ పట్టుగ ధ్యానము చేయగా మరిం
  త రగులు గాంచి సాధనపు ధన్యత గాంచి బృహత్తు ధ్యేయమై!  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. వరమగు తపమును జేయుచు
  నిరతము శ్రీహరి పదములె నెమ్మది తలచన్
  పరమాత్ముడు కరుణింపగ
  మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్

  రిప్లయితొలగించండి
 11. నిరతము సత్య ధర్మముల నీతిని ధారణ జేయ తల్చుచున్
  గురువుల తల్లిదండ్రులను గోవుల నిత్యము గౌరవించుచున్
  పరయుపకార దీక్షగొని వంచన వీడుచు నాత్మవైరి కా
  మ రణమునున్ జయించిననె మర్త్యు డనంబడు నెవ్విధిన్ గనన్

  రిప్లయితొలగించండి
 12. మరణము మానవాళి నొకమారె వరించనఁ గల్లఁ గాదె సం
  సరణము నందు చావులవి సారెకు సారెకు సంభవించు నా
  పరిభవరూపమృత్యువులు, పన్నుగ తద్విధ హేయసంక్రమ
  న్మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సరి సాధనతో రుద్రుని
  నిరతము కొలుచుచు నతనికి నెమ్మినొసగుచున్
  వరముగ సిద్ధిని బొందుచు
  మరణమును జయించువాడె మర్త్యుండన్నన్.

  సరియగు సాధనమ్మున విషాంతకు నెంచుచు నిత్యమంతయున్
  పురువడిగూడు నాదటను పూజలు సేయుచు రుద్రుడాతనిన్
  శరణము గోరుచుండుచు నసాధ్యమునౌ పరమమ్ము నొందుచున్
  మరణమునున్ జయించిననె మర్త్యు డనంబడు నెవ్విధిన్ గనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు  1. సరియగు సాధనమ్మున విషాంతకు నెంచుచు నిత్యమంతయున్
   పురువడి గూడునాదటను పూజలు సేయుచు రుద్రదేవునిన్
   పరమపదమ్ము నిమ్మనుచు ప్రార్థన జేసి గ్రహించి ఘోరమౌ
   మరణమునున్ జయించిననె మర్త్యు డనంబడు నెవ్విధిన్ గనన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 14. కె.వి.యస్. లక్ష్మి:
  గురువుగారికి నమస్కారములు. నిన్నటి పూరణ పరిశీలించగలరు.

  వానలం గురిపించకు వరుణదేవ
  నీవె నాధారమనుమాట నిజము జెప్ప
  నీవు నాగ్రహించిన నింక నిలువలేము
  కరుణమేఘుడ! చాలింక కదలిపొమ్ము.

  రిప్లయితొలగించండి
 15. నిరతము సత్కార్యమ్ముల
  మరువక జేసిన పదుగురి మదిలో కొలువై
  స్థిరముగ నిలుచునతండే
  మరణమును జయించువాఁడె, మర్త్యుం డన్నన్

  రిప్లయితొలగించండి
 16. ధరణిని పుట్టిన జీవికి
  మరణమ్మనివార్యమంచు మరచితి వేమో
  మరియేల పలికితివిటుల
  మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్.

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  కీ. శే. శ్రీ రాపాక ఏకాంబరాచార్యులవారికి🙏🙏🙏

  జయన్తి తే సుకృతినో రససిద్ధాఃకవీశ్వరాః l
  నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్ ll

  ధర నరుడై జనించిననుదారమతిన్ నిజకావ్యసృష్టి సు...
  స్థిరతరకీర్తి గాంచి రససిద్ధునిగా సుకృతంపురాశిగా.,
  నరిగిన దేహమున్ వదలి., యాతడు నిల్చు యశశ్శరీరుడై!
  మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ధన్యవాదములండీ.. చిన్న పొరపాటు టైపింగ్ లో...(మూడవపాదంలో చిహ్నం.(.,) (!)మార్పు... 🙏🙏


   కీ. శే. శ్రీ రాపాక ఏకాంబరాచార్యులవారికి🙏🙏🙏

   జయన్తి తే సుకృతినో రససిద్ధాఃకవీశ్వరాః l
   నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్ ll

   ధర నరుడై జనించిననుదారమతిన్ నిజకావ్యసృష్టి సు...
   స్థిరతరకీర్తి గాంచి రససిద్ధునిగా సుకృతంపురాశిగా.,
   నరిగిన దేహమున్ వదలి., యాతడు నిల్చు., యశశ్శరీరుడై
   మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

   తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.

   తొలగించండి
 18. అరుదగు మానవ జన్మము
  వరముగ లభియించె ననుచు భక్తి పరుండై
  యరి ష డ్వ ర్గ గుణ ము లా
  మరణము ను జయించు వాడె మర్త్యు o డన్న న్

  రిప్లయితొలగించండి
 19. నరునెదను భీతి కన్నను
  మరి రుగ్మత యుండదనెడి మర్మమెఱుంగన్
  సరిగొన బూనుచు భయమను
  మరణమును జయించు వాడె మర్త్యుం డన్నన్!

  రిప్లయితొలగించండి
 20. ధరణిని చెడ్డకాలమది దాపుర మయ్యె కరోన రూపునన్
  దొరకదు మందు నేడు ప్రజ దుఃఖము బాపగ, నిట్టి వేళలో
  స్థిరముగ వెజ్జు సూచనలఁ జేయుచు కృత్యములన్న కాలపున్
  మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్

  రిప్లయితొలగించండి
 21. అరిషడ్వర్గమ్ముల దా
  నరికట్టుచు ధ్యానమందు హ్లాదము గొనుచున్
  వెరపన్నది లేక యిలను
  మరణమును జయించువాడె మర్త్యుండన్నన్

  రిప్లయితొలగించండి
 22. పరిణయశీలమౌ జగతి ప్రాభవ మొప్పగ మానవాళియై
  కరుణను జ్ఞానమార్గమును కర్మను వీడని దైవరూపమై
  నిరతపు జన్మజన్మలును నిస్తుల భౌతిక సౌఖ్యమౌజరా
  మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 23. నిరతముకర్మశీలురయినిశ్చలభక్తినిదేశసేవకై
  మరణములెక్కసేయకయెమాననిచీనిపరాపకారమై
  కరుణనువీడిపోరిమనకల్నలుభారతికిచ్చెహర్షమున్
  మరణమునున్జయించిననెమర్త్యుఁడనంబడునెవ్విధిన్గనన్

  రిప్లయితొలగించండి
 24. మరణముగల్గువారలనుమర్త్యులటంచువచించుచట్టముల్
  తరుణమునందుస్థైర్యమునుధైర్యముజూపితృణంబుకైవడిన్
  స్ధిరయశమైజగద్దితముదేహమువీడెజవానుడిద్ధరన్
  "మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్

  రిప్లయితొలగించండి
 25. తిరముగ జనుల తలపులన్
  నిరతము నెవ్వాఁడు నిల్చు నీత్యర్థముగా
  దరుమము దప్పక, వాఁడున్
  *"మరణమును జయించువాఁడె, మర్త్యుం డన్నన్"*

  రిప్లయితొలగించండి
 26. మరణము తప్పదు మనిషికి
  మరణమునకు వెరవకెపుడు మంచిని సేయన్
  మరువరు జనులతని మదిని
  మరణమును జయించు వాఁడె మర్త్యుం డన్నన్

  రిప్లయితొలగించండి
 27. మరణము దప్పదేరికిని మానవులై జనియింప మేదినిన్
  వెరవక దానికై మదిని విష్ణుపదంబును నమ్మి గొల్వకన్
  సరి సరి యేమి మాటలివి సార విహీనములెట్లు సత్యమౌ
  "మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు" నెవ్విధిన్ గనన్

  రిప్లయితొలగించండి

 28. పిన్నక నాగేశ్వరరావు.

  జర, రుజలు సహజ మటులనె
  మరణమ్మును సహజము గద మనుజుల
  కెల్లన్
  మరి యిట్టులనుట తగునా
  మరణమును జయించువాడె మర్త్యుం
  డన్నన్?

  రిప్లయితొలగించండి
 29. సురలోక వాసుడన్నను
  మరణమును జయించువాడె, మర్త్యుండన్నన్
  మరణము లోపేయాత్మను
  శరణాగతిఁ బొందజేసి యమరులగలియున్.

  రిప్లయితొలగించండి
 30. జర రుజలతోజనమ్ములు
  మరణించుట వింతకాదు మహిలో నెపుడున్
  హరికరుణమునంది సతము
  మరణమును జయించు వాడె మర్త్యుండన్నన్

  రిప్లయితొలగించండి
 31. నిరతము పరులకు మేలును
  జరుపుచు స్వార్ధము విడచిన సజ్జను లెపుడున్,
  ధరలోన కీర్తి శేషులె!
  "మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్"

  రిప్లయితొలగించండి
 32. 17.08.2020
  అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ యత్నం.

  *కం*

  ధరణిన్ కీర్తిని బొందుచు
  కరుణను తా నెల్ల వేళ ఘనముగ పంచా
  సిరులవి సొంతమనచు దు
  *ర్మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్"*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 33. అరిషడ్వర్గముఁజంపుచు
  నెరుకయుఁజూపుచుమనుగడనెదిరింపంగా
  నరుడేజేతగనిలుచును
  మరణమునుజయించువాడెమర్త్యుండన్నన్

  రిప్లయితొలగించండి
 34. మరణముతథ్యము మనిషికి
  మరణభయముతోబ్రతుకుట మరణముకాదే
  మరణస్మరణముజేయక
  మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్

  రిప్లయితొలగించండి
 35. ధరమృత్యుంజయుడనబడు
  మరణమునుజయించువాడె,మర్త్యుండన్నన్
  నెఱుగుముమానవునింగను
  మరణంబునులేనినతడుమహినింగలడే?

  రిప్లయితొలగించండి
 36. మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్
  ధరణిని ధర్మమున్ నిలుప దానవ జాతిని ద్రుంచినట్టి దా
  శరథికి లేదు మృత్యువట, సత్యము దప్పని వారలైన స
  త్పురుషులె నిల్చియుందురిల మోదము నంది జనాళి గుండెలో.

  రిప్లయితొలగించండి
 37. పరహితమును కోరుకొనుచు
  నిరతము దైవమును దలచి నేయము తోడన్
  దరదము లేక చరించిన
  మరణమును జయించు, వాడె మర్త్యుండన్నన్!!!

  రిప్లయితొలగించండి
 38. మరణమునున్ జయించిననెమర్త్యుడనంబడునెవ్విధిన్ గనన్
  మరణమునున్జయించుటనుమర్త్యునిసాధ్యముకాదుగాభువిన్
  ధరనుజనించినట్టిప్రతితమ్ముడునన్నయునెల్లవారలున్
  మరణముదప్పదంచునికమానసమందునగొల్వుడీశునిన్

  రిప్లయితొలగించండి
 39. చం:

  తరగని సంపదల్ గలిగి తక్కరి చేష్టలు మాని, నొప్పెడిన్
  పరపతి మీర దీనజన భారము నెంచి సమాజ మందునన్
  నిరతము మేలు సేయుచును నిశ్చల చిత్తము జూపు వాడె పో
  మరణమునున్ జయించిననె మర్త్యుడనంబడు నెవ్విధిన్ గనన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 40. నర లోక వాసులకు న
  చ్చెరు వైన వపాయము లతి చింత్యమ్ములు దు
  ష్కర మైనను బ్రజ్ఞన్ దు
  ర్మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్


  కరణము లెల్లఁ జేసిన సకాలము నందుఁ జెలంగి మే లగున్
  నరులకుఁ గష్ట సాధ్యము లనంతర మెంచి మనమ్ము నందు దు
  ష్కరమును గూడఁ జేయగను సంభవ కార్య మమర్త్యుఁ డంచు, నీ
  మరణమునున్ జయించిననె, మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్

  [మర్త్యుఁ డమర్త్యుఁ డనంబడు నని భావము;
  మర్త్యుఁడు = మర్త్య లోక వాసి; అమర్త్యుఁడు = మరణము లేని వాఁడు]

  రిప్లయితొలగించండి
 41. మరణమునేస్మరించుచునుమారణహోమముసల్పి పిల్లలన్
  కరుణనుమాలిచంపితుదకాపరమాత్మునిచేతిలోనతా
  పరమపదించెకంసజనపాలుడవార్యముచావు యేరికిన్
  మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్

  రిప్లయితొలగించండి
 42. పరులకు సేవజేయుటయె ప్రాణుల కెల్లను జీవధర్మమౌ
  వరముగ సప్తసంతతిని భావి తరంబుల మేలుగోరుచున్
  తిరముగ పాదుకొల్పినను దీనుల గుండియలందు నిత్యుడై
  మరణమునన్ జయించిననె మర్త్యుడనంబడు నెవ్విధిన్ గనన్

  సప్తసంతతి = సప్తసంతానాలు

  రిప్లయితొలగించండి

 43. పిన్నక నాగేశ్వరరావు.
  ( రెండవ పూరణము )

  వెరవక కరోన సోకిన
  సరియగు మందులను వాడి స్థైర్యము
  తోడన్
  నిరతము యోగా చేయుచు
  మరణమును జయించువాడె మర్త్యుం
  డన్నన్.

  రిప్లయితొలగించండి
 44. కందం
  ధరణిని 'భయమె' మరణమను
  నరేంద్రుని సుభాషితమ్ము నమ్ముచుఁ దెగువన్
  నిరతముఁ బురోగమించఁగ
  'మరణము'ను జయించువాఁడె మర్త్యుం డన్నన్

  చంపకమాల
  తరుమవె కోతులున్ జెలఁగి ధైర్యము వీడుచుఁ బారఁ జూడ, వెన్
  దిరిగితి వేని భీతిఁ గొని దిక్కులకొక్కటి పారిపోవు నీ
  మరణ సమానమౌ 'వెఱపు' మానుమటన్న నరేంద్రు బోధలన్
  ' మరణము' నున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్!

  రిప్లయితొలగించండి