ఆహా... ఇంతకాలానికి మీచేత దత్తపది వ్రాయించ గలిగాను. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. (భారతంలో పెన్ను, ఇంకు మొదలైనవి ఉండవు కదా... అందరూ కచ్చితంగా అన్యార్థంలోనే దత్తపదాలను ప్రయోగిస్తారు అనుకొన్నా! మీరు ఈ రూట్లో వస్తారని ఊహించలేదు!)
అలుపే పర్వదు నా మదిన్నిక సమ స్యల్దీరునే వేగమున్ తలపున్నన్ను దహించు నీ వికృత కృ త్యం బుక్కు దేహాన చే తల జూపించెద నాదు శౌర్యమును స ద్యఃస్ఫూర్తి బెన్గాలినై విలపించన్దగ దీవు జంపెదను భా విన్నింక నా కీచకున్!
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
కోపము వీడి భారతము కొండొక రీతిని వ్రాయబూనుచున్
తాపము హెచ్చగా మిగుల తప్పులు పోవగ సెల్లు ఫోనునన్
పాపయ శాస్త్రులన్ సుతులు పండుగ జేయుచు టెక్ససందునన్
పేపరు బుక్కు పెన్నులను ప్రీతిని తీసిరి యింకు పాటుతో
🙏
ఆహా... ఇంతకాలానికి మీచేత దత్తపది వ్రాయించ గలిగాను.
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
(భారతంలో పెన్ను, ఇంకు మొదలైనవి ఉండవు కదా... అందరూ కచ్చితంగా అన్యార్థంలోనే దత్తపదాలను ప్రయోగిస్తారు అనుకొన్నా! మీరు ఈ రూట్లో వస్తారని ఊహించలేదు!)
🙏😊
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబుక్కున పేపరున్ తెఱచి పొందగు రీతిని నింకు పెన్నునన్
చక్కగ నింపి యర్జునుని సాహసకృత్యము లేర్చికూర్చుచున్
చొక్కమునైన పద్ధతిని సూతసుతుండగు కర్ణు నాజిలో
చక్కడగించు ఘట్టమును చందుగ వ్రాసె నతండు జూడుమా!
మీరు కూడా ప్రభాకర శాస్త్రి గారి మార్గం పట్టారు.
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి, గురువర్యులకు ఇద్దరకూ నమస్కారములు.
తొలగించండిభీముడు సైరంధ్రితో....
రిప్లయితొలగించండిఅలుపే పర్వదు నా మదిన్నిక సమ
స్యల్దీరునే వేగమున్
తలపున్నన్ను దహించు నీ వికృత కృ
త్యం బుక్కు దేహాన చే
తల జూపించెద నాదు శౌర్యమును స ద్యఃస్ఫూర్తి బెన్గాలినై
విలపించన్దగ దీవు జంపెదను భా
విన్నింక నా కీచకున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికృష్ణుడు పాండవులతో
రిప్లయితొలగించండిచక్కని గెలుపే పర్యవసానము గద
బుక్కెడు పరమాన్నము దిను ప్రొద్దు గనుము
విజయ మింకెంతొ దూరము వెళ్ళలేదు
కీర్తియన్ పెన్నిధి దొరకు కీడుదొలగు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండిదత్తపది :
రిప్లయితొలగించండిపేపర్ - బుక్ - పెన్ - ఇంక్ అనే పదాలతో
భారతార్థంలో ఇష్టమైన ఛందస్సులో
( వివాహమాడి కౌరవవంశరక్షణ కావించ
మని భీష్మునికి చెబుతున్న సత్యవతీదేవి )
వగపే పరుగిడె నామది
సెగలను జిమ్ముచు నుబుకుచు ; శీఘ్రమ నీవే
తగుదువు పెన్ముప్పును బా
పగ ; బరిణయమాడు భీష్మ ! వంతయు
నింకున్ .
(వగపు - శోకము ; వంత- బాధ )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభీమా! చంపే పర్వము
రిప్లయితొలగించండినా మల్లచఱచుట నాపు మా పెన్గొనులా
టన్! మక్కించి ఋబుక్షము
కున్ మగధాధీశు ననుపు, గొదగొను మింకన్౹౹
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ, నాల్గవ పాదాలలో ప్రాస తప్పింది. టన్+మక్కించి=టన్మక్కించి, కున్+మగ=కున్మగ... మ,న్మ లకు ప్రాసలేదు.
ఈ నాటి శంకరాభరణం వారిదత్తపది
రిప్లయితొలగించండిపెన్,బుక్,ఇంకు,పేపరు
ఈ పదములతో భారతార్ధము
సీసములో నా పూరణ
ప్రేయసీ నీవల(పేపరు)గులను తీయించుగా పురుషుని, యెంచి కొంటి
వే మంచి (యింకు)వ,వేగిరము గనిట్టి నర్తన శాలలో నాదు కోరి
కను తీర్చ నుంటివి గా నొకపరి తీయ
వలయు నీ ముసుగు,దీపపు వెలుగు
లోనిను చూచెద నేనని దరిచేర
వలలుడు తనపిడికిలి బిగించి
మార్కొన డు(బుక్కు)న పడెను మత్తు వదలి
కీచకుడు విస్మయము నొంది కాచు కొనుచు
(పెన్గొ)నుచు ముష్టి యుద్ధము భీకరముగ
చేసి నసువులు రయముగ బాసె నపుడ
ఇంకువ. చోటు
పెన్గొని త్రోపులాడు
పూసపాటి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి"దీపపు వెలుంగు..." అనండి. లేకుంటే గణభంగం.
నిన్నటి పూరణ
రిప్లయితొలగించండివికలుండై వ్యధఁ జెంద ధర్మవిభు డావేక్షించి క్రోధాళువై
ప్రకటాటోపవిపక్షహృద్దళనతీవ్రావేశదుర్వీక్ష్యుడై
బకసంహర్త జయమ్ముఁ గోరి మదిలో, పాంచాలితో భాస్కరాం
బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్.
భాస్కరాంబకుడు = శ్రీమహావిష్ణువు
(చక్షూ స్సూర్యోऽజాయత అని పురుషసూక్తం)
కృష్ణ ద్రౌపది.
కంజర్లరామాచార్య.
మీ పూరణ అద్భుతంగా, మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండికృష్ణ!నీదు రూ(పేపర)మోష్ణగతుల
నార్పును గ(బుక్కు)న వినుము కూర్పు మయ్య
సంధి (పెన్)యత్నమును జేసి సత్య (మింకు)
తగవు లిద్దానిచే ననె ధర్మజుండు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినేటి దత్తపది🙏🏻
రిప్లయితొలగించండిఆపే పరుసములిక, నీ
కోపంబుక్కారణంబు కోమలి కృష్ణా!
ఈపెన్ జీకటి కీచకుఁ
రూపింకీమట్టి గలియు రోదించకుమా!
నిన్నటి పూరణము:
శా.
ప్రకటంబయ్యెను కీచకాధముడు, పాపాత్ముండు, కామాంధుడా
సకటున్ పీడమడంచ నా వలలుతో సైరంధ్రియే వేడగా
సకలంబా హరి గాచునంచెరిగి యాసద్బాంధవున్, తోయజాం
బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్
సకటుడు-దుష్టుడు (పర్యాయపద నిఘంటువు,GN Reddy 1990)
కృష్ణ-ద్రౌపది
🙏🏻🙏
మీ మొదటి పూరణ బాగున్నది.'కోపంబుక్కారణంబు' అనడం సాధువు కాదు.
తొలగించండిమీ నిన్నటి పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది.
అభినందనలు.
రిప్లయితొలగించండిజరాసంధుని వధ
చట్టున మునుపే పర్రున
గుట్టుగ శాదమును చీల్చి కూల్చుట నేర్పెన్
కొట్టుచు గబుక్కు పెన్గొని
పట్టుచు విదళింప నింకె బార్హద్రథుడే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆపకు కంబుకంఠి! మనసాయెను నీపయి., నీదు సొంపులిం...
పే., పరుడంచునెంచకె.,రహిన్ దరి జేరవె.,మన్మథాగ్నిలో
వేపకె., నిన్ను నన్ను గలిపెన్ విధి., మాలిని! రాజ్యమంతయున్
నీపరమౌను నన్ను కరుణించిన., నింక సుఖాల దేల్చవే!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.
తొలగించండిమళ్లీ కీచకుడేనా :)
కన్ఫరమ్ గా విరాటు కొల్వులోని వారే :)
జిలేబి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండినమఃపూర్వకకృతజ్ఞతలండి.
తొలగించండి28, ఆగస్టు 2020, శుక్రవారం
రిప్లయితొలగించండిదత్తపది - 170
పేపర్ - బుక్ - పెన్ - ఇంక్
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి
నా పూరణ.
*** *** **
( శ్రీ కృష్ణుడు రాయబారిగా వెడలి కౌరవేంద్రునితో పలుకు సందర్భము .... )
తే.గీ.
వ్యర్థపు తల(పే పరు)గులు వాఱుటేల?
తగదు నీకు సుయోధన!వగలు దెచ్చు
కాదది సబ(బు.కు)రిపించు గారవమును.
మంచి తల(పెన్ను)కొని నీదు మనమునందు
పాండుసుతులదౌ భాగము వారికిడుము.
(ఇంకు) సుంత పాపములు పృథ్వీశ నీకు!
🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివలపేపరువిడెనుబుకుచు
రిప్లయితొలగించండితలపేపెన్బాధనింకెతరుణీమణిరో
పిలుపేయాలస్యమునీ
తలవాకిటసౌబలుండుదాసుండగులే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపేపరు పులియౌ నుత్తర వీరు మనసు
రిప్లయితొలగించండిబుక్కు లోనున్న పుటలను పూర్తి చదివి
పెన్నిధి గ మారి భయమది వీగి పోవ
పార్థు డింకించె కురుసేన బ వర మందు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి*కీచకుడు ద్రౌపదితో మదోన్మత్తుడై పలికిన మాటలుగా* నీ తలపే పర్వేందు ము ఖీ! తాపము పెంచుచుండె కేశిని, యింకే లా, తామసము గబుక్కున . నా తారసమునకు రమ్ము నారీ ముదమున్.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబుక్క గొన్నట్టి వస్త్రము వెక్కిరించ
రిప్లయితొలగించండినేల నాపెన్ కదియగ నీ కాలహరణ
మనియె యోర్మి ఇంకి యతని మనము నందు
చెలువ తలపే పరుగు లిడ సింహబలుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*ఇంకే *పెన్మాయ నిలువదు
రిప్లయితొలగించండిబింకము వీడి నిలువుమిట వేగమె పార్థా !
కుంకల రోషం *బుక్కన్
లెంకల జేయ పగలనిట రే*పే పర్వమౌ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*బుక్కగా నతిథిగ వచ్చె నక్కసాన
రిప్లయితొలగించండికోపి దూర్వాస మౌని *పెన్ తాపమొంది
మౌనుల తల*పే పర్వములౌను కృష్ణ !
బోన మిడవేగ పడు*మింక వారిజాక్షి !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదత్తపది : పేపర్ - బుక్ - పెన్ - ఇంక్
రిప్లయితొలగించండిద్రౌపది శ్రీకృష్ణునితో....
తేటగీతి:
బాధనోర్చితి బుక్కిట బట్టి బట్టి
సైపలేనింక మాధవా సంధియేల
క్రమ్మె పెన్మాయ దొలగించి గావుమయ్య
అనిని గెలుపే పరుగెత్తి యంద మాకు.
---గోలి.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికుప్పించన్ చుబుకమ్ము నిప్పులనె యుగ్రుండౌచు భీముండనున్
రిప్లయితొలగించండితప్పెన్ ధర్మము కౌరవాధముల యుద్ధంబింక తథ్యంబగున్
తప్పున్ వే తలలింకు రక్తములు విధ్వంసంబు సృష్టించెదన్
పప్పై పోవును వారిసేన గెలుపే పర్వంగ నేనాడెదన్
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిద్రౌపది కీచకునితో
రిప్లయితొలగించండివల *పే పర* కాంత పయిన
కలిగించును *పెను* విపత్తు గహ్వరి పైనన్
నిలుపుము జం *బుక* చేష్టలు
తొలగుము నీ *వింక* చావు దొరలక మున్నే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమడుగులో దాగున్న దుర్యోధనుని బయటకు రప్పించుటకై ధర్మజుడు ...
రిప్లయితొలగించండితల(పే పర్వి)డ నటు నిటు
కలహం(బుక్క)డగ జేయ గాసారమునన్
నిలి(పెన్) నను దుర్విధనుచు
విలపించెదవేల (నింక) వెలికిన్ రమ్మా
స్వర్గంలో అర్జునునితో ఊర్వశి..
రిప్లయితొలగించండికందం
తలపే పరుగులు వెట్టగ
వలపుబుకుచు కౌగిలింప వచ్చితి, తనువున్
మలచిన పెన్నిధుల మరు న
నలమ్మునకు రుధిరమింకు నరుడా! నీకై!!
28.08.2020
రిప్లయితొలగించండిదత్తపది..
*పేపర్ - బుక్ - పెన్ - ఇంక్*
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి
నా పూరణ యత్నం 🙏
*కం*
చూపే పరాయి నన నే
నోపక మనసిక నుబుకుచు నొంటరి యగునే
చూపెన్ ప్రేమను నీపై
ద్రౌపది తగు లీలలింక దాస్యమ్మిడుమా!!
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏
ఇంకనిదై స్వార్థము నా
రిప్లయితొలగించండివంక గన పరాన్నబుక్కువసుధాధీశుల్
పంకిలతలపే పరుపెన్
డొంకన బడియె కురురాజు నొంటరితుదకున్... (కృష్ణ వాక్కు)
స్వరములు జాఱ చివరను ద
రిప్లయితొలగించండినరు నిటు రేపేప రుబుకు నలి రే పేపర్
నరుఁడు నుబుక్ చాపెను పద
మరయం జాపెన్ మఱింకు నరయంగా నింక్
[నరుఁడు = అర్జునుఁడు; నలిన్ రేపు ఏపర్ ; నలి రోగము; ఏపు = బాధించు; ఏపరు: ఏపర్; ఉబుకు: ఉబుక్; చాపెను: చాపెన్; ఇంకు: ఇంక్, యిట్లు పదముల చివరి స్వరము జాఱిన యగు నని భావము]
కం:
రిప్లయితొలగించండివలపే పరమావధిగా
వెలుగుచు కీచుకు డుబుకెడి ప్రేమను జూపెన్
ఫలితము ద్రౌపది తడబడి
కలవర మందెను మనమున కన్నీళ్ళింకన్
వై. చంద్రశేఖర్
దత్తపది :-
రిప్లయితొలగించండి*పేపర్ - బుక్ - పెన్ - ఇంక్*
పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం
*కందం**
గెలుపే పరమావధి కా
వలెను గబుక్కుమని గెలవవలెను పెనుగులా
టలు లేక రాజ్యమబ్బదు
విలంబమేలింకను పద విజయా పోరన్
................✍️చక్రి
(యుద్ధ రంగమున నిలిచిన అర్జునునితో కృష్ణుడు)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపెన్వ లపుగల్గెనింకనేనోపలేను
రిప్లయితొలగించండిభామ!రావనీదుతలపేపరగెమదిని
పూనిరానిచోనసువుగు బుక్కుమనును
నంచుబ్రాధేయపడెనునా కీచకుండు
ఏకచక్ర పురంబున ‘ఇంకు’వ కడ
రిప్లయితొలగించండిఅసురుడింక తమను బుక్కు ననుచు వగచ
బకుని తానొంటరిగ చం’పే పరు’వ ముండి
నట్టి ‘పెన్ను’ద్ది నని భీముడనున యించె
ఇంకువ = నివాసస్థలం
బుక్కు = తిను
పరువము = యౌవనము
పెన్నుద్ది = పెద్ద ఆటగాడు
అనునయించు = ఊరడించు