25, ఆగస్టు 2020, మంగళవారం

సమస్య - 3468

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె"

(లేదా...)
"భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"

71 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    ఆర్యుడు పెండ్లియాడుచును హాయిగ నుండక క్షామమందునన్
    శౌర్యము జూపి యేడుగురు సంతును పెంచుచునుండ తీరుగా
    వీర్యము తగ్గు రీతిగొని వేడుక జేయుచు మందు మ్రింగగన్
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

    రిప్లయితొలగించండి
  2. ఆర్యగుణాభివృద్ధిగతినా చతురాశ్రమముల్ గలుంగ, స
    ద్కార్యములెల్లజేసి, కడకంట యతిన్ గని, పోవదల్చగన్
    శౌర్యత వీర్యవైఖరుల చాటగనాఖరికొక్కమారు, త
    ద్భార్యకు గర్భమాయెనని భర్త గడుంగడు బొందె దుఃఖమున్!

    ఆదిపూడి రోహిత్
    😊😊🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సత్కార్యము... పో దలంచగన్.. చాటుటకై తుద కొక్కమారు... (ఆఖరు.. అన్యదేశ్యం)..."

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ధైర్యము జేసి వృద్ధకుడు దండిగ శుల్కము నిచ్చి సుందరిన్
    వీర్యము కోలుపోవగను వేడుక మీరగ పెండ్లియాడగా
    క్రౌర్యము హెచ్చ వైరియగు గండర గండుడు కుఱ్ఱవానిదౌ
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

    రిప్లయితొలగించండి
  4. సంతు కాహారమిడు టయే చాల కష్ట

    మగుచు నుండెను గ "సుధామ" మరల బిడ్డ


    కష్టమని మనమున తలచు చుండ

    భార్య కున్ గర్భ మయ్యెను‌, భర్త యేడ్చె


    కుచేలుడి భార్య నెలతప్పెనని తెలుపగా ఆతని మనోరధము

    రిప్లయితొలగించండి
  5. సమస్య :
    భార్యకు గర్భమాయెనని
    భర్త కడుంగడు బొందె దు:ఖమున్

    (బలహీనురాలైన భార్యకిక గర్భం రానీయ
    వద్దన్న డాక్టరు మాట పాటించకపోతే ..?)
    " ఆర్యుడ ! జాగరూకతల
    నామెను నెప్పుడు చూచుకోవలెన్
    గార్యము లెన్నియున్నను ; వి
    ఘాతము లేర్పడు గర్భమైనచో ;
    ధైర్యము బూనియుండుమనె
    దట్టుచు వీపును డాక్టరమ్మ ; నా
    భార్యకు గర్భమాయె " నని
    భర్త కడుంగడు బొందె దు:ఖమున్ .

    రిప్లయితొలగించండి
  6. ఆర్యకుడు గొప్పగ తెలిపినంత నింక
    వెనుకముందులు జూడక పెండ్లియాడ
    కార్యమనునది కొనసాగక మొదలె దన
    భార్యకున్ గర్భమయ్యెను , భర్త యేడ్చె

    ఆర్యకుడు = తాత

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆడపిల్లలు యెక్కువై నార్యుడంత
    ప్రేయసికి గర్భ మాపగ వెజ్జుతోడ
    మందు నిప్పింపగ విఫలమయ్యె నదియె
    భార్యకున్ గర్భమాయెను భర్త యేడ్చె.

    ఆర్యుడు పత్ని తానొసగు నాడపరంపర నాపనెంచి త
    త్కార్యముకై భిషక్కు దరి ఖ్యాతిని గాంచిన మందుమాత్రలన్
    ధైర్యముతోడ నాలికిడి దండిగ మ్రింగగ జేసియుండినన్
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడు బొందె దు:ఖమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పిల్లలు+ఎక్కువై' అన్నపుడు యడాగమం రాదు.
      'కార్యమునకై' అనడం సాధువు. "కార్యమునన్ భిషక్కు..." అనవచ్చు.

      తొలగించండి


  8. అయ్యయో ! ఎల్ కేజీ లో సీటు రాకుంటే ఎలా :)



    భార్యకున్ గర్భమయ్యెను; భర్త యేడ్చె
    నోరి నాయనో స్కూలులో "నో" యనంగ
    నేమ గును నా గతి యనుచు నెత్తి పైన
    గుడ్డ వేసుకుని మదిని కుమిలిపోయె



    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. కందోత్పల


    పడి దొరలుచు నేడ్చెనయ! వి
    నడు! భార్యకు గర్భమాయెనని భర్త కడుం
    గడుఁ బొందె దుఃఖమున్ వ
    చ్చెడు బుడ తడి బడి గురించి చింతించెనయా !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. ఆది ,సోమ, మంగళ ,బుధ, యనుచు ముందు

    వారికి, గురు,శుక్ర శనులు వీరికి ముద

    ముగను పేరిడితిని, యిక ముందె చటను

    పేర్లు లేవుగా వారమున్ పెట్టగ తన

    భార్యకున్ గర్భమయ్యెను,భర్త యేడ్చె


    రాజబాబు రోదన. తాతా మనవడు సినిమా లో

    రిప్లయితొలగించండి


  11. కల లో ఓ క్షణంలో అన్నీ ఫ్లాష్ లా కనబడె

    తూర్యము లెల్ల మ్రోగె భళి ధూకళి ఝంకళి తో ముహుర్తమం
    దార్యుడు పెండ్లియాడె తనరారగ శోభన మాయె! శీఘ్రమై
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్
    ధైర్యము చాల లే బడిని తానిక సంతతి నెట్లు చేర్చుటో!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. తాను ఉద్యోగ విధులందు పనిలొ యుండి
    యింటి వైపుకు చూడక యిపుడు రాగ
    ఏమి ఖర్మమొ యీవర్త నిపుడు వినియె
    భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తాను+ఉద్యోగ' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. 'పనిలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'కర్మము' సాధుపదం. 'వార్త' టైపాటు.

      తొలగించండి
  13. ఆర్యుల దీవెనల్ సఫల మౌటను మిక్కిలి సంతసించె నా
    భార్యకు గర్భమాయెనని భర్త, కడుంగడుఁ బొందె దుఃఖమున్
    గ్రౌర్యము జూపె దైవమని కాంతకు బుట్టిన బిడ్డ యేమియున్
    జర్యలు లేక శీఘ్రముగ స్వర్గము జేరిన జూచి ఖిన్నుడై.

    రిప్లయితొలగించండి
  14. ఆర్యుల కాలమందు కడు యాఖరి జాతిన జన్మమొందగన్
    క్రౌర్యత పూని హీనులన రాక్షస వైఖరి జూపు సంఘమున్
    పర్యవసానమున్ తలచి భావన సేయుచు దీనుడొక్కడున్
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడు బొందె దుఃఖమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆఖరి' అన్నది అన్యదేశ్యం. అయినా 'కడున్+ఆఖరి=కడు నాఖరి' అవుతుంది.

      తొలగించండి
  15. భార్య ప్రసవము సంక్లిష్టభరితమాయె
    వైద్యుడామెకు మరుకాన్పువలన ప్రాణ
    గండమగుననె నేడాది నిండకుండ
    భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. "వార్యము కాని భీకరవిపత్తు కరోన భయమ్ములో భిష
      గ్వర్యుల జూపుటేల? తగు వైద్యమ దెట్లు!? సుఖప్రసూతికై
      ధైర్యముతోడ వైద్యమహితాలయమేది లభించు? నయ్యయో
      భార్యకు గర్భమాయె" నని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  17. గడచె పది యేండ్ల కాలమ్ము కాని తనకు
    సంతు కలుగ లేదని కడు చింత నుండ
    పుండు మీదను కారమై పొరుగు వాని
    భార్య గర్భ మయ్యెను భర్త యేడ్చె

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    సెలవుముగించుకొని సైన్యం పిలుపునందుకొని.. దేశరక్షణ లోనున్న ఒక జవాను......

    భూర్యవకాశమంచు వలపున్ తలపున్ వెఱపున్ త్యజించి స..
    త్కార్యము దేశరక్షణగ దాను దలంచిన సైనికుండు., స...
    ద్ధైర్యయుతుండె., వార్తవిని తల్లడిలెన్., జనలేని వేళలో
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  19. కార్యములందు దాసి కడుకమ్మని భోజన మిచ్చుతల్లిగా
    నార్యవసించుచున్ సతము హర్షము తోడుత జీవితంపు మా
    ధుర్యము గ్రోలుచుండగను దుర్విధి గర్భపు నంతరమ్ములో
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

    రిప్లయితొలగించండి
  20. కార్యములన్నియున్ మిగుల క్రన్నన
    చక్కగ బెట్టువాడునై
    ధైర్యము మీరగన్ గెలిచి దానము జేసెను రాజ్యమంతటిన్
    స్థైర్యము వీడకన్ మునుల శాపము
    బొందియు పాండురాజుకున్
    భార్యకు గర్భమాయెనని , భర్త గడుంగడు బొందె దుఃఖమున్

    భర్త = రాజు (ధృతరాష్ట్రుడు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో

      కార్యములన్నియున్ మిగుల కౌశలమున్ నెరవేర్చు వాడునై
      ధైర్యము మీరగన్ గెలిచి దానము జేసెను రాజ్యమంతటిన్
      స్థైర్యము వీడకన్ మునుల శాపము
      బొందియు పాండురాజుకున్
      భార్యకు గర్భమాయెనని , భర్త గడుంగడు బొందె దుఃఖమున్

      భర్త = రాజు (ధృతరాష్ట్రుడు )

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా, నమస్సులు! 🙏🙏🙏

      తొలగించండి
  21. కంసున కొసంగె నాపసికందు లార్వు
    రిన్ తదుపరి నాదేవకీ లేమ సప్త
    మమునఁ నానక దుందుభి మాన సమున
    భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె.

    ఆనక దుందుభి-వసుదేవుడు

    రిప్లయితొలగించండి
  22. స్థైర్యముధైర్యమిత్తునిజదారకుతోడయినీడనిత్తుమా
    ధుర్యముపంచియిత్తుగనుదోయికిఱెప్పయిగారవింతుసౌం
    దర్యముశౌర్యవీర్యములుదారతసంతుకుపాయమెంచుచో
    *భార్యకుగర్భమాయెననిభర్తకడుంగడుఁబొందెదుఃఖమున్*

    రిప్లయితొలగించండి
  23. ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
    భార్యలుగొన్నవారలకు భార్యల తాకిడి జోరులందినన్
    భార్యను గూర్చి పెట్టుటకు భార్యలచూపగ వేలవేలతో
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"

    రిప్లయితొలగించండి
  24. తనికెళ్ళ శేష వెంకటాద్రి హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  25. ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
    భార్యలుగొన్నవారలకు భార్యల తాకిడి జోరులందినన్
    భార్యను గూర్చి పెట్టుటకు భార్యలచూపగ వేలవేలతో
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"

    రిప్లయితొలగించండి
  26. ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
    భార్యలుగొన్నవారలకు భార్యల విలువలు తెలియలేగా
    భార్యను గూర్చి పెట్టుటకు భార్యలబ్రోకరు వేలవేలతో
    "భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె"

    (లేదా...)

    "భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"

    https://kandishankaraiah.blogspot.com/2020/08/3468.html?m=1

    రిప్లయితొలగించండి
  27. శౌర్యము చాల జూపుచును చక్కని చుక్కను పెండ్లి యాడె లే
    ధైర్యము జేసి యెంతగనొ దాసరి వెంకడు కుంటి వాడు లే
    కార్యము నాడె తెల్సుకునె కర్మ య దెట్టిదొ చూడుడీ భళా
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

    రాం కిదాంబి

    రిప్లయితొలగించండి
  28. శౌర్యము చాల జూపుచును చక్కని చుక్కను పెండ్లి యాడె లే
    ధైర్యము జేసి యెంతగనొ దాసరి వెంకడు కుంటి వాడు లే
    కార్యము నాడె తెల్సుకునె కర్మ య దెట్టిదొ చూడుడీ భళా
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

    రిప్లయితొలగించండి

  29. పిన్నక నాగేశ్వరరావు.

    నల్గురాడ పిల్లలె మగ నలుసు వలయు
    ననెడు భర్తకున్ వెజ్జులు నచ్చచెప్ప
    సమ్మతించెను చివరకు సంతునాప
    కాని, యింతలో సమయము గడచి కొంత
    భార్యకున్ గర్భమయ్యెను, భర్త యేడ్చె.

    రిప్లయితొలగించండి
  30. ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
    భార్యలుగొన్నవారలకు భార్యల విలువలు తెలియలేగా
    భార్యను గూర్చి పెట్టుటకు భార్యలబ్రోకరు వేలవేలతో

    రిప్లయితొలగించండి
  31. ధైర్యము సన్నగిల్లినను దారుణమౌ నిజమున్ గ్రహింపగా,
    స్థైర్యము నీయబూని యది తప్పనెరింగియు దాను బొంకినన్
    భార్యకు గర్భమాయెనని; భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్
    పర్యవసానమున్ దలచి, స్వస్థత నిమ్మని వేడె దైవమున్

    రిప్లయితొలగించండి
  32. సంతులిద్దరు గల్గిరిసతికి,మరల
    భార్యకున్ గర్భమయ్యెను,భర్తయేడ్చె
    బ్రదుకుభారమగుననుచువంతగలిగి
    సగటుమనుషులబాధలుసక్కనగునె!

    రిప్లయితొలగించండి
  33. ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
    భార్యలుగొన్నవారలకు భార్యల తాకిడి జోరులందినన్
    భార్యను గూర్చి పెట్టుటకు భార్యలచూపగ వేలవేలతో
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"

    రిప్లయితొలగించండి
  34. ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
    భార్యలుగొన్నవారలకు భార్యల తాకిడి జోరులందినన్
    భార్యను గూర్చి పెట్టుటకు భార్యలచూపగ వేలవేలతో
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"

    తనికెళ్ళ శేష వెంకటాద్రి

    రిప్లయితొలగించండి
  35. పాడు రోగమది కరోన వచ్చి యాసు
    పత్రి జేరెసతియనుచు బాధ పడెడు
    పాళ మందు తెలిసెనొక వార్త యదియె
    భార్యకున్ గర్భమయ్యెను, భర్త యేడ్చె.

    రిప్లయితొలగించండి
  36. కార్యము చేయగా వలదు కాంచగ లేవు ముహూర్తమొక్కటం
    చార్యులు చెప్పనేమి విరహమ్మును తాళగ లేని దంపతుల్
    ధైర్యము చేసి వారు సురతమ్మున పాల్గొనినంత శీఘ్రమే
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

    రిప్లయితొలగించండి
  37. భార్యకుగర్భమాయెననిభర్తకడుంగడుబొందెదుఃఖమున్
    భార్యకుగర్భమౌటకునుబాధనునొందుటపాడియేరవీ!
    భార్యయకారణంబుగదభర్తకుగౌరవమబ్బచేతకున్
    భార్యయుభర్తయున్ దనరుభావితరాలకుమార్గదర్శులౌ

    రిప్లయితొలగించండి
  38. ఏరి కుండదు పుట్టఁ గుమారుఁ డాలి
    కింపుగ మనమ్ము లోపల నెన్నఁ డైనఁ
    బట్ట లేక యానందము కట్టెదుటనె
    భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె


    ఆర్య కులాభివృద్ధికి మహత్తర భాగ్యవిధాయకమ్ము న
    ధ్వర్యచ యాత్త సత్ఫలము వంశ వివర్ధన మౌను గర్భమే
    కార్య మకార్య మందు ఘన కార్యము నందు విభేద శూన్యుఁడే
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

    రిప్లయితొలగించండి
  39. ఆర్యకుడంతగా దెలుప నన్యములెంచక పెండ్లియాడగా
    కార్యము సాగకుండగనె గాథనుదెల్పిరి బంధులందరున్
    భార్యకు గర్భమాయెనని , భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్
    పర్యవసానమంచు పతివత్నికి తెంపునొసంగ బూనెగా

    రిప్లయితొలగించండి
  40. విదేశ ప్రయాణము తప్పినందులకు , ఒకవైపు సంతోషమున్ననూ, మనస్సులో బాధ పడిన సమయాన్ని ఉటంకిస్తూ ఈ పద్యము

    ఉ:

    కార్యము లెంచి నున్నతిని గాంచి విదేశ ప్రయాణమన్నచో
    పర్య వసానమున్ దెలియ పంతము నెగ్గక బోవ నుల్లమున్
    క్రౌర్యము తోడ నా గరళ కంఠుని యాజ్ఞ యిదేమి చిత్రమో
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడు బొందె దుఃఖమున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  41. కోరి కోర్కెతో ముందుగ కరముబట్టి
    వారి చుట్టా ల పక్కాల వాసమంది
    హాయి హాయిగా ఊ రేగి హాయిగోర
    *భార్యకున్ గర్భమయ్యెను; భర్త యేడ్చె!*

    తనికెళ్ళ శేష వెంకటాద్రి హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  42. కోరి కోర్కెతో ముందుగ కరముబట్టి
    వారి చుట్టా ల పక్కాల వాసమంది
    హాయి హాయిగా ఊ రేగి హాయిగోర
    *భార్యకున్ గర్భమయ్యెను; భర్త యేడ్చె!*

    రిప్లయితొలగించండి
  43. ఆర్యుడు కంసుడాదటను హంగుగ చెల్లెలి బెండ్లిజేయుచున్
    ధైర్యమె జారగా వినగ దానికి గల్గెడు పుత్రుడేయరిన్
    క్రౌర్యము మీరనిర్వురిని కారగృహమ్మున బందిజేయగా
    భార్యకు గర్భమయ్యెనని భర్త కడుంగడు బొందె దుఃఖమున్

    రిప్లయితొలగించండి
  44. తేటగీతి
    సంతుకై ముప్పదేళ్లుగ సలిపి సతిని
    పొరుగువారింట వేవిళ్ల మురిపెమనఁగ
    మంగళకరమై మిత్రుని మనుమని దగు
    భార్యకున్ గర్భమయ్యెను, 'భర్త' యేడ్చె!

    ఉత్పలమాల
    పర్యవసానమున్ గనక వాక్కిడె ప్రేమఁగ శంతనుండు దు
    శ్చర్యల కన్న పుత్రులను జార్చఁగ నిర్దయ 'గంగ' నీటఁ ద
    త్కార్యము నాప వీడునని ధైర్యము జాలక తేపతేపకున్
    భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్!

    రిప్లయితొలగించండి