కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ"
(లేదా...)
"అసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ"
(లేదా...)
"అసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్"
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
విసుగు విరామమున్ గనక వీధుల వెంటను గొంతుచించుచున్
కసిగొని మోడినిన్ తెగడి గర్జన చేయుచు గాంధి వంశపున్
రసికుడు నోడగన్ గనుచు రచ్చను జేయుచు హస్తినమ్మునం
దసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్
తొలగించండిఅర్జునుడు = (స్వర్గవాసి) అర్జున్ సింగ్
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఇది సరదా పూరణ ఎంతమాత్రం కాదు.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ముసిముసి నవ్వులీనుచును ముచ్చట మీరగ ముత్తుకూరునన్
రుసుమును పొంది ముందుగను రొప్పుచు రోజుచు యుద్ధభూమినిన్
తసదియ వీధి నట్టువను త్రాగి గుడుంబను జాస్తిజాస్తిగా
నసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్
అర్జునకు మోడికి ముత్తుకూరుకు సంభంధము నా బుర్రకు చిక్కలేదు చిక్కు ముడి విప్ప దీయారా అర్యా
తొలగించండి
తొలగించండివీధి నట్టువ = వీధి నాటకము
తొలగించండిపీ యెస్కె గారు
మధ్యలో మోడి ఎక్కడినుంచి వచ్చేరు ? :)
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపాదమునకు బాణముతాక వ్రజధరుండు
రిప్లయితొలగించండినసువు లంబాసె, నర్జునుం డంద రేడ్వ
వలదనుచు నూరడించి యా వనిత లెల్ల
రను రయముగ ద్వారక నగరమును విడచి
రమ్మని పలికి తోడ్కొని రాజ మంది
రమ్ము వీడ, సంద్రము లో పురమ్ము మునిగె
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి"వ్రజవిభుండు" అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబాలకుడభిమన్యుండట బవర మందు
అసువులంబాసె; నర్జునుండందఱేడ్వ
తాకనలి సైంధవుని జంప భీకరమగు
శపథమెంచి నిపత్యకు సాగె నడరి.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికసిగొని పద్మమొగ్గరము ఖండన
రిప్లయితొలగించండిసేయగ నేర్పుమీరగన్
ముసురుచు కౌరవాధములు ముద్దుల బాలుని సంహరించగా
నసువుల బాసె నర్జును డనంత విషాదమునొంద, నందఱున్
వసుధను చావుపుట్టుక లవారితమంచును నూరడించరే !
సినిమా అర్జునుడు NTR
తొలగించండివిసుగు విరామమెంచకను వేషములెన్నియొ వేసి గొప్పగన్
పసగల కృష్ణకర్ణ కురు వంశపురాజుల పాత్రధారుడై
వసిగొని యంత్యకాలమున భామను పార్వతి బెండ్లియాడగా
నసువులబాసె నర్జును డనంత విషాదమునొంద నందఱున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'పద్మ మొగ్గరము' దుష్టసమాసం.
ధన్యవాదములాచార్యా! తమ్మి మొగ్గరముగా మార్చెదను! 🙏🙏🙏
తొలగించండిసందర్భము :
రిప్లయితొలగించండిఅశ్వమేధ యాగంలో భాగంగా మణిపురము వచ్చినపుడు
ఉలూచి బభృవాహనుని వద్దకు వచ్చి యుద్ధము చేసి తండ్రిని సంతోషపెట్టమని చెప్పగ , నతడు ప్రయోగించిన బాణము అర్జుని ప్రాణం తీసింది. అప్పుడు ఉలూచి బభృవాహనునికి సంజీవనిమణిని
ఇచ్చి అర్జునుని గుండె పై నుంచ తిరిగి బ్రతికాడు.
తే॥గీ॥
ప్రేయసి యులూచి యిచ్చిన ప్రేర ణమున
తనయుడు విడిచిన శరము తాకినంత
నసువులం బాసె నర్జునుం డందఱేడ్వ ,
ఉవిద యిచ్చిన మణివల్ల నుసురు నిలిచె
ఉవిద = భార్య
పూరణకు మంచి ఐతిహ్యాన్ని ఎన్నుకున్నారు. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి( ధర్మజుని యజ్ఞాశ్వరక్షకుడైన అర్జునుడు తనకు చిత్రాంగదకు పుత్రుడైన బభ్రువాహ
రిప్లయితొలగించండిను నెదిరించి నిర్జీవుడైన సందర్భం )
" నిసుగగువాడు వీడెట ? మ
నీషుడ నేనెట ? పాండువంశ్యుడన్ ;
వసుధను బభ్రువాహనుడు
బారక నిల్చునె ? " యంచు గర్వియై
విసవిస బల్కి ధీరసుతు
భీకరశౌర్యశరాగ్నికీలచే
నసువుల బాసె నర్జును ; డ
నంతవిషాదము నొంద నందరున్ .
( నిసుగు - పసివాడు ; మనీషుడు - బుద్ధిశాలి )
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమిసిమిని గూడి యుద్ధమున మెల్పుగ నా యభిమన్యుడుండగన్
కసిగొని మోసపద్ధతిని కౌరవులాతని మట్టుబెట్టగన్
అసువులబాసె; నర్జునుడనంత విషాదము నొందనందఱన్
కసరుచు సైంధవాధముని కర్కశబెట్టి వధించె పూనికన్.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కర్కశబెట్టి'?
రిప్లయితొలగించండిచిత్ర జగతి సోకులు :) టీవీవాళ్ల న్యూసు కవరేజి :) మన ఇండియన్ ఎక్స్ప్రెస్ బాలకృష్ణ గారే సరియో కాదో చెప్పాలె :)
అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ
చిత్ర సీమ దుఃఖమునొందె చింతిలగ జి
లేబు లెల్లరు కాల్వలై లెస్స కంటి
నీరు పారె వరద పొంగి నింగి కెగసె!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీరు పల్లమెఱుగు... జిలేబి గారి కన్నీరు నింగి కెగిసింది.
పాపం! నా గురించి రెండుసార్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వ్రాసిన బాలకృష్ణ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు?
తొలగించండిఅలా గోకకుంటే నారదీయ ఎట్లా అవుతామండీ కందివారు ? చాన్నాళ్లు బాలకృష్ణ గారు కనిపించలే కొంత వార్ని లాగుదామని :)
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅసదృశ మేటివీరులట నాతత పౌరుషవంతులాతరిన్
రిప్లయితొలగించండికసిగొని కానలన్ జనిరి కాంతను గూడి యవారితంబనన్
ముసరగ దాహమందరికి మూర్ఖుగ వాదిలి యక్షుచేతిలో
నసువుల బాసె నర్జును డనంత విషాదము నొంద నందఱున్
వసుధను నర్మదాతటిని వాసిగ భాసిలె చక్రవర్తిగన్
తొలగించండిమసలెను దివ్యతేజుడయి మాన్యత నొందగ మేటివీరుగన్
పసరము గోరితెచ్చుకొనె పంతము భార్గవు తోడ మూర్ఖుడై
యసువుల బాసె నర్జును డనంత విషాదము నొంద నందఱున్
అర్జునుడు = కార్తవీర్యార్జునుడు
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'మూర్ఖత వాదిలి' అంటే బాగుంటుందేమో?
రిప్లయితొలగించండిప్రముఖుడు! మహా నటుండు గ
నుమ! అసు వులఁ బాసె నర్జు నుఁ డనంత విషా
దము నొంద నందఱున్ చే
రి మునిగి రా దుఃఖసాగరిని జనులకటా !
జిలేబి
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండి
తొలగించండినిజంగానే ? :)
అర్జునుండన కార్తవీర్యార్జునుండు
రిప్లయితొలగించండిపరశురాముడు గమకించి పరశుతోడ
తలను చేతులునరుకగ తక్షణంబు
అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండికలడు ప్రఖ్యాత ధనికు డొకండు నగరి
రిప్లయితొలగించండియతడును కరోనకు గురియై యంత చేరె
గొప్పగను రమే షాస్పత్రి గౌరవముగ
అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"... నగరి నతడును.." అనండి.
రిప్లయితొలగించండిఆ నటుడి మరణం వెనుక ఎవరి హస్తముంది ?
రసికత జొప్పు నాట్యముల రాధన మందు జిలేబులెల్లరిన్
ముసిముసి నవ్వులన్ భళి ప్రమోదము నొందగ చేసె నాతడే!
మిసిమిసి లాడు యవ్వనపు మేటినటుండు గృహమ్ములోనరే
యసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీరు ప్రస్తావించింది సుశాంత్ మరణం గురించే కదా?
యతులన్ బ్రాసగణమ్మలన్ మధురశబ్ధార్థమ్ములం గూర్ఛి, వ్యా
రిప్లయితొలగించండికృతి,ఛందస్సుల నాదరించి, నియమాకీర్ణప్రదీప్తిన్ చమ
త్కృతు లొప్పారగ రమ్యభావవిలసద్వ్యంగ్యోక్తిమల్లేఖనా
రతి, పూజన్ ఘటియించి, వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్
కంజర్ల రామాచార్య
వనస్థలిపురము
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమసలుచునుండిరింట పదిమంది కుమారులు పూర్వమందు., నే...
డు సరిగనొక్కడయ్యెను కుటుంబనియంత్రణచేత., వానికిన్
పసితనమందె సోకెనట పాపము నిన్న కరోన., యింతలో
నసువులఁ బాసె నర్జునుఁడనంత విషాదము నొంద నందఱున్!!
అర్జునుడు... ఏకైకసంతానమైన పుత్రుడు
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండిపసరముగోరియర్జునుడపారమదంబునసార్వభౌముడన్
రిప్లయితొలగించండిబసిడియురత్నముల్ ప్రభులపంచననుండుటశ్రేయమంచునా
పసరముగొంచుపోనలిగిభార్గవరాముకుఠారఘాతచే
"నసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికసిగొనికౌరవాధములుకాలునికైవడిచిచ్చురేపునా
రిప్లయితొలగించండిబసగలవీరశూరునిసుభద్రకుమారునిముట్టడించగా
*నసువులఁ బాసె, నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్*
విసురుగసైంధవాధిపునిబేర్కొనదోషిగమట్టుబెట్టెలే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపోరు సల్పెడి యభిమన్యు పోడిమగని
కపట మెంచి కౌరవులెల్ల కదన మందు
దుర్నయమ్ముగ నాతని తునిమి నంత
అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితమ్మి మొగ్గర మందున ధైర్యముగను
రిప్లయితొలగించండిపోరు నభిమన్యు డు రిపుల మోస మునకు
నసువు లం బాసె నర్జునుం డ o ద రే డ్వ
తాను దుఃఖితుండయ్యె నా తరుణమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాజసూయాశ్వము మణిపురమ్ముఁ జొచ్చ
రిప్లయితొలగించండిబబ్రువాహనుడద్దాని బాదరింప
కొడుకు తండ్రియు పోరాడ కూన చేత
అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ
గంగ శాపమె దీనికి కారణంబు.
బాదరించు-ఎదిరించు
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మణిపురమ్ము జొరగ" అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమిసిమిని గూడి యుద్ధమున మెల్పుగ నా యభిమన్యుడుండగన్
కసిగొని మోసపద్ధతిని కౌరవులాతని మట్టుబెట్టగన్
అసువులబాసె; నర్జునుడనంత విషాదము నొందనందఱన్
కసరుచు సైంధవాధముని కయ్యమునందు వధించె పూనికన్. .
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరుసరుస లాడి రేగెను నరోత్తముడైన సుభద్రసూతియున్-
రిప్లయితొలగించండిగుసగుస లాడి కౌరవులు కుట్ర వహించి చెలంగ నాతడున్
అసువుల బాసె నర్జనుడనంత విషాదము నొంద;నందరున్
విసుగున ధర్మ మేదనుచు విస్మయమున్ భయమున్ దలిర్పగా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిdhanyavadamulu
తొలగించండివసిగొని తమ్మిమొగ్గరము వ్రయ్యలు వాఱగ జేసి చెచ్చెరన్
రిప్లయితొలగించండిపసగల వీరుడై చలగ పార్థుని పుత్రుడు శత్రు సేనపై
కసిమసినొంద కౌరవులు కర్ణుడుపాధి ధనుస్సుఁ ద్రుంపగా
నసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వీరుడై చెలగ" టైపాటు.
పసి వయసైనఁ దాల్మి గలవా డభిమన్యుడు మొగ్గరమ్మునన్
రిప్లయితొలగించండికసి నెదిరించి శత్రువుల గాలమునందున జిక్కి యక్కటా
అసువులఁ బాసె; నర్జునుఁ డనంత విషాదము నొంద; నందఱున్
దెసలను దాకు నీ సుతుని ధీర యశమ్మని యూరడించిరే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివలదన వినకతాచని పార్థ సుతుడు
రిప్లయితొలగించండినసువులంబాసె అర్జును డందరేడ్వ
సైంధవుని సంహరించెంద సంజ లోప
టంచు ప్రతిన చేసి వధించె నాహవమున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామరావణయుద్ధానరావణుండు
రిప్లయితొలగించండినసువులింబాసె,నర్జునుండందఱేడ్వ
నసువులంబాసెచివరకునాలిపిదప
పుట్టుమనుజుడుతప్పకగిట్టుసుమ్ము
రెండవపాదము
తొలగించండినసువులంబాసె గా చదువవలసినది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅస్త్రసన్యాస మొనరించి యాపగేయు
రిప్లయితొలగించండిడంపశయ్యను జేరిన యనఘు డైన
భీష్ము డుత్తరాయణముకై వేచి యుండి
యసువులం బాసె, నర్జునుం డందఱేడ్వ
బాగుందండీ! అభినందనలు! 💐💐💐
తొలగించండిధన్యోస్మి
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి.............శంకరాభరణం.........
రిప్లయితొలగించండి19/08/2020..బుధవారం
సమస్య
*** ****
అసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్"
నా పూరణ. చం.మా.
**** *****
ఇషువును బభ్రు వాహనుడె యింద్రుని పుత్రుడు సవ్యసాచిపై
వెస బడవేయ నా క్షణము పీలువు ధాటి భరించలేక ..,యా
వసువుల శాప వహ్ని ఘన పార్థుని మిక్కిలి జుట్టుముట్టగా
నసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్"
-- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికార్తవీర్యార్జున వృత్తాంతం ఆధారంగా..
తొలగించండికసవుల బట్టిజన్నములు కాంక్షయులేక మహర్షిజేయుగా
పసగలరేడువచ్చి పితప్రాణము తీసిన వార్త తెల్వ తా
పసిసుతు"పర్సుపాణి" తనపైగల బాధ్యత తీర్చ చంపె, తా
నసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద; నందఱున్
అర్జనుడు = కార్తవీర్యార్జనుడు
---- శ్రీరామ్ 10వ తరగతి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పితృ ప్రాణము' అనండి. 'పర్సుపాణి'?
గురువుగారికి నమస్కారం 🙏
తొలగించండిపరశురాముడు = పర్సుపాణి ---ఆంధ్రభారతి ఉవాచ
అది పర్శు పాణి
తొలగించండిక్షమించాలి టైపు పొరపాటు "పర్శు పాణి" సరియినది.
తొలగించండిరాయబారపు సీనందు రక్తి మీర
రిప్లయితొలగించండిఅర్జునుండుగ నటించు నమిత ప్రతిభ
ప్రజల మన్నన లొందిన ప్రజ్ఞ శాలి
"అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినటియించు... అనండి. లేకుంటే గణభంగం.
శశివదను డభిమన్యుడు శస్త్రవిద్య
రిప్లయితొలగించండియందు కుశలుడు సైంధవుడడ్డు పడగ
తమ్మిమొగ్గర మందున తల్లడిల్లి
యసువులం బాసె, నర్జును డందరేడ్వ
అర్జునుడు + అందరు యేడ్వగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిశూరుడై పోరు నభిమన్యు వీర వరుని
మోసమున కౌరవులు తమ్మి మొగ్గరమున
చేరి నొక్కటై యాతని చెండి నంత
అసువులంబాసె అర్జునుండందఱేడ్వ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చేరి యొక్కటై...'
పసితనమైన వీడని సుభద్రతనూజుడు రుద్రరూపుడై
రిప్లయితొలగించండిపసగల శత్రుమూకలను భండన మందున కూల్చనెంచుచున్
గసిగను తమ్మిమొగ్గరముఁ గాలిడి యొంటరి పోరునందు తా
నసువులఁ బాసె, నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమసినిగజేసిశత్రువులమాన్యతనొందుచునెల్లవారిచేన్
రిప్లయితొలగించండినసువులబాసెనర్ర్జునుడనంతవిషాదమునొందనందఱున్
వసుధనుజచ్చిపుట్టుటలవార్యముగానజింతజెందకన్
నసువులుబోవకుండగనెనాత్మనుశంకరువేడుకోదగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మసినిగ'?
కొడుకు కృతవీర్యునకు నేలెఁ బుడమి నెల్ల
రిప్లయితొలగించండివేయి చేతులు భాసిల్ల నాయతముగఁ
గార్తవీర్యార్జును నని భార్గవుఁడు సంప
నసువులం బాసె నర్జునుం డంద ఱేడ్వ
కసిమసఁగంగఁ గౌరవ నికాయ మధర్మ విధాన మెంచి భా
ను సమ మహార థోత్తము ఘనుం గడతేర్చిరి యంద ఱొక్కటై
వసుమతిఁ గూలి పోరుచు సుభద్ర కుమార వరాభిమన్యుఁడే
యసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్
[కసిమసఁగంగ = చంపంగ]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండికురు క్షేత్ర మధ్యమమున అర్జునుని స్థితి:
రిప్లయితొలగించండిచం:
పసిగని రెండు పక్షములు పాండవ మధ్యముడెర్క నష్టమై
విసవిస తేరు దప్పుకొని వేదన నొందుచు కృష్ణు వేడగన్
వసమది గాక యుండె నని వైరము వద్దనె యస్త్ర శూన్యుడై
అసువుల బాసె నర్జును డ, నంత విషాదము నొంద నందరున్
వై. చంద్రశేఖర్
పూరణ సమర్థనీయంగా ఉన్నట్టు లేదు. కురుక్షేత్రంలో అర్జునుడు అసువుల బాయడం ?
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅర్జునుడు అసువులు బాయుట ను "అతిశయోక్తి" గా భావించి అలా పూరణ గావించాను. కురుక్షేత్ర మధ్యమాన విహ్వలుడై నిలువడము అర్జునునికి అసువులు బాయడం తో సమానమని నా భావన. ఏమైనప్పటికీ మీ సమీక్ష శిరోధార్యము.
తొలగించండిరాజసమ్ముగ పోరాడి రణమునందు
రిప్లయితొలగించండిబాలుడభిమన్యు వీరుడై పమ్ముకొనగ
కుట్రజేయుచు కౌరవుల్ గూడిజంప
అసువులం బాసె, నర్జునుండందరేడ్వ!!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిగోవు వృషభమ్ములా హరిఁ గోరినంత
పాప భారమ్ము తొలగించి గోపకుడున
కృష్ణమూర్తిగ ధర్మమ్ము గెలువఁ జేసి
యసువులం బాసె, నర్జునుండందఱేడ్వ
చంపకమాల
వసుమతి ధర్మదేవతలు పంకజనాభుని గోరినంతటన్
సిసలగు ధర్మమున్ నిలిపు శేముషిఁ బాపుచు పాపభారమున్
బసులకుఁ బాలకుండనఁగ ఫల్గుణుఁ బ్రోచిన కృష్ణమూర్తియే
యసువులఁ బాసె; యర్జునుఁడనంత విషాదము నొంద నందఱున్!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికొన్ని టైపాట్లున్నవి.
గురుదేవులకు ధన్యవాదములు. నిలుపు టైపాటు వల్ల నిలిపు అయింది. సవరించుకుంటాను సర్
తొలగించండిమిసమిసలాడుయవ్వనుడు మీసములైనను రాని బాలుడా
రిప్లయితొలగించండిస్పశముననొంటియై జనగ వారిజ వ్యూహమునందు చిక్కితా
నసువులఁ బాసె, నర్జునుఁ డనంత విషాదము నొంద, నందఱున్
పసియభిమన్యు శౌర్యమును భావనజేసిరి పెక్కు రీతులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వారిజ వ్యూహము' అన్నపుడు 'జ' గురువై గణభంగం. సవరించండి.
(పద్మవ్యూహం.అభిమన్యుడు)
రిప్లయితొలగించండితే.గీ.
వ్యూహ మందున జిక్కిన యోధుడతడె
చీల్చి చెండాడె కౌరవ సేనలణఁచ
మరలి రాలేక నభిమన్యు మహిని గూలి
యసువులం బాసె, నర్జునుం డంద రేడ్వ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మరలి రాలేక యభిమన్యు డొరిగి ధరిణి..." అంటే బాగుంటుందని నా సూచన.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
తమ్మి మొగ్గరమందున తాను జొచ్చి
పోరు సల్పగ నభిమన్యు పౌరుషముగ
కుట్ర చేసిన కౌరవుల్ కూల్చగ నత
డసువులం బాసె; నర్జునుం డంద ఱేడ్వ
దొడగిరి యతిశయంబగు దుఃఖమొదవ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి