రాఖీ సోదరి నేను నీకనుచు వే రాగమ్ములన్ తీయుచున్ శాఖల్ వారిగ దాచుచున్ ధనమునున్ జాగ్రత్తగా రోమునన్ దాఖల్ చేసి ప్రధానమంత్రి పదవిన్ దండించుచున్ సింగునున్ రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా!
ఆ ఖాభము లైనఁ జెలీ యా ఖర నఖముల మెఱయుచు, నంభోజముఖీ నే “ఖీ” యనిన సఖీ యని రా ఖీ, కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
[ఆఖము = గడ్డపాఱ; కరములు = కిరణములు; కట్టిన = కూడఁబెట్టిన]
ఈ ఖానంతము నందు సంకలిత మయ్యెన్ జీవ మచ్చోటనే శాఖా భేదము లేల నీ కకట సఛ్ఛాతోదరీ వంశ స చ్ఛాఖా యే మిది “తా” యనం దగ దహో శాపమ్మునన్ వర్ణ మౌ రా “ఖీ” కట్టిన హస్తపద్మము లయో ప్రాణంబుఁ దీసెన్ గదా
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
UPA (2004-14)
రాఖీ సోదరి నేను నీకనుచు వే రాగమ్ములన్ తీయుచున్
శాఖల్ వారిగ దాచుచున్ ధనమునున్ జాగ్రత్తగా రోమునన్
దాఖల్ చేసి ప్రధానమంత్రి పదవిన్ దండించుచున్ సింగునున్
రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిదు:ఖము లెల్లను తీర్చును
రాఖీ కట్టిన కరములె; ప్రాణము దీసెన్
రాఖీ ఫలమ్ములు తెలియక
రాఖీ కట్టగ కదలిన రమణిన్ దుష్టుల్.
కొద్దిగా సరిచేశాను :
తొలగించండిదు:ఖము లెల్లను తీర్చును
రాఖీ కట్టిన కరములె; ప్రాణము దీసెన్
రాఖీ ఫలమ్ములు తెలియక
రాఖీ కట్టగ కదలిన రమణికి దుష్టుల్.
మొదటి పాదంలో ప్రాస తప్పింది.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
గురువు గారికి నమస్కారములు. పద్యాన్ని సవరిఁచాను. దయతో పరిశీలించండి.
తొలగించండిఆఖరు జేయును దు:ఖము
రాఖీ కట్టిన కరములె; ప్రాణము దీసెన్
రాఖీ ఫలమ్ము నెరుగక
రాఖీ కట్టగ కదలిన రమణికి దుష్టుల్.
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిగురువుగారికి నమస్కారములు. పద్యములు వ్రాయుట నేర్చుకుంటున్న నేను లేటుగా నిన్నటి పూరణను ఇప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించండి.
గజము మొఱ నాలకించుచు కనికరమున
వేగమె రక్ష సేయగ నాగమించి
శరణమిచ్చిన అజితుడా సర్వ పాప
హరుని కరములు శంఖు చక్రాంచితములు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వేగమే" అని దీర్ఘాంతం చేయండి. లేకుంటే గణభంగం.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
శాఖల్ కోయుచు పర్ణశాల కడనున్ శస్త్రమ్మునున్ పూనుచున్
దేఖో భాయిర! నాదు ముక్కు చెవులన్ త్రెంపెన్ మహాశూరుడన్
కాఖాగఘ్ఘలు నేర్పి రావణునికిన్ కార్యంబునన్ పంపుచున్
రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మహాశూరుడన్' అన్న పదానికి అన్వయం కుదరడం లేదు. "త్రెంపెన్ మహాశూరుడై" అనవచ్చు.
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆ ఖానుండు, జిహాదీ ,
తాఖీ దివ్వగ మరణము తప్పదు జనులా
రా ఖావదు తాననుచున్
రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ ఖద్యోతుడు భూతపంచకము తామవ్వేళ వీక్షించువా
రిప్లయితొలగించండిరా ఖేచారులు విస్తుపోవ నకటా యాసోదరిన్ మత్తుడై
యాఖున్ బిల్లి విధాన జంప యనిరా యాకాశమందీగతిన్
రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆ ఖేదాన్విత, సోదరున్ గలసి తానా రాము పెండ్లాడగన్
రిప్లయితొలగించండిసాఖేయంబును గూర్చమన్చు వగచన్ శాఠత్వుడై రావణుం
డాఖేటాంగణమందు నీచుగ తానా కార్యము న్జేయగన్
రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబు దీసెన్ గదా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. "నీచుడుగ" అంటే సరి.
ఆ ఖలుడొక దుర్మార్గుం
రిప్లయితొలగించండిడా ఖర పుత్రుని పలుకుల నాలింపకుమో
రేఖా! వాడనె నిట్టుల
రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదేఖో యని యా దుష్టుదు
రిప్లయితొలగించండితాఖతుతో కత్తి తీసి తనువున పొడువన్
రాఖీ కట్టితి గదరా
రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దుష్టుడు' టైపాటు.
రాఖీ పండుగ సాక్షిగ
రిప్లయితొలగించండిశాఖంబులు వండివార్చి సందడిసేయన్,
రాఖీలందగ వైరసు
రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
కొరుప్రోలు రాధాకృష్ణరావు
సమయోచితమైన పూరణ. బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅమరావతి రైతు మహిళల నిరసన సందర్భంగా
రిప్లయితొలగించండికం॥
మౌఖిక ముగ ససి గోరుచు
రాఖీ కట్టిన కరములె , ప్రాణముఁ దీసెన్
కాఖీ దుస్తులు దొడిగెడు
శాఖా ధీశుని కి దీర్పు జరిగెడుజోటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆ ఖానుండు జిహాది యై ప్రబలియౌరా మృత్యువే మీకనం
గా, ఖాంకుండదె తొప్పదోగు హరిమన్ ఖాండ్రించి తూటాలతో
తాఖీదివ్వగ దుష్టడై, జనులు విత్రాసమ్ముతోనొవ్వ నా
రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితాఖీదంపెనవాబుగోపననుభద్రాద్రీశుదేవాలయం
రిప్లయితొలగించండిబీఖానుండవమానమొందునటులన్ బేఖాతరున్జేయుచున్
మౌఖర్యంబునగట్టెనంచుగినిసెన్ మర్యాదనున్ద్రుంచుచున్
రాఖీకట్టినహస్తపద్మములయోప్రాణంబుఁదీసెన్గదా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాఖీసినిమాలోప్రజ
రిప్లయితొలగించండిరాఖీలనుగట్టిరంతప్రముఖుండంచున్
బేఖాతర్ప్రతినేతను
రాఖీగట్టినకరములెప్రాణముదీసెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాదేదీ కరోన కనర్హం
రిప్లయితొలగించండిమాఖర్మేమిది? యంబర
లేఖాయై యీకరోన రేగెను జగమున్
శేఖరుకు రేఖ కట్టన్
"రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసూచించిన సవరణలను వాట్సప్ సమూహంలో చూడండి.
రాఖీ గట్టిన సోదరి
రిప్లయితొలగించండినా ఖలుడవమాన పరచ నాగ్రహమందున్
రేఖా జంపితి, నీవా
రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్.
ఆ ఖద్యోతుడు క్రుంగి చీకటులిలన్ వ్యాపించు నవ్వేళలో
రిప్లయితొలగించండినా ఖల్వాటుడు రమ్మటంచు నిను తానాహ్వానమున్ బల్కగా
రేఖా! గాంచితినేను, సోదరునిగా రేషంబు తో దుర్మతిన్
రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిగురువు గారికి నమస్కారములు. పద్యాన్ని సవరిఁచాను. దయతో పరిశీలించండి.
రిప్లయితొలగించండిఆఖరు జేయును దు:ఖము
రాఖీ కట్టిన కరములె; ప్రాణము దీసెన్
రాఖీ ఫలమ్ము నెరుగక
రాఖీ కట్టగ కదలిన రమణికి దుష్టుల్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలేఖల లో పొగడె చెలుని
రిప్లయితొలగించండిరాఖీ కట్టిన కరము లె : ప్రాణము దీ సెన్
రాఖీ కట్టక దేశపు
దుఃఖ ము నెడబాప తాను దురమున రిపువు న్
రేఖా!చెల్లిగ నిన్ను దేవుడొసగెన్ లేరెవ్వ రంచన్యమౌ
రిప్లయితొలగించండిశాఖన్ బుట్టిన శేఖరుండనుచు విశ్వాసమ్ముచూపించి యో
లేఖన్ వ్రాయ కరోనరోగి కరమౌప్రేమమ్ముతో కట్టగా
రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా
అసనారె
రేఖ అనే పోలీసు శేఖర్ అనే తీవ్రవాదిని హతమార్చిందనే కల్పనతో...
రిప్లయితొలగించండిశేఖరుడను పేర దిరుగు
నా ఖలుడా తీవ్రవాది యగ్రజుడైనన్
రేఖ యతని గడదేర్చెను
రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
రేఖా!వింటివెయీయది
రిప్లయితొలగించండిరాఖీదాగట్టగనలిరహిచెడియతడున్
మౌఖికముగదాబాధించగ
రాఖీకట్టినకరములెప్రాణముదీసెన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరాఖీరోజున శోకమున్ నిలుపకున్ రాగమ్మె గూర్చున్ సదా
రాఖీ కట్టిన హస్తపద్మములయో; ప్రాణంబు దీసెన్ గదా
రాఖీ గొప్పయె నెంచకున్ తిరుగు దౌర్భాగ్యుండు నీచుండు నౌ
నాఖానుండు వనితారత్నముకటన్నావేశ ముప్పొంగగన్.
రాఖీకట్టుటపూర్తియైనపిదపన్ రాజేంద్రనాధుండుదా
రిప్లయితొలగించండిముఖ్యంబంచునుగంఠనాళముదగన్మూయంగయాయక్కయౌ
రాఖీకట్టినహస్తపద్మములయోప్రాణంబుదీసెన్గదా
రాఖీయన్నదియుండనోపునుభువిన్ బ్రాణంబురక్షించునై
శాఖాధిపతిగనుండియు
రిప్లయితొలగించండిమౌఖికసంభాషణలనుమానసహింసన్
కాఖీదౌర్జన్యమునను
రాఖీకట్టినకరములెప్రాణముఁదీసెన్
ఆ ఖాభము లైనఁ జెలీ
రిప్లయితొలగించండియా ఖర నఖముల మెఱయుచు, నంభోజముఖీ
నే “ఖీ” యనిన సఖీ యని
రా ఖీ, కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
[ఆఖము = గడ్డపాఱ; కరములు = కిరణములు; కట్టిన = కూడఁబెట్టిన]
ఈ ఖానంతము నందు సంకలిత మయ్యెన్ జీవ మచ్చోటనే
శాఖా భేదము లేల నీ కకట సఛ్ఛాతోదరీ వంశ స
చ్ఛాఖా యే మిది “తా” యనం దగ దహో శాపమ్మునన్ వర్ణ మౌ
రా “ఖీ” కట్టిన హస్తపద్మము లయో ప్రాణంబుఁ దీసెన్ గదా
[ఖ + అనంతము = ఖానంతము: అనంతాకాశము]
ప్రేమించిన చెలి రాఖీగట్టగ ప్రాణము పోయినదని వాపోతున్న ప్రేమికుడు!
రిప్లయితొలగించండిరేఖయనిన నాప్రాణము
లేఖలువ్రాసితి విరివిగ లేదుగబదులే
ఆఖరున సోదరిననుచు
రాఖీగట్టిన కరములె ప్రాణము దీసెన్
ఫేసుబుక్కు చెల్లెలు 🤗🤗
శేఖర్ నీచెల్లిననుచు
లేఖల నేర్పునను గూర్చి లేమయె తుదకున్
నాఖాతా కబళించగ
రాఖీగట్టిన కరములె ప్రాణముదీసెన్
నాఖాతా = నా బ్యాంకు ఖాతా
సెప్టెంబరు 2015 నుండి పద్యరచనా వ్యాసంగము పునః ప్రారంభించి యిప్పటి దనుక సమస్యాపూరణములు 3000 కు మించిన పద్యములతో కలిపి 10, 200 మించి పద్యములు పూర్తి యయినవి.
రిప్లయితొలగించండిరచనల వివరములు:
1. రామ చంద్ర శతకము.
2. పోచిరాజ శతకము.
3. పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు).
4. వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము).
5. శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు).
6. శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము).
7. శ్రీమన్నారాయణ శతకము.
8. శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు).
9. శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక.
10. శ్రీమదాంధ్ర రామాయణము (కొనసాగుచున్నది)
11. శ్రీ బాల రామాయణము (కొనసాగుచున్నది)
ప్రోత్సహించిన మా యన్నగారు సుబ్బారావు గారికి, గురువులు శంకరయ్య గారికి, కవి మిత్రులకు ధన్యవాదములు.
పోచిరాజు కామేశ్వర రావు.
ఆర్యా! అభినందన వందనములు.
తొలగించండిరచనల వరుస సంఖ్య ద్విగుణీకృతముకావలెనని ఆపార్వతీపరమేశ్వరులను వేడుకొనుచున్నాను
తొలగించండిఆర్యా! అభివందనములు. మీ పాండితీ పటిమ అనన్యసామాన్యము.
తొలగించండిఅందఱికి వందనములు.
తొలగించండిఆర్యా! అభినందనలు.
తొలగించండిలేఖలతో విసిగించగ
రిప్లయితొలగించండిరేఖతనకురాఖికట్టి లీలగ నవ్వెన్
శేఖర్ బలాత్కరింపగ
రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
కం.
రిప్లయితొలగించండితీఖా మాటల మాటున
మోఖా వెదకుచు ధనమును మోసము జేయన్
సాఖీ మద్యము పరపగ
రాఖీ కట్టిన కరములె ప్రాణము దీసెన్
తీఖా=రమ్యమైన
సాఖీ=ప్రియురాలు
వై. చంద్రశేఖర్
రిప్లయితొలగించండికందం
తా ఖైదీలకు చెల్లిగ
రాఖీలను గట్టివెళ్ళ ప్రాణము విడ షా
జీ ఖాన్ కరోన యంటగ
రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్
శార్దూలవిక్రీడితము
తా ఖైదీలను మార్చనెంచి తొలుతన్ దర్శించి గండారునే
రాఖీలన్ గొని సోదరీ సమమనన్ రంజిల్లఁగా గట్ట షా
జీ ఖాన్ గూలె, కరోన యామె వలనన్ సిద్ధించెనన్ వార్తలన్
రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా