కవిమిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవమి పూజలె మేలు వినాయకునకు"
(లేదా...)
"నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవమి పూజలె మేలు వినాయకునకు"
(లేదా...)
"నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్"
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
కువలయ నేత్రయున్ మగడు కూరిమి నొందెడి చంటిపాపతో
నవనవలాడు విగ్రహము నవ్వుచు నుండగ మూషికమ్ముతో
భవనమునందు జేయగను భక్తిని, ముందుగ నైదురోజులన్
నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పవలును రేయినిన్ పనులు పన్నుగ జేయుచు దుడ్డుకోసమై
చివరకు లీవు చిక్కకయె చింతను జేసి చతుర్థి పూటనున్;
కవులును పండితుల్ కలసి కమ్మగ కూడగ క్యాలిఫోర్నియన్
నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిభువి నవరాత్రిపూజలవి పోడిమిమీరగ నిర్వహించగన్
రిప్లయితొలగించండినవమియె శ్రేష్ఠమౌతిథి; యనంతుడు రాముని పూజసేయగన్
నవమియె శ్రేష్ఠమౌ తిథి; సునాద వినోదిని చండిపూజకున్
నవమియె శ్రేష్ఠమౌ తిథి; వినాయక
పూజకు వీడుమష్టమిన్!
కవి మిత్రులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు! 💐💐💐
తొలగించండిఅమ్మా ! నమస్సులు. మీరు నంద్యాల వాసులని మా నాన్న గారు (రేవణ సిద్ధాంతి గారు) చెప్పారు. నిజమేనా?
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
సిద్ధాంతి గారూ,
సీతాదేవి గారిది నెల్లూరు.
🙏
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏
తొలగించండిసిద్ధాంతిగారూ, మాది నెల్లూరండీ! 🙏🙏🙏🙏
తొలగించండిశివునిగ విష్ణుదే వునిగ చిన్మయ శిల్పము విఘ్నరాజుదై
రిప్లయితొలగించండిరవికుల వార్థిచంద్రుడగు రాముని రూపము
కన్నులన్బడన్
ప్రవణుడు చిన్నికృష్ణునిని శ్రావణ మందున నూయలూపగన్
నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి( భాద్రపదశుద్ధచవితి నాడు గణపతిని
పూజిద్దామని చెల్లి ; కాదు అష్టమినాడని
చిన్నన్న ; కాదుకాదు నవమినాడని పెద్దన్న)
" చవితియె నేడు ; సోదరులు !
చక్కగ పువ్వుల , పత్రి తెండికన్ ; "
" అవతల కేగుమా ! తెలియ
కట్టుల నంటివి ; యష్టమే తగున్ ! "
" రవములు మాను డిర్వురును ;
రండిటు చెప్పెద ; నాలకింపుడీ !
నవమియె శ్రేష్ఠమౌ తిథి వి
నాయకపూజకు ; వీడు మష్టమిన్ . "
( రవములు - అరుపులు )
సంవాద రూపమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిదైవ పూజ సలుపుటందు , దాశరథికి
రిప్లయితొలగించండిజనన మొందినట్టి తిథియౌ చైత్రమాస
నవమి పూజలె మేలు ; వినాయకునకు
చచ్చి బతికిన తిథియగు చవితి మేలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిభువిని రాము నర్చించెడి పుణ్య తిథియె
నవమి; పూజలె మేలు వినాయకునకు
భాద్రపద శుక్ల చవితిని; భవుని రాణి
ఉమను కొలువగ విజయదశమియె బాగు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగురువు గారికి కవిమిత్రులకు వినాయకచవితి శుభాకాంక్షలు.
భువి నొనరించు దాశరథి బూజల కెప్పుడు పేర్మి గూర్చగా
నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్
పవిదిని నీవు జేయుమిట భాద్రపదమ్మున వచ్చునట్టిదౌ
చవితి దినమ్ము నందున సజావుగ నందరు మెచ్చునట్లుగన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజగతి లో రాముని కెపుడు చైత్ర శుధ్ధ
రిప్లయితొలగించండినవమి పూజలు,మేలు వినాయకునకు
పూజలెపుడు చవితి నాడు, పొరబడితివి
నీవని పలికె నొక్కడు నెలత తోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరామ కళ్యాణమదియేను రమ్యముగను
రిప్లయితొలగించండిసకల జనులాచరింతురు చైత్ర శుద్ధ
నవమి, పూజలె మేలు వినాయకునకు
భాద్ర పదశుద్ధ చవితిని భక్తి తోడ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచైత్ర మాసాన రాముని జన్మదిన ము
రిప్లయితొలగించండిచేరి భద్రాద్రి భక్తులు చేయు నట్టి
నవమి పూజలు మేలు : వినాయకునకు
భాద్ర పద చవితిని చేయ వలయు పూజ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరామభద్రుని కొలువంగ రమ్యముగను
రిప్లయితొలగించండినవమి పూజలె మేలు, వినాయకునకు
చేయ పూజలు చవితిని శ్రేయమగును
భక్తి ముఖ్యము తెలియుము భావమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిరావె! బెల్లపు పాకము రామునికని
నవమి పూజలె మేలు; వినాయకునకు
చవితి జోతలు ; అష్టమి చక్క గాను
కన్నయకు తెలుసుకొనవె కలువకంటి!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచవితిన పిండి వంటలను సాదగు పాయస పానకంబులన్
రిప్లయితొలగించండిచవిగొన వచ్చు సత్యముగ చామర కర్ణుడు ; గౌరిసూను కై
దవనపు పూజపై హవన తంతును సేయగ నిందు ముఖ్యమై
న వమియె శ్రేష్ఠమౌ ; తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్
వమి = అగ్ని
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'చవితిని' అనండి.
రిప్లయితొలగించండికందా చంప్స్!
సకి! శ్రీరామునకే రా
ధిక! నవమియె శ్రేష్ఠమౌ తిథి! వినాయక పూ
జకు, వీడు మష్టమిన్ ప
ట్టుకొని చవితిని విడువకు చటుక్కున నతడిన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభవముగ కౌసలేయునకు, పార్థివి కిన్ కర పీడనమ్ము చే
యవలయు నెప్డు? ఈ చవితి, యన్న! విశేషము దేనికోకదా?
భవకుడ! నల్లవేల్పునకొ? ప్రశ్నల కెల్ల జవాబు పన్నిగా,
నవమియె శ్రేష్ఠమౌ తిథి; వినాయక పూజకు; వీడు మష్టమిన్!
వినాయగనే వినై తీర్పవనే
https://youtu.be/FRanoudR1ss
శుభాకాంక్షలతో
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఎప్డు+ఈ' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "...వలయు నెప్పు డీ చవితి..." అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపెళ్ళి కూతురిని చేయుటకు ముహూర్తమడిగితే పంతులుగారు ఇలా చెప్పారు.. 🙏
ఎవరెపుడైన భక్తి భజియించుచు వానికినగ్రపూజగా
నవవిధసత్ప్రసాదముల నమ్మిక గూర్చిన రక్ష జేసెడిన్!
నవవధువున్ బొనర్చుటకు నమ్ముడు మంచి ముహూర్తమిద్దియే
నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు., వీడు మష్టమిన్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిఅవనిని రామచంద్ర పరమాత్ముడు పుట్టిన దే తిథిన్? భువిన్
రిప్లయితొలగించండిచవితి యదేల శ్రేష్ఠమట? సత్క్రియ జేయగ కూడదెప్పుడో
యవనిని? యగ్రజా తెలుపు మంచడగంగనె చెప్పెనిట్టులన్
నవమియె, శ్రేష్ఠమౌతిథి వినాయకపూజకు, వీడుమష్టమిన్.
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి.............శంకరాభరణం.........
రిప్లయితొలగించండి22/08/2020..శనివారం
సమస్య
*** ****
"నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్"
నా పూరణ. చం.మా.
**** *****
భువి జన విన్నపాలు విని మోద సుఖమ్ముల భాగ్య మీయగన్
పవలును రేయి గాంచునె ? సువార తిథుల్ కనునే గణేశు డా?
ప్రవిమల విఘ్న నాయకుని బ్రార్థన జేయ వచించ కిట్టులన్
"నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్"
-- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
🌷 వనపర్తి🌷
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురుభ్యోన్నమః; గణాధిపతయేనమః🙏🏻🙏🏻
రిప్లయితొలగించండిఅష్టమిన కృష్ణుఁ బూజింపు మనఘ చరిత!
ఆరఘు కులోత్తముఁ దలపు మవని విధిగ
నవమి, పూజలె మేలు వినాయకునకు
విఘ్నముల బాయ మొదట పవిత్రముగను.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరవి కుల సోముడవ్యయుడు రాముని పూజను సేయ బూనగా
రిప్లయితొలగించండినవమియె శ్రేష్ఠమౌ తిథి; వినాయక పూజకు వీడు మష్టమిన్
చవితి విశేషమైన తిథి చక్కగ గొల్వ గణేశు భక్తితో
వివిధ సుపుష్ప పత్రముల వేడ్కనలంకృతుఁ జేసి ప్రీతిగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందఱికీ గణేశ్ చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిశ్రీ గణేశాయ నమః
దేవ గణముల కధిపతి, జీవ రాశి
బ్రోచి కరుణను గురిపించి, భువనమందు
మొదటి పూజల నందుచు ముదము నిచ్చు,
గణపతిన్ గొల్వ విభవము గల్గు మనకు!
భద్రగిరి రామ కల్యాణ వైభవంబు
రిప్లయితొలగించండిజరుగు శుభములు బడయగ చైత్ర శుద్ధ
నవమి; పూజలె మేలు వినాయకునకు
భాద్రపద శుద్ధ చవితిని భద్రమొదువ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభక్తి మీఱఁ జిత్తమ్మున భయద విఘ్న
రిప్లయితొలగించండిభగ్న కారకములు శుక్ల పక్ష మందు
భాద్రపద మాసమునఁ బంచవాస రోన
నవమి పూజలె మేలు వినాయకునకు
ప్రవరులు త్రేత యందు మఱి ద్వాపర నామ యుగమ్ము నందు మా
నవకుల రక్షణార్థము సనాతన పూరుషు లుద్భవించఁగా
నవనిని రామచంద్రునకు నా పిదపం బక దైత్య భేదికై
నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక! పూజకు వీడు మష్టమిన్
కరిమూర్ధా! శివవక్త్రా!
తొలగించండిహరి వరయజ్ఙోపవీత! హత విఘ్నాలీ!
వర మూషికేంద్ర వాహన!
గిరిజా హస్తాబ్జ భూత! గేయస్తుత్యా!
విఘ్నాధిపత్య ధుర్యా !
విఘ్నచ్ఛేదన నితాంత విద్యా! భక్తో
పఘ్నా! భవ సంచిత పా
పఘ్నా! భగ్నైక దంత! భవకాయఘ్నా
మీ రెండు పూరణలు, రెండు స్తుతిపద్యాలు అద్భుతంగా, మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిప్రవిమలరామచంద్రునకుబట్టముగట్టగనెంచిఱేనియా
రిప్లయితొలగించండిభవభయహారిదాశరథిభావినృపుండనిబాససేసెనీ
"నవమియె శ్రేష్ఠమౌ తిథి ;వినాయక పూజకు వీడు మష్టమిన్"
భువినియయోధ్యపట్టణముమోదమునొందగనగ్రపూజకై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభువిదసరోత్సవంబునముముక్షువులెల్లరుజమ్మిపూజకై
రిప్లయితొలగించండిప్రవిమళచేతనన్దశమిపర్వదినంబదిదుర్గపూజకున్
"నవమియె శ్రేష్ఠమౌ తిథి ;వినాయక పూజకు వీడు మష్టమిన్"
భవుడువిరించియర్కశశివాణినృసింహులుమ్రొక్కిరాదినిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే. గీ.
రిప్లయితొలగించండిఅవని పెండ్లి సీతా రామ చంద్రులకును
నవమి, పూజలేమేలు వినాయకునకు
చవితి-మొదలు నవదినోత్సవము జరుగు
చివరి రోజునిమజ్జనం చేయుచుంద్రు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.
భాద్రపదమాసమందునభవ్యమైన
రిప్లయితొలగించండివిఘ్ననాయకు నవరాత్రివేడ్కలందు
శుద్ధపాఢ్యమిమొదలుగా శుక్లపక్ష
నవమి పూజలె మేలు వినాయకునకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్తవగుణుడొక్కరుండు తనఛాత్రున కీగతి దెల్పుచుండె దా
రిప్లయితొలగించండినవిరళ భక్తితత్పరత నార్యుని రాముని గొల్వబూనుచున్
వివిధములైన వస్తువులు వేగమె జేర్చుట జూచి, "డింభకా!
నవమియె శ్రేష్ఠమౌతిధి "వినాయక! పూజకు, వీడు మష్టమిన్ .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివినాయక చవితిశుభాకాంక్షలతో......
రిప్లయితొలగించండిచవితిరోజునకుదరనిసద్భక్తులకు
గణపతినవరాత్రియనుటకలదుకనుక
నవమిపూజలెమేలువినాయకునకు
భక్తిముఖ్యముతిధులవిబరగుపిదప
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. సవరించండి.
నవమియెశ్రేష్ఠమౌతిధివినాయకబూజకువీడుమష్టమిన్
రిప్లయితొలగించండివివరముతోడజెప్పుదునువీనులవిందగుమాటలిప్పుడున్
నవమియునష్టమందనకయాగణనాధునిబూజజేయుమా
చవితిదినంబునందుననెజక్కగజేయుమపండుగెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండితేటగీతి
పండుగల తిధులన్ గూర్చి పైత్యమేమొ
సందియంబుల గూర్చుచు సలుపనేల?
వేదవిదితమైన చవితి విడువ నెటుల
నవమి పూజలె మేలు వినాయకునకు?
చంపకమాల
వివరము లేని మాటలను వీడుము సోదర నమ్మబోకుమా!
నవు కొనఁ గొందరిట్లనఁగ నాడని నేడని వెక్కిరింపుగన్
జవితికి వైభవంబుఁగనఁ జాలక రేపెడు భాష్యమే సుమా!
"నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్"
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
వసుధ రాముని కల్యాణ వైభవమ్ము
జరుగు రోజది ప్రతియింట చైత్ర శుద్ధ
నవమి; పూజలె మేలు వినాయకునకు
భాద్రపద శుద్ధ చవితి పర్వమ్ము నందు.
చ:
రిప్లయితొలగించండికవితలు వ్రాయ నీదినము గట్టిదటంచునె పొద్దు పొడ్పునన్
వివశుడనైతి యంశమది వింతగు రీతిని ప్రస్తరించగన్
వివరణ లేల జూడుమిటు వేదన గూర్చుట గాదె నిట్లనన్
నవమియె శ్రేష్టమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్
వై. చంద్రశేఖర్
రిప్లయితొలగించండిపార్వతీమాత కు సతము వసుధ యందు
నవమి పూజలె మేలు, వినాయకునకు
భాద్రపదచవితిన చేయు వలయు పత్రి
పూలతోడను వాసిగా పూజ లెల్ల.
భువనములేలు స్వామి పరిపూర్ణుడు నౌరఘు రామమూర్తికిన్
చవతియనాడు చేయవలె చక్కగ పత్రి యుపూవులాదిగన్
కువలయ మందు చూడగను కూడదటండ్రు వివాహమాడుటన్
నవమియె శ్రేష్ఠమౌ తిథి ,వినాయక పూజకు, వీడు మష్టమిన్"