15, ఆగస్టు 2020, శనివారం

సమస్య - 3458

కవిమిత్రులారా,
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్"
(లేదా...)

"వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్"

76 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  చిచ్చులు బెట్టి కాల్చి భళి చిందులు త్రొక్కుచు వాడవాడలన్
  నచ్చిన చోటులందు కడు నందము నొందుచు నల్ల విత్తమున్
  పిచ్చిగ కూడ బెట్టనిక వీలును గాకయె మోడిరాజ్యమున్
  వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  రొచ్చుచు రోజుచున్ తనరి రోడ్డుల మధ్యను కేకలేయుచున్
  పిచ్చిగ దూషణమ్ములిడి పీల్చుచు రక్తము మోడివర్యుదిన్
  రచ్చను జేయు దీది కడు రంకెలు వేయగ వంగభూమినిన్
  వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్

  రిప్లయితొలగించండి
 3. మచ్చలు లేని మాత భరతాంబకు వందనమిచ్చి కొందరున్
  చొచ్చెను రాజకీయమున సొమ్ములు భక్షణజేయదల్చుచున్
  పుచ్చులనేరివేయుటనమోఘమునేలెను మోడి గావునన్
  వచ్చె స్వతంత్రమంచు గడు వంతను బొందిరి నేతలెల్లరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. చొచ్చిరి.. అనండి.

   తొలగించండి
  2. మచ్చలు లేని మా భరతమాతకు వందనమిచ్చి... అనవచ్చు.

   తొలగించండి
 4. నేతాజీ, బాపూజీ..
  పాత తరంబేగ, నేడు భారత భువినిన్
  యాతత ధనదాహముతో
  స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   భువినిన్ + ఆతత... అన్నపుడు యడాగమం రాదు. భువిలో నాతత... అనండి.

   తొలగించండి
 5. ఆగస్టు 15 న ముహూర్తములు రద్దయిన సందర్భంగా ఆంధ్ర నేతల మనోభావములు

  ఇచ్చెద మిండ్లకాగితము లీసును బొందగ చంద్రబాబదే
  గ్రుచ్చెద క్రొత్తకాపిటలు గూల్చిపురాతన
  రాజధానినిన్
  తుచ్ఛపు న్యాయవాదులిట దూరము సేయగ మంచియూహలన్
  వచ్చె స్వతంత్రమంచు గడువంతల నొందిరి నేతలెల్లరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అన్నయ్యకు జాతీయ రాజకీయాలు... చెల్లెమ్మకు రాష్ట్ర రాజకీయాలు... బాగుంది.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 😊😊🙏🙏🙏

   తొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కౌతుక మొందిరి పౌరులు
  స్వాతంత్ ర్యము వచ్చి; యేడ్వసాగిరి నేతల్
  జాతికి ఘాతము లొనర్చి
  నీతినివిడి పొందినట్టి నిధులు వెలార్చన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం మూడవ గణం జగణమయింది. జాతికి ఘాత మొనర్చియు... అనండి.

   తొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అచ్చును గూడు చందమున యందముగా జనులుల్లసిల్లెగా
  వచ్చె స్వతంత్రమంచు; గడువంతల నొందిరి నేతలెల్లరున్
  ఎచ్చుగ తాము మోసములనెంచి గడించిన సొత్తులన్నిటిన్
  రెచ్చెడి తీరు నీప్రభుత లెస్సదనమ్మున రచ్చసేయగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చందమున నందముగా జను లుల్లసిల్లగా... అనండి.

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు.

   తొలగించండి


 8. ఖాతరు చేయని జనులకు
  నేతృత్వమెలాగు చేయ నేర్తుమటంచున్
  మోతాదుకు మించి యరరె
  స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 9. అరె భారతమాతయె బా
  గరి! వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొం
  దిరి నేత లెల్లరున్ చి
  ప్ప రిక్క వెట్టుకొని‌చూడ భండారమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. వచ్చె విముక్తి జాతికన పండుగ జేతురు సంతసంబునన్
  యెచ్చటనైన త్యాగధను లీ వనికై తమ సర్వమిచ్చి జే
  ల్జొచ్చిన గాథ తల్తుర ? నిజోత్సవమన్న యిదా ? యిటెందుకై
  వచ్చె ? స్వతంత్రమంచు గడు వంతను బొందిరి నేత లెల్లరున్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిచ్చి పొగడ్తలున్ బొగడ వేదికలున్, సమయాను వర్తనమున్,
   మెచ్చుటకన్చు మాలలును, మెత్తని మాటలు వట్టి చేతలున్,
   తెచ్చిన తీపి మ్రింగ దగ తీరికతో నిట కేగెనా ? యనన్
   వచ్చె స్వతంత్రమంచు గడు వంతను బొందిరి నేత లెల్లరున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ... సంతసంబునన్ + ఎచ్చట.. అన్నపుడు యడాగమం రాదు. సంతసంబుతో నెచ్చట... అనండి. నిజోత్సవమన్న నిదా... అని ఉండాలి.
   రెండవ పూరణ మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 11. ( ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర్యం దేనికి
  సంకేతం ? ఏ మార్పు కోసం ? )
  " కచ్చెలు రేపుచున్ మెడల
  ఖండన జేసెడి నేర్పుకోసమా ?
  చిచ్చుల బెట్టుచున్ మనల
  జీల్చెడి దుష్టుల తీర్పుకోసమా ?
  మచ్చల దెచ్చుచున్ భరత
  మాతకు శోకపు గూర్పుకోసమా ?
  వచ్చె స్వతంత్ర " మంచు గడు
  వంతను బొందిరి నేత లెల్లరున్ .

  రిప్లయితొలగించండి
 12. స్వాతంత్ర్యదినోత్సవమును
  నాతతనిష్టనుజరిపెడునవకాశంబే
  రీతిని కాననితరుణము
  స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్

  రిప్లయితొలగించండి
 13. స్వాత౦త్ర్యము తెచ్చితిమిక
  భూత౦బులు శా౦తి సౌఖ్య భోగులన౦గా
  వ౦తల గూరుట చూచియు
  స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్

  రిప్లయితొలగించండి


 14. ఖచ్చితమైన గాంధి యనుకాంక్షయె పెక్కుటిలంగ ధీరులై
  తెచ్చిరి యొత్తిడిన్ జనులు తేకువ తోడు! బ్రిటీషువారలో
  యిచ్చిరి రెండు ముక్కలు సయింపక! దేశమ సవ్యమై కదా
  వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పెక్కుటిలంగ...? పిక్కటిలంగ..టైపాటా?

   తొలగించండి
 15. మాతంత్రము మాదె యనుచు
  నే తంత్రము తోడ నైన నెగ్గుట కొఱకై
  ధీ తంత్రము దెలియక నీ
  స్వాతంత్ర్యము వఛ్చి యే డ్వ సాగిరి నేతల్

  రిప్లయితొలగించండి
 16. తాతల కాలము నుండియు
  భీతిల్లిన నిమ్నజాతి, పేదల మరియున్
  జాతిని జాగృత పరచెడు
  స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  సామాజికమాధ్యమప్రభావం🙏

  చెచ్చెర వార్తలన్ చదివిచెప్పెడి ధోరణి వింతవింతగా
  పెచ్చరిలంగ.,స్పర్ధ గొని., ప్రేక్షకసంఖ్యను పెంచ., పెద్దలన్
  చచ్చుగ నూహజేయుచు
  ప్రచారము జేయగ మృత్యువార్తలన్
  వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. వచ్చెను వచ్చెనంచు తెగవాగెద వెక్కడవచ్చెస్వేచ్ఛయే
  మొచ్చెనునేరికిన్సుఖమునేరికిదక్కెనుభోగభాగ్యముల్
  బిచ్చెమునెత్తువారలకుపేదలుసాదలునొచ్చునట్లుగా
  *వచ్చె స్వతంత్రమంచుఁగడువంతను బొందిరి నేతలెల్లరున్*

  రిప్లయితొలగించండి
 19. కుచ్చితులైన నాయకలు కోట్లకు కోట్లు ధనమ్ముదోచుచున్
  పచ్చని పైర్లతోవెలుగు పంట పొలమ్ముల కొల్లగొట్టగా
  చెచ్చెర నోట్లతో ప్రజలు చేయ పరాభవమిప్డు పేదకున్
  వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్

  రిప్లయితొలగించండి
 20. పెచ్చరిలంగమద్యమునుప్రీతినిగ్రోలిరిరోగగ్రస్తులై
  చచ్చిరితెల్లవాడొకడెసంపదదోచెనునాడునేడుని
  క్కచ్చిగనెల్లవారలకఖండజనాళికిదోచుకొమ్మనన్
  *వచ్చె స్వతంత్రమంచుఁగడువంతను బొందిరి నేతలెల్లరున్*

  రిప్లయితొలగించండి
 21. 15.08.2020

  అందరికీ నమస్సులు 🙏మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳💐🌻💐

  నా పూరణ యత్నం..

  *కం*

  కోతలు కోయుచు చక్కగ
  చేతలలో శూన్యమైన సేవలు గని మా
  రాతలు మార్చండను నా
  *"స్వాతంత్ర్యము వచ్చి, యేడ్వసాగిరి నేతల్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏✍️

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. మిత్రులారా ఇది పద్యములకు‌ సంభందించిన ‌బ్లాగు‌ ఒకసారి‌ పరిశీలన చేసి దాని ప్రకారము‌ మీ భావమలు పద్యము లోకి మార్చి‌ పంపగలరు

   తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 23. నేటి శంకరా భరణము వారి సమస్య

  స్వాతంత్ర్యము వచ్చి యేడ్వ సాగిరి నేతల్

  ఇచ్చిన పాదము కందము నా పూఱణము మహాక్కరలో

  భారత దేశము స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత చాలా మంది సంస్ధానాధీసులు తమ రాజ్యములను భారత దేశములో విలీనము చేయుటకు చాలా కాలము తిరుగు బాటు
  చేసి చివరకు గత్యంతరము లేక సర్దార్ పటేల్ శాసించగా తప్పక తమ రాజ్యములను
  విలినము అయిష్టము గా చేశారు. కాని మనసులో చాలా కాలము స్వాతంత్ర్యము వచ్కినది భారత భూమికి మా స్వేచ్చ కొల్పోయినాము కదా అని యేడ్చారు ఇది నిజ
  సంఘటన.

  రచ్చలన్ చేయుచు భరత దేశపు రాజులు సర్కారు సూచనలన్

  మెచ్చక తిరుగుబాటు తనముతోడ మిడిసిబడ, పటేలు శాశించగా

  నిచ్చ లేక సంస్ధానముల్ కలిపెగా నెదురు తెల్పక, నట స్వాతంత్ర్యము

  వచ్చి యేడ్వసాగిరి నేత లెల్లరు వారి స్వేచ్చ నశించెగా ననుచున్


  పూసపాటి

  రిప్లయితొలగించండి
 24. వత్సముడెబ్బదిమూడయె
  స్వాతంత్ర్యమువచ్చి,యేడ్వసాగిరినేతల్
  కోతలపాలనలేకను
  చేతలరాజ్యమ్మురాగసీమాంధ్రమునన్

  రిప్లయితొలగించండి
 25. నిచ్చలు రచ్చజేయుచును నేర చరిత్రులు పెచ్చుమీరుచున్
  నచ్చిన రీతి దోచెడు వినాయకులందరి చేష్టలాపగన్
  మెచ్చగ సజ్జనావళి, శ్రమించు పటుత్వ విధానమున్ గనన్
  వచ్చె స్వతంత్రమంచు గడు వంతలబొందిరి నేతలందరున్.

  రిప్లయితొలగించండి
 26. హెచ్చెను రాజకీయములు నేర్పడె హక్కులు శాసనమ్ములున్
  మెచ్చిన పాలనమ్ము లవి మిక్కిలి యయ్యెను దేశమందు సం
  దిచ్చునె! పూర్వమందనుసరించు విధమ్ముల? యిట్టి మార్పుతో
  వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్

  రిప్లయితొలగించండి
 27. గోతులు తీసెడువారల
  నేతంత్రము నాచరించి నేమార్చంగ
  న్నేతీరుంగానకయే
  స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్!!

  ----యెనిశెట్టి గంగా ప్రసాద్.

  రిప్లయితొలగించండి
 28. తాతలతండ్రువకలలే
  తేతలలేనివియగుటగఁజేసిరినీచుల్
  నీతియుకోతిగమారగ
  స్వాతంత్య్రమువచ్చియేడ్వసైగిరినేతల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తాతలతండ్రులకలలే
   చేతలలేనివియగుటగఁజేసిరినీచుల్
   నీతియుకోతిగమారగ
   స్వాతంత్య్రమువచ్చియేడ్వసాగిరినేతల్

   తొలగించండి
 29. ఘాతుకమన గాడ్సే మన
  జాతి పితను కూల్చెనకట, జాలియె లేకన్
  కోతయి హృదయము పగులగ
  "స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్"

  రిప్లయితొలగించండి
 30. పిచ్చిగ గంతులేయకుడి పేరుకు వచ్చిన దీ స్వతంత్ర్యమే?
  చెచ్చెర కంటితో గనుచు చేయకు గొప్పగ సంబరాలు, పో
  జచ్చిరి తెల్లవార్లు,మరి, చచ్చెన దాస్యపు బుద్ధి నీ మదిన్??
  *వచ్చె స్వతంత్రమంచుఁగడువంతను బొందిరి నేతలెల్లరున్*

  రామ్ కిడాంబి

  రిప్లయితొలగించండి
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇచ్చనుసంతసిల్లెబ్రజయిక్కటులన్నియుదీర్చగావెసన్
   వచ్చెనుస్వతంత్రమనుచు,గడువంతనుబొందిరినేతలెల్లరున్
   నీచ్చటదాపురించెనికనెట్లుగవీడుటయీతనిన్ నహో
   ఖచ్చితమీతనిన్దలపగాకలుదీరిననేతయేసుమా

   తొలగించండి
 32. యాతత హర్షము సెల్గఁగ
  నా తరిఁ బట్టంగ లేక యాశ్చర్యముగం
  జేత లుడుగంగ బోరున
  స్వాతంత్ర్యము వచ్చి యేడ్వఁ జాగిరి నేతల్


  మెచ్చిరి పౌరు లెల్లరును మించెను మిన్నున వాద్య ఘోషయే
  నచ్చిన రీతి నాట్యములు నారుల తోడుతఁ జేసి రింపుగా
  నచ్చపుఁ గేతు రాజముల నారసి వీనిని నిల్పు టెట్లు నా
  వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్

  [అప్పటి నేత లెల్లరు ధర్మాత్ములే]

  రిప్లయితొలగించండి
 33. బూతులె నీతులు కాగా
  కోతుల వలె నేతలు దిగఁ కొట్లాటలకున్,
  వాతలు బెట్టిరి జనులిక
  స్వాతంత్ర్యము వచ్చి, యేడ్వసాగిరి నేతల్

  రిప్లయితొలగించండి
 34. .............శంకరాభరణం.........
  15/08/2020...శనివారం

  సమస్య
  *** **
  వచ్చె స్వతంత్రమంచు గడు వంతను బొందిరి నేత లెల్లరున్

  నా పూరణ. ఉ.మా.
  **** *****

  పెచ్చుగ బేదలైరి నిరు పేదలు బీదలు రోజురోజుకున్

  హెచ్చగ భాగ్యవంతులయిరీ భువి శ్రీలులు నంతకంతకున్

  మెచ్చెడు రీతి మార్పులవి మేలుగ లేవని పల్కి..,యిందుకా

  వచ్చె స్వతంత్రమంచు గడు వంతను బొందిరి నేత లెల్లరున్

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 35. ఉ:

  తొచ్చెము లెంచుచున్ బ్రిటిషు దోపిడి దారులె సక్రమంబనన్
  రెచ్చిన శక్తికోర్చి కడు లెక్కకు మిక్కిలి కూడబెట్టుచున్
  హెచ్చులు బల్కరే తుదకు హేళన భావము గుమ్మరించుచున్
  వచ్చె స్వతంత్ర్య మంచు గడు వంతను బొందిరి నేతలెల్లరున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 36. పెచ్చు చరిత్ర గాథలను పిల్లల కోసము సిద్ధపర్చిరే
  కుచ్చితు లైన తెల్లదొర కూటమినెల్లను ప్రారద్రోలగా
  వచ్చె స్వతంత్రమంచు, కడు వంతన బొందిరి నేతలెల్లరున్
  మ్రుచ్చిల వచ్చినట్టి ఖలు మూర్ఖుల పాలన యందు నాడిటన్.

  రిప్లయితొలగించండి
 37. నీతికి తిలోదకములిడి
  జాతిని దోచుకొన జూడ చైతన్యముతో
  నీ తరపు ప్రజ లెదుర వా
  క్స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్ !

  రిప్లయితొలగించండి
 38. ఏతంబెత్తిన బడుగులు
  స్వాతంత్య్రమువచ్చిఏడ్వ సాగిరి, నేతల్
  పాతంబగు నీతివిలువ
  శాతంబును బెంచ సాగు చర్యలు గనుడీ.(1)
  ____________________________
  ఘాతంబే రాజులదీ
  గోతంబులు నింపుకుజను గొడవే, యిపుడున్
  భాతిందగునెన్నికలై
  స్వాతంత్య్రమువచ్చిఏడ్వ సాగిరి నేతల్.( 2)🙏

  రిప్లయితొలగించండి
 39. యాతనగా పాతనృపులు
  స్వాతంత్య్రమువచ్చిఏడ్వ సాగిరి, నేతల్
  కోతలునేర్చిరి జనతా
  నీతికినోటేసి పదవి నిచ్చునుగనుకన్. (3)

  రిప్లయితొలగించండి
 40. అచ్చెరువొందజేయుమదియారడిబెట్టుకరోన ఘోరముల్
  నిచ్చలునప్రమత్తతయు నీడను నమ్మని రోజులొచ్చెనిం
  కిచ్చటనుత్సవంబులకునేవిధి వీలు దొడంగు నిప్పుడే
  వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్

  రిప్లయితొలగించండి
 41. విచ్చె ముదమ్ము జాతి కిక వేదనలన్నియు దూరమౌ నహా
  వచ్చె స్వతంత్రమంచుఁ; గడు వంతను బొందిరి నేత లెల్లరున్
  రెచ్చిన పౌరుషాగ్ని నవలేశము బ్రాణము లెక్క సేయకన్
  మెచ్చగ దేశమంతయును మ్లేఛ్ఛుల బోరిన వారిఁ దల్చుచున్

  రిప్లయితొలగించండి
 42. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ స్వాతంత్య్ర పర్వదిన శుభాకాంక్షలు

  కందం
  రోతగ విలువలు మార్చఁగ
  జాతి కొఱకు త్యాగులైన స్వర్గస్తులుగా
  ఘాతకులమేలు కొరకని
  స్వాతంత్య్రము, వచ్చి యేడ్వసాగిరి నేతల్

  ఉత్పలమాల
  పిచ్చిగ దేశ భక్తి గొని వేదన లోర్చుచు త్యాగచింతనన్
  దెచ్చితిమయ్య! స్వేచ్ఛ యని దివ్యపదమ్మున జాలిఁ జూచుచున్
  హెచ్చిన ఘాతుకమ్ముల ప్రహేలిక లల్లెడు రాక్షసాలికై
  వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్

  రిప్లయితొలగించండి
 43. కం: పాతకముగ దుష్కృతుల!
  స్వాతంత్ర్యము నడ్డుకొనరి స్వార్థము కొఱకున్!
  ఏతంత్రము వాడకనే!
  స్వాతంత్య్రము వచ్చి యేడ్వ సాగిరి నేతల్!!

  రిప్లయితొలగించండి