24, ఆగస్టు 2020, సోమవారం

సమస్య - 3467

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్"

(లేదా...)
"తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్"

42 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  ముద్దులు ముచ్చటన్ గొనుచు మూఢుడ! వోటును బీరుకోసమై...
  కొద్దిగ చింతజేయకయె గొప్పగ వేయుచు నాట్యమాడి నీ
  వెద్దినమందు కుక్క గొని హీనపు బుద్ధిని రాజుజేతువో
  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్

  రిప్లయితొలగించండి
 2. ఒద్దికగ కాశియాత్రను
  ముద్దుల పత్నీసమేతముగ జేసి తుదిన్
  తద్దయు విందును గూర్చగ
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈమధ్యనే టివిలో పెంపుడు కుక్క రాజు చనిపోతే దాని విగ్రహాన్ని స్థాపించి దానికి పూజలు చేయడం చూపించారు

   ముద్దుగ బెంచుకోగ దమపుత్ర
   సమంబుగ కుక్కనొక్కటిన్
   బుద్ధిగ చెప్పినట్లువిని పొందిక స్వామికి సేవచేయ సం
   సిద్ధుడు నిర్గమించగ విశేషము
   విగ్రహరూపమున్ స్మృతిన్
   తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్

   తొలగించండి
 3. పద్దులు తీర్చిపోవలయు పండిన కాలము ధర్మరాజ నీ
  వద్దకు వచ్చు కుక్కయట ప్రస్తుతి చేయుచునున్న యత్నమున్
  వద్దని పంపరాదనెడి వాక్కు మదిన్ గను స్వర్గసీమలో
  తద్దినమందు శ్వానమును తప్పకగొల్వుము శాస్త్రపద్ధతిన్

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ముద్దుగ నత్తగారిదగు ముచ్చట మీరిన రాజమండ్రికిన్
  ప్రొద్దున లేచి పోవగను భోరున వర్షపు వెల్లువందు నీ
  వెద్దినమందు కుక్క గొని యేఱును దాటుచు నిల్లుజేరితో
  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్ 😊

  రిప్లయితొలగించండి
 5. ( ప్రశ్నోత్తరి - క్రమాలంకారం )
  " తద్దయు గీర్తిశేషులగు
  తల్లిని దండ్రిని నెప్డు గొల్తుమో ? "
  " యొద్దిక నింటిరక్షణకు
  నోపిక దేనిని బెంచగావలెన్ ? "
  " బెద్దగ విద్యనిచ్చుచును
  బ్రేమగ జూచెడి యయ్యగారలన్ ? "
  " దద్దినమందు " " శ్వానమును "
  " తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్ . "

  రిప్లయితొలగించండి
 6. అద్దిర! యీయుగంబునను హాస్యము కాదిది విన్మటంచు నా
  ముద్దియతోడ బల్కె పతి మోహముమీర జనంబు లీయెడన్
  గ్రద్దకు కుక్కకున్ సకల ప్రాణుల కొక్కొక రోజు దెల్పిరే
  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్.

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దుద్దెక్కిన ధైర్యముతో
  ముద్దుగ పెంచిన శునకమె ముచ్చుల నెగుచున్
  యొద్దికగా నిను ప్రోచిన
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్.

  ముద్దులుజూపి పద్ధతిగ పోషణ జేసిన కుక్కయే నినున్
  గద్దఱులైన దోపరులు కక్కసబెట్టెడి వేళనందునన్
  పెద్దపులిన్ వలెన్నడరి వీకున వారినెదిర్చిప్రోచునా
  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్

  రిప్లయితొలగించండి
 8. అద్దిర భళిరా యనుచున్
  బుద్దిగ శివునే తలచుచు పోయిన కాశీ
  సుద్దిగ చెబుదురు పెద్దలు
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్

  రిప్లయితొలగించండి
 9. పెద్దలు చెప్పిన వినవా?
  ప్రొద్దుననే త్రాగి యిట్లు మొరుగుట యేలన్
  మద్దెపు మాటలనిట్టుల
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. ముద్దడు నన్నము నిడగా
  పెద్దగ నినుఁగొల్చునట్టి పెన్నిధి యవదా!
  యెద్దినమా వేఁపేగిన,
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్

  వేపి-కుక్క

  రిప్లయితొలగించండి
 12. (హైదరాబాదు నగరంలో పెద్దమ్మ గుడి దగ్గర వినాయక్ నగర్ లో Sri Shiva Panchayatana Kalabhairava Swamy Devalayam)

  పెద్దమ్మనరసి యాగుడి
  వద్దన గల కాలభయిరవ ప్రతిమ గాంచన్
  నద్దాని గుకుర మనుకొని
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్

  కుకురము = శ్వానము = కుక్క
  తద్దినము = ఆ దినము

  రిప్లయితొలగించండి
 13. వద్దుర వాదు సేయకు మవారిత మీగతి లంచమిచ్చుటల్
  కద్దుర యెచ్చటైన నధికారుల మేపుట కొల్వులందునన్
  పెద్దలు మున్నె చెప్పిరిల వెళ్ళగ కాశికి తప్పకుండగన్
  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్

  రిప్లయితొలగించండి
 14. పెద్దలకున్దివంగతసపిండులకోగిరమెప్పుడిత్తురో?
  ముద్దుగప్రేమమీరగప్రబుద్ధులునొద్దికబెంచుకొందురీ
  ప్రొద్దునజంతువేదొకొ?యపూర్వ వినమ్రత సాధుసంతులన్
  *తద్దినమందు;శ్వానమును;తప్పకగొల్వుముశాస్త్రపద్ధతిన్*

  రిప్లయితొలగించండి
 15. ముద్దుగ బెంచిన శునకం
  బద్దియు చని పోయి యొక్క యబ్దము దాటెన్
  ఒద్దిక మీరగ దానికి
  తద్దినమున శ్వాన పూజ తప్పదు సేయన్

  రిప్లయితొలగించండి


 16. నిద్దుర కొంచెమ్మే! నీ
  వద్ద పడి మెలకువతో నివాసము గాచున్
  కద్దమి వీడగ తనువున్
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  ఒక ముసలాయన చెప్పిన నీతి..

  ముద్దుగనుంటిమేవురము పూర్వము., భార్యల గూడి ముగ్గురున్
  విద్దెలకంచు వృత్తికని వేరుగ బోయిరి., యింక నింట మే..
  మిద్దరముంటిమిప్పుడిట., వృద్ధులమైతిమి., గాన మీరలే...
  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి!!

  రిప్లయితొలగించండి
 18. .............శంకరాభరణం.........
  24/08/2020..సోమవారం

  సమస్య
  *** ****
  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్

  నా పూరణ. ఉ.మా
  *** *** ****

  హద్దులు లేని పేరిమి నహర్నిశమున్ యజమాని జూపుచున్

  పద్ధతి మీఱ నిన్ను పరిపాలన జేసిన...నోయి సేవకా!

  బుద్ధి కృతజ్ఞతల్ విడిచి మోసము జేయగ నీవు జూతువో

  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇద్దరు భోక్తలె గద మరి
   వద్దన్నను గారెలిన్ని వండితివేలా
   కద్దొకటే దారి దలప
   తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్

   తొలగించండి
 20. ముద్దులశంభునిజూచుచు
  నొద్దికగాబూజజేయనోపినకొలదిన్
  నెద్దినముండినకాశిని
  తద్దినమునశ్వానపూజతప్పదుసేయన్

  రిప్లయితొలగించండి
 21. ముద్దులయాదిదేవుగనమోదముతోడనకాశికేగుచో
  తద్దినమందుశ్వానమునుతప్పకగొల్వుముశాస్త్రపద్ధతిన్
  బుద్దినిబూజజేయయటపూర్వముపాపములెన్నియున్ననున్
  నద్దినమందునేదఱగునారతికర్పురభాతినిన్ సుమా

  రిప్లయితొలగించండి
 22. పెద్దలు సెప్పిరి యివ్విధిఁ
  గద్దు శునక రూపుఁ డగుట కాలయముండే
  సద్దొనరించక రా నే
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్


  పెద్దలు మెచ్చ హర్షమున వెల్గుచుఁ దృప్త మనోరథాత్ములై
  సుద్దపుఁ జిత్తమూనియు నశోచత వర్తిలఁ జేసి భక్తినిం
  దద్దయు శ్రద్ధ పూర్వులకుఁ దర్పణ సంయుత కర్మకాండముల్
  తద్దిన మందు శ్వానమును దప్పక కొల్వుము శాస్త్రపద్ధతిన్

  [శు +ఆనము =శ్వానము; శు = చక్కగ, త్వరితముగ; ఆనము = ఉచ్ఛ్వాసము, ఇక్కడ ప్రాణాయామ మని భావించ నగును]

  రిప్లయితొలగించండి
 23. ఒద్దిక విశ్వాసముగల
  ముద్దులశునకమ్ముకన్నుమూసినవేళన్
  తద్దయు శ్రద్ధాసక్తుల
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్

  రిప్లయితొలగించండి
 24. ఒద్దికతోడనందరిలొనొక్కటియైచరియించునట్టి మా
  ముద్దులకుక్కుటమ్మకట మూసెను కన్నులు శాశ్వతమ్ముగా
  పెద్దలు సాంత్వనంబునిడిపేరిమివాక్కుల బల్కిరిట్టులన్ :
  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్

  రిప్లయితొలగించండి
 25. ముద్దుగ బెంచిన శునకము
  నిద్దురలో కన్నుమూయనిర్వేదంతో
  తద్దయు వాత్యల్యముతో
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్!!!

  రిప్లయితొలగించండి
 26. నిద్దుర బోవువేళ గమనించుచు జాజరు కారులా నిశిన్
  సద్దును సేయకుండ నట సంచన చుబ్బన చూరులాటకై
  నిద్దరు జోచ్చినంత గని హినుల వేపియె పట్టి యిచ్చినన్
  దద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్.

  రిప్లయితొలగించండి
 27. ఒద్దిక పితరుల గొల్చెడి
  దెద్దినమో?! నీవు కాశి కేతెంచంగ
  న్నెద్ది యొనరించ గావలె?!
  తద్దినమున; శ్వానపూజ తప్పదు సేయన్!

  రిప్లయితొలగించండి
 28. నేపాల్/ ఖాట్మండు లో భైరవుని పూజలు క్షుద్ర శక్తులనుండి రక్షణకు ఇప్పటికీ చేస్తారు. మేము యాత్రలు చేసేటప్పుడు తెలిసింది.
  అట్లే భైరవ అష్టకమును ఆది శంకరాచార్యులు రచించారు.
  ఇక కాశీ కి వెళ్లిన వారు భైరవుని గుడి దగ్గరే కాశీ దండ కొని చేతికి ధరిస్తారు. ఈ విషయాల ఆధారంగా రాసిన పద్యమిది:

  ఉ:

  సిద్ధిని గోరి జాగిలము సేవలు జేతురు ఖాటుమండునున్
  తద్దయ మీర శంకరులు ధారణ జేసిరి బైరవట్టమున్
  నిద్ధియె మేలుగాదలచి నెల్లరు దండ ధరింప కాశినిన్
  తద్దిన మందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్ర పద్ధతిన్

  భైరవట్టము=భైరవ అష్టకము
  దండ= భైరవుని గుడి లో కాశీదండ చేతికి కట్టుకొంటారు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 29. ముద్దులు కారెడు కుక్కకు
  నొద్దికగా నెల్ల బెట్టి నుత్సాహముతో
  గద్దించక తెచ్చినయా
  తద్దినమున శ్వానపూజ తప్పదు చేయన్

  రిప్లయితొలగించండి
 30. కందం
  వద్దని మిము సుతుడంపిన
  వృద్ధాశ్రమమునకుఁ గుక్క వెదుకుతుఁ జేరన్
  బుద్ధిగ మిమ్మిలు చేర్చెనొ
  తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్!

  ఉత్పలమాల
  వద్దని మిమ్ములిద్దరిని పంపగ నిర్దయ నాశ్రమంబుకున్
  నిద్దుర బోక తా వెదకి నెమ్మది జేరుచుఁ గుక్కమిమ్ములన్
  బుద్ధి నెఱుంగ జేసి సుతు మూర్ఖత బాపుచు నిల్లు చేర్చెనో
  తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్!


  రిప్లయితొలగించండి