22, ఆగస్టు 2020, శనివారం

అష్టభుజ చిత్ర బంధ తేటగీతి

వినాయకుని ప్రార్థన

 కరివదన   కలిగితివి  నిగరపు చరిత,                    
కనులలో కాంచు చుంటిమి కరుణ యివము ,           
కరుణ నిడ  మేము కాంచము  కంట నుదక,              
కర యుగళము తో పూజించ కలుగు కనురు,              
కలుగ జేయుము నిరతము  ఘనపు గడణ ,               
కలసి యుండుగా  నీతోడ  కలిమి జనని,
కటవదన నీవు లేనిచో నటమటవడు,
కనగ లేరుగా నెవరు నీ ఘనపు నెరను

(నిగరము = ఘనము; ఇవము = మంచు; ఉదక = జలము; కనురు = కరుణ; గడణ = స్తోత్రము; అటమటవడు = విచారించు; నెరను = మర్మము; కటవదనుడు = ఏనుగు ముఖము గలవాడు) 

          ఈ పద్యములో (క)  అను అక్షరము బంధించబడినది. పద్యము చదువు విధానము - ముందుగా ( 1) అను సంఖ్య  వేసిన గడి నుంచి  ప్రారంభించాలి.  (కరివదన కలిగితివి  నిగరపు చరిత)  తో  మొదలు  పెట్టి  మరల క్రింద కు వచ్చి  అదే  (క) తో వరుసగా అన్ని  గడులు చదువు కోవాలి.   చివరి గడి (కనగ లేరుగా నెవరునీ ఘనపు నెరను) అయి పోయిన తరవాత   మరల (క) అక్షరము తో  1 వ రంగు గులాబి  గడి దగ్గర మొదలు పెట్టి ప్రదక్ష్ణణముగా   గుళాబి గడులలో  ఒక్కొక్క అక్శరము కలుపు కోవాలి.  (కరివదనుడనవర)  అన్నదగ్గర  ఆగి  పైన ఆకు పచ్చ అక్షరములు (త ‌) ను కలిపి ప్రదక్షణమూగా అకు పచ్చ రంగు గడులలో  అక్షరములు చదువుకోవాలి అప్పుడు వచ్చు  వాక్యము   (కరివదనుడనవరతము కరుణ నిడును) అన్న తేటగీతిలో  వాక్యము వస్తుంది. 
తాత్పర్యము
కరివదనుడా ఘనమైన చరిత  కలిగ్నవాడ ,కనులలో చల్లని (మంచు) లాంటి  చూపు కలిగిన వాడా, నీవు కరుణ చూపగా మా కనులలో నీరు చూడము గదా, రెండు చేతులతొ పూజలు చేయగా  నీకు  కరుణ క;ఉగును గదా, నిరతము నీ  ఘనమైన స్తోత్రము చేయ అవకాశము  ఇవ్వుము, నీ తోడ ఎప్పుడు లక్శ్మి దేవి  కలసి  ఉంటుంది గదా,(లక్ష్మీ గణపతి  అంటుంటాము) ఏనుగుముఖము గలవాడ నీవు లేనిచో విచారము కలుగును గదా, నీ యొక్క మర్మము ఎవరికి తెలియదు గదా
                                                  పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 
                                                                        20/8/20

1 కామెంట్‌: