కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన"
(లేదా...)
"కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన"
(లేదా...)
"కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్"
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
నాలుగు ప్రక్కలందు గల నాణ్యపు కోవెలలందు దూరుచున్
గోలగ కీర్తనల్ నుడివి గొప్పగ నోడగ మోడివర్యుకున్
చాలిక వేషమంచు వడి జందెము పీకుచు పారవేయుచున్
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితనదు లాభమె ముందుగ తలచు చుండి
క్రమమగు విధము జూపక కదలు నట్టి
కొంటె గుణముల మిత్రుల కూర్మి వీడి
పారిపోవలె గీర్తిని గోరుకొనిన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి09.08.2020
రిప్లయితొలగించండిఅందరికీ నమస్సులు 🙏🙏
*సరదా పూరణ* 😀😀
*తే గీ*
అన్న పేరు పొందిన యొక హంతకుండు
నాన్న నీకు తెలియదేమి నరికి జంపు
నట్టి మనుజుల యింట నమ్మాయిని విడి
*"పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన"*
*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙏
వాట్సప్ లో సమీక్ష చూడండి.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పోలుచు నాంజనేయు వలె పొంకము మీరగ మావొ భక్తుడై
వాలము త్రిప్పుచున్ తనరి వంగల భూమిని కాల్చివేయుచున్
చీలిచి చెండెదంచు భళి చిక్కగ దీదికి సీతరాముడే
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిధర్మజాదులు విరటుని దరికిఁజేరి
రిప్లయితొలగించండితలను దాచుకొనంగలేదా!బలీయ
మైన విధి నెంచి-కాలముఁగానినాడు
పారిపోవలెఁగీర్తినిఁగోరుకొనిన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఆలియె కోపగించి క్షణమాగక తిట్లను గుమ్మరించగా
రిప్లయితొలగించండిపోలిసు వీరసామి దన ముందర వాహన మాపినంతనే
జాలిని జూపకే తనను జంపగ వచ్చెడి కాబులీగనన్
కాలికి బుద్ధిచెప్పవలె గ్రక్కున ధీరుడు కీర్తిగోరినన్
వరూధినీ ప్రవరాఖ్యము
తొలగించండిమేలిమి పైడివన్నియల మేనునుగల్గిన
నప్సరాంగనే
జాలిని జూపుమంచు దనజాణ తనమ్మున ప్రేమగోరగా
జాలమునందునన్ బడక చక్కగ దాని దిరస్కరించుచున్
కాలికి బుద్ధిచెప్పవలె గ్రక్కున ధీరుడు కీర్తిగోరినన్
రాము,కీర్తుల ప్రేమకథ
తొలగించండివేరు కులమని రాముని వేరుపరచ
కారులేదని పేదని దూరగాను
దారిలేదిక నిద్దరు చేరి రాత్రి
పారిపోవలె గీర్తిని గోరుకొనిన
తొలగించండివాటె పిటీ వరూధిని :)
"వలపుల కన్నె వచ్చిన చివాలున " నో" యని పారిపోదురే?"
జిలేబి
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
తొలగించండి@ జిలేబి గారు
తొలగించండిఅన్నట్టు మీ బ్లాగుపేరు వరూధిని కదా! 😊😊😊
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివాలకమైన వర్తనము బాగును దల్చు గుణమ్ము లెవ్వియున్
వ్రాలకనుండు వేషమున ప్రాకుచు స్వీయఫలమ్ము లొందగన్
వాలయమంత వెంటబడు వంచక మిత్రుల వీడనాడుచున్
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదారి జూపుచు పదుగురి జేరి, వారి
రిప్లయితొలగించండిమంచి చెడుగుల యోచించి, మనసు నందు
గూడు గట్టిన స్వార్థంపు ౙాడ విడిచి
పారి పోవలె, గీర్తిని కోరు కొనిన!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాలలు వేసి గొల్చెదరు మాన్యులు ధీరుని జూచినంతటన్
రిప్లయితొలగించండిచాలును చోద్యమంచు తెగ సవ్వడిసేతురు బుద్ధిహీనులున్!
పాలను నీటగల్పినను పాడవునట్లగు వారి సంఘమున్
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుడు కీర్తి కోరినన్!
ధీరుడు - ధీ బలము కలవాడు, పండితుడు
Rohit🙏🏻🙏🏻🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరికి పూజల్ వలదిచట,నట్టి వారు
రిప్లయితొలగించండిపారి పోవలె,కీర్తిని కోరు కొనిన
వారు హరనామమే సల్పి బ్రతుకవలయు
ననుచు బలికె లంకేశుడు జనుల తోడ
హరి నామ కీర్తన నా రాజ్యం లో నిషేధము అని రావణాసురుడు తెలుపు సందర్భంలో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీతి నియమంబు వల్లించు నేతలంత
రిప్లయితొలగించండినీడు నిచ్చుచు పేదల తోడు నిలచి
హంగు లార్బాట ములనన్ని నడ్డు కొనుచు
పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీడ నిచ్చుచు... టైపాటు.
నీతి నియమంబు వల్లించు నేతలంత
రిప్లయితొలగించండినీడ నిచ్చుచు పేదల తోడు నిలచి,
హంగు లార్బాట ములవీడి ననవరతము
పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన
కొరుప్రోలు రాధాకృష్ణరావు
పాడు పనులకు నెన్నడు కడు దవ్వు
రిప్లయితొలగించండిపారిపోవలెఁ, గీర్తినిఁ గోరుకొనిన
మ౦చి పనులకు మనమున మార్గమిచ్చి
జీవనమ్మును సఫలము చేయవలయు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం, యతిదోషం. సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివీలగునేల మొగ్గరము? భీష్మపితామహకుంభసంభవో
తొలగించండిద్వేలపరాక్రమప్రకటవీరసమాహృతభీకరమ్మునన్
చాలు బృహన్నలా? యని యశమ్మది వచ్చును జీవముండినన్
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్.
కంజర్ల రామాచార్య
కోరుట్ల.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికీర్తి అనే చిగురాకుబోడి తో రమేశుడి ప్రణయ విచారము :)
పెండ్లి యాడగాను రమేశ! పెద్దలెల్ల
మంకు పట్టి కుదరదని మాటి మాటి
కి తడ కట్టిరి పరుగులంకించుకొనుము
పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమేలగు సత్పథంబునను మిక్కిలి దీక్ష జరించు చుండు స
చ్ఛీలగుణాన్వితుండయిన క్షేమము లెంచుచునున్న దౌష్ట్యమే
కీలకమైన ప్రాంతమున కిమ్మనరా దది చూడకుండగా
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికదనరంగాన వైరులమదమునణచి
రిప్లయితొలగించండిపోరుసలిపినశత్రువు భీరువగుచు
పారిపోవలెఁ ,గీర్తినిఁ గోరుకొనిన
వెన్నుచూపరు యుద్ధాన వీరులెపుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిత్తమార్జింప దలచుచున్ వేడ్కగాను
రిప్లయితొలగించండిఘన పురస్కారములసేతు మనుచు నేడు
జగతిని వెలసి నట్టి యా సంస్థలగని
పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికందోత్పల
కడగండ్లకు పరుగులిడక
వడి, కాలికి బుద్ధి సెప్పవలె, గ్రక్కున ధీ
రుఁడు గీర్తిఁ గోరినన్, తడ
బడక నిలువవలెనటంచు పరిపూర్ణముగా
జిలేబి
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఈ కీర్తి సహజమైనది కాదు.. అని తిరస్కరించాలంటే కొంత ధైర్యం కూడా కావాలి. 🙏
గోల యిదేమొ గాని కవికోకిలలున్ కవిచక్రవర్తులున్
వేలకు వేలునైరి., పదివేలనిడన్ లభియించుచుండె నా..
మాలివి., యిట్టి సంస్థలు ప్రమాదములౌ., నవి పిల్వ., మెల్లగా
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅడుగడుగునభయపడుచునే
రిప్లయితొలగించండిబడి, కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీ
రుఁడు గీర్తిఁగోరినన్ వెం
బడి వచ్చెకరోనరుజకు బడులే నెలవౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం.
అనువుగానిచోటులనిల్చి యధికులనక
రిప్లయితొలగించండిపారిపోవలెఁఁ,గీర్తినిఁగోరుకొనిన
దైవమేజయాపజయముస్థైర్యధైర్య
మంచుధీరుండుపోరాడునంచితముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితాలిమితోడయుద్ధమున దాయలగూల్చుచు విక్రమించుచున్
రిప్లయితొలగించండికాలునివోలెవాలమును క్రమ్మర త్రిప్పగ శత్రు సైన్యముల్
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున, ధీరుఁడు గీర్తిఁ గోరినన్
జాలినిచూపరాదెపుడు చంపుటకున్ తన వైరి వీరులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాలికి వేలికిన్ ముడులు గర్వితులైధనదాహులైసదా
రిప్లయితొలగించండిమేలునుగోరకే పిలిచి మృత్యుసమంబవమానపగ్నితో
గ్రాలగజేసిగూల్చఁదిరకాసులనీసునువెళ్ళగ్రక్కుచో
"కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అవమానపు టగ్ని' అనడం సాధువు. అవమాన వహ్ని... అనవచ్చు.
ఆలమునందు వైరితతి పై విజయమ్మది కష్టమైనచో
రిప్లయితొలగించండికాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
వీలును బట్టి వ్యూహమును వేగముగా సరిదిద్దుకొంచు స
త్కాలములోన పూనుకొని కయ్యము చేయ జయమ్ము కల్గు చూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది.
వ్రాసి యొకటియో రెంటినో పద్యములను,
రిప్లయితొలగించండిముట్టజెప్ప నెంతయొకొంత, ములగచెట్టు
పైకి నెట్టు మూర్ఖుల దరిఁ బోక, సుకవి
పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికేలకు కంకణంబులు ను కెంపుల హారము చిత్రచేలముల్
రిప్లయితొలగించండివేలికి యుంగరంబు సరి వేడుక తీరక మేఖలంబనన్
వేలకు వేలు డబ్బుగొని వేమరు వేసట గూర్చి బుర్ర గో
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుడు గీర్తి గోరినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వ్రేలికి నుంగరంబు..'
రిప్లయితొలగించండిదుష్టు లున్నట్టి తావు లం దుండ బోక
*పారిపోవలె, కీర్తిని కోరుకొనిన*
జగతి యందు మంచి పనులు చక్కగాను
నాచరించు చుండ వలయు ననవరతము.
గాలికి సోకు నీరుజను కట్టడి చేయక యున్నచెప్పకన్
మాలిమితోడచెంతకును మానుగ చేరుచు హానికూర్చదా
వీలయి నంతదూ రముగ వేగము గానిట మాస్కు దాల్చుచున్
*"కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్"*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధైర్యసాహసములతోడపోర,యరులు
రిప్లయితొలగించండికదనరంగానభీతినికాలుముడిచి
పారిపోవలె,గీర్తినిగోరుకొనిన
నెదురుదాడికినిలబడిహదముజేయి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతిదోషం. హదము జేయి..?
చేత గానట్టి వారలు సిగ్గు చేత
రిప్లయితొలగించండిపారి పో వలె : గీర్తిని గోరు కొనిన
నిలిచి ప్రతిభను చాటుచు నిగ్గు లొలుక
మెప్పు నొందుచు భాసింత్రు మేటి యగుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేలకువేలుగానరులువెంబడివచ్చుచునుండగానికన్
రిప్లయితొలగించండిగాలికిబుద్ధిసెప్పవలెగ్రక్కున,ధీరుడుకీర్తికోరినన్
జాలినధైర్యమున్వడసిశత్రుసమూహముబంపగావలెన్
జాలముసేయకన్దివికిచక్కటియుక్తినిబోరుజేయుచున్
రిప్లయితొలగించండితూలకు నిమ్మళమ్ము విడి తొందర దేల భయమ్మదేలరా?
చాలిక సోదరా! వలదు సాధ్యము కానిది లేదదేలరా
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు? గీర్తిఁ గోరినన్
చాలదు దానికై వలయు చాతురి పెంచుకొనంగ మేలగున్!
జిలేబి
ఆలి విరాళితో బసిడి యంచుల వన్నెల చీర గోరినన్
రిప్లయితొలగించండియేలను మాట లేక పరికింపక వేళ దుకాణమేగగా
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
గేలిని సేయబోకుడయ కేశవుడైనను కాంత దాసుడే
కాలము చెల్లిపోవు నపకారుల కాతడు గాంచినంతనే
రిప్లయితొలగించండికాలుని వోలె యాలమున గాలిడినంతనె వైరి వీరులున్
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున; ధీరుఁడు గీర్తిఁ గోరినన్
కాలగతిన్ బరాక్రమమె గాక ప్రశాంతత నిల్పు మేలుగా
వాలుగ కంటితోడ పసిబాలల తోడ నృశంసు తోడ గ
రిప్లయితొలగించండియ్యాళుల తోడ హీనుల కృతాత్ముల తోడ సమిత్తు కూడదే
యాలియె యాగ్రహించి కలహమ్ముకు సిద్ధమటంచు పల్కినన్
గాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
తాళ వృక్ష మూలమ్మునఁ ద్రాగుచుండఁ
రిప్లయితొలగించండిబాలు దా నగు నిందల పాలు సుమ్ము
దుష్టజన సమూహము నుండి కష్ట మయినఁ
బాఱిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన
నేలఁ జెలంగ శత్రువులు నివ్వెఱ సెందక వీరు లెల్లరున్
వాలి సశస్త్ర సంచయము వారిని నాజి జయించ నొప్పఁగా
నాలము సేయ నేఁగు నపు డడ్డిడి యింతయు భీతిఁ గొల్ప నీ
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
[గొల్పనీక + ఆలికి = గొల్పనీ కాలికి]
నేటికాలంపుపోకడనిజముఁదెలియ
రిప్లయితొలగించండిమాటుమలినంబుచూడగమనిషికుండు
ధర్మసంగతిమరచిననరుడెమేటి
పారిపోవలెకీర్తినిఁగోరుకోనిన
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
ధూర్త మానవుల కెపుడు దూరముగను
పారిపోవలెఁ ; గీర్తినిఁ గోరుకొనిన
నాచరించుచు సత్కర్మ లనవరతము
జగతి ధర్మాను వర్తియై సాగవలయు.
ఉ:
రిప్లయితొలగించండికాలమె దీర్పు చెప్పు గద కానిది యేదదొ మంచి దేదనిన్
పోలిక లెంత మాత్రమున పొందికగూర్చవు చిత్తగించగన్
శీలము నెంచ వాలు గని శీర్షము వాల్చ ప్రవాహ మార్గమై
కాలికి బుధ్ధి జెప్పవలె గ్రక్కున ధీరుడు కీర్తి గోరగన్
వై. చంద్రశేఖర్
మేలపు మాటలన్ బలికి మిమ్ముల మిన్నగ జూతునంచునే
రిప్లయితొలగించండిపాలకులై జనాళి నిటు బాధలు పెట్టెదరంచెరంగకన్
వేలకు వేలుగా గదలి పెద్దల జేసిరి, వారి యాగ్రహ
జ్వాలల జిక్కకుండ పరిపాలన జేయుచు సవ్యమౌ విధిన్
మేలొనరించుటే తిరిగి మెప్పును పొందెడి దారి నందికన్
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
మేలగు నార్షధర్మమును మేఁగొని జక్కగ నాచరించుచున్
రిప్లయితొలగించండిశీలము ధర్మమూ లముగ శిల్పముఁజెక్కుచు మూర్తిమంతుడై
కాలపు రాగబం ధమున కర్మను మానక స్వార్థమూనకన్
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్
కొరుప్రోలు రాధాకృష్ణరావు
తేటగీతి
రిప్లయితొలగించండిఎన్నికల ముందు వాగ్దాన మిచ్చినటులఁ
బాలనంబున నేతవై పటిమ తోడ
నేలినంతట దారిద్ర్యమిలను వీడి
పారిపోవలెఁ, గీర్తినిఁ గోరుకొనిన!
ఉత్పలమాల
పాలన లోన జూపెదను పాటవమింపుగటంచుఁబల్క, మి
మ్మేలిక జేసినంతఁ బ్రజ లెన్నుచు చిక్కు సమస్యలన్నిటిన్
దేలిచి ధైర్యవంతుడుగ దీనులఁ గావఁగఁ గష్టనష్టముల్
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున, ధీరుఁడుఁ గీర్తి కోరినన్
ప్రాణతీపిచేత బతుకవలయునన్న
రిప్లయితొలగించండిపారిపోవలెఁ గీర్తిఁగోరుకొనిన
అవని జీవశ్చవముఁగాక నభ్యుదయపు
పాత్ర నటియింపమేలంద్రు పార్టి బెట్టి