11, ఆగస్టు 2020, మంగళవారం

సమస్య - 3454

కవిమిత్రులారా,
కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్"

(లేదా...)
"శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్"

81 కామెంట్‌లు:


 1. తా కృప జూపగ జగమున
  శ్రీకృష్ణుఁడు దైవ,మగునె శిష్టజనులకున్
  వ్యాకృత లీలా గరిమన్
  స్వీకృతిగొను వారి మనసు వేడుక
  నలరన్!

  రిప్లయితొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  పోకాలంబున నేను దాగగనహో పోరాటమున్ సైచకే
  తోకన్ ముడ్చుచు బావిలో, బయటకున్ ద్రోహమ్మునన్ లాగుచున్
  నాకాలిన్ తొడమీద కొట్టమని
  యన్యాయంబు జేసెన్ గదా
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పోఁగాలము' అనడం సాధువు. (సిలబసులో లేదని దబాయిస్తే పాపం సాత్త్వికుడైన తెలుగు పంతులు ఏం చేస్తాడు? నిజమే కాబోలు అనుకుంటాడు!) "తోకన్ ముడ్చి హ్రదమ్ములో..." అనండి.

   తొలగించండి
  2. గురువుగారూ, మీ అవస్థ చూస్తే విశ్వనాథ వారి “ విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు” లో పండితుడైన విష్ణుశర్మకు ఆంగ్లం బోధించడానికి వారు పడిన తిప్పలు గుర్తొస్తున్నాయి! పామరులకైతే యేదయినా సులువుగా బోధించవచ్చు. కాని పండితులతోనే చిక్కంతా! 😊😊🙏🙏🙏🙏

   తొలగించండి

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  Income Tax Troubles:

  నూకల్ నాలుగు మూటగట్టి పనుపన్ నోరూరగా పత్నియే
  కోకల్ సిల్కువి రత్నముల్ మణులనున్ కొండాడుచున్ పంపగన్
  బాకాలూదుచు వచ్చిరే వడివడిన్ భ్రష్టాత్ములై శిస్తుకున్
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్?

  రిప్లయితొలగించండి
 4. శా||
  ప్రాకారంబుననుండు వైరిజనులున్ ప్రఖ్యాతులౌవారికిన్
  సోకన్ పౌండ్రకవాసుదేవుడటు, సంక్షోభంబునున్ మాన్పుటన్
  మూకన్ జెండగ కృష్ణుడట్లు జనులున్ మోరెత్తె, 'వేల్పొక్కడే
  శ్రీకృష్ణుం-డపరాధి దైవమగునే? సిష్టాత్ములౌవారికిన్-'
  Rohit 🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పొంకించెడి భక్తులకున్
  శ్రీకృష్ణుండు దైవ;మగునె శిష్ట జనులకున్
  ప్రాకాశ్యమైన భక్తిని
  వీకగ ప్రకటించువేళ వేడుకనివ్వన్

  మాకందరకును దైవము
  శ్రీకృష్ణుండు; దైవమగునె శిష్టజనులకున్
  ఆ కంసుడు దుర్మార్గుడు
  దూకొన్నట్టి మధురపురమందున్.
  (దూకొను= అతిశయించు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ మొదటి పాదంలో ప్రాస తప్పింది.
   రెండవ పూరణ చివరి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్కారములు. సవరించిన పద్యాలూ;

   జోకను గల భక్తులకున్
   శ్రీకృష్ణుడు దైవ, మగునె శిష్ట జనులకున్
   ప్రాకాశ్యమైన భక్తిని
   వీకగ ప్రకటించువేళ వేడుకనివ్వన్

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 6. కె.వి.యస్. లక్ష్మి:

  ఆకారుణ్య పయోనిధి
  శ్రీకృష్ణుడు దైవ,మగునె శిష్టజనులకున్
  శోకము దూరము జేసెడి
  శ్రీకాంతుండగుచు గాచు స్థిరతరుడగుగా!

  రిప్లయితొలగించండి
 7. సమస్య :
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే
  శిష్టాత్ములౌవారికిన్

  (శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయబోతున్న ధర్మ
  రాజుతో శిశుపాలుడు )
  నాకున్ దక్కెడి రుక్మిణీసుదతి న
  న్యాయంబుగా దేరుపై
  వే కొంపోయెనె ? నీతి యుండెనె ? మహా
  వేగంబుతో దొంగయై
  కోకల్ మూటలు గట్టి చెట్టుపయి కె
  క్కున్ వీడు మాన్యుండ ? ఛీ !
  శ్రీకృష్ణుం డపరాధి ; దైవమగునే
  శిష్టాత్ములౌవారికిన్ ??

  రిప్లయితొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వీకన్ జూపని మాటలన్ పలుకునే? వీడా నిటన్ రాయబా
  రాకృత్యంబును గొప్పగా నడపి నిర్వర్తించు కార్యార్థియా?
  ఛీ! కృష్ణుండిట మాకు భీతినిడునౌ జిహ్వన్ వచించెన్ గదే?
  శ్రీకృష్ణుండపరాధి, దైవమగునే శిష్టాత్ములౌవారికిన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వీడా యిటన్... అనండి. రాయబారాకృత్యంబును... ?

   తొలగించండి
  2. గురువుగారికి నమస్కారములు. రాయబారా కార్యంబును అని మార్చవచ్చును గదా!

   తొలగించండి
 9. ఏకృతమును లేకు౦డనె
  తా కృప జూపగ సతతము తామసపరుడౌ
  నన్ కృప జూడడు మరి యా
  శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   తాఁ గృప.. అనడం సాధువు. మూడవ పాదంలో ప్రాస తప్పింది. సవరించండి.

   తొలగించండి
 10. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణుని గొప్పతనాన్ని భార్యకు వివరిస్తున్న భర్త.

  శ్రీకారాగృహసంభవాదిగతవైశిష్ట్యప్రభావుండు గో
  పీకాంతాపరిధానమానహరణావిభ్రాంతిసంధానమో
  క్షాకాంక్షావరదాత భక్తజనరక్షార్థావతారుండునౌ
  శ్రీకృష్ణుం డపరాధిదైవమగునే, శిష్టాత్ములౌవారికిన్.

  అపర+ఆధిదైవము

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 11. ఈనాటి శంకరాభరణం వారి సమస్య

  శ్రీ కృష్ణుడు దైవమగునె శిష్డుజనులకున్

  ఇచ్చిన పాదము కందము

  నా పూరణము సీసములో


  మార్జాలము పగిది మాటున దాగుచు
  పాలు మీగడలు రేపల్లె లోన

  దొంగిలించెను గదా ,ద్రోహ చింతన కూడి
  జలకము లాడెడి లలనల వలు

  వలు దాచినాడుగా, సులువుగ
  పాలివ్వ
  తలచిన స్త్రీ ప్రాణ ములను తీసె,

  తలచ శ్రీ కృష్ణుడు దైవమగునె శిష్ట
  జనులకు నెపుడైన, సకల లోక

  పూజ్యు డైనట్టి భీష్ముని బ్రోచ శుభము

  లెప్పు డుకలుగు చుండును ,
  మెప్పు బడయ

  గలవుగా, ధర్మ నందనా చెలిమి‌తోడ

  ననుచు శిశుపాలుడు బలికె
  నలుగు రెదుట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నలుగురి+ఎదుట... అన్నపుడు సంధి లేదు. నలుగురు విన... అనండి.

   తొలగించండి
 12. *శిశుపాలుని మాటలుగా*

  పోకిరి తనమున పడతుల
  కోకలు హరియించినట్టి గొల్లడు గాదే
  చీకటిఁ వెన్నెను దోచిన
  శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్

  రిప్లయితొలగించండి


 13. శిశుపాలుని మాటగా


  ఈ కరుడుగట్టిన మనిషి,
  యీ కపటపు వేషధారి యీ దుష్టుడు యీ
  లేకితనమ్ముల వాడీ
  శ్రీకృష్ణుఁడు, దైవమగునె శిష్ట జనులకున్?  శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో

  శిశుపాలుడేమి పుణ్యము చేసుకొనెనో
  శ్రీకృష్ణుని గాధలున్నంత వరకు అతని పేరు కూడా
  మారుమోగు :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. శంకరాభరణం ఉన్నంత వరకు మనిద్దరి పేర్లు...

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   త్యాగరాజు గారి తపమేమి చేసెనో యెఱుగ... కీర్తనను గుర్తుకు తెచ్చారు.

   తొలగించండి
 14. ఆకృతిలో పోలికలను
  శ్రీకృష్ణునివోలెనున్న జిత్తులమారుల్
  శ్రీకృష్ణులుగారుకపట
  శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్

  రిప్లయితొలగించండి
 15. భీకర దుష్ట జనాళికి
  శ్రీ కృష్ణుడు దైవ మగునె? శిష్ట జనులకున్
  ప్రాకటము గ వరము లొసఁగు
  శ్రీ కరు డై వెలుగు గాదె చిన్మయు డగుచున్

  రిప్లయితొలగించండి
 16. రాకాచంద్రుని వెన్నెలన్ సతము లోలాక్షీ సమూహమ్ముతో
  నాకాంక్షల్ నెరవేర్చుకొంచు లలి పాలందించు స్త్రీరత్నమున్
  తాకూలార్చెను మామఁ జంపె కసితో దాక్షిణ్యమున్ వీడి యా
  శ్రీకృష్ణుం డపరాధి, దైవమగునే శిష్టాత్ములౌవారికిన్ ?

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ


  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్"

  ఏ కృత్యంబొనరించినన్ తుదకు మేలే, ధర్మరక్షార్థమే,
  ఆకృష్టాఖిలధేనుగోపవనితాత్యంతప్రమోదార్థమే,
  వైకృత్యంబగుగాని మీరిటులనన్ భావ్యమ్మె కృష్ణాష్టమిన్?
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. మ్రాకుల్గూల్చె, హరించె నంగనల చేలంబుల్; కులాచారముల్,
  బూకల్జేసెను పెక్కులున్, దనరకన్ పోనార్చె లోలాక్షినిన్,
  సాకల్యంబుగ భండనంబు నట తా సాగించె తావీయకన్
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్

  రిప్లయితొలగించండి
 19. శ్రీ కృష్ణాష్టమిమోక్షగాములకిడున్ శ్రేయస్సుప్రేయస్సులన్
  శ్రీకృష్ణాష్టమికృష్ణలీలలుమహాశ్రేష్ఠంబుదేశంబునన్
  మాకృష్ణుండభిరాముడార్తజనసంపన్నుండునేతీరునన్
  "శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్?

  రిప్లయితొలగించండి
 20. మాకున్మీకునువందనార్హుడుమహామాన్యుండుధూర్తాళికిన్
  మేకౌదుష్టులదున్మశిష్టులకుసామీప్యంబునందుండగా
  జీకట్లన్దునుమాడనుడవెన్జింతించుక్రీడ్యర్థమే
  "శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్?

  రిప్లయితొలగించండి
 21. మ్రాకుల్గూల్చెనుశాపమణ్చెపసివారన్జంపుదైత్యాంగనా
  పీకన్నుల్మెనుకాళియోరగునిబంపించెన్హ్రదంబందున్
  సాకారాచ్యుతుడార్తరక్షకుడువిశ్వాసాళికెత్తీరునన్
  "శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణ మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 22. శ్రీకారంబునకాదిపూజ్యుడనిసంప్రీతిన్ప్రశంసించగా
  జీకాకైశిశుపాలుడీసుననురాజీవాక్షునిందించనున్
  "శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే, శిష్టాత్ములౌవారికిన్
  స్వీకృత్యంబగుగృత్యమొక్కటి యసంప్రీతిన్గనంబర్చెనే

  రిప్లయితొలగించండి
 23. శ్రీకృష్ణుండెదుభూషణుండుఘనమౌ
  క్రీడావినోదుండునై
  శ్రీకార్యం బగురాజసూయమున ని
  శ్శేషంబుగావించగా
  శ్రీకేయూరశమంతమున్నొదవు దు
  శ్శీలుండుగా బేర్వడన్
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి


 24. జన్మాష్టమి నాడు ఇంతగా స్వామి వారిని తిట్టింప జేస్తే ఎలాగండీ కంది వారు?

  శిశుపాలుని మాటగా

  ఈ కార్మేఘపు వాడు, దొంగ ,పతితుండీ దుష్టుడీ కేడడున్
  బాకాలూదుచు నీతులన్ బలుకు, జంబాల్గొట్టుడీ కొండెడున్
  కోకల్బట్టుచు లాగు కన్నియలనీ కూళుండు నిందార్హుడీ
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్?  నేనలే
  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. ఆ కుత్సిత మతులకు మరి
  శ్రీకృష్ణుఁడు దైవమగునె? శిష్టజనులకున్
  ప్రాకటముగ పరమ గురుడు
  శ్రీకృష్ణుడె దైవమెపుడు చింతింపంగన్

  రిప్లయితొలగించండి
 26. శిశుపాల ఉవాచ 👇

  ఏకత మీతడు పూజ్యుడు?
  నాకయి గూర్చిన వనితను నాచెనుగాదే?
  వీకను బారెను రణమున
  శ్రీకృష్ణుడు దైవమగునె శిష్టజనులకున్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాకై నేర్పడినన్ వధూటి గొనెనే
   నైపుణ్యమేపారగా
   వీకన్ బారెను సాగరమ్మునకు
   నావీరున్ జరాసంధునిన్
   తాకంగా భయభీతుడై, నిరత కాంతాలోలు డైనట్టి ఈ
   శ్రీకృష్ణుం డపరాధి, దైవమగునే శిష్టాత్ములౌ వారికిన్?

   తొలగించండి
 27. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వీకన్ జూపని మాటలన్ బలుకునే? వీడా యిటన్ దౌత్యమున్
  తా కావించునె గొప్పగా? మము నేతర్కంబుతో తార్కొనున్?
  ఛీ! కృష్ణుండిట మాకు భీతినిడునౌ జిహ్వన్ వచించెన్ గదే?
  శ్రీకృష్ణుం డపరాధి, దైవమగునే శిష్టాత్ములౌ వారికిన్?

  రిప్లయితొలగించండి
 28. శ్రీకృష్ణుండుసుభూషణుండుఘనమౌ
  క్రీడావినోదుండునై
  శ్రీకార్యం బగురాజసూయమున ని
  శ్శేషంబుగావించగా
  శ్రీకేయూరశమంతమున్నొదవు దు
  శ్శీలుండుగా బేర్వడన్
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్

  కొరుప్రోలు రాధాకృష్ణరావు,🙏🏻సరిచేసాను గురువుగారు

  రిప్లయితొలగించండి
 29. ఆకీనాశులు నిత్యమున్ ప్రజల నన్యాయమ్ముగాచంపుచున్
  చీకాకుల్ కలిగించు చుండ నడచన్ శ్రీకృష్ణుడీ పృథ్విపై
  తాకల్గెన్ వసుదేవు పుత్రుడయి యుద్ధారమ్ము చేయన్ ప్రజన్
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్ ?

  రిప్లయితొలగించండి
 30. 11.08.2020
  నా పూరణ యత్నం 🙏

  *కం*

  ఆ కౌరవులెల్లరు మరి
  గోకుల కృష్ణుని తలచుచు గొప్పగ యనరే
  మీకొరకై సైన్యమనిన
  *"శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్"*!!

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 31. ద్రౌపది మనోగతం

  హేకృష్ణా మధుసూదనా మురహరీ హేనందగోపాల రా
  హే కారుణ్యపయోనిధీ గిరిధరా హే దీనబంధూ మురా
  రీ కాపాడుము దీనురాలనన పాలించెన్ గదా యేవిధిన్
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్

  రిప్లయితొలగించండి

 32. శ్రీ కృష్ణుడు భగవానుడు
  శ్రీ కృష్ణుడు మనకు నిచ్చు సిరి సం ప ద లున్
  శ్రీ కృష్ణుని సేవించిగ
  శ్రీ కృష్ణుడుదైవమగునెశిష్టజనులకున్

  రిప్లయితొలగించండి
 33. అష్టమి రోహిణి పొద్దున
  న ష్టమ గర్భుడు గ పుట్టె కృ ష్ణుడు మహిలో
  న్ని ష్టముగ పూ జ చేసిన
  కష్టము లిక మనకు తొల గు కన్నని దయచేన్

  రిప్లయితొలగించండి
 34. ఆకన్నయ్యను వెన్నదొంగయని నాప్యాయమ్ముగన్ బిల్వరే
  కోకల్ దోచిన దుండగీడనుచు నాక్రోశింపరే గోపికల్
  శోకాబ్ధిన్ నను ముంచి తేల్చి నెపుడున్ చొప్పించుచున్ కుక్షిలో
  *శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 35. శ్రీకాంతుండు సురాళికోరగను తా శిష్టాళి రక్షింపగా
  నీ కల్పమ్మున ధర్మమున్ నిలుపగన్ హేమాంగుడే పృథ్విపై
  నా కంసాధము జంపనెంచుచును కారాగారమున్ బుట్టె నా
  శ్రీకృష్ణుం డపరాధి? దైవమగునే శిష్టాత్ములౌవారికిన్

  రిప్లయితొలగించండి
 36. ఆకల్దీర్చగ నెంచినట్టి సతి సంహారమ్మునే చేసె, వా
  డే కూలార్చెను గాదె కంసుడను, వాడే రుక్మి తోబుట్టు వౌ
  యా కన్యన్ హరియించె, హరికుండై వెన్ననే దోచె నా
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్

  రిప్లయితొలగించండి
 37. శ్రీకాంతుండుదశావతారములలో శ్రీకృష్ణుగా ద్వాపరన్
  లోకంబందునధర్మ స్థాపనమునాలోకించి యేతెంచె నే
  సేకంబుల్ తనకంటనట్టివిభుడా శ్రీనాథుడౌ విష్ణువే
  శ్రీకృష్ణుం ,డపరాధి దైవమగునే శిష్టాత్ములౌ వారికిన్

  రిప్లయితొలగించండి
 38. కాకోదరమ్మును దఱిమె
  నా కేల గిరీంద్ర మెత్తి యారసె నేలా
  నీకీ ప్రశ్నము బేలా
  శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్


  వీకం గొల్వుము బుద్ధి నూని మది నా విశ్వేశునిన్ వహ్నిలో
  దూకం జాలెడు మూర్ఖమౌ శలభమై తోచంగ నేలా నరా
  యేకాంతమ్మునఁ జింత సేయు మిఁక కాదే పల్కు దుష్టాలికిన్
  శ్రీకృష్ణుం, డపరాధి! దైవమగునే శిష్టాత్ములౌవారికిన్

  రిప్లయితొలగించండి
 39. అందరికీ శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు..

  శిశుపాలుని నిందలు..

  కందం
  అకారము కనువిందుగ
  గోకులమునుఁ గొల్లకొట్టె గ్రోలఁగ వెన్నల్
  లేకిగ చీరలు దోచిన
  శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్?

  భీష్ముని మరణం తర్వాత దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మను నిందిస్తూ...

  శార్దూలవిక్రీడితము
  లోకాలేలెడు స్వామిగన్ బొగడుచున్ బ్రోవంగఁ సేవించినన్
  సాకారమ్మొనరంగ పాండవులవౌ స్వప్నాలు గాంగేయుపై
  నే కారుణ్యము లేక కూల్చమనియెన్ హేయమ్ముగా క్రీడితో
  శ్రీకృష్ణుం డపరాధి! దైవమగునే శిష్టాత్ములౌవారికిన్?


  రిప్లయితొలగించండి
 40. రాకాసి బుద్ధి పొడమిన
  శ్రీకృష్ణుడు దైవమగునె, శిష్ట జనులకున్
  సాకారదైవముగ వి
  శ్వాకారము జూప నరుడు సాగిలబడియెన్.

  రిప్లయితొలగించండి
 41. సాకారంబగు విష్ణుతత్వమది సం
  స్థాపించగా ధర్మమున్
  లోకాతీతుడు గోపబాలుడయె గోలోకంబు బృందావనిన్
  శోకావేశము మాన్పగా నొసగెనే సుశ్లోక గీతాసుధన్
  శ్రీకారంబును జుట్టె దుర్విభువులన్ శిక్షింపగా పృధ్వి నా
  శ్రీకృష్ణుం డపరాధి? దైవమగునే శిష్టాత్ములౌ వారికిన్!

  రిప్లయితొలగించండి
 42. ఆ కామాంధు డకార్యకారి ఖలుడా యజ్ఞారి కజ్ఞానికిన్
  శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే; శిష్టాత్ములౌ వారికిన్
  శ్రీకృష్ణుం డజు డాదిదేవు డతనిన్ సేవింప సద్భక్తులై
  పోకార్చున్ గద పాప రాశి నతడే మోక్షంబు నందించుగా

  రిప్లయితొలగించండి
 43. సమస్యా పూరణం

  *శ్రీకృష్ణుడు దైవమగునె? శిష్టజనులకున్*
  ...............
  గోకుల సాయన, సాయీ
  రాకేశుడు, సాయిరాము, రకరకములునై
  వికటించిన యే సాయీ
  శ్రీకృష్ణుడు దైవమగునె? శిష్టజనులకున్*

  రిప్లయితొలగించండి
 44. శ్రీకృష్ఞుడపరాధిదైవమగునేశిష్టాత్ములౌవారికిన్
  శ్రీకృష్ణుండిలదైవమయ్యెడినిదాశీఘ్రంబులోకాళికిన్
  శ్రీకృష్ణుండననేర్వుమారమ!ప్రజాశ్రేయస్సుగాంక్షించగా
  శ్రీకృష్ణుండపరాధిదైవమగునా?చింతించుడీ సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 45. కం//
  మీకృపను బొందె కంసుడు
  తా కృతకర్మను గలిగియు, దాష్టికముగ తా l
  ప్రాకృత కర్మను జేసిన
  శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్ ll

  రిప్లయితొలగించండి
 46. శా:

  ఆకాశంబున నేగుచున్ గయుడు వీడా నూయచేరెంగదా
  లోకాధీశునిదోయిలిన్ గనగ నోలోచించి గోపమ్మునన్
  బాకానూది వధించ నెంచ నపుడా పాదించె నీరీతిగన్
  శ్రీ కృష్ణుండపరాధి దైవ మగునే శిష్టాత్ములౌ వారికిన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 47. నోలోచించి కి బదులు నాలోచించి గా చదువగలరు

  రిప్లయితొలగించండి