5, ఆగస్టు 2020, బుధవారం

సమస్య - 3448

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రంభాభోగమ్ముఁ గోరరాదు కవీంద్రా"
(లేదా...)
"రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే"

73 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  దంభమ్మందున మున్గి తేలక సదా తాదాత్మ్యమున్ జెందుచున్
  సంభాలించుచు క్రోధ కామములనున్ జాప్యమ్మునున్ జేయకే
  శంభున్ పాదము లాశ్రయించి కవితల్ శ్రావ్యంబుగా వ్రాయకే
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే

  రిప్లయితొలగించండి
 2. శుంభత్ సత్కవనంబు లేక ప్రతిభాశోభావిహీనుండవై
  దంభంబుల్ బలె పల్కుచున్ ధరణివిద్వాంసాళిఁ గర్హించుచున్
  ఝృంభిచంగ భయంబునంది జనులున్ చేజేతులాచేయు సం
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే

  సంరంభ + ఆభోగము ( పరిపూర్ణత్వము )

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   జృంభించంగ... టైపాటు.

   తొలగించండి
 3. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సంభవమగు దేవతలకు
  రంభా భోగమ్ము; గోరరాదు కవీంద్రా!
  సంభావన మనకు మనమె
  సంభవమగు నీకు నదియె సరి పాండితితో.

  రిప్లయితొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  కుంభమ్మందున రాళ్ళు వేసి జలమున్ కూర్మిన్ వడిన్ త్రాగుచున్
  సంభాలించుచు గూడు కట్టక మదిన్ సంబందమున్ కోరుచున్
  దంభమ్మందున మున్గి తేలుచునయో తాలాబులన్ వీడుచున్
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే

  కవి = నీటికాకి
  రంభ = అరటిచెట్టు
  తాలాబు = తటాకము
  సంబందం = పెళ్ళి (తెలంగాణ పదకోశం...నలిమెల భాస్కర్)

  రిప్లయితొలగించండి
 5. జంభారాతికి జెల్లును
  రంభాభోగమ్ము; గోరరాదు కవీంద్రా
  దంభమ్మున సత్కార
  మ్మంభోజాసనుని రాణి యర్చనలేకే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జంభారాతికి నొప్పుగాదె దివిలో సంరంభ మొప్పారగా
   రంభాభోగము; గోరదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే
   దంభమ్మొప్పగ పట్టముల్ మరియు సత్కారంబులన్? గొల్వకే
   అంభోజాసను రాణి మానసము
   నత్యంతానురక్తిన్ దగన్ !

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏

   తొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దంభోక్తుల్ సతమీవు పల్కుచు నిటన్ తాపత్రయంబొందుచున్
  సంభావింతువు శ్రేష్ఠుడౌ కవివలెన్ సామర్థ్యమేలేకయే
  సంభేదమ్మగు కైతలల్లుచు మహా సత్సారునిన్ తీరు సం
  రంభాభోగము గోరెదేల కవిచంద్రా! యర్హతల్ గాంచవె?

  రిప్లయితొలగించండి
 7. దంభంబేలవచించుమానవులసద్భాగ్యార్థమేకావ్యముల్
  సంభావింపకునిన్నునీవుకుకవీసామర్థ్యమేశూన్యమై
  శంభున్విష్ణువుశారదాంబదయలేశంబైననున్లేక సం
  రంభాభోగముగోరెదేలకవిచంద్రా!యర్హతల్గాంచవే

  రిప్లయితొలగించండి


 8. దంభోక్తులు వలదండీ!
  సంభారమ్ముల విఘనము సరి మన కంతే!
  జంభారికి చెందినదా
  రంభాభోగమ్ముఁ గోరరాదు కవీంద్రా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. అంభోజాసను రాణిని
  సంభావించు సతతమ్ము సద్భక్తిని, హే
  పుంభావ సరస్వతీ! విను
  రంభా భోగమ్ముఁ గోరరాదు, కవీంద్రా.

  రిప్లయితొలగించండి
 10. దంభంబేలవచించుమానవులసద్భాగ్యార్థమేకావ్యముల్
  సంభావింపకునిన్నునీవుకుకవీసామర్థ్యమేశూన్యమై
  శంభున్విష్ణువుశారదాంబదయలేశంబైననున్లేక సం
  రంభాభోగముగోరెదేలకవిచంద్రా!యర్హతల్గాంచవే

  రిప్లయితొలగించండి
 11. "రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే
  జంభారాతికిసాధుసత్పురుషవిశ్వశ్రేయయోగీంద్రుకున్
  శుంభచ్ఛత్రునిహంతకున్శివునకున్శోభించువిష్ణ్వాదికిన్
  ఝృంభించన్గవితాపగామునిగినిశ్చేష్టుండవైబోకుమా

  రిప్లయితొలగించండి
 12. రిప్లయిలు
  1. శుంభత్సాహితివేదిమధ్యధిషణాశోభావహత్కావ్యగీ
   రంభోరాశివిరాజమానకవిసమ్రాట్టుల్ సమాహూతులై
   జృంభించం, దగవందు నీవు, నట నగ్రాథిత్యపూజార్హసం
   రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే

   కంజర్ల రామాచార్య
   కోరుట్ల.

   తొలగించండి
  2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 13. శ౦భు పద మాశ్రయి౦చిన
  ర౦భా భోగమ్ము, గోరరాదు కవీ౦ద్రా!
  స౦భావి౦పక పదములు
  శు౦భద్గతి శారదా౦బ శుక్ల పద౦బుల్

  రిప్లయితొలగించండి


 14. దంభాల్పల్కకు నవ్విపోదురుసుమా తావేలు వేయంగ నా
  యంభారిన్చరణమ్ములూనగను ఛాయాభృత్తు లైపోదుమే?
  సంభారమ్ముల విందులే సరియగున్! సంభోగ భాగ్యమ్ములా
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. శంభావాంచిత సారసద్విమల శంసాపూర్ణ చాతుర్యతల్
  సంభావార్భటి రమ్యచిత్ర కథనా సంకల్ప కల్పితాశుతల్
  సంభాసుండు కవీంద్రుడౌను ! నిరతాశాస్వార్థ కాముండనన్
  రంభాభోగము గోరెదేల కవిచంద్రా ! యర్హతల్ గాంచవే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 16. అంభోజాసనముఖ్యదేవగణమున్ హర్షాతిరేకమ్ముతో
  శుంభద్వాక్యము లంది సత్తపముగా స్తోత్రంబు చేయంగ నా
  జంభద్విట్టు మనుష్యవేషధరుడై చాలించుమం చిట్లనెన్
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే"

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  అంభోజాసనవాసవాదిసురలాహా యంచు సోత్సాహులై
  శుంభద్రామశుభాలయమ్ము ధరణిన్ శోభిల్లు నేడంచు ప్రా....
  రంభంబున్ దిలకింపనుత్సుకత వే రానున్న యీ వేళలో
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 18. అంభో జాక్షి కి పతి వై
  శంభుని భక్తుం డగుచును సత్కిర్తుల తో
  కుంభిని రాణించుచు సం
  రంభా భోగమ్ము కోర రాదు కవీంద్రా !

  రిప్లయితొలగించండి
 19. అంభోజాసనపత్నిని
  సంభావనజేయుచుండిసతతముమదినిన్
  సంభాలించెడునీకిదె
  రంభాభోగమ్ముగోరరాదుకవీంద్రా!

  రిప్లయితొలగించండి
 20. దంభమ్మైన విధమ్ముతోడచనుచున్ దర్పమ్ముతోసంస్థ లా
  రంభమ్మున్ వడిఁ సృష్టి చేయుచును వేలంవేయుచున్ పట్టముల్
  గంభీరంపు విధిన్ స్తుతించ కవులన్, కాంక్షించి మోసంపు సం
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వడి తర్వాత అరసున్న అవసరం లేదు. 'వేలం' వ్యావహారికం.

   తొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. అంభోజానుబత్నినింగొలుచుమాహాత్మ్యుండ!యిట్లంటివా
  రంభాభోగముగోరదేల?కవిచంద్రా!య ర్హతల్గాంచవే
  సంభాలీంచుకునుండనోపునుగదాసత్కావ్యపారుణులౌ
  జంభారాతికిమిత్రునింసతినినేసంసేవ్యమానుండిలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అంభోజాసను...సంభాళించుకు... మిత్రునిన్... టైపాట్లు.

   తొలగించండి


  2. అంభోజాసనుబత్నినింగొలుచుమాహాత్మ్యుండ!యిట్లంటివా
   రంభాభోగముగోరదేల?కవిచంద్రా!య ర్హతల్గాంచవే
   సంభాళించుకునుండనోపునుగదాసత్కావ్యపారీణులౌ
   జంభారాతికిమిత్రునిన్ సతినినేసంసేవ్యమానుండిలన్

   తొలగించండి
 23. రంభాధారివిగమనుమా
  రంభాననెనీదుమనసురాగముఁబోందన్
  రంభోరులఁజేరఁజనకు
  రంభాభోగమ్ముఁగోరరాదుకవీంద్రా
  1వరంభ=బ్రహ్మచారిధరించెడివెదురుకోల

  రిప్లయితొలగించండి
 24. 05/08/2020
  అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ

  *కం*

  శంభో శంకరుని దలచి
  సంభవమని పద్యములను చక్కగ వ్రాయన్
  రంభేలను వచ్చెనిపుడు
  *"రంభాభోగమ్ముఁ గోరరాదు కవీంద్రా"*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   శంభుని శంకరుని... రంభ యిపు డేల వచ్చెను... అనండి.

   తొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. అంభోజాసను సతికృప
  సంభవ మగునుగ కవులకు సంభావనముల్!
  దంభము తోడను స్తుతులను,
  "రంభాభోగమ్ముఁ గోరరాదు కవీంద్రా"

  రిప్లయితొలగించండి
 27. కం.
  కుంభిని పండితు డహరా
  రంభము నంభారవమ్ము, రాగము తోడన్
  సంభోగమేలనయ్యా!
  *రంభాభోగమ్ముఁ గోరరాదు కవీంద్రా!*

  కుంభిని-భూమిపై
  అహరారంభము-ప్రాతఃకాలము
  అంభారవము-ఆబోతుఅఱుపు

  -యజ్ఞభగవాన్ గంగాపురం

  రిప్లయితొలగించండి
 28. సంభావించుము భక్తి పూర్వముగ విశ్వాసమ్ముతో పండితా!
  యంభోజాసను రాణినిన్ సతము నీ యజ్ఞానమున్ ద్రుంచగన్,
  దంభమ్మందున దీర్ఘదర్శిననుచున్ దర్పంబుతో హీనమౌ
  రంభాభోగముఁ గోరదేల కవిచంద్రా! యర్హతల్ గాంచవే.

  రిప్లయితొలగించండి
 29. అంభోరాశి నిభ మహా
  గంభీ రార్థ కవితా నికాయము కలదా
  డంభమ్మున సద్యస్సం
  రంభా భోగమ్ముఁ గోరరాదు కవీంద్రా


  అంభోజాసన దార వీతదయ విద్యాహీన దుర్భాగ్యుఁడా
  సంభావ్యమ్ముగ నేర్చి విద్యలను సచ్ఛబ్దార్థ సంయోగముల్
  శుంభత్కావ్యము లొక్క టొక్కటిగనే శోభిల్లు గ్రంథవ్ర జా
  రం భాభోగముఁ గోరె దేల కవిచంద్రా యర్హతల్ గాంచవే

  [ఆరంభ + ఆభోగము =ఆరంభాభోగము: ప్రారంభమునందె పరిపూర్ణత]

  రిప్లయితొలగించండి
 30. సంభావ్యంబుగ భవ్య కావ్య రచనా సద్భావమున్ దేలకన్
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే
  దంభంబున్ ఘన తాపసోత్తముల కాతంకంబు గావింపగా
  రంభాభోగము లాశ జూపెడి యహల్యాజారు సాదృశ్యమున్

  రిప్లయితొలగించండి
 31. శా:

  శంభో యేమిటొ వింత గోల కవితా స్రస్టా సమూహమ్మునన్
  సంభాలింపగ కష్టమాయె నకటా శాంతమ్ము చేగూర్చగన్
  గంభీరమ్ముగ చింతసేయ నగునో కావ్యాను సారంబుగన్
  రంభా భోగము గోరె దేల కవి చంద్రా యర్హతల్ గాంచవే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 32. మహాకవి ధూర్జటి గారిని స్మరించుకుంటూ, ఆ మహాకవి జీవన ఇతివృత్తంలో  .. శార్దూలంలో పూరణ 🙏

  శా :
  అంభోజంబులగొల్చి పాదయుగళంబర్చించ నిన్నే శివా !  
  గాంభీర్యంబగు మేటి కావ్య గరిమల్ కైవల్యమొందెన్ శివా !     
  శంభోశంకర ! యంటి, నీదు కరుణాచందంబునీయుమ్ శివా !  
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా ! యర్హతల్ గాంచవే !

  కస్తూరి శివశంకర్

  రిప్లయితొలగించండి
 33. కందం
  సంభావించఁగ నొకపరి
  పుంభావసరస్వతివని పొంగుచు నా సం
  రంభమ్మున భ్రమపడుచున్
  రంభాభోగమ్ముఁ గోరరాదు కవీంద్రా!

  రిప్లయితొలగించండి
 34. శార్దూలవిక్రీడితము
  సంభావించఁగ గుంపులోన కవిగన్ స్వాధీనమున్ దప్పుచున్
  బుంభావమ్ము కవిత్వమందమరెనన్ మూర్ఖత్వమేపార సం
  రంభంబందున చూపునాకసమునన్ భ్రాంతిన్ ప్రకోపించగన్
  రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా! యర్హతల్ గాంచవే?

  రిప్లయితొలగించండి
 35. గంభీరముగా కరోనయు
  గుంభినిదిరుగాడె గుమియుగూడుట యసదే
  సంభవ సత్కార పరీ
  రంభాభోగమ్ముగోర రాదు కవీంద్రా!

  రిప్లయితొలగించండి
 36. గంభీరముగా కరోనయు
  గుంభినిదిరుగాడె గుమియుగూడుట యసదే
  సంభవ సత్కార పరీ
  రంభాభోగమ్ముగోర రాదు కవీంద్రా!

  రిప్లయితొలగించండి
 37. జంభారాతికి నొప్పును
  *రంభాభోగమ్ము,గోరరాదు కవీంద్రా*
  రంభము వంటి దురాశలు
  రంభము రేపగ బ్రతుకున రహియది తొలగున్

  రంభము:కంటకము(3 పాదము)
  రంభము:దుమ్ము(4 వ పాదము)

  రిప్లయితొలగించండి