20, ఆగస్టు 2020, గురువారం

సమస్య - 3463

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ"

(లేదా...)
"రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్"

107 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  పత్నిని వీడి రాజ్యమును పట్టుచు చేతిని మోడివర్యుడే
  నూత్నపు రీతినిన్ వెలిగి నోరుల మూయుచు ప్రాతిపక్ష్యులన్
  యత్నము చేసి, భాజపులు హాయిని చెంద నయోధ్యనందునన్
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. "Only Stones to be Used for Building Ram Temple in Ayodhya, Will Stand for 1,000 Years: Trust Official"

   తొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రాతిపక్షులన్' అన్న ప్రయోగం సాధువు కాదనుకుంటాను. "వైరివర్గమున్" అనవచ్చు కదా?

   తొలగించండి
 2. యత్నము లెన్నొజేసి తగు నాజ్ఞలు పొంది న్యాయమౌవిధిన్
  రత్నమయోధ్యలో గుడిని రాములవారికి కట్టగా మహా
  రత్నమువంటి నామమును వ్రాయగ భక్తులు రాళ్ళపైననున్
  రత్నములయ్యె రాళ్ళు భళిరాయని మెచ్చగ లోకులెల్లరున్

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. ఆటవిడుపు సరదా పూరణ:
   (జిలేబి గారికి అంకితం)

   నూత్నపు రీతినిన్ కొసరి న్యూనత వీడుచు పుత్రునిన్ కడన్
   యత్నము చేసి శాస్త్రివరు డాదట మీరగ హైద్రబాదునన్
   పత్నిని కూడుచున్ కడకు బంజరు హిల్సున మేడ కట్టగా
   రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్

   తొలగించండి
  2. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   'పుత్రు సంగతిన్' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి

 4. నూత్నత నిండి శాస్త్రము వి
  నూత్న పథంబుల మానవాళికిన్
  యత్న ఫలంబులీయ ప్రజ
  లందరి యిండ్లను దేవళమ్ములన్
  కృత్నులలంకరించ మని
  కిన్ నవరాగములద్ది యొద్దికన్
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళి
  రా యని మెచ్చఁగ లోకులెల్లరున్!

  కృత్నులు=నైపుణ్యం కలిగిన పనివారు

  రిప్లయితొలగించండి
 5. శిలలపై శిల్పాలు చెక్కినారు

  నూత్న వధూవరుల్ జనిరి నూతన లోకము నోరుగల్లుకున్
  పత్నికి నంధురాలగుట వర్ణన జేయుచు బల్కెనిట్టులన్
  యత్నము లెన్నొజేసి యిట హంగులు
  దిద్దిగ శిల్పులే దగన్
  రత్నములయ్యె రాళ్ళు భళిరాయని మెచ్చగ లోకులెల్లరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నూత్నపురీతులన్ బ్రజల నూరట
   బెట్టగ నిండ్లపట్టలన్
   పత్నుల పుత్రికామణుల బాగునుగోరుచు వారిపేర నౌ
   రత్నములంచు పంచుటకు రంజుగ భూమిని సేకరించగన్
   రత్నములయ్యె రాళ్ళు భళిరాయని మెచ్చగ లోకులెల్లరున్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'శిలలపై శిల్పాలు..' పాటను చిత్రీకరించింది హంపీలో..

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా! హంపిసీమకున్ గా మార్చెదను! 🙏🙏🙏

   తొలగించండి
 6. సమస్య :
  రత్నములయ్యె రాళ్లు భళి
  రా యని మెచ్చగ లోకులెల్లరున్
  (తమ ప్రయత్నం లేకుండానే రాళ్లు రత్నాలుగా మారుతాయి - ఎలాగంటే )
  యత్నము లేక దొంగయె త
  థాగతదేవుని శిష్యుడాయెనే ;
  యత్నము లేక మంగళుడు
  యాదవనాథుని భక్తుడాయెనే ;
  యత్నము లేక కాపరియె
  యంబిక వ్రాత గవీంద్రుడాయెనే ;
  రత్నములయ్యె రాళ్లు ; " భళి
  రా " యని మెచ్చగ లోకులెల్లరున్ .
  ( అంగుళిమాలుడు - బుద్ధభగవానుని శిష్యుడు ; బిల్వమంగళుడు - కృష్ణభక్తుడు ; కాలుడు - కాళిదాసుడు )

  రిప్లయితొలగించండి
 7. ఒకచోట నుర్రూత లూగు కవనములు తోడ నొప్పుచు నుండు, దోచు చుండు

  నురికించు చుండెడి యుద్ధ భేరీలతో
  నొక ప్రక్క,శృంగార మొక్క ప్రక్క

  నొలికించు చుండును, నొకదిశ
  లోన సంగీత గానములను

  చూపించు,నొకప్రక్క జోరుగా
  భారత ఘట్టముల్ బాగు గాను


  కనుల విందును జేయు నేక శిల నగర

  శిల్ప చతురత నేరీతి తెల్పగలము

  శిల్పి యులిదెబ్బ తగుల వాసినిడు కళల

  రత్నములుగ మారెను ఱాళ్లు ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 8. చెత్తకుండీ నందున నుండి జేరదీసి
  యాశ్రయమునిచ్చి , విద్యల నన్నినేర్ప
  నింత ఘనముగ నెదుగుట నెంచిజూడ
  రత్నములుగ మారెను ఱాళ్ళు , ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి


 9. మూల ఉన్నదాన్ని కష్టపడి తీస్తే హై వాల్యూ :)


  అక్క డెక్కడో గనులలోన కనుల కన
  బడక యుండె త్రవ్వి వెలుగు బరచి చూడ
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ
  గాను మనుజుల లెంత నిగ్గడియొ కాదె  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి


 10. కందోత్పల

  నిగనిగ లాడుచు కన్నుల
  వగ, రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మె
  చ్చఁగ లోకులెల్లరున్ మూ
  లగపడి యున్న గనిని జనులరె త్రవ్వంగాన్


  జిలేబి

  రిప్లయితొలగించండి


 11. నూత్నపు కైపు లంతయు మనోజ్ఞమగున్ పరమార్థమిద్దియే!
  ప్రత్నపు త్రవ్వకమ్ముల నిరంతర మైన కృషిన్, ప్రయాసతో
  యత్నము చేసి త్రవ్వి గని యందున చూడ కనుల్ జిగేల్మనన్
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. బండ రాళ్ళను కొని తెచ్చి వాసిగాను
  శిల్పి నిపుణతన్ జూపంగ శీఘ్రము గను
  చక్కనైన రూపును దాల్చి సకల కళల
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అదవ జంటను చేకొని యనువు జేసి
  వినయము విధేయతాజ్ఞాన విద్యలన్ని
  నేర్పి సరిమనుజుల జేసి నెఱిని గూర్ప
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 14. ఎందరొ మహానుభావులై ఈ ధరా స్ట
  లంబునన్ జననం బంది లక్శ్యమెరిగి
  జన్మ సార్ధక్యమును పొంద చనగ నిజము
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 15. రత్నము వంటి మారుతట రామ పదాబ్జములందునిల్వ యే
  యత్నము లేక రాముడిడె నాభరణంబట ప్రీతిమీర నా
  రత్నము లందునన్ ప్రభువు రాముని గాంచగ పెక్కలించ నీ
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చగ లోకులెల్లరున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రత్నము వంటి మారుతిదె రామ పదాబ్జములందునిల్వ యే
   యత్నము లేక రాముడిడె నాభరణంబట ప్రీతిమీర నా
   రత్నము లందునన్ ప్రభువు రాముని గాంచగ పెక్కలించ నీ
   రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చగ లోకులెల్లరున్

   తొలగించండి
 16. దస్యుని సుతులంచు జనులు దయను వీడి
  మచ్చరించిరి గదనాడు, మహిని నేడు
  ప్రాజ్ఞులై వెలుగుట గాంచి పలికి రిట్లు
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 17. ఎక్కడోకొండకోనలకేగితెచ్చి
  బండఱాళ్ళను మలచెను భామినులుగ
  శిల్పిచాతురీవిభవముచేతగాదె
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  యత్నము తోడ నిద్దరు ననాథల జేకొని చక్కజేయగా
  నూత్నపు విద్యలన్ వలను నోరిమి నేరిమి నీతి చిత్తునన్
  క్రుత్నుల జేసి వారినిట గొప్పగు పౌరులుగా నొనర్చితిన్
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్!

  రిప్లయితొలగించండి
 19. యత్నకృతమ్మునన్ బడయు నజ్ఞు డనంతసమీహితార్థముల్,
  యత్నము తోడ నాకుఁదిను నాక్రిమి షట్పదరూపుదాల్చదే!
  యత్నమె మూలకారణమ టంచుఁ ప్రశంసల మున్గు నీ శిలల్
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురం.

  రిప్లయితొలగించండి
 20. 20.08.2020 సమస్య:
  శ్రీ గురుభ్యో మహభ్యోన్నమః!🙏🏻🙏🏻🙏🏻
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ
  పూరణము:
  తేగీ.
  సప్తతి వడిలో నైనను చక్కగాను
  శంకరాభరణము పేర శంకరార్యు
  పద్య రచనకు నిష్ఠతో పాదుకొలుప
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ.

  రిప్లయితొలగించండి
 21. గారడీ విద్య నేర్చిన ఘనుడొకండు
  ప్రతిభ జూపించి యలరించి రక రకంపు
  వింతలన్ బ్రదర్శిం చెడి వేళ యందు
  రత్నము లుగ మారెనురాళ్లు ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 22. మైలవరపు వారి పూరణ

  యత్నము జేసి కొండలనహర్నిశలున్ శ్రమతోడ త్రవ్వుచున్
  నూత్నవిధానమెంచుచు కనుంగొన కాంతుల జిమ్మునట్లుగా
  రత్నములోయనంగ పలురాపిడులన్ మెరుగుల్ పొనర్పగా
  రత్నములయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 23. యత్నము జేయ గీడగు మహాబల వంతుడు వాలి యంచు తా
  పత్నిని, రాజ్యమున్ వదలి బండల కొండల తిర్గునత్తఱిన్
  నూత్న సుహృత్తు రాఘవుడు నుగ్గులుసేయగ భ్రాతనంతటన్
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్

  రిప్లయితొలగించండి
 24. భారతీయ శిల్ప కళల ప్రాభవంబు!
  యెంచ నేరికి తరమౌను యించుకంత, గుడులు,గోపురములు మరి, గుహలయందు,
  "రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ప్రాభవంబు నెంచ... తరమగు నించుకంత..." అనండి.

   తొలగించండి
 25. యత్నము చేయమానవులు యాతనలన్ గణియింప కుండ నా
  నూత్నపు శోధనమ్ముల వినుత్నవిధానము సంభవింపగా
  కృత్నుల చేతి వాటమగు కృత్యములన్ కడు నిగ్గుదేలగా
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్

  రిప్లయితొలగించండి
 26. కె.వి.యస్. లక్ష్మి:

  కనకపు ధర నింగికెగయ గాంచు చుండి
  బాధ నొందెడి వారల వాంఛ దీర్చ
  తళుకు బెళుకు రాలనుజేర్చి తాచి నపుడు
  రత్నము లుగ మారెనురాళ్లు ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 27. .............శంకరాభరణం.........
  20/08/2020..గురువారం

  సమస్య
  *** ****
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్

  నా పూరణ. ఉ.మా.
  **** *****

  యత్నమొనర్చి వేమన , ప్రయత్నమొనర్చుచు కాళిదాసు, తా

  యత్నమొనర్చి గౌతముడు , యత్నమొనర్చుచు బోయడే భువిన్

  నూత్నపు దీప్తి రాజిలుచునున్ గడియించిరి భూరి కీర్తులే

  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్"

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 28. యత్నము లేక వ్యర్థమగుగా సృజనాత్మక శక్తి యుండినన్
  యత్నము దోనె సాధ్యమగునందురు కార్యమదెట్టిదైననున్
  యత్న ఫలమ్ముతో మెరుగు యంత్రమునొక్కటి సేయ నాతడున్
  రత్నము లయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్

  రిప్లయితొలగించండి
 29. పత్నిని దొంగలించగను పాపి దశాస్యుడు క్లేశమొంది దా
  యత్నము జేయ తోయనిధి యందున గట్టగ సేతువున్ మహా
  రత్నము రామనామమును వ్రాయగ కోతులు రాళ్ళపైననున్
  రత్నములయ్యె రాళ్ళు భళిరాయని మెచ్చగ లోకులెల్లరున్

  గురువుగారికి భక్తిప్రపత్తులతో 🙏🙏🙏🙏🙏

  పత్నిని వీడుచున్ దనదు వాసము
  గైకొని యాశ్రమంబునన్
  నూత్నపు భంగిజేకొని వినోదము నెంచుచు ల్యాపుటాపునన్
  యత్నము సల్పగా నిచట యజ్ఞము వోలుచు నేర్పపద్యముల్
  రత్నములయ్యె రాళ్ళు భళిరాయని మెచ్చగ లోకులెల్లరున్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ రోజు నన్ను జిలేబిగారు ఆవహించి నట్లున్నారు! 😃😃🙏🙏

   తొలగించండి
  2. పాఠాంతరము
   పత్నిని గూడుచున్ దనదు వాసము గైకొని ఓరుగల్లునన్

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ఒరుగల్లుకు వచ్చిన తర్వాత కొన్ని పనులు వెనుకపడ్డాయి.

   తొలగించండి
  4. ధన్యవాదములు గురువర్యా! నమస్సులు! వరంగల్ వరదలతో ఇబ్బందులు పడుతున్నదని టి వి లో చూస్తున్నాము! మీరు యెలా ఉన్నారు? 🙏🙏🙏🙏

   తొలగించండి
 30. బాధ్యతెఱుగుచుతనయింటభర్తయుండె
  ఇంటియిల్లాలువంటింటినేర్పుఁదెలిసె
  కంటిపాపలగలిపెనుకోవిడమ్మ
  రత్నములుగమారెనుఱాళ్లుప్రజలుమెచ్చ

  రిప్లయితొలగించండి
 31. బాధ్యతెఱుగుచుతనయింటభర్తయుండె
  ఇంటియిల్లాలువంటింటినేర్పుఁదెలిసె
  కంటిపాపలగలిపెనుకోవిడమ్మ
  రత్నములుగమారెనుఱాళ్లుప్రజలుమెచ్చ

  రిప్లయితొలగించండి
 32. బాధ్యతెఱుగుచుతనయింటభర్తయుండె
  ఇంటియిల్లాలువంటింటినేర్పుఁదెలిసె
  కంటిపాపలగలిపెనుకోవిడమ్మ
  రత్నములుగమారెనుఱాళ్లుప్రజలుమెచ్చ

  రిప్లయితొలగించండి
 33. ఆవశిష్ఠునిశబలనేయపహరించ
  యత్నములువమ్ముగాగబ్రహ్మర్షియయ్యె
  గాధిజువిషయవాంఛలేక్రాలికాలి
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ

  రిప్లయితొలగించండి
 34. నా ప్రయత్నం :

  తేటగీతి
  ప్రార్థనన్ గాళిదాసును పండితునిగఁ
  గృత్నుగఁ దెనాలి వారిఁ బ్రకీర్తునునిగ
  కాళికా మాత తీర్చెను, కరుణఁ బొంది
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ

  కందం
  కృత్నుగ తెనాలి వారినిఁ
  బత్నికిఁ దగఁ గాళిదాసుఁ బండితుఁ జేసెన్
  యత్నించి వేడఁ గాళిని
  రత్నములుగ మాఱె రాళ్లుఁ బ్రజలే మెచ్చన్

  ఉత్పలమాల
  పత్నికి దీటుగా నిలుచు పండితుఁ జేయదె కాళిదాసుఁ దాఁ
  గృత్నుగ రామలింగనిఁ బ్రకీర్తునిఁ జేయదె కాళికాంబయే
  యత్నము వీడబోవక దయన్ గను మంచును వేడఁ దల్లినే
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్

  రిప్లయితొలగించండి
 35. చేయఁ జేయ విసుగు లేక చేకుఱు నిల
  నెట్టి పనులైన సంశయ మేల యిందు
  మానకుండక యోర్పున సానపట్ట
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ


  పత్ని యుతమ్ము మ్రొక్కఁగ నపత్యము కల్గెను జక్రవర్తికిన్
  నూత్న విధంపు సేద్యమున నూకలు పండెను బీడుభూములన్
  యత్నము సేసి మూర్ఖుఁ డొకఁ డయ్యెను బండిత సత్తముం డిలన్
  రత్నము లయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకు లెల్లరున్

  రిప్లయితొలగించండి
 36. అమరశిల్పియాజక్కన హస్తమలర
  రత్నములుగమారెనుఱాళ్ళుప్రజలుమెచ్చ
  బండరాళ్ళనుశిల్పులుభామినులుగ
  మలచియుండుటజూచితిమిలనుగుడిని

  రిప్లయితొలగించండి
 37. ఉ:

  యత్నము జేసి పెద్దలకు యాగము సామ్యము విద్య నేర్పనై
  యత్నము మీర రాత్రి బడి యంచన మిక్కిలి నాదరింపగన్
  కృత్నుల నెంచి వ్రాయుటను గీతము లెంచుచు ప్రోత్సహింపగన్
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 38. యత్నముబోయవానికిడెనాదికవీశుడటన్నఖ్యాతినిన్
  యత్నముగాధినందనునకవ్యయబ్రహ్మపథంబుజూపెనా
  యత్నముచేధ్రువుండుమహిమాన్వితసుస్థిరతారయయ్యెనా
  *"రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్*

  రిప్లయితొలగించండి
 39. పత్నినివెంటబెట్టుకొనిపామరుడొక్కడుహంపికేగిదా
  నూత్నపుకట్టడంబులమనోహరదృశ్యముజూచితేసఖీ!
  రత్నములయ్యెరాళ్ళుభళిరాయనిమెచ్చగలోకులెల్లరున్
  యత్నముజేయగాభువినినక్కఱకందనిజేతలుండునే

  రిప్లయితొలగించండి
 40. యత్నకృతమ్మునన్ బడయు నజ్ఞు డనంతసమీహితార్థముల్
  యత్నము తోడ నాకుఁదిను నాక్రిమి షట్పదరూపుదాల్చదే
  యత్నమె మూలకారణమ టంచుఁ ప్రశంసల మున్గు నీ శిలల్
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్.

  రిప్లయితొలగించండి
 41. రమ్య దివ్యాకృతుల్ దీర రాల మలచి,
  శిల్పి కల్పనన్ జీవమ్ము నిల్పె, నచట,
  నాటి రామప్పయే కళా వాటి, మేటి
  రత్నములుగ మారెను, రాళ్ళు ప్రజలు మెచ్చ!

  (రామప్ప దేవాలయ దర్శనం నాకు ఒక గొప్ప అనుభూతి)

  రిప్లయితొలగించండి
 42. వేసవి కరువు సీమలో వెసను బావి
  తోడి పోయగ మొరమున దోచె రంగు
  రాళ్ళు వార్త వచ్చెను రంగు రాళ్ళుగాదు
  రత్నములుగ మారెను ఱాళ్ళుఁ బ్రజలు మెచ్చ!

  రిప్లయితొలగించండి
 43. పోటిబడి బడిదెఱచియు పొసగ చదువు
  నడుచు చరితాను సారమై నాణ్యతెసగ
  మొద్దు విద్యార్థులను తీర్చి దిద్ధి నిలుప
  రత్నములుగ మారెను ఱాళ్ళుఁ బ్రజలు మెచ్చ!

  రిప్లయితొలగించండి

 44. పిన్నక నాగేశ్వరరావు.

  చదువులో మందమతులైన ఛాత్రులకును
  విడిగ ప్రత్యేక శ్రద్ధతో విద్య గఱపి
  తీర్చిదిద్దగ నొజ్జలు తీరుగాను
  వార లున్నత స్థానముల్ బడసి మేటి
  రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు
  మెచ్చ.

  రిప్లయితొలగించండి
 45. రత్నము వంటి నాయకుడు రమ్మని కమ్మని పండునిచ్చుచున్
  రత్నపుటంచులుంగలిగి రాజుగ గాంచి ప్రజాజనంబులన్

  రత్నమువంటి భూమిమన రాణులకివ్వగ పోరుసల్పగా
  రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ ప్రా ణమివ్వ గా

  రిప్లయితొలగించండి
 46. నాపీరు తనికెళ్ళ శేష వెంకటాద్రి. హైదరాబాద్ లో నివాసం. గురువుగారు రామ్ కిడాంబి గారిద్వారా కలుసుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను. ధన్యవాదములతో తనికెళ్ళ శేష వెంకటాద్రి.
  నమస్కారములతో

  రిప్లయితొలగించండి
 47. సమస్యకు నా పూరణ.

  రత్నపువిల్లనంగను విలక్షణరీతుల కావ్యకన్యకల్
  యత్నము చేతకూడెనట యష్టగజంబులు జన్మనీయగన్!
  నూత్నము కృష్ణ రాయని మనోరథ సంభవ రత్నసానువున్
  రత్నములయ్యె రాళ్ళు! భళి! రాయని మెచ్చగ లోకులెల్లరున్

  ������������ కందర్ప రామకృష్ణ

  రిప్లయితొలగించండి
 48. ఈరోజు సమస్య-సమాధానం రాలేదు లేదా? తెలుపగలరు
  తనికెళ్ళ శేష వెంకటాద్రి

  రిప్లయితొలగించండి
 49. ఉ: రత్నములంటి బిడ్డల వరమ్మున మంత్రపురంబునివ్వగన్
  యత్నము సాయరే నతిగ యజ్ఞము విజ్ఞుల కూర్పుతోడగన్
  రత్నమువంటి(పద్య) పాదముల రాయుచునుండగ రాటుదేలగన్
  రత్నములయ్యె రాళ్ళు! భళిరాయని మెచ్చగ లోకులెల్లరున్!!💐💐💐

  రిప్లయితొలగించండి