30, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3472

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్"
(లేదా...)

"సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్"

87 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    సంసారమ్మును వీడి కానలనహో జంజాటమున్ ద్రెంచుచున్
    హంసన్ గూడుచు ధ్యాన మార్గముననున్ హ్లాదమ్మునున్ పొందగన్
    ధ్వంసమ్మున్ వడి జేసి మోహమునువే తాదాత్య్మతన్ జెందుచున్
    సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్

    హంస = పరమాత్మ

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సంసారమ్మును వీడి సంఘమునతా సన్మానమున్ పొందుచున్
    హింసన్ జేయుచు రాజకీయముననున్ హృద్యమ్ముగా శత్రులన్
    ధ్వంసమ్మున్ వడి జేసి కాంగ్రెసునహో ధన్యుండునై దిల్లినిన్
    సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్

    సంఘము = రాష్ట్రీయ స్వయంసేవక సంఘము

    రిప్లయితొలగించండి
  3. హింసను వీడుచు జీవుల
    ధ్వంసంబు త్యజించి సంఘ ధర్మము గాచన్
    సంసాధనమున యౌగిక
    సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్!

    రిప్లయితొలగించండి
  4. హింసం జేయకదప్పదు
    సంసారము నందిన; యతి సత్పూజ్య డగున్
    కంసారిని గొల్చి పరమ
    హంసగ మారిన జగతికి హ్లాదము బంచన్

    రిప్లయితొలగించండి
  5. సంసక్తంబొనరించి మానసమునన్ శర్వున్ సదా భక్తితో
    సంసేవించి తరించు వాడెపుడు పూజాభాజనుం డయ్యెడున్
    సంసారస్థితుఁడై; యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్
    సంసారమ్ము త్యజించి ఐహిక దురాశాపాశ నిర్ముక్తుడై

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సంసిద్ధమగును సద్గతి
    సంసారము నందిన; యతి సత్పూజ్యు డగున్
    సంసేవలతో నిరతము
    హంసుని కరుణను ఘనముగ నందిన యపుడున్.

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సంసిద్ధంబగు నుతమోత్తమ గతుల్ సంతుష్ఠి తానుండగన్
    సంసారస్థితుడై; యతీశ్వరుడు పూజాభాజనుండయ్యెడున్
    హంసన్ ధ్యాన మొనర్చుచున్ నిరతమా నాదిత్యునిన్ శ్రేష్ఠుడా
    కంసారిన్ గణుతించి నాతని దయన్ గాఢమ్ముగా పొందగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "... నుత్తమోత్తమ.. నిరతమా యాదిత్యునిన్... గణుతించి యాతని" అనండి.

      తొలగించండి
  8. సమస్య :
    సంసారస్థితుడై యతీశ్వరుడు పూ
    జాభాజనుం డయ్యెడున్

    ( సప్తర్షులు హిమవంతుని వద్దకు వచ్చి
    పరమేశ్వరునికి పార్వతినిమ్మని కోరారు . )
    ఈ సారంగవిలోలలోచనను స
    ర్వేశుండు ; ముక్కంటి ; కై
    లాసేశుండును ; చంద్రమౌళి ; శివుడున్ ;
    లావణ్యపాథోధి ; తే
    జోసమ్మోహనమూర్తి కిమ్ము గిరిజన్ ;
    జోహారు శైలేంద్రుడా !
    సంసారస్థితుడై యతీశ్వరుడు పూ
    జాభాజనుం డయ్యెడున్ .
    ( లావణ్యపాథోధి - సౌందర్యసముద్రుడు )

    రిప్లయితొలగించండి
  9. సంసార బాధ్యతల వి
    ధ్వంసము గావించి జియ్యదరి
    జేరుటకై
    కంసారి తలపున మరో
    సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్

    రిప్లయితొలగించండి
  10. హింసా చారుడు యతినని
    సంసారము వీడితినని సత్పాత్రుడ నే
    కంసారిని నమ్మితినని
    సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్

    రిప్లయితొలగించండి
  11. కంసారిని సతము గొలుచు
    హంసా! వచియించుచుంటి నాలింపు మికన్
    హంసయగుఋశ్య శృంగుడు
    సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్

    రిప్లయితొలగించండి
  12. హింసామార్గము వీడి శుద్ధమతియై హెచ్చించి సౌజన్యమున్
    ధ్వంసంబున్ బొనరించి కామపటలిన్ బ్రహ్లాదియై నిత్యమా
    కంసార్యర్చితశంభుదాస్య మెపుడున్ గాంక్షించి చిద్భావనా
    సంసారస్థితుడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్"

    రిప్లయితొలగించండి


  13. ధ్వంసంబగునోయ్ పూర్తిగ
    సంసారము నందిన యతి, సత్పూజ్యుఁ డగున్
    కంసకపు కమండలమును,
    హంసక్షీరపు వివేకమనుసరణ గొనన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. సంసారమునెరపుచునే
    సంసక్తమునొందిసాధుసంతతితోడన్
    హంసనియంత్రణజేయుచు
    సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్

    రిప్లయితొలగించండి
  15. హింసా మార్గము వీడియు
    ధ్వంస మొనర్చి చెడు గుణమ వారిత రీతిన్
    కంసా రాతిని గొల్చుచు
    సంసారము నందిన యతి స త్పూ జ్యు o డగు న్

    రిప్లయితొలగించండి
  16. సంసృత్యంబున సర్వ సౌఖ్యముల తోషంబొందె సంసారియై
    సంసత్తందున మేటియై ప్రజలకున్ సర్వంబయెన్ తండ్రిగన్
    హంసాత్ముండయి రాజయోగమమరన్ యా మైథిలేశుండు నీ
    సంసారస్థితుడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అమరన్ + ఆ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి


  17. కాంసీయంపు కమండలమ్ము విడి ధిక్కారమ్మునే చేగొనన్
    ధ్వంసంబౌనతడే సుమా మనుజులందాకర్షణన్ గానుచున్
    సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు, పూజాభాజనుం డయ్యెడున్
    హంసక్షీరపు న్యాయమున్ విడువకన్ హంకారమే వీడగా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. హింసాసూయనిషిద్ధకార్యరతుడై హేలావిలాసాప్తుడై
    హంసోహమ్మని రక్తవర్ణధరుడై నంతం దగన్ యోగియో?
    హంసౌపమ్యము నొంది క్షీరసలిలన్యాయావలంబుండునై
    సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    కంసారిన్ సగుణమ్ముగా కొలిచి నిష్కామమ్ముగా., నిర్గుణున్
    హంసస్సోహమటంచు నిల్పి విధి శ్వాసాయాతనిర్యాతమున్
    శ్రీంసామ్రాజ్యము కోరుచున్ సతము నిశ్శ్రేయఃప్రభాభామినీ
    సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  20. హింసా మార్గము వీడి ప్ర
    శంసాత్మక మగు పనులను సాధించంగన్
    మాంసాహారము ముట్టక
    సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్!!

    రిప్లయితొలగించండి
  21. ( సప్తర్షులు హిమవంతుని వద్దకు వచ్చి
    పరమేశ్వరునికి పార్వతినిమ్మని కోరారు . )
    హింసాక్రూరుడు తారకాసురునివౌ
    హీనంబులౌ చేష్టలన్
    ధ్వంసంబున్ బొనరింపగాగలుగు స
    ద్ధానుష్కుడౌ పుత్రుకై
    సంసారంబును సల్పగా దలచె నా
    శంభుండు ; నీ గౌరిచే
    సంసారస్థితుడై యతీశ్వరుడు పూ
    జాభాజనుం డయ్యెడున్ .

    రిప్లయితొలగించండి
  22. కంసారిన్ మదిదల్చి కర్మఫలమున్గాంక్షించకే ధీరుడై
    *సంసారస్థితుఁడై; యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్*
    హంసోహంబని తత్త్వమస్సియని ధ్యానావస్థితిన్బ్రహ్మమున్
    ధ్వంసాహంబుల నిర్గుణాత్ముడయి పాపధ్వంసు నర్చించుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తత్త్వమసి+అని=తత్త్వమసి యని' అవుతుంది.

      తొలగించండి
  23. హంసల్ మెచ్చెడు యానయౌ కలికి సుహ్లాందంపు నాత్మోద్భవై
    పుంసాం మోహనరూపుడైన రఘురాముం డల్లుడై శోభిలన్
    హంసోహమ్మని నాత్మలోన నిరతం బానందసంధాయియై
    సంసారస్థితుడై యతీశ్వరుడు పూజాభాజనుం డయ్యెడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
    3. సవరణతో

      హంసల్ మెచ్చెడు యాన సీత తన
      కాహ్లాదంపు నాత్మోద్భవై
      పుంసాం మోహనరూపుడైన రఘురాముం డల్లుడై శోభిలన్
      హంసోహమ్మని నాత్మలోన నిరతం బానందసంధాయియై
      సంసారస్థితుడై యతీశ్వరుడు పూజాభాజనుం డయ్యెడున్

      తొలగించండి
  24. ధ్వంసమ్మొనర్చి గుణముల,
    పుంసామ్మోహనుడు రాముఁ, బురుశోత్తము నా
    పాంసమ్మును తలనిడి ని
    స్సంసారము నందిన యతి సత్పూజ్యుడగున్

    రిప్లయితొలగించండి
  25. హింసామార్గమువీడినిచ్చలము దేహంబందువైరాగ్యతన్
    హంసన్బట్టి నియంత్రణంబుసలుపన్ హాసంబు సంసారికిన్
    సంసక్తంబగుచున్ యతీశ్వరులసంజాతంబునన్ మెల్గుచున్
    సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్

    రిప్లయితొలగించండి
  26. కంసారిపరమాత్ముండై
    హంసాహ్లాదంబగుతఱిహాయనిగోలువన్
    సంసారమునంటకఁదా
    సంసారమునందినయతిసత్పూజ్యుడగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  27. వేసారి సతీసుతులకు
    మాసాహసశకునిన్యాయాన మరుల్గొనకన్
    తాసించుచు సుకవితా
    సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. అయ్యా, ఇది నా తొలియత్నం. మీరే దయచేసి తగురీతిన మార్చగలరు 🙏🏻🙏🏻

      తొలగించండి
    3. భాస్కర్ గారు మీ ప్రయత్నము ప్రశంసనీయము.
      ఇక్కడ ప్రాసాక్షరమునకుఁ బూర్వము బిందు వున్నది కావున నన్ని పాదములలో బిందుపూర్వక స గుణింతము రావలెను.
      కంస, ప్రశంస, సంసేవన మీ విధముగాఁ బ్రాసను గూర్చ వలెను.
      మఱియొక ప్రయత్నము చేయండి. తప్పక సాధించఁ గలరు.

      తొలగించండి
  28. హింసామార్గమువీడుచు
    గంసారిన్ దలచుచుండికమ్రపుభక్తిన్
    సంసాధనమునునొందుచు
    సంసారమునందినయతిసత్పూజ్యుడగున్

    రిప్లయితొలగించండి
  29. హంసధ్యానమ్మున ననృ
    శంసుండు నిజేంద్రియ చయ జయమునఁ గామ
    ధ్వంసత భాసిల్లంగన్
    సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్


    సంసారమ్మున నా వసిష్ఠుఁ డరయన్ సత్యంపు బ్రహ్మర్షియే
    సంసారమ్మునఁ గౌశికుండు నరయన్ సత్యంపు బ్రహ్మర్షియే
    సంసారమ్మున నత్రి యొక్కఁ డరయన్ సత్యమ్ము సప్తర్షులన్
    సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మొదటి పూరణ అద్భుతంగా, రెండవ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  30. సంసారమ్మది పాపకూపమనుచున్ సన్యాసిగా మారుచున్
    కంసారిన్ కఱినేస్తి నీలమణిఁ నిష్కామమ్ము తో కొల్వగన్
    సంసారమ్మును వీడుటెందుకది యే శాస్త్రమ్ము లో కంటివో
    సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్.

    రిప్లయితొలగించండి
  31. హింసామార్గమునెంచకుండగనుదానెప్పట్టునూహించుచున్
    గంసారిన్ మదినుండునట్లుగదమిన్ గమ్రంపుభావంబుతో
    సంసారంబునుజేయుచుండియునునాసాంతంబుధ్యానించుచున్ సంసారస్ధితుడైయతీశ్వరుడుపూజాభాజనుండయ్యెడున్

    రిప్లయితొలగించండి
  32. కందం
    సంసారాంబుధి నీదియు
    హంసోహపు బాటనెంచి యడగఁగ భ్రమలున్
    కంసారిన్ దలఁచి మరొక
    సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్

    శార్దూలవిక్రీడితము
    ధ్వంసంబౌ కురువంశమింక ననుచున్ వాంఛించి సత్యాంబయే
    హంసోహమ్మను బాటనున్న సుతుడౌ వ్యాసున్ నియోగించగన్
    సంసిద్ధుండుగ వారసత్వమిడి నిస్సంగుండయెన్ దల్లికై
    సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్

    రిప్లయితొలగించండి
  33. శా:

    సంసారమ్మును వీడి నూరి మఠమున్ సన్యాసిగా జేరగన్
    వంశంబంతయు జేరి జెప్పదొడగన్ బాహాటమై తంత్రముల్
    హంసాశ్యమ్మున జక్క బెట్ట పనులన్ హ్లాదంబునే బొందుచున్
    సంసారస్థితుడై యతీశ్వరుడు పూజాభాజనుండయ్యెడున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. ధ్వంసమ్మున్ సృజియించుచున్ సతతమున్ దయ్యమ్ములన్ వంచగా,
    హింసాత్ముండగు యాతుధానుఁ దుదముట్టింపంగ ప్రహ్లాదునిన్
    కంసారిన్ భజియించునట్లు మలచెన్ కార్యార్థియై మౌని ని
    స్సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్

    రిప్లయితొలగించండి
  35. ధ్వంసంబైనమనోవికారముల శాంతంబైనవాంఛాళితో
    గంసారాతినెదన్దలంచిశిలయైకైవల్యవైభోగమై
    హంసోపాసన నాచరించు బుధుడవ్యక్తాత్మదర్శించుచున్
    *సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్*

    రిప్లయితొలగించండి
  36. హింసలు మానిన హితుడౌ
    సంసారమునందిన,యతి సత్పూజ్యుడగున్
    కంసారిని తలచి సతము
    సంసారపు మోహము విడ జవమున జగతిన్

    రిప్లయితొలగించండి