16, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3459

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వానలం గురిపించకు వరుణదేవ"

 (లేదా...) 
"వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్"

93 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  బోనాల్ కాలము పోవగా ముదమునన్ పొంగెన్ కదా కాల్వలే
  కోనల్ కోనల మైలలే పరువుచున్ ఘోరంబుగా పారెనే
  దీనుండౌచును చెప్పెదన్ వినుమురా తిప్పల్ వడిన్ మాపురా
  వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చానల్ వృద్ధులు పాపలున్ పురుషులున్ జంజాటమున్ సైచకే
  వానల్ లేకయె వేడితో కుమిలెరా బంగారు నెల్లూరినిన్
  నానారీతుల మ్రొక్కెదన్ జనుమురా నందమ్ముతో నాడకున్
  వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

  రిప్లయితొలగించండి
 3. దీనుల్ గోల్పడె నిండ్లనే వరదలే దేశంబు ముంచెత్తగా
  చేనుల్ మున్గెను పంటలే చెడెనురా
  చెట్లెన్నొ గూలెన్ గదా
  నానాబాధల గూర్చుచున్ నెడతెగన్
  నైరాశ్యమున్ ముంచెడిన్
  వానల్ మాకిక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Rain rain go away

   వానలం గురిపించకు వరుణదేవ
   రమ్ము మరొకరోజున మంచి రాత్రివేళ
   చిన్ని జానకి క్రీడకు సిద్ధమయ్యె
   వానలం గురిపించకు వరుణదేవ

   తొలగించండి


  2. వానలం గురిపించకు వరుణదేవ
   పొమ్మ యిప్పుడు రమ్మ యెపుడయిన మరి
   చిట్టకమునకిదె తయారు చిట్టి చిలక
   వానలం గురిపించకు వరుణదేవ


   జిలేబి

   తొలగించండి
  3. చిట్టక ప్రయోగములు జిలేబికే తగును! 👏👏😊😊🙏🙏

   తొలగించండి
  4. సీతాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో "దీనుల్ గోల్పడి రిండ్లనే" అనండి. అలాగే "...గూర్చుచున్ సతతమున్ నైరాశ్యమున్..." అనండి.
   *********
   జిలేబి గారూ,
   మీ పేరడీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  5. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏

   తొలగించండి
  6. సవరించిన పూరణ

   దీనుల్ గోల్పడ గూడులన్ వరదలే దేశంబు ముంచెత్తగా
   చేనుల్ మున్గెను పంటలే చెడెనురా
   చెట్లెన్నొ గూలెన్ గదా
   నానాబాధల గూర్చుచున్ సతతమున్
   నైరాశ్యమున్ ముంచెడిన్
   వానల్ మాకిక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

   తొలగించండి
 4. కాలమందున పులకించ నేల తల్లి
  వర్ష రాశుల నందించి హర్ష మొసగు!
  వరదలన్ బాధ లందించి వగచు నటుల
  వానలం గురిపించకు వరుణదేవ!


  రిప్లయితొలగించండి


 5. (అవసరాన్ని మించిన వానలు కన్నీటి వానలకు కారణమౌతాయి )
  కాన నున్నట్టులుండెను కనుల కిపుడు ;
  చేను లన్నియు మునిగెను చింత ముదిరె ;
  మిట్టపల్లము లేకమై గట్టు తెగియె ;
  మేనులెంతయొ తడిసెను మించెజ్వరము;
  నున్న జబ్బుల కదనము నోపలేము ;
  వానలం గురిపించకు వరుణదేవ !

  రిప్లయితొలగించండి
 6. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

  వానలంకురి పించకు వరుణ దేవ

  ఇచ్చిన పాదము తేటగీతి దానిని ఎత్తు గీతిగా వాడుచు సీసములో నా పూరణ

  ఇంద్రుని పూజలు అపివేయ కోపించి జడివానలు కురిపించుతాడు సురపతి గోకులమందు కృష్ణుడు గోవర్దనము యెత్తి గోవులను గోపాలుర నెల్లరను కాపాడుతాడు వారము రోజులు కుంభ వృష్టి ఆగ కుండా కురుస్తుంది గోప కాంతలు కొందరికి‌ అప నమ్మకము‌ కలిగి ధైర్యము‌ సడలి వరుణ దేవుని ప్రార్థన చేయు సందర్భం  సతతము పాలిచ్చు సౌరభే యమ్ములన్
  పూజించ మనెనుగా బుడత డిపుడు,

  యింద్రుని పూజలు నెప్పుడు వలదని
  మమ్ముల నాపించి మనసు బెట్టి

  నాగమున్, ప్రకృతిన్, నమ్ముచు నర్చించ
  మనుచునీ బాలుడు మాకు తెలిపె,

  కినుక వహించుచు ఘనముగ
  వృష్టిని
  కురిపించు చుంటివి, కొండ క్రింద

  మా తలను దాచుకొంటిమి, మమ్ము కరుణ

  తోడ కాచగ వలయు, మా‌ గోడు‌ వినుము,

  వానలం కురిపించకు వరుణ దేవ

  యనుచు ప్రార్ధిచె గోకుల వనిత లెల్ల

  పూసపాటి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "బుడత డిప్పు । డింద్రుని పూజల నెప్పుడు... మమ్ము వారించియు.. నాగమును ప్రకృతిన్...వేడిరి ..వనితలెల్ల" అనండి.

   తొలగించండి


 7. వాన వాన వెళ్లవె యిక నాన్న అమ్మ
  అన్న తమ్ముడు చెల్లాయి ఆడు కోవ
  లెను జిలేబి ప్రార్థన చేసె లెస్సగాను
  వానలం గురిపించకు వరుణదేవ!

  Rain, rain, go away
  Come again another day
  Daddy wants to play
  Rain, rain go away…

  Nursery Rhyme source :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఇంగ్లీషోళ్ళు "Rain rain go away.." అంటే, మనవాళ్ళు "వానల్లు కురవాలి వానదేవుడా..." అని పాడుతారు.

   తొలగించండి


 8. ఓయ్ చాప పిల్లా! నగరాన్ని చూడాలన్నావు గా రా పోదాం షికారు చూడగా :)  మీనమ్ముల్ భళి పోవు చుండె వరుసల్ మించార సందర్శనం
  బీ నాడీ నగరమ్ము చేయ! జనులో భీతిన్ సుమా గాంచిరే!
  యేనాడున్ మరి యింతగాను గనలేదీ కుంభ వృష్టిన్ ప్రభో!
  వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. చాలు కురిసిన వానలు చాలు దేవ
  పంట మునిగెను తడిసెను పసుల శాల
  కోప మేలను కరుణను కొసరు చూపి
  వానలం గురిపించకు వరుణదేవ

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సస్యములను దాహార్తిని చక్కబఱచ
  వలసినంత ప్రమాణమె వర్ష మిడుచు
  వరదలు నిలిపి బాధించు పవిది దీర్ఘ
  వానలం గురిపించకు వరుణదేవా!

  చేనుల్ పంటలతోడ నెచ్చెఱునటుల్ చిన్కుల్ పసాదించుచున్
  ఆనందంబున ప్రాణకోటికిట దాహార్తిన్ సదా దీర్చుచున్
  యేనాడున్ మితిమీఱకుండి చనుమా! నీరీతి దీర్ఘంబునౌ
  వానల్ మాకిక వద్దురా వరుణదేవా! నీకు మా స్తోత్రముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'తీర్చుచున్ + ఏనాడున్' అన్నపుడు యడాగమం రాదు. కొన్ని టైపాట్లున్నవి.

   తొలగించండి
 11. వానకావలెపంటలుపండుటకును
  జోరువానలునష్టంబు పైరులకును
  పరిమితినిమించి వాగులుపొరలునటుల
  వానలం గురిపించకు వరుణదేవ

  రిప్లయితొలగించండి
 12. కె.వి.యస్. లక్ష్మి:
  గురువు గారికి నమస్కారములు. దయతో నిన్నటి పూరణ పరిశీలించగలరు.

  భూతపు చేష్టల చెలగుచు
  జాతిని చెఱచెడి విమతుల చర్యల నిపుడున్
  యాతన లొందుచు వారల్
  స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్

  రిప్లయితొలగించండి
 13. వానాకాలమునందునన్ చినుకులన్ వర్షింపగాహర్షమే
  వానల్ మిక్కుటమైనపంటలకునావర్షంబులే శత్రువుల్
  కానన్ నీవతివిస్తృతిన్ గురవకన్ కారుణ్యమున్ జూపవే
  వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

  రిప్లయితొలగించండి
 14. దీనాలాపము భూ నభోంతరము నేదిక్కున్గనన్ దేవ ! మా
  చేనుల్ గీములు నీటమున్గెను బ్రోచేవారె లేరా యనన్
  నీనాడీ విధి దాపురించె మహిలో నీవే దయన్ జూపు మీ
  వానల్ మాకిక వద్దురా వరుణదేవా ! నీకు మా స్తోత్రముల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. "నీట మున్గినవి.." అంటే సరి! 'బ్రోచేవారు' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 15. దోనెం బోలుచుఁ దేలియాడె గృహముల్ దుర్వారసంపాతమై
  వానం గూలెను శేషవాసములు ద్యావాభూము లేకంబులై,
  బోనమ్ముల్ కఱువయ్యె, చిల్లువడెనో వ్యోమంబు నంద క్కటా!
  వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 16. ✍ మల్లి సిరిపురం శ్రీశైలం భూలోకం నుండి,
  తే.గీ//
  అంబరము పైన వేల్పులు సంబరముగ
  తానమాడ పొంగి పొరలి దారిబట్టి !
  చేపలచెరువు నిండియు చేనుమునిగె
  వానలం గురిపించకు వరుణదేవ !!

  రిప్లయితొలగించండి
 17. వరద పోటుకు గురియైన పంటలన్ని
  కొట్టు కొని పోయె కర్షకు ల్ క్రుంగి రకట
  రాక పోకలు నిలిచెను రగిలె గుండె
  వానల o గురి పించకు వరుణ దేవ !

  రిప్లయితొలగించండి
 18. నారు పోసిన పొలమున నీరు నింపి
  ఏఱుఁబాఱగ నేటట నేఱు నింపి,
  పంట నూర్పిడి వేళనఁబాటి యగుచు
  వానలం గురిపించకు వరుణదేవ

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  *అన్ లాక్3.Oలో..*
  *వర్తకసంఘంవారి వేడుకోలు*

  కానంజాలము దారితెన్నులిట మృగ్యంబయ్యె వ్యాపారమున్
  మా నోటన్ గన మట్టిగొట్టెను కరోనా.,సుంత యిప్డిప్పుడే
  దీనత్వమ్ము తొలంగుచుండె ధనవృద్ధిన్ ద్రుంచగా న్యాయమా?
  వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

  రిప్లయితొలగించండి
 20. .............శంకరాభరణం.........
  15/08/2020...శనివారం

  సమస్య
  *** ****
  వానల్ మాకిక వద్దురా వరుణదేవా! నీకు మా స్తోత్రముల్!

  నా పూరణ. శార్ధూల విక్రీడితము
  **** *****

  కోనల్ కొండలు వాగు లేవియు గనన్ ఘోరంగ నీ వర్షమే!
  చేనుల్ చెల్కలు నీట మున్గె; గృహముల్ చెట్లున్ క్షయమ్మయ్యెరో!
  నానారీతుల నష్టముల్ కలిగె బ్రాణాలెన్నొ పోయెన్ ప్రభో!
  వానల్ మాకిక వద్దురా వరుణదేవా! నీకు మా స్తోత్రముల్!

  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 21. సమస్య :-
  "వానలం గురిపించకు వరుణదేవ"

  *తే.గీ**

  మురికి వాడలు మునిగెను ముసురుతోడ
  పంటను జలము ముంచుతు పాడుజేసె
  బట్టలారవనినా భార్య తిట్టె నధిక
  వానలం గురిపించకు వరుణదేవ
  ......................✍️చక్రి

  రిప్లయితొలగించండి
 22. అణగిపోయె వేసవితాపమంతలోనె
  ఇల్లుగురిసె దారిచెఱువులీలమెరిసె
  ఊరిలోపడవయుసాగె కూటికరువు
  వానలం గురిపించకు వరుణదేవ!

  రిప్లయితొలగించండి
 23. జ్యానుల్ పొంగ పురమ్ములే మునిగెనే క్ష్మాజమ్ములే కూలెనే
  ప్రాణాపాయము పొంచియున్నదనుచున్ బ్రార్థించె డిన్ లోకులా
  దీనాలాపన నాలకించు మికపై తీక్ష్ణత్వమున్ మానుమా!
  వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

  రిప్లయితొలగించండి
 24. వరద,బురదల చీకాకు వసుధ మునిగె!
  వ్యాధి, బాధల జనులకు వంత పెరిగె!
  ఎండ యన్నది కననీక కుండ పోత
  "వానలం గురిపించకు వరుణదేవ"

  రిప్లయితొలగించండి
 25. చేయ పను లేవియును లేక
  చిత్తమందు
  నిండిపోయెనశాంతియు నీరు నిండ
  దారి కనగరాదు తలను దాచు కొనగ
  వానలం గురిపించకు వరుణదేవ.

  రిప్లయితొలగించండి
 26. వాగు వంకలు పొంగుచు వావిరిగను
  కొట్టుకుని పోవుచుండెను కొన్ని యూర్లు
  అష్టకష్టముల్ బడుచుండె యచటివారు
  వానలంగురిపించకు వరుణదేవ!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కొన్ని యూరు । లష్టకష్టముల్ బడుచుండి రచటివారు" అనండి.

   తొలగించండి
 27. వానలంగురిపించకువరుణదేవ!
  యనుచుబలుకంగనుసబబె?యార్యమీకు
  వానలేనిచోమనుజునిబ్రదుకుగలదె!
  చింతజేయుమయొకపరిచేతనమున

  రిప్లయితొలగించండి
 28. చిత్తడిగనుండతనపెంపుఁజేసిమీరి
  కాటువేయునుకోవిడుకాపుఁగాచి
  జనులరావంబువినవయ్యజాలిఁజూపి
  వానలంగురిపించకువరుణదేవ

  రిప్లయితొలగించండి
 29. వరదలొచ్చునట్లు కురియు వర్షమేల
  పంటచేలులన్నియుపాడు బడగ జనుల
  నష్టమాయెనాస్తియుబోవ కష్ట పెట్టు
  వానలం గురిపించకు వరణదేవ!!

  రిప్లయితొలగించండి
 30. వానల్ వచ్చెనుమిక్కుటంబుగనహోపట్టాలువేమున్గెగా
  జేనుల్ నిఃండెనునీటితోడనుభళాశీఘ్రంబుగాదోడనౌ
  వానల్ మాకికవద్దురావరుణదేవా!నీకుమాస్తోత్రముల్
  నానందమ్ముగబిల్లలాడునుగదాయావర్షపుంనీటిలోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పిల్ల లాడెదరయా యావర్షపున్ నీటిలోన్" అనండి.

   తొలగించండి
 31. కృష్ణ లీలల నేర శక్యమె!


  కొండ నేల నెత్తఁగ వలె నండకొఱకు
  వాసుదేవుండు బోరున వాన పడఁగ
  చాలును గద యిట్లన్నను జాలు నింక
  వానలం గురిపించకు వరుణదేవ


  వానల్ దాఁ గురిపించు భూతలమునం బర్జన్యుఁడే వేఁడినన్
  నే నీ శక్రుని భక్తితత్పరత దానీరంబు నిల్పుం గదా
  యీ నీర్కుప్పకు నాథునిం గొలువఁగా నేలయ్య నీ వివ్విధిన్
  వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

  రిప్లయితొలగించండి
 32. సానీటైజును జేసినావు భువినే చాల్చాలు సంతోషమే
  చైనా పారె కరోన దెబ్బతిని నీ సయ్యాట లింకేలరా
  ధోనీయే విరమించినట్లు పదరా! దుర్వారమీధారయే
  *వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి

 33. పిన్నక నాగేశ్వరరావు.

  కూలిపోయెను వరదలో గూడులెన్నొ
  వర్ణనాతీతమయ్యెను ప్రజల బాధ
  లింక; పంటచేలు మునిగి లంకలాయె
  గోడుగోడున నేడ్చుచు వేడుచుండ
  వానలంగురిపించకు వరుణ దేవ!

  రిప్లయితొలగించండి
 34. "వానలం గురిపించకు వరుణదేవ
  బడుగుబలహీనవర్గాలప్రజలగుడెసె
  లూగుచుండెనుభయముతోనాగవయ్య
  వెళ్లి గ్రీష్మానరావయ్యప్రేమజూప

  రిప్లయితొలగించండి
 35. తేటగీతి
  ఆకలిని దీర్చు పంటల నాదుకొనఁగ
  వలయు నీ ధార మాకదే ప్రాణధార
  గుండెలల్లాడు వరదల కుండపోత
  వానలం గురిపించకు వరుణదేవ!

  శార్దూలవిక్రీడితము
  నానా బాధలఁ బెట్టి కోవిడిల మా నాశమ్మునే జూడగన్
  దీనావస్థల నుండ పంటలకునై తేవయ్య నీ ధారలన్
  ప్రాణమ్ముల్ బలి జేయు రీతి వరదన్ పారించు క్రూరాకృతిన్
  వానల్ మాకిఁక వద్దురా! వరుణదేవా! నీకు మా స్తోత్రముల్


  రిప్లయితొలగించండి
 36. వానల్యెండలుహద్దుమీరకభువిన్భాగ్యంబుమోదంబునౌ
  దీనుల్కర్షకకోటివానలకుప్రార్థింపంగదాగుండియీ
  *వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్*
  కోనల్కానలునేడ్చుచుండవరదల్గూడున్పడంగొట్టెరా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వానల్+ఎండలు' అన్నపుడు యడాగమం లేదు.

   తొలగించండి
 37. 16.08.2020
  అందరికీ నమస్సులు 🙏

  నా పూరణ యత్నం..

  *తే గీ*

  అడిగి నంతను గానవు నటుల నెటుల
  వలదు దేవాయనినను నీ వద్దువేమి
  మమ్ము ముంచెడి ప్రేమలు మాకు యేల
  *"వానలం గురిపించకు వరుణదేవ"*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 38. శా:

  వానాకా లమనెంచి వంగడము సంపాదించి సేద్యమ్ముగా
  సోనా మాసురి నారు బెంచి వరి కుచ్చుల్ గ్రుచ్చి నాటంగనై
  నానా హంగులు గూర్చ నేక బిగిగా నైరాశ్యమున్ బెంచెడిన్
  వానల్ మాకిక వద్దురా వరుణ దేవా నీకు మా స్తోత్రముల్

  సోనా మాసురి =సోనా మసూరి , వరి విత్తనము.

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 39. మ్రానుల్గూలెవిహంగరాజములుసామాన్యుల్గృషికుల్శ్రామికుల్
  దీనుల్బీదలురోడ్డుజీవనులుమందీమార్బలంబంతయున్
  ప్రాణాలన్బిగబట్టిపాలితులువస్త్రాన్నాళికైయార్తితో
  *వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్*

  రిప్లయితొలగించండి
 40. వానాకాలము వచ్చెనన్న భయమౌ పట్నంబులందున్ గనన్
  నానా క్లేశములందు ముంచు జనులన్ నాశంబుగాన్ దారులున్
  వానల్ గోరిన వారలే వగచుచున్ బ్రార్థింతురీ రీతిగా
  వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "వానాకాలము" సాధు ప్రయోగం కాదని గురువు గారి సూచన మేరకు, సవరణతో...

   వానల్ దెచ్ఛెడి కాలమన్న భయమౌ పట్నంబులందున్ గనన్
   నానా క్లేశములందు ముంచు జనులన్ నాశంబుగాన్ దారులున్
   వానల్ గోరిన వారలే వగచుచున్ బ్రార్థింతురీ రీతిగా
   వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్

   తొలగించండి
 41. కె.వి.యస్. లక్ష్మి:

  వానలం గురిపించకు వరుణదేవ
  నీవె నాధారమనుమాట నిజము జెప్ప
  నీవు నాగ్రహించిన నింక నిలువలేము
  కరుణమేఘుడ! చాలింక కదలిపొమ్ము.

  రిప్లయితొలగించండి