18, ఆగస్టు 2020, మంగళవారం

సమస్య - 3461

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్"

(లేదా...)
"రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్"

87 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    కుతినిన్ జెందుచు నాంధ్రమున్ విరివిగా కూర్చంగ పద్యమ్ములన్
    వెతలన్ జెందుచు కానలేక పదముల్ వేగంబుగా చేర్చగన్
    గతిలేకుండగ నాదు బోంటు లయయో గారాబుదౌ నాంధ్రభా
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆంధ్రభారతి' ఎందరికో ఉపయోగపడుతున్నది. దానిని రూపొందించిన శేషతల్పశాయి, నాగభూషణం గారలకు మనమంతా ఋణపడి ఉన్నాం.

      తొలగించండి
  2. స్మిత వదనమ్మున నలరుచు
    హిత మెంచుచు భావ జగతి నెలమిని భాషా
    వితతి నొసంగెడి యా భా
    రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్!

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కుతినిన్ జెందుచు వెఱ్ఱి బాగు కవినిన్ కూడంగ కల్యాణమున్
    పతినిన్ జూచుచు వేచివేచి కడకున్ ప్రార్థించుచున్ కామునిన్
    సతియే పోరుచు కుందుచున్ కుములుచున్ సంతానమున్ కోరగన్
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్

    రతి = మన్మథుని భార్య

    రిప్లయితొలగించండి
  4. 18.08.2020
    అందరికీ నమస్సులు🙏

    నా పూరణ ..

    *కం 1*

    సతతము బూజలు జేయుచు
    వెతలను హృదయంబు నందు వేరుగ నిలిపా
    కృతులను జదువుచు నా భా
    *"రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్"!!*

    *కం 2*

    శృతిమించిన శృంగారము
    గతి తప్పిన కవితలల్లు ఘనమగు రీతిన్
    గతి తాననుకొని మనమున
    *"రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్"!!*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నిలిపి+ఆ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  5. సమస్య :
    రతిపూజన్ ఘటియించి వ్రాయగదగున్
    రమ్యంపు గావ్యమ్ములన్

    (మహాభక్తుడైన దాసగుణ్ సాయినాథుని
    సంకీర్తనలను రచింప సన్నద్ధుడైనాడు )
    సతతమ్మున్ షిరిడీనివాసుడగుచున్
    సద్భక్తియుక్తుండు ; స
    న్మతితో దాసగుణుండు సాయిని మనో
    మధ్యమ్మునన్ నిల్పి దీ
    పితభక్తిన్ బృథుకీర్తనమ్ములను సం
    ప్రీతిన్ రచింపంగ హా
    రతిపూజన్ ఘటియించి వ్రాయగదగున్
    రమ్యంపు గావ్యమ్ములన్
    ( దీపితభక్తిన్- ప్రకాశించు భక్తితో ; పృథు కీర్తనములు- ఘనమైన గేయములు )

    రిప్లయితొలగించండి
  6. కుతుకము చాలదు తెలుసా?
    మతి నెంతయు భక్తితోడ మహిమాన్వితయౌ
    సతి భారతి నెన్నుచు హా
    రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్

    రిప్లయితొలగించండి
  7. సతతము వీణా వాదన

    చతురత్వమున తన రత్న సభను సకల శో

    భితమును చేసెడి నా భా

    రతిని గొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సరవిని గూడిన మనమున
    పరపుగ ప్రజలకు పొలుపును పంచెడి తలపున్
    సరియగు విరాళినా భా
    రతిని గొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వితమును గూడిన మనమున
      సతతము ప్రజలకు పొలుపు నొసంగెడి తలపున్
      జతనపు విరాళి నా భా
      రతిని గొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. శ్రుతిసారైక శుభాంగి చిద్విమల వాచోధిష్ఠితన్ ; సత్కళా
    వతి సర్వేశ్వరి సర్వదేవనుత వాగ్వాదస్వరూపేశ్వరిన్
    చతురాస్యు స్వకులాంగనౌ వర సరస్వత్యంబ పూజాంగ హా
    రతి పూజన్ ఘటియించి వ్రాయగ దగున్ రమ్యంపు గావ్యమ్ములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'చతురాస్య స్వకులాంగనా...' అనండి.

      తొలగించండి


  10. అతివలు లలితా! వ్రాయవ
    లె తమదగు విధముల కైత లెల్లను వినుమా
    వ్రతమాచరించి వడి భా
    రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. యతి ప్రాసవెదుకులాటలు
    మతిపోగొట్టగసతమతమగుతరుణములో
    నుతియించిభక్తితో భా
    రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్

    రిప్లయితొలగించండి
  12. చతురత గల్గిన వాడై
    యతులిత పాండిత్య గరిమ నాడ్యు o డగు చున్
    సతతము భక్తిగ తా భా
    రతిని గొలిచి కావ్యములను వ్రాయగ వచ్చు న్

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    🕉🚩నమో భారత్యై 🙏💐

    శ్రితమందారను., భక్తవత్సలను., రాశీభూతవర్ణాకృతిన్.,
    శ్రుతిసౌందర్యఁ., బురాణరూపిణిని సుశ్లోకన్., యథాశక్తి స..
    న్మతి ధ్యానించిన వాక్ప్రవాహముల సంధానించు., సద్భక్తి భా...
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సరియౌ రీతినిగూడు డెందమున ప్రాశస్త్యంబునౌ భావముల్
    పరపైనట్టి విధానమున్ ప్రజలకున్ పంచంగ నూహించుచున్
    పరిశుద్ధంబగు భక్తినిన్ సతము సంభావించి వాగ్దేవి భా
    రతిపూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వితమౌ రీతిని గొప్పగా మనమునన్ పెంపొందు భావమ్ములన్
      జతనమ్మైన విధానమున్ ప్రజలకున్ చందమ్ముగా పంచనౌ
      మతినిన్ గూడుచు భక్తినిన్ సతము రమ్యంబౌ క్రియన్ వాణి భా
      రతి పూజన్ ఘటియించి వ్రాయగ దగున్ రమ్యంపు గావ్యమ్ములన్.

      తొలగించండి
  15. సతతము నిలువఁగ రచనలు
    చతురానను రాణి, బ్రహ్మసతి నావాణిన్
    శృతదేవిని, భాషా భా
    రతిని గొలిచి కావ్యములను వ్రాయగనొప్పున్

    రిప్లయితొలగించండి


  16. రారండోయ్ రారండోయ్ రీ టైర్డయ్యలారా అమ్మలారా! పిల్ల లారా! పాపలారా ప్రౌఢులారా ! ఎల్లరున్ రారండోయ్ !



    జతరండీ! జమగట్టుడీ స్థలమునన్! సత్రంబిదే జోరుగా
    ను తదాత్వమ్మున నేర్వ శీఘ్రముగ విన్నూత్నంపు చందమ్ములీ
    న త్రిలింగంబున కైతలెల్ల! త్వరగా నభ్యాసమున్ సల్పి భా
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శీఘ్ర మిచటన్ నూత్నంపు...' అనండి (విన్నూత్నంపు.. అన్న ప్రయోగం సాధువు కాదు)

      తొలగించండి
  17. కె.వి.యస్. లక్ష్మి:

    నిన్నటి పూరణ:

    మరణ జననముల మాయల
    నెరుగుచు ధర్మపధమందు నెగడెడి నతడున్
    ధరణిని జీవన ముక్తుడు
    మరణమును జయించువాడె మర్త్యుండన్నన్.

    నేటి పూరణ:

    సతతము కొలిచెద భక్తిని
    అతులిత విద్యల నొసగుచు నడరెడి వాణిన్
    శ్రుతిధారిణి కోరెద భా
    రతిని కొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్.

    రిప్లయితొలగించండి
  18. గురువు గారికి
    నమస్కారములు
    🙏
    హితమగు రీతిన కైతలు

    సతతము నిన్నే మరువక సద్భావనతో

    స్తుతియించుచు మదిలో, భా

    రతినిఁగొలిచి కావ్యములను వ్రాయఁగనొప్పున్
    మీ
    సిహెచ్. భూమయ్య,
    నారాయణఖేడ్.

    రిప్లయితొలగించండి
  19. గతి తప్పని కృతి నిడి స
    మ్మతము గొనుచు నది పదుగురి మన్నన లందన్
    గతి నీవె యనుచు నా భా
    రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్

    రిప్లయితొలగించండి
  20. ప్రతిదినమందున భక్తిగ
    వ్రతముగ పూవులను యేరి ప్రణతులనిడుచున్
    హితముగ నుతియించుచు భా
    రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పూవులను + ఏరి' అన్నపుడు యడాగమం రాదు. "పుష్పముల నేరి" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు ..సవరిస్తాను..

      తొలగించండి
  21. హితమగు చదువుల తల్లిని
    సతతము మది నందు నిలిపి సద్భావముతో
    నుతముగ వాగీశ్వరిఁ భా
    రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్

    రిప్లయితొలగించండి
  22. సతతము సుకవుల కెల్లను
    ప్రతిభయు కూడగ జగతిని వాసిగ నెపుడున్
    హితమగు విద్యల నిడ భా
    రతిని కొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్

    2.నుతియించుచు హరినిలస
    న్మతియొసగుమనుచు నిరతము మానుగ నాపా
    ర్వతి,పార్థివితోడన్ మా
    రతిని కొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్

    రిప్లయితొలగించండి
  23. మతిలో కోర్కె ఘటిల్ల నేర్చుకొని సమ్మానమ్ముతో విద్యలన్
    స్తుతమౌ కావ్యములన్ పఠించుచును సంతోషమ్ముతోనిత్యమున్
    గతినీవేయని శుద్ధమైన మదిలో కాంక్షించి వాగ్భామ భా
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  24. అతులితభావముగొఱకును
    యతులునుబ్రాసలమరికలుహాహాయనగన్
    సతియునుమాతయునగుభా
    రతినిగొలిచికావ్యములనువ్రాయగనొప్పున్

    రిప్లయితొలగించండి
  25. అతులిత జ్ఞానము నొసగగ
    సతతము భక్తిని కొలచుచు శారద సతికిన్,
    స్తుతులను సల్పుచు నా భా
    "రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్"

    రిప్లయితొలగించండి

  26. సవరణతో
    సతతము సుకవుల కెల్లను
    ప్రతిభయు కూడగ జగతిని వాసిగ నెపుడున్
    హితమగు విద్యల నిడ భా
    *రతిని కొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున
    మరొక పూరణ

    3రతిపతిపితసుతు సతి,భా
    *రతిని గొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్*
    సతతము జనులు విడక స
    న్మతితో పూజింపనొసగు మరువక శక్తిన్

    రిప్లయితొలగించండి
  27. సతతమ్ము భక్తి తోడను
    చతురానను రాణి వాణి జదువుల తల్లిన్
    శ్రుతదేవి పలుకుజెలి భా
    రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్

    రిప్లయితొలగించండి
  28. వితతంబౌకథనంబుతో వలపులున్ విశ్లేషముల్ కూరిమిన్
    అతిమాధుర్యపదంబులన్ జొనిపియాద్యంతంబు హృద్యంబుగా
    సతతంబెల్లరుమెచ్చురీతిరచనల్ సల్పంగ మున్ముందు భా
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  29. శ్రితమందారను ప్రతిభా
    మతినొసగినకాళిదాసమాణిక్యాంబన్
    సతినిన్శ్యామలయౌభా
    *రతినిఁగొలిచి కావ్యములను వ్రాయఁగనొప్పున్*

    రిప్లయితొలగించండి
  30. స్తుత విద్యల శ్రీకారపు,
    నతులిడి గణపతికిఁ దొలుత నలువ సతి సర
    స్వతి వాగ్దేవిని భక్తి ని
    రతినిఁ గొలిచి, కావ్యములను వ్రాయఁగ నొప్పున్


    అతి లావణ్య విశేష భావముల ద్వంద్వార్థ ప్రభా నైపుణిన్
    విత తానుగ్రహ దీప్త ధీద్యుతి సదా వేద్యంబుగా భాసిలన్
    నుత శబ్దార్థ లసత్ప్రమాణములఁ బ్రాజ్ఞుల్ మెచ్చ వాగ్దేవి భా
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  31. మతిపోగొట్టెడుమంజులక్వణమునన్ మాణిక్యవీణాశ్రుతిన్
    హితసాహిత్యమహత్త్వతత్త్వరుచినిన్ హేరంబుడేవ్రాయభా
    రతమున్వ్యాసుడుజెప్పెగావ్యులికపైప్రారబ్ధమున్గాల్ప భా
    *రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁదగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్*

    రిప్లయితొలగించండి
  32. సతతమ్మాధవళాంగి బ్రహ్మ సతి నా సాహిత్య సంశోభినిన్
    సతమానంద ప్రదాయినీ జనని భాషాయోష వాగీశ్వరిన్
    శ్రుతదేవిన్ కవి డెందమున్ నిలిపుచున్ స్త్రోత్రమ్ము తో నిచ్చ భా
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్.

    రిప్లయితొలగించండి
  33. మ:

    పితరుల్ భాగ్యము నాదు విద్య నరయన్ వేగమ్ముగా ఛందమున్
    చతురంబౌ విధి పద్యమల్లికనుచున్ సాధింప చుక్కానియై
    సతమున్ బల్కిరి యున్నతిన్ బడయ నాసాంతమ్ము సద్భక్తి భా
    రతి పూజన్ ఘటియించి వ్రాయగ దగున్ రమ్యంపు కావ్యమ్ములన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  34. అతులిత రససిద్ధి, సుని
    శ్చితబుద్ధి, సుశబ్దలబ్ధి, చేతనశుద్ధిన్
    ప్రతిభావ్యక్తుల నిడ భా
    రతిని గొలిచి కావ్యములను వ్రాయగ
    నొప్పున్

    శ్రుతి శాస్త్రాదుల గౌరవించి స్థిరమౌ
    శుద్ధాంతరంగమ్మునన్
    అతులంబౌ రససిద్ధినిన్ కవితాలంకార వాక్సుద్ధినిన్
    మితిలేనట్టి దయన్నొసంగగ నమ్మీనాక్షి వీణాపాణి భా
    రతి పూజన్ ఘటియించి వ్రాయదగున్ రమ్యంపు కావ్యంబులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పులు దొర్లాయి! సవరిస్తాను! 🙏🙏🙏

      తొలగించండి
    2. శ్రుతి శాస్త్రాదుల గౌరవించి స్థిరమౌ
      శుద్ధాంతరంగమ్మునన్
      అతులంబౌ రససిద్ధినిన్ సుకవితా లంకార వాక్సుద్ధినిన్
      మితిలేనట్టి దయన్నొసంగుమని నామీనాక్షి వాగ్దేవి భా
      రతి పూజన్ ఘటియించి వ్రాయగదగున్ రమ్యంపు కావ్యంబులన్

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వాక్శుద్ధి' టైపాటు. "ఒసంగుమని యా మీనాక్షి.." అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  35. రతతాలీ నిరతానురక్తుడగునా రాజేంద్రు నంకింపగా
    రతుడై మన్మథుడావహింప కవియున్ రాకేందు రాత్రమ్మునన్
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్
    రతి కేళీ విధులే ప్రబంధములగున్ రాజిల్లు శృంగారమున్

    రిప్లయితొలగించండి
  36. అతిభక్తిన్గడుబ్రేమతోమిగులనాయార్యాసమేతంబభా
    రతిపూజన్ఘటియించివ్రాయగదగున్రమ్యంపుగావ్యమ్ములన్
    గతినీవేయనిగూర్మితోరమనుదాకామాక్షియయేయంచుసా
    రతిబూజించిననిచ్చుగామనకుబుర్రాదేవతేసంపదల్

    రిప్లయితొలగించండి
  37. నా రెండవ పూరణము:

    సిత హంసస్థిత సుందర ప్రకట రా
    శీ రమ్య దివ్యాకృతిన్
    హిత సంశోధిత భావరాగసమ సా
    హిత్యాత్మయై వెల్గుచున్
    శ్రుతిగీతోజ్జ్వల లాస్య లాలిత విభా
    శోభాకృతిన్ దూగు భా
    రతి పూజన్ ఘటియించి వ్రాయగదగున్ రమ్యంపు కావ్యమ్ములన్!

    రిప్లయితొలగించండి
  38. కందం
    గత వైభవ కవితామయ
    కృతి దీప్తులఁ బరవశించి కేల్మోడ్పులతో
    శ్రుతి సింగారిన్ వాక్భా
    రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్

    మత్తేభవిక్రీడితము
    గతమందున్ ఘన కీర్తి నింపొదవ సత్కావ్యాను సందీప్తిలోఁ
    గృతిమాధుర్యము గ్రోలి మైమఱచుచున్ గేల్మోడ్పులన్ భక్తిమై
    శ్రుతి సింగారిని వాక్ప్రసాదమిడగన్ స్తోత్రాది శుశ్రూష భా
    రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్

    రిప్లయితొలగించండి
  39. కం: ప్రతివత్సరమునను సుధీ
    మతిన గణపతిని మరువక మది తలచా గణ
    పతి ఆశీస్సులగొని భా
    రతిని గొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్!! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻కొల్లారపు పాండు రంగ మూర్తి .

    రిప్లయితొలగించండి