7, ఆగస్టు 2020, శుక్రవారం

సమస్య - 3450

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్"(లేదా...)
"పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్"

48 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  పరువులు పెట్టి పారగను పాకుల జూడగ ముంబయిన్ భళా....
  నరకుచు మోడి నవ్వుచును నందన మొందుచు చీని భాయిలన్
  కరచెడి రీతి జూడగను కాంగ్రెసు పార్టిని నాట్యమాడెడిన్
  పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్

  రిప్లయితొలగించండి
 2. యుద్ధమునుండి తిరిగివచ్చిన బాలచంద్రునితో అతని భార్య ..........

  త్వరపడి యుద్ధరంగమున భంగమునంది విచిత్ర రీతి వే
  గిరమె గృహంబుజేరితివి కిమ్మనకుందువు శౌర్యహీనుఁడై
  మరలితివయ్యొ నీకునవమానము లేదటె ? నిన్ను బోలునా
  పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్

  రిప్లయితొలగించండి
 3. చరితము ఘనతను గూర్చును
  పురుషులకున్; భూషణములు పూవులు గాజుల్
  తరుణుల కెల్లెడ జూడగ
  మురిపెపు నైదవ తనమును ముడివడ జేయున్.

  రిప్లయితొలగించండి
 4. 07.08.2020
  అందరికీ నమస్సులు 🙏🙏

  నా పూరణ యత్నం..

  *కం* 🌹

  తరుణులు జీన్సులు షర్టులు
  విరివిగ వేయుచు తిరుగగ ప్రియముగ నెపుడున్
  అరెరే! నిక పోటీకై
  *"పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్"*

  *కం* 🌹🌹

  కురులకు కత్తెర వేయుచు
  కరములు బోసిగ నిరతము కనిపించెడి యా
  తరుణీ మణులుండగ కలి
  *"పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🙏

  రిప్లయితొలగించండి

 5. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వరుసగ నారు మాసములు బార్బరు షాపులు మూసివేయగా
  తిరముగ లాకుడౌనునను తీరిచి దిద్దుచు నూనె పూయగన్
  పెరుగగ జుత్తు దండిగను పేరిచి యల్లగ రెండు వేణులన్
  పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్

  రిప్లయితొలగించండి
 6. చిరు మీసంబుల్ రహి నిడు

  పురుషులకున్ ,భూషణములు‌ పూవుల్ గాజుల్

  కురులకు కర యుగళములకు

  వరుసగ వన్నియ నొసగును వనితల కెపుడున్

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సరియగు ధర్మవర్తనము చక్కని మాట విలాస రూపముల్
  పురుషులకున్ సుభూషలగు; బువ్వులు గాజులు గాలి మెట్టెలున్
  తరుణులకెల్ల శోభను ముదమ్మును గూర్చిసతమ్ము వారినిన్
  పరిఢవమొంద జేయుచు సువాసినులన్నొనరించు నెంతయున్.

  రిప్లయితొలగించండి

 8. * శంకరాభరణం వేదిక *
  07/08/2020..శుక్రవారం

  సమస్య
  ********
  పురుషులకున్ సుభూషలగు బువ్వులు గాజులు గాలి మెట్టెలున్"

  నాఫ పూరణ. చం.మా.
  *** ****** *

  కరువలి పట్టి భీముని విఘాతములన్ భరియించ లేక తాన్

  వెఱవుచు భండనమ్మునను వీపును జూపుచు బారిపోయి స

  త్వరము సరస్సు నందునను దాగు సుయోధను వంటి బీరులౌ

  పురుషులకున్ సుభూషలగు బువ్వులు గాజులు గాలి మెట్టెలున్"


  -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 9. కె.వి.యస్. లక్ష్మి:

  గురువుగారికి నమస్కారములు. దయచేసి నిన్నటి పూరణ పరిశీలించగలరు.

  దుష్కృత్యంబున ధర్మ బ
  హిష్కృతుడై రామబాణ హింసకు గురియై
  నిష్కృతి రావణుడొందెను
  దుష్కృతమున పుణ్యమబ్బు దుర్మార్గునకున్.

  రిప్లయితొలగించండి
 10. తరుణీ ప్రకృతిన్ జెలగుచు
  సరసపు పాటలనుబాడి సందడిజేసే
  తిరిపెమడుగు షండకులౌ
  పురుషులకున్ భూషణములు పూవుల్ గాజుల్


  విరటుని కొల్వులో తనపాత్రను ధర్మజునికి వివరిస్తున్న కిరీటి

  నరవర! నేర్పుమీరగను నాట్యము నేర్పెడు నాట్యగత్తెనై
  విరటుని కొల్వులోన కడువేడ్కను కాంతల బ్రీతిగూర్చెదన్
  సరసపు మాటలాడుచును చక్కని వేషము దాల్తు షండులౌ
  పురుషులకున్ సుభూషలగు బూవులు గాజులు గాలిమెట్టెలున్

  రిప్లయితొలగించండి
 11. పురమున నెన్నిక లందున
  వరుసగ జేసిన ఘనమగు వాగ్దా నములన్
  మరుగున పెట్టిన పాలక
  పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్

  రిప్లయితొలగించండి


 12. అరయగ చెవిలో పువ్వులు
  పురుషులకున్ భూషణములు, పూవులు గాజుల్,
  సరసత తోడై రమణులు
  మురిపెము పిరియమ్ము చూపి ముద్దుగ నిడగా !


  నారదా
  జిలేబి

  రిప్లయితొలగించండి


 13. అరయగ పువ్వులన్ తురుమగా చెవిలో మురిపెమ్ము చూపుచున్
  పురుషులకున్ సుభూషలగుఁ, బువ్వులు గాజులు గాలి మెట్టెలున్,
  సరసత తోడు భామలదె స్పర్శమణిప్రభవమ్ము పొందగా
  పిరియపు చూపులన్ విపణివీధిని బోవగ వారి తోడుతన్ !


  కడవన్నె సరసపు ధర :)

  జిలేబి

  రిప్లయితొలగించండి


 14. లలనలె నిడగా చూపుచు
  లలి, పురుషులకున్ సుభూష లగుఁ బువ్వులు, గా
  జులు గాలి మెట్టెలున్ గల
  గలలాడించి పిరియపు వగల తోడు సుమా


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. తరుణులు సంప్రదాయసతతవ్యవహారవిరాజమానలై
  బరగిన మేలు మేలనరె పావనధన్యచరిత్రలన్, తదా
  చరణ మహత్వపూర్ణలగు సాధ్వికి నట్లుగ ధారణార్థమై,
  పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 16. దరహాసము, పౌరుషమది
  పురుషులకున్ భూషణములు, పూవులు గాజుల్
  కురుమట్టమలంకారము
  తరుణులకని చెప్పిరైరి ధరణిని ప్రాజ్ఞుల్.

  రిప్లయితొలగించండి
 17. వరమగును గదా మీసము
  పురుషులకున్, భూషణములు పూవులు గాజుల్
  కురులకు చేతులకు నగు
  నరుదుగ కానబడుచు౦దు రతివలు పుడమిన్

  రిప్లయితొలగించండి
 18. తరుణులఁ బ్రసన్న మొనరుప
  పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్
  మరి పట్టుచీరలను పరి
  పరి బహుమానం బిడుట యవశ్యపథంబౌన్

  రిప్లయితొలగించండి
 19. సురుచిర చిరుహాసమ్మే
  పురుషులకున్ భూషణములు, పూవులు గాజుల్
  తరుణులకవిభూషణములు
  కరుణసకలజనులకిలనుఘనమగు నగయౌ

  రిప్లయితొలగించండి
 20. రిప్లయిలు
  1. నిరతము లాకుడౌననగ నేవిధి జూచిన జీవనంబు దు
   ష్కరమవ రిక్తహస్తముల సంతు సతీజన పోషణంబు నా
   తరమ యనన్ కరోన పర తంత్రము పైబడ సాగలేని కా
   పురుషులకున్ సుభూషలగు బువ్వులు గాజులు గాలి మెట్టెలున్

   తొలగించండి
 21. కరమగు కడియము బటువులు
  పురుషులకున్ భూషణములు! పూవులు గాజుల్
  వరలెడి కాటుక, మోమున
  దరహాసము, నుదుటి బొట్టు తన్వికి సొమ్ముల్!

  రిప్లయితొలగించండి
 22. కరమగు కడియము బటువులు
  పురుషులకున్ భూషణములు! పూవులు గాజుల్
  వరలెడి కాటుక, మోమున
  దరహాసము, నుదుటి బొట్టు తన్వికి సొమ్ముల్!

  రిప్లయితొలగించండి
 23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 24. దురమున రిపులకు భయపడి
  పరుగున వెనుదిరిగి వచ్చు పంద ల గనియున్
  తరుణులు పలికెద రా కా
  పురుషుల కున్ భూషణములు పూవులు గాజుల్

  రిప్లయితొలగించండి
 25. పురుషులు కారు కారిలను బోటులు, వీరలు వింతజాతియై
  ధరణిని యచ్చటచ్చటను తారస పడ్దురు గాంచినంత నా
  విరటుని కొల్వుకూటమిని పేడి బృహన్నల వంటి శండులౌ
  పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్.

  రిప్లయితొలగించండి
 26. సురపొన్నలుచిరఁజీవులు
  కరకంకణకద్దమంటిగాజులుననగన్
  స్థిరమగుకంకణధారులు
  పురుషులకున్ భూషణములు పూవులుగాజుల్

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 27. నిరతము నుపకృతి జేయుట
  పురుషులకున్భూషణములు,పూవులుగాజుల్
  తరుణులకవిజేకూర్చును
  నిరవగునైదవతనంబునిండగుశోభన్

  రిప్లయితొలగించండి
 28. మైలవరపు వారి పూరణ


  సరసులు భారతీయ ఘనసంస్కృతి నమ్మినవార., లెంతొ యా..
  దరమున బ్రేమ బంచుచు ముదంబులనందెడివారు., శ్రావణిన్
  పరమపవిత్రకాలమున భార్యలకివ్వగ కాన్కనెంచునా
  పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 29. దశకుమార చరితం ఆధారంగా ఖడ్గ తిక్కన వృత్తాంతం
  చంపకమాల :
  పరుగిడి యుద్ధరంగమున పంచన జేరిన భర్తజూసి తాన్
  విరిగిన పాలయున్ బసుపు పిండిలి ఇచ్చెను స్నాన మాడగా
  మరుగునబడ్డ బౌరుషము మ్రాలగ చెప్పెను నాతి యిట్లు న
  ప్పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్" ---శ్రీరామ్ 10వ తరగతి

  రిప్లయితొలగించండి
 30. ధరణిని యుద్దరంగమున తద్దయు భీతిని పాఱు వారికిన్
  తరుణులతోడ సంతతము తచ్చన లాడుచు రాణివాసమున్
  నిరతము చీర కట్టుకుని నెయ్యము చూపెడి షండులైన నా
  పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్

  రిప్లయితొలగించండి
 31. నిరుపమ 'పోటీ'పరీక్షలు-
  కరమతి భీకరమునౌచు కలవర పెట్టన్
  గిరగిర తిరిగెడు 'జల్సా'
  పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్.

  రిప్లయితొలగించండి
 32. పిరికితనమ్మున పోరున
  నరి వీరుల గని వెరపున నాకంపితులై
  పరువిడి వెనుకకు మరలెడి
  పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్

  రిప్లయితొలగించండి
 33. తిరమగుసత్యవాక్పటిమ,తీర్చినబాధలుదోటివారివిన్
  పురుషులకున్సుభూషలగు,పువ్వులుగాజులుగాలిమెట్టెలున్
  దరుణులకెల్లవేళలనుదాగలిగించుసుమంగళీత్వమున్
  నరయుముకాంతనాబడునునాదిపరాత్పరశక్తిగాభువిన్

  రిప్లయితొలగించండి
 34. ��
  ధర దానగణము తెగువలు
  పురషులకున్ భూషణములు,పూవుల్ గాజుల్!
  పురలోపమ సుదతులకిల
  కరము ముదము నొసగుననుటఁ గాదన గలమే!!
  ��️��భమిడిపాటి కాళిదాసు!

  రిప్లయితొలగించండి
 35. 🙏
  ధర దానగణము తెగువలు
  పురషులకున్ భూషణములు,పూవుల్ గాజుల్!
  పురలోపమ సుదతులకిల
  కరము ముదము నొసగుననుటఁ గాదన గలమే!!
  🖊️👌భమిడిపాటి కాళిదాసు!

  రిప్లయితొలగించండి
 36. కందం
  మఱువఁగ నెంచకు రమ్మా!
  సిరులవి సౌభాగ్యమునకు సింగారములున్
  గురుతులనఁగ యెదపంచిన
  పురుషులకున్, భూషణములు పూవులు గాజుల్

  చంపకమాల
  మఱువక? సంప్రదాయముల మంగళ దాయకమంచుఁ గూర్చఁగన్
  సిరులన దైవమిచ్చినవి శ్రీకరమౌ ధరియించినంతనే
  గురుతన మానసమ్మునొక కోవెల జేయుచు మిమ్మునిల్పెడున్
  పురుషులకున్, సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్!

  రిప్లయితొలగించండి
 37. వరమగునవనాగరికత
  సురుచిరసుందరవదనకుసూటేకళగా
  పరమగుశోభనుదెచ్చును
  పురుషులకున్భూషణములుపూవులుగాజుల్

  రిప్లయితొలగించండి
 38. చిరునగవుల్ సుభాషణముచెన్నగు ధైర్యము సాహసంబులున్
  పురుషులకున్ సుభూషలగుఁ, బువ్వులు గాజులు గాలి మెట్టెలున్
  పరిమళచందనాదులును భామలకందముగూర్చు, పూరుషుల్
  తరుణులకెల్లభూషణముతల్లడమొందెడువారిగాచుటల్

  రిప్లయితొలగించండి
 39. కరముల నస్త్ర శస్త్రములు గాంచన రత్న కిరీటముల్ భళా
  పురుషులకున్ సుభూషలగుఁ; బువ్వులు గాజులు గాలి మెట్టెలున్
  తరుణులకున్ సుభూషలగుఁ ధన్యత గూర్చు సుమంగళాంకనల్;
  వర హిత సాత్వికార్థమగు వాక్కు సుభూషణమెల్లవారికిన్

  రిప్లయితొలగించండి
 40. కర కటకములన్ గాజు ల
  న రాదె యనవచ్చుఁ జుమ్మి నరవర వినుమా
  హరికథను నుడివెడు మహా
  పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్


  పురుషులకున్ సుభూషలగుఁ బో భుజకీర్తులు నుంగరమ్ములుం
  బురుషగ ణోత్తముండు పరిపూర్ణ మహా హరి నిట్లు గాంచమే
  కురులకు హస్త పద్మములకుం గన స్త్రీలకుఁ, బుణ్యలబ్ధ ధీ
  పురుషులకున్, సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్

  రిప్లయితొలగించండి
 41. మురిపెము తోడను ప్రేయసి
  సరసకు చేరగ మగనికి స్వర్గమె, మరియా!
  సరసపు నవ్వులు, మాటలు
  "పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్"

  రిప్లయితొలగించండి
 42. సిద్ధేంద్ర యోగి శాసించిన రీతిలో నేటికిని కూచిపూడిలో ప్రతి మగ పిల్లవాడు( ఆడ వారికి నిషేధము) పెద్దయ్యాక ఏ వృత్తిని అవలంబించినా స్వామి సన్నిధిలో భామ వేషం వేసి తీరాలి. ఆ నియమం పకారమే ఈ పద్యము

  చం:

  నిరుపమ నృత్య రూపకము నింటికి పేరగు కూచిపూడినిన్
  తెరతెర గాన వచ్చునట దేవుని సన్నిధి భామ రూపమున్
  పరువము గూడి వేసికొను పద్ధతి నేటికి నిశ్చయమ్ముగన్
  పురుషులకున్ సుభూషలగు బువ్వులు గాజులు గాలి మెట్టెలున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి

 43. పిన్నక నాగేశ్వరరావు.

  కరముల పసిడి కడియములు
  పురుషులకున్ భూషణములు; పూవులు
  గాజుల్
  మరియున్ గాలికి మెట్టెలు
  గరువపు సంపదయె గాద కాంతలకెల్లన్.

  రిప్లయితొలగించండి

 44. వరమయి బంగరు కడియాల్
  పురుషులకున్ భూషణములు; పూవులు, గాజుల్,
  పరిగొను కంఠా భరణాల్,
  గరువపు సంపద- పడతుల కళయై బరగున్!

  రిప్లయితొలగించండి

 45. వరమయి బంగరు కడియాల్
  పురుషులకున్ భూషణములు; పూవులు, గాజుల్,
  పరిగొను కంఠా భరణాల్,
  గరువపు సంపద- పడతుల కళయై బరగున్!

  రిప్లయితొలగించండి
 46. పరపతి పెంచు కడియములు
  *పురుషులకున్ భూషణములు,పూవులు గాజుల్*
  సరిగంచు పట్టుచీరలు
  తరుణీమణులకు సతతము తరగని సిరులే.

  రిప్లయితొలగించండి