కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె"
(లేదా...)
"నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె"
(లేదా...)
"నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్"
సీతనపహరణమ్మున చింతగలిగె
రిప్లయితొలగించండిశాంత మేమాత్రమునులేక శక్తులుడుగ
కదనరంగాన మరణము గాంచు నపుడు
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరామాయణంలో నస్యమా?
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
దాస్యమ్మున్ వడి పారద్రోలగనహో తంటాలనున్ సైచుచున్
సస్యశ్యామలమైన గ్రామముననున్ శ్లాఘమ్ములన్ పొందగన్
నాస్యంబైనది శైత్యమున్ విడువగన్ నాటమ్మునన్ చీదుచున్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నాస్యంబు'?
తొలగించండి🙏
నాస్య = [నాసా+యత్, నాసాయాం భవమ్] ముక్కులో వుండునది.
....ఆంధ్రభారతి
(కిట్టింపు)
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
రామలీల నాటకములో:
దోస్యమ్మున్ విడి నేల కూలగనయో దుర్మార్గులన్ పోరుచున్
నాస్యంబందున శ్వాసమున్ విడుచుచున్ నందమ్ము కోల్పోవగన్
హాస్యంబున్ భళి చేసి లక్ష్మణునకున్ హన్మానునున్ పంపుచున్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నాస్యంబు'?
🙏
తొలగించండిలాస్యంబాడగ మీసముల్ యమిత
రిప్లయితొలగించండినిద్రావస్థలో మోముపై
హాస్యంబించుక గాదు వానిని
సునాయాసంబుగా లేపగన్
నస్యంబిమ్మని రావణుండడిగె, విన్నాణంబుగా రామునిన్
దాస్యుండౌనటు జేయగాదగిన నీ
తమ్ముండు మేల్కాంచగా
చైత్ర నవమినాడు పగలు రాత్రియనక
తొలగించండిగ్రామమందున నాడగ రామకథను
నిదురకాగక తేనీరు పెదవినిడుచు
రావణుడు నస్యమిమ్మని రామునడిగె
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'మీసముల్+అమిత' అన్నపుడు యడాగమం రాదు. "మీసముల్ మిగుల..." అనండి.
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏🙏
తొలగించండిలాస్యంబాడగ మీసముల్ ప్రబల
తొలగించండినిద్రావస్థలో మోముపై
హాస్యంబించుక గాదు వానిని
సునాయాసంబుగా లేపగన్
నస్యంబిమ్మని రావణుండడిగె, విన్నాణంబుగా రామునిన్
దాస్యుండౌనటు జేయగాదగిన నీ
తమ్ముండు మేల్కాంచగా
నగరియందు రామకథను
రిప్లయితొలగించండినాటకముగ
వేయువేళన నందలి వేషధారు
లందరును సేద గొనుచుండ నందునున్న
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండినాటకమొకటి మధ్యన నాలుగైదు
నిమిషముల వ్యవధానము; నిమ్మళమ్ము
గాన పాత్రధారులు మాట కలిపి రపుడు
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినస్యమును బీల్చు నలవాటు నాపలేక
రమ్యముగ నాడుచుండెడి రావణవధ
నాటకము మధ్య సెదదీరు నట్టి వడిని
రావణుడు నస్యమిమ్మని రాము నడిగె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సేదదీరు'ను 'సెదదీరు' అన్నారు. "నాటకము మధ్య విశ్రాంతి నందువేళ" అందామా?
గురువు గారికి నమస్కారములు
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండినస్యంబిమ్మని రావణుండడిగె వి
న్నాణంబుగా రామునిన్
( సురభి నాటక కళాకారులు గాత్రసౌలభ్య
దాయకమైన నస్యంకోసం తెరలో ...)
ఆస్యంబందున నెన్నొ భావముల నా
టాడించి సంతోషమన్
సస్యాలన్ రసికావతంసుల మదుల్
సమ్మోహముల్ జేయుచున్ ;
లాస్యాలన్ జరిపించు పద్యముల నా
లాపింప భావించుచున్ ;
" నస్యం బి " మ్మని రావణుండడిగె వి
న్నాణంబుగా రామునిన్ .
(ఆస్యము - ముఖము ; సస్యాలన్ - పైరు లతో ; లాస్యాలన్ -సుకుమారనాట్యాలను)
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆస్యంబందు బొగాకు చుట్ట, యుదరం బందున్ సురా యుక్తుడై
రిప్లయితొలగించండిలాస్యం బెల్లెడ జేయువా డొకడు వాలాయంబుగా వాగుచున్
హేస్యాలా! వినుమంచు బల్కెను గదా యీరీతి "యుద్ధంబునన్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్"
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిలాస్యంబాడెను రామరూపకమునన్ లంకేశుడై గొప్పగా
నస్యంబున్ గొను వాడుకన్ నిలుపలేనాతండు నావేళనున్
నస్యంబందున బాధరేగి వ్యవధానంబందునన్ వేడుచున్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారికి నమస్కారములు.
తొలగించండి
రిప్లయితొలగించండికందివారివ్వాళ సెలవా :)
లాస్యాయొక్కతె నాట్యమాడి నిలిపెన్ లావైన కాయంపు వా
డాస్యోటన్ తన కొప్పుపైన తురిమెన్ డ్రామా జిలేబీయమే!
హాస్యమ్మాయె ప్రధానమైన కథ ! బాహాటమ్ముగా మధ్యలో
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీధి నాటకములు వేయు బృంద మొకటి
రిప్లయితొలగించండిపట్టణానికి పయనించు పాళమందు
దారి మధ్యన విశ్రాంతి గోరు వేళ
రావణుఁడు నస్యమిమ్మని రాము నడిగె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినాటకమునకు వేళాయె నడువమన్న
రిప్లయితొలగించండిఏమి నాటకమో కాని యిపుడు ముందు
జలుబు విపరీత మాయెను జర నొసగుము
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జర' అన్యదేశ్యం.
నస్యమున కల వాటైన నాయకుండు
రిప్లయితొలగించండిహాస్య మాడుచు నొకపరి యనియె నిట్లు
సమరమును నిల్పి వాంఛ తో సరస ముగను
రావణుడు నస్య మిమ్మని రాము నడిగె
మొదటి పాదం లో నస్య మలవాటు గానున్న నాయకుండు అని సవరణ చేయడమైనది
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిహాస్యంబించుకలేదు., కష్టపడి సన్న్యాస్యాకృతిన్ జేరి., నే.
నాస్యాస్ఫారితభీతికారకుడనై యాశించితిన్ జానకిన్
సస్యంబీమె., రణమ్ము జేయుటకునై సౌమాంచితంబైనదౌ
నస్యంబిమ్మని రావణుండడిగె విన్నాణంబుగా రామునిన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండిసస్యంబుల్ విరివిన్ ఫలించె ననుచున్ సంతృష్టులై వేడ్కగా
రిప్లయితొలగించండిలాస్యంబాడగ నిశ్చయించుకొనిరా రామాయణమ్మున్ జనుల్
హాస్యాలాడుచు వారుకూడిరట యభ్యాసంబుకై నత్తరిన్
నస్యంబిమ్మని రావణుండడిగె విణ్నాణంబుగా రామునిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"అభ్యాసార్థులై" అనండి.
లంకకును చేటుఁదెచ్చిన రాజెవండు?
రిప్లయితొలగించండిశాస్త్రి యేమని పల్కె భేషజముతోడ?అవని వీడగ కైకేయి యెవనినడిగె?
రావణుడు-నస్యమిమ్మని-రామునడిగె
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిరాము రాజు ననెడివారు రక్తి గూడి
రామ రావణ పాత్రలు రమ్యముగను
నటన జేయుచు తెరచాటు నందు రాజు
రావణుడు నస్య మిమ్మని రాము నడిగె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినస్యంబున్ దగ బీల్చు వాడితడయో నాకెట్లు ప్రాప్తించె నా
రిప్లయితొలగించండిలస్యంబాయెను నాటకంబు నిక నారంభింపుడో యన్గనే
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్
హాస్యంబైనను హద్దు దాట నపహాస్యంబౌనయో జూడగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనగ' అన్నదానిని 'అన్గ' అనరాదు. "ఆరంభిపగా గోరగా..." అనండి.
నాటకంబునువేయుచు నడుమనడుమ
రిప్లయితొలగించండిరావణుడు నస్యమిమ్మనిరామునడిగె
పొడెమునలవాటు గలవారుపుచ్చటుడివి
యడుగుకొందురు జగతిని విడువలేక
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పుచ్చటుడివి'?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
నస్య మలవాటు కల్గిన నటులు వారు
సమయమెంతయో గడచె నస్యమ్ము పీల్చి
యనుచు కౌతుకమ్మును నాపుకొనగ లేక
నాటకము మధ్యలో తెరచాటు కేగి
రావణుడు నస్యమిమ్మని రామునడిగె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివింత నా కిందుఁ దోఁచదు సుంత యేని
రిప్లయితొలగించండిరామ రావణు లనిశమ్ము రామ రామ
ప్రీతి నొందుదు రిద్దఱు పీల్చి పీల్చి
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె
సస్యశ్యామల భారతావనినె దుశ్చారిత్రు దుర్బ్బుద్ధి కా
మ స్యాలభ్య మనోరథ మ్మగునె సంభావ్యంబు నిత్యం బనా
లస్యన్ సీతను దప్తకాంచన మయ శ్లాఘ్యమ్ము వైదేహి దౌ
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్
[నస్యము = ముక్కున ధరించు ముక్కుపుడక; కామ స్యాలభ్య మనోరథము: అలుక్సమాసము ]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిలాస్యంబొందిననాటకంబున నహోలజ్జావిహీనుండునై
రిప్లయితొలగించండినస్యంబిమ్మనిరావణుండడిగెవిన్నాణంబుగారామునిన్
నస్యంబించుకబీల్చబాడగుగదానాళాలుశీఘ్రంబుగా
నస్యంబక్కటప్రాణహానియునుదానైజేర్చునాశమ్మునున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒక నాటకం లో భాగంగా గురు శిష్యుల సంభాషణ గా ఈ పద్యము:
రిప్లయితొలగించండిశా:
శిష్యున్డా యిటు రమ్మటంచు బిలువన్ శ్రీ రామ వేసమ్ముకై
హాస్యంబూనిన మోముతో నిలుచ నాహార్యంబు గైకొన్మనెన్
యిస్యానా, మరి మీరు రావణుడునై యింపారు టెట్లన్నచో
నస్యంబింమ్మని రావణుండడిగె విన్నాణంబుగా రామునిన్
ఇస్యానా=ఉపకారము (నిఘంటు శోధన)
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"మోముతో నిలువ... గైకొమ్మనెన్.." అనండి.
హాస్యస్ఫోరక మైన ఘట్టమును నేనావేదికన్ జూచితిన్
రిప్లయితొలగించండిలాస్యంబా! తెర వెన్క యంకమున పాత్రల్ వీడి వైరంబునే
సస్యోత్పన్నము లైన సారములతో సంధించుచున్ సఖ్యతన్
*నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
తేటగీతి
రిప్లయితొలగించండిహాస్యమేలేని యాహార్యమనఁగఁ బల్కె
"జలుబు బాధమించె తమరి శరపుధాటి"
పలుకులెంచఁగ తెరపైన వర్తకమన
"రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె!"
శార్దూలవిక్రీడితము
ఆస్యంబుల్ వగపించి శైత్యమున మీ యస్త్రోద్ధతిన్ మించనెన్
హాస్యస్ఫోరకమించుకైనఁ గన నాహార్యంబునన్ లేకయే
లాస్యంబేమని చింతఁజేయ తెరపై ప్రాకట్యనన్ దీరుగన్
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్
(వాణిజ్య ప్రకటనకర్తలకు పౌరాణిక పాత్రలొక లెక్కా వారితో ఏమైనా పలికించఁ గలరు...)
నస్యమొకపట్టుదట్టింప నాశమగును
రిప్లయితొలగించండిమేనిలోనున్న రుగ్మతల్, మేలుగూర్చు
నంచునాటకమారంభమవకమున్నె
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె
నస్యమును పీల్చు వాడట నయముగాను
రిప్లయితొలగించండినాటకములు వేయుచు మధ్యన నాయకుడగు
పాత్రధారిని వైరియౌ పంక్తి గళుడు
రావణుడు నస్యమిమ్మని రామునడిగె.