నడిరేయి సరదా పూరణ: అహ్మదు జాను సాహెబుల హాయిని కూడుచు హైద్రబాదునన్రహ్మను గౌడులన్ కలిసి రమ్యపు రీతిని బారులందునన్బ్రాహ్మణులెల్ల త్రాగగను బంజరు హిల్సున బీరు కాయలన్ బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) వహ్మను వీడుచున్ తనరి వైరుల కూల్చగ మాయ చేష్టలన్బ్రహ్మ కటాక్షమొందగను బారులు కట్టుచు దేవళమ్ములన్బ్రాహ్మణునంచు రాహులుడు భళ్ళున కూయగ వోట్లకోసమై బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్వహ్మ = భయము (వహ్మ : ఉరుదూ - తెలుగు నిఘంటువు (ఐ. కొండలరావు) 1938)
క్రొవ్విడి వెంకట రాజారావు: జీవులను నేర్పున సృజన జేయు మనుచు అజుని గోరె శివుడు; హలాహలము గ్రోల హరుని భక్తితో సురలెల్ల నభినుతించె పాల కడలిని మథియించు కాలమందు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
క్రొవ్విడి వెంకట రాజారావు: బ్రహ్మను దల్చి ప్రాణులను పాటవ మెంచుచు సృష్టి జేయగా బ్రహ్మను జీరె శంకరుడు; పానముసేయ హలాహలమ్మునున్ బ్రహ్మనుగూడి దేవతలు ఫాలుని వేడిరి భక్తితోడుతన్ బ్రహ్మయు దివ్యులున్నలర త్రాగె విషమ్మును ఈశ్వరుండటన్.
జిహ్మగ నూహజేయ హరు చేనఖ శస్త్రము తోడ ద్రుంచె నా;బ్రహ్మకళాభివేశ యుమ పాణిని యందగ బ్రహ్మ చారియై ;బ్రహ్మ తదాదులున్ వగయ భర్గుడు గాచె సురాదులన్ తా ;బ్రహ్మను , జీరె శంకరుఁడు , పానము సేయ హలాహలమ్మునున్జిహ్మ = వంకర
దేవతా సమూహము విష్ణుదేవుని మరియజునిఁ గోరె, శివుఁడు హలాహలముఁ గ్రోలగా జగములను రక్షింపఁ గరుణఁ జూపవేడి యొప్పింపగా భయవిహ్వలులయి.
అమృత మథనపు వేళ భళారె విషముబయటపడగాను ద్రావ నస్వప్నులెల్లనజునిఁ గోరె; శివుఁడు హలాహలముఁ గ్రోలముందుపడుచు నిలిపె కంఠమున జిలేబిఅజుడు - శివుడు - ఆంధ్రభారతి ఉవాచజిలేబి
కందోత్పలఅహ! వాడు గిల్లుకొన కరరుహ, "బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్" తహతహలాడి సమస్య వచ్చె తక్షణము సుమా జిలేబి
నీవు నీదు పనిని నిలుపకు మనుచునుఅజుని గోరె శివుడు హాలాహలము గ్రోలిలోక మెల్ల శా౦తి సుకముల న౦దగాకాచినట్టి హరుకు కరము మోడ్తు
సాగరము జిలుకుట గొనసాగుచుండజొప్పడిన లక్ష్మిసంగతి జూడుమనుచునజునిఁ గోరె శివుఁడు ; హలాహలముఁ గ్రోలసాగెనతడు లోక హితము జరుగుటకయి
పాలనముజేయుహరిసృష్టిబాధ్యతంచు"నజునిఁ గోరె శివుఁడు; హలాహలముఁ గ్రోల"త్రిదివులెల్లరుశివుని ప్రార్థించిరంతలోకమానందమొందెసుశ్లోకుగరుణ
సృష్టిజేయుమార్య!సుజనులననుచునునజునిగోరెశివుడు,హలాహలముగ్రోలసంతసంబునందిరంత,దేవగణమువిహ్వలతనుబొందభీతిచేత
ఎల్ల జగముల మేలుకై ఈశ్వరుండు! విషము ద్రాగగ పూనెను వెరపు లేక! సృష్టి కర్త సూచ నెరుగ క్షేమమంచు|"అజునిఁ గోరె శివుఁడు హలాహలముఁ గ్రోల"
క్రమాలంకారం లో --వాణి మనువాడ గోరె నెవ్వారి చెపుమ? కడలి మధియింప బుట్టిన గరళ మేమి సేయ ముప్పు తప్పె నిలను చెన్ను గాగ? అజుని గోరె : శివుడు హలా హలము గ్రోల
బ్రహ్మయె సృష్టిజేసెనిట బ్రాణుల నెల్లను వింతవింతగాబ్రహ్మ వరంబునన్ గలిగె రక్కసి కోవిడు కీటకంబదే జిహ్మ విషూచికన్ దరుమ జేజెకు సాధ్యము గాన బ్రోవగాబ్రహ్మను జీరె శంకరుడు పానము సేయ హలాహలమ్మునన్
వహ్మలుసెందకుండగనుభ్రష్టవిహీనులసృష్టిజేయుమాబ్రహ్మనుజీరెశంకరుడు,పానముజేయహలాహలమ్మునున్ బ్రహ్మయుదేవతల్ మఱియురాజులుసర్వులుసంతసంబునన్ జిహ్మపుబుద్ధులన్గొనకచేతులనెత్తుచునీశుమ్రొక్కిరే
బ్రహ్మకు దండ్రియౌ హరియె భారము మోయగ మంథరాద్రినిన్బ్రహ్మరసంబుకై సలుప వార్నిధి మంథనమందు ముందుగాబ్రహ్మ విలాసమా యనఁ గరాళ విషాగ్నులు రేగ నింద్రుడున్బ్రహ్మనుఁ జీరె; శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్బ్రహ్మయు వేడనా హరుడు భక్తవశంకరు డార్తిఁ దీర్చెనే
కె.వి.యస్. లక్ష్మి: జగతి కార్యము సలుపుగ సాగు మనుచు అజుని గోరె శివుడు; హలాహలము గ్రోల హరుని సురలెల్ల వేడగా కరుణ గూడి అంబ సాక్షిగా గరళమ్ము నారగించె.
పిన్నక నాగేశ్వరరావు.సృష్టి కార్యము నిరతము చేయుమనుచునజునిఁ గోరె శివుడు; హలాహలముఁ గ్రోలమనుచు సురలసురులు వేడ హరుడు గొనెనుక్షీర సంద్రము నందరు చిలుకు వేళ.
క్షీరసాగరమునుచిలుకగానందుండిబుట్టె విషము శౌరి బుచ్చుకొనగఅజునిఁ గోరె, శివుఁడు హాలాహలము గ్రోలసకల లోకములను శాంతి విరిసె
గంగగౌరిలమధ్యనకామవైరివిషముకంటెనువిషమమైవేడిగలుగసత్యవాక్కునుజెప్పంగసాగిమ్రోక్కిఅజునిఁగోరెశివుఁడుహలాహలముఁగ్రోల
సత్యలోకమ్ము జేరియా శార్ఙ్గధరుడుసృష్టి జేసెడు బాధ్యతన్ జేగొనమనియజునిఁ గోరె, శివుఁడు హలా హలముఁ గ్రోలసురలప్రార్థననాలించి సరియె ననెను.
బ్రాహ్మణ పండితుండొకడు భార్యకు చెప్పె పురాణ మిట్టులన్ బ్రహ్మయె పాటవమ్ముగల వాడని నమ్ముచు చెంతకేగి యా బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు, పానము సేయ హలాహలమ్మునున్ బ్రహ్మను గూడి దేవతలు భర్గుని కోరిరి లోక రక్షకై.
గౌరి శుభదాయిని మది జగత్రయపు హితమ్ము గోరి పతినిఁ ద్రాగఁ, దలచి యిట్టులివ్వి షమ్ము మహా త్ముని నేమి సేయ దజునిఁ గోరె, శివుఁడు హలాహలముఁ గ్రోల జిహ్మగ దంత సంభవము సిక్కఁగఁ దద్ధవళాబ్ధిఁ జిల్కఁగా జిహ్మ గతిం జెలంగి వడి ఛిన్నము కాఁగ జగమ్ములే పరబ్రహ్మము దేవదేవుని సభక్తినిఁ గాంచఁగ దేవకోటి వేబ్రహ్మనుఁ జీరె, శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్
మైలవరపు వారి పూరణ బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్!బ్రహ్మయు శంకరుండనెడి వ్యక్తులు మద్యము త్రాగనెంచగాజిహ్మపు మైత్రి ముందుగ రుచిన్ గొన జూచిన శంకరుండటన్బ్రహ్మను త్రోసి రాజనుచు వాసన జూడగ., వాదులాటలోబ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్! చీరెను.. .. కత్తితో చీల్చెను
బ్రహ్మ శంకరులు మిత్రులు గా భావించి, వారు మారుపేరున చెప్పే మాటలకు సరదాగా రాసిన పద్యంఉ: బ్రహ్మయు శంకరుండ్లనగ రంగము జేసెడి సిద్ధ హస్తులే బ్రాహ్మణు వండనే ర్చెనట వంటలు శంకరు త్రాగ నేర్వనైబ్రహ్మ పదార్థమున్ గొనగ బావయొ వేగమె యంచు నాత్రమున్బ్రహ్మను జీరె శంకరుడు పానము సేయ హలాహలమ్మునున్వై. చంద్రశేఖర్
బ్రహ్మముఁజేరగారుషులుప్రాజ్ఞతఁజేసిరిధ్యానయోగమున్రహ్మినిపారలౌకికములాస్యముఁజేసెనుమానసంబునన్అహ్మనునగ్నియేనికనునారెనుశంభునిఫాలమందునన్బ్రహ్మనుఁజీరెశంకరుడుపానముసేయహలాహలమ్మునున్
తేటగీతివిషము పొంగంగ పార్వతి వేడుకొనఁగమేలుమేలంచుఁ బ్రజలకున్ గాలగతినిఁ, దలఁచి మందరగిరి క్రింది దాసరయ్యనజునిఁ, గోరె శివుఁడు హలాహలముఁ గ్రోలఉత్పలమాలజిహ్మగ తాడుగా గిరినిఁ జేరిచి కవ్వమనంగ సోదరుల్బహ్మరసమ్ముకై సిలుక పాలసముద్రమునందు పొంగగన్జిహ్మ దశన్ జనించ నుమ చేకొన వేడఁగ, దొన్నె చేతితోబ్రహ్మనుఁ జీరె శంకరుఁడు, పానము సేయ హలాహలమ్మునున్(బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు = బ్రహ్మ ను పలకరించెనుశివుడు)
అహమది బ్రహ్మమగుమహీరుహ బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్ బహుసహనులు మునులీవిధంబు సత్యము దెలియన్
క్షీర సాగరమందున సిరిని గూడి యాదిశేషునిపైజేరె హరియు తానువాణి వదనమున సతము వాసముండనజుని గోరె,శివుడు హలాహలము గ్రోల
మంధరగిరిభార మది వీడగనురాదుమిగత పనులు జూడమేలు-హరియునజునిగోరె, శివుడు హలాహలము గ్రోలగలుగు తాపమోప గలవనియెను!
రిప్లయితొలగించండినడిరేయి సరదా పూరణ:
అహ్మదు జాను సాహెబుల హాయిని కూడుచు హైద్రబాదునన్
రహ్మను గౌడులన్ కలిసి రమ్యపు రీతిని బారులందునన్
బ్రాహ్మణులెల్ల త్రాగగను బంజరు హిల్సున బీరు కాయలన్
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వహ్మను వీడుచున్ తనరి వైరుల కూల్చగ మాయ చేష్టలన్
బ్రహ్మ కటాక్షమొందగను బారులు కట్టుచు దేవళమ్ములన్
బ్రాహ్మణునంచు రాహులుడు భళ్ళున కూయగ వోట్లకోసమై
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్
వహ్మ = భయము
(వహ్మ : ఉరుదూ - తెలుగు నిఘంటువు (ఐ. కొండలరావు) 1938)
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిజీవులను నేర్పున సృజన జేయు మనుచు
అజుని గోరె శివుడు; హలాహలము గ్రోల
హరుని భక్తితో సురలెల్ల నభినుతించె
పాల కడలిని మథియించు కాలమందు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిబ్రహ్మను దల్చి ప్రాణులను పాటవ మెంచుచు సృష్టి జేయగా
బ్రహ్మను జీరె శంకరుడు; పానముసేయ హలాహలమ్మునున్
బ్రహ్మనుగూడి దేవతలు ఫాలుని వేడిరి భక్తితోడుతన్
బ్రహ్మయు దివ్యులున్నలర త్రాగె విషమ్మును ఈశ్వరుండటన్.
జిహ్మగ నూహజేయ హరు చేనఖ శస్త్రము తోడ ద్రుంచె నా;
రిప్లయితొలగించండిబ్రహ్మకళాభివేశ యుమ పాణిని యందగ బ్రహ్మ చారియై ;
బ్రహ్మ తదాదులున్ వగయ భర్గుడు గాచె సురాదులన్ తా ;
బ్రహ్మను , జీరె శంకరుఁడు , పానము సేయ హలాహలమ్మునున్
జిహ్మ = వంకర
దేవతా సమూహము విష్ణుదేవుని మరి
రిప్లయితొలగించండియజునిఁ గోరె, శివుఁడు హలాహలముఁ గ్రోల
గా జగములను రక్షింపఁ గరుణఁ జూప
వేడి యొప్పింపగా భయవిహ్వలులయి.
రిప్లయితొలగించండిఅమృత మథనపు వేళ భళారె విషము
బయటపడగాను ద్రావ నస్వప్నులెల్ల
నజునిఁ గోరె; శివుఁడు హలాహలముఁ గ్రోల
ముందుపడుచు నిలిపె కంఠమున జిలేబి
అజుడు - శివుడు - ఆంధ్రభారతి ఉవాచ
జిలేబి
రిప్లయితొలగించండికందోత్పల
అహ! వాడు గిల్లుకొన కర
రుహ, "బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సే
య హలాహలమ్మునున్" తహ
తహలాడి సమస్య వచ్చె తక్షణము సుమా
జిలేబి
నీవు నీదు పనిని నిలుపకు మనుచును
రిప్లయితొలగించండిఅజుని గోరె శివుడు హాలాహలము గ్రోలి
లోక మెల్ల శా౦తి సుకముల న౦దగా
కాచినట్టి హరుకు కరము మోడ్తు
సాగరము జిలుకుట గొనసాగుచుండ
రిప్లయితొలగించండిజొప్పడిన లక్ష్మిసంగతి జూడుమనుచు
నజునిఁ గోరె శివుఁడు ; హలాహలముఁ గ్రోల
సాగెనతడు లోక హితము జరుగుటకయి
పాలనముజేయుహరిసృష్టిబాధ్యతంచు
రిప్లయితొలగించండి"నజునిఁ గోరె శివుఁడు; హలాహలముఁ గ్రోల"
త్రిదివులెల్లరుశివుని ప్రార్థించిరంత
లోకమానందమొందెసుశ్లోకుగరుణ
సృష్టిజేయుమార్య!సుజనులననుచును
రిప్లయితొలగించండినజునిగోరెశివుడు,హలాహలముగ్రోల
సంతసంబునందిరంత,దేవగణము
విహ్వలతనుబొందభీతిచేత
ఎల్ల జగముల మేలుకై ఈశ్వరుండు!
రిప్లయితొలగించండివిషము ద్రాగగ పూనెను వెరపు లేక!
సృష్టి కర్త సూచ నెరుగ క్షేమమంచు|
"అజునిఁ గోరె శివుఁడు హలాహలముఁ
గ్రోల"
క్రమాలంకారం లో --
రిప్లయితొలగించండివాణి మనువాడ గోరె నెవ్వారి చెపుమ?
కడలి మధియింప బుట్టిన గరళ మేమి
సేయ ముప్పు తప్పె నిలను చెన్ను గాగ?
అజుని గోరె : శివుడు హలా హలము గ్రోల
బ్రహ్మయె సృష్టిజేసెనిట బ్రాణుల నెల్లను వింతవింతగా
రిప్లయితొలగించండిబ్రహ్మ వరంబునన్ గలిగె రక్కసి కోవిడు
కీటకంబదే
జిహ్మ విషూచికన్ దరుమ జేజెకు సాధ్యము గాన బ్రోవగా
బ్రహ్మను జీరె శంకరుడు పానము సేయ హలాహలమ్మునన్
వహ్మలుసెందకుండగనుభ్రష్టవిహీనులసృష్టిజేయుమా
రిప్లయితొలగించండిబ్రహ్మనుజీరెశంకరుడు,పానముజేయహలాహలమ్మునున్
బ్రహ్మయుదేవతల్ మఱియురాజులుసర్వులుసంతసంబునన్
జిహ్మపుబుద్ధులన్గొనకచేతులనెత్తుచునీశుమ్రొక్కిరే
బ్రహ్మకు దండ్రియౌ హరియె భారము మోయగ మంథరాద్రినిన్
రిప్లయితొలగించండిబ్రహ్మరసంబుకై సలుప వార్నిధి మంథనమందు ముందుగా
బ్రహ్మ విలాసమా యనఁ గరాళ విషాగ్నులు రేగ నింద్రుడున్
బ్రహ్మనుఁ జీరె; శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్
బ్రహ్మయు వేడనా హరుడు భక్తవశంకరు డార్తిఁ దీర్చెనే
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిజగతి కార్యము సలుపుగ సాగు మనుచు
అజుని గోరె శివుడు; హలాహలము గ్రోల
హరుని సురలెల్ల వేడగా కరుణ గూడి
అంబ సాక్షిగా గరళమ్ము నారగించె.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
సృష్టి కార్యము నిరతము చేయుమనుచు
నజునిఁ గోరె శివుడు; హలాహలముఁ గ్రోల
మనుచు సురలసురులు వేడ హరుడు
గొనెను
క్షీర సంద్రము నందరు చిలుకు వేళ.
క్షీరసాగరమునుచిలుకగానందుండి
రిప్లయితొలగించండిబుట్టె విషము శౌరి బుచ్చుకొనగ
అజునిఁ గోరె, శివుఁడు హాలాహలము గ్రోల
సకల లోకములను శాంతి విరిసె
గంగగౌరిలమధ్యనకామవైరి
రిప్లయితొలగించండివిషముకంటెనువిషమమైవేడిగలుగ
సత్యవాక్కునుజెప్పంగసాగిమ్రోక్కి
అజునిఁగోరెశివుఁడుహలాహలముఁగ్రోల
సత్యలోకమ్ము జేరియా శార్ఙ్గధరుడు
రిప్లయితొలగించండిసృష్టి జేసెడు బాధ్యతన్ జేగొనమని
యజునిఁ గోరె, శివుఁడు హలా హలముఁ గ్రోల
సురలప్రార్థననాలించి సరియె ననెను.
బ్రాహ్మణ పండితుండొకడు భార్యకు చెప్పె పురాణ మిట్టులన్
రిప్లయితొలగించండిబ్రహ్మయె పాటవమ్ముగల వాడని నమ్ముచు చెంతకేగి యా
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు, పానము సేయ హలాహలమ్మునున్
బ్రహ్మను గూడి దేవతలు భర్గుని కోరిరి లోక రక్షకై.
గౌరి శుభదాయిని మది జగత్రయపు హి
రిప్లయితొలగించండితమ్ము గోరి పతినిఁ ద్రాగఁ, దలచి యిట్టు
లివ్వి షమ్ము మహా త్ముని నేమి సేయ
దజునిఁ గోరె, శివుఁడు హలాహలముఁ గ్రోల
జిహ్మగ దంత సంభవము సిక్కఁగఁ దద్ధవళాబ్ధిఁ జిల్కఁగా
జిహ్మ గతిం జెలంగి వడి ఛిన్నము కాఁగ జగమ్ములే పర
బ్రహ్మము దేవదేవుని సభక్తినిఁ గాంచఁగ దేవకోటి వే
బ్రహ్మనుఁ జీరె, శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిబ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్!
బ్రహ్మయు శంకరుండనెడి వ్యక్తులు మద్యము త్రాగనెంచగా
జిహ్మపు మైత్రి ముందుగ రుచిన్ గొన జూచిన శంకరుండటన్
బ్రహ్మను త్రోసి రాజనుచు వాసన జూడగ., వాదులాటలో
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్!
చీరెను.. .. కత్తితో చీల్చెను
బ్రహ్మ శంకరులు మిత్రులు గా భావించి, వారు మారుపేరున చెప్పే మాటలకు సరదాగా రాసిన పద్యం
రిప్లయితొలగించండిఉ:
బ్రహ్మయు శంకరుండ్లనగ రంగము జేసెడి సిద్ధ హస్తులే
బ్రాహ్మణు వండనే ర్చెనట వంటలు శంకరు త్రాగ నేర్వనై
బ్రహ్మ పదార్థమున్ గొనగ బావయొ వేగమె యంచు నాత్రమున్
బ్రహ్మను జీరె శంకరుడు పానము సేయ హలాహలమ్మునున్
వై. చంద్రశేఖర్
బ్రహ్మముఁజేరగారుషులుప్రాజ్ఞతఁజేసిరిధ్యానయోగమున్
రిప్లయితొలగించండిరహ్మినిపారలౌకికములాస్యముఁజేసెనుమానసంబునన్
అహ్మనునగ్నియేనికనునారెనుశంభునిఫాలమందునన్
బ్రహ్మనుఁజీరెశంకరుడుపానముసేయహలాహలమ్మునున్
తేటగీతి
రిప్లయితొలగించండివిషము పొంగంగ పార్వతి వేడుకొనఁగ
మేలుమేలంచుఁ బ్రజలకున్ గాలగతినిఁ,
దలఁచి మందరగిరి క్రింది దాసరయ్య
నజునిఁ, గోరె శివుఁడు హలాహలముఁ గ్రోల
ఉత్పలమాల
జిహ్మగ తాడుగా గిరినిఁ జేరిచి కవ్వమనంగ సోదరుల్
బహ్మరసమ్ముకై సిలుక పాలసముద్రమునందు పొంగగన్
జిహ్మ దశన్ జనించ నుమ చేకొన వేడఁగ, దొన్నె చేతితో
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు, పానము సేయ హలాహలమ్మునున్
(బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు = బ్రహ్మ ను పలకరించెనుశివుడు)
అహమది బ్రహ్మమగుమహీ
రిప్లయితొలగించండిరుహ బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సే
య హలాహలమ్మునున్ బహు
సహనులు మునులీవిధంబు సత్యము దెలియన్
క్షీర సాగరమందున సిరిని గూడి
రిప్లయితొలగించండియాదిశేషునిపైజేరె హరియు తాను
వాణి వదనమున సతము వాసముండ
నజుని గోరె,శివుడు హలాహలము గ్రోల
మంధరగిరిభార మది వీడగనురాదు
రిప్లయితొలగించండిమిగత పనులు జూడమేలు-హరియు
నజునిగోరె, శివుడు హలాహలము గ్రోల
గలుగు తాపమోప గలవనియెను!