8, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3481

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్" 

(లేదా...)
"పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై"

76 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    చరియించన్ పలు వీధులన్ మురియుచున్ జంబమ్ములన్ వీడుచున్
    కరముల్ మోడ్చుచు బీరునున్ ధనమునున్ గారాబుగా పంచగన్...
    వరమౌ భారత భూమినిన్ ప్రజలహో బంధించగా వోట్లతో
    పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై...

    రిప్లయితొలగించండి
  2. బరువౌ జీవితము గడపు
    పరతంత్రుల్; దీనజనుల పాలి సురతరుల్
    తరగని సంపద తోడను
    కరుణను నిండుగ మనమున గల్గినవారే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బరువౌ బ్రతుకు గడపెదరు పరతంత్రుల్..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను. 🙏🙏🙏

      తొలగించండి
    3. బరువౌ బ్రతుకు గడపెదరు
      పరతంత్రుల్; దీనజనుల పాలి సురతరుల్
      తరగని సంపద తోడను
      కరుణను నిండుగ మనమున గల్గినవారే

      తొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కలియుగ మంత్రము:

    సరియౌ తీరున దీనులే మెలగుచున్ సాపాటునున్ మానుచున్
    సురలన్ గొల్చుచు రాత్రులన్ పవలులన్ శోకించుచున్ లావుగా
    వరమౌ భక్తిని పాశరీతి గొనుచున్ బంధించగా వేల్పులన్
    పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై....

    రిప్లయితొలగించండి
  4. అద్భుతమైన సమస్య. తెనాలి రామకృష్ణుని స్ఫూర్తితో...

    "విరాటుడి దగ్గర తలదాచుకున్న పాండవులు ఆయన గోధనాన్ని రక్షించే సన్నివేశం.."

    మ||
    కురుసైన్యంబు విరాటరాజ్యమును కంక్షోభంబునన్ బెట్ట గో
    సిరులన్ బంధనజేయ పాండవులు నిక్షేపంబు రక్షింపనీ
    తెరనెత్తంగ ముహూర్తమిద్దెయననుత్తేజంబుతో పోరునీ
    పరతంత్రుల్ చరియింత్రు దీనజనకల్పక్ష్మాజ సాదృశ్యులై

    ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణకు చక్కని సన్నివేశాన్ని ఎన్నుకున్నారు. ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'గో సిరులు' దుష్టసమాసం.

      తొలగించండి
  5. 2వ పూరణ:

    మ||
    వరముల్ జిమ్ముచునైదువత్సరములవ్వన్ వీధులన్ నాయకుల్
    పరమప్రేమల జూపి 'ఫ్రీ' ధనము సంపాదించకే యిచ్చెడిన్
    తరుణోపాయముగా ప్రజావనరులన్ దాక్షిణ్యభావంబుతోన్
    పరతంత్రుల్ చరియింత్రు దీనజనకల్పక్ష్మాజ సాదృశ్యులై

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవ్వన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
  6. సమస్య :
    పరతంత్రుల్ చరియింత్రు దీనజనక
    ల్పక్ష్మాజసాదృశ్యులై

    (మానవతామహనీయులైన వారిని మనసారా అనుసరించేవారే దీనజనులకు
    కల్పతరువులుగా వరలుతారు )
    కర మాసక్తి తలిర్ప ధర్మజు, బలిన్,
    గర్ణున్, దధీచిన్,శిబిన్,
    షిరిడీనాథు, మహాత్మునిన్, రమణునిన్,
    శ్రీరామకృష్ణున్, మదర్
    థెరిసానిన్ మదినిండుగా దలచుచున్
    దేదీప్యధర్మజ్ఞతా
    పరతంత్రుల్ చరియింత్రు దీనజనక
    ల్పక్ష్మాజసాదృశ్యులై .
    ( మహాత్మునిన్ - గాంధీజీని ; ధర్మజ్ఞతా
    పరతంత్రులు- ధర్మమునకు లొంగినవారు)

    రిప్లయితొలగించండి
  7. 3వ పూరణ (వ్యంగ్యం/ఆధ్యాత్మికము) :

    అరిషడ్వర్గములు
    మనిషిని తినేస్తూ వాని దేహం మీద ఆధారపడుతూ వానికే ఉపయోగపడుతున్నాయని మనసుని నమ్మిస్తాయి, ఆనందింపజేస్తాయి.

    మ||
    అరిషడ్వర్గములెప్పుడున్ మనసునందానందమున్ గూర్చుచున్
    నరులన్ నిర్దయతన్ నిరాశగతతృష్ణాత్మావిధిన్ భోగతన్
    విరియన్ తోడ్పడు దేహభోక్తులగుచున్, ఠీవిన్ ప్రదర్శించుచున్,
    పరతంత్రుల్ చరియింత్రు దీనజనకల్పక్ష్మాజ సాదృశ్యులై

    ఆదిపూడి రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి


  8. అరయగ జిలేబి వలదా
    పరతంత్రులు; దీనజనుల పాలి సురతరుల్
    గురుతరముగ నా మంచిని
    నిరతము చేయంగ నెంచు నిర్మల హృదయుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. రిప్లయిలు
    1. పద్యము వ్రాయ జాలుటొక ప్రాభవమా! గుదిఁగ్రుచ్చి శబ్దముల్
      చోద్యము లట్లు వృత్తమునఁ జొప్పడు నట్లుగఁ జేయ, సౌహృదా
      వేద్యములౌనటుల్ సరసబీజము నాటుచు గుండెపాదులో
      పద్యముఁ బాతిపెట్టఁగలవారి పదంబుల కేను మ్రొక్కెదన్

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. తరమే మిమ్ము నుతించ నేరికి బలీంద్రా! హరిశ్చంద్రభూ
    వర! కర్ణా! సకలమ్ము నర్థిసుజనస్వాధీనముం జేసి మీ
    మరణంబైన గణించఁ బూనితిరొ! ధర్మాచారదీనార్తహృ
    త్పరతంత్రుల్ చరియింత్రు దీనజనకల్పక్ష్మాజ సాదృశ్యులై

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సరియగు సౌష్ఠవ మొందరు
    పరతంత్రులు; దీనజనుల పాలి సురతరుల్
    కరుణను గల్గుచు నిరతము
    చరియింతురు తోడుగాను చక్కని తీరున్.

    రిప్లయితొలగించండి
  12. మరువకు భగవన్నామము
    నరుకకు తరుజాతి నెపుడు నరుడా వినుమా
    ధరణిని బ్రోచెడు దీక్షా
    పరతంత్రులు దీన జనులపాలి సురతరుల్.

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సరియగు సౌష్ఠవ మిచ్చుచు
    కరుణను తోడ్పగ నుండి ఘనతత్త్వమునన్
    నిరతము సాగెడి దీక్షా
    పరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్.

    రిప్లయితొలగించండి
  14. చిరు నవ్వనునది మరతురు
    పర తంత్రులు : దీన జనుల పాలి సుర తరుల్
    నిరతము జనతతి సేమము
    లరయుచు శ్రమి యించు వార లవనిని తలప న్

    రిప్లయితొలగించండి
  15. మరుగున పాండవు లుండగ
    విరటుని కొల్వునను తాము వీరత పశులన్
    కురువీరులు పట్ట గెలిచె
    పరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్

    రిప్లయితొలగించండి
  16. నిరతిగ రోగుల పాలిట
    వరమైసేవించువారువైద్యులు వారల్
    నిరతము విధినిర్వవహణ
    పరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "విధి నిర్వహణా పరతంత్రులు..." అనండి.

      తొలగించండి
  17. గురువుల పెద్దల మాటలు
    నరయుచు విశ్వాసమూని ననవరతంబున్
    కరుణను చూపెడు దీక్షా
    పరతంత్రులు దీనజనులపాలిసురతరుల్

    రిప్లయితొలగించండి


  18. తిరమై బానిస లన్న భావనయె బంధింపంగ కల్మాషులై
    పరతంత్రుల్ చరియింత్రు; దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై
    వరమై మోహన దాసు గాంధివలె వాక్స్వాతంత్ర్యమున్ కోరి ని
    బ్బరికమ్మున్, దృఢమైన నమ్మకముతో స్వాతంత్ర్యులే చేర్తురౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. నిన్నటి పూరణ


    సద్యశ సాంద్రుడాదికవి చంద్రుడు వాల్మికి, నన్నయాదులున్
    హృద్యత పద్యసత్కృతుల నల్లిన రీతి చమత్కృతుల్ తగన్
    చోద్యముగా నవాకృతులు శోభిల శారద పాదపీఠికన్
    పద్యము బాతిపెట్టగలవారి పదంబుల కేను మ్రొక్కెదన్

    రిప్లయితొలగించండి
  20. మైలవరపు వారి పూరణ

    సరసస్వాంతులు భారతీపదనవాబ్జశ్రీసమారాధకుల్
    కరుణామూర్తులు స్వీయవైణికకళాకార్యక్రమప్రాప్తమౌ
    వరవిత్తమ్మునుదారతన్ బరులకై పంచన్ సదా రాగత...
    త్పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కరుణన్ గూడిన పోడిమిన్ చెలగుచున్ కార్యమ్ములన్నింటిని
    న్నొరవౌ తీరున చక్కజేయుచు సదా యుక్తమ్మునౌ పద్ధతిన్
    పరిహారమ్ములు సంఘటించు నటులన్ వాటైన విన్నాణమున్
    పరతంత్రుల్ చరియింత్రు దీనజనకల్పక్ష్మాజ సాదృశ్యులై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరుణన్ గూడిన పోడిమిన్ చెలగుచున్ కార్యమ్ములన్నింటిని
      న్నొరవౌ తీరున చక్కజేయుచు సదా యుక్తమ్మునౌ పద్ధతిన్
      పరిహారమ్ములు సంఘటించు నటులన్ వాటైన ధర్మార్ధులౌ
      పరతంత్రుల్ చరియింత్రు దీనజనకల్పక్ష్మాజ సాదృశ్యులై

      తొలగించండి
  22. కె.వి.యస్. లక్ష్మి:
    గురువుగారికి నమస్కారములు. నిన్నటి పూరణను పరిశీలించగలరు.

    పద్యప్రాభవ మెఱుగక
    హృద్యమ్మగు పద్యమందు నేర్పుయె లేకన్
    చోద్యమ్ముగ వాసెడిదౌ
    పద్యమ్మును బాతిపెట్టు వారలకు నతుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నేర్పు+ఎ' అన్నపుడు యడాగమం రాదు. "నేర్పే లేకే" అనండి.

      తొలగించండి
  23. ధరపై జన్మకు సార్థకమ్ముగొన నుత్సాహమ్ముతో నిత్యమున్
    హరిఁ బ్రార్థించుచు భక్తితో ధనముపై నాసక్తి వర్జించుచున్
    కరుణన్ జూపుచు తోటి మానవులపై కార్యా ర్థులై శౌరికిన్
    పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై

    రిప్లయితొలగించండి
  24. [08/09, 08:57] PKSKumar: ఈ నాటి శంకరాభరణం వారి సమస్య

    పరతంత్రులు దీనజనులపాలి సురతరుల్

    ఇచ్చిన పాదము కందము

    నా పూరణ సీసములో



    భార్యను కోల్పోయి ప్రాణభయమ్ముతో
    ఋష్యమూకమ్ముపై సృకము పీల్చు

    కొనుచు నేనిచ్చోట మనుగడ
    సాగించు చుంటిని, నితనితో నంటు నేను

    సల్పి నే రీతిన సాయము నాతని
    కిన్జేయ గలను, వేగి తన యుండ,

    తరచి చూడగ పర తంత్రులు దీనజ
    నులపాలి సురతరుల్ ,చెలిమి చేయ


    కలుగు మేలనుచున్ నీవు పలుకు చుంటి

    వి ,హనుమా తెలియ పరచు వివరములను

    రయముగ నని సుగ్రీవుడు రామ చంద్రు

    నెదుట హనుమంతు నడిగెను నెమ్మి తోడ.





    (హనుమంతుడు సుగ్రీవునితో రామ చంద్రుడు భార్యను కోల్పోయి వచ్చాడు అతనితో చెలిమి చేసి అతనికి సాయము చేసిన అతను నీకు సాయ పడ గలడు అని చెప్పినప్పుడు సుగ్రీవుడు హనుమంతుని తో పలుకు సందర్భంల
    నంటు = స్నేహం

    వేగి తనయుడు = హనుమంతుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద్యంపై నా సమీక్షను వాట్సప్ లో చూడండి.

      తొలగించండి
  25. ఒరులను హింసించక మరి
    యరిషడ్వర్గమును బాసి యానందమునే
    కురిపించెడు నా దీక్షా
    పరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్.

    🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  26. పరులే దిక్కని వేడుకొంచు నిరతంబాలంబనన్ గోరుచున్
    పరతంత్రుల్ చరియింత్రు; దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై
    పరసేవామతులై చరింత్రు దలపన్ స్వఛ్ఛందు లాత్మజ్ఞులై
    వరమౌ మానవ సేవటంచదియె సౌభాగ్యంబుగా నెంచుచున్

    రిప్లయితొలగించండి
  27. స్థిరమతి తోడుతఁ నీ శం
    కరులే పూరణలపేర కబ్బము లొసగన్
    మరతురె, కవులీ దీక్షా
    పరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్

    రిప్లయితొలగించండి
  28. *రావణునితో విభీషణుని మాటలు గానూహించి*
    సరికాదంటిని యగ్రజా విడుమ భూజాతన్ మహా సాధ్వినిన్
    శరణంబంచును కోరు రాఘవుని యా సత్యవ్రతున్ శీఘ్రమే
    కరుణా సాగరుడంద్రు లోకులతనిన్ కల్పమ్ములో ధర్రత
    త్పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై.

    రిప్లయితొలగించండి
  29. సుర తుల్య తపస్సంప
    న్న రమాధవ నామ చింతనా రత హృదయుల్
    పరమంపు యోగ విద్యా
    పరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్


    వర భక్త వ్రజ మానసాబ్జముల నా పద్మాక్షుఁ డాయత్తుఁడై
    నిరతం బుండఁగ విష్ణు భక్తవర సాన్నిధ్యమ్ము మేల్సేయదే
    హరినామస్మర ణైక వర్తనులు ధ్యాయచ్ఛంఖభృచ్చింతనా
    పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై

    రిప్లయితొలగించండి
  30. పరధనమునునాశింతురు
    పరతంత్రులు,దీనజనులపాలితసురతరుల్
    కరమునునుపకృతిజేసెడు
    నరశ్రేష్ఠులుదాముభువికి నాయకులయ్యున్

    రిప్లయితొలగించండి
  31. కందం
    సురకోటి జగన్మాతకు
    నిరతము పాదాలనుండి నెగడెడు వారల్
    హరుడున్ బ్రహ్మోపేంద్రులుఁ
    బరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్

    మత్తేభవిక్రీడితము
    కరుణాపూరిత దృక్కులన్ జగములన్ గావన్ జగన్మాతయే
    మురిపింపన్ దగ సేవలన్ హరుడు బహ్మోపేంద్రులర్చింపరే
    నిరతమ్మా వరదాయినిన్ జనులు మన్నింపంగ స్తోత్రాళిఁ ద
    త్పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై

    రిప్లయితొలగించండి
  32. నిరతంబాశ్రయమొందుచున్బరునిదానెవ్వారినైనన్భువిన్
    పరతంత్రుల్ చరియింత్రు,దీనజనకల్పక్షాజసాదృశ్యులై
    కరమున్సేవనుజేతురార్యనయనాగారమ్ముతోనెప్పుడున్
    బరసేవమ్మునసౌఖ్యముంగలుగునెప్పట్టున్దగన్జూచినన్

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. కొద్ది మార్పు తో..

      గుడిలో పూజారి భగవంతుని పరాధీనుడు. వారిచ్చే దీవెనపై భక్తుడి భావన:

      మ:

      కరముల్ మోడిచి సన్నుతింప నిడ భాగ్యంబుల్ మహాభోగముల్
      వరముల్ బొందగ నిచ్చె దీవెనలు దేవాజీవి తా వేలుపై
      మొరలన్ దెల్పెడి మాధ్యమమ్ము ననగా మోదమ్ముతో మ్రొక్కితిన్
      పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  34. నిరతంబెల్లజనాళి సేమములనున్ నెమ్మిన్ సమీక్షించుచున్
    వరమైదీనుల నాదుకొంచుదయతో వాత్సల్యమున్ చూపుచున్
    నిరతిన్ వైద్యమె జీవనమ్మనుచు సన్మిత్రిన్ జనోద్ధారణా
    పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై

    రిప్లయితొలగించండి
  35. అరిషడ్వర్గపుబలిమిని
    *పరతంత్రులు ;దీనజనుల పాలి సురతరుల్*
    పరులనుతనవలెనెరుగుచు
    పరహితమైజీవితంబుబంచెడుపురుషుల్

    రిప్లయితొలగించండి
  36. పరమార్థంబెరుగంగగంగతరువుల్వార్ముక్కుధర్మజ్ఞులున్
    పరమోదారదధీచికర్ణశిబియున్బ్రహ్మాండమేభేష్షనన్
    హరికిన్లోకములంటగట్టెబలిదేత్యాగంబుధర్మజ్ఞతా
    *పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై*

    రిప్లయితొలగించండి