కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి"
(లేదా...)
"ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి"
(లేదా...)
"ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్"
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
బలుపౌ రీతిని శ్రద్ధనున్ గొనుచునా వారాణసిన్ జేరుచున్
తలనున్ ముంచుచు చేతులన్ కడుగుచున్ తాదాత్మ్యతన్ బొందుచున్
కలశమ్మందున గంగతీర్థములతో గండమ్ములన్ తీర్చుటన్
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్
ఖలుడు = సూర్యుడు (ఆంధ్రభారతి)
తొలగించండి* తాదాత్మ్యమున్
మీ సరదా పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండి🙏
తొలగించండిఆరు గ్రహము లొకచొ ననువగు చోటున
రిప్లయితొలగించండిరాశులందు మెరియ రమ్యముగను
అందు లోనముఖ్యు డగునట్టి తేజుడు
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి!!
***ఖలుడు= సూర్యుడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...గ్రహము లొకట... మెరయ..." అనండి.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ఖలుడే నిల్వగ పార్లమెంటు పదవిన్, గగ్గోలునున్ జేయుచున్
విలపించంగను భామలున్ పురుషులున్, వీరుండునై దీటుగా
తలనున్ త్రుంచుచు నెన్నికన్ బలుపుగా దండించి యోడించెడిన్
ఖలునిం; గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిఈ నాటి శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండిఖలుని గొల్చు వాడె కనును ముక్తి
ఇచ్చిన సమస్య. ఆట వెలది దానిని తేట గీత కు మార్చి నా పూరణ
ఖలుడు అనగా మూర్ఖుడు అని అసలు అర్ధము
సూర్యుడు అని అర్ధం కూడా కలదు
ఆది వారమున గ్రహము లారు స్వంత
క్షేత్రములలోన తిరుగాడు, చిత్ర మైన
గ్రహ గమనమన గ్రహరాజు ఖలుని గొల్చు
వాడె కనును ముక్తి నిజమౌ వసుధ లోన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసకల ప్రాణులకు వలయు శక్తి నిచ్చి
రిప్లయితొలగించండిజీవి జడతను వదిలించి చేతనమును
కలుగజేయుచు నారోగ్య కారకుడగు
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి
ఖలుడు = సూర్యుడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏🏽
తొలగించండిక్షమించండి . ఇచ్చింది ఆటవెలది పాదమైతే తేటగీతి యనుకొని పూరించాను. సవరిస్తాను
తొలగించండి( భాస్కరస్తుతి )
రిప్లయితొలగించండివేయికిరణములను వెలుగొందు స్వామియే
యేకచక్రరథము నెక్కి వచ్చె ;
జగము మేలుకొల్పు సప్తాశ్వు ; రవి ; విశృం
ఖలుని గొల్చువాడె కనును ముక్తి .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆధ్యాత్మిక పూరణ:
రిప్లయితొలగించండిమ||
సులువే నీ పదపంకజద్వయము సంక్షోభాత్ములై నిన్ గనన్?
పలు విద్యాదితపోబలప్రకటితప్రాబల్యశక్త్యాదులన్
ఫలిలంబౌ రసరమ్యమౌ ద్రవముతో వ్రాయంగ చిత్ఘంట లే
ఖలు నిం గొల్చినవాడె యర్హుడగు మోక్షంబందగా నిచ్చెలున్
విరుపు: లేఖలు
ఆదిపూడి రోహిత్
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో కొంత అన్వయదోషం. "సంక్షోభాత్ములై గన్గొనన్" అనండి. 'చిద్ఘంట' అని ఉండాలి.
ప్రాగ్దిశాద్రులందు ప్రభవించు దైవము
రిప్లయితొలగించండితిముర రిపుడు వాడు దివస కరుడు
కశ్యపాత్మజుండు కరుమపు సాకిరి
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"తిమిర రిపువు..." అనండి.
గుడి రధమును కూల్చ గొడవను సేయంగ
రిప్లయితొలగించండిచర్చి గొడవ పెట్టి జైలు కంపె
మంచి చేయ నేడు మనసు పడగ రాదు
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిచెలగన్ జేతిని వెన్నముద్ద., మెడలో చెంగల్వపూదండ., గం...
టలుమ్రోగన్ మొలత్రాడు.,దట్టి గన పట్టై శోభలీనంగ , ము
వ్వల గజ్జెల్ రవళించు బాలకుని గోపాలున్ లసత్కట్యులూ..
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికనులకు కనబడెడి కమనీయ దైవమై
గ్రహములకు దొరయగు ఘనత నొంది
సకలజీవులకిల స్వస్థత గూర్చెడి
ఖలుని గొల్చువాడె కనును ముక్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితలపై గంగను గంఠ మందు రగమున్ తారాధిపున్ జూటమున్
రిప్లయితొలగించండిహలహాలమ్ము గళమ్ములో తనదు దేహార్థమ్ము నన్ శక్తినిన్
గల కామారి, యయుగ్మ నేత్రుడగు పింగాక్షున్ గపర్తిన్ విశృం
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిజిలుగుల్ జిమ్ముచు నంబుదాయనమునన్ చెన్నొందు దేవుండునై
ఇలలో ప్రాణులకెల్ల తిన్నదనమున్నీయంగగా మించుచున్
పొలుపౌ గాములనెల్ల నేలు దొరయై ప్రోథమ్ముతో సాగునౌ
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగురువుగారికి నమస్కారములు.
తొలగించండిగగన మందు వెల్గి కాంతి పుంజ ములను
రిప్లయితొలగించండిజీవ కోటి కొసగి చేవ నింపు
కర్మ సాక్షి యగుచు కనిపించు వాడైన
ఖలుని గొల్చు వాడె కనును ముక్తి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచెలులం గూడి వ్రజాంగనాగృహములన్ చెన్నారు బాల్యమ్ము సొ
రిప్లయితొలగించండిపొలయం బాలను వెన్ననున్ బెరుగు మాయోపాయచోరుండు మ్రు
చ్చిలె, సృష్టిస్థితికర్త కేలఁ దగెనో!, చిద్బద్ధవిభ్రాజ్యు లూ
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్.
కంజర్ల రామాచార్య
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపాలసంద్రమందు పవళించి యుండెడి
రిప్లయితొలగించండిపన్నగశయనుండు పావనుండు
గరుడ వాహనుండు ధరణీభృతుడు విశృం
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి
సవరణతో
రిప్లయితొలగించండిసకల జీవులకును శక్తి నొసగువాడు
జీవి జడత జావ జేయు వాడు
జగతి నందు జనుల స్వాస్థ్య కారకుడగు
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి
విశ్వమంతకునెఱివెలుగునుగలిగించు
రిప్లయితొలగించండిఖలునిగొల్చువాడెకనునుముక్తి
ముక్తియనగదెలియురక్తిలేమిభువిని
బంధనంబునుండివైదొలంగు
ఆటవెలది
రిప్లయితొలగించండితండ్రినామ జపముఁ దాల్చఁ బ్రహ్లాదుని
గురులుఁ బల్కి నంత నరసి, యనియె
జగములేలుతండ్రి జలజాక్షు శౌరి ని
ష్ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి
మత్తేభవిక్రీడితము
పలుకన్ నేర్చుము తండ్రి నామ జపమున్ బ్రహ్లాద! సేమంబనన్
దొలుకన్ జూడక యన్యమా గురులతో నోరార నిట్లాడెనే
జలజాక్షున్ జగమేలు తండ్రి హరినిన్ సర్వేశ్వరున్ బ్రీతి ని
ష్ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిఆదివారమందు నాదిత్య హృదయమ్ము
ససిని గూడ నెంచి చక్కనైన
భక్తితో నినుపగు పద్ధతినెంచుచు
ఖలుని గొల్చు వాడె కనును ముక్తి.
తలపన్ పాపము మూట గట్టుకొనునా దౌర్భాగ్యునా రావణున్
రిప్లయితొలగించండిఖలునిం గొల్చినవాఁడె; యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్
విలువౌ తారక రామ మంత్ర మహిమన్ వేద్యంబుగా నెంచుచున్
చెలువౌ రాముని పాద పంకజములన్ సేవింప నిత్యంబిలన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభళిరాయేమనియంటిమీరిచటయీకాయంపుమోక్షమ్ముకై
రిప్లయితొలగించండిఖలునింగొల్చినవాడెయర్హుడగు,మోక్షంబందగానిచ్చటన్
గలకాలంబునుసేవజేయవలెనాకామాక్షిపాదాలకున్
ఖలునింగొల్చినవానికిన్భువినిమోక్షంబందవీలుండునౌ
ఖలుడు=సూర్యుడు
రిప్లయితొలగించండిభృశ శిరో మయూర పింఛ భాసితు భక్తు
రిప్లయితొలగించండిలార చిన్ని కృష్ణు శార దాంబు
ద నిభ వర్ణ దేహుఁ దప్త సువర్ణ మే
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి
ఇలకున్ భారము తీర్చ నెంచి తగ విశ్వేశుండు విష్ణుండు భూ
వలయం బందు నరాకృతిం దిరుగుచున్ భాసిల్లఁగా సంతతం
బలపే లేకయు నిర్మలాత్మను ని జాంబా నిర్దయా ప్రా గులూ
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్
పద్మబాంధవుండు భాస్కరుడాతఁడు
రిప్లయితొలగించండిజీవకోటికెల్లజీవమతఁడు
వసుధయందుదాను ప్రత్యక్ష దైవము
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి
ప్రొద్దునకనిపించుపూర్వాశబ్రహ్మమై
రిప్లయితొలగించండిపగటివేళతానెపరమశివుడు
నపరసంధ్యతానుహరియైవెలుగిడెడు
ఖలునిఁగొల్చువాఁడెకనునుముక్తి
గు రు మూ ర్తి ఆ చా రి -- వె లు గో డు
రిప్లయితొలగించండిఅంధకార మెల్ల నంతము గావించి ,
సర్వజీవ తతికి శక్తి నొసగి ,
పాలనమ్ము సలుపు ప్రత్యక్షదైవమౌ
ఖలుని గొల్చు వాడె కాంచు ముక్తి |
{ ఖలుడు = సూర్యడు }
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిలువౌ జీవనయానమున్ మనసునుద్వేగమ్ము పోనాడుచున్
రిప్లయితొలగించండిపలుకార్యమ్ముల పేదవారలకు సౌభాగ్యమ్మునందించుచున్
తలపందున్ హరి నిల్పిసంతతము నుత్సాహమ్ముతోనా విశృం
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్
మ:
రిప్లయితొలగించండినిలువన్ జాలడె చెంగుచెంగుమన తన్నెంచంగ నామాత్యుగా
పలుమారుల్ చెరసాల కేగినను నింపాదిన్నుపేక్షించిరే
వలదన్నన్ మరి తప్పదింక విఠలా వ్యాపారముల్ సాగుటన్
ఖలునిన్ గొల్చిన వాడె యర్హుడగు మోక్షం బందగా నిచ్చలున్
విఠలా=దేవుణ్ణి తలచడం
వై. చంద్రశేఖర్
ఆదివార మందు ఆదిత్య హృదయమున్
రిప్లయితొలగించండివదలక పఠియించి వాసి గాను
భక్తి భావమూని భజనల తోడను
ఖలుని గొల్చువాడు కనును ముక్తి.