17, సెప్టెంబర్ 2020, గురువారం

సమస్య - 3489

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశనెపుడున్"

 (లేదా...)
"దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ"

41 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  "మా భారతము"

  నష్టపు బుద్ధులన్ గొనుచు నందన మొందుచు ధుష్కృతమ్ములౌ
  చేష్టల నేర్చి యాదటను చెన్నుగ జ్ఞాతుల హింసపెట్టుచున్
  కష్టము లిచ్చి కానలను; కాలుని జేరగ యుద్ధమందునన్
  దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ

  రిప్లయితొలగించండి

 2. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఇష్టపు వేల్పులన్ గొలిచి హిందుల క్రైస్తుల మ్లేచ్ఛులందునన్
  సుష్టుగ బీరులన్ పఱచి సుందర రీతిని నేతయై కడన్
  పుష్టిగ మేపుచున్ ధనము ముద్దుగ కాలుని భృత్యసంతతిన్
  దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ

  రిప్లయితొలగించండి
 3. ఉ||
  కష్టములెన్నియోగలుగ కార్యమునందున చిత్తశుద్ధితో
  నిష్ట ధరించుచున్ నియమనిగ్రహముల్ జతజేసి గూర్చెడిన్
  వ్యష్టి సమిష్టికై బ్రతుకు బాటను బోయెడు సన్మతిట్లు ని
  ర్దుష్టుడు, సర్వలోకముల దుర్దశనొందకదృష్టవంతుడౌ

  ఆదిపూడి రోహిత్ శర్మ 🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 4. సమస్య :
  దుష్టుడు సర్వలోకముల
  దుర్దశ నొంద కదృష్టవంతుడౌ

  ( దుష్టుడు - శిష్టుడు )
  శిష్టుల నెల్ల బాధలను
  ఛిద్రము జేసిన గష్టముల్ బడున్
  దుష్టుడు సర్వలోకముల ;
  దుర్దశ నొంద కదృష్టవంతుడౌ
  శిష్టుడు జీవితమ్మునను
  జిన్మయమూర్తిగ మార్గదాయియై
  యిష్టముతోడ ధర్మమతి
  నెప్పుడు బాయక సంచరించినన్ .
  (ఛిద్రము -చిదుముట ; చిన్మయమూర్తి-
  జ్ఞానమూర్తి )

  రిప్లయితొలగించండి
 5. ఇష్టముగా నార్తులకును
  కష్టములెన్నైననోర్చి కర్ణుడుగుడపన్
  మృష్టాన్న భోజనఫలము
  దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశనెపుడున్

  రిప్లయితొలగించండి
 6. గురువు గారికి నమస్కారం
  🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
  నేటి సమస్యకు నా పూరణ ప్రయత్నం
  ~~~~~~~~~~~~~~~~~~~
  దుష్టుఁడుపరమందుగనఁడుదుర్దశనెపుడున్
  ~~~~~~~~~~~~~~~~~~~
  కందం:
  ~~~~~~
  ఇష్టానిష్టములఁవిడచి
  సృష్టించినకావ్యమెల్లచీకటిఁజీల్చన్
  శిష్టుండౌసుకవితెలిపెఁ
  దుష్టుఁడుపరమందుగనఁడుదుర్దశనెపుడున్

  తెలిపెన్+తుష్టుఁడు=తెలిపెఁదుష్టుఁడు
  పై పాదాలు కవికి విశేషణంగా ....కవి తెలిపిన మాట "తుష్టుఁడు" ఎటువంటి దుర్దశ గనఁడు అని.
  తుష్టుఁడు భగవంతుడు తనకు ఇచ్చిన వాటితో ఆనందం గా ఉంటాడు.
  *ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్*
  గనుక అతడికి దుర్దశ లేదు.
  .........✍ *బోరెల్లి హర్ష*
  కర్నూలు

  రిప్లయితొలగించండి
 7. దుష్టున కెన్నడైననిల దుర్దశ తథ్యము తథ్యమే సుమా !
  క్లిష్టము గూర్చి శిష్టజన క్లేశము జూడగ నెంచు పాపియై
  భ్రష్టుడు నైన నా శివుని పాదము లంటగ తక్షణంబు నా
  దుష్టుడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుడౌ

  రిప్లయితొలగించండి
 8. కష్టముల కుములు వారల
  నిష్టముగా కాచి వారి నెంతయు కావన్
  తుష్టిని పొందును దైవము
  దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశనెపుడున్

  రిప్లయితొలగించండి
 9. కష్టముననున్నవారికి
  శిష్టులకాతండురక్షచేయుచునుండున్
  దృష్టుండగుదుర్జనులకు
  దుష్టుఁడు, పరమందు గనఁడు దుర్దశనెపుడున్

  రిప్లయితొలగించండి
 10. శిష్టులకెల్లవేళలను చింతను కూర్చిన పొందుహా నియున్
  దుష్టుడు,సర్వలోకముల దుర్దశ నొందకదృష్టవం తుడౌ
  తుష్టిగమూడుపొద్దులునుతోయజనాభునికొల్చువా డిలన్
  కష్టము లొందకన్ మదినికంజద ళాక్షుని దీవెనందుచున్

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ

  శిష్టగుణాన్వితుండు.. విధుశేఖర
  పాదనిరంతరార్చనా
  పుష్టియుతుండు., మాతృపితృమోదకరుండు.,పురాణశాస్త్రధీ...
  వేష్టితుడార్షసంస్కృతిపవిత్రుడు., నిత్యనిమిత్తచర్యలం
  దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ!

  (చర్యలన్+తుష్టుడు)

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 12. కందం
  ఇష్టమ్ముగ హరిఁ జేరఁగ
  శిష్టులఁ గష్టాల పాలు చేసెడు జన్మన్
  దుష్టిని గొనె లంకేశుఁడు
  దుష్టుడు,పరమందు గనఁడు దుర్దశనెపుడున్

  రిప్లయితొలగించండి
 13. కష్టము సద్యశ మందుట
  దుష్టుడు : పరమందు గనడు దుర్దశ నెపుడున్
  శిష్టుడు సత్కృత్యుడయి వి
  శిష్టుం డై నెగడు చుండ చిత్తంబల రన్

  రిప్లయితొలగించండి
 14. శిష్టులగు శిష్య గణమది
  ప్రష్టుడగు గురువు నడుగగ పావనుడౌ యా
  ధృష్టువు కూర్మిన చెప్పెన్
  దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశనెపుడున్

  రిప్లయితొలగించండి
 15. ఇష్టముతోడ నిత్యము మహేశునిఁ గొల్చుచు, పేదవారికిన్
  కష్టములందు నెప్డు సహకార మొసంగుచు శుద్ధబుద్ధితో,
  శిష్టుల గౌరవించుచును, సేవల వృద్ధులఁ బ్రోచుటందునన్
  దుష్టుఁడు, సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ

  రిప్లయితొలగించండి
 16. తుష్టుగ బాపము జేసిన
  దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశనెపుడున్
  పుష్టిగ నీ యిహమందే
  కష్టము ల ననుభ వమొంద గానమె
  సృష్టిన్

  రిప్లయితొలగించండి
 17. కష్టసుఖమ్ముల లోపల
  దృష్టిని సమముగ నిలుపుచు దిరముగ హరి ని
  ర్దిష్టముగ గొల్చు హృదినన్
  దుష్టుడు పరమందు గనడు దుర్గశ నెపుడున్

  రిప్లయితొలగించండి
 18. భ్రష్టత గను నిహ పరముల
  దుష్టుఁడు; పరమందు గనఁడు దుర్దశనెపుడున్
  శిష్టుడు ధర్మము దప్పక
  దృష్టి నిలిపి దైవమందదృష్టము నొందున్

  రిప్లయితొలగించండి
 19. విష్టప మేలువాడిని విభిన్నుని ముమ్మొన వాలు దాల్పునిన్
  బుష్టిగ నమ్మి కొల్చినను భూరి యనుగ్రహ మిచ్చునంచు నా
  ప్రష్టుడు చెప్పెనిట్టుల సభాసదు లెల్లరు మెచ్చి భేషనన్
  దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ
  . . (భేషనన్ తుష్టుడు......భేషనన్ దుష్టుడు)

  రిప్లయితొలగించండి
 20. ఇష్టపుమాటలెయీయవి
  దుష్టుడుపరమందుగనడుదుర్దశనెపుడున్
  దుష్టుండిహమందునెనిక
  భ్రష్టుడుగామారిపొందువంతలుమిగులన్

  రిప్లయితొలగించండి

 21. పిన్నక నాగేశ్వరరావు.

  కష్టముల ననుభవించును
  దుష్టుడు; పరమందు గనడు దుర్దశ
  నెపుడున్
  శిష్టుడు సద్భావనతో
  నిష్టగ దైవమును గొల్వ నిశ్చల భక్తిన్.

  రిప్లయితొలగించండి
 22. ఇష్టపడున్ సతంబుగననీశ్వరునన్నిచరాచరంబులన్
  కష్టములందునాదుకొనుకామితముల్ నెరవేర్చు నర్థికిన్
  శిష్టజనాళికాతడువిశిష్టసఖుండు,దురాత్ములైనచో
  దుష్టుఁడు, సర్వలోకముల దుర్దశనొంద కదృష్ట వంతుఁడౌ

  రిప్లయితొలగించండి
 23. ఉత్పలమాల
  శిష్టులమైన మమ్ము హరి సేవకుఁ బంపని ద్వారపాలకుల్
  దుష్టులుగా జనింతురని దూషణఁ జేయఁగ మౌనివర్యులున్
  గ్లిష్టతఁ బాప శ్రీహరియె ప్రేరణ నీయఁగ జన్మమెత్తెడున్
  దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ!

  రిప్లయితొలగించండి
 24. కష్టము లెరుగని మనుజుడు
  ఇష్టముగా యెన్నొ పనుల నిక్కము గెలువన్
  స్పష్టము గర్వము బడసిన
  దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశనెపుడున్!!

  రిప్లయితొలగించండి
 25. వింతగనున్నదీపలుకు వేదనతోమది విన్నబోయె ని
  ర్ఘాంతహృదంతరాళపరిఘట్టనదుఃఖము మిన్నునంటె ది
  గ్భ్రాంతులజేసియెల్లరనుభావజుగూరిచి యాతడిట్లనెన్ :
  "కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై"

  రిప్లయితొలగించండి
 26. దుష్టుడుసర్వలోకములదుర్దశనొందకదృష్టవంతుడౌ
  దుష్టునకంటునేజెపుమదుర్దశశంకరుభక్తుడైనచో
  గష్టములెన్నివచ్చిననుగల్మషకంఠుడురక్షజేయుగా
  దుష్టుడుమంచివాడునయితోరపుభక్తినదృష్టవంతుడే

  రిప్లయితొలగించండి
 27. కష్టసుఖమ్ములన్ సమముగా మదిభావన జేయగల్గి ని
  ర్దిష్టముగా మురారిని వరేణ్యుని గొల్చుచు బ్రహ్మభావనా
  దృష్టిని సర్వమున్నతని దివ్య కళామయమంచు దల్చెడిన్
  దుష్టుడు సర్వలోకముల దుర్దశనొంద
  కదృష్టవంతుడౌ

  రిప్లయితొలగించండి
 28. కష్టము బలవంతు నణఁచఁ
  గాష్ఠమ్మున మండు వఱకుఁ గలుగు పరులకున్
  నష్టము ముంచు నితరులన్
  దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశ నెపుడున్

  [పర మందు = ముంచిన పిమ్మట]
  డ-ఢ ప్రాస వలె ట-ఠ ప్రాస ప్రయోగము!

  పాఠాంతరము:
  కష్టము బలవంతు నణఁచఁ
  గృష్ట మగు వఱ కడరి కలిగించుఁ బరులకున్
  నష్టము ముంచు నితరులన్
  దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశ నెపుడున్


  స్పష్టమ యంత్య కాలమునఁ బద్మదలాక్షుని నేర కైనఁ దా
  నిష్టము లేక తల్చిన నహీన ఫలమ్మిడు విష్ణు నామమే
  దృష్టము విష్ణు నామ ఘన తేజ మహో వినమే యజామిళున్
  దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ

  రిప్లయితొలగించండి
 29. ట్విష్టుగ వచ్చె కరోనా
  టెష్టులపేరున దునిమిరి టెకునిక్కుల పా
  పిష్టులు జనులేమాఱగ
  దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశనెపుడున్ ??

  రిప్లయితొలగించండి
 30. కష్టము లెన్ని యేనియు చికాకును జూపక ధైర్యవంతుడై
  శిష్టుల బ్రోచు కార్యమును జేకొని పోరెడి నాత డెట్టులౌ
  దుష్టుడు? సర్వలోకముల దుర్దశ నొంద కదృష్టవంతుడౌ!
  యిష్టుడ టంచు నెల్లరు వహింతురు ప్రేమగ నా మనీషినిన్

  రిప్లయితొలగించండి
 31. సృష్టిని స్పష్టమయ్యె మనసే మనకిష్ట మనిష్ట మిచ్చు సం
  క్లిష్టము పుష్టి తుష్టియు వరిష్టము శ్రేష్టుల కిష్ట పూర్తి సం
  శ్లిష్టము తుష్టి సద్గుణమె శిష్ట ధనం బనివార్య వాంఛలం
  దుష్టుఁడు సర్వలోకముల దుర్దశ నొంద కదృష్ట వంతుఁడౌ

  రిప్లయితొలగించండి
 32. ఉ:

  దుష్టుని జేర నిల్వ సరి తూగదటంచన లోకులెల్ల రున్
  దృష్టిని తప్పుకొంటు నలు దిక్కులు చూచుట గాంచి నేతగా
  కష్టము లేక నింతయును కార్యములెల్లను చక్కబెట్టగన్
  దుష్టుడు సర్వ లోకముల దుర్దశనొందకదృష్ట వంతుడౌ

  సర్వలోకములు =ఎక్కడికేగినను అనే అర్థం లో.

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 33. కష్టము నరునకు మోక్షము
  ఇష్టులు నాప్తులు జెలులను నెరుగక నరుడున్
  ఇష్టిగను ఆత్మ లోనన్ఁ
  "దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశనెపుడున్"
  (ఆత్మలోనన్ +తుష్టుడు )
  ------ శ్రీరామ్ 10వ తరగతి

  రిప్లయితొలగించండి
 34. ఇష్టులనొక్కచో బిలిచి నిక్కము టెక్కుల బోవగా ననన్
  పృష్టము గావగా నిలిచి పేర్కొనె ప్రేమగ నిల్తునంచుచున్
  కష్టము దీర్తు మీ కరువు కాటక ముల్ నిక నేతనవ్వగా...
  భ్రష్టుడ జేయబోవ బహు భారమ నెంచియు దూర్తబుద్దితో
  దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ


  రిప్లయితొలగించండి