కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చచ్చె సింహము చీమచే సత్యమిద్ది"
(లేదా...)
"చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చచ్చె సింహము చీమచే సత్యమిద్ది"
(లేదా...)
"చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్"
రిప్లయితొలగించు"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
America - Vietnam War:
చిచ్చుల్ పెట్టుచు చిన్నదేశమునయో చీనీయులన్ త్రోలగన్
రచ్చన్ జేయుచు రాగనున్ బరువగున్ రాకెట్లతో త్రెంపగన్...
వచ్చెన్ సైన్యము కూల్చగా నమెరికన్ బండారమున్ నవ్వుతో....
"చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్"
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు🙏
తొలగించు
రిప్లయితొలగించుఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
China - Vietnam War:
చిచ్చుల్ పెట్టుచు చిన్నదేశమునయో చీనీయులే మూర్ఖులై
రచ్చన్ జేయుచు రాగనున్ బరువగున్ రాకెట్లతో త్రెంపగన్...
వచ్చెన్ సైన్యము కూల్చగా పసుపులన్ బండారమున్ నవ్వుతో....
"చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్"
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు🙏
తొలగించునలుబ దేళ్ళుగ కాంగ్రేసు నాద నుకొన,
రిప్లయితొలగించునాయ మేథిన బీజేపి యడిసి పట్టె
స్మృతియి రానియె గెలవంగ చిత్ర మాయె
లోకసభసభ్యు డారాహుఁ లోడ, కనగ
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించు"...యమేథిని.." అనండి.
సమస్య :
రిప్లయితొలగించుచచ్చె సింహము చీమచే సత్యమిద్ది
( కంటికి కనిపించని అణువంత కరోనాజీవి
సింహమంతటి లోకాన్ని వణకిస్తున్నది )
చిచ్చుకన్నులు లేనట్టి చిన్నినలుసు ;
గిచ్చుగోళులు కనరాని కిట్టుపురుగు ;
జగతి కంతకు భయమును రగులుగొల్పె ;
చచ్చె సింహము చీమచే ; సత్యమిద్ది .
( కిట్టుపురుగు - చచ్చుపురుగు )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించునేటి శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించుచచ్చె సింహము చీమచే సత్యమిద్ది
నా పూరణ సీసములో
మహా పరాక్రమ వంతుడైన అర్జునుడు తన కుమారుడైన
బభృవాహనుని చేతిలో గంగా దేవి శాప కారణమున చనిపోగ
అర్జునుని భార్య ఉలూచి తన వద్ద గల మణిచే అతనిని బ్రతికిస్తాను అని చెబుతుంది అప్పుడు చక్ర ధారి ఉలూచిని గాంచి పలికిన సందర్భము
విల్లును పట్టిన వేగముగ నలుది
శలకు విడుచువాడు సవ్యసాచి
సంగరమున శర సంధానమును జేసి
రిపులను కూల్చు కిరీటి యతడు,
చీకటి లోనైన చిత్రగతిని విల్లు
సంధించి కూల్చెడి శౌర్యుడతడు
యట్టి ధీరుడిపుడు పిట్ట పగిది నేడు
బభృవాహనునిచేత ప్రాణములను
కోలు పోయెనుగా నేడు, కాల మహిమ,
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది,
ఘనత నొందిన గాండీవి తనువు విడిచె
ననె యులూచితో గిరిధారి జనుల యెదుట
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'శౌర్యుడతడు+అట్టి' అన్నపుడు యడాగమం రాదు.
తే.గీ.
రిప్లయితొలగించుచిన్నవాడను చులకన చెదరు లాగు
పూతన బకాసురులనొక రీతి గూల్చి
కంసరాజుని బలిమితో గట్టబెట్టె
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'కంసరాజును' అనండి.
🙏🏻
తొలగించుచిన్నవాడను చులకన చెదరు లాగు
పూతన బకాసురులనొక రీతి గూల్చి
మామ కంసుని కదనాన మట్టగించె
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది
వచ్చె కురు సైన్యముల్ వేగ పసుల పట్ట
రిప్లయితొలగించుపోయి రుత్తరుడును పేడి పోర వారి
వెళ్ళుటయె కాదు వచ్చిరి విజయమంది
చచ్చె సింహము చీమచే సత్యమిదియె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకంటికి కనిపించని క్రిమి కాలుడగుచు
రిప్లయితొలగించువిశ్వ విఖ్యాతుడైనట్టి విమలమతిని
యమర లోకాల కదియంపె నదియె గాంచ
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునిన్నటి పూరణ
రిప్లయితొలగించుముప్పులఁ వెట్టి తాఁ బరుల మోస మొనర్చుచు వారి సంపదన్
జొప్పడు మేర మూట నిడి శోచితులై విలపింపఁ గూర్చినన్
దెప్పరమౌ సుఖాంబునిధిఁ దేలునె?... ధర్మవిరుద్ధమైనవై
కుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్
కంజర్ల రామాచార్య
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించులచ్చిన్ గుండెల దాచుకొన్న హరిఁ బ్రహ్లాదుండు వీక్షించుచున్
సచ్చిత్తమ్మున వాక్కునందు క్రియలన్, సద్భక్తి సేవింపగా.,
వచ్చెన్ శ్రీహరి., సంపె దైత్యుని., గనన్ బాలుండె తద్ధేతువౌ!
చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఅచ్చోటన్ సరదాసమాజమున వారవ్వేళ నుత్సాహులై
రిప్లయితొలగించుయచ్చంబైనవిధాన బొంకవలె నిప్డంచాడ నాస్పర్ధలో
మెచ్చం జాలినరీతి బల్కె నొకడీ మేరన్ సహర్షమ్ముగా
చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఎన్ని కలలోన నిలచిరినెదురుబదురు
రిప్లయితొలగించుచీమ మరియును సింహముచిహ్నములుగ,
జేరి ఫలితము నొందగ జీమవారు
"చచ్చె సింహము చీమచే సత్యమిద్ది"
కొరుప్రోలు రాధాకృష్ణరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుధన మదంబున తన కంటె ధరణి నెవరు
రిప్లయితొలగించులేరటంచు ను గర్వాన వీరు భంగి
విఱ్ఱ వీ గగ వక్రించి విధి వశాన
చచ్చె సింహము చీమచే సత్య మిద్ది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువచ్చెన్ బాండవ మధ్యముండు కడు దర్పంబందుచున్ వేగమే
రిప్లయితొలగించుతెచ్చెన్ వెంట శిఖండినిన్ గనుచు నా ధీరుండు గాంగేయుడే
యచ్చెర్వొందుచు వీడి యస్త్రములనా హంసుండు, కూలెన్ గదా!
చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించుపంత మొందుచు పరుగిడు పన్నిదమున
విమతియైన కుందేలును విపినమందు
యోర్పు గూడిన తాబేలు యోడజేసె
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచిచ్చున్రేపెకరోనయన్క్రిమిమసిన్జేసెన్ప్రపంచంబునే
రిప్లయితొలగించుసచ్చారిత్రులుధూర్తవారసులుదేశాధీశులుగ్రాధిపుల్
మ్లేచ్ఛుల్నాస్తికులాస్తికార్భకులుపారీంద్రంబులేయీల్గరే
*చచ్చెన్సింహముచీమచేతనహహాసత్యమ్మువాక్రుచ్చితిన్*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅరసు తన పరివారము నంతనుగొని
రిప్లయితొలగించుయడవినందు వేటకు వచ్చెనని విని భయపడి
చచ్చె సింహము ; చీమచే సత్యమిద్ది
యనుచు తెలియ మృగములన్ని యరుస మొందె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుతే.గీ (పంచపాది)
రిప్లయితొలగించువిజయమెవరిదో తేలగ వెరవనేల
దేశమునకునోటరు పెద్దదిక్కుగాదె
కష్టపడిన మనుజులకు కలుగు ఘనత
చిన్నవారన చులకన చెదరు గాదె
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది
(ఎన్నికలలో ఫలితాలు దైవాధీనాలు.
ఆశ్చర్యాలు సహజము. ఒక్కోసారి సామాన్యులు ప్రముఖులపై గెల్వవచ్చు)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువచ్చెన్ మాకు ప్రభుత్వమంచు జనులన్ వంచించి క్షేత్రమ్ములన్
రిప్లయితొలగించుఇచ్చన్ గైకొని బాధపెట్ట మదులన్ హెచ్చంగ కోపాగ్నులే
వచ్చెన్ క్రొత్తగనెన్నికల్, విజయమున్ ప్రత్యర్థులే పొందగా
చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించురెచ్చన్ రాక్షస పాలనమ్మకట నాంగ్లేయాధిపత్యంబునన్
రిప్లయితొలగించుఇచ్చెన్ గాంధి యహింస నాయుధముగా నేకత్వమున్ జాతికిన్
తెచ్చెన్ స్వేచ్ఛను దెల్లవారి దరిమెన్ దేశంబునందుండికన్
చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించువచ్చెన్ మాకు ప్రభుత్వమంచు మదమున్ వంచించి రైతన్నలన్
రిప్లయితొలగించుఇచ్చన్ మార్చెద రాజధాని ననుచున్ హేయంపు ద్రోవన్ జనన్
వచ్చున్ క్రొత్తగనెన్నికల్, గెలిచి యా ప్రత్యర్థులే యందురే
చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుపొదలచాటుననిలబడిబోయవాడు
రిప్లయితొలగించువేయబాణమునఱచుచుభీకరముగ
చచ్చెసింహము,చీమచేసత్యమిద్ది
కఱువబడినదైరోదించెగనకలక్ష్శి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుబల్లిదుండుసమరసింహబలుఁడువాఁడు
రిప్లయితొలగించువైరివీరులపాలిటసౌరుఁడతఁడు
విధిబలీయము సోకెను విసపుజొరము
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుశా:
రిప్లయితొలగించుహెచ్చెన్ వెల్లువలా ప్రజాశ్రయము నూహింపన్ తథారీతినిన్
తెచ్చెన్ శాంతి కపోతమై ఎగయుచున్ దేశాన స్వాతంత్ర్యమున్
గ్రుచ్చన్ తూటని గుండెలోన నకటా ఘోరాతి ఘోరంబునన్
చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదాలు
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుచచ్చెన్ సింహముచీమచేతనహహాసత్యమ్మువాక్రుచ్చితిన్
రిప్లయితొలగించునిచ్చన్ బల్కితె?కప్పగంతుల!యహోయేమాయె?బాగుంటివా?
మెచ్చన్ గాయెనెజెప్పుమాయదిమహామేధావియేయైతివే
లుచ్చామాటలుమాటలాడకెపుడున్ రూమర్లుబోనాడుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుతూఱి చెవు లందు జూలునఁ దూఱి దాగి
రిప్లయితొలగించుతూఱి గోళ్ల సందులఁ గళ్లఁ దూఱి నసలఁ
గుట్ట దూఱి తలను బాదుకొంచుఁ గొంచుఁ
జచ్చె సింహము చీమచే సత్యమిద్ది
సచ్చారిత్ర శకుంతలా సతి కిడన్ సంతోష మప్పట్టునన్
రచ్చం గాంచక దీనయై నిలిచి క్రూరత్వంబు గోల్పోవఁగా
నచ్చంబౌ విపినాంతరమ్మునను దౌష్యంతుండు పౌగండుచేఁ
జచ్చెన్ సింహము, చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్
[పౌగండము = 5-10 మధ్య వయస్సు]
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించు
రిప్లయితొలగించుపిన్నక నాగేశ్వరరావు.
కంటికిన్ గనపడని సూక్ష్మంపు జీవి
లక్షలాదిగ మనుజులన్ లయమొనర్చె
పేదలున్ గొప్పవారను భేదమిడక
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది.
తేటగీతి
రిప్లయితొలగించుసింహమై దైత్యుఁడక్కటా! శ్రీహరిఁగనఁ
జీమఁ బోలెడుఁ బ్రహ్లాదుఁ జీదఱించ
హరియె కంబమ్మునన్ నరహరిగ దూక
చచ్చె సింహము! చీమచే సత్యమిద్ది!!
శార్దూలవిక్రీడితము
తుచ్చుల్ తెల్లలు గూడెమందు తనకై దుర్మార్గముల్ జేయగన్
దచ్చాడంగను వత్తురన్న గిలితో ధైర్యాన నల్లూరియే
స్వచ్ఛందమ్ముగ గుండెఁ జూపి నిలువన్ సారించి తూటాడగన్
జచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్
చిచ్చున్ రేపెకరోన జాఢ్యమిలలో చిత్రంబుగా నెల్లరన్
రిప్లయితొలగించుఇచ్చన్ వచ్చినరీతి భీకరముగానిక్కట్ల పాల్జేయుచున్
రెచ్చెన్కంటికి కానుపించక విచారించన్ మదిందోచెడిన్
చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్
చేయగా పంచదారతో చేడియలట
రిప్లయితొలగించువివిధ రకముల బొమ్మల వేడ్కతోడ
కొంగ బాతు సింహము కోడి కుక్కుటముల
చచ్చె సింహము చీమచే సత్యమిద్ది