26, సెప్టెంబర్ 2020, శనివారం

సమస్య - 3498

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్"

 (లేదా...)
"కుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్"

55 కామెంట్‌లు:

  1. శంకరాభరణంబు లోన సంతసముగ చేరి నాడ,

    శంకరార్యుడు నాకు నెపుడు సలహాలు నిడుచుండ నేను

    శంకరాభరణంబు నందు సరసమున్ పూర్తి చేసితిని

    శంకయే లేక యీనాడు శత దశముల సమస్యలను

    శంకరార్యా మ్రొక్కు చుంటి సంత సముగ పదములకు

    శంకర గురువర్యా యిదియె సత్యము మీ గారవమ్ము

    పంక మందున్న యీ కలువ ‌‌ పైన జూప వలయు సతము


    మీ శిష్య పరమాణువు

    పూసపాటి

    రిప్లయితొలగించండి
  2. కవి శ్రేష్టులకు
    నమస్కారము

    నా విద్యార్ధిని విద్యార్ధులకు
    శుభ ఆశీస్సులు




    సుమారుగా నాలుగు సంవత్సరాల క్రితం‌ నేను శంకరాభరణము సమూహములో శంకరార్యుని
    అనుగ్రహం తో చేరాను

    ఆనాటి నుంచి సమూహములో ఇచ్చిన సమస్యలు నేటికి 1001 పూరించి నానని సంతోషముగా తెలియ పరుస్తూ ఉన్నాను. వాటిలో ఇచ్చిన
    సమస్యల పాదములు (ఎక్కువగా కందములను) సీస పద్య పాదములుగా మార్చి
    231 సీస పద్యములు వ్రాసినాను సమస్య పాదము అటులనే మార్చకుండా ఉంచి

    ఇది అంతా శ్రీ కంది శంకరార్యులు నాపై తగినంత‌ అనురాగం చూపి నేను వ్రాసిన పద్యములలో ప్రతి దినము‌ తప్ప్పులు‌ చూపి నా చేత సరిచేయించి నన్ను ఒక తెలుగు విద్యా ర్ధిగా తీర్చి దిద్దారు


    ఆ స్పూర్తితో నేను తెలుగు మొలకలు ,తెలుగు వనము‌ అను తెలుగు కావ్య మధనము‌ అను సమూహములు‌ స్వంత గా నడిపి గత సెప్టెంబరు ‌నుంచి దేశము నలు మూలల‌ నుంచి తెలుగు భాషాభిమానులకు ఉచితముగా
    తెలుగు పద్యం ఎలా వ్రాయాలి‌ అన్న పాఠములు నేర్ప సాగాను
    అనగా గురు లఘవుల నిర్ణయం దగ్గర నుంచి(నర్సరీ)
    మొదలు పెట్టి నేర్పు ‌తున్నాను వారిలో కొందరు శంకరా భరణము గ్రూపులో సమస్యా పూరణములు చేయు చున్నారు ఇది వాట్సప్ మాధ్యమము ద్వారా మొదలు పెట్టాను దేశము నలు మూలల నుంచి విద్యా ర్ధులు‌ ఉన్నారు

    ఒక ఉపాధ్యాయుని గా మలచి
    ఈ రోజున నా వద్ద సుమారుగా 85. మంది శిష్యులకు పద్య బోధన నేర్పుటకు అవకాశము ఇచ్చినది శ్రీ శంకారార్యుని స్పూర్తి చిరు నగవుతో ప్రతి సందేహము తీర్చు వారి ఓర్పు‌,నేర్పు కు నేను సతతము ఋణ పడి ఉన్నాను

    బంధ కవిత్వం మన తెలుగు రాష్ట్రం లో వ్రాయు వారు చాలా తక్కువ మంది వారిలో
    నేను ఒకడిని అట్టి ప్రతిభ నాకు ఇచ్చి వారి బ్లాగులో నా‌ చిత్ర బంధ కవిత్వముల నుంచి
    నన్ను ఘనాపాటి లైన‌ కవుల సరసన చిరు ఆసనము ఏర్పాటు చేసి ప్రోత్సాహం ఇచ్చిన శ్రీ కంది శంకరార్యునికి
    మరొక మారు నమస్కారము చేయు చున్నాను

    ఇంటి పేరు పూసపాటి అయినా
    సీస పద్యములు అధికముగా వ్రాసి సమస్య లు పూరించిన కారణమున నన్ను సీసపాటి
    అని పిలుచు అర్హత నాకు కొందరు కవులు ఇచ్చారు‌ అందరికి ధన్యవాదాలు


    కంది గురువు గారికి
    వారికి శతధా సహస్రధా శిరస్సు వంచి ప్రణామములు
    వారి పాద పద్మములకు చేయుచున్నాను

    వారికి నేను సర్వదా ఋణపడి ఉన్నాను అని నిస్సందేహంగా చెప్పు చున్నాను

    మరి యొకమారు గురువు గారి పాద పద్మ ములకు వందనములు చేయుచు

    పూసపాటి (సీసపాటి)
    26/9/20

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉదయం లేవగానే కనిపించిన మీ సందేశం నాకు ఆనందాన్ని, తృప్తినీ, కించిత్తు గర్వాన్నీ కలిగించింది. మీకు నా శుభాకాంక్షలు! నేను కేవలం నిమిత్తమాత్రుడను. ఈ విజయానికి మీ ఆసక్తి, పట్టుదల, స్వయంకృషి ప్రధాన కారణాలు.

      తొలగించండి

  3. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    చెప్పగ నింటియాలు వడి జేబులు నిండుగ పోసి యట్కులన్
    గొప్పగ పొమ్మనంచు భళి కోరిక తీరగ నేడు ద్వారకన్
    ముప్పులు వచ్చె శిస్తులను మూర్ఖులు లాగగ శ్యామసుందరా!
    కుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  4. ఒప్పులు మెండుగ జేసిన
    తప్పుగ మెలగిన మనుజులు తగరీసీమన్
    మెప్పులు రావుగ వారికి
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దప్పిక తీరిన మనుజులు
      తప్పుగ జూతురె బడలిక తరగని జనులన్
      గొప్పలు జెప్పిన యేమగు
      కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "...జెప్పిన నేమగు..." అనండి.

      తొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గొప్పగ చీటి కట్టగను కొండొక లాటరిలోన మిత్రుడే,
    ముప్పులు వచ్చె నాకిచట ముద్దుల భామయె వంచి వీపునన్
    చెప్పులు తీసి కొట్టగను చెవ్వులు మూయుచు; మిత్రునింటనున్
    కుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  6. తిప్పలు తప్పవు మనకెడ
    కుప్పలుగా సిరులు గూడ ; క్షోభింపఁ దగున్
    అప్పులు దండిగ నుండగ
    చెప్పుచు నుంటిని వినుమిక జీవన నిజమున్

    కెడ = దగ్గర

    రిప్లయితొలగించండి
  7. చప్పున సంపదల్ గలుగ శత్రువు లేర్పడు నిశ్చయంబుగన్
    గుప్పన మత్సరంబు భువిగూలగ జేసెడు మార్గమెంచుచున్
    తప్పదు చోరభీతి మరి దాయల దాడులు పన్నుపోటులున్
    కుప్పలు గుప్పలై సిరులు గూడగ ఖేదము నందగాదగున్

    రిప్లయితొలగించండి
  8. ఒప్పులకుప్పా వినవే
    చెప్పెద, శత్రువుల బెంచు, చింతల బెంచున్
    నిప్పుల కుంపటె ధనమన
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  9. గొప్పగ బంధులు వత్తురు
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్
    మెప్పుకు పోయి ధనమ్ముల
    నెప్పుడు తా ఖర్చు చేయ నెరుకయె లేకన్

    రిప్లయితొలగించండి
  10. ఈనాటి శంకరాభరణం వారి సమస్య

    కుప్పలుగా సిరులు కూడ క్షోభించ దగున్


    ఇచ్చిన పాదము కందము


    నా 1001. వ పూరణ. సీసములో


    బంధు గణంబులు బారులు
    తీర్చుచు
    గడప ముందర చేరి గొడవ చేతు

    రప్పు లివ్వ మనుచు, రాత్రులు
    నిదుర రా
    క భయము తో మనంగ వలయు గద,

    సతతము పన్నుల శాఖయు,
    పోలీసు
    శాఖల దాడులు జరుగ వెతలు

    కలుగు ,కుప్పలుగా సిరులు కూడ క్షోభించ
    దగునెప్పుడు నిలలో, ధర్మ గతిని

    ధనము పొంద నిరతము ముదమ్ము పొంద

    గలము, చెరసాల బాధలు కలుగ వెపుడు,

    లంచమును గైకొన ననుచు లక్షణముగ

    తెలిపె నొక భర్త తన భార్య తీరు గాంచి

    రిప్లయితొలగించండి
  11. తప్పులుచేసినవారికి
    తప్పవుతిప్పలునుముప్పుధరలోనెపుడున్
    చప్పున వక్రపుగతిలో
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఒప్పును గూడని రీతిని
    తప్పగు నవినీతి తోడ తనరుచు పరులన్
    తిప్పలు బెట్టుచు నికృతుని
    కుప్పలుగా సిరులుగూడ క్షోభింప దగున్.

    రిప్లయితొలగించండి
  13. సమస్య :-
    "కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్"

    *కందం**

    చెప్పెదరు గదా పెద్దలు
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్;
    రెప్పలు మూసిన మరణము
    తిప్పలు పడనేల ధనము తృప్తిని చాలున్
    ................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  14. విప్పగబాగుబోగులను వింతలువెల్వడె వేనవేలుగన్
    చెప్పెడు మాటలన్వినుచుఁజెల్లని మార్గముఁజేరికొందరున్
    గొప్పల కోసమంచుమరికొందరుఁజేఱుచు వక్రమార్గమున్
    కుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  15. గొప్పగ వంచించి జనుల
    తప్పుగ నార్జించు టన్న తగదంద్రు గదా
    నొప్పగు రీతిన్ గాకన్
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింప దగున్

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఒప్పునుగాని చందమున నుద్ధతి గూడుచు నెల్లవేళలన్
    తప్పగు వక్రమార్గమున తాను చరించుచు తోడివారలన్
    తిప్పలు బెట్టునట్టిదగు తీవ్రపు తత్త్వము నెంచి సాగుచున్
    కుప్పలు గుప్పలై సిరులు గూడిన ఖేదము నందగా దగున్.

    రిప్లయితొలగించండి
  17. అప్పులుముప్పటంచుప్రజలార్జనసేయగదొడ్డిదారులన్
    దప్పనినిప్పువంటిదనితప్పకయెప్పుడొగాల్చునంచుము
    ప్పెప్పుడొయిప్పుడేదొరికెపెంపొనరింతనుజింతవింతగా
    కుప్పలుఁగుప్పలైసిరులుగూడినఖేదమునందఁగాఁదగున్

    రిప్లయితొలగించండి
  18. గొప్పలగోరెయప్పులవికుప్పలగుప్పలునిప్పుదిబ్బలే
    తప్పవుతిప్పలెప్పుడువృథాధనసంచయమేలగోరెదో
    యప్పులుముప్పుతిప్పలనునారడిబెట్టుద్రిశంకుపుత్రుడే
    యప్పొనరించియాత్మజునియాలినినమ్మెనుదప్పవెప్పుడున్
    *"కుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్"*

    రిప్లయితొలగించండి
  19. అప్పులు తీరి కాపురమునందు సుఖమ్ముఘటిల్లు పంటతో
    కుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన, ఖేదము నందఁగాఁ దగున్
    గొప్పలు పోయి యిచ్చ సమ కూడిన సొమ్ములు ఖర్చుపెట్టినన్
    తప్పుడుమార్గమందునను, దక్కిన సంపద జారిపోవగా

    రిప్లయితొలగించండి
  20. అప్పులఁ గోరుచున్ స్వజనులాప్తులు మిత్రులు మార్తులౌదురే . యెప్పుడు ప్రాభవత్వమది యెత్తునొ యంచు భయంబు తెచ్చెడిన్
    తిప్పలు రోగకారకమదే తెలుపంగవశమ్ము కాదురా
    కుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  21. మెప్పును బొందుచు జేర్చిన
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్
    ముప్పని చోర భయంబున
    తిప్పలు బడి దాని దాచు తికమక నందున్

    రిప్లయితొలగించండి
  22. చొప్పడగా నవినీతికి
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింప దగున్
    తప్పవుశిక్షలు నరుడా
    అప్పనముగ జనుల దోచ నధికారముతో!

    రిప్లయితొలగించండి
  23. 26.09.2020
    అందరికీ నమస్సులు 🙏

    నా పూరణ యత్నం..

    *కం*

    అప్పులు వలదని దెల్పుచు
    తప్పులు తా జేయునెపుడు ధనమును పొందన్
    మెప్పును బొందక నిలలో
    *"కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్"*!

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  24. మైలవరపు వారి పూరణ

    కీ.శే. శ్రీ బాలూ గారికి
    శోకతప్తహృదయముతో..
    పద్యనీరాజనం💐😥🙏


    ఎప్పటికైన తథ్యమని యెల్లరెరుంగుదురయ్య మిత్తి., మే...
    మిప్పుడు దుఃఖమందుటకు నేమిది హేతువు? సుబ్రమణ్యమా!
    గుప్పెడు గుండె దాకునటు గొంతుక పాటలకోట జేసి నీ
    విప్పుడె స్వర్గసీమకయి యేగితివా! *అభిమానసంపదన్*
    తెప్పలనిండ నింపితివి తెల్గు జనాళిహృదంతరమ్ములన్
    కుప్పలుఁ గుప్పలై *సిరులు* గూడిన ఖేదము నందఁగాఁ దగున్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  25. అప్పనమగురహదారిని
    కుప్పలుగాసిరులుగూడ క్షోభింపదగున్
    కప్పురమువోలెకఱుగును
    దప్పులుదాజేయమిగుల దర్పమునెగడన్

    రిప్లయితొలగించండి
  26. ఉ:

    పప్పును దప్పళమ్ములను పాయస భక్షము లెల్లఁ మెక్కుచున్
    తిప్పలు లేక యెల్లపుడు తీయనిమాటల వూసులాడుచున్
    కప్పల తీరు గూడెదరు కాలము పండిన చుట్టపక్కముల్
    కుప్పలు గుప్పలై సిరులు గూడిన ఖేదము నొందగా దగున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. అప్పిచ్చు వాఁడు గలఁ డని
    ముప్పుల నెంచక యెడంద మునుఁగుదు వేలా
    యప్పుల కెప్పటి యట్టులఁ
    గుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్

    [సిరులు = శోభలు]


    ఒప్పుగఁ బంచు మద్ధనము నుత్తమ కార్యము లందు గర్వపుం
    దప్పపు టంధకార మది తప్పక కప్పును నిక్క మింత నీ
    వప్పరమేశు సన్నిధికి నక్కట యౌదువు దూర మిద్ధరం
    గుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్

    [దప్పము = దట్టము]

    రిప్లయితొలగించండి
  28. మెప్పులుగానిరీతినిలమీరుచుహద్దులుగూడబెట్టుతన్
    గుప్పలుగుప్పలైసిరులుగూడినఖేదమునందగాదగున్
    నెప్పటికైననున్బరులునీర్ష్యనుబ్రాణముదీయజూతురే
    యొప్పగున్యాయమార్గముననుద్ధతినొప్పగనుండగాదగున్

    రిప్లయితొలగించండి
  29. కందం
    కుప్పలుగ చెఱువు నిండిన
    కప్పలు పదివేలుఁ జేర కంగారటులే
    యప్పుల పోరులధికమై
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్!

    ఉత్పలమాల
    ఎప్పటికెంత తిన్నసహియించునొ యంతియె గూర్చు స్వస్థతన్
    మెప్పును గోరి మీరు మితిమీరిన సంపదలీయ సంతుకున్
    ముప్పును దెచ్చిపెట్టి మునుముందుగ సోమరులౌట వారికిన్
    గుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  30. కం//ఎప్పుడు దానము చేయక
    తిప్పలు కొని తెచ్చుకొనచుతిరిగెడి జనులున్
    తప్పిరి ధర్మము నంతయు
    కుప్పలుగా సిరులు గూడా క్షోభీం పదగున్

    రిప్లయితొలగించండి
  31. మెప్పుల గోరి కుచముపై
    కప్పు వెలువరచి గులుకుచు కోలము గోరన్
    తిప్పలుపడు నాతికి చను
    గుప్పలుగా సిరులు గూడ క్షోభింప దగున్

    రిప్లయితొలగించండి
  32. చేరి కొలువ సురలు శ్రీపతి పండితా
    రాధ్యుల గృహవరుఁడు రాగ యుక్త
    పద సుమ భరిత గళ బాల సుబ్రహ్మణ్య
    ము పిక జిష్ణువు దివమునకు నేఁగె

    రిప్లయితొలగించండి
  33. చెప్పిన మాటచె వినిడక
    తిప్పలు బెట్టుచు పరులను తేరగ దోచన్
    నిప్పులు కొలిమై చివరకు
    కుప్పలుగా సిరులు గూడ క్షోభింప దగున్.

    రిప్లయితొలగించండి