22, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3494

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"లక్ష్మీపతి భర్త యయ్యె లలన నగజకున్"

 (లేదా...)
"లక్ష్మీవల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్"

47 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  నడిరేయి సరదా పూరణ:

  ఈ క్ష్మా ప్రాసను విందుగా నొసగుచున్ హెచ్చించమా బీపినిన్
  మా క్ష్మాపాలుడు కంది వంశముననున్ మర్యాదగా పుట్టుచున్
  లక్ష్మీవల్లభు శాఖ శంకరుడహో వ్రాయంగ నేడిట్టులన్:
  "లక్ష్మీవల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్"

  రిప్లయితొలగించండి
 2. రాజగురువు రాజుగారి కొడుకు బుద్ధిహీనుడైన వానిని వ్రాతలో తప్పులకు సిక్షించిన ఈయనకు ప్రమాదం కదా, అందుకు సిక్షింపలేక వాడు వ్రాసిన తప్పులను పక్కన ఉన్న పండితులకు చూడండయ్యా ఇది వరుస అని తలనొప్పి తీర్చుకుంటున్నాడు😀😀😀🤭


  శా||
  సూక్ష్మంబుల్ గ్రహియించవేమి వటువా? జూడన్ దగన్ వ్రాసినన్!
  సుక్ష్మాభృత్తుకు బిడ్డవైతివి నినున్ క్షోభింప శక్యంబె? త
  ద్లక్ష్మీవల్లభు సచ్చరిత్రనటు పారన్ వేతువే? యేలనా
  లక్ష్మీవల్లభుడయ్యె భర్తయుమకున్ ?లక్షింపుడీ పండితుల్!
  రోహిత్ శర్మ🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'తత్+లక్ష్మీ.. = తల్లక్ష్మీ' అవుతుంది.

   తొలగించండి
 3. సమస్య :
  లక్ష్మీవల్లభుడయ్యె భర్త యుమకున్
  లక్షింపుడీ పండితుల్

  ( లక్ష్మీవల్లభుని కైలాసభూలక్ష్మీవల్లభుని
  చేసినట్లైతే బాగుంటుంది కదూ !)
  ఈ క్ష్మామండలమందు నెచ్చటయినన్
  నీరీతి నీక్షింతుమా ?
  సూక్ష్మంబైన పథంబు నెన్నవలెగా
  శూరత్వపుం బ్రజ్ఞతో ;
  బక్ష్మంబుల్ ముకుళించితిన్ ; భళి భళీ
  వాక్రుత్తు ; గైలాసభూ
  లక్ష్మీవల్లభుడయ్యె భర్త యుమకున్ ;
  లక్షింపుడీ పండితుల్ !!
  ( పక్ష్మములు - కనురెప్పలు )

  రిప్లయితొలగించండి
 4. లక్ష్మణ! వినరా శ్రీహరి
  లక్ష్మీపతి, భర్త యయ్యె లలన నగజకున్
  లక్ష్మకమది గళమందున
  లక్ష్మణము లనంతముగల రాజధరుండే. . . ......................లక్ష్మకము ...మచ్చ ; లక్ష్మణము...నామము, పేరు,

  రిప్లయితొలగించండి
 5. ఈ నాటి శంకరాభరణం వారి సమస్య


  లక్ష్మీ పతి భర్త యయ్యె లలన నగజకున్

  ఇచ్చిన పాదము కందము

  నా పూరణము సీసములో

  ఒక గురు కులములో ఒక‌ముని‌ తన‌ శిష్యులకు దేవతల బంధుత్వాలు తెలియ పరచుట  వాసుదేవుడు సత్యభామ వల్లభుడు, ద్రౌపదికి భర్త కిరీటి,పాండురాజు

  మనువాడె గా కుంతి మాద్రులన్,కోదండ
  రాముడు నాధుడు రమణి సీత

  కు తరచి చూడంగ,నతివ స
  రస్వతి
  బ్రహ్మ పట్టమహిషి,పైడి నెలత

  ప్రభువు లక్ష్మీపతి,భర్త యయ్యె
  లలన నగజకు నా వైద్య నాదుడు ,సతి

  గాదె వల్లి యా గుహునకు, కరిముఖునకు

  సిద్ది బుధ్ధులు పత్నులు చెలిమి
  బడసి,

  ననుచు వివరములను తెలిపె నొక తపసి

  తనదు శిష్యులకు కడు ము‌దమ్ము తోడ

  రిప్లయితొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  లక్ష్మిని వీడడు సతతము
  లక్ష్మీపతి; భర్తయయ్యె లలన నగజకున్
  లక్ష్మికి నన్న త్రినేత్రుడు
  లక్ష్యముగా తారకాసుర వధ తలచుచున్.

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. శ్రీలక్ష్మీపతిమిత్రరత్నము హిమాద్రీశుండు ముక్కంటి తా
   సూక్ష్మాంగీకృతనిర్జరాపగశిరశ్శోభాయమానుండు లో
   కక్ష్మాపాలకు లెల్ల రోహొ! యనగన్ గైలాసశోభావహ
   ల్లక్ష్మీవల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్

   కంజర్ల రామాచార్య
   వనస్థలిపురము.

   తొలగించండి
  2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  లక్ష్యంబున్ గొని నీశ్వరుండు యిలలో రక్షస్సుడా తారకున్
  ఈ క్ష్మామండలమందు నొంచుటకు తానే వీరుడౌ బాలునిన్
  లక్ష్మణా! నగజాతయందు గనగా నాలక్షించి కైలాస భూ
  లక్ష్మీవల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో ప్రాస తప్పింది. '...గొని యీశ్వరుండు' అనండి. 'ఈశ్వరుండు+ఇలలో' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
  2. లక్ష్మమ్మున్ గొని యీశ్వరుండు నిలలో రక్షస్సుడా తారకున్
   ఈ క్ష్మామండలమందు నొంచుటకు తానే వీరుడౌ బాలునిన్
   లక్ష్మణా! నగజాతయందు గనగా నాలక్షించి కైలాస భూ
   లక్ష్మీవల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్.

   తొలగించండి
 9. లక్ష్మి జనించెను కడలిని
  లక్ష్మీపతి భర్త యయ్యె : లలన నగజన్
  లక్ష్మికి సోదర తుల్యుడు
  సూక్ష్ముడు శివుడు పతి యయ్యె సురలు నుతింపన్

  రిప్లయితొలగించండి
 10. మైలవరపు వారి పూరణ

  పక్ష్మద్వంద్వము మూసి., హస్తముల భాస్వన్ముద్రలన్ దాల్చి, తా..
  నా క్ష్మాసీమ భరించుచున్ తపనశైత్యాదిన్ దపోనిష్ఠతో....
  న్సూక్ష్మగ్రాహ్యుని శంకరున్ వలచె., సంతోషించి యానందస...
  ల్లక్ష్మీవల్లభుఁడయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 11. లక్ష్మికి విభుండు గదరా
  లక్ష్మీపతి, భర్త యయ్యె లలన నగజకున్
  లక్ష్మకు డా విషపు భోక్త
  లక్ష్యము లేకను పలికిన లఘువౌదువురా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం మూడవ గణం జగణమయింది. సవరించండి.

   తొలగించండి
 12. లక్ష్మికి పతిదానెవ్వరు?
  నీక్ష్మాతలమందు శివుని యిల్లాలెవరో?
  లక్ష్మీ శివుడును వరుసగ
  లక్ష్మీపతి, భర్త యయ్యె లలన నగజకున్

  రిప్లయితొలగించండి
 13. ఆ క్ష్మాజకు పెనిమిటియగు
  లక్ష్మీపతి ; భర్త యయ్యె లలన నగజకున్
  సూక్ష్మత తోడ గణించగ
  లక్ష్మికి యన్నయగు లోక రక్షకశివుడే

  క్ష్మా = భూమి

  రిప్లయితొలగించండి
 14. ఆక్ష్మాజకువిల్లు విరిచి
  లక్ష్మీ పతి భర్తయయ్యె,లలన నగజకున్
  లక్ష్మకమది గళమున గల
  సూక్ష్ముండుపరిణయమాడె సురలట మెచ్చన్

  రిప్లయితొలగించండి
 15. లక్ష్మమ్మున్ గొని యీశ్వరుండు నిలలో రక్షస్సుడా తారకున్
  ఈ క్ష్మామండలమందు నొంచుటకు తానే వీరుడౌ బాలునిన్
  లక్ష్మణా! నగజాతయందు గనగా నాలక్షించి కైలాస భూ
  లక్ష్మీవల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్.

  రిప్లయితొలగించండి
 16. లక్ష్మీదంబు విభూతి ఫాలమున వైరాగ్యంబు పెంపొందగా
  లక్ష్మీదంబది నీలకంఠమహొ సంరక్షింప భక్తాళినిన్
  లక్ష్మీదంబది చంద్రరేఖ తలపై రంజింప చిత్తంబు మోక్ష
  లక్ష్మీవల్లభుడయ్యె భర్త యగజకున్
  లక్షింపుడీ పండితుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూడవ పాదం చివర మోక్ష బదులు
   స ల్లక్ష్మీవల్లభుడు గా చదువ ప్రార్ధన

   తొలగించండి
  2. లక్ష్మీవల్లభుడయ్యె భర్త యుమకున్ గా చదువ ప్రార్ధన! 🙏🙏🙏

   తొలగించండి
 17. కె.వి.యస్. లక్ష్మి:

  లక్ష్మిని యెడదను దాల్చెను
  లక్ష్మీపతి; భర్తయయ్యె లలన నగజకున్
  లక్ష్మణ రూపుండు శివుడు
  లక్ష్మముగా తారకాసుర నణగజేయన్.

  రిప్లయితొలగించండి
 18. లక్ష్మణ!విష్ణువెకదమఱి
  లక్ష్మీపతి,భర్తయయ్యెలలననగజకున్
  లక్ష్మికిసోదరుడయియే
  లక్ష్మకములులేనిశివుడులాస్యముతోడన్

  రిప్లయితొలగించండి
 19. సూక్ష్మంబుగజూచినచో
  లక్ష్మికిపరమముపదమునులక్షణమగుగా
  లక్ష్మీపతిశివుడగుచో
  లక్ష్మీపతిభర్తయయ్యెలలననగజకున్

  రిప్లయితొలగించండి
 20. లక్ష్మీనాథుడు శంకరుండనుచు పల్కన్ భావ్యమే కాదందునే
  సూక్ష్మగ్రాహివి కావటంచు తెలిసెన్ చోద్యంబదే, చక్రియే
  లక్ష్మీవల్లభుడయ్యె, భర్త యుమకున్ లక్షింపుడీ పండితుల్
  పక్ష్మమ్మొక్కటి ఫాలమందుగల పశ్వత్పాలుడే కాదుటే.

  రిప్లయితొలగించండి
 21. నారదుని వచనములు:

  సూక్ష్మంబుగఁ జెప్పితి నీ
  పక్ష్మము లల్లాడ శివుఁడు భద్రం బగు నీ
  కీ క్ష్మాతలమున నవ్విధి
  లక్ష్మీపతి! భర్త యయ్యె లలన నగజకున్


  సూక్ష్మీభూత విచార సంచయములం జోద్యమ్ము గా నేరదే
  యీ క్ష్మా వాసులు తల్తు రీ హరి హరై కేశత్వ మింపారఁగన్
  లక్ష్మీనాథుని యండతో శివుఁడు కైలాసాద్రి కారాధ్యుఁడై
  లక్ష్మీ! వల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్

  రిప్లయితొలగించండి
 22. సూక్ష్మగ్రాహ్యుడుభక్తరక్షకుడునైచోరుండుగాబేరునౌ
  లక్ష్మీవల్లభుడయ్యె,భర్తయుమకున్ లక్షింపుడీపండితుల్
  ఆక్ష్మానాధునిగోర్కెమేరకుభువిన్ హర్షాతిరేకంబునన్
  లక్ష్శీనాధునిసోదరుండుశివుడేలాస్యంబుబెంపొందగా

  రిప్లయితొలగించండి
 23. లక్ష్మిని యెదపై దాల్చెను
  లక్ష్మీపతి; భర్త యయ్యె లలన నగజకున్
  లక్ష్మీసహజుని దలపై
  లక్ష్మముగా దాల్చిన యనలాంబకుడజుడున్

  రిప్లయితొలగించండి
 24. శా:

  ఈ క్ష్మా తల్లకెడైన గాని బలుకన్నీరీతి సంబుద్దినిన్
  లక్ష్మీ కాంతుడు భ్రాతయై నగజకున్ లాక్షణ్యుడై యొప్పగన్
  సూక్ష్మంబెంచగ నిద్ది నొక్క పలుకే సూచించ పూరింపనై
  లక్ష్మీ వల్లభుడయ్యె భర్త యుమకున్ లక్షింపుడీ పండితుల్

  పలుకు=ప్రశ్న /సమస్య

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 25. ఈక్ష్మామండలమందుతారకుడుకారించంగ, కార్యార్థియై
  లక్ష్మీపుత్రుడు శూలి మౌనమును వాలాయమ్ముగానాపగా
  సుక్ష్మగ్రాహ్యుడు శంకరుండు లలితో చోద్యమ్ముగా నంద స
  ల్లక్ష్మీవల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్

  రిప్లయితొలగించండి
 26. ఆక్ష్మాపాత్రుడయోధ్యరాట్విభుసుతుండాసత్యుడాశంభుదౌ
  లక్ష్మాకారధనుస్సుఁద్రుంపెఁగుజఁబెండ్లాడంగసీరాముడే
  లక్ష్మీవల్లభుఁడయ్యె;భర్తయుమకున్లక్షింపుఁడీపండితుల్
  సూక్ష్మాత్ముండుహిరణ్యరేతసుడుహింస్రుండర్థనారీశుడౌ

  రిప్లయితొలగించండి