19, సెప్టెంబర్ 2020, శనివారం

సమస్య - 3491

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాధాకృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ"

 (లేదా...)
"రాధాకృష్ణుఁడు బ్రహ్మచారి యగు నో రాకేందుబింబాననా"

56 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    సాధించంగను పాండువంశమునదౌ సంతానమున్ త్రుంచుటన్
    వేధించన్ గురుపుత్రుడే విడువగన్ పేరొందు బ్రహ్మాస్త్రమున్
    బాధన్ దీర్చ సుభద్రకున్ మనుమడిన్ ప్రాణంబు తెప్పించగన్
    రాధాకృష్ణుఁడు బ్రహ్మచారి యగు నో రాకేందుబింబాననా!

    రిప్లయితొలగించండి
  2. మాధవ మురళీ గానము
    శోధనమును జేసి ప్రేమశుద్ధత గూర్చున్
    రాధన శుద్ధప్రేమయె
    రాధాకృష్ణుండు వటుడు రాకేందుముఖీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరదాగా ( పెళ్ళిగాని ప్రసాదు)
      ఆధీనము దప్పె వయసు
      మేధను గలిగినను దగిన మెలకువ లేకే
      సాధింపలేక మనువును
      రాధా! కృష్ణుండు వటువు రాకేందుమిఖీ !

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! మీ ఆరోగ్యం యెటులున్మది? 🙏🙏🙏

      తొలగించండి
  3. రాధా మాధవ ప్రణయము
    సాధనతో సాధ్యపడులె సాకల్యంగా
    మాధవుని భక్తి మధురము
    రాధాకృష్ణుండు నటుడురాకేందుముఖీ
    ++++++++++++++++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "కలియుగ భాగవతము"

    బాధల్ పెట్టుచు రోజురోజు విడకన్ బ్రహ్మాండమౌ తీరునన్
    శోధించంగను పల్లెలన్ నగరులన్ శోకమ్ము తెప్పించుచున్
    వేధించన్ కడు ప్రేమతోనలవకన్ వెంటాడుచున్, నీవలన్
    రాధా! కృష్ణుఁడు బ్రహ్మచారి యగు నో రాకేందుబింబాననా!

    రిప్లయితొలగించండి
  5. సాధకుడొకడే యెరుగును
    మాధవు లీలాంతరంగ మర్మమ్ములనే
    వైధేయు డెరుగ లేడిది
    రాధా! కృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ

    రిప్లయితొలగించండి
  6. రాధామాధవ ప్రణయము
    గాధలకేపరిమితమ్ముకారాలుమగల్
    రాధయతనిమేనత్తయె
    రాధాకృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ

    రిప్లయితొలగించండి
  7. వేదిక నందు శూన్య తల పేటిక లోని ఝషంబు గూల్చి తా
    మూదల జేసె నర్జునుడు మోదము గూర్పగ ద్రౌపదేయుకున్
    కాదన కుండ కన్యకను గైకొనె ద్రౌపద రాకుమారుకౌ
    సోదరి బెండ్లియాడె నిజసోదరు డెల్లరు సంతసిల్లగన

    ఝషము = చేప, మూదల = నిరూపణ

    గాథల్ పెక్కులు తాదాత్మ్యమందగ శ్రీకాంతున్మహా లీలలున్
    మాధుర్యామృత నవ్యాకృతుల్ గన సామాన్యుడన్ ధారుణిన్
    రాధామాధవ ప్రేమల్ మహాద్భుత ధారల్ గనన్ తెల్పగన్
    రాధాకృష్ణుడు బ్రహ్మచారి యగు నో రాకేందుబింబాననా!

    రిప్లయితొలగించండి
  8. బాధను చెందంగ తగదు
    రాధాకృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ!
    గాధలు వేయున్న నేమి?
    వృధా చింతింప వలదు వేదన విడుమా!

    రిప్లయితొలగించండి
  9. సాధుజనబాంధవుండగు
    మాధవు నీవాడె! కోపమా! విడు మాతా!
    వేధనలనిక వదలవలె
    రాధాకృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాధవుడు నీవాడె' అనడం సాధువు కదా?

      తొలగించండి
  10. రాధాకృష్ణులప్రణయము
    ప్రాధాన్యతసంతరించెపావనగతియై,
    మాధవుడస్కలితుడునన
    రాధాకృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  11. రాధను వలచిన దెవ్వరు?
    బాధకు గురి జేసి రెవరు బలి మహరాజున్?
    మాధుర్యము బంచు నెవరు?
    రాధాకృష్ణుండు : వటుడు : రాకేందు ముఖీ

    రిప్లయితొలగించండి
  12. శోధించుచు మంచిచెడుల
    సాధించెను ధర్మమిలను సచివుఁడు తానై
    మాధవుఁ దానెప్పటికిని
    రాధా! కృష్ణుండు వటుడు రాకేందుముఖీ!

    రిప్లయితొలగించండి
  13. మాధవుడు,మాపతి,జగ

    న్నాధుడు,దైత్యారి,పద్మనాభుడు,జగమున్,

    శోధించగనస్ఖలితుడు,

    రాధా కృష్ణుండు వటుడు రాకేందు ముఖీ

    రిప్లయితొలగించండి
  14. రాధాకృష్ణుల ప్రేమగాథలవియే రమ్యంబటంచున్ భువిన్
    మేధావుల్ వచియింపనేమి గన లక్ష్మీనాథునిన్ లీలలన్
    వైధేయుండెఱుగంగలేడు గదనే ప్రాగ్యంశు డాదిత్యుడే
    రాధా! కృష్ణుడు బ్రహ్మచారి యగునో రాకేందు బింబాననా!

    రిప్లయితొలగించండి
  15. మాధవులీలలుతెలియవు
    పాంధులమేనీవునేనుపారముతెలియన్
    వేధయెలౌక్యమలౌక్యము
    రాధాక్రుష్ణుండువటుడురాకేందుముఖీ

    రిప్లయితొలగించండి
  16. శోధింపంగమనంబెరాధయగుసుశ్లోకాచ్యుతాఖ్యుండునా
    బోధాగ్రేసరుడాత్మనిర్భరుడగున్పూర్ణుండుబ్రహ్మంబులో
    నాదాతీతుడుసంచరించుమగువా!నారాయణుండెంచగా
    *రాధాకృష్ణుఁడు బ్రహ్మచారియగు నో రాకేందుబింబాననా*

    రిప్లయితొలగించండి
  17. కె.వి.యస్. లక్ష్మి:

    శోధింప తెలియ నేరును
    మాధవుడిల జేయు లీల మానుష రూపున్
    సాధకుడై బలి నడచెను
    రాధా! కృష్ణుండు వటుడు రాకేందుముఖీ!

    రిప్లయితొలగించండి
  18. రాధామాధవుగూరిచి
    మేధావులుదెలియలేరుమేదినినెచటన్
    మాధవుడననొకశక్తియ
    రాధాకృష్ణుండువటుడురాకేందుముఖీ!

    రిప్లయితొలగించండి
  19. మాధవుని రాసలీలలు
    మాధుర్య మొసగెడి దృశ్యమౌ మరి యేలన్
    క్రోధము గనబరు చుంటివి
    రాధాకృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ

    రిప్లయితొలగించండి
  20. భూధర సపాదప చయ మ
    హా ధరుఁడు పిదప గృహస్థుఁ డయ్యెం గద తా
    నీ ధర నస్ఖలితుం డట
    రాధా! కృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ


    ఆధారం బగు నీకు సంతతము నీ యా మాటలన్ వీడుమా
    బాధల్ దీరఁగ వేఁడు కొన్మ యతనిం బద్మాక్షి నిన్నేలఁగా
    నాధీనుం డగు భక్త కోటి కిల నబ్జాక్షుండు బాల్యమ్మునన్
    రాధా! కృష్ణుఁడు బ్రహ్మచారి యగు నో రాకేందుబింబాననా

    రిప్లయితొలగించండి
  21. రాధాకృష్ణుడునాయనంగనుగడున్ రక్షానుసంధానుడై
    బాధల్ లేకనుజేయుచుండునుగభవ్యుండునౌటన్భువిన్
    రాధాకృష్ణుడుబ్రహ్మచారియగునోరాకేందుబింబాననా
    శోధించగన్ నాతడెప్పటికహోశూరుండుమాన్యుండుగా

    రిప్లయితొలగించండి
  22. కందం
    భూధరుడే నరహరియై
    మాధవుఁడన రాక్షసాళి మర్దించె! బలిన్
    సాధించిన వారెవరన
    రాధా! కృష్ణుండు 'వటుఁడు' రాకేందుముఖీ!

    శార్దూలవిక్రీడితము
    బాధల్ బాపఁగ భూమియున్ వృషభమున్ బ్రార్థింప నమ్మాధవున్
    సాధించెన్భువి రాక్షసాళికిలఁ దా సంహారియై ధర్మమున్
    బోధించెన్ దగ గీతనెల్ల ధరపై పూర్ణావతారుండునై
    శోధించన్ వర కృష్ణలీలలెలమిన్ చూపించనౌ నెట్టులున్
    రాధాకృష్ణుఁడు బ్రహ్మచారి యగు నో? రాకేందుబింబాననా!

    రిప్లయితొలగించండి
  23. మాధవునే దలచి వలచి
    రాధనమున మైమరచిరి రమణులటన్నన్
    గాధలె గానవి వినుమో
    రాధా! కృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ

    రిప్లయితొలగించండి
  24. మాధుర్యంబును బంచు బత్నులకు దా మమ్మేల గుర్తించులే
    ప్రాధాన్యంబిడడంచు నీవలుగుటే భావ్యంబుగానొప్పదో
    రాధా! కృష్ణుఁడు బ్రహ్మచారి యగు నో రాకేందుబింబాననా
    స్వాధీనుండగు నాతడెన్నడు గనన్ సద్భక్తికిన్ బద్ధుడై

    రిప్లయితొలగించండి
  25. శా:

    క్రోధాగారము లేలనోమగువ నీ క్రూరంపు నాభీష్టముల్
    సాధింపంగ వివాహమున్నె నిటులన్ సాధ్యంబు గాలేనిదై
    లేదింకన్ నొడబాటు నొంద తగునౌ లేకున్న చో గాంచనౌ
    రాధా ! కృష్ణుడు బ్రహ్మచారి యగు నో ! రాకేందు బింబాననా

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి