30, సెప్టెంబర్ 2020, బుధవారం

సమస్య - 3503

 తేదీ : 01-10-2020 (గురువారం)
 కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆగ్నేయాస్త్రమ్ము వేయ నభ్రము గురిసెన్"
(లేదా...)
"ఆగ్నేయాస్త్రము వేయఁగన్ గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్"

65 కామెంట్‌లు:

  1. రిప్లయిలు

    1. "శ్రీ రాముని దయ చేతను..."

      సరదా పూరణ:

      నగ్నంబయ్యెడి బుద్ధినిన్ గొనుచు తా నందమ్మునున్ గ్రోలుచున్
      లగ్నంబంచును శ్రావణంబు నయయో రాధేయునిన్ దల్చుచున్
      మగ్నంబౌచును భ్రష్టుడే వడివడిన్ మైకమ్మునన్ పోరులో
      నాగ్నేయాస్త్రము వేయఁగన్ గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్

      తొలగించండి
    2. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అగ్నిశిఖలు జీర్వారెను
    ఆగ్నేయాస్త్రమ్ము వేయగా; వానపడెన్
    అగ్నిని కక్కెడి నెండను
    భగ్నము జేయుచు చలువను పంచెడి రీతిన్.

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మగ్నంబౌచును రోతనున్ కిటుకునన్ మాట్లాడకే దిల్లితో
    లగ్నంబంచును నియ్యదే, వలపునన్ రాకాసియౌ చీనితో
    భగ్నంబయ్యెడి రాకెటున్ గొనుచుతా బైరాగియౌ పాకుడే
    యాగ్నేయాస్త్రము వేయఁగన్ గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్

    రిప్లయితొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అగ్నింగూడు శిఖల్ భయంకరముగన్ వ్యాపించె నుప్పొంగుచున్
    ఆగ్నేయాస్త్రము వేయగన్; గురిసె వర్షాభ్రమ్ము లుద్ధండతన్
    అగ్నింగక్కెడి వేసవిన్ క్రమముగా నల్పమ్ము గావించగా
    మగ్నంబయ్యెను వారుణాస్త్రమును చిమ్మంజేయు కాలమ్మునన్.

    రిప్లయితొలగించండి



  5. ( సత్యా నరకాసుర సంగ్రామం )
    లగ్నంబున్ బొనరించి దైత్యుడు దురా
    లాపంబులన్ గ్రుద్ధుడై
    యాగ్నేయాస్త్రము వేయగన్ ; గురిసె వ
    ర్షాభ్రమ్ము లుద్దండతన్
    భగ్నంబున్ బొనరింప సత్య ప్రియుడౌ
    భర్తన్ సమీక్షించి వే
    భుగ్నంబైన ధనుస్సునన్ బరపగా
    బొంగారు వర్షాస్త్రమున్ .
    ( భుగ్నంబైన - వంగిన ; పొంగారు - అతిశయించు ;వర్షాస్త్రము - వారుణాస్త్రము ; సమీక్షించి - బాగుగా చూచి )

    రిప్లయితొలగించండి
  6. అగ్నిని తలచుచు‌ రయముగ

    నాగ్నేయాస్త్రము వేయగన్ వాన బడెన్

    భగ్నంబాయెశరము, యిం

    ద్రాగ్ని యె లేక నురిమెన్ కదన రంగంబున్


    కర్ణుడు అర్జునిని పై యుద్ధ ము చేయు సమయాన గురు శాపము‌వలన మత్రములు మరచి పోతాడు అన్న భావన

    ఇంద్రాగ్ని మెరుపు

    రిప్లయితొలగించండి
  7. కె.వి.యస్. లక్ష్మి:
    భగ్నము లయ్యెను వానలు
    ఆగ్నేయాస్త్రమ్ము వేయగా; వానపడెన్
    మగ్నంబున వర్షాస్త్రము
    లగ్నము లక్షించి వేసి రాణించంగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వానలు+ఆగ్నేయాస్త్రమ్ము...' అని విసంధిగా వ్రాయరాదు. "వర్షము లాగ్నేయాస్త్రమ్ము..." అనండి.

      తొలగించండి
  8. అగ్ని శిఖలెగసె నంతట
    ఆగ్నేయాస్త్రమ్ము వేయఁ ; నట వాన పడెన్
    భగ్న యతనమిది జూడగ
    లగ్నము సరిలేదనుకొనె లాక్షణిక
    జనుల్

    రిప్లయితొలగించండి
  9. యతి సరిలేదను అనుమానముతో మార్చడమైనది 🙏🏽

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. అగ్నిశ్వాసలు నాసికాపుటములం దావేశసంజాతసో
      ద్విగ్నాంతర్యసముజ్జ్వలమ్ములగు నాభీలున్ బతిం
      జూచుచున్
      భగ్నోద్రేకునిఁ జేయనెంచి సతి తా బాహుద్వయిన్ గట్టె న
      య్యాగ్నేయాస్త్రము వేయఁగన్ గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్.

      కంజర్ల రామాచార్య
      వనస్థలిపురం.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  11. అగ్నియలముకొనె నంతట
    ఆగ్నేయాస్త్రమ్ము వేయఁగా వాన పడెన్
    అగ్నులు మాయము లయ్యెను
    భగ్నమొనర్పగ వరుణుని బాణము చేతన్

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    భగ్నంబున్ బొనరించి శంకరుని చాపంబెత్తి., సీతామనో
    మగ్నుండై జనుదెంచ.., భార్గవుడసామాన్యుండు క్రోధాఖ్యమౌ
    ఆగ్నేయాస్త్రము వేయగన్ గురిసె వర్షాభ్రమ్ములుద్దండతన్
    లగ్నంబై రఘురామశీర్షమున నానందాంబువర్షంబులన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. భగ్నమ్మై యల సంధియత్నములు దౌర్భాగ్యమ్ముతో భీష్ము డు
    ద్విగ్నమ్మైన మనస్సుతోకదనమున్ తేజమ్ముచూపించ తా
    నాగ్నేయాస్త్రము వేయఁగన్, గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్
    భగ్నమ్మున్ వడి చేయఁ గ్రీడి విడువన్ వర్షాస్త్రమున్ ధీరుడై
    అసనరె

    రిప్లయితొలగించండి
  14. భగ్నంబైరిగ వైరులు
    ఆగ్నేయాస్త్రమ్ము వేయగా : వాన బడెన్
    మగ్నంబగు మేఘ మ్ములు
    అగ్నిని చల్లార్చ దొడగె నవనిని మిగులన్

    రిప్లయితొలగించండి
  15. అగ్ని కురిసెనట విజయుం
    డాగ్నేయాస్త్రమ్ము వేయగా, వానపడెన్
    భగ్నము కైభీష్ముం డు
    ద్విగ్నతతో వారుణాస్త్ర వేసిన వేళన్

    రిప్లయితొలగించండి
  16. ఆ గ్నాల ధ్యాసలోన ని
    మగ్నమయిన వాడొకండు మానిని ప్రేమన్
    భగ్నపడి వాగె నిట్టుల
    నాగ్నేయాస్త్రమ్ము వేయఁగా వాన పడెన్

    రిప్లయితొలగించండి
  17. అగ్నిశిఖల్ బొడమెన్నట
    నాగ్నేయాస్త్రమ్ము వేయ; నభ్రము గురిసెన్-
    భగ్నం బొందక వర్షము
    సాగ్నికబలమందు వారుణాస్త్రము వేయన్!


    రిప్లయితొలగించండి
  18. అగ్ని రగిలె గర్ణుండటు
    లాగ్నేయాస్త్రమ్ము వేయ: నభ్రము గురిసెన్
    భగ్నము జేయుచు దానిఁ ని
    మగ్నుండై వారుణాస్త్ర మర్జునుడేయన్

    రిప్లయితొలగించండి
  19. భగ్నంబయ్యెను శాంతియత్నమట, సంపాతమ్ములో వారి రో
    షాగ్నిజ్వాలలె మిన్నుముట్టగను భీష్మాచార్యునిన్ నిల్ప ను
    ద్విగ్నుండౌచు కిరీటి యెత్తుల నటన్ భీష్ముండు తా గూల్చెనే
    ఆగ్నేయాస్త్రము వేయఁగన్ గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్

    రిప్లయితొలగించండి
  20. అగ్నులు గురియును భీతిగ
    నాగ్నేయాస్త్రమ్మువేయ,నభ్రముకురిసెన్
    భగ్నముజేయగ గాడ్పును
    విఘ్నేశ్వరుదలచివేయవేష్యపుధనువున్

    రిప్లయితొలగించండి
  21. అగ్ని యెదుటను ద్రి వల్యవ
    లగ్నను బెండ్లాడఁ బత్ని లలనామణియే
    లగ్నం బరసి యలుక నా
    నాగ్నేయాస్త్రమ్ము వేయ నభ్రము గురిసెన్


    భగ్నం బయ్యెను శత్రు సైన్యపు మహాభాగ్యమ్ము వీక్షించు ము
    ద్విగ్నంబై వడిఁ బాఱుచున్నది యహో భీతిల్లి నిర్లజ్జతో
    నగ్నిన్ రాలెడు మండుచుండ నట నాహా నిప్పు రవ్వల్గదా
    యాగ్నేయాస్త్రము వేయఁగం గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్

    రిప్లయితొలగించండి
  22. అగ్నిజ్వాలలుమెండుగానెగయుచున్ నాకాశమందంతటన్
    నాగ్నేయాస్త్రమువేయగన్ గురిసె,వర్షాభ్రమ్ములుద్దండతన్
    భగ్మంబొందగవేడిగాలులుమహాభారంబుతోనుండుచున్
    విఘ్నంబెప్పుడులేకయుండగనుదావేష్యమ్ములన్జార్చెహో

    రిప్లయితొలగించండి
  23. కం:

    భగ్నం బొందగ యెలము
    ద్విగ్నమ్ము నతా ప్రియసఖి వెరపగు వేళన్
    మగ్నంబాయెను మనసదొ
    నాగ్నేయాస్త్రమ్ము వేయ నభ్రము గురిసెన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  24. కందం
    మగ్నుండై పని వింటే?
    భగ్నమ్మౌ నతనితో ప్రవచనమనఁగ! ను
    ద్విగ్నుండై యజ్ఞతననె
    "నాగ్నేయాస్త్రమ్ము వేయ నభ్రము గురిసెన్"

    శార్దూలవిక్రీడితము
    మగ్నుండౌచును నిర్ణయించఁగొన 'బ్రహ్మశ్రీ' లదౌ పట్టికన్
    భగ్నమ్మౌనన వింటివే యొకని నే వారించ నవ్వాడు ను
    ద్విగ్నుండౌచు రణంబు గూర్చి యిటులన్ బ్రేలెన్ గదా! యజ్ఞతన్
    "యాగ్నేయాస్త్రము వేయఁగన్ గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్"

    రిప్లయితొలగించండి
  25. ఇంద్రజిత్ వధ సమయంలో లక్ష్మణునికి మేఘనాధునికి జరిగిన యుద్ధం

    అగ్నిసడలిపోయిన తా
    భగ్నుండై యజ్ఞమున క్షపాచరుడీసున్
    లగ్నకుడగు లక్ష్మణుపై
    ఆగ్నేయాస్త్రమ్ము వేయ నభ్రము గురిసెన్
    (లక్ష్మణుడు వరుణాస్త్రం ప్రయోగించాడని )
    ------- శ్రీరామ్ 10వ తరగతి

    రిప్లయితొలగించండి
  26. భగ్నముజేయగ వ్యూహం
    బగ్నికణమువోలెపార్థుడాదురమందు
    న్నగ్నిశిఖలదలపించెడు
    నాగ్నేయాస్త్రమ్ము వేయ నభ్రము గురిసెన్

    రిప్లయితొలగించండి
  27. లగ్నంబాడగ నెంచినే సరససల్లాపంబులో గాదె ని
    ర్మగ్నంబై పలు గొప్పలన్ బలికితిన్ మర్యాదనే వీడుచున్
    భగ్నంబయ్యెను నాదుయత్నమట నాపల్కుల్ వృథాయయ్యెనే
    యాగ్నేయాస్త్రము వేయఁగన్ గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్

    రిప్లయితొలగించండి
  28. భగ్నంబున్ బొనరించినన్ దప మయుగ్బాణుండు గ్రోధాగ్ని సం
    భగ్నుం డుగ్రుడునై దహించ రతి రూపాస్త్రున్ క్షమించంచు ను
    ద్విగ్నంబై పతిభిక్ష బెట్టుమన నావిర్భూతు నున్జేసె నే
    *"త్రాగ్నేయాస్త్రము వేయఁగన్ గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్"*

    రిప్లయితొలగించండి