18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3490

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సోదరిం బెండ్లియాడెను సోదరుండు" 

(లేదా...)
"సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్"

46 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    ఆదట రామభద్రుడట హాయిని త్రుంచగ శంభుధన్వమున్
    సోదరి తోడుతన్ వరల సుందరి రూపున పెండ్లిపందిరిన్
    కాదనకుండ వేడుకను కమ్మగ జూచుచు జానకమ్మదౌ
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    "కోలొ కోలోయన్న..."

    ఆదర మొందుచున్ తొలుత నంజియె చేరగ డింగరీడుగన్
    వేదన నిచ్చుచున్ తుదకు వేడుక మీర సరోజ మెచ్చగా
    మోదము నొందుచున్ తనరి ముద్దులు మీరెడి లక్ష్మిదేవిదౌ
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్

    రిప్లయితొలగించండి
  3. గు రు మూ ర్తి ఆ చా రి - వె లు గో డు
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,,,,

    { గురువుగారికి మరియు కవివరులకు నమస్కృతులు •

    నిన్నటి పూరణ స్వీకరింప మనవి }



    క్లిష్టపరిస్థితిన్ మదిని ఖేదము నొందని ధైర్యశాలివై ‌,

    నష్టము లెన్ని కల్గినను న్యాయము దప్పక సంచరించుచున్ ‌,

    నిష్టగ నా పరాత్పరుని నీ హృదయంబున సంస్మరించుచున్ ,

    శిష్టుల గౌరవించుచును , చేయుచు నెప్డు పరోపకారమున్ ,

    భ్రష్టగుణాళి బాసి , భగవంతు డొసంగిన దానితోడ సం

    తుష్టినిపొందుసద్గుణముతో * మనుమోయి హితుండ‌ * కాంచినన్

    దుష్టుడు సర్వలోకముల దుర్దశ నొంద కదృష్టవంతుడౌ


    [ భ్రష్టగుణాళి బాసి = దిగజారిన గుణ వర్గమును విడిచి
    కాంచినన్ + తుష్టుడు = కాంచినన్ దుష్టుడు ]


    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి
  4. ధర్మజుండు ద్రౌపదితోడ తా వచించె
    సవ్యసాచియె మారువేషంబు తోడ
    ద్వారకాపురి జని నగధరుని, చక్రి
    సోదరిం బెండ్లియాడెను సోదరుండు

    రిప్లయితొలగించండి
  5. వేద మంత్రముల నడుమ వేల జనుల

    చూచు చుండగా నా నంద సుతుడు రుక్మి

    సోదరిం బెండ్లి యాడెను,సో
    దరుండు

    తల్లి తండ్రులు మదిని సంతసము బడయ

    రిప్లయితొలగించండి
  6. సమస్య :-
    "సోదరిం బెండ్లియాడెను సోదరుండు"

    *తే.గీ**

    ముదురు బెండకాయ కదరా మోహనుండు
    పెండ్లి చేసుకొన నెవడు పిల్లనిచ్చె
    హాస్య మాడు బంధుజనుల నడ్డగించి
    నిజము జెప్పితి నేను నా నేస్తగాడి
    సోదరిం బెండ్లియాడెను సోదరుండు
    ................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  7. ద్వారకా పురియందున తాను శౌరి
    సోదరిని పెండ్లి యాడెను సోదరుండు
    ముసలి వారించునను భయము మదిలోన
    యున్నను కిరీటి హెచ్చిన యుత్సుకతన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మదిలోన నున్నను...యుత్సుకతను.." అనండి.

      తొలగించండి
  8. కృష్ణుడు భగిని గొనిపోవ గినుకనొంది
    యడ్డు పడినట్టి రుక్మిని నణచి , యతని
    సోదరిం బెండ్లియాడెను ; సోదరుండు
    చిందును దిగమింగుచు వారి శివముగోరె

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ముచ్చటైన విధము వనమున హిడింబు
    సోదరిం బెండ్లి యాడెను సోదరుండు
    భీముడు జనని యనుమతితో ముదమున
    భ్రాతలందరు మెచ్చుచు బాళి నొంద

    రిప్లయితొలగించండి
  10. ఉత్పలమాల:
    సోదరియొక్కతే తనకు చూపెను ప్రేమలుగారవం బుగన్
    కాదనుటన్ యెరుంగకను గైకొనుచుండెను కోరినంతయున్
    మోదము చెందగన్ పరగ మోజుయుగల్గిన కోడెకాడుతో
    సోదరి పెండ్లియాడెనిజ సోదరుడెల్లరు సంతసిల్లగన్


    వరగంటి నగేష్

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆదట గూడగా వనమునందున వీడక వెంబడించుచున్
    మోదముతోడ నందముగ ముద్దులు జిల్కిననా హిడింబుదౌ
    సోదరి బెండ్లియాడె నిజసోదరు డెల్లరు సంతసిల్లఁగన్
    ధీదయె జూపి భీముడట తీరుగ తల్లియె సమ్మతించగన్.

    రిప్లయితొలగించండి
  12. మేదినీ జను లెల్లరు మెచ్ఛు కొనగ
    రోష యుతుడైన కృష్ణుడు రుక్మి యొక్క
    సోదరిని పెండ్లి యాడెను : సోదరుండు
    భంగ పడియును కుమిలెను వంత తోడ

    రిప్లయితొలగించండి
  13. వేదపు నాదసూత్రములు విల్లును ద్రుంచగ వెల్లువెత్తుచున్
    మేదిని పుల్కరించెనటు మిన్నును ముట్టగ శ్రీతరంగముల్
    మోదముఁగన్నవా రికన బూర్వపు పుణ్యము నూర్మిళాదులై
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ, డెల్లరు సంతసిల్లఁగన్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  14. సాదరమొప్పద్వారకకుచక్రికిరీటినిస్వాగతించగా
    మోదముతోయతీశ్వరునిబూజనెపంబుసుభద్రనంపగా
    యాదవశెట్టియానతినియాదరణీయుడటంచుశార్ఙ్గికిన్
    సోదరిఁబెండ్లియాడె నిజసోదరుఁడెల్లరు సంతసిల్లఁగన్

    రిప్లయితొలగించండి
  15. ఆదరణమ్ముతో చెలువ హస్తము చేకొని ప్రేమఁ బంచగా,
    సాదరమైన రీతిగను సాగుచు నుండగ కాపురమ్ము ని
    ర్వాదముతోడ, మెచ్చగను బంధువు లందరు గాంచి, గేస్తునిన్
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్
    నిజ: నెచ్చెలి

    రిప్లయితొలగించండి
  16. సోదరింబెండ్లియాడెనుసోదరుండు
    నిట్లుగలదండ్రుముస్లిములింటయార్య!
    సత్యమాయిది?చెప్పుడసత్యమనుచు
    తెలియరాదిదిమఱినాకు దెలుపగలరు

    రిప్లయితొలగించండి
  17. ఆదరమొప్పగారతినియాయదునందనుగారవంపుదౌ
    సోదరబెండ్లియాడెనిజసోదరులెల్లరుసంతసిల్లగన్
    మోదముజిందులారగనుబూతమనస్కయయాసుభద్రనున్
    సాదరమొప్పగానరుడుసజ్జనబృందముగారవించగా

    రిప్లయితొలగించండి
  18. అందచందాలమేల్బంతియంబుజాక్షి
    అంగజునికామెసహజాత యట్టివాని
    సోదరిం బెండ్లియాడెను, సోదరుండు
    పూలవిలుకాడు కురిపించె పూలవాన
    భవ్యచరితుఁడు బావపై భగినిపైన.
    (ఈ ఘట్టం కేవలం కల్పితం)

    రిప్లయితొలగించండి
  19. ఆ ధనహీను గూడి మనువాడగ రాదని తల్లిదండ్రులున్
    క్రోధము నొంద చెల్లియకు కూర్మి యొసంగగ యన్న, యంతటన్
    వాదములాపి పెద్దలు వివాహము నొప్పుకొనంగ ప్రేమికున్
    సోదరి బెండ్లియాడె, నిజ సోదరు డెల్లరు సంతసిల్లగన్ !
    (సోదరుడె ల్లరు = సోదరుడు మఱియు అందరు)

    రిప్లయితొలగించండి
  20. *ధర్మరాజు ద్రౌపదితో పలికిన పలుకులుగా* . భేదము చూపబోడు చెలి పేరిమి వీడడు నిశ్చయంబుగా
    నీదరి చేరువాడిదియె నిక్కము నా నుడులాలకించుచున్
    వేదన వీడుమింక నరి వీర భయంకరుడైన మాధవున్
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్

    రిప్లయితొలగించండి
  21. ఎలమి మేనరికమ్మని యెల్ల రమ్మ
    లక్క లాడ గుసగుసలు మిక్కుటముగ
    వారి కౌ నతం డట మేనబావ యాడె
    సోదరిం బెండ్లి, యాడెను సోదరుండు


    పాద వృతాందుక స్వన విభాసిత నంచిత సింహమధ్య శా
    తోదరిఁ గంబుకంఠి సిత తోయజ నేత్ర నరాళ కుంతలన్
    సాదర వాక్యఁ జంద్ర సదృ శాస్య నొకండు సువర్ణవర్ణ భా
    సోదరిఁ బెండ్లియాడె, నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్

    [భాస +ఉదరి = భా సోదరి]

    రిప్లయితొలగించండి
  22. ఉ:

    ఆదర స్వాగతమ్ములును హాస్యపు జల్లుల మేలనమ్ములున్
    నాదము శ్రావ్యమైనదగు నవ్వుచు త్రుల్లెడి బాల్య స్నేహితుల్
    వేదిక వేదమంత్రములు ప్రీతుడు బావయె వైభవమ్ముగా
    సోదరిఁ బెండ్లియాడె, నిజ సోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  23. తేటగీతి
    శివుని విల్లు విరచి దోచి సీత మనసు
    రామచంద్రుడు పెళ్లాడె రంజిలంగ
    మెచ్చి సౌమిత్రి కెంచ నూర్మిలను సీత
    సోదరిం, బెండ్లియాడెను సోదరుండు

    ఉత్పలమాల
    ఆదరమొప్ప రాముఁడు శరాసనమున్ దగ నెత్తి త్రుంచి స
    మ్మోదముఁ గూర్చిజానకికి ముచ్చట నందెడు పెళ్లి వేదిపై
    వేద విధాన లక్ష్మణుని బేర్మిని నూర్మిళ కెంచ సీతకున్
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్


    రిప్లయితొలగించండి
  24. ధర్మజుండును సోదరుల్ ధరను త్రవ్వి
    కారడవిలోన పయనించు వారలవగ
    కుంతి హిడింబు సోదరిన్ కూడుమనగ
    సోదరిం బెండ్లియాడెను సోదరుండు

    రిప్లయితొలగించండి
  25. ఆదరమొప్పగా బిలిచి యల్లునితో యని రత్త మామలున్
    మాదు కనిష్ఠ పుత్రికకు మాన్యుడు నీ యనుజుండు జోడనిన్
    మోదము దోడ నంత దగు మూర్తమునందున నన్న భార్యకున్
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్

    రిప్లయితొలగించండి
  26. సాధుజనావనుండయిన చక్రిసహోదరిపట్ల ప్రేమతో
    సాధువువేషధారణముసల్పుచుజేరెసుభద్ర చెంగటన్
    ఆదరమొప్ప పార్థుగని హాలుడు పెండ్లికి నిచ్చగించగన్
    సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్

    రిప్లయితొలగించండి