5, సెప్టెంబర్ 2020, శనివారం

సమస్య - 3478

కవిమిత్రులారా,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

 ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తగవులం బెట్టువా రుపాధ్యాయు లనఁగ"

 (లేదా...)
"తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్"

67 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    వగలన్ దెచ్చెడి ప్రాసలన్ యతులనున్ వైషమ్యమున్ గాంచుచున్
    సెగలన్ గ్రక్కుచు బెత్తమున్ విసరుచున్ శృంగార రూపమ్మునన్
    నగుచున్ వెఱ్ఱిగ బాగులేవనుచు నానా రీతులన్ హాయిగా
    తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      "యతులనున్ వైవిధ్యమున్ గాంచుచున్...విసరుచున్ జిత్రంపు రూపమ్మునన్..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  2. పిల్లల మనసులలో నీ పైవాని గెలవాలి అన్న పద్ధతి మితిమీరేట్టు చేసేవారేగా దీనికి కారణం...

    మ||
    పగలున్ రేలటు పుస్తకంబు పఠనంబంచున్ బడన్ వెంటనా
    వగయన్ పిల్లల మానసంబునిడ 'నీ పైవానినెక్కంగనే
    జగమున్ దిగ్విజయంబటంచు' బడిలో సంగ్రామకార్యోర్థులే
    తగవుల్ బెట్టిన వారలేగద! యుపాధ్యాయుల్ విచారించినన్!

    ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    సగమౌ వేళల క్లాసులన్ విడుచుచున్ సాధించి ట్యూషన్లనున్
    బిగువౌ రీతిని పెంపుచున్ గృహములన్ బీభత్సమౌ వేడుకన్
    పగనున్ బూనుచు భత్యమున్ భరణమున్ వర్ధిల్లగన్ జేయుమన్
    తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

    రిప్లయితొలగించండి
  4. తగవు లంబెట్టువారుపా
    ధ్యాయు లనగ

    బోరు నెచ్చోట నైనను,బోధనమ్ము

    చేయుచు ననవరతము, మంవిని తెలుపుచు,

    వినయమును నేర్పు చుండెడి ఘనులు గాదె

    రిప్లయితొలగించండి
  5. తామొసగిన జవాబులె తగినవనుచు
    తగవులాడెడి శిష్యులం దరికి జేర
    బిలిచి తగినట్టి విధముగ విశదబరచి
    తగవులం బెట్టువారుపాధ్యాయు లనఁగ

    తగవు = జగడము , యుక్తము
    పెట్టు = ఇచ్చు

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అచ్చు గూడిన చదువుల నరయ జేసి
    మంచి చెడ్డల తారతమ్యములు కఱపి
    మతియు నజ్ఞతల మధ్య సతము గొప్ప
    తగవులం బెట్టు వారుపాధ్యాయులనగ.

    రిప్లయితొలగించండి
  7. సమస్య :
    తగవుల్ బెట్టెడివారలే కద యుపా
    ధ్యాయుల్ విచారించినన్
    (నేటి పోటీప్రపంచంలో పిల్లలపట్ల కన్నవారి ప్రవర్తన - గురువుల ప్రవర్తన )
    సెగలన్ జిమ్మెడి మాటలన్ బితరులే
    చీకాకు చెందించుచున్
    దగవుల్ బెట్టెడివారలే కద ! యుపా
    ధ్యాయుల్ విచారించినన్
    నగవుల్ జిందుచు బోధనాపటిమతో
    నానాటికిన్ శిష్యులన్
    జగమే మెచ్చెడి పౌరసత్తములుగా
    జాతీయతన్ దీర్చరే !!
    ( పితరులు - తల్లిదండ్రులు ; విచారించు- ఆలోచించు)

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పగిదౌ వెల్గెడి విద్యలన్ కఱపుచున్ పాఠీన బృందమ్ముకున్
    సొబగున్ గూడిన రీతి మంచిచెడులన్ సోమించి బోధించుచున్
    తగు భంగిన్ ఘన విత్తికిన్ వెడగుకున్ దాఖ్యమ్ముతో నిత్యమున్
    తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బృందమ్మునకున్, వెడగునకున్...' అన్నవి సాధు రూపాలు.

      తొలగించండి
    2. పగిదౌ వెల్గెడి విద్యలన్ కఱపుచున్ పాఠీన వర్గమ్ముకై
      సొబగున్ గూడిన రీతి మంచిచెడులన్ సోమించి బోధించుచున్
      తగు భంగిన్ ఘన విత్తి యజ్ఞతలకున్ దాఖ్యమ్ముతో నిత్యమున్
      తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

      తొలగించండి
  9. వగపున్ జూపక నిత్యమున్ మనమునన్ వాత్స్యల్య మేపారగా
    జగమున్ ముంచెడి నర్ధకామముల యజ్ఞానంపు జీకట్లనే
    తగులంబెట్టెడు వారలౌనుగ నుపాధ్యాయుల్ ! యసత్యంబెటుల్
    తగవుల్ బెట్టెడి వారలేగద యుపాధ్యాయుల్ విచారింపగన్?

    రిప్లయితొలగించండి
  10. జ్ఞానబోధలు చేయుచు చక్కగాను
    చదువు సంస్కారమును నేర్పు సద్గురువుల
    తగవులంబెట్టువారుపాధ్యాయులనగ
    నుచిత మెప్పు డు కాదందు రుర్వి యందు

    రిప్లయితొలగించండి


  11. ఒకరి మధ్య మరియొక బాలునకు మేలు
    గూర్చగా చదువున వారు కొట్టుకొనుచు
    తగవులం బెట్టువారు పాధ్యాయు లనఁగ
    తప్పు లేదు స్పర్ధ వలయు ధరణి లోన!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "ఒకరి మధ్య మరొక బాలునకును మేలు" అందామా?

      తొలగించండి
  12. భేదమెంచక పాఠముల్ విశద పరచి
    సాంపరాయమున తనదు ఛాత్రులకును
    హెచ్చు తగ్గు గుణములిచ్చి నెల్లవేళ
    తగవులం బెట్టువా రుపాధ్యాయు లనఁగ

    రిప్లయితొలగించండి
  13. తగవు పడుచుండు శిష్యుల తగవు దీర్చి
    చదువు లందున మాత్రమె స్పర్ధ లనుచు
    తగవులకు సరియగునట్టి దారి చూపి
    తగవులం బెట్టువా రుపాధ్యాయు లనఁగ

    రిప్లయితొలగించండి


  14. తగునా వీరికి జుట్టుపట్టుకొని నిర్ధారింపగా తప్పులన్?
    పగవారోయని పించు వారిని గనన్ పట్టింపులన్ జూడగా
    జగదానందము గూర్చు స్పర్ధనరరే సాధింప విద్యార్థులే
    తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. స్పర్ధయా వర్ధతే విద్యా

    తగవెం దైనను గాంచమో పరిధినిన్ దాటంగ లేనంత నా
    తగ వెంతో ఫలమిచ్చు విద్యలను స్పర్ధారూపకోత్తారిణీ
    సుగుణమ్మై, ఫలితార్థయోజకులునై శుద్ధార్తిసంధాతలై
    తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  16. వెనుకబడుచున్న వేళల విద్యలందు
    మేటివిద్యార్థితోగట్టి పోటివెట్టి
    విద్యగరపుచుశిష్యులమధ్యనెపుడు
    తగవులం బెట్టువా రుపాధ్యాయు లనఁగ

    రిప్లయితొలగించండి
  17. తగవుల్ బెట్టిన తన్నినన్ గురుడు విద్యా దానము జేయుచున్
    జగతిన్ మేటిగ శిష్యు నిల్పి; పితయై సర్వజ్ఞతల్ గూర్పడే !
    పగకై నిల్పెను చంద్రగుప్తు నృపుగన్ వర్ధిల్ల చాణక్యుడున్
    తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దానమున్ జేయుచున్' టైపాటు. లేకుంటే గణభంగం.

      తొలగించండి


  18. కంద గీతి


    ఠవణింపగ స్పర్ధయె పా
    టవమెల్ల పెనుపు గొన చవటల మార్చుచు ‌వి
    ప్లవములకు తగవులం బె
    ట్టువా రుపాధ్యాయు లనఁగ టొంకు గలుగునే?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    🙏తస్మై శ్రీ గురవే నమః🕉🚩💐🙏

    భగవద్రూపులు జ్ఞానభాస్కరులు తత్త్వజ్ఞుల్ దమిన్ బోధనం
    బగలున్ రేలు సమాజశాంతిహితధర్మస్థాపనోత్సాహులౌ
    యుగకర్తల్.,భువనైకవంద్యులు గురుల్.,యుక్తంబె నీవిట్లనన్
    దగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి అధిక్షేపాత్మకమైన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  20. మంచి విజ్ఞాన మందించు మాన్యు లగుచు
    భావి పౌరుల నందింత్రు పట్టు బట్టి
    విద్య నార్జించు విషయాన ప్రేమ మీర
    తగవు లంబెట్టు వారు పాధ్యాయు లనగ

    రిప్లయితొలగించండి
  21. 'స్పర్ధయా వర్ధతే విద్యఁ'బలుకుబడినిఁ
    జిలికి యక్షర సత్యమ్ము సేయఁ గోరి
    కదిపి విద్యార్థులకు మధ్యఁ జదువులందుఁ
    దగవులం బెట్టువారుపాధ్యాయు లనఁగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

      తొలగించండి
  22. శిష్య కోటి కభ్యున్నతి చేకురంగ
    స్పర్ధ కలిగించ బోవగ చదువులందు,
    తగవులం బెట్టు వారు పాధ్యాయులనగ
    చెల్లదు హితుడా! గురువులే శ్రేష్ఠులిలను !

    రిప్లయితొలగించండి
  23. భగవంతుండని గాదె యొజ్జలను సంభావించి పూజించెడిన్
    జగతిన్ బుట్టిన నీవు పల్కితివి ప్రజ్ఞాశాలివై నివ్విధిన్
    తగవుల్ బెట్టెడి వారలే గద యుపాధ్యాయుల్ విచారించినన్
    తగునా నీకిది మిత్రమా వలదికన్ ధర్మంబు కాదందునే.

    రిప్లయితొలగించండి
  24. మత్తేభవిక్రీడితము
    సుగతిన్ బొందఁగ భావిభారతమహో శోభాయమానమ్ముగన్
    నిగమార్థంబుగ వారసత్వమిడెడున్ నిస్వార్థ భావంబుతో
    పగతో గాకయు విద్యనేర్చు కతనన్ స్పర్ధింప శిష్యాళికిన్
    దగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

    రిప్లయితొలగించండి
  25. తగవులంబెట్టువారుపాధ్యాయులనగ
    నేమియిట్లుగబల్కిరియార్యులయ్యు
    దగవులందీర్తురుగనుపాధ్యాయులవని
    వందనంబులుసేతునువారికిపుడు

    రిప్లయితొలగించండి
  26. రిప్లయిలు
    1. తగవున్ దెచ్చెను పంచజన్యు నెడ పుత్రారక్షకై యొక్కడున్
      తగవున్ దెచ్చెను రుక్మి దోడ గన వార్తావాహుడై యొక్కడున్
      తగవున్ దెచ్చెను ధర్మ రక్షణకు గీతాచార్యుడై యొప్పునన్
      తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

      తొలగించండి
  27. చదువులందు మరియు నాటలందు నెపుడు
    స్పర్థ వలన గలుగు మేలు సరిగ దెలిపి
    తగిన నియమంబులఁ దగిన దారులందు
    తగవులం బెట్టువా రుపాధ్యాయు లనఁగ

    రిప్లయితొలగించండి
  28. తగవుల్బెట్టెడివారలేకదయుపాధ్యాయుల్ విచారించినన్
    తగవుల్ బెట్టెడువారుకాదుగనుపాధ్యాయుల్ సమీక్షించగా
    దగవుల్దూరుచునెయ్యముందనరిదాదాత్మ్యంబుతోనుండుచున్
    జగడంబెప్పుడులేకయుండగనుబ్రఙ్ఞాశాలిగాజేయుగా

    రిప్లయితొలగించండి
  29. గురునిపూజజేయగుణవంతుజేయును
    రుజయుతొలగుగురునిరూపుజూడ
    దేశికుండునగుచుదేశాలుదిరిగెడు
    వరలుమేటిగురువ!వందనములు

    రిప్లయితొలగించండి

  30. పిన్నక నాగేశ్వరరావు.

    జ్ఞాన తృష్ణను కలిగించి ఛాత్రులందు
    సంపదను వృద్ధి చేయు తలంపుతోడ
    వారి బాగుకై వారిలో స్పర్ధ యనెడు
    తగవులంబెట్టు వారుపాధ్యాయు లనగ.

    రిప్లయితొలగించండి
  31. చదివిన చదువులఁ బటిమ సవ్య భంగి
    నంచితమ్ముగ సర్వ విద్యార్థు లందు
    నర్హతల నెంచఁగఁ దగవు లనఁగఁ దోఁచు
    తగవులం బెట్టు వా రుపాధ్యాయు లనఁగ

    [తగవు = జగడము, న్యాయము]


    నిగమక్షీణపు విద్య లేల యిలలో నేర్వంగ యోచించుమా
    యగు ణాన్యాయ విధాన మియ్య దని విద్యానైపుణీ శోధనం
    బగలే పుట్టఁగఁ దారతమ్యము లెదన్ వర్ధిల్ల విద్యార్థులుం
    దగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

    [నిగమము = మార్గము]

    రిప్లయితొలగించండి
  32. మ:

    యుగముల్ మారిన మారుగాక ఋషులై యున్నారుపాధ్యాయులే
    పగలున్ రాతిరులొక్కటై ప్రగతినాపాదింప జీవాళికిన్
    తెగలన్ గూరిచి వారు వీరనక విద్దెన్నేర్ప నాస్పర్ధతో
    తగవుల్ బెట్టెడి వారలే కద యుపాధ్యాయుల్ విచారించగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  33. యుగమేదైనను గల్గరే యరుదుగా
    నున్మాద చిత్తుల్ ధరన్
    జగమందుండెడి దోపిడిన్ జెణకుచున్ సంసిద్ధులన్ జేయుచున్
    బిగువౌ మాటల ఛాత్రులన్ మరలగా
    బీభత్సమౌ త్రోవకున్
    తగవుల్ బెట్టెడి వారలేగద యుపాధ్యాయుల్ విచారింపగన్

    ఒకప్పుడు విశ్వవిద్యాలయాలు కమ్యానిస్టు భావజాలానికి, తర్వాతి కాలంలో కులరాజకీయాలకు, ఇటీవల మతరాజకీయాలకు నెలవు
    లవుచున్నవి. ఎక్కడైనా దోపిడీయే ప్రధాన విషయమౌతున్నది.

    🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  34. జగతిన్ శిష్యులు పేరుపొంద కడునుత్సాహమ్ము కల్గించుచున్
    పగలున్ రేయుయు నిచ్చతోడుతను నిర్వర్తించుచున్ బాధ్యతల్
    ద్విగుణంబౌచును వారిదౌ ప్రతిభయున్ పెంపొందగా, స్పర్థకై
    తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్

    రిప్లయితొలగించండి
  35. నాడు నేడైన గురువుల నాణ్యతరయ
    చెరగలేదెంతయు జనుల యురములందు
    అతిగనాశించి సన్మానమంద గోరు
    తగవులం బెట్టువా రుపాధ్యాయు లనఁగ!!

    రిప్లయితొలగించండి