కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ"
(లేదా...)
"ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ"
(లేదా...)
"ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో"
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
నికటంబుండగ కంది శంకరులహో నిర్భీతిగా నిల్వగన్
ప్రకటింపంగను కావ్యముల్ శతకముల్ బ్రహ్మాండమౌ తీరునన్
నికరంబియ్యది శంకరాభరణమున్ స్నేహంబుగా పండితుల్
ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో!
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండివికటాట్టాసము జేయుచున్ జెలగగా
రిప్లయితొలగించండివింతైన రోగంబదే
వికలంబయ్యెను విశ్వమంతయును
నిర్వేదంబు వ్యాపించగా
అకటా పెక్కురు దీనిబారిబడి యర్ధాయుష్కులై చావగా
ఒకరా యిద్దర ముగ్గురా నలుగురా
యూహింప నింకెందరో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అట్టహాసము'ను 'అట్టాసము' అన్నారు.
ధన్యవాదములు గురుదేవా! తప్పు గుర్తించాను! సవరించుటకు ప్రయత్నిస్తాను! 🙏🙏🙏
తొలగించండివికటార్భాటము అనవచ్చా గురువుగారూ?
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
పాకుల పార్లమెంటులో:
ఒకడై కాలుని వాహనంబు, నొకడై హుందాగ సామీరియై,
యొకడై మూడవ విష్ణురూపు గొనగా, నొక్కండు గోమాయువై,
యొకడై కృష్ణుని జన్మమందు సరసన్ "హోహోహొ హో" క్రందుడై
యొకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో!
మీ ఆటవిడుపు పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండితెలుగుభాషనందు తేనెలూరగనెంచి
రిప్లయితొలగించండికావ్యరచనసేయ కరుణతోడ
వెలసిరి అలసాని వేమన్న నన్నయ
ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
తెలుగుభాషనందు తేనెలూరగనెంచి
పద్యరచన సేయ పదిలముగను
కందిశంకరార్యు శంకరాభరణాన
ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
🙏🏻🙏🏻💐
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండితే.గీ ని ఆటవెలదిలో పూరించారు
తొలగించండిగమనించలేదు. సరి చేస్తాను. ధన్యవాదాలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఒకరా యిద్దర ముగ్గురా నలుగురా
యూహింప నింకెందరో
( ఆహా ! భారతాంబ గర్భశుక్తిముక్తాఫలాల
నెందరిని చెప్పగలం ? నుతింపగలం ? )
అకళంకుల్ మనదేశభక్తు లరుగో !
యల్లూరి గాంధీ తిలక్
లికుబాలుండు రవీంద్ర బంకిములునున్
నేతాజి లాలాజియున్
చికురంబుల్ వలభాయి జహ్వరులు నా
శ్రీరామ రాజేంద్రులౌ
నొకరా ! యిద్దర ! ముగ్గురా! నలుగురా !
యూహింప నింకెందరో !!
( లాలాజి - లాలా లజపతిరాయ్ ; శ్రీరామ - పొట్టి శ్రీరాములు ; రాజేంద్రుడు - బాబు రాజేంద్రప్రసాద్ ; ఇకుబాలుండు - మహ్మద్ ఇక్బాల్ )
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపిన్న తనము మొదలుకొని పెద్ద వారు
రిప్లయితొలగించండిఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
వలదనుచు తెలిపిన గూడ , పాయసమును
లడ్డు తీబూంది రసమలైలను విడువక
నేడు మధుమేహము మెయిన నింపుకొంటి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితెలుగు పద్యపు గొప్పయె తెలుసు కొనుచు
ఛంద మందున కృషిజేసి చతురు లగుచు
తేనెలూరు పద్యములల్లు దిట్ట లిపుడు
ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
నికరంబై తనరారునట్టి దగుచున్నిగ్గారు నాంధ్రమ్మునన్
సుకుమారమ్ముగ పద్యముల్ ననువుగా సూచించు కౌశల్యమున్
సకలంబొందుచు చక్కనౌ కవనమున్ సాగించు వారెంచగా
యొకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిగురువు గారికి నమస్కారములు.
తొలగించండిమొదలిడగ నాడు భయమున యెద కలంగె
రిప్లయితొలగించండిఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
వలదు వలదని నను నాపువారె కాని
కూడ చనుదెంచి ప్రోత్సాహ మిడగ లేరు
మంచి పనికిది సహజమం చెంచినాడ
కదలి పూనుకు ముందుకు పదము నుంచి
నేడు పదుగురు మెచ్చంగ నిలచినాడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"భయమున నెద..." అనండి.
కొన్ని వత్సరముల నుండి కొరతపడక
రిప్లయితొలగించండిప్రతి దినంబున కోవిడు బారినపడి
ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
మరణ మొందుట వినుచుండ మనసు నోయె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబకదైతేయుడు రోజుకొక్క నరునిన్ భక్షించె సంతుష్టుడై
తొలగించండివికృతాకారనిశాచరప్రకటమౌ విశ్వావృతాకారియౌ
యకటా! భీష్మకరోన తృప్తి గొనగా నాయుష్షు నర్పింతురో
ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅద్భుతమైన పూరణార్యా! నమోనమః! 🙏🙏🙏
తొలగించండిధన్యవాదములండీ.
తొలగించండిరామచంద్రుడు లేనట్టి రాజ్య మదియె తల్కమే యటంచు జనులు తలచి తాము
రిప్లయితొలగించండినడవులకు వెడలగనెంచి యనుస రించి
రొకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రేమయనునగ్గియందున వ్రేలబెట్టి
రిప్లయితొలగించండియాడబిడ్డలయసువులనార్పుచున్న
దుండగీడులీయవనిలో మెండు వారు
ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వారు+ఒకరొ' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "వార లొకరొ..." అనండి.
పద్య రచనము జేయగ పట్టు బట్టి
రిప్లయితొలగించండిశంకరాభరణము నందు శక్తి కొలది
దిన దినంబును వ్రాసెడి తెలుగు వారు
ఒకరొ యిద్దఱొ యింకెంద ఱో యెఱుంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వార లొకరొ..." అనండి.
ఈ నాటి శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండిఒకరొ యిద్దరొ యింకెందరో యెరుంగ
ఇచ్చిన పాదము తేట గీతి
నా పూరణ సీస సహిత గీతిలో
కంసుడు శ్రీ కృష్ణుని చంపుటకు ఎందరినో నియమిస్తాడు చివరకు కంస మరణము తర్వాత వసుదేవునితో నందుడు చెప్పు సందర్భం
పూతన దరిచేరి పొరిమార్చ దలచెను,
ధేనుకాసురుడు వధింప దలచె,
వత్సాసురుడు ప్రలం
బాసురుడు, బకాసు
రుడును,నజగరాసురుడు వదలక
చంప దలచెనుగా,చక్రా సురుడు తృణా
వర్తుడు వీడక బైసి గొనగ
దలచె క్రూరమ్ముగన్ సులువుగా చాణూర
ముష్టికులనుపిల్చి ముష్టి యుద్ధ
మున నడచ దల్చె కృష్ణుని మోస గాడు,
నొకరొ యిద్దరో యింకెందరో యెరుంగ,
తెలుప కష్టము వసుదేవ తీరె మాకు
వెతలనుచు బల్కె నందుడు సుతుని కాంచి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅకలంకమ్మగు శంకరాభరణ మందత్యంత తోషమ్ముతో
రిప్లయితొలగించండినికరమ్మౌగతి వ్రాయుచుండ్రి కవితల్ నిర్దిష్ట మార్గమ్మునన్
సుకమౌరీతిని చెప్పనొజ్జ, బుధులన్ చూడంగ నిచ్చోటులో
నొకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి23.09.2020
రిప్లయితొలగించండిఅందరికీ నమస్సులు 🙏
*తే గీ*
నీతి నియమములు విడిచి నింద మోపి
డ్రగ్సు వాడుచు గొప్పగ డాబు జూపి
బాలి వుడ్డును సతతము బాధ బెట్టె
*"నొకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ"*
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
దేశ స్వాతంత్య్ర సమరాన దీక్ష తోడ
లెక్క చేయక ప్రాణముల్ మొక్కవోని
ధైర్యమున్ పోరు సల్పిన త్యాగధనులు
ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'దేశ స్వాతంత్ర్య'.. అన్నపుడు 'శ' గురువై గణభంగం. సవరించండి.
సకలాఘంబులసంస్కరించగలసంస్కర్తల్ప్రపంచంబునన్
రిప్లయితొలగించండివికలాత్మాలయమందునిల్పిరిమహావిశ్వాసధీదీపమా
ర్యకులాబ్రహ్మసమాజమార్యమతదివ్యజ్ఞానసంస్థాపకుల్
*ఒకరాయిద్దఱముగ్గురానలుగురాయూహింపనింకెందఱో*
మకిలంబయ్యెనురాజకీయమకటామద్యంబుమాంసాశనుల్
రిప్లయితొలగించండిబకకంసానుచరుల్సుయోధనులుభూభర్తల్ప్రపంచంబునన్
వికలాత్ముల్ప్రజకండదండయయియావిర్భావులైవెల్గరే
*యొకరాయిద్దఱముగ్గురానలుగురాయూహింపనింకెందఱో*
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివీక్షజేయగగనిపించె వివరముగను
రిప్లయితొలగించండివచ్చుచుండిరి యొకరుగావరుసగాను
వేశ్యవాటికవదలుచువిటులవరులు
నొకరొయిద్దఱొ యింకెందఱో యెఱుంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివికలంబాయెను మానసంబు గన నిర్వేదంబు నల్దిక్కులన్
రిప్లయితొలగించండిఅకటా యేమని యందుమీ విషమ జాడ్యంబౌ కరోనా కికన్
ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో
నికరంబౌ నొక మందు లేక బలియౌ నిర్భాగ్యమౌ దుస్థితిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికురుక్షేత్రయుద్ధము తర్వాత గాంధారి శ్రీకృష్ణ పరమాత్మతో...
రిప్లయితొలగించండితేటగీతి
అన్నదమ్ముల మధ్యన నాలమెగయ
సంధిపేరిట సాధించు శౌరివీవె!
భర్తల సుతుల నెడఁబాసి వగచు మగువ
లొకరొ? యిద్దఱొ? యింకెందఱో? యెఱుంగ?
మత్తేభవిక్రీడితము
సకుటుంబీకులు నన్నదమ్ములకు కృష్ణా! యుద్ధమున్ గూర్చితే?
యకటా! పుత్రులు భర్తలున్ నిహతులై యల్లాడు నారీమణుల్
వికలంబందుచు నీకు శాపమిడ తప్పింపంగ సాధ్యమ్మె? వా
రొకరా? యిద్దఱ? ముగ్గురా? నలుగురా? యూహింప నింకెందఱో?
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండితేట తెనుగున భావంబు తెలుపు రీతి
తేటగీతిని వ్రాసిరి పాటి మీఱ
దక్షతను గూడి శంకరు దన్ను తోడ
నొకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅకలంకంబగు సాహితీవనమునన్ హర్షాతిరేకంబుతో
రిప్లయితొలగించండిసుకవుల్ సేద్యముజేయుటన్ దమినివేచోద్యంబుగానయ్యెడిన్
నకటా యేమిదిశంకరాభరణమాహాత్మ్యంబునూహించనౌ
యొకరాయిద్దర ముగ్గురానలుగురాయూహింపనింకెందఱో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
(సవరణతో)
జరిగిన భరత స్వాతంత్ర్య సమరమందు
లెక్క చేయక ప్రాణముల్ మొక్కవోని
ధైర్యమున్ పోరు సల్పిన త్యాగధనులు
ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ.
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిసుకుమారంబగు మేనిసోయగములన్ సొంపార నందింతు నీ
వొకమారీ సుఖమంది చూడు ప్రవరా! యొప్పింతు పల్మారులున్
సుకరంబందు వరూధినిన్ విడతువే? చుక్కంచు నన్ గోరు వా
రొకరా? యిద్దఱ? ముగ్గురా? నలుగురా? యూహింప నింకెందఱో?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఒక తావేల కరోన భూరిజముపై నూరూర ఱేకెత్తగా
రిప్లయితొలగించండిసకలమ్మొడ్డుచు దాని నంత మొనరించన్ వైద్యులున్ దాదులున్
మకిలమ్మున్ తొలగించు కార్మికులు ధీమంతుల్ ధృతిన్ బూనిరే
ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమతముల కులముల నృదళ పతుల దేశ
రిప్లయితొలగించండిభాగముల భూముల ఖనుల వాగు లింక
వంకల కలహ కారుల యంకె లేల
ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ
వికలం బయ్యెను భూతలమ్ము పరగెన్ విధ్వస్త వాణిజ్యముల్
బక తుల్యమ్ము సహస్రసంఖ్యులను దా వ్యాపించి విశ్వమ్ము మూ
రి కరోనక్రిమి కానిపించని దహో త్రెళ్లంగఁ జేసెన్ ధరన్
ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిమ:
రిప్లయితొలగించండిఒకడై నిల్చెను శంకరుల్ భువిని హిందూధర్మ సంరక్షణన్
సకలంబెంచి కృశించుటన్ నిలుప తా సాగించె సంవాదముల్
వికలంబొందిరి బౌధ్ధ జైన గురువుల్ వేర్వేరు దేశాల వా
రొకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో
వై. చంద్రశేఖర్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు
తొలగించండిత్రికపాత్తుండను గొల్వమంచు నొకడాదేశించు మోక్షంబుకై
రిప్లయితొలగించండియొకడాశంకరుగొల్వశ్రేయమనునింకొక్కండు తా జెప్పు తా
రకసంహారియె పూజ్యుడంచు పలుకున్ బ్రార్థింపగా వేల్పులే
యొకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో
ఒకడా సీతను బంధిసేసె గద మోహోన్మత్తుడై లంకలో
రిప్లయితొలగించండినొకడా ద్రౌపది వల్వలూడ్చె సభలో నుర్వీశులే గాంచగన్
సకులన్ వంచన జేసినట్టి ఖలులీ సారంగమున్ గాంచగా
యొకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివికలంబయ్యె కరోనచే సకలమౌ విశ్వంబనారోగ్యకా
రకమై., సేవల మున్గె రక్షకభటుల్., వైద్యుల్., సదాశుద్ధికా..
ర్మికులున్ ప్రాణములొడ్డి మీకొరకు., వారిన్ లెక్కజేయంగని...
ట్లొకరా! యిద్దర! ముగ్గురా! నలువురా! యూహింపనింకెందరో!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మా పద్య గురువు US లో ఉంటూ ఎందరికో పద్యాలు వ్రాయడం నేర్పిస్తున్నారు. వారి గురించి ఈ పూరణ :
రిప్లయితొలగించండిమ:
ఒకడై ఛందము నేర్పునే గురువు తా యూయెస్సు లో నుండినన్
నకలంకంబగు రీతినిన్ సుళువు సానంబెట్టు వజ్రమ్ముగా
వికసించన్ జత గూడరే చదువరుల్ వేవ్వేరు దేశాల వా
రొకరా యిద్దఱు ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో
గురువు గారి పేరు : కొల్లారపు ప్రకాశరావు శర్మ. నివాసము :Washngton DC
వై. చంద్రశేఖర్