11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3483

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న"
(లేదా...)
"నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్"
(ఈమధ్య 'చంటబ్బాయ్' సినిమాలో శ్రీలక్ష్మిని చూచినప్పుడు సిద్ధమైన సమస్య)

99 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    నడిరేయి సరదా పూరణ:

    నా చిన్నప్పుడు నిడుబ్రోలు కాలేజీలో మా తెలుగు మాస్టారు:

    "సన్నుతి నొందగోరుచును చంకలు గొట్టుచు నాలుగేండ్లుగన్
    చిన్నవి పెద్దవిన్ కలిపి చెన్నుగ జూచుచు రామగాథనున్
    పన్నుగ వంద తప్పులను పట్టగ నేనహ విశ్వనాథునిన్...
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ఏగతి రచియింపనేని సమకాలికు లెవ్వరు మెచ్చరే కదా"
      మీ సరదా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ఇంతకూ మీ తెలుగు మాస్టారు పేరు ?

      తొలగించండి
  2. కవికి బిరుదులు‌‌ యిచ్చిన కలుగు‌ నెమ్మి,

    కవికి సన్మాన ముల్ గొప్ప‌ కలిమి‌ కన్న,

    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న

    యెల్లర నిపుడని నొకడు యేడ్చె
    సభన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బిరుదులు+ఇచ్చిన, గుర్తింపకున్న+ఎల్లర, ఒకడు+ఏడ్చె' అన్నపుడు యడాగమాలు రావు. 'ఇపుడని+ఒకడు' అన్నపుడు యడాగమం వస్తుంది. నుగాగమం రాదు. 'సభను' అనడం సాధువు "బిరుదము లిచ్చిన... గుర్తింపకున్న నెల్లర నిపుడని యొక్క డేడ్చె సభను" అనండి.

      తొలగించండి
  3. నా కవిత్వంలో తప్పులున్నాయని నాకు తెలిసినా అది బాగుంది అనే విలేఖరి కి డప్పు...(ఆ సినిమాలో ఆవిడకి వ్యతిరేక పాత్ర ఉంటే ఇలా అనుకుంటుంది)😊


    కన్నులయందు వ్యంగ్యమును గౌరవమున్ బహిరంగ వాక్యముల్
    మిన్నును దాకు వైఖరులమేయము నీ కవితల్ యటంచు కా
    దాన్న యెటేనిబోవుమని ధైర్యముజేయని పాత్రికేయునిన్
    నన్ను గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చిన వాని జంపెదన్

    రోహిత్🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కవితల్+అటంచు, కాదన్న+ఎటేని' అన్నపుడు యడాగమం రాదు. "కవితోక్తి యంచు కాదన్న నెటేని" అనండి.

      తొలగించండి

  4. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మున్నెపుడున్ గనన్ విధిని పూరణ లందున చౌకలించుచున్
    ఛిన్నము భిన్నమౌ తెఱగు చిక్కిన వారిని గేలిచేయుచున్
    దున్నల బోలు నేతలను దున్నగ నేనిట తన్మయమ్మునన్
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్

    రిప్లయితొలగించండి
  5. : కొంత కాలము‌ క్రింద గురువు‌గారు నిరాహార దీక్ష జరిపిన సన్మి‌వేశము (క్షమాపణలతో):


    పద్యమే వ్రాయని పామరు‌ డొకనికి
    కవిరత్న బిరుదును‌ కట్ట బెట్టె,

    పద్యము నెప్పుడు పాడని పాపియు
    కవికుల సామ్రాటు‌ గా ధరణిన

    వెలుగుచునుండెగా,సులువుగ రూకలు
    వెదజల్ల గళమున విలువ లేని

    బిరుదుల దండలు సరసగతిన‌ జేరు
    నీదిన‌ములలోన నేత్ర ద్వయము

    మూసుకొని పోయెనా యేమి? మూర్ఖ లకును

    బిరుదు లనిడుచు మీరెల్ల మరచినంత

    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న

    ననుచు ప్రముఖ కవి బలికె మనసు విరిగి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కట్టబెట్ట... ధరణిని.. సరసగతిని.. నేత్రయుగము (నేత్రద్వర మన్నపుడు త్ర గురువై గణభంగం)" అనండి.

      తొలగించండి
  6. ఎన్నిక లాడువేళ ప్రతియింటికి బంచితి వేలరూప్యముల్
    పన్నుగ ద్రాగగా నిడితి ఫారిను లిక్కరు లెక్కలేకనే
    తిన్నగ పార్లమెంటునను తిట్లను తిట్టగ కొత్తకొత్తగన్
    నన్ను గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివారి జంపుదున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! 🙏🙏🙏🙏
      కవీశ్వరులు ప్రభాకర శాస్త్రిగారి ప్రభావ మతులమ్! 😊💐🙏

      తొలగించండి
  7. గురువు గారికి నమస్కారం..
    నా పూరణ ప్రయత్నం..


    తెలుగుభాషనితెగులనెతెలివిలేని
    జాతిజనులలోనుండినజాడ్యములను
    చంపెదను,నన్నుకవిగగుర్తింపకున్న
    పద్యమందునజెప్పెదపాటిగాను

    యస్.హన్మంతు

    రిప్లయితొలగించండి
  8. ౧.
    చచ్చు కవులెందరోయిట మెచ్చుకొనగ
    తగిన సన్మానమునుజేయ తగుదురయ్య
    కోపమునునాపుకోలేక కూసి నాడ
    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న!!

    ౨.
    ఎన్నని వ్రాయపద్యముల నెవ్వరు జూడగ నిచ్ఛగించిరే
    మొన్నటి దాకపల్కిరిటు ముచ్చటగొల్పెడు చందమందునన్
    పన్నిరి నాటకీయముగ భావము లేనిక విత్వపు రీతులెంచగన్
    నిన్నటిదాకనుడ్వినవి నేడిట యేలని నాగ్రహమ్మునన్
    వెన్నునుజూపకుండగను వీరల నిత్తఱి పల్కనెంచితిన్
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వృత్తంలో మూడవ పాదంలో గణభంగం. "భావము లేని కవిత్వరీతులన్" అందామా? "నేడిట నేల" అని ఉండాలి. 'ఏల+అని=ఏలనని' అవుతుంది. 'అని+ఆగ్రహమ్మునన్=అని యాగ్రహమ్మునన్' అవుతుంది.

      తొలగించండి
    2. ౧.
      చచ్చు కవులెందరోయిట మెచ్చుకొనగ
      తగిన సన్మానమునుజేయ తగుదురయ్య
      కోపమునునాపుకోలేక కూసి నాడ
      చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న!!

      ౨.
      ఎన్నని వ్రాయపద్యముల నెవ్వరు జూడగ నిచ్ఛగించిరే
      మొన్నటి దాకపల్కిరిటు ముచ్చటగొల్పెడు చందమందునన్
      పన్నిరి నాటకీయముగ భావము లేనిక విత్వరీతులన్
      నిన్నటిదాకనుడ్వినవి నేడిట నేలని యాగ్రహమ్మునన్
      వెన్నునుజూపకుండగను వీరల నిత్తఱి పల్కనెంచితిన్
      నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్!!



      ***మీ సూచనకు మిక్కిలి ధన్యవాదములు! సవరణతో...🙏🙏

      తొలగించండి
  9. నిన్నొక ముద్దరాలిగను,నీమము వీడక కీర్తిజేతులే
    సన్నుతులై కవీశ్వరులు ,సాధ్యముగాదని యొప్పకున్నచో!
    మిన్నును దించి నేలపయి,మీసముద్రిప్పుచు నట్టివారిలో
    నన్ను గవీశ్వరుండని,ఘనంబుగ మెచ్చని వానిజంపెదన్

    రిప్లయితొలగించండి
  10. సమస్య :
    నన్ను గవీశ్వరుండని ఘ
    నంబుగ మెచ్చనివాని జంపెదన్

    (కాళిదాస కవీంద్రునిపై కక్షగట్టిన కవిరాక్షసు డనే కవి భోజరాజుతో )
    నన్నుగదా ప్రభూ ! తమరు
    " నవ్యకవీశ్వరు "డంచు మెచ్చిరే
    నిన్నటి దాక ; యిప్పుడిత
    నెవ్వడొ ? యెచ్చటి వాడొ ? పద్యముల్
    జెన్నుగ గుప్పుచున్ జనుల
    చిత్తములన్ మరపింపజేసెడిన్ ;
    నన్ను గవీశ్వరుండని ఘ
    నంబుగ మెచ్చని - వాని జంపెదన్ .
    ( చిత్రం - మహాకవి కాళిదాసు ; కాళిదాసు - ఏ ఎన్ఆర్ ; భోజరాజు - ఎస్ వీ ఆర్ ; కవిరాక్షసుడు - సీ ఎస్ ఆర్ )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవిరాక్షసుడు సార్థక నామధేయం! అద్భుతమైన పూరణ. అభినందనలు.
      "...యిప్పు డిత డెవ్వడొ"

      తొలగించండి
  11. దన్నుగా రామభద్రుని దయ కలిగిన
    చాలు నాకు యంచు హనుమ నుడివె మేలు
    రామగాథను వినని మర మనుజులను
    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నాకు+అంచు' అన్నపుడు యడాగమం రాదు. "నాకు నంచు" అనండి.

      తొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వరుస నాలుగు పంక్తులు వ్రాసి దెచ్చి
    సత్కవుల సంఘమున నిల్చి జగడగొండి
    నాదటను గూడి మూర్ఖుడై ననియె నిటుల
    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "జగడగొండి యాదటను... మూర్ఖుడై యనియె నిటుల..."

      తొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తిన్నగ సత్కవీంద్ర సమితిన్ దరి జేరిన మూర్ఖుడొక్కడున్
    పన్నుగ నాల్గుపంక్తులకు పద్యము నల్లితి మీరు చక్కగా
    నెన్నికజేసి దానినిట నెంచుమటంచును పల్కెనిట్లుగా
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్.

    రిప్లయితొలగించండి
  14. వీధిరౌడీ తోటరాముడు తాను కవిగా గుర్తింపొందాలన్న కండూతిని తీర్చుకోడానికి ఒక అర్భక కవిని బెదిరిస్తూ -

    కవినికావలెననుకోర్కెకలదునాకు
    నియమమొనరించినాడనునిన్నునేను
    వాసియైనట్టి కవితలు వ్రాసియిమ్ము
    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మా చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళి" అన్న తోటరాముడు కవితను గుర్తుకు తెచ్చారు.

      తొలగించండి
  15. పెద్ద కవులవి పద్యముల్ పేర్మితోడ
    వ్రాసి యుంచుకు నాలుగు వాసి కలవి
    చదువ సభలోన వీడొక్క చవటయనిరి
    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న

    రిప్లయితొలగించండి
  16. మన్నిక శంకరార్యుని సమస్యలఁ బూరణఁ గుస్తి పట్టి త
    ప్పున్నను నర్థశబ్దరసపుష్టివిహీనము లైన వాటి నె
    న్నెన్నొ నగణ్యసంఖ్యల రచించితి, నిన్నిటఁ జూచి యైననున్
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురం.

    రిప్లయితొలగించండి
  17. కన్నులుమూసిచెప్పెదను కమ్మనిపద్యము లెన్నియేనియున్
    నన్నయసాటివాడనని నన్నెపుడందురు నాదు భృత్యులిం
    కెన్నడునాదుగొప్పతనమెల్లరుమెచ్చగ నాకు నెమ్మియౌ
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్

    రిప్లయితొలగించండి
  18. యాగము కన్చు శృంగముని నంగన లందరు "జుట్టు" ముట్టుచున్
    రాగము మీర "ముక్కు"లిడి రంజిల పాటల నాటలాడుచున్
    బాగగు పల్కులాడుచును వాసిగ "కన్ను"లవిల్తు చేష్టలన్
    దాగుడుమూత లాడుచు తాపము పెం"చె వి"భాండపట్టికిన్

    ముక్కులు = భక్ష్య విశేషము
    కన్నుల విలుతుడు = మన్మథుడు


    నన్నయ శైలి నెన్నుచును నవ్య కృతుల్ రచియింపమెచ్చిరో ;
    ఎన్నగ నన్నయార్యువలె నెవ్వరు సత్కృతు లల్లగెల్తురే ;
    నన్నయ తిక్కనార్యుల సనాతన కైతల త్రోసిపుచ్చుచున్;
    నన్ను గవీశ్వరుండని , ఘనంబుగ , మెచ్చనివాని జంపెదన్.

    రిప్లయితొలగించండి
  19. పద్యములు వ్రాసినను పొరబాట్లవెన్నొ
    యున్ననుండవచ్చును గాదె మిన్న గాను
    తప్పులంచును నన్నింక త్రస్తరింప
    చంపెదను, నన్ను కవిగ గుర్తింపకున్న.

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. రెండవ పూరణ

      పాండ్యరాజసభలో విద్వజ్జనకోలాహలుడనే పండితకవి ఇట్లు ప్రకటించాడు

      ( 12 సంవత్సరాలబాలుడైన యామునాచార్యుల వారు ఆ కవిని ఓడించాడు
      ఆ ఓడించిన విధం అద్భతం గా ఉంటుంది.)

      సన్నుతరాజ్యపాలనలసద్వర! సత్కవిపండితాప్త! పే
      రెన్నిక నౌ చతుర్విధకవీశయశస్సు గడించితిన్ త్వదీ
      యోన్నతమౌ సభన్ సుకవి యొండు జయించగ లేని వానినిన్
      నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ, జంపెదన్"

      కంజర్ల రామాచార్య
      వనస్థలిపురము

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  21. రాశి గాంచునా పద్యాల వాసియేల
    యతులు ప్రాసలటంచు మీరడ్డనేల?
    తప్పులు వెదక నేనింక తాళలేక
    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న

    రిప్లయితొలగించండి
  22. పన్నగభూషణాధరునిపార్థునిసేయుచుఁ బద్యమల్లితిన్
    వెన్నెలమాసమందుననువేరుగవర్ణనఁ జేసిఁజెప్పితిన్
    మిన్నునుమన్నుగన్ మలచి మేలును గీడుగదేల్చువాడనౌ
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పన్నగ భూషణాంచితుని..." అంటే బాగుంటుంది.

      తొలగించండి
  23. మైలవరపు వారి పూరణ

    ఎన్నొ కథావిశేషములనెంతొ వ్యయమ్మునకోర్చి పంప., మీ..
    కెన్నికఁజేయ జుల్కనయ! ఏమనుకొంటిరి? పిచ్చివానిగా
    నన్ను దలంచినారొ? యిదె నా ప్రతినన్ వినుడయ్య! యింకపై
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  24. చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న"
    ననుచు పలికిన పలుకుల నడల నేల!
    పదవి యొసగిన గర్వపు వ్యాధితు మాటన్
    శ్రద్ధ జూప వలదుగద శంకరార్య !

    రిప్లయితొలగించండి
  25. ఆత్మ హత్యకు పాల్పడు టను చితంబు
    చంపెద ను నన్ను కవిగ గుర్తింప కున్న
    ననుట మంచిది కాదని యనవ రతము
    వ్రాయ యత్నిo ప కవి యంచు వాసి గలుగు

    రిప్లయితొలగించండి
  26. సన్మ తినిబూని కావ్యముల్ చక్క గాను
    వ్రాసె డుకవీంద్రు డనయము పరుల తోడ
    "చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న"
    యన్న సత్కవి కానేర డవని యందు.

    రిప్లయితొలగించండి

  27. టన్నుల కొద్దిరాసితని డాబులు జెప్పుకుపండితుల్ సదా!
    కన్నుయు మిన్నుయున్ గనక గర్వము మీరగ ధూర్తులేయనా!
    మన్నన వీడగన్ చపల మానసులై నిటు పల్కుచుందురే!
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కన్నును మిన్నునున్... ధూర్తులే యనన్" అనండి.

      తొలగించండి
  28. నేనుకుకవీశ్వరుండనునేతలెల్ల
    వ్రాతలనుమెచ్చిగైతలవ్రాయుమన్న
    నారిటను *తతా* ల లిఖించి యాగ్రహముగ
    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆరింట త పెట్టడాన్ని ప్రస్తావించిన మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      బాల్యచాపల్యంతో చిన్నపుడు ఆరింట తా పెట్టి ఒకడు చావాలని పద్యం చెప్పాను. చచ్చాడు... ఆయుశ్శు తీరిన తర్వాత మొన్న మొన్ననే!

      తొలగించండి
    2. ఆరింట త పెట్టడం అంటే ఏమిటి గురువుగారూ? జ్యోతిష సంబంధమా?

      తొలగించండి
  29. మన్ననజేసిభావపరిమాణమునర్థముతుల్యమైనచో
    చెన్నుగమేలుమేలుబలిశెట్టివిదిట్టవటంచుమెచ్చరే
    *నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ; మెచ్చనివానిఁ జంపెదన్*
    కన్నులనిప్పుపోసుకునికావ్యులగారవమూడ్చివేసినన్

    రిప్లయితొలగించండి
  30. మీ శిష్యుని యంతరంగము.🙏🏻🙏🏻
    తేగీ.
    చదువులమ్మను గొలుచుచు చక్కగాను
    ప్రాస యతులను నేర్పించు పండితుండు
    శంకరార్యుల శిశ్యుండ శంక వలదు
    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న.

    రిప్లయితొలగించండి
  31. ఉన్నవి నాదుమానసము నున్నత భావములెంచ నెన్నియో
    సన్నుతి చేసి శారదను చక్కని శైలి లిఖించు చుంటినే
    చెన్నని నాకవిత్వమును చెప్పక యున్న సహింప సాధ్యమే?
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్

    రిప్లయితొలగించండి
  32. అలుసె నా పద్యములు, మిరియాల, శేషు
    కవుల కైతల ముందు దిగదుడుపగునె?
    బాబు బొగిడెదవే? ధర్మపత్ని వీవు?
    చంపెదను, నన్ను కవిగ గుర్తింపకున్న!

    రిప్లయితొలగించండి
  33. మిరియాల ప్రసాదరావు,శేశుకుమార్,విట్టు బాబు

    రిప్లయితొలగించండి
  34. చంపెదనునన్నుకవిగగుర్తింపకున్న
    నేమిదౌర్జన్యమీయదియేమిసామి!
    కవిగగుర్తించుటగుగానుగలవుకొన్ని
    యర్హతలుగల వెయవిమీ కార్య!చింత
    జేయుడొకపరిసావధానయుతుడవయి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాలుగవ, ఐదవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  35. పన్నుగ వంద కైతలను వ్రాయుచు పట్టము లంది యుండగా
    నన్ను గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చని వాని జంపెదన్
    మన్నున జేర్చు వాడ"నని మర్త్యు డొకండు వచింప జంకుచున్
    కన్నులు విచ్చి నంత కల గాంచితి నన్న నిజమ్మెఱింగితిన్

    రిప్లయితొలగించండి
  36. మున్నుకవీంద్రులున్ బరమ పూజ్యులు చెప్పిరటంచు గాదె మీ
    రెన్నుచు నుంద్రు దోషముల వెన్నియొ నాదుకవిత్వమందునన్
    దన్నుగ ప్రాసలున్ యతులు తప్పిన వంచును గేలి సేతురా?
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్.

    రిప్లయితొలగించండి
  37. నిన్నకు మొన్న మాటలను నేర్చిన నీవు విమర్శకుండవై
    నన్నును నాదు పద్యముల నాసి రకంబను నంత వాడవా
    తన్నులు తప్పవింక మరి తప్పులు పట్టుట నాపకుండినన్
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్

    రిప్లయితొలగించండి
  38. కవికిఁ గవి బద్ధశత్రువు కాఁ గలండు
    ధరణి నన్నది కా దనృతమ్ము నాఁగ
    నార్యులార మీకు నసూయ యంచు తలఁచు
    చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న

    [తలఁచుచు +అంపెదను = తలఁచు చంపెదను]


    సన్నుత చిత్త వర్తన విశారద మిత్రమ యేమి చెప్పుదుం
    బన్నుగ శబ్ద భావ సమపాత్రత నెంచి యెడందఁ బండి తా
    సన్నుఁడు శుక్ర నామ ధనశాలి యొకండు వచించె నివ్విధిన్
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మొదటి పూరణ వైవిధ్యంగా ఉన్నది. రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  39. అన్నువతోడనన్ జనులుహారతినిచ్చుచుగారవించిరే
    నన్నుగవీశ్వండనిఘనంబుగ,మెచ్చనివానిజంపెదన్
    మిన్నునుమన్నునుంగనకమీరెడుగర్వముతోడనాపనిన్
    గన్నులుగాంచెనీకలనుగాఢపునిద్రనునుండగాదరిన్

    రిప్లయితొలగించండి
  40. ఉత్పలమాల
    మొన్న తిరస్కరించనొక ముద్దియ జల్లితి మోమునామ్ల మా!
    యన్నులమిన్న వీడెనన నార్తికిఁ బ్రేమ కవిత్వమల్లితిన్
    తిన్నగ స్వీకరించి గురుతింపక నిందుతుఁడంచుఁ గూతురే?
    నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్!

    రిప్లయితొలగించండి
  41. తేటగీతి
    అతివ కాదన్నఁ జేసితి నామ్లదాడి
    విరహగీతుల వ్రాసితి వీడనామె
    నిందితుని కవిత్వమనుచుఁ గ్రిందపరచ
    జంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న!

    రిప్లయితొలగించండి
  42. ఉ:

    సన్నని నవ్వు నవ్వె దొక చక్కని కన్నియ వంపుసొంపులన్
    కన్నులు చంచలింప చిరు ఖండిక వ్రాయగ జేరె నచ్చు కై
    తిన్నగ, మోసమెంచి తగు దీటగు మాటల బల్కితిట్లనిన్
    నన్ను గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చని వాని జంపెదన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి