కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్"
(లేదా...)
"కాంచనపుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్"
(లేదా...)
"కాంచనపుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్"
రిప్లయితొలగించు"శ్రీ రాముని దయ చేతను..."
నడిరేయి సరదా పూరణ:
దంచిన నూకలన్ తినుచు దండుగ మాలిన వృత్తిలోననున్
కొంచెము కూడబెట్టుచును కోరిక తీరగ భిక్షమందు తా
నించుక పైసలన్ కొనుచు హేలను గెల్వగ లాటరీననున్
కాంచనపుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు🙏
తొలగించు
రిప్లయితొలగించుఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
RK Narayan's "Guide":
కంచము నిండుగా కుడుపు కానగ జాలక నాట్యకత్తెనున్
మంచము మీద లాగుచును మంచిగ మాటలు చిల్కరించుచున్
వంచన జేసి నాయకుని భార్యను లేపుచు పారిపోవగన్
కాంచనపుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించు'గైడ్' చిత్రంలోని "గాతా రహే మెరా దిల్..." అన్నపాట నాకెంతో ఇష్టం.
🙏
తొలగించునిజమే...అన్ని పాటలు బాగుంటాయి నవల కూడా:
https://gpsastry.blogspot.com/2014/03/railway-guide.html?m=0
కొట్టేసిందంతా ఇచ్చేసాక బికారేగా
రిప్లయితొలగించుఉ||
మించిన డబ్బు లంచముల మ్రింగి ధనంబును బెంచనీతడున్
త్రుంచ ప్రభుత్వయత్నమున తొందరగన్ తిరువేంకటాద్రికే
తెంచుచు స్వర్ణమెల్లయును దెచ్చి విశేషము దానమిచ్చుటన్
కాంచనపుష్పపూజను బికారియొనర్చెను శేషశాయికిన్
ఆదిపూడి రోహిత్🙏🏻🙏🏻🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'ఎల్లయును' అన్న ప్రయోగం సాధువు కాదు. "స్వర్ణమంతటిని..." అనండి.
సమస్య :
రిప్లయితొలగించుకాంచనపుష్పపూజను బి
కారి యొనర్చెను శేషశాయికిన్
( భాగవతాన్ని భావగతంగా రచించి భక్తు
లకు , భగవంతునికి అర్పించాడు పోతన )
మించిన భక్తి భాగవత
మీ యిలయందలి భక్తకోటికిన్
బంచు మరందబిందువుల
భాగ్యము నెంతని చెప్పవచ్చు ! నా
శాంచలకీర్తిశాలి ; కవి
చంద్రుడు ; పోతన స్వార్థశూన్యహృ
త్కాంచనపుష్పపూజను ; బి
కారి ; యొనర్చెను శేషశాయికిన్ .
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించుసంచిత పుణ్య ఫలంబను
రిప్లయితొలగించుకాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్
సంచిత పాప ఫలంబగు
కాంచన ధన రాసి లోభి గాంచుచు మురియున్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించుఇంచుక మేలు తలచి హరి
రిప్లయితొలగించుపంచన జేరిన కుచేలు పండుగ వలె సే
వించగ తన సువినయమను
కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుదంచిన యటుకుల మూటను
రిప్లయితొలగించుకొంచెము కొంచెము గ విప్పి కూర్మి బడయగన్
దించిన శిరముతో ని
ష్కాంచన పుష్పాంజలిని బికారి హరికిడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమూడవ పాదంలో గణభంగం. "దించిన శిరమ్ముతో ని..." అనండి.
వాంచిన శిరస్సు తోడన్
రిప్లయితొలగించుకాంచనపుష్పాంజలి నధికారి హరి కిడన్
వాంచా నొందుచు దానిని
కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్
.వాంచు = వంచు (ఆం॥భా)
వాంచా = కాంక్ష (ఆం॥భా)
కాంచన్ + అపుష్పము
కాంచన్ = చూడగ
అపుష్పము = పువ్వులు లేనిది (ఆం॥భా)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకుచేలోపాఖ్యానము.
రిప్లయితొలగించుసంచిత పాపఫలంబన
మించిన సంసార బాధ, మిడుకగ లేకన్
కించిత్ మోమాటమునన్
కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమించిన భక్తిభావమున మేను వెలుంగగ నిల్చి మ్రొక్కుచున్
రిప్లయితొలగించుసంచిత పాపరాశులను స్వామి! యణంచుము లేమిద్రుంచుమా
యంచును తన్మయత్వమున హర్షము మానసమందు నిండ నో
కాంచన! పుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్"
మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించుకాంచుము స్పష్టముగా నో
కాంచన! పుష్పాంజలి బికారి హరికిడెన్
మించిన భక్తిని గూడుచు
వంచుము తన లేమినంచు వందనములతో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅంచితధర్మవర్తనుడు దంచితసత్వగుణుండు పూర్వసం
రిప్లయితొలగించుసంచితపాపదుష్టఫలసంభవజన్మసుధాముడార్తితో
వంచన లేని పూతవరభక్తివిభాసితభావనోల్లస
త్కాంచనపుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్.
కంజర్ల రామాచార్య
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించువంచన నెరుగని వాడై
రిప్లయితొలగించుకొంచక భగవ న్నామజపము కూరిమి తోడన్
మంచిగ నొనర్చి స హృదయ
కాంచన పుష్పాంజలి బికారి హరి కిడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించురెండవ పాదంలో గణభంగం. "కొంచక హరి/హర నామజపము కూరిమితోడన్" అనండి.
రిప్లయితొలగించుమైలవరపు వారి పూరణ
సంచితపుణ్యభాగ్యుడు విశాలదయాహృదయుండు., భక్తిదీ...
ప్త్యంచితుడర్థహీనుడు., మహాగుణమాత్రధనుండు., నిత్యని...
శ్చంచలబుద్ధి మ్రొక్కి, చని సప్తగిరుల్ గని స్వామికిన్ మనః...
కాంచనపుష్ప పూజను బికారి
యొనర్చెను శేషశాయికిన్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించువంచన సేయక మనమున
రిప్లయితొలగించుచంచల విశ్వాసముంచి సాగెను పురికిన్,
పంచన జుట్టిన యటుకుల
కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు"పంచను..." అనండి.
కొంచెమునైన నీ దయను కోరుచు చేతును పూజలెన్నియే
రిప్లయితొలగించునెంచగ చూప నీ కరుణ నెంతయు దూరము చేయకుండ నా
సంచితమెల్ల పెట్టెదను సంపద వచ్చునటన్న యంచు నా
కాంచనపుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమించిన భక్తి భావమున మేను హృదిన్ పులకించి పోవగా
రిప్లయితొలగించుపెంచిన ప్రేమ తత్వమున ' పేద 'సుదామ ,మురారి,కృష్ణునిన్
కాంచెను: బాల్యమందు తను కన్న కలల్ ఫలియించెనో యనన్-
"కాంచన పుష్ప పూజను బికారి యొనర్చెను శేషశాయికిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదములు
తొలగించుమంచియెరుంగనంచితసమస్యలచట్రములోనదాగిని
రిప్లయితొలగించున్నెంచదలంచసంకటములెన్నియొబిట్టుగజుట్టుముట్టమ
న్నించుమఘంబులూడ్చుననునీకనుసన్నలనుండనిమ్ముహృ
*"త్కాంచనపుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్"*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఅంచిత మైన మార్గమున యానముచేయుచు జీవితమ్మునన్
రిప్లయితొలగించుపంచుచు నార్జనమ్ము భువి బాధలనొందెడు తోటివారికిన్
కాంచుచు తృప్తి నెప్డు శుభకార్యము లందున నొంటరీఁడు హృ
త్కాంచన పుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించుమించిన భక్తి జూపుచు నమేయముగా నుపచర్యలెంచుచున్
కొంచెము కొంచెమున్ గలిపి గూర్చిన విత్తమునంత వాడుచున్
మంచిగ జేర్చినట్టివగు మంజుల బంగరు పూలతోడ దా
కాంచన పుష్పపూజను బికారి యొనర్చెను శేషసాయికిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచెంచుకులంబున నొక్కడు
రిప్లయితొలగించుమంచిగ పురజనులు మెచ్చ నానందించెన్
లాంఛనముగ రాజు నిడిన
కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్
(హరి = వానరము)
----- శ్రీరామ్ 10వ తరగతి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించురెండవ పాదంలో యతి తప్పింది. "మంచిగ పురజనులు మెచ్చ మది ముదమందెన్" అనండి.
చంచలుడనైతి, నీవె య
రిప్లయితొలగించుచంచలుడ వటంచు నమ్మి సతతము నిన్న ర్చించెదనోయి యనుచు హృ
త్కాంచన పుష్పాంజలిని బికారి హరికిడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుఅష్టదళ పాదపద్మారాధన! 🙏🙏🙏
ఇంచుక సందియమ్ముగన కింటికి
వేలుపు వేంకటేశుడై
ముంచెడు ప్రేమతో మురిసి ముస్లిము భక్తులు ముత్తరంబులున్
సంచిత మైన ద్రవ్యమును శ్రద్ధగ గూర్చుచు నొక్కటొక్కటిన్
కాంచన పుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్
పంచెను మృదుగానమ్మను
పంచామృతమన్నమయ్య పటుతర భక్తిన్
ఎంచగ దన పదకవితా
కాంచన పుష్పాంజలిని బికారి హరికిడెన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించువేంకటేశ్వరునకు స్వర్ణపుష్పాలను సమర్పించిన ముస్లింలు నెల్లూరు వారే కదా?
ధన్యోస్మి గురుదేవా! గుంటూరువారని చదివాను! 🙏🙏🙏
తొలగించు
రిప్లయితొలగించుఅంచిత భక్తిని చూపుచు
వంచన చేయక పరులకు వాసిగ ధరలో
మంచితనము చూపుచు హృ
*త్కాంచన పుష్పాంజలిని బికారి హరికిడెన్*
[
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుత్రుంచగలేడు పూవులను
దూయగ పాపమటంచు జాలితో
నెంచడు తోయమీయ నవి
యెంగిలిజేసెను చేపలంచు గా
వించె కరాల మోడ్చి ధన
మించుక లేకయు నెమ్మనమ్ములో
కాంచన పుష్ప పూజను బి
కారి యొనర్చెను శేషశాయికిన్!
మీ మానస పూజతో పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుమంచిగజేసెనుజూచితె
రిప్లయితొలగించుకాంచన!పుష్పాంజలినిబికారిహరికిడెన్
సంచితమగుపుణ్యంబున
నంచితుడైనేగుదివికిహర్షముతోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమించుగసంపన్నుడిడెను
రిప్లయితొలగించుకాంచనపుష్పాంజలిని, బికారి హరి కిడెన్
మించిన భక్తినియటుకుల
నెంచగహరిజూచుభక్తినెల్లరియందున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుచంచలుడైననేమి పలు శాస్త్రములన్ బఠియించె కావునన్
రిప్లయితొలగించుద్రుంచగ లేడు పుష్పముల రూక్షము నుండి దయాళువై సదా
యంచితు డైన వాడనిపరాత్పరు నెప్పుడు భక్తితోడ హృ
త్కాంచనపుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుపంచన యున్న బండయె శుభంకరు డైన గిరీశుడంచు భా
రిప్లయితొలగించువించుచు భక్తితోడ తన వేదన తీర్చమటంచు చేసెనా
కాంచన పుష్పపూజను, బికారి యొనర్చెను శేషశాయికిన్.
చంచలమౌ మనస్సునిక స్థామముఁ నిల్పి పరంపదమ్ము కై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఎంచ భగవంతుని కరుణ
రిప్లయితొలగించునించుక కొన వలయు భక్తి యిద్ధన మేలం
బంచఁగ నతనికి గొందఱు
కాంచన పుష్పాంజలిని బికారి హరి కిడెన్
[కాంచనము = చంపకము]
మించ ధనాఢ్యులం దివిరి మేదినిఁ బూర్వ దశా భవౌఘ స
త్సంచిత పుణ్య రాశి ఫల సంభవ ధీ మహి మాగ్ర్య భక్తి స
క్తాంచిత చిత్త శుద్ధిఁ బర మైక్యము సెందఁ బరాత్ప రాత్మలోఁ
గాంచ నపుష్ప పూజను బికారి యొనర్చెను శేషశాయికిన్
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించుసంచితపాపకర్మముల సంపదలెన్నియొకూడబెట్టి యా
రిప్లయితొలగించుశించుచు పాపమోచనము చేసెనుదుష్టుఁడుదైవ సన్నిధిన్
కాంచనపుష్పపూజను, బికారి యొనర్చెను శేషశాయికిన్
మించినభక్తితో హృదయమేకుసుమాంజలిగా ఘటించుచున్
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుసంచితమౌవిధంబుగనుసర్మమునందునబుణ్యమబ్బగన్
రిప్లయితొలగించుకాంచన!పుష్పపూజనుబికారియొనర్చెనుశేషసాయికిన్
నంచితుడౌచునాతడటహర్షముతోడనునుండునెప్పుడున్
మంచిగబూజజేయునెడమానిసులందరుబుణ్యమూర్తులే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు30.09.2020
రిప్లయితొలగించుఅందరికీ నమస్సులు🙏
నా పూరణ యత్నం..
*కం*
ఎంచక తప్పుల నెప్పుడు
పెంచిన భక్తిని సతతము ప్రేమగ నిలుపన్!
మంచిని మనసున నింపిన
*"కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్"*!!
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఉ:
రిప్లయితొలగించుఎంచెను పూలతోటలను యేర్పడ జేయగ సేద్యమందునన్
పెంచెను పుష్ప జాతులను వేడుక సంపఁగె నొక్కభాగమై
పొంచి కరోన వ్యాప్తి ధర పోబడి పంచిరె దేవళమ్మునన్
కాంచన పుష్ప పూజను బికారి యొనర్చెను శేషశాయికిన్
సంపంగి పూలు=కాంచనపూలు
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'తోటలను+ఏర్పడ' అన్నపుడు యడాగమం రాదు.
ధన్యవాదములు: తోటలను యేర్పడ కు బదులుగా తోటలనె యేర్పడ అని చదువగలరు.
తొలగించుశ్రీ పివిఆర్కె ప్రసాద్ గారి 'నా హం కర్తా హరి: కర్త' పుస్తకకథనం... (అష్టదళ పాదపద్మారాధన సేవకు నేపథ్యంలో)
రిప్లయితొలగించుకందం
అంచిత భక్తిని ముస్లిము
కాంచెనొ మది తిరుమలేశుఁ, గష్టంబైనన్
సంచలనమష్టదళముల
కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్
ఉత్పలమాల
అంచిత భక్తి భావమున నాదట ముస్లిము భక్తుడొక్కడున్
గాంచెనొ మానసమ్మున ప్రగాఢపు నమ్మికఁ దిర్మలేశునిన్!
సంచలనంబనన్ శ్రమను సైచుచు నష్టదళమ్ములొప్పఁగన్
గాంచన పుష్ప పూజను బికారి యొనర్చెను శేషశాయికిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించు🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించు